England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్‌లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది.
లబుషేన్ జిడ్డు బ్యాటింగ్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు.
అయితే, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు.
రన్‌రేటు 1.61..
ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్‌నర్‌షిప్‌లో రన్‌రేటు 1.61గా నమోదైంది.
వారి రికార్డు బద్దలు కొట్టి
యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్‌రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్‌రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు.
ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్‌రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్‌లను ట్రోల్ చేస్తున్నారు.
కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment