ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని తాను పట్టుదలతో ఉన్నట్లు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. ఇప్పటికీ తనలో క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. అందుకే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు వెల్లడించాడు. కాగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.
సౌదీ అరేబియాలోని జిద్దా నగరాన్ని బీసీసీఐ వేలంపాటకు వేదికగా ఎంచుకుంది. ఈ క్రమంలో 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ ఆండర్సన్ కూడా ఉన్నాడు. అయితే, అతడు 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.
రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధర
అయినప్పటికీ.. 42 ఏళ్ల ఆండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరతో తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయం గురించి తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలో క్రికెట్ ఆడగల సత్తా మిగిలే ఉంది. నేను వేలంలోకి రావడానికి ప్రధాన కారణం అదే.
నన్ను ఎవరైనా కొనుక్కుంటారా? లేదా? అన్న అంశంతో నాకు అవసరం లేదు. నాకైతే తిరిగి మళ్లీ క్రికెట్ ఆడాలని ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏ ఫార్మాట్లో ఆడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా’’ అని ఆండర్సన్ పేర్కొన్నాడు.
అయితే, ఇప్పటి వరకు తన ఏ ఫ్రాంఛైజీ ఆశ్రయించలేదని.. అయినా తాను ఏదో ఒక జట్టుకు ఆడాతననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టెస్టుల్లో 704 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!
ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ టెస్టు జట్టు మెంటార్‌గా కొత్త అవతారమెత్తాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆండర్సన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆ జట్టును వీడిన బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో స్థానంలో ఆండర్సన్ సేవలను ఉపయోగించుకునే దిశగా చెన్నై అడుగులు వేయవచ్చు.
చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!
Comments
Please login to add a commentAdd a comment