అంతర్జాతీయ క్రికెట్ విడ్కోలు పలికిన ఇంగ్లండ్ లెజండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. యూకే మీడియా రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆండర్సన్ ఆడనున్నట్లు సమాచారం.
మేజర్ లీగ్ క్రికెట్‌లో ఓ ఫ్రాంచైజీ తమ జట్టులో ఆండర్సన్ భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే అతడితో సదరు ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. ఆండర్సన్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఎంఎల్‌సీలో ఆండర్సన్ ఆడనున్నాడా?
కాగా అమెరికా వేదికగా ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు భాగమయ్యారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, జోష్ హేజల్‌వుడ్ వంటి వారు ఎంఎల్‌సీలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతనిథ్యం వహిస్తున్నారు.
అయితే ఆండర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడితే మరింత ప్రాధన్యత సంతరించుకునే అవకాశముంది. కానీ ఆండర్సన్‌కు అయితే టీ20ల్లో పెద్దగా అనుభవం లేదు. ఆండర్సన్ చివరగా 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆండర్సన్ ఆడలేదు. మరి ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగమవుతాడా లేదన్నది వేచి చూడాలి.
చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment