James Anderson
-
మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని తాను పట్టుదలతో ఉన్నట్లు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. ఇప్పటికీ తనలో క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. అందుకే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు వెల్లడించాడు. కాగా నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.సౌదీ అరేబియాలోని జిద్దా నగరాన్ని బీసీసీఐ వేలంపాటకు వేదికగా ఎంచుకుంది. ఈ క్రమంలో 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఇంగ్లండ్ లెజెండరీ బౌలర్ ఆండర్సన్ కూడా ఉన్నాడు. అయితే, అతడు 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరఅయినప్పటికీ.. 42 ఏళ్ల ఆండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరతో తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ విషయం గురించి తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాలో క్రికెట్ ఆడగల సత్తా మిగిలే ఉంది. నేను వేలంలోకి రావడానికి ప్రధాన కారణం అదే.నన్ను ఎవరైనా కొనుక్కుంటారా? లేదా? అన్న అంశంతో నాకు అవసరం లేదు. నాకైతే తిరిగి మళ్లీ క్రికెట్ ఆడాలని ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏ ఫార్మాట్లో ఆడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నా’’ అని ఆండర్సన్ పేర్కొన్నాడు. అయితే, ఇప్పటి వరకు తన ఏ ఫ్రాంఛైజీ ఆశ్రయించలేదని.. అయినా తాను ఏదో ఒక జట్టుకు ఆడాతననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టెస్టుల్లో 704 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్!ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ టెస్టు జట్టు మెంటార్‌గా కొత్త అవతారమెత్తాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆండర్సన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆ జట్టును వీడిన బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో స్థానంలో ఆండర్సన్ సేవలను ఉపయోగించుకునే దిశగా చెన్నై అడుగులు వేయవచ్చు.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడనున్న ఆండర్సన్?
అంతర్జాతీయ క్రికెట్ విడ్కోలు పలికిన ఇంగ్లండ్ లెజండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. యూకే మీడియా రిపోర్ట్ ప్రకారం.. వచ్చే ఏడాది మేజర్ లీగ్ క్రికెట్లో ఆండర్సన్ ఆడనున్నట్లు సమాచారం.మేజర్ లీగ్ క్రికెట్లో ఓ ఫ్రాంచైజీ తమ జట్టులో ఆండర్సన్ భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే అతడితో సదరు ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. ఆండర్సన్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.ఎంఎల్‌సీలో ఆండర్సన్ ఆడనున్నాడా?కాగా అమెరికా వేదికగా ఈ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఇప్పటికే చాలా మంది స్టార్ క్రికెటర్లు భాగమయ్యారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, జోష్ హేజల్‌వుడ్ వంటి వారు ఎంఎల్‌సీలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతనిథ్యం వహిస్తున్నారు.అయితే ఆండర్సన్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడితే మరింత ప్రాధన్యత సంతరించుకునే అవకాశముంది. కానీ ఆండర్సన్‌కు అయితే టీ20ల్లో పెద్దగా అనుభవం లేదు. ఆండర్సన్ చివరగా 2014లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆండర్సన్ ఆడలేదు. మరి ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్లో భాగమవుతాడా లేదన్నది వేచి చూడాలి.చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు' -
ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అతడే: కేఎల్ రాహుల్
శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన కేఎల్ రాహుల్ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో వరుసగా 37, 57 పరుగులు చేశాడు. అయితే, కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా-‘ఎ’ జట్టుకు ఓటమి తప్పలేదు.తదుపరి టెస్టు సిరీస్‌తో బిజీబెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా-‘బి’ చేతిలో ఇండియా- ‘ఎ’ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. సొంతగడ్డ మీద సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న మ్యాచ్‌లో అతడు భాగం కానున్నాడు. తాజా ఫామ్ దృష్ట్యా తుదిజట్టులోనూ ఈ వికెట్ కీపర్‌కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నంబర్ వన్ అతడేఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా-‘ఎ’ జట్టును వీడిన కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లను ఎంచుకోమని యూట్యూబర్ కోరగా.. విరాట్ కోహ్లికి అగ్రస్థానమిచ్చిన రాహుల్.. ఆ తర్వాతి స్థానాలకు వరుసగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజం, ట్రవిస్ హెడ్‌ను ఎంపిక చేసుకున్నాడు.అత్యుత్తమ బౌలర్ ఎవరంటే?ఇక ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ ఎవరంటూ సదరు యూట్యూబర్ ఆప్షన్లు ఇవ్వగా రాహుల్.. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ పేరు చెప్పాడు. ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు రెండో ర్యాంకు ఇచ్చిన రాహుల్.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మూడు, అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు నాలుగు, పాకిస్తాన్ యువ పేసర్ నసీం షా కు ఐదో ర్యాంకు ఇచ్చాడు.కాగా ప్రపంచంలోని నవతరం ఫాస్ట్బౌలర్లలో ప్రత్యేకమైన శైలితో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుమ్రాను కాదని కేఎల్ రాహుల్ స్టెయిన్ పేరు చెప్పడం అతడి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సదరు యూట్యూబర్ తానే ఆప్షన్లు ఇచ్చి రాహుల్‌ను పేర్లు ఎంచుకోమని చెప్పాడు. కాబట్టి.. ‘‘అతడి లిస్టులో బుమ్రా పేరు ఉందో లేదో రాహుల్‌కు తెలియదు. అందుకే అతడు స్టెయిన్‌ను ఎంచుకుని ఉండవచ్చు’’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా క్లాసీ రాహుల్ ఎంతో క్లాస్‌గా సమాధానాలు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
రీ ఎంట్రీ ఇవ్వనున్న ఆండర్సన్..?
ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ తిరిగి బంతిని పట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఆండర్సన్ టీ20ల్లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడు. తాజాగా ఓ పొడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఇంగ్లండ్ లెజండరీ క్రికెటర్ వెల్లడించాడు. వచ్చే వేసవిలో లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు తన సిద్దంగా ఉన్నానని ఆండర్సన్ తెలిపాడు. అదేవిధంగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా వ్యవరించాలన్న తన కోరికను ఆండర్సన్ వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. "నా కెరీర్లో టీ20 క్రికెట్‌ను చాలా కోల్పోయాను. టీ20ల్లో ఏదో ప్రత్యేకత ఉంది. కాబట్టి నేను పొట్టి ఫార్మాట్లో ఆడాలనకుంటున్నాను. నాకు ఇంకా ఫిట్నెస్ ఉంది. ప్రస్తుతం ది హండ్రెడ్ లీగ్‌ను తరుచుగా చూస్తున్నాను. మొదటి 20 బంతులను బౌలర్లు అద్భుతంగా స్వింగ్ చేస్తున్నారు. నేను కూడా ఆవిధంగా బంతిని స్వింగ్ చేయగలను. అయితే ఇప్పటివరకు రెడ్‌బాల్‌తో అలవాటపడ్డ నేను వైట్ బంతితో ఎంతవరకు స్వింగ్ చేస్తానన్నది ప్రశ్నార్ధకం. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ ఇప్పటివరకు నేను ఆడలేదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి మరి" అని ది ఫైనల్ వర్డ్ పొడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండర్సన్ పేర్కొన్నాడు. కాగా ఆండర్సన్ తన స్వదేశంలో కాకుండా బయట ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలంటే సౌతాఫ్రికా టీ20 లీగ్, బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ మంచి ఎంపికగా చెప్పుకోవాలి. కానీ ఐపీఎల్ వేలంలోకి వస్తే అతడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకం. -
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్‌హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్‌లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
మళ్లీ పప్పులో కాలేసిన పాక్ కెప్టెన్
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఆండర్సన్.. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్లో 704 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. రెడ్‌బాల్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా తన కెరీర్‌ను ముగించాడు. ఈ క్రమంలో అండర్సన్స్కు క్రికెటర్లు,అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఆండర్సన్‌కు అభినందనలు తెలిపే క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పప్పులో కాలు వేశాడు. ఆండర్సన్ ‘కట్టర్’లను ఎదుర్కోవడం విశేషం అని బాబర్ తెలిపాడు."జిమ్మీ.. మీ బౌలింగ్‌లో కట్టర్లను ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు జెంటిల్మన్ గేమ్ నీలాంటి గొప్ప క్రికెటర్‌ను కచ్చితంగా మిస్ అవుతోంది. వరల్డ్ క్రికెట్లో మీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది.నిజంగా మీరు గోట్(గ్రేటేస్ట్ ఆల్‌టైమ్)" అని ఎక్స్‌లో బాబర్ రాసుకొచ్చాడు. అయితే ఇక్కడే బాబర్ తప్పు చేశాడు. అస్సలు కట్టర్స్ అనేవి ఆండర్సన్ బౌలింగ్ శైలికి సంబంధం లేదు. అతడు ఎక్కువగా బంతిని స్వింగ్ చేస్తాడు. దీంతో బాబర్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు.అయితే తన తప్పును గ్రహించిన బాబర్ పోస్ట్‌ను డిలీట్ చేసి కొత్తగా మళ్లీ పోస్ట్ చేశాడు. ఈ సారి మీ స్వింగ్‌ను ఎదుర్కొవడం విశేషం అంటూ రాసుకొచ్చాడు. బాబర్ తొలుత పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటకి నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్లు తీసి పాక్ కెప్టెన్‌ను తెగ ఆడేసికుంటున్నారు. ఇనాళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నావు.. నీవు మారవా బాబర్ అంటే కామెంట్లు చేస్తున్నారు. It was a privilege to face your swing, Jimmy!The beautiful game will now miss one of its greatest. Your incredible service to the sport has been nothing short of remarkable. Huge respect for you, GOAT 🫡 pic.twitter.com/fE2NMz4Iey— Babar Azam (@babarazam258) July 12, 2024 -
‘704’తో ముగించిన అండర్సన్
లండన్: 21 సంవత్సరాల టెస్టు కెరీర్... 188 మ్యాచ్‌లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కెరీర్‌కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో అండర్సన్ ఖాతాలో చివరిదైన 704వ వికెట్ చేరింది. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా... సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు. మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్ మోతీ (31 నాటౌట్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ (5/61) విండీస్‌ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. -
21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ప్లేయర్ జిమ్మీ ఆండర్సన్ 21 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.JIMMY ANDERSON FINAL MOMENTS ON THE FIELD IN INTERNATIONAL CRICKET. 🫡🌟pic.twitter.com/24uSZqeBOK— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఆండర్సన్.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్‌కు సాగనంపారు. లార్డ్స్ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్‌ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆండర్సన్ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్ చివరి వికెట్ జాషువ డసిల్వ.THE FINAL WALK OF JIMMY ANDERSON IN INTERNATIONAL CRICKET. 🥹pic.twitter.com/N2GFFDgYYT— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 202441 ఏళ్ల ఆండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్‌లు ఆడి 26.45 సగటున 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన ఆండర్సన్ ఆంతకుముందు ఏడాదే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో జిమ్మీ 194 మ్యాచ్‌లు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున టీ20లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో కేవలం 19 మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 18 వికెట్లు పడగొట్టాడు. The final Test wicket of Jimmy Anderson.21 Years. 704 Wickets. Legend. 🫡pic.twitter.com/3iK85SYxBO— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024సుదీర్ఘ కెరీర్ లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా కీర్తించబడతాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే ఆండర్సన్ కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు పడగొట్టారు. మూడు ఫార్మాట్లలో చూసినా మురళీథరన్ (1347), షేన్ వార్నే (1001) మాత్రమే ఆండర్సన్ (987) కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది.A lovely tribute video by England Cricket for Jimmy Anderson. 🐐❤️pic.twitter.com/AAHXj4zTJx— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు కుప్పకూలింది.GUARD OF HONOUR FOR JIMMY ANDERSON. 🐐- The greatest ever of England cricket!pic.twitter.com/5ks2Iz8oEy— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.LORD'S AND FAMILY OF JIMMY ANDERSON GIVING HIM ONE FINAL STANDING OVATION. 🥹❤️ pic.twitter.com/HD3mG7MYK0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించడంతో విండీస్ 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్‌తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించారు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్‌పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. చివరి మ్యాచ్ ఆడబోతున్న ఆండర్సన్
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ దిగ్గజ పేసర్ జిమ్మీ ఆండర్సన్ కెరీర్లో చివరి మ్యాచ్. ఈ టెస్ట్ అనంతరం ఆండర్సన్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తాడు. ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్ట్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్ (జులై 18-22), ఎడ్జ్‌బాస్టన్ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.వెస్టిండీస్ తుది జట్టు (అంచనా): క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్), జాసన్ హోల్డర్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్‌కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా జేమ్స్ ఆండర్సన్
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆండర్సన్ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్‌ను ఫాస్ట్ బౌలింగ్ మెంటార్‌గా నియమించింది. తన చివరి టెస్ట్ ముగిసిన వెంటనే ఆండర్సన్ కొత్త బాధ్యతలు చేపడతాడు.ఇంగ్లండ్.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్‌లు మొదలవుతాయి. లార్డ్స్, ట్రెంట్‌బ్రిడ్జ్, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. లార్డ్స్‌లో జరుగబోయే టెస్ట్‌తో ఆండర్సన్ రిటైర్ కానున్నాడు. ఆండర్సన్ బౌలింగ్ మెంటార్‌గా తన ప్రస్తానాన్ని విండీస్‌తో రెండో టెస్ట్ నుంచి మొదలుపెడతాడు.జట్ల వివరాలు..ఇంగ్లండ్ (తొలి రెండు టెస్ట్‌లకు): హ్యారీ బ్రూక్, జో రూట్, డేనియల్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్, జేమ్స్ ఆండర్సన్ (తొలి టెస్ట్‌కు మాత్రమే), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డిల్లన్ పెన్నింగ్టన్, మ్యాట్ పాట్స్వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కవెమ్ హాడ్జ్, అలిక్ అథనాజ్, జకరీ మెక్క్యాస్కీ, జేసన్ హోల్డర్, కిర్క్ మెక్కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్ ఇమ్లాక్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, మిఖైల్ లూయిస్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జెర్మియా లూయిస్ -
అండర్సన్ సంచలన నిర్ణయం.. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న ఆండర్సన్.. ఈ వేసవి సీజన్‌తో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా 41 ఏళ్ల ఆండర్సన్ వెల్లడించాడు."ఈ వేసవిలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు మ్యాచ్. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్‌కు ,అభిమానులకు ధన్యవాదాలంటూ" ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్ రాసుకొచ్చాడు. ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) -
జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!
యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. కాగా క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల(GBP- British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్‌లో ఆయన.. ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్‌తో ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను సునాక్ షేర్ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు సునాక్. కాగా ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్లో పాల్గొన్నానంటూ రిషి సునాక్ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రిషి సునాక్.. ‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్ పెట్టారు. ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08 — England Cricket (@englandcricket) April 5, 2024 -
Sports: తాను '700ల మైలు రాయిని' దాటిన వండర్సన్..!
41 సంవత్సరాల 7 నెలల 8 రోజులు.. ఈ వయసులో అంతర్జాతీయ క్రీడల్లో చాలా మంది రిటైర్మెంట్ తీసుకొని ఎక్కడో ఒక చోట కోచ్‌గానో లేక వ్యాఖ్యాతగానో పని చేస్తూ ఉంటారు. లేదంటే ఆటకు దూరంగా దానితో సంబంధం లేకుండా కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. కానీ జేమ్స్ అండర్సన్ ఇంకా క్రికెట్ మైదానంలో పరుగెడుతూ ఉన్నాడు. పట్టుదలగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పోరాటతత్త్వమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఏకంగా 700 వికెట్ల మైలురాయిని అందుకునేలా చేసింది. 21 ఏళ్లుగా సాగుతున్న అంతర్జాతీయ కెరీర్ అతని స్థాయి ఏమిటో చూపిస్తే, అలసట లేకుండా సాగుతున్న ప్రయాణం ఎన్నో అద్భుత ప్రదర్శనలను ప్రపంచ క్రికెట్ అభిమానులకు అందించింది. సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ సంవత్సరాలు ఆటలో కొనసాగడంలో విశేషం లేదు. గతంలోనూ చాలామంది ఇంతకంటే ఎక్కువ ఏళ్లు క్రికెట్ ఆడారు. కానీ ఎంతో కఠోర శ్రమతో కూడిన పేస్ బౌలింగ్‌లో అన్ని ప్రతికూలతలను, గాయాలను దాటి ఒక బౌలర్ ఇలా సత్తా చాటడం ఎంతో అరుదైన విషయం. 2002లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జిమ్మీ అండర్సన్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 187 టెస్టు మ్యాచ్‌లు.. జిమ్మీ అండర్సన్ కెరీర్ ఇది. ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే ఇంతకంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. 16 ఏళ్లకే అరంగేట్రం చేసిన బ్యాటర్‌గా సచిన్‌తో పోలిస్తే 20 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన అండర్సన్ కెరీర్ ప్రస్థానం పూర్తిగా భిన్నం. టి–20ల కాలంలో నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోతున్న ఈతరం బౌలర్లతో పోటీ పడుతూ రోజుకు 15–20 వరకు అంతర్జాతీయ టెస్టుల్లో బౌలింగ్ చేయడం అసాధారణం. వీటికి 194 వన్డేలు అదనం. టెస్టులు, వన్డేలు కలిపి అతను దాదాపు 50 వేల బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేలకు దాదాపు 9 ఏళ్ల క్రితమే వీడ్కోలు పలికినా టెస్టుల్లో ఇంకా అదే జోరును అండర్సన్ కొనసాగించి చూపిస్తున్నాడు. ఒకే ఒక లక్ష్యంతో.. జేమ్స్ అండర్సన్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. అతను చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టపడ్డాడు. చూడటంతో పాటు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా ఆడేవాడు. అందుకే ఇంట్లోనూ ప్రోత్సాహం లభించింది. స్కూల్ క్రికెట్నుంచే అతను బౌలింగ్‌పై దృష్టి పెట్టాడు. సాధనతో ఆపై పూర్తి స్థాయి పేస్ బౌలర్‌గా సత్తా చాటాడు. దాంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్థానిక లాంక్షైర్ కౌంటీ మైనర్ లీగ్‌లలో అండర్సన్ సత్తా చాటాడు. దాంతో లాంక్షైర్ ప్రధాన కౌంటీ టీమ్ తరఫున ఆడేందుకు ఎంపికయ్యాడు. అండర్సన్ ఎంత మెరుగ్గా కౌంటీల్లో ప్రభావం చూపించాడంటే లాంక్షైర్ తరఫున కేవలం 3 వన్డేలు ఆడగానే అతనికి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు లభించడం విశేషం. తన జెర్సీపై కనీసం తన పేరు, నంబర్ కూడా లేకుండానే హడావిడిగా టీమ్‌తో కలిసిన అండర్సన్ అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. దాంతో 2003 వరల్డ్ కప్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇలా మొదలైన ఆరంభం రెండు దశాబ్దాలుగా గొప్పగా సాగుతూనే ఉంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలతో.. అండర్సన్ కెరీర్ ఆరంభంలో రెండు పార్శా్వలతో సాగింది. చక్కటి బౌలింగ్‌తో లయతో సాగుతున్నప్పుడు అతనిలాంటి మంచి బౌలర్ ఎవరూ లేరన్నట్లుగా వికెట్ల వర్షం కురిసింది. కానీ ఒక్కసారి లయ కోల్పోతే అంత చెత్త బౌలర్ లేరన్నట్లుగా బ్యాటర్లు చితకబాదారు. లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే ఐదు వికెట్లతో తన రాకను ఘనంగా చాటడం, ఆ తర్వాత కొద్ది రోజులకే పాకిస్తాన్‌పై వన్డేల్లో హ్యట్రిక్ అతడికి తగిన గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ అప్పటికే ఇంగ్లండ్ జట్టులో పలువురు సీనియర్లు పాతుకుపోయి ఉండటంతో తగినన్ని అవకాశాలు దక్కలేదు. దాంతో విరామాలతో వచ్చిన అవకాశాల్లో అండర్సన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే 2005 తర్వాత ఇంగ్లండ్ ప్రధాన పేసర్లంతా ఆటకు గుడ్‌బై చెప్పడంతో వచ్చిన అండర్సన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగి ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించడంతో టీమ్‌లో స్థానం సుస్థిరమైంది. సంప్రదాయ స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో పాటు రివర్స్ స్వింగ్ విద్యలో కూడా ఆరితేరిన తర్వాత అండర్సన్ మరింత ప్రమాదకరంగా మారాడు. కెరీర్ ఆరంభంలో తన యాక్షన్‌ను మార్చుకొని కొంత ఇబ్బందిపడిన అతను కొద్ది రోజులకే మళ్లీ తన పాత్ సైడ్ ఆర్మ్ యాక్షన్‌కు వచ్చి అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 2010 తర్వాత అండర్సన్ తనను తాను అత్యుత్తమ పేసర్‌గా తీర్చి దిద్దుకున్నాడు. ఇంగ్లండ్‌లో హీరో లేదా జీరో అయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉండే సిరీస్ యాషెస్. సొంత గడ్డపై పలుమార్లు ఆసీస్ బ్యాటర్ల పని పట్టిన అండర్సన్ కెరీర్లో 2010–11 ఆస్ట్రేలియా పర్యటన హైలైట్‌గా నిలిచింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 3–1తో చిత్తుగా ఓడించడంలో 24 వికెట్లతో అండర్సన్ ప్రధాన పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టేందుకు 2015 వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పిన అండర్సన్ తాను అనుకున్నట్లుగా ఈ ఫార్మాట్లో మరిన్ని గొప్ప ప్రదర్శనలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగి.. అండర్సన్ సొంత మైదానాల్లో మాత్రమే రాణిస్తాడని, వాతావరణంలో కాస్త మంచు, తేమ ఉంటేనే స్వింగ్‌తో చెలరేగుతాడనేది అతనిపై పలు సందర్భాల్లో వచ్చిన విమర్శ. అయితే ఒక్కో ఏడాది ఆటలో రాటుదేలుతూ పోయిన తర్వాత ఇలాంటి విమర్శలకు అతను చెక్ పెట్టాడు. ఇంగ్లండ్‌లోని అన్ని వేదికలపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో సహజంగానే అతని పేరు కనిపిస్తుంది. కానీ వీటికి తోడు శ్రీలంకలోని గాలేలో 6 వికెట్లు, కేప్‌టౌన్‌లో 5 వికెట్లు, అడిలైడ్‌లో 5 వికెట్లు, 2012లో నాగ్‌పూర్‌లో భారత్‌పై 4 కీలక వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శన.. ఇలా విదేశీ గడ్డపై అండర్సన్ తీసిన వికెట్లు అతని ప్రభావాన్ని చూపించాయి. ఇక అరంగేట్ర టెస్టు నుంచి ఇప్పటి వరకు అతని ఆటలో సాగిన పురోగతి, వేర్వేరు ప్రత్యర్థులపై నమోదు చేసిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. మాస్టర్ ఆఫ్ స్వింగ్ నుంచి అతను మాస్టర్ ఆఫ్ ఆల్ కండిషన్స్గా మారాడు. 700 వికెట్లు ముగ్గురే సాధించగా వారిలో మురళీధరన్, వార్న్ స్పిన్నర్లు కాగా అండర్సన్ తొలి పేస్ బౌలర్. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ ఎక్కువ టెస్టులు ఆడటం సహజంగానే అండర్సన్‌కు కలిసి వచ్చినా, అతను ఆటడం మాత్రమే కాకుండా అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ విలువ పెరిగే వైన్‌లాగా అతను మారాడు. అతని వికెట్లను మూడు దశలుగా విడగొడితే; తొలి 44 టెస్టుల్లో సగటు 35 కాగా, తర్వాతి 47 టెస్టుల్లో అది 28కి తగ్గింది. ఇక 2014నుంచి ఆడిన 96 టెస్టుల్లో సగటు ఏకంగా 22.66కి తగ్గడం అంటే బౌలర్‌గా అతను ఎంత మెరుగయ్యాడో అర్థమవుతుంది. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండర్సన్ ఏకంగా 220 వికెట్లు తీయడం విశేషం. స్వింగ్‌కు పెద్దగా అనుకూలించని ఉపఖండపు పిచ్‌లపై కూడా గత పదేళ్లలో అండర్సన్ 23.56 సగటును నమోదు చేయడం అతను ఎంత ప్రభావం చూపించాడో చెబుతుంది. మురళీధరన్ (800 వికెట్లు)ను చేరుకోవడం చాలా కష్టం కాబట్టి మరో 9 వికెట్లు తీసి షేన్‌వార్న్ (708)ను దాటడం అండర్సన్ తదుపరి లక్ష్యం. ఇంగ్లండ్ బోర్డు అతనిపై నమ్మకముంచితే, అతని ఘనతలను పరిగణనలోకి తీసుకొని వేటు వేయకుండా మరికొంత కాలం ఆడే అవకాశం కల్పిస్తే సచిన్ అత్యధిక టెస్టుల (200) రికార్డును అండర్సన్ అధిగమించగలడు. ఒకవేళ ఆ లోపే అతని ఆట ముగిసిపోయినా, వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా అతను సాధించిన ఘనతల విలువ ఏమాత్రం తగ్గదు. — మొహమ్మద్ అబ్దుల్ హాది. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి
Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్ ఆండర్సన్ నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆండర్సన్ ఖాతాలో 700వ టెస్టు వికెట్ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి పేసర్‌గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక- స్పిన్నర్)- 800 షేన్ వార్న్(ఆస్ట్రేలియా- స్పిన్నర్)- 708 జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్- పేసర్)- 700* అనిల్ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్)- 619 స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్- పేసర్)- 604 View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్‌లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్‌లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్‌బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్‌క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్‌కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్‌దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
జేమ్స్ ఆండర్సన్ సూపర్ డెలివరీ.. గిల్‌కు మైండ్ బ్లాంక్! వీడియో
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను ఆండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత ఇన్నింగ్స్ 63 ఓవర్ వేసిన ఆండర్సన్ రెండో బంతిని గిల్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆండర్సన్ వేసిన బంతికి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన గిల్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీతో చెలరేగాడు. 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110 పరుగులు చేసింది. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 366 పరుగులు చేసింది. pic.twitter.com/HuGzNOAzav — Sitaraman (@Sitaraman112971) March 8, 2024 -
ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్‌లోని చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు లభించిన విరామ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెటర్లు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ విరామ సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ సహచర క్రికెటర్లతో కలిసి స్థానిక జలపాతంలో రీఫ్రెష్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. England cricketer James Anderson and his teammates enjoying a refreshing dip in a local khadd in Dharamshala 😍 pic.twitter.com/JQravFPLvM — Go Himachal (@GoHimachal_) March 6, 2024 ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిలో మమేకమైపోయారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా కనెక్టైనట్లుంది. హిమాచల్ ప్రదేశ్ శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడి జలపాతాలు, ఎత్తైన మంచు కొండలు భూతలస్వర్గాన్ని తలపిస్తాయి. అందుకే ఈ ప్రాంతం ఇంగ్లీష్ క్రికెటర్లకు స్వదేశానుభూతిని కలిగిస్తుంటుంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల నడుమ భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో సొంత అభిమానులను నిరుత్సాహపరిచింది. బజ్‌బాల్ అంటూ ఊదరగొట్టిన వీరు రోహిత్ సేన దెబ్బకు తోకముడిచారు. బెన్ డకెట్, ఓలీ పోప్, రూట్ సెంచరీలు మినహా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెప్పకోదగ్గ ప్రదర్శనలు లేవు. స్టార్లతో నిండిన జట్టు నుంచి ఊహించని ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. -
వారెవ్వా.. 41 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. 40/0 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైశ్వాల్(37) తొలి వికెట్‌గా రూట్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(55), రజిత్ పాటిదార్(0) పెవిలియన్‌కు చేరారు. భారత విజయానికి ఇంకా 80 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో గల్(13), జడేజా(2) పరుగులతో ఉన్నారు. ఆండర్సన్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇక నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్ క్యాచ్‌తో ఆండర్సన్ పెవిలియన్‌కు పంపాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్ వేసిన జో రూట్ బౌలింగ్‌లో మూడో బంతిని జైశ్వాల్ ఆఫ్ సైడ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిలో టర్న్ ఎక్కువగా వుండడంతో ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న 41 ఏళ్ల ఆండర్సన్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/yzWaeTi1f0 — Sitaraman (@Sitaraman112971) February 26, 2024 -
అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరిశాపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ ట్రాప్‌లో హిట్‌మ్యాన్ చిక్కుకున్నాడు. ఆండర్సన్ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టాడు. భారత ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ఆండర్సన్.. నాలుగో బంతిని రోహిత్‌కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని హిట్‌మ్యాన్ ఫార్వెర్డ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ కొనబాగాన తగిలి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో నిరాశతో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. అదే విధంగా ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. చదవండి: WPL 2024: తండ్రి రిక్షా డ్రైవర్.. కూతురేమో మ్యాచ్ ఫినిషర్! ఎవరీ సజనా? pic.twitter.com/MIOrEQkEDC — Sitaraman (@Sitaraman112971) February 24, 2024 -
ఆండర్సన్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సెంచరీ అనంతరం నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 187 పరుగుల వద్ద ఉన్న యశస్వి.. వెటరన్ పేసర్ ఆండర్సన్పై కనికరం లేకుండా విచుకుపడ్డాడు. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత గేర్ మార్చిన అతను.. ఇన్నింగ్స్ 85వ ఓవర్లో ఆండర్సన్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది 180ల్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 సౌరవ్ గంగూలీ తర్వాత మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు దాటిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2007లో స్వదేశంలో పాక్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంగూలీ 534 పరుగులు సాధించాడు. ఓ ఇన్నింగ్స్‌లో, ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ఇన్నింగ్స్‌లో యశస్వి ఇప్పటివరకు 10 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో అతను 20 సిక్సర్లు కొట్టాడు. యశస్వికి ముందు టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ (19) పేరిట ఉండేది. ఆండర్సన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన ఐదో భారత ప్లేయర్‌గా (2002 తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు ధోని (రెండు సార్లు), హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వికి (194) జతగా సర్ఫరాజ్ ఖాన్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 378/4గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 504 పరుగుల లీడ్‌లో ఉంది. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్‌లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్‌ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్‌లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్‌కోట్ టెస్ట్‌తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్‌కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
చారిత్రక మైలురాళ్లకు అడుగు దూరంలో ఉన్న అశ్విన్, ఆండర్సన్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగబోయే మూడో టెస్ట్‌లో వెటరన్ బౌలర్లు జిమ్మీ ఆండర్సన్, రవిచంద్రన్ అశ్విన్‌లు చారిత్రక మైలురాళ్లపై కన్నేశారు. వీరిద్దరు టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాళ్లకు అతి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో అశ్విన్ ఇంకాస్త ముందున్నాడు. రాజ్‌కోట్ టెస్ట్‌లో యాష్ (499) మరో వికెట్ తీస్తే, టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా, రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. యాష్‌కు ముందు అనిల్ కుంబ్లే (619 వికెట్లు) మాత్రమే భారత్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఆండర్సన్ విషయానికొస్తే.. మూడో టెస్ట్‌లో జిమ్మీ (695) మరో ఐదు వికెట్లు తీస్తే సుదీర్ఘ ఫార్మట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ అరుదైన మార్కును దాటారు. స్పిన్ దిగ్గజాలు ముత్తయ్య మురళీథరన్ (800), షేన్ వార్న్ మాత్రమే 700 వికెట్ల ఘనతను సాధించారు. ఆండర్సన్ ఈ మైలురాయిని చేరుకుంటే, ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్‌గా, తొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా పలు రికార్డులు సాధిస్తాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15న మొదలవుతుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ రెండు మ్యాచ్‌లు పూర్తయిన అనంతరం 1-1తో సమంగా ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖలో జరిగిన సెకెండ్ టెస్ట్‌లో భారత్ విజయఢంకా మోగించింది. -
క్రికెటర్ కంటే ముందు ఫాస్ట్ బౌలింగ్ అభిమానిని.. నాకు ఎవరితో పోటీ లేదు: బుమ్రా
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శన కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న బుమ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. వికెట్ల సంఖ్య, గణాంకాలను నేను ఎప్పుడూ పట్టించుకోను. యువకుడిగా ఉన్నప్పుడు అలా చేశాను. అప్పుడు అవి నన్ను ఉత్తేజపరిచేవి. ఇప్పుడు పరిస్థితి వేరు. సీనియర్‌గా నాపై అదనపు బాధ్యతలు ఉన్నాయి. యుక్త వయసులో నేను నేర్చుకున్న మొదటి డెలివరీ యార్కర్. ఆటలోని దిగ్గజాలను చూశాను. వకార్, వసీం, జహీర్ ఖాన్.. ఇలా చాలామంది బౌలింగ్‌ను చూస్తూ పెరిగాను. జట్టుగా మేము పరివర్తన దశలో పయనిస్తున్నాము. జట్టు కోసం నేను చేయగలిగినదంతా చేస్తాను. అది బాధ్యతగా భావిస్తాను. జట్టు అవసరాల పరంగా రోహిత్‌తో చాలా విషయాలు చర్చిస్తాను. అతనితో చాలా కాలంగా కలిసి ఆడుతున్నాను కాబటి మా ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. ఇంగ్లండ్ వెటరన్, దిగ్గజ పేసర్ జిమ్మీ ఆండర్సన్‌తో పోటీపై స్పందిస్తూ.. క్రికెటర్ కంటే ముందు నేను ఫాస్ట్ బౌలింగ్ అభిమానిని. ఏ ఫాస్ట్ బౌలర్ రాణించినా ముందుగా నేనే వారిని అభినందిస్తాను. మ్యాచ్ సమయంలో వ్యూహ రచనపై స్పందిస్తూ.. పరిస్థితిని, వికెట్‌ను చూసి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తాను. ముందుగా ఏదో ప్రణాళికలు అనుకుని అలా వెళ్లాలని అనుకోనని అన్నాడు. కాగా, బుమ్రాతో పాటు యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఇదిలా ఉంటే, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్తో టీమిండియాను గెలిపించిన బుమ్రాను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచనున్నారన్న ప్రచారం జరుగుతుంది. వర్క్‌లోడ్ కారణంగా మూడో టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతి కల్పించనున్నట్లు సమాచారం. తిరిగి అతన్ని నాలుగు, ఐదు టెస్ట్‌లకు జట్టులోకి ఆహ్వానిస్తారని తెలుస్తుంది. -
అండర్సన్ మ్యాజిక్ డెలివరీ.. బిత్తరపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన అండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సత్తాచాటుతున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట సందర్భంగా అండర్సన్ సంచలన బంతితో మెరిశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన అండర్సన్.. నాలుగో బంతిని రోహిత్‌కు అద్బుతమైన ఔట్ స్వింగర్‌ను సంధించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి రోహిత్ బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఈ మ్యాజిక్ డెలివరీకి రోహిత్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 27 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్ Same to same.. 👀👀 Have to fix this #RohitSharma#INDvENGpic.twitter.com/IFMhUwY2jY — Parth_ 45 (@Parth_045) February 4, 2024 -
చరిత్ర సృష్టించిన జేమ్స్ ఆండర్సన్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బరిలోకి దిగడం ద్వారా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై అత్యధిక వయసులో ( 41 ఏళ్ల 187 రోజులు) టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆండర్సన్‌కు ముందు లాలా అమర్నాథ్ (1952లో 41 ఏళ్ల 92 రోజుల వయసులో భారత గడ్డపై పాక్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు) భారత్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగా ఉన్నాడు. ఈ జాబితాలో రే లిండ్వాల్ (38 ఏళ్ల 112 రోజులు), షూటే బెనర్జీ (37 ఏళ్ల 124 రోజులు), గులామ్ గార్డ్ (34 ఏళ్ల 20 రోజులు) మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. History created by Anderson. 🐐 - He is the oldest pacer to play Tests in India. pic.twitter.com/VcxhpfmUBO — Johns. (@CricCrazyJohns) February 2, 2024 ఇదిలా ఉంటే, లేటు వయసులోనూ ఏమాత్రం దూకుడు తగ్గని ఆండర్సన్ టీమిండియాపై సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ వెటరన్ పేసర్ టెస్ట్ క్రికెట్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆండర్సన్ ఖాతాలో 691 వికెట్లు ఉన్నాయి. ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో ఆండర్సన్ కీలకమైన శుభ్‌మన్ గిల్ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27) మరోసారి నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌లో ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆండర్సన్ ఖాతాలో మరో రికార్డు.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యధిక క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఆండర్సన్ రెండో స్థానంలో నిలిచాడు. చంద్రపాల్, ఆండర్సన్ ఇద్దరూ 22 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 25 క్యాలెండర్ ఇయర్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. -
ఆండర్సన్ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి "ఆ ఇద్దరు" పుట్టనేలేదు..!
విశాఖ వేదికగా భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. 41 ఏళ్ల ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కని ఆండర్సన్‌ను రెండో టెస్ట్‌లో బరిలోకి దించాలని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆండర్సన్ ఎంట్రీతో తొలి టెస్ట్ ఆడిన మరో పేసర్ మార్క్ వుడ్‌పై వేటు పడింది. టీమిండియాపై, ప్రత్యేకించి భారత గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మార్పుతో పాటు రెండో టెస్ట్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ తుది జట్టులో మరో మార్పు కూడా చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానంలో పాక్ మూలాలున్న స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఈ రెండు మార్పులతో ఇంగ్లండ్ రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొంటుంది. Shoaib Bashir and Rehan Ahmed were not even born when Jimmy Anderson made his Test debut. - Tomorrow Anderson will take the field with both Bashir and Rehan...!!! 🫡🐐 pic.twitter.com/i7PgpMVb5g — Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024 ఇదిలా ఉంటే, వెటరన్ పేసర్ ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఆండర్సన్ టెస్ట్ అరంగేట్రం చేసే నాటికి అతని ప్రస్తుత సహచరుల్లో ఇద్దరు పుట్టనే లేదు. ఆండర్సన్ 2003, మే 22న తన తొలి టెస్ట్ మ్యాచ్ (జింబాబ్వేపై) ఆడగా.. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యులు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ అప్పటికి జన్మించలేదు. బషీర్ 2003, అక్టోబర్ 13న పుట్టగా.. రెహాన్ 2004, ఆగస్ట్ 13న జన్మించాడు. ఈ ఆసక్తికర అంశం గురించి తెలిసి ఆండర్సన్ ఫిట్నెస్ను, ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అతను మరో రెండేళ్లు కూడా ఆడేలా ఉన్నాడంటు కామెంట్లు చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో ఆండర్సన్.. షోయబ్, రెహాన్లతో కలిసి బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే, ఆండర్సన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతను 183 టెస్ట్‌లు ఆడి 690 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌కు (800 వికెట్లు) దక్కింది. అతనికి తర్వాతి స్థానంలో షేన్ వార్న్ (708) ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్ ఆక్రమించాడు. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. -
Ind vs Eng: రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
Ind vs Eng 2nd Test Vizag: టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది. జాక్ లీచ్ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్‌వుడ్‌ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్మెంట్. ఈ మ్యాచ్‌లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్‌వుడ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్ సెషన్లో అతడు పాల్గొనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో గెలిచేందుకు కాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో చేర్చింది బీసీసీఐ. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్? -
IND vs ENG: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ హైవోల్టేజ్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టును ఒక రోజు ముందే ప్రకటించింది. తొలి టెస్టుకు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దూరమయ్యాడు. ఆండర్సన్ స్ధానంలో స్పీడ్ స్టార్ మార్క్ వుడ్‌కు మేనెజ్మెంట్ ఛాన్స్ ఉంది. కాగా ఈసీబీ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్‌లో స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడే కావడం గమనార్హం. అనూహ్యంగా ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. స్పినర్ల కోటాలో రెహన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హర్ట్లీ చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్
ICC WC 2023 Winner Prediction: వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకుంటుందని ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో ఈసారి టీమిండియాను ఓడించి ట్రోఫీ గెలుస్తుందంటూ అతి విశ్వాసం ప్రదర్శించాడు. కాగా 2019 ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ రాకతో ఇంగ్లిష్ జట్టు మరింత పటిష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచకప్-2023లో భారత్ వేదికగా ఆడిన తొలి మ్యాచ్‌కే స్టోక్సీ దూరం కావడం ఇంగ్లండ్‌పై ప్రభావం చూపింది. ఆరంభ మ్యాచ్‌లో కివీస్ చేతిలో చిత్తుగా ఓడి ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది బట్లర్ బృందం. -2.149 రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్‌గా కొనసాగుతున్న ఆండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ 13వ ఎడిషన్‌లో సెమీస్ చేరే జట్లు, టైటిల్ విన్నర్‌పై తన అంచనాను తెలియజేశాడు. ఆండర్సన్(PC: X) సెమీస్‌లో ఆ 4 జట్లే.. ఇక ఫైనల్లో ‘‘ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈసారి సెమీ ఫైనలిస్టులుగా నిలుస్తాయి. ఆసీస్‌తో ఇటీవలి సిరీస్‌లో సౌతాఫ్రికా(3-2తో గెలుపు) అదరగొట్టింది. నిజానికి ప్రస్తుతం ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక.. పాకిస్తాన్, న్యూజిలాండ్ కూడా సెమీస్ దిశగా పయనిస్తాయి. కానీ.. టాప్-4లో నిలవలేవు. నా అంచనా ప్రకారం.. హోరాహోరీ ఫైనల్లో ఇంగ్లండ్ టీమిండియాను ఓడించి టైటిల్ గెలుస్తుంది’’ అని దిగ్గజ బౌలర్ ఆండర్సన్ బీబీసీ టెస్టు మ్యాచ్ స్పెషల్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా నవంబరు 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: నువ్వెందుకు ఉన్నట్లు? అయినా రాహుల్‌ను ఎందుకు ఆడించట్లేదు: యువీ -
Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్ రిప్లై ఇదే! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యజిలాండ్ మధ్య మ్యాచ్‌తో గురువారం ప్రపంచకప్ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్‌కు ఇంగ్లండ్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. వాళ్లిద్దరు లేరు కదా! ఓ జర్నలిస్టు.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఫాస్ట్‌బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్‌కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా. 2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారు. నవ్వు ఆపుకొన్న బట్లర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్‌బాల్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్ బ్రాడ్ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్ ఈ విధంగా స్పందించాడు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్ విజేత బట్లర్ భారత్‌లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి! చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. A journalist asked Jos Buttler in the PC if the absence of Anderson and Broad will affect their pace bowling in the tournament?Just look at him,he was trying so hard not to laugh 😂😭.#CWC23 Video Credit: @ICC Facebook pic.twitter.com/1rdOjglfEd — Delhi Capitals Fan (@pantiyerfc) October 4, 2023 -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
స్టువర్ట్ బ్రాడ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..
యాషెస్ సిరీస్ 2023 చివరి టెస్ట్ సందర్భంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు తన కెరీర్లో చివరిసారి బ్యాటింగ్‌కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్‌తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రాడ్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆసీస్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్‌ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్‌ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్, బ్రాడ్ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు. Who's cutting onions? 🥺🥺pic.twitter.com/6wEoLEpp9Q — CricTracker (@Cricketracker) July 30, 2023 బ్రాడ్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్ బౌలర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్ తరఫున సుదీర్ఘ టెస్ట్ కెరీర్ కలిగిన బ్రాడ్‌కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన బ్రాడ్.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ (8) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. -
ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!
England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో మాంచెస్టర్‌లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో అతడికి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. వైఫల్యాలు కొనసాగిస్తూ గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్‌క్లాస్)తో లెజెండరీ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్ సిరీస్‌లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా అండర్సన్‌కు బదులు ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్ బృందంపై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!! యాషెస్ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
Ashes 5th Test: మొండిగా వెళ్తున్న టీమ్ ఇంగ్లండ్.. కీలక ప్రకటన
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో చివరి టెస్ట్‌కు ముందు టీమ్ ఇంగ్లండ్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో టెస్ట్‌లో ఆడిన 14 మంది సభ్యుల జట్టునే ఐదో టెస్ట్‌లోనూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. సిరీస్‌లో 1-2తో వెనుపడినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండా మొండిగా ముందుకెళ్తుంది. గత మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన జేమ్స్ ఆండర్సన్‌ను సైతం కొనసాగించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేకపోతున్న ఆండర్సన్‌ను అయినా తప్పిస్తారని అంతా ఊహించినప్పటికీ.. ఇంగ్లీష్ మేనేజ్మెంట్ మాత్రం అనుభవజ్ఞుడైన ఆండర్సన్‌ను జట్టులో కొనసాగించేందుకు మొగ్గు చూపింది. తుది జట్టులో ఆండర్సన్‌కు అవకాశం ఇస్తుందో లేదో తెలీదు కానీ, 14 మంది సభ్యుల జట్టులో అతన్ని కొనసాగించి సంచలన నిర్ణయమే తీసుకుంది. ఎలాగూ యాషెస్ చేజారింది కాబట్టి, ఆండర్సన్‌ను ఆఖరి టెస్ట్ బరిలోకి దించి అతనిచే బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటన చేయించాలని అనుకుంటుదేమో కాని, మొత్తానికి ఆండర్సన్‌ను కొనసాగించి ఇంగ్లండ్ టీమ్ పెద్ద సాహసమే చేసింది. కాగా, నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతి దాకా వచ్చిన గెలుపు వరుణుడి కారణంగా చేజారింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ బౌలర్లు మరో 5 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలిచే అవకాశంతో పాటు సిరీస్ అవకాశాలు కూడా సజీవంగా ఉండేవి. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రా గా ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకుంది. అంతకుముందు తొలి రెండు టెస్ట్‌ల్లో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడో టెస్ట్‌ల్లో విజయం సాధించి, నాలుగో టెస్ట్‌లో గెలుపు అంచుల వరకు వచ్చింది. నాలుగో టెస్ట్‌లో వరుణుడి పుణ్యమా అని ఆసీస్ ఓటమి బారి నుంచి తప్పించుకుని యాషెస్‌ను నిలబెట్టుకుంది. చివరిదైన ఐదో యాషెస్ టెస్ట్ కియా ఓవల్ వేదికగా జులై 27 నుంచి ప్రారంభమవుతుంది. ఐదో యాషెస్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు.. బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ -
Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు...
దిగ్గజ పేసర్, ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. యాషెస్ సిరీస్-2023లో ఇంగ్లండ్ నష్టపోవడానికి ఆండర్సన్ ప్రధాన కారణమని ఆరోపించాడు. లెజెండ్ బౌలర్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు ఇంగ్లండ్ టీమ్ తగిన మూల్యం చెల్లించుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆండర్సన్ ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఒక్కటంటే ఒక్క కీలక వికెట్ కూడా తీసి జట్టుకు ఉపయోగపడింది లేదని ఫైరయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను ఆండర్సన్‌ను తూర్పారబెట్టిన వాన్.. మరోవైపు నుంచి కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఆండర్సన్‌ను దిగ్గజ బౌలర్‌గా పరిగణించడాన్ని ఎవరూ కాదనలేరని, జట్టులో చోటుకు అతను వంద శాతం అర్హుడే అని అంటూనే ఆండర్సన్ సేవల వల్ల ఇంగ్లండ్‌కు ఒరిగిందేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. వర్షం కారణంగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం బీబీసీ యాషెస్ డైలీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన 4 యాషెస్ టెస్ట్‌ల్లో 3 మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 114 ఓవర్లు వేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. వాన్ చెప్పినట్లు ఆండర్సన్ పేలవ ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఆండర్సన్ స్థానంలో మరే బౌలర్‌ను తీసుకున్నా ఫలితాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండేవి. నాలుగో టెస్ట్‌లో అయితే ఆండర్సన్ ప్రదర్శన అరంగేట్రం బౌలర్ కంటే దారుణంగా ఉండింది. నాలుగో రోజు ఆండర్సన్ ఏ మాత్రం ప్రభావం చూపించినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచి, సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకునేది. మొత్తంగా చూస్తే కెరీర్లో సుమారు 1000 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ ప్రస్తుతం జట్టుకు భారంగా మారాడు. ఐదో టెస్ట్‌లో అయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మేల్కొనకపోతే ఇంతకుమించిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దిగ్గజ బౌలర్, కెరీర్ చరమాంకంలో ఉన్నాడు అని ములాజకు పోతే ఐదో టెస్ట్‌లో కూడా ఇంగ్లండ్‌కు భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో ఆండర్సన్‌ను పక్కకు పెట్టి ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరిని ఆడించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో ఆసీస్ యాషెస్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు యాషెస్‌ను ఈ దఫా కూడా తమ వద్దనే ఉంచుకోనుంది. ఒకవేళ ఇంగ్లండ్ ఆఖరి టెస్ట్ గెలిచినా సిరీస్ 2-2తో డ్రా అవుతుందే తప్ప ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేదు. -
తొలి బంతికే వికెట్ తీసిన ఆండర్సన్.. ఐదేసిన వోక్స్.. ఆసీస్ ఆలౌట్
యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తొలి బంతికే వికెట్ తీశాడు. డ్రైవ్ షాట్ ఆడబోయిన కమిన్స్ (1).. కవర్ పాయింట్లో ఉన్న స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ ఓవర్‌నైట్ స్కోర్ 299 వద్దనే తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 301 పరుగుల వద్ద ఆలౌట్.. అయితే..! క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ సెకెండ్ స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 301 పరుగుల వద్ద ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఐదేసిన వోక్స్.. ఆసీస్ 317 ఆలౌట్ హాజిల్‌వుడ్ (4)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 317 పరుగుల వద్ద ముగిసింది. 36 పరుగులతో స్టార్క్ అజేయంగా నిలిచాడు. క్రిస్ వోక్స్‌కు ఇది యాషెస్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41), డేవిడ్ వార్నర్ (32), మిచెల్ స్టార్క్ (36 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ ఐదేయగా, బ్రాడ్ 2, ఆండర్సన్, వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్‌లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్‌కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్‌ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్‌లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్‌లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్‌ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్‌ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
యాషెస్ నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించింది. ముందుగా ప్రచారం జరిగిన విధంగా మూడో టెస్ట్ ఆడిన జట్టునే ఈసీబీ కొనసాగించలేదు. నాలుగో టెస్ట్ కోసం ఈసీబీ ఓ మార్పు చేసింది. ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. One change for the 4th @LV_Cricket #Ashes Test at @EmiratesOT 🏟🏏 — England Cricket (@englandcricket) July 17, 2023 మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్‌డౌన్‌లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్‌లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, మూడో టెస్ట్‌లో ఆసీస్‌పై ఇంగ్లండ్ చిరస్మరణీ విజయం సాధించిన తర్వాత ఇంగ్లీష్ మేనేజ్మెంట్ అదే జట్టును కొనసాగిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈసీబీ మాత్రం నాలుగో టెస్ట్ కోసం రాబిన్సన్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆండర్సన్ వైపే మొగ్గు చూపింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మూడో టెస్ట్ సందర్భంగా రాబిన్సన్ స్వల్పంగా గాయపడ్డాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్లతో రాణించిన రాబిన్సన్ మూడో టెస్ట్‌లో మాత్రం తేలిపోయాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ -
యాషెస్ మూడో టెస్ట్ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు). ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్ కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలన్న పట్టుదలతో ఉంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం తుది జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై వేటు పడింది. 41 ఏళ్ల అండర్సన్ టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 179 టెస్టుల్లో 688 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు అతన్ని పక్కనబెట్టారు. అండర్సన్‌తో పాటు రెండో టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన జోష్ టంగ్‌ను కూడా పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. వీరిద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌తో పాటు మార్క్ వుడ్లు తుది జట్టులోకి వచ్చారు. ఇక భుజం గాయంతో సిరీస్‌కు దూరమైన బ్యాటర్ ఓలీ పోప్ స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ వచ్చింది. లార్డ్స్ టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్.. మూడో టెస్టులో మాత్రం ఓలీ పోప్ స్థానమయిన నెంబర్-3లో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం ఇంగ్లండ్ గడ్డపై 22 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌ను గెలిచిన కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించనున్నాడు. మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ చదవండి: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్.. #Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా -
అండర్సన్ కంటే జహీర్ ఖాన్ బెస్ట్ బౌలర్: ఇషాంత్
భారత క్రికెట్లో మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. తన అద్భుత బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్ దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్‌కు తన సేవలు అందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరోసారి ఈ దిగ్గజ పేసర్‌పై టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్‌లో ఎవరు అత్యుత్తమ బౌలర్ అని రణ్వీర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా ఇషాంత్ ఏమీ ఆలోచింకుండా అండర్సన్ కంటే జహీర్ గొప్ప బౌలర్‌ను అని చెప్పుకొచ్చాడు. కాగా అండర్సన్ కూడా ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన కెరీర్లో ఇప్పటి వరకు 180 టెస్టులు, 194 వన్డేలు ఆడిన అండర్సన్ వరుసగా 269, 686 వికెట్లు పడగొట్టాడు. అతడి టెస్టు కెరీర్లో ఏకంగా 32 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. "జిమ్మీ అండర్సన్ బౌలింగ్ శైలి కాస్త బిన్నంగా ఉంటుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతడు ఎక్కువ భాగం తన కెరీర్లో ఇంగ్లండ్‌లోనే ఆడాడు. ఇంగ్లండ్ పిచ్‌లకు పేసర్లు అనుకూలిస్తాయి, అదే భారత్‌లో ఆడి వుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. నా వరకు అయితే అండర్సన్ కంటే జాక్(జహీర్ ఖాన్) బెస్ట్ బౌలర్" అని ఇషాంత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్ టూర్‌కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు! -
'అలా అయితే యాషెస్‌లో నా కథ ముగిసినట్లే!'
ఇంగ్లండ్ వెటరన్ పేసర్.. జేమ్స్ అండర్సన్ నిస్సందేహంగా ఈ తరంలో ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ అని చెప్పొచ్చు. స్వింగ్ కింగ్‌గా పేరొందిన అండర్సన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇరుదేశాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌లోనూ అండర్సన్ కీలకపాత్ర పోషించాడు. 2015లో ఇంగ్లండ్ యాషెస్ గెలవడంలో అండర్సన్‌దే ముఖ్యపాత్ర. అలాంటి అండర్సన్ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన యాషెస్ సిరీస్ 2023లో అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ఒక్క ప్రదర్శనతో అతనికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే బెన్ స్టోక్స్ అండర్సన్‌ను బాగా నమ్ముతాడు. అందుకే రెండో టెస్టులో రాణించి స్టోక్స్ నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న అండర్సన్ ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ''లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో నా బౌలింగ్ పదును చూపించాలనుకుంటున్నా. కానీ ఎడ్జ్‌బాస్టన్ టెస్టు పిచ్ ఫ్లాట్‌గా ఉంది. యాషెస్ సిరీస్‌లో జరిగే మిగతా టెస్టుల్లోనూ పిచ్ ఇలాగే ఉంటే మాత్రం యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో పిచ్‌పై స్వింగ్, రివర్స్ సింగ్ లేవు.. సీమ్ బౌన్స్ అసలే లేదు.. కనీసం పేస్ బౌలింగ్‌కు కూడా అనుకూలంగా లేదు. రానున్న మ్యాచ్‌ల్లో పేస్‌కు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. ఇక ఎన్నో ఏళ్లుగా ఇంగ్లండ్‌కు ప్రధాన బౌలర్‌గా ఉన్నా. నా బౌలింగ్ స్కిల్స్‌తో ఎలాంటి కండీషన్స్లోనైనా వికెట్లు రాబట్టే ప్రయత్నం చేశా.. కానీ ఎడ్జ్‌బాస్టన్ పిచ్ మొదటిసారి కొత్తగా కనిపించింది. ఇలాగే ఉంటే యాషెస్‌తో నా బంధం ముగిసినట్లే(అంటే జట్టులో చోటు కోల్పోవడమే) అని అర్థం'' అంటూ వివరించాడు. James Anderson said - "If all Ashes pitches are like Edgbaston that I'm done in the Ashes series. That pitch was like kryptonite for me. There was not much swing, no reverse swing, no seam bounce, no movement and no pace". (On Edgbaston pitch in first Ashes)#Ashes2023 pic.twitter.com/fqQBldgENj — Aman Awasthi (@AwasiAman17) June 23, 2023 చదవండి: టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా -
Ashes 1st Test: 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్న జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో (టెస్ట్‌లతో కలుపుకుని) 1100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో జిమ్మీ ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆండర్సన్.. కేవలం 289 మ్యాచ్‌ల్లోనే 1100 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 54 సార్లు 5 వికెట్ల ఘనత (ఇన్నింగ్స్‌లో), 6 సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్‌లో) సాధించాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/19గా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్ల ఘనత ఇంగ్లండ్‌కే చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ పేరిట ఉంది. అతను 1110 మ్యాచ్‌ల్లో ఏకంగా 4204 వికెట్లు పడగొట్టాడు. విల్ఫ్రెడ్ తర్వాత టిచ్ ఫ్రీమన్ (592 మ్యాచ్‌ల్లో 3776 వికెట్లు), చార్లీ పార్కర్ (635 మ్యాచ్‌ల్లో 3278 వికెట్లు) ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2003లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన ఆండర్సన్.. 180 మ్యాచ్‌ల్లో 686 వికెట్లు పడగొట్టి, ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆండర్సన్ టెస్ట్‌ల్లో 32 సార్లు 5 వికెట్ల ఘనత, 3 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. అతని అత్యుత్తమ టెస్ట్ గణాంకాలు 7/42గా ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ముత్తయ్య మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు కేవలం 32.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసి, 35 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా బౌలింగ్ క్యాంప్‌లో జేమ్స్ అండర్సన్!
హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటాడు. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకునే బోగ్లేకు బయట చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా 61 ఏళ్ల హర్షా బోగ్లే జేమ్స్ అండర్సన్ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా బౌలింగ్ క్యాంప్‌లో జేమ్స్ అండర్సన్ ప్రత్యక్షమయ్యాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లకు బౌలింగ్‌లో టిప్స్ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ రియాలిటీలో అతను జేమ్స్ అండర్సన్ కాదు.. సోహమ్ దేశాయ్. ప్రస్తుతం టీమిండియాకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సైడ్ యాంగిల్లో సోహమ్ దేశాయ్ అచ్చం జేమ్స్ అండర్సన్‌ను తలపించాడు. అందుకే బోగ్లే అదేంటి అండర్సన్.. టీమిండియా క్యాంప్‌లో ఏం చేస్తున్నాడని కన్ఫూజన్‌కు గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో నాలుక చరుచుకున్న హర్షా బోగ్లే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. HAHAHAHAHA! Poor Harsha Bhogle really believed Soham Desai to be Jimmy Anderson pola. Tells on air that Anderson came to help out the Indian team before the final 😂 pic.twitter.com/LuMvln3hTF — Mama | 360° Entertainment (@SriniMaama16) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
ఆసీస్‌తో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్!
England Vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండర్సన్.. సోమర్‌సెట్‌తో మ్యాచ్ సందర్భంగా గజ్జల్లో నొప్పితో విలవిల్లాడాడు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే నొప్పి కారణంగా వైదొలిగాడు. మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లంకాషైర్- సోమర్సెట్ మధ్య మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ గాయం గురించి ఆదివారం ప్రకటన చేసింది. అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం 40 ఏళ్ల ఆండర్సన్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అయితే, జూన్ 1న ఐర్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ ఆడనున్న ఏకైక టెస్టు నాటికి అతడు జట్టుతో చేరతాడా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొంది. విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్ ఇదిలా ఉంటే.. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి గురించి లంకాషైర్ కోచ్ గ్లెన్ చాపెల్ బీబీసీతో మాట్లాడుతూ.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఏమీ లేదని, త్వరలోనే అతడు కోలుకుండాటని చెప్పాడు. కాగా జూన్ 16 నుంచి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడనున్న ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా ఆండర్సన్ టెస్టు క్రికెట్లో 685 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వారితో పాటు తాజాగా ఇక ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఓలీ స్టోన్, బ్రైడన్ కార్స్ తదితరులు గాయాల బారిన పడగా.. తాజాగా ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే 2021-22 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఐదింట నాలుగు విజయాలతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌నైనా డ్రా చేసుకుని ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక యాషెస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. జూన్ 7-11 వరకు మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
వారం మురిపమే.. అండర్సన్‌తో సంయుక్తంగా
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన అశ్విన్ ఆరు ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో అశ్విన్, అండర్సన్ ఇద్దరూ 859 ర్యాంకింగ్ పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్, అండర్సన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మధ్య పోటీ కొనసాగుతున్నది. భారత్‌తో రెండు, మూడు టెస్టులు ఆడకపోవడంతో వెనుకబడిన కమిన్స్ ప్రస్తుతం 849 ర్యాంకింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే ఐసీసీ వారానికి ఒకసారి ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ వారం కొత్త జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో సౌతాఫ్రికా బౌలర్ కగీసో రబడా 807 ర్యాంకింగ్ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో విజృంభిస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం లియోన్ 9వ స్థానంలో ఉన్నాడు. చదవండి: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్.. కోహ్లి సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్ శర్మ.. -
BGT 2023: నంబర్ 1 బౌలర్‌గా అశ్విన్.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా
ICC Test Bowling Rankings- Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశూ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. అశ్విన్ రెండో టెస్టులో మూడే! తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ వంటి కీలక బ్యాటర్ల వికెట్లు కూల్చి ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఆసీస్ నడ్డి విరిచాడు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో తొలి టెస్టులో రాణించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో టెస్టులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న ఆండర్సన్.. రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అశ్విన్- జేమ్స్ ఆండర్సన్ టాప్-5లో మనోళ్లు ఇద్దరు ఈ నేపథ్యంలో జేమ్స్ ఆండర్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పయి రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఉన్న అశ్విన్ నంబర్ 1గా అవతరించాడు. టాప్-5లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది స్థానం సంపాదించారు. ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు ర్యాంకులే దిగజారడంతో బుమ్రా నాలుగోస్థానానికి చేరుకోగా.. ఆఫ్రిది టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా 2015లో అశ్విన్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ బుమ్రా టాప్-5లో కొనసాగడం విశేషం. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 2. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 859 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు 5. షాహిన్ ఆఫ్రిది- పాకిస్తాన్- 787 పాయింట్లు చదవండి: BGT 2023 IND VS AUS 3rd Test: జడ్డూ బౌలింగ్‌లో లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..! IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్ శర్మ తప్పు చేశాడా? -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు! ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే!
ICC Men's Test Bowling Rankings: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌లో మౌంట్ మాంగనీయ్లో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లతో సత్తా చాటి.. అగ్రస్థానానికి ఎగబాకాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. ఆండర్సన్ ఈ ఫీట్ నమోదు చేయడం ఇది ఆరోసారి. ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానం ఆక్రమించాడు. ఈ క్రమంలో ఆండర్సన్ 87 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టాడు. 87 ఏళ్ల రికార్డు బద్దలు అత్యధిక వయసులో టెస్టు నంబర్ 1 బౌలర్‌గా అవతరించిన క్రికెటర్‌గా నిలిచాడు. 40 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం క్లారీ గ్రిమెట్ పేరిట ఉండేది. 1936లో 44 ఏళ్ల 2 నెలల వయసులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఇక ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో 40 ఏళ్ల దాకా జట్టులో కొనసాగడం కాస్త కష్టమే. కాబట్టి ఇప్పటికైతే ఆండర్సన్ రికార్డుకు ఎసరు పెట్టేవాళ్లు లేరని చెప్పవచ్చు. మొదటి ర్యాంకుకు అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదం ఇక కివీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆండర్సన్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అగ్రస్థానానికి ఎగబాకి మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌తో ఆండర్సన్ మొదటి ర్యాంకుకు ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లండ్‌కు కివీస్‌తో ప్రస్తుతం మిగిలి ఉన్నది ఒకే ఒక టెస్టు. దీంతో ఆండర్సన్ న్యూజిలాండ్‌తో మిగిలిన మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది. అదే సమయంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు అశ్విన్. అశూకు నల్లేరు మీద నడకే ఆసీస్‌తో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో అదీ తనకు అచ్చొచ్చిన పిచ్‌లపై ఈ స్పిన్ బౌలర్ చెలరేగడం ఖాయం. కాబట్టి స్వల్పకాలంలోనే అశ్విన్,.. కేవలం తనకంటే రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువగా కలిగి ఉన్న ఆండర్సన్‌ను వెనక్కినెట్టడం సులువే. ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌తో పోటీ ఉందని భావించినా.. అతడు అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లడం.. మళ్లీ వస్తాడో లేదో తెలియకపోవడం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అశ్విన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రస్థానానికి చేరుకోవడం 36 ఏళ్ల అశూకు నల్లేరు మీద నడకే! ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 866 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. ఓలీ రాబిన్సన్- ఇంగ్లండ్- 820 పాయింట్లు 5. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు చదవండి: Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ Women T20 WC: కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్ -
కమిన్స్ జైత్రయాత్రకు చెక్.. నంబర్ 1 ఎవరంటే! సత్తా చాటిన జడ్డూ
ICC Men's Test Bowling Rankings: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకస్థానం మెరుగుపరచుకుని రెండో ర్యాంకు సాధించాడు. జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించిన ఆండర్సన్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వీళ్లిద్దరినీ వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 866 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకు అందుకున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. ఆండర్సన్ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. రవీంద్ర జడేజా సత్తా చాటిన జడ్డూ దాదాపు నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కమిన్స్‌కు చెక్ పెట్టాడు. అదే విధంగా.. అత్యధిక వయసులో నంబర్ 1 ఘనత సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతున్న టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 6 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 763 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. త్వరలోనే నంబర్ 1 అశ్విన్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ మిగతా రెండు టెస్టుల్లోనూ సత్తా చాటితే నంబర్1గా అవతరించడం ఖాయం. మరోవైపు.. కమిన్స్ మళ్లీ పూర్వవైభవం పొందాలంటే మాత్రం టీమిండియాతో సిరీస్‌లో తప్పక రాణించాలి. అయితే, అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన అతడు అసలు తిరిగి వస్తాడా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అశూ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మొదటి రెండు టెస్టుల్లో పేసర్ కమిన్స్ మొత్తంగా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా పదిహేడు వికెట్లతో సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 866 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. ఓలీ రాబిన్సన్- ఇంగ్లండ్- 820 పాయింట్లు 5. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు బుమ్రా చదవండి: ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు! Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ -
ENG Vs NZ: గర్జించిన వెటరన్ సింహాలు.. న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్
బజ్‌బాల్ విధానాన్ని అవలంభించి ఇంగ్లండ్ జట్టు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై ఆడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టును 267 పరుగుల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్లు ఆండర్సన్, బ్రాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ 7 వికెట్లతో విజృంభించగా.. బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా ఈ వెటరన్ పేస్ ద్వయం రెండో ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగారు. బ్రాడ్ 4, ఆండర్సన్ 4 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాశించారు. బ్రాడ్ పడగొట్టిన 4 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లు కావడం మరో ఆసక్తికర విషయం. ఇంగ్లండ్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆండర్సన్, బ్రాడ్ ధాటికి 126 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. అటాకింగ్ ఫార్ములాను అమలు చేసిన ఇంగ్లండ్ మరోసారి సక్సెస్ సాధించింది. ఆండర్సన్, బ్రాడ్‌తో పాటు ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) అర్ధసెంచరీ సాధించగా.. టామ్ లాథమ్ (15), బ్రేస్‌వెల్ (25) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులకు ఆలౌటైంది. 19 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 374 పరుగులకు ఆలౌటై, ప్రత్యర్ధి ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటై 267 పరుగుల తేడతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డక్కెట్ (84), హ్యారీ బ్రూక్ (89) భారీ అర్ధశతకాలతో చెలరేగగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో టామ్ బ్లండెల్ (138) సెంచరీతో, కాన్వే (77) హాఫ్ సెంచరీతో మెరిశారు. అనంతరం ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రూట్ (57), హ్యారీ బ్రూక్ (54), ఫోక్స్ (51) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో న్యూజిలాండ్ బౌలర్లు వాగ్నర్ 6, టిక్నర్ 4, కుగ్గెలిన్ 4, బ్రేస్‌వెల్ 3, సౌథీ 2 పడగొట్టగా.. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 7, బ్రాడ్ 5, రాబిన్సన్ 5, జాక్ లీచ్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 24 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగనుంది. -
సెంచరీతో మెరిసిన బ్లండెల్.. ఇంగ్లండ్‌కు దీటైన జవాబు.. కానీ అంతలోనే
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ 306 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (77)కు తోడు.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్(138) సెంచరీతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 306 పరుగుల(82.5 ఓవర్లలో) వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 3 వికెట్లు తీయగా.. రాబిన్సన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వాళ్లలో స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, కెప్టెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది. కాగా గత కొంతకాలంగా దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్‌కు కొత్త పాఠాలు చెబుతున్న ఇంగ్లండ్ మరోసారి అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది. వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా.. న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడిన ఆ జట్టు ఏకంగా ఓవర్‌కు 5.57 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా... ఓపిగ్గా క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేయకుండా ఇంగ్లండ్ బ్యాటర్లంతా ధాటిని కొనసాగించారు. హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, ఒలి పోప్ (42), బెన్ ఫోక్స్ (38) రాణించారు. కాన్వే, బ్లండెల్ వల్లే.. నీల్ వాగ్నర్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కాన్వే, బ్లండెల్ బ్యాట్ ఝులిపించడంతో ఆతిథ్య కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేయగలిగింది. మరోసారి అదే దూకుడు ఈ క్రమంలో 19 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. స్వల్ప ఆధిక్యమే అయినా ఇంగ్లండ్ దూకుడుకు మాత్రం కళ్లెం పడలేదు. 9 ఓవర్లలోనే 50 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే 27 (29), బెన్ డకెట్23 (25) దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, 9.2 వద్ద టిక్నర్ డకెట్‌ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ మౌంగనీయ్, వెల్టింగ్టన్ ఈ సిరీస్‌కు వేదికలుగా మారాయి. చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో.. IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్ Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023 -
NZ Vs Eng: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్‌లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్‌మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ -
చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. గడిచిన 21 ఏళ్లలో..!
వయసు పైబడుతున్న కొద్దీ పాత వైన్‌లా తయారవుతున్నట్లుంది ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పరిస్థితి. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న జిమ్మీ.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. గడిచిన 21 ఏళ్లలో ఏడాదికి కనీసం ఒక వికెటైనా తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 40 ఏళ్ల ఆండర్సన్.. నాటి నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక్క వికెటైనా తీశాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆండర్సన్ టెస్ట్ క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 200320042005200620072008200920102011201220132014201520162017201820192020202120222023James Anderson has now taken a Test wicket in each of the last 21 calendar years 🐐 pic.twitter.com/Zp9w3YEnnM— ESPNcricinfo (@ESPNcricinfo) February 16, 2023 ఇప్పటికే 178 టెస్ట్‌ల్లో 677 వికెట్లు తీసి ఓవరాల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆండర్సన్.. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు (194 వన్డేల్లో 269) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అలాగే టెస్ట్‌ల్లో సచిన్ (200) తర్వాత అత్యధిక టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌గా, ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌గా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 వికెట్లు పడగొట్టిన 216వ బౌలర్‌గా, ఇంగ్లండ్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. తాజాగా ఆండర్సన్ ఖాతాలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇదిలా ఉంటే, కివీస్‌తో తొలి టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రాకెట్ వేగంతో పరుగులు సాధించి 325/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెన్ డక్కెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్ (42), బెన్ ఫోక్స్ (38) సైతం బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి రాబిన్సన్ (15 నాటౌట్; 3 ఫోర్లు) జోరుమీదుండగా.. జేమ్స్ ఆండర్సన్ బరిలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో వాగ్నర్ 4, సౌథీ, కుగ్గెలెన్ తలో 2, టిక్నర్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 37 పరగులు చేసింది. కాన్వే (17), వాగ్నర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కావాల్సినంత సమయం ఉండి, చేతిలో వికెట్ ఉన్నప్పటికీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!'
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ శుక్రవారం అర్థరాత్రి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. కాగా మ్యాచ్ అనంతరం కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం కాగా.. పక్కనే ఉన్న నాదల్ కూడా తట్టుకోలేక ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెదరర్, నాదల్‌ను అభిమానులు ఇలా చూడలేకపోయారు. ''మ్యాచ్‌లో మాత్రమే ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు.. వీరి బంధం విడదీయలేనిది'' అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్.. ఫెడరర్, నాదల్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. వారి ఫోటో పక్కన బ్రాడ్ తనతో పాటు అండర్సన్ ఫోటోను పెట్టాడు. ''2053లో అండర్సన్ రిటైర్ అయితే నేను కూడా ఇలానే ఏడుస్తానేమో'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్న బ్రాడ్, అండర్సన్ మంచి మిత్రలు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో కెరీర్‌ను ఆరంభించారు.టెస్టు క్రికెట్లో పేసర్ల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన లీడింగ్ బౌలర్‌గా అండర్సన్ కొనసాగుతుండగా.. అతని వెనకాలే స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు. కాగా బ్రాడ్ షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు.''ఫెడ్డీ, నాదల్‌లు టెన్నిస్‌లో మంచి మిత్రులైతే... మీరు క్రికెట్లో చిరకాల మిత్రులు.. మీ బంధం కూడా శాశ్వతంగా సాగిపోవాలి అని కోరుకుంటున్నా'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..!
James Andersdon: దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47) చెలరేగి సఫారీలను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 330 పరుగులకే (151, 179) పరిమితం చేయగా.. బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 415/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌లో 6 వికెట్లతో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ప్లేయర్ సైమన్ హార్మర్ వికెట్ పడగొట్టడం ద్వారా ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు (951, టెస్ట్‌ల్లో 664, వన్డేల్లో 269, టీ20ల్లో 18) సాధించిన పేస్ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉండేది. మెక్‌గ్రాత్.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 949 వికెట్లు సాధించాడు. తాజాగా ఆండర్సన్.. మెక్‌గ్రాత్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా అవతరించాడు. 40 ఏళ్ల ఆండర్సన్ మరో 5 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల (పేసర్లు, స్పిన్నర్లు) జాబితాలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను (955 వికెట్లు) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకుతాడు. ఇంగ్లండ్-సఫారీల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 8న ప్రారంభమవుతుంది. చదవండి: జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు -
జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వంద టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్స్‌న్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(స్వదేశంలో 94 టెస్టులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్(స్వదేశంలో 92 టెస్టులు) మూడో స్థానంలో.. ఇక నాలుగో స్థానంలో ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(స్వదేశంలో 91 టెస్టులు) ఉన్నాడు. అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్‌కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ పడిలో అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్‌లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం. ఇక 19 ఏళ్ల కెరీర్లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం పాజిటివ్ నోట్‌తో ఆరంభించింది. లంచ్ విరామం అనంతరం సౌతాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు తీశారు. 19 years after his Test debut at Lord's, James Anderson has another milestone at home 🏴 pic.twitter.com/kMh7aFSh10 — ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2022 చదవండి: Asia Cup 2022: 'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి' SA vs ENG: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ -
పాపం ప్రోటీస్ కెప్టెన్.. దురదృష్టం వెంటాడితే ఇలాగే ఉంటుంది!
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటిస్.. 161 పరుగుల లీడ్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చేలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్ లంగ్త్ బాల్‌తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్ ఇన్నింగ్స్ 23 ఓవర్లో జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన థై ప్యాడ్‌కు తగిలి వికెట్ల వైపు దూసుకెళ్లింది. ఎల్గర్ బంతిని ఆపే ప్రయ్నతం చేసినా అప్పటికే అది వికెట్లను గీరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు దురదృష్టమంటే ఎల్గర్దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. A much-needed wicket! 💪 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | #RedforRuth pic.twitter.com/Y4LqxanBX1 — England Cricket (@englandcricket) August 18, 2022 చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: ‘భారత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా పాకిస్తాన్‌దే విజయం! ఎందుకంటే.. మాకు’! -
కళ్లు చెదిరే క్యాచ్! 40 ఏళ్ల అంకుల్ చేతిలో అవుటయ్యావు.. ఎందుకిలా?
India VS England 5th Test- Shreyas Iyer: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నిరాశ పరిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 11 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్ ఆండర్సన్ వేసిన షార్ట్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్‌కు దొరికిపోయాడు. అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను కళ్లు చెదిరే రీతిలో ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు బిల్లింగ్స్. దీంతో శ్రేయస్ అయ్యర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మరోవైపు.. అయ్యర్‌ను అవుట్ చేసేందుకు షార్ట్ బాల్‌తో తాము పన్నిన పథకం సఫలం కావడంతో ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ముఖంపై చిరునవ్వు విసిరింది. కాగా ఐపీఎల్-2022లో అయ్యర్ సారథిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక సామ్ బిల్లింగ్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది.ఈ క్రమంలో అయ్యర్ అవుటైన తీరుపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు షార్ట్ బాల్‌కు వికెట్ పారేసుకున్న అతడు మళ్లీ అదే తప్పు పునరావృతం చేయడంపై మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ‘‘40 ఏళ్ల అంకుల్(ఆండర్సన్‌ను ఉద్దేశించి) బౌలింగ్‌లో.. మరీ ఇలా అవుటయ్యావు.. ఏంటిది అయ్యర్? నువ్వు చాలా బాగా ఆడతావు. కానీ షార్ట్ బాల్ మాత్రం నీ బలహీనత అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆటలో ఇవన్నీ సహజమని, అయితే అయ్యర్ అవుట్ కాగానే మెకల్లమ్ సంబరపడిపోయిన తీరు శ్రేయస్ విలువేంటో చాటుతోందని అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. చదవండి: IND vs ENG Test Day 1: పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా? Ooooooh what a catch @sambillings!! 🤲 Scorecard & Videos: https://t.co/jKoipFn3e9 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/BOLkN8d7TR — England Cricket (@englandcricket) July 1, 2022 1467703 Shreyas Iyer whenever he sees a ball bounce even a little bit: pic.twitter.com/Gr2wJE6UsJ — Mohit Kumar (@iamsportsgeek) July 1, 2022 Everyone is gone. So do you overthink. Iyer will come good on these situations more often thn not. But just like any other player..need to work on his weakness. At least on leaving that short ball. — Kaushik (@CricKaushik_) July 1, 2022 Iyer rattled by 40 years old uncle and we have booked him for T20 World Cup in Australia. 🤣😭😭#INDvsENG — mahi (@TheJinxyyyy) July 1, 2022 -
సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. అండర్సన్ దూరం
లీడ్స్: సొంతగడ్డపై జోరుమీదున్న ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కొత్త కోచ్ మెకల్లమ్, కొత్త కెప్టెన్ స్టోక్స్‌లతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 2–0తో ఇప్పటికే సిరీస్ గెలిచింది. గురువారం నుంచి జరిగే చివరి టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలని స్టోక్స్ సేన పట్టుదలతో ఉంది. చీలమండ గాయంతో ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్ అండర్సన్ ఈ టెస్టులో ఆడటంలేదు. అతని స్థానంలో కొత్త పేసర్ జేమీ ఓవర్టన్కు తుది జట్టులో అవకాశమిచ్చారు. -
టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్‌గా..!
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టామ్ లాథమ్‌ను ఔట్ చేసిన అండర్సన్.. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్‌ని సాధించాడు. తద్వారా టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అండర్సన్ రికార్డులెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145), జో రూట్(176) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మిచెల్(190),టామ్ బ్లండల్(106) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్ 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతోంది. చదవండి: Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి? -
ఫాస్ట్ బౌలర్లతో వచ్చిన సమస్య ఇదే.. రక్తం చిందించిన వేళ
క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లంటే వేగానికి పెట్టింది పేరు. వారు అత్యంత వేగంతో విసిరే బంతులు ఎవరి మూతులు, ముక్కు విరగ్గొడతాయేమోనని చిన్నపాటి భయం ఉంటుంది. 1970వ దశకంలో వెస్టిండీస్ నుంచి అరవీర భయంకరమైన బౌలర్లు ఉండేవారు. వారు బౌలింగ్‌కు వస్తున్నారంటే ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టేది. అప్పట్లో హెల్మెట్ సహా కీలకమైన గార్డ్స్ అందుబాటులో లేకపోడంతో ఆటగాళ్ల తలలు పగిలి రక్తాలు కారడం సహజంగా కనిపించేది. కానీ కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాట్స్‌మన్‌కు గ్లోవ్స్, ప్యాడ్స్, హెల్మెట్ లాంటి రక్షణ కవచాలు వచ్చాయి. ఫాస్ట్ బౌలర్లు ఎంత వేగంతో సంధించినా చిన్నపాటి గాయాలు తప్ప పెద్దగా నష్టం ఉండేది కాదు. షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, షేన్ బాండ్లు వేగానికి పెట్టింది పేరు. ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియా క్రికెట్లో పిలిప్ హ్యూజ్ ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచంలో విషాదాన్ని మిగిల్చింది. సీన్ అబాట్ వేసిన బంతి హ్యూజ్ హెల్మెట్ సందులో నుంచి వెళ్లి మెడ వెనుక సున్నితమైన ప్రాంతంలో తగలడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. ఆ తర్వాత రెండు రోజులకే పిలిప్ హ్యూజ్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనే అంతకముందు 2008లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేసిన ఒక బంతి ప్రత్యర్థి బ్యాటర్ రక్తం చిందేలా చేసింది. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అండర్సన్ మరోసారి ఫ్లిన్ అంశాన్ని గుర్తు చేశాడు. 2008లో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా కివీస్ ఆటగాడు డేనియల్ ఫ్లిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న అండర్సన్ మరోసారి బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే 12 బంతులు మాత్రమే ఆడిన ఫ్లిన్.. అండర్సన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా వచ్చి హెల్మెట్ గ్రిల్స్ లోపలకి వచ్చి ప్లిన్ మూతిని పగలగొట్టింది. ఈ దెబ్బకు ప్లిన్ నోటి నుంచి పన్ను ఊడి రక్తం కారసాగింది. ఈ దెబ్బకు ఫ్లిన్ క్రీజులోనే కూలబడ్డాడు. నోటి నుంచి రక్తం దారగా కారడంతో ఆటగాళ్లు కాస్త భయానికి లోనయ్యారు. వెంటనే ఫ్లిన్‌ను ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని.. బంతి వేగానిక పన్ను మాత్రమే ఊడిందని.. మిగతా ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు. దీంతొ లంచ్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఫ్లిన్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు. దీంతో భయపడిన అంపైర్లు ఫ్లిన్‌ను పెవిలియన్‌కు పంపించారు. అయితే కేవలం భయంతోనే ఫ్లిన్ వాంతులు చేసుకున్నాడని.. ఆ రాత్రంతా వాంతులు అయ్యాయని.. న్యూజిలాండ్ బోర్డు మరుసటిరోజు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. చదవండి: Ranji Trophy 2022: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
Eng Vs NZ: అదరగొట్టిన సౌథీ, బౌల్ట్.. ఇంగ్లండ్‌కు షాక్! కానీ.. మళ్లీ!
New Zealand tour of England 2022- Eng Vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా తొలిరోజు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి రోజు ఆటలో 92/2తో మెరుగైన స్థితిలో కనిపించిన ఆతిథ్య జట్టును కివీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. ట్రెంట్ బౌల్ట్, కైలీ జెమీషన్, టిమ్ సౌథీ తలా రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరి దెబ్బకు 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఇక శుక్రవారం నాటి రెండోరోజు ఆటలో భాగంగా సౌథీ.. స్టువర్డ్ బ్రాడ్‌ను అవుట్ చేయడంతో ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టు.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఫోక్స్ రూపంలో తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయింది. ఈ క్రమంలో పార్కిన్సన్ వికెట్ తీసి బౌల్ట్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో ఇంగ్లండ్.. కివీస్ కంటే కేవలం 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా సౌథీ నాలుగు, బౌల్డ్ 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జెమీషన్‌కు రెండు, గ్రాండ్‌హోమ్‌కు ఒక వికెట్ లభించాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ 14, విల్ యంగ్ 1, కేన్ విలియమ్సన్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆండర్సన్ ఒకటి, అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. రెండో రోజు ఆటలో 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 36-3. న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్: తొలి టెస్టు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 141-10 (42.5 ఓవర్లు) చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Wasim Jaffer Trolls Eng Vs NZ 1st Test: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! JIMMMY! 😍 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/BLyPNdqwRp — England Cricket (@englandcricket) June 3, 2022 This is some debut 💪 Scorecard/Clips: https://t.co/w7vTpJwrLP 🏴 #ENGvNZ 🇳🇿 | @MattyJPotts pic.twitter.com/9028Sleasc — England Cricket (@englandcricket) June 3, 2022 A 9 run deficit as Tim Southee and Trent Boult combine for 7 wickets at Lord's 🏏 Watch LIVE in NZ with @sparknzsport and listen with @SENZ_Radio 📲#ENGvNZ pic.twitter.com/30zD1K3kXB — BLACKCAPS (@BLACKCAPS) June 3, 2022 -
'వాళ్లిద్దరికే వికెట్లు పడుతున్నాయి.. నీ బాధ నాకు అర్థమైంది'
కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ రావడంతో ఇంగ్లండ్ దశ మారినట్లుంది. క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు కకావికలమైంది. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. రీఎంట్రీ ఇచ్చిన అండర్సన్.. డెబ్యూ టెస్టు ఆడుతున్న మాథ్యూ పాట్స్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కివీస్ బౌలర్లు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగిపోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''డెవన్ కాన్వే.. నీ బాధ నాకు అర్థమయింది..'' అంటూ కాన్వే ఫోటో కాకుండా బ్రాడ్ ఫోటోను పెట్టాడు. కాన్వేకు బదులుగా బ్రాడ్ ఫోటో పెట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. మ్యాచ్‌లో అండర్సన్, బ్రాడ్లు రీఎంట్రీ ఇచ్చారు. రొటేషన్‌లో భాగంగా విండీస్‌తో సిరీస్‌కు వీరిద్దరిని దూరంగా పెట్టారు. ఇక కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరికి అవకాశం వచ్చింది. అండర్సన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు తీసి కివీస్ ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా డెబ్యూ బౌలర్ మాథ్యూ పాట్స్ కూడా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. ఇద్దరే చెరో నాలుగు వికెట్లు తీయడంతో బ్రాడ్‌కు ఒక్క వికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. కానీ డెవన్ కాన్వే రూపంలో బ్రాడ్‌కు అదృష్టం తగిలింది. ఆఫ్‌స్టంప్‌కు వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్న కాన్వే వికెట్ సమర్పించుకున్నాడు. అలా ఎట్టకేలకు అండర్సన్, మాథ్యూ పాట్స్ల మధ్య బ్రాడ్ వికెట్ దక్కించకున్నాడు. ఇది పసిగట్టిన వార్నర్ కాస్త తెలివిని ప్రదర్శిస్తూ కాన్వేపై జాలి చూపిస్తూనే.. ఇన్‌డైరెక్ట్‌గా బ్రాడ్‌కు మెసేజ్ పంపాడు. ''ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరే వికెట్లన్నీ పడగొట్టారు.. నీకు దక్కుతుందో లేదో అని భయపడ్డా.. మొత్తానికి దక్కించుకున్నావు.. నీ బాధ నాకు అర్థమయింది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా! -
Eng Vs NZ: కుప్పకూలిన టాపార్డర్.. 132 పరుగులకే కివీస్ ఆలౌట్!
England Vs New Zealand 1st Test 2022 Day 1: ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ జట్టు విలవిల్లాడింది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి నిలవలేక పర్యాటక కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో తొలి టెస్టు మొదటి రోజు 132 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ ఆండర్సన్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. అదే విధంగా.. అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ సైతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాను సైతం నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బృందానిన్ని ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆండర్సన్. ఓపెనర్లు టామ్ లాథమ్(1 పరుగు), విల్ యంగ్(1)ను పెవిలియన్‌కు పంపాడు. అతడికి తోడు మాథ్యూ పాట్స్ చెలరేగాడు. విలియమ్సన్(2 పరుగులు)ను అవుట్ చేసి కివీస్‌కు భారీ షాకిచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా చేసిన స్కోర్లు: 1,1, 2, 3,13,14,42,6,26,7,14. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్రాండ్‌హోమ్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. 42 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండర్సన్ 4, పాట్స్ 4, స్టువర్ట్ బ్రాడ్ ఒకటి, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 132-10 (40 ఓవర్లు) చదవండి 👇 Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. అమ్మో అదో పీడకల.. తాను ఎదురుగా ఉన్నాడంటే ఇక అంతే: జయవర్ధనే 36 balls 🔴 5 maidens ⛔ 4 Runs 🏏 2 Wickets ☝ Every ball from Jimmy's opening spell 😍 pic.twitter.com/BNcyQSgZ2t — England Cricket (@englandcricket) June 2, 2022 -
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం.. 8 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లపై వేటు!
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టులకు 16 మంది సభ్యలుతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లపై సెలెక్షన్ ప్యానల్ వేటు వేసింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ . డేవిడ్ మలన్ సహ మరికొంత మంది ఆటగాళ్లపై వేటు పడింది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగట్రేం చేయనున్నారు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్‌స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
నాడు అశ్విన్-విహారి.. ఏడాది తర్వాత బ్రాడ్-అండర్సన్..
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్‌కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్‌ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..? -
అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్‌ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్‌ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మార్క్‌వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! -
'మా బౌలింగ్‌ను విమర్శించే హక్కు మీకు లేదు'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఘోర పరాజయాలు నమోదు చేసింది. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో ఏకంగా 275 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఒకవైపు ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగుతుంటే.. అదే పిచ్‌లపై ఇంగ్లండ్ బౌలర్లు విఫలమవ్వడం ఆసక్తి కలిగించింది. చదవండి: జీవితంలో మళ్లీ టెస్టులు ఆడతాననుకోలేదు: కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. రైట్ లెంగ్త్(గుడ్‌లెంగ్త్) విసరడంలో విఫలమయ్యారంటూ క్రీడా విశ్లేషకులు విమర్శించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా మా బౌలర్ల వైఫల్యం ఉందంటూ ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాత్రం తమ బౌలింగ్‌పై వస్తున్న విమర్శలను తన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. డిసెంబర్ 26 నుంచి మూడోటెస్టు జరగనున్న నేపథ్యంలో అండర్సన్ టెలిగ్రాఫ్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'మేం బౌలింగ్ బాగా చేయలేదని విమర్శిస్తున్నారు. ఒక బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. రైట్ లెంగ్త్ వేయలేదని మీరు అంటున్నారు.. కానీ మ్యాచ్ ప్రారంభంలో రెండురోజులు గుడ్‌లెంగ్త్‌తో బౌలింగ్ వేయడానికి మా బెస్ట్ ఇచ్చాం. ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది..మాకు కలిసిరాలేదు అంతే తేడా. మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం, టీ విరామం సమయాల్లో మా బౌలర్లంతా ఒక గ్రూఫ్‌గా ఏర్పడి ఎక్కడ తప్పు చేశామన్నది చర్చించుకుంటాం. గుడ్‌లెంగ్త్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. ఇక మా బౌలింగ్‌ను విమర్శించే హక్కు మీకు(క్రీడా విశ్లేషకులు) లేదు. అడిలైడ్ టెస్టులో మేము ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌లోనూ ఆలౌట్ చేశాం..ఇది మాత్రం మీకు కనబడలేదా? మా బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇక ఆస్ట్రేలియన్స్ మాకంటే బాగా ఆడారు. కానీ రేపటి మ్యాచ్‌లో మేం ఆసీస్‌ను ఓడించే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: BBL 2021: మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి! -
Ashes 2021-22 Adelaide Test: ఇంగ్లండ్ జట్టు ఇదే.. బరిలో అండర్సన్
England 12- Member Squad: ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు తాము ఆడిన ఎనిమిది డే అండ్ నైట్ టెస్టుల్లో గెలిచి అజేయంగా ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టులో ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులు చేసే అవకాశముంది. పేసర్లు అండర్సన్, బ్రాడ్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో వీరిద్దరు తుది జట్టులో ఆడటం ఖాయమైంది. యాషెస్ సిరీస్ రెండో టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు ఇదే: జో రూట్(కెప్టెన్), జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్, డేవిడ్ మలన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ పోప్, రోరీ బర్న్స్, ఓలీ రాబిన్సన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, హసీబ్ హమీద్, క్రిస్ వోక్స్. చదవండి: యాషెస్ సిరీస్ 2021-22.. రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) -
Ashes Series 2021: తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
Ashes Series 2021: England Announces 12 Man Squad For Gabba Test: ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా డిసెంబరు 8న మొదలుకానున్న మ్యాచ్ కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. మోకాలి నొప్పి కారణంగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ జట్టుకు దూరం కాగా... మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్ స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లుగా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కాగా జో రూట్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. గబ్బా టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ►జో రూట్(కెప్టెన్), స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, హసీబ్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. యాషెస్ సిరీస్ 2021- షెడ్యూల్: ►మొదటి టెస్టు: డిసెంబరు 08-12: గబ్బా ►రెండో టెస్టు: డిసెంబరు 16-20: అడిలైడ్ ►మూడో టెస్టు: డిసెంబరు 26- 30: మెల్బోర్న్ ►నాలుగో టెస్టు: జనవరి 5-9: సిడ్నీ ►ఐదో టెస్టు: జనవరి 14-18 చదవండి: Sara Tendulkar: మోడలింగ్‌లో అడుగుపెట్టిన సచిన్ తనయ.. వీడియో వైరల్ చదవండి: Australia Ashes Squad: యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వరల్డ్‌కప్ హీరోకు నో ఛాన్స్. -
ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం
James Anderson Ruled Out 1st Test Ashes Series Calf Injury.. కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. కండరాల గాయంతో బాధపడుతున్న అండర్సన్ తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే మోచేతి గాయంతో జోఫ్రా ఆర్చర్ దూరమవ్వగా.. ఓలీ స్టోన్ వెన్నుముక సర్జరీతో దూరంగా ఉన్నాడు. తాజాగా అండర్సన్ కూడా తొలి టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు షాక్ అని చెప్పొచ్చు. తొలి టెస్టుకు అండర్సన్ గైర్హాజరీలో ఇంగ్లండ్ నలుగురు బౌలర్లతో ఆడనుంది. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్లో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. చదవండి: David Warner: వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. అది గుర్తు లేదా? ఇక అండర్సన్‌కు యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు యాషెస్‌లో 152 వికెట్లు తీసిన అండర్సన్.. 2010-11లో ఇంగ్లండ్ ఆసీస్ గడ్డపై యాషెస్ గెలవడంలో అండర్సన్ పాత్ర కీలకం. ఆ సీజన్లో 24 వికెట్లతో అండర్సన్ దుమ్మురేపాడు. ఇక ఆసీస్ గడ్డపై 18 టెస్టుల్లో 60 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అండర్సన్ ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 632 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక యాషెస్‌ను ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. 2017-18లో 4-0తో గెలిచి యాషెస్‌ను గెలిచిన ఆసీస్.. 2019లో 2-2తో డ్రా చేసుకోవడంతో యాషెస్‌ను తమ దగ్గరే ఉంచుకుంది. చదవండి: Alex Carey: అలెక్స్ క్యారీకి జాక్‌పాట్.. టిమ్ పైన్ స్థానంలో -
సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పందించాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని, మిస్ అయిన మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని అశిద్దామని భావేద్వేగపూరిత మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. తన హెంగ్రౌండ్(ఓల్డ్‌ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని ఈ 39 ఏళ్ల లాంకషైర్ క్రికెటర్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) ఇదిలా ఉంటే, ఇదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. పాక్షికంగా రద్దైన ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో మ్యాచ్ భారత్, మూడో టెస్ట్ ఇంగ్లండ్, నాలుగో మ్యాచ్ టీమిండియా గెలిచాయి. 4 మ్యాచ్‌ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఓసారి 5 వికెట్ల ప్రదర్శన మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో 21 వికెట్లతో ఓలీ రాబిన్సన్ అగ్రస్థానంలో ఉండగా, 18 వికెట్లతో టీమిండియా పేసర్ బుమ్రా రెండో ప్లేస్‌లో నిలిచాడు. చదవండి: అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీస్ సమం అయినట్టే.. -
ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..?
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్ 42 ఓవర్ బౌల్ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్ రక్తంతో తడిసిపోయింది. అయినప్పటికీ ఆండర్సన్ మైదానాన్ని వీడకుండా, తన కోటా ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ సన్నివేశం టీవీల్లో స్పష్టంగా కనిపించడంతో సోషల్‌మీడియాలో వ్యాప్తంగా ఆండర్సన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆట పట్ల ఈ వెటరన్ క్రికెటర్‌కు ఉన్న అంకితభావానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. కాగా, ఈ గాయలు ఎప్పుడు తగిలాయన్నది టీవీల్లో కనబడలేదు. బహుళా ఫీల్డింగ్ చేసేటప్పుడు అతను ఈ గాయాల బారిన పడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 191 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(50), శార్దూల్ ఠాకూర్(57) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ఆఖర్లో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్, ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా రివర్స్ కౌంటరిచ్చింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా చెలరేగిపోవడంతో ఇంగ్లీష్ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. టీ విరామానికి ముందు ఇంగ్లండ్ స్కోర్ 11/2. చదవండి: అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్'తో బరిలోకి దిగారు.. -
ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..?
లండన్: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ అండర్సన్ భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతర క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ అతనికి చివరి మ్యాచ్ కావచ్చని ఆయన పేర్కొన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. భారత్‌తో సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లి వికెట్‌తో ఆండర్సన్ తన క్రికెట్ కెరీర్‌ను ముగించవచ్చని జోస్యం చెప్పాడు. కాగా, 39 ఏళ్ల ఆండర్సన్ టీమిండియాతో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో ఇప్పటికే 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జిమ్మీ మొత్తం 30 వికెట్లు పడగొట్టగా.. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి . అండర్సన్ ఇంగ్లండ్ తరఫున 165 టెస్ట్ మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/42. అలాగే జిమ్మీ.. బ్యాట్స్‌మెన్‌గా 1246 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 81. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన అండర్సన్.. టెస్ట్ ఫార్మాట్లో కొనసాగేందుకు 2015లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆండర్సరన్ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే ఆండర్సన్ టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ క్రమంలో అతను స్వింగ్ కింగ్‌గా పేరొందాడు. ఇదిలా ఉంటే, భారత్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో అండర్సన్ పలు అరుదైన ఘనతలను సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఆండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 1529 ఓవర్లు వేసిన అండర్సన్.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 1792 మెయిడిన్ ఓవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇదే టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. ఇంగ్లీష్ గడ్డపై(స్వదేశంలో) టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ తొలి స్థానంలో ఉన్నాడు. మురళీ స్వేదేశంలో 73 టెస్ట్‌ల్లో 493 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జిమ్మీ (630) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు.. బట్లర్ సహా మరో బౌలర్ ఔట్ -
మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే.. అప్పుడు, ఇప్పుడు అండర్సనే
లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన.. మూడేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టు చేతిలో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. 2018 లార్ట్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్‌లో మళ్లీ అంతటి ఘోర పరాభవాన్ని రుచి చూసింది. నాడు తొమ్మిది వికెట్ల ప్రదర్శనతో టీమిండియా పతనాన్ని శాసించిన అండర్సనే.. మరోసారి భారత జట్టు పాలిట సింహస్వప్నం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగులకే చాపచుట్టేయడానికి ప్రధాన కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ ఆదిలోనే కేఎల్ రాహుల్, కోహ్లి, పుజారా వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. కాగా, 215/2 వద్ద నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆతిధ్య జట్టు భారత ఆధిక్యాన్ని 1-1కి తగ్గించి సిరీస్‌ను సమం చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. ఓలి రాబిన్సన్(5/65), క్రెయిగ్ ఒవర్టన్(3/47) రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కలిపి మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: ఆండర్సన్ బౌలింగ్ చేస్తుంటే పంత్ ఏం చేస్తున్నాడో చూడండి.. -
చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు
లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అజింక్య రహానే వికెట్ పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ వెటరన్ పేసర జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో(ఇంగ్లండ్ గడ్డపై) 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అతను రికార్డుల్లోకెక్కాడు. ఆండర్సన్‌కు ముందు ఇంగ్లండ్‌లో ఏ ఇతర బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ జాబితాలో ఆండర్సన్ తర్వాతి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్(341 వికెట్లు), ఫ్రెడ్ ట్రూమన్(229 వికెట్లు) ఉన్నారు. ఇక, ఓవరాల్ సొంత గడ్డపై 400 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆండర్సన్(400), అనిల్ కుంబ్లే(350), స్టువర్ట్ బ్రాడ్(341),షేన్ వార్న్(319) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆండర్సన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్‌పై నమోదై ఉంది. అండర్వుడ్ భారత్‌కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. 215/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఏ దశలోనూ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్సన్(5/65), ఒవర్టన్(3/47) ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కలిపి మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి