గాయపడ్డ జేమ్స్ ఆండర్సన్
England Vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ గాయపడ్డాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆండర్సన్.. సోమర్సెట్‌తో మ్యాచ్ సందర్భంగా గజ్జల్లో నొప్పితో విలవిల్లాడాడు.
ఓల్డ్ ట్రఫోర్డ్‌లో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే నొప్పి కారణంగా వైదొలిగాడు. మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో లంకాషైర్- సోమర్సెట్ మధ్య మ్యాచ్ డ్రా అయిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ గాయం గురించి ఆదివారం ప్రకటన చేసింది.
అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం
40 ఏళ్ల ఆండర్సన్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అయితే, జూన్ 1న ఐర్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ ఆడనున్న ఏకైక టెస్టు నాటికి అతడు జట్టుతో చేరతాడా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొంది.
విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్
ఇదిలా ఉంటే.. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి గురించి లంకాషైర్ కోచ్ గ్లెన్ చాపెల్ బీబీసీతో మాట్లాడుతూ.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఏమీ లేదని, త్వరలోనే అతడు కోలుకుండాటని చెప్పాడు. కాగా జూన్ 16 నుంచి చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆడనున్న ఐదు మ్యాచ్‌ల యాషెస్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా ఆండర్సన్ టెస్టు క్రికెట్‌లో 685 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన ఫాస్ట్‌బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
వారితో పాటు తాజాగా
ఇక ఇప్పటికే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఓలీ స్టోన్, బ్రైడన్ కార్స్ తదితరులు గాయాల బారిన పడగా.. తాజాగా ఆండర్సన్ సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే 2021-22 యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఐదింట నాలుగు విజయాలతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో
ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌నైనా డ్రా చేసుకుని ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక యాషెస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. జూన్ 7-11 వరకు మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా!
వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
Comments
Please login to add a commentAdd a comment