PC: ICC
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలిపింది. అదే విధంగా.. పింక్ బాల్‌తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.
ఇక ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్ ఓవల్ మైదానం, బాక్సింగ్ డే మ్యాచ్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఉంటాయని సీఏ తెలిపింది. కాగా యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుండటం 43 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఇంగ్లండ్‌లోడ్రా
ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్ కంగారూ గడ్డపై జరుగనుంది.
ఆసీస్ గడ్డపై గెలుపునకై తహతహ
ఇదిలా ఉంటే.. 2010 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడి.. రెండు డ్రా చేసుకుంది.
ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసీస్‌కు కీలకం.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- యాషెస్ సిరీస్-2025- 26 షెడ్యూల్
👉మొదటి టెస్టు- పెర్త్ స్టేడియం, నవంబరు 21-25, 2025
👉రెండో టెస్టు- ది గాబా(డే, నైట్ పింక్‌బాల్ మ్యాచ్)- డిసెంబరు 4-8, 2025
👉మూడో టెస్టు- అడిలైడ్ ఓవల్, డిసెంబరు 17- 21, 2025
👉నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025
👉ఐదో టెస్టు- ఎస్‌సీజీ, జనవరి 4-8, 2026.
చదవండి: అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment