ప్చ్‌.. మూడో టెస్టుకు దూరమే | James Anderson To Miss 3rd Ashes Test Against Australia | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. మూడో టెస్టుకు దూరమే

Published Mon, Aug 19 2019 7:38 PM | Last Updated on Mon, Aug 19 2019 7:38 PM

James Anderson To Miss 3rd Ashes Test Against Australia - Sakshi

హెడింగ్లీ : ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ యాషెస్‌ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి టెస్టు నుంచి అర్థంతరంగా తప్పుకున్న అండర్సన్‌, లార్డ్స్‌ టెస్టులోనూ ఆడలేదు. అయితే మూడు టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఇంగ్లీష్‌ ఫ్యాన్స్‌ భావించినప్పటికీ చివరికి నిరాశే ఎదురైంది. ఈ నెల 22 నుంచి హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) 12 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. అయితే అండర్సన్‌ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని, దీంతో అతడికి మరికొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని భావించినట్లు  ఈసీబీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. 

అయితే ఆగస్టు 20 నుంచి నార్త్‌ క్రికెట్‌ క్లబ్‌లో జరగబోయే ఓ కౌంటీ మ్యాచ్‌లో అండర్సన్‌ పాల్గొంటాడని ఆ అధికారి తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అండర్సన్‌ ఫిట్‌నెస్‌ ఓ అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్‌ బౌలర్‌ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న జోఫ్రా ఆర్చర్‌ తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. దీంతో మూడో టెస్టుకు ఆర్చర్‌ను ఎంపిక చేశారు. హెడింగ్లీ టెస్టులో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళానికి ఆర్చర్‌ నాయకత్వం వహించనున్నాడు. ఇక గత టెస్టులో అనూహ్యంగా మొయిన్‌ అలీ స్థానంలో చోటు దక్కించుకున్న జాక్‌ లీచ్‌ అంచనాల మేర రాణించాడు. దీంతో మూడో టెస్టుకు కూడా అలీని పక్కకు పెట్టి లీచ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. 

ఇంగ్లండ్‌ జట్టు బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. ఇన్నింగ్స్‌కు ఒకరిద్దరూ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. తొలి టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో మూడో టెస్టులో గెలిచి సిరీస్‌పై మరింత పట్టు బిగించాలని ఆసీస్‌ ఆరాటపడుతుండాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు భావిస్తోంది. 

యాషెస్‌ మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు
జో రూట్‌(సారథి), జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టో, స్టువార్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, స్యామ్‌ కరన్‌, డెన్లీ, జాక్‌ లీచ్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement