Major League Cricket
-
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడనున్న ఆండర్సన్?
అంతర్జాతీయ క్రికెట్ విడ్కోలు పలికిన ఇంగ్లండ్ లెజండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. యూకే మీడియా రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో ఆండర్సన్ ఆడనున్నట్లు సమాచారం.మేజర్ లీగ్ క్రికెట్లో ఓ ఫ్రాంచైజీ తమ జట్టులో ఆండర్సన్ భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే అతడితో సదరు ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. ఆండర్సన్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.ఎంఎల్‌సీలో ఆండర్సన్ ఆడనున్నాడా?కాగా అమెరికా వేదికగా ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు భాగమయ్యారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, జోష్ హేజల్‌వుడ్ వంటి వారు ఎంఎల్‌సీలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతనిథ్యం వహిస్తున్నారు.అయితే ఆండర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడితే మరింత ప్రాధన్యత సంతరించుకునే అవకాశముంది. కానీ ఆండర్సన్‌కు అయితే టీ20ల్లో పెద్దగా అనుభవం లేదు. ఆండర్సన్ చివరగా 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆండర్సన్ ఆడలేదు. మరి ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్లో భాగమవుతాడా లేదన్నది వేచి చూడాలి.చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు' -
స్టీవ్ స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. మేజర్ లీగ్ క్రికెట్ విజేత వాషింగ్టన్ ఫ్రీడం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను వాషింగ్టన్ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్ ఆధ్యాంతం భీకర ఫామ్‌లో ఉండిన ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్ బౌలర్లలో కమిన్స్ 2, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్, డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన జన్సెన్.. రచిన్ మాయాజాలం208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్ మార్కో జన్సెన్ (4-1-28-3), రచిన్ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్ నేత్రావల్కర్ (4-0-33-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు కార్మీ రౌక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. జన్సెన్, రచిన్ అద్భుతంగా బౌలింగ్ చేసి యూనికార్న్స్ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ టీమ్‌ను స్టీవ్ స్మిత్ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్ టీమ్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
భీకర ఫామ్‌లో ట్రవిస్ హెడ్
మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడం ఓపెనర్ ట్రవిస్ హెడ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన హెడ్.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మరో మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన హెడ్ 54.5 సగటున 173కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 327 పరుగులు చేసి వాషింగ్టన్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో హెడ్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. 1, 32 నాటౌట్, 0, 54 నాటౌట్, 54, 53, 56, 77 నాటౌట్.యూనికార్న్స్‌తో జరిగిన క్వాలిఫయర్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో హెడ్‌తో పాటు (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో వాషింగ్టన్ ఫ్రీడం సునాయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (1), ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది. -
రచిన్ మాయాజాలం.. హెడ్ మెరుపులు.. మ్యాక్స్‌వెల్ ఊచకోత
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో వాషింగ్టన్ ఫ్రీడం ఫైనల్‌కు చేరింది. ఇవాళ (జులై 26) జరిగిన క్వాలిఫయర్‌లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్.. రచిన్ రవీంద్ర (2.4-1.11-4), మార్కో జన్సెన్ (4-0-46-3), నేత్రావల్కర్ (4-0-23-2), ఫెర్గూసన్ (3.2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో హసన్ ఖాన్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో సునయాస విజయం (15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) సాధించింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 1, ఆండ్రియస్ గౌస్ (9), రచిన్ రవీంద్ర (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. యూనికార్న్స్ బౌలర్లలో హసన్ ఖాన్ 2, పాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. యూనికార్న్స్ రేపు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 29న జరిగే ఫైనల్లో వాషింగ్టన్ ఫ్రీడంతో అమీతుమీ తేల్చుకోనుంది. -
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్.. సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ మరో విజయం సాధించింది. సియాటిల్ ఓర్కాస్‌తో ఇవాళ (జులై 24) జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగింది. సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం ఓర్కాస్‌ను 140 పరుగులకే పరిమితం చేసింది.మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన డుప్లెసిస్, సావేజ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. డుప్లెసిస్ (17 బంతుల్లో 39; 6 ఫోర్లు, సిక్స్), సావేజ్ (27 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. విధ్వంసకర బ్యాటర్లు డెవాన్ కాన్వే (0), స్టోయినిస్ (11) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో అయాన్ దేశాయ్, కీమో పాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్, నండ్రే బర్గర్, బ్రేస్‌వెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన బార్ట్‌మన్, నూర్ అహ్మద్178 పరుగుల లక్ష్య ఛేదనలో ఓర్కాస్ దారుణంగా విఫలమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-20-3), నూర్ అహ్మద్ (4-0-19-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో చెలరేగిన సావేజ్ బౌలింగ్‌లోనూ (3-0-23-2) సత్తా చాటాడు. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ దక్కింది. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో డికాక్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో సంబంధం లేకుండానే సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది.ఈ మ్యాచ్‌తో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పోటీపడతాయి. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్‌ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్‌కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ విధ్వంసం.. ట్రవిస్ హెడ్ మెరుపులు
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లో స్మిత్‌కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024మరో ఎండ్‌లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో హెడ్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడలేదు. -
పోలార్డ్ వీర బాదాడు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రషీద్ ఖాన్ (4-0-22-3), నోష్తుష్ కెంజిగే (4-0-22-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-2), రొమారియో షెపర్డ్ (4-0-30-1), కీరన్ పోలార్డ్ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), నితీశ్ కుమార్ (15), స్పెన్సర్ జాన్సన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్ నరైన్ (6), ఉన్ముక్త్ చంద్ (9), డేవిడ్ మిల్లర్ (6), సైఫ్ బదార్ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్ (0) నిరాశపరిచారు.131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్ పూరన్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (12 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, స్పెన్సర్ జాన్సన్, డ్రై, రసెల్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. -
ఆర్సీబీ ఆటగాడి విధ్వంసం.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్లే ఆఫ్స్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అర్హత సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓర్కాస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(33 బంతుల్లో 8, 3 సిక్స్‌లతో 62 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జయసూర్య(31) పరుగులతో పర్వాలేదన్పించాడు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో స్పిన్నర్ హసన్ ఖాన్ 3 వికెట్ల పడగొట్టగా.. రౌక్స్ రెండు, కౌచ్, ఆండర్సన్ తలా వికెట్ సాధించారు.ఫిన్ అలెన్ విధ్వంసం..అనంతరం 153 పరుగుల లక్ష్యాన్ని శాన్ ఫ్రాన్సిస్కో కేవలం 4 వికెట్ల మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో ఫిన్ అలెన్(న్యూజిలాండ్) విధ్వంసం సృష్టించాడు. లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో సెకెండ్ ఫాస్టెస్ట్ హాప్ సెంచూరియన్‌గా అలెన్ నిలిచాడు. అంతకుముందు ఆసీస్ స్టార్, వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే ఆర్ధశతకం నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 30 బంతులు ఎదుర్కొన్న అలెన్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్(24నాటౌట్) రాణించాడు. కాగా అలెన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
హెడ్, స్మిత్ మెరుపులు.. సూపర్ కింగ్స్ చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్-2024 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. డల్లాస్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో వాషింగ్టన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.హెడ్ కేవలం 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేయగా.. స్మిత్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు మాక్స్వెల్(34), పియెనార్(33) పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ మూడు వికెట్లు, బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో సత్తాచాటగా.. జస్దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ తలా మూడు వికెట్లు పడగొట్టి సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించారు. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
మేజర్ లీగ్ క్రికెట్-2024లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫ్రాంచైజీకి హెడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లీగ్‌లో భాగంగా శనివారం ఉదయం టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో హెడ్ విధ్వంసం సృష్టించాడు.సూపర్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొలి ఓవర్ నుంచే సూపర్ కింగ్స్ బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హెడ్ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వాషింగ్టన్ బ్యాటర్లలో హెడ్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(57), ఓబుస్ పియెనార్(33) పరుగులతో రాణించారు.అసలేంటి ఈ మేజర్ లీగ్ క్రికెట్?తమ దేశంలో క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు అమెరికా క్రికెట్ ఆసోయేషిన్ ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని ప్రారంభించింది. తొట్ట తొలి సీజన్ గతేడాది జూలై 13 నుంచి 30 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ రెండో సీజన్. మొత్తం ఈ క్రికెట్ లీగ్‌లో ఆరు జట్లు పాల్గోంటున్నాయి.ఇందులో సీటెల్ ఓర్కాస్, ఎంఐ న్యూయర్క్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో ఎంఐ న్యూయర్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్రాంజైలు ఐపీఎల్ యాజమాన్యంకు సంబంధించినవే గమనార్హం. -
ముంబై ఇండియన్స్‌కు మరో పరాభవం..ప్లే ఆఫ్స్‌కు యూనికార్న్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్ ఫోర్కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. యూనికార్న్స్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. యూనికార్న్స్ చేతిలో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్... కెప్టెన్ కోరె ఆండర్సన్ (59 నాటౌట్), హస్సన్ ఖాన్ (44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్, హసన్ ఖాన్‌తో పాటు కమిన్స్ (13), రూథర్‌ఫోర్డ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎంఐ బౌలర్లలో నోష్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్ తలో 2, రొమారియో షెపర్డ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.149 పరుగల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 20 పరుగులు అవసరం కాగా.. హీత్ రిచర్డ్స్, రషీద్ ఖాన్ జోడీ 16 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా.. హరీస్ రౌఫ్ హీత్ రిచర్డ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఎంఐకు పరాజయం తప్పలేదు. యూనికార్న్స్ బౌలర్లలో మాథ్యూ షార్ట్ 3, బ్రాడీ కౌచ్ 2, హరీస్ రౌఫ్, హస్సన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (56) అర్ద సెంచరీతలో రాణించాడు.కాగా, ఈ ఎడిషన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాషింగ్టన్ ఫ్రీడం, యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎంఐ న్యూయార్క్, సీయాటిల్ ఓర్కాస్ పోటీపడుతున్నాయి. -
సౌతాఫ్రికా ఓపెనర్ ఊచకోత.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో! అయినా పాపం
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో సీటెల్ ఓర్కాస్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓర్కాస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.ఓర్కాస్ బ్యాటర్లంతా విఫలమైనప్పటకి ఆ జట్టు ఓపెనర్, దక్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.నైట్‌రైడర్స్ బౌలర్లలో జాన్సన్, రస్సెల్, నరైన్, డ్రై తలా వికెట్ సాధించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 27 పరుగులతో రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో గనూన్, హార్మత్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదమైనప్పటకి సీటెల్ ఓర్కాస్ ఓటమి పాలవ్వడంతో ర్యాన్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. -
హెడ్ మెరుపులు.. 88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రీడం టీమ్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా (ఈ సీజన్లో) నిలిచింది.హెడ్, గౌస్, రచిన్ మెరుపులు..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. ట్రవిస్ హెడ్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రియస్ గౌస్ (48 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (8), మ్యాక్స్‌వెల్ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, కీరన్ పోలార్డ్ తలో 2 వికెట్లు.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టారు.88 పరుగులకే కుప్పకూలిన ముంబై ఇండియన్స్183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. వాషింగ్టన్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 13.3 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. జస్దీప్ సింగ్ 3.. మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్ తలో 2.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో రొమారియో షెపర్డ్ (25), ట్రెంట్ బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
ట్రవిస్ హెడ్ బ్యాట్‌ను రెండు ముక్కలు చేసిన రసెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో వాషింగ్టన్ ఆటగాడు ట్రవిడ్ హెడ్ పుల్ షాట్ ఆడబోగా బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటన వాషింగ్టన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.Russell broke Travis head's bat with a Fierce bowlMajor league cricket #Russell#travishead#mlc#majorleaguecricket #Cricket #smith#head#funnyincident pic.twitter.com/0cFLoYDB1Y— जंबारू (@jambr123356) July 14, 2024ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. వాషింగ్టన్ బౌలర్లు నేత్రావల్కర్ (3.4-0-35-4), మ్యాక్స్‌వెల్ (4-0-15-3), లోకీ ఫెర్గూసన్ (4-0-31-2), రచిన్ రవీంద్ర (2-0-7-1) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో సైఫ్ బదార్ అత్యధికంగా 35 పరుగులు చేయగా.. స్టార్ ఆటగాళ్లు జేసన్ రాయ్ (12), సునీల్ నరైన్ (0), ఉన్ముక్త్ చంద్ (1), షకీబ్ (0), మిల్లర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో రసెల్ (20), వాన్ స్కాల్విక్ (12 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్ (16), అలీ ఖాన్ (11) బ్యాట్ ఝులిపించడంతో నైట్‌రైడర్స్ 100 పరుగుల మార్కు దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (2 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 16 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 11 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మిత్‌తో పాటు ఆండ్రియస్ గౌస్ (15) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, వాన్ స్కాల్విక్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
నిప్పులు చెరిగిన నేత్రావల్కర్, ఫెర్గూసన్
మేజర్ లీగ్ క్రికెట్లో ఇవాళ (జులై 12) సియాటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓర్కాస్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓర్కాస్.. వాషింగ్టన్ ఫ్రీడం పేసర్లు సౌరభ్ నేత్రావల్కర్ (3.4-0-18-3), లోకీ ఫెర్గూసన్ (4-0-26-4), మార్కో జన్సెన్ (4-0-28-1), ఇయాన్ హాలండ్ (4-0-34-1) ధాటికి 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ 51 (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ 24 (19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), శుభమ్ రంజనే 12 (17 బంతుల్లో) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం.. లహీరు మిలంత (33 నాటౌట్), ఓబస్ పియెనార్ (31 నాటౌట్) రాణించడంతో 18.2 ఓవర్లలో విజయతీరాలకు (127/5) చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ 12, రచిన్ రవీంద్ర 26, ముక్తార్ అహ్మద్ 8, మ్యాక్స్‌వెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్కాస్ బౌలర్లలో నండ్రే బర్గర్ 2, ఇమాద్ వసీం, కెమారాన్ గానన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
నరైన్, రసెల్ విఫలం.. నైట్‌రైడర్స్ ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని నమోదు చేసింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో నిన్న (జులై 9) జరిగిన మ్యాచ్‌లో ఓర్కాస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. జేసన్ రాయ్ (52 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (5), ఉన్ముక్త్ చంద్ (18), షకీబ్ అల్ హసన్ (7), ఆండ్రీ రసెల్ (14) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో జమాన్ ఖాన్, హర్మీత్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓర్కాస్.. ర్యాన్ రికెల్టన్ (66 బంతుల్లో 103; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. రికెల్టన్కు జతగా క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (51 నాటౌట్) ఆడాడు. ఓర్కాస్ కోల్పోయిన ఏకైక వికెట్ (నౌమన్ అన్వర్ (9)) స్పెన్సర్ జాన్సన్‌కు దక్కింది. ఎంఎల్సీ ప్రస్తుత ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లు అయిన అనంతరం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం టాప్‌లో ఉంది. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, ఎంఐ న్యూయార్క్, లాస ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న స్టీవ్ స్మిత్
మేజర్ లీగ్ క్రికెట్లో (ఎంఎల్సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టీవ్.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్‌లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.Steven Smith loving the MLC. pic.twitter.com/k8CfprlXnQ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ గత సీజన్‌కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్‌లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.వాషింగ్టన్ ఫ్రీడం, టెక్సస్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన వాషింగ్టన్ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాష్టింగ్టన్‌కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
పూరన్ ఊచకోత.. తొలి మ్యాచ్‌లో ముంబై టీమ్ ఘన విజయం
మేజర్ లీగ్ క్రికెట్(MLC) 2024 సీజన్‌ను ఎంఐ న్యూయర్క్ ఘనంగా ఆరంభించింది. స్ట్రీట్ పార్క్ స్టేడియం వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయర్క్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ ఎంఐ బౌలర్ల దాటికి కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. న్యూయర్క్ బౌలర్లలో రషీద్ ఖాన్, బౌల్డ్ చెరో మూడు వికెట్ల పడగొట్టి.. సీటెల్ ఓర్కాస్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు పొలార్డ్ రెండు వికెట్లు, ఇషాన్ అదిల్, నోకియా తలా వికెట్ సాధించారు. సీటెల్ ఇన్నింగ్స్‌లో శుబమ్ రంజనే(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విధ్వంసం సృష్టించిన పూరన్..ఇక 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ న్యూయర్క్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 14.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఎంఐ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసిం ఆజేయంగా నిలిచాడు. సీటెల్ బౌలర్లలో గనూన్ రెండు వికెట్లు, బర్గర్, జహీర్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్‌రైజర్స్ కెప్టెన్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో ఆడేందుకు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ ఫ్రాంచైజీతో కమ్మిన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రన్నరప్‌గా నిలిపిన కమ్మిన్స్‌కు.. ఈ ఏడాది ఎంఎల్సీ(MLC) సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. గత సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కోకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ అనంతరం.. ఆ జట్టు కెప్టెన్సీ పదవి ఇంకా ఖాళీగానే ఉంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్‌తో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రాంచైజీ కమ్మిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కమ్మిన్స్‌కు కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. తన సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియాకు కమ్మిన్స్ వరుసగా డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్‌ను అందించాడు. ఈ క్రమంలోనే లీగ్ క్రికెట్లో పలు ఫ్రాంచైజీలు అతడికి పగ్గాలు అప్పగించేందుకు క్యూ కడుతున్నాయి.ఇక ఈ ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో ఇప్పటికే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదర్చుకున్నారు. ట్రావిస్ హెడ్, మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, మోసస్ హెన్రిక్స్ , బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ఆటగాళ్లు వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో తరపున ఆడనున్నారు. అదే విధంగా ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్‌కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. జూలై 2 నుంచి ఎంఎల్సీ సెకెండ్ సీజన్ ప్రారంభం కానుంది.చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేసేందుకు నేను రెడీ: గంభీర్ -
మేజర్ లీగ్ క్రికెట్‌కు లిస్ట్-ఏ హోదా
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్‌గా ఎంఎల్సీ గుర్తింపు దక్కించుకుంది. ఎంఎల్సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్‌సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్‌లో మూడు వారాల పాటు 19 మ్యాచ్‌లు ఆడగా.. ఈ సీజన్లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్‌గా ఎక్స్‌ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంఎల్‌సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌కు తొలి సీజన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్‌ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్సీ అరంగేట్ర ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్‌సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. క్రికెట్లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి. -
మాక్స్వెల్ కీలక నిర్ణయం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున మాక్స్వెల్ ఆడనున్నాడు. ఈ మెరకు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టులో తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు సైతం చేరారు. తాజాగా మాక్సీ కూడా జతకట్టడంతో వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ మధ్య నుంచి మాక్స్వెల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు తన అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్వెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్సీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న ఈ మేజర్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ జూలై 4నుంచి ప్రారంభం కానుంది.