Usman Khawaja
-
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్‌కప్‌లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్‌లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్‌తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్‌లు ఆడి 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్‌లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్‌కప్‌లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్‌కప్‌నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్‌లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్‌లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్‌ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్‌కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్‌ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్‌ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్‌కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
బాబర్‌ను హత్తుకున్న ఖవాజా చిన్నారి కూతురు.. అందమైన దృశ్యాలు
ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు స్వీట్ షాకిచ్చారు పాక్ ప్లేయర్లు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇండోర్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ సహా డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు. Warm wishes and heartfelt gifts for the Australian players and their families at the MCG indoor nets 🎁✨ pic.twitter.com/u43mJEpBTR — Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023 ఇక ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూతుళ్లు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. A very cute moment between Babar Azam and Usman Khawaja's daughter ♥️♥️ #AUSvPAKpic.twitter.com/GP5NhpJ95f — Farid Khan (@_FaridKhan) December 25, 2023 ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాక్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! -
Aus Vs Pak: మేమేం తప్పు చేశాం భయ్యా? షాక్‌లో పాక్ ఫ్యాన్స్!
David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది. పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్‌గా 49వది. ఇలా అద్భుత ఇన్నింగ్స్‌తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వార్నర్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe — cricket.com.au (@cricketcomau) December 14, 2023 Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN — ٰImran Siddique (@imransiddique89) December 14, 2023 -
పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! చెత్త ఫీల్డింగ్‌తో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్‌కు దిగిన పాక్‌కు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. Twin boundaries in the first! Shaheen has his tail up despite an expensive first over #AUSvPAK pic.twitter.com/oixensArZG — cricket.com.au (@cricketcomau) December 14, 2023 షఫీక్ ఆ క్యాచ్ జారవిడవడంతో పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్ ఆరంభంలో ఆమిర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్ ఖవాజా. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది. WTF bcci installed a chip in the ball 😤#AUSvsPAK pic.twitter.com/xoNuaUK3s9 — 𝙕𝙀𝙀𝙈𝙊™ (@Broken_ICTIAN) December 14, 2023 వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు చుక్కలే లంచ్ బ్రేక్ సమయానికి డేవిడ్ వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్‌ను డ్రాప్ చేసిన అబ్దుల్లా షఫీక్‌పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఖవాజా క్యాచ్‌ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? Tired of the conventional, David Warner's 12th boundary of the first session was nothing short of inventive! 😯#AUSvPAK @nrmainsurance #PlayOfTheDay pic.twitter.com/8ih9vnjhUj — cricket.com.au (@cricketcomau) December 14, 2023 -
Ashes 2023: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు! యాషెస్ చరిత్రలో..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓవరాల్‌గా 496 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్‌లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్ మొత్తంలో సాధించిన రన్స్‌లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సందర్భంగానే స్కోర్ చేయడం గమనార్హం. 26 ఏళ్ల తర్వాత.. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్‌గా నిలిచాడు. ఆ రికార్డు మిస్! ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్‌లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్ సాధించిన ఆసీస్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్‌మన్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్‌ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్ గెలిచిన ఆసీస్ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ వోక్స్.. మిచెల్ స్టార్క్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పంచుకున్నాడు. యాషెస్-2023లో ఉస్మాన్ ఖావాజా సాధించిన పరుగులు ►ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో- 141, 65. ►లండన్ టెస్టులో- 17, 77. ►లీడ్స్ టెస్టులో- 13, 43. ►మాంచెస్టర్ టెస్టులో- 3, 18. ►ఓవల్ మైదానంలో- 47, 72. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్‌కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్‌లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్‌రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్‌రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్‌రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్‌రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్‌రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్‌లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
Eng Vs Aus: మేమింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం: ఇంగ్లండ్ స్టార్
The Ashes, 2023- England vs Australia, 3rd Test- Day 2- లీడ్స్: యాషెస్ సిరీస్ మూడో టెస్టు ఆసక్తికర మలుపులతో సాగుతోంది. రెండో రోజు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పోటాపోటీగా పోరాడాయి. రెండో రోజు నాటి శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (43), డేవిడ్ వార్నర్ (1), మార్నస్ లబుషేన్ (33), స్టీవ్ స్మిత్ (2) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 142 పరుగులకు చేరింది. స్టోక్స్ దూకుడు అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 68/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (80; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటిచేత్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో మార్క్ వుడ్ (8 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు ఇంగ్లండ్ భారీ ఆధిక్యం కోల్పోకుండా కాపాడాయి. ఇక ఆసీస్ కెప్టెన్ కమిన్స్ (6/91) రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. గెలవగలిగే స్థితిలోనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తామింకా గెలవగలిగే స్థితిలోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశాడు. వికెట్ బాగుందని.. తమ జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్‌లో పైచేయి సాధిస్తుందని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 200 మార్కు దాటడం తమలో సానుకూల దృక్పథం నింపిందన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు వికెట్లు పడగొట్టి ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే తాను దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నానన్న అలీ.. రెండు వికెట్లు తీయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజు ఆటలో మొయిన్ అలీ లబుషేన్, స్మిత్ వికెట్లు పడగొట్టగా.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాను క్రిస్ వోక్స్, డేవిడ్ వార్నర్‌ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్‌కు పంపారు. ఇదిలా ఉంటే.. యాషెస్ తొలి రెండు టెస్టుల్లో పర్యాటక ఆసీస్ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి -
యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా మైండ్ బ్లాక్ అయింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్టు ఆడుతున్నాయి. తొలిరోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన స్టోక్స్ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్టోక్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు తొలి సెషన్లోనే చెలరేగిపోయారు. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీసినప్పటికి.. హైలెట్ అయింది మాత్రం మార్క్ వుడ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్‌లో మార్క్ వుడ్‌కు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ఆసీస్‌కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖవాజాను ఔట్ చేసిన 13వ ఓవర్లో మార్క్‌వుడ్ ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరడం విశేషం. గుడ్‌లైన్ అండ్ లెంగ్త్‌తో సంధించిన మార్క్‌వుడ్ ఆఖరి బంతిని ఇన్‌స్వింగర్ వేశాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఖవాజా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. 96.5 మైళ్ల వేగం(గంటకు 152 కిమీ)తో వచ్చిన బంతి దెబ్బకు స్టంప్ ఎగిరి కింద పడింది. ఇక యాషెస్ చరిత్రలో మార్క్ వుడ్ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్ డెలివరీగా నిలిచింది. ఇంతకముందు ఆసీస్ స్టార్ మిచెల్ జాన్సన్ 2013 యాషెస్ సిరీస్‌లో గంటకు 97 మైళ్ల వేగం(గంటకు 156.7 కిమీ)తో బంతిని విసిరాడు. ఇప్పటికి ఈ రికార్డు యాషెస్ చరిత్రలో పదిలంగా ఉంది. అంతకముందు స్టువర్ట్ బ్రాడ్.. వార్నర్‌ను(4 పరుగులు), వందో టెస్టు ఆడుతున్న స్మిత్(22 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మార్నస్ లబుషేన్‌ను(21 పరుగుల) క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్ మార్ష్ 30, ట్రెవిస్ హెడ్ 17 పరుగులతో ఆడుతున్నారు. It's full and straight and far too quick for Usman Khawaja 🌪️ Australia are 2 down and Mark Wood is on fire! 🔥 #EnglandCricket | #Ashes pic.twitter.com/y5MAB1rWxd — England Cricket (@englandcricket) July 6, 2023 చదవండి: #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్' -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. ఆసీస్ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్
లార్డ్స్ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 లంచ్ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్‌స్టో అవుట్లో తప్పు లేదు. బంతి ఇంకా ‘డెడ్’ కాకముందే అతను క్రీజ్ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్ స్టంప్స్‌పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్‌స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు. -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ యువ పేసర్.. వార్నర్, ఖ్వాజాల ఫ్యూజ్‌లు ఔట్
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్లు ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలుత ఉస్మాన్ ఖ్వాజాను (17) అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో బోల్తా కొట్టించిన టంగ్.. ఆతర్వాత ఇటీవలికాలంలో చూడని అత్యద్భుమైన బంతితో వార్నర్ (66) ఖేల్ ఖతం చేశాడు. టంగ్ సంధించిన బంతిని ఎలా ఆడాలో తెలీని వార్నర్ నిశ్రేష్ఠుడిగా చూస్తూ ఉండిపోయాడు. పెవిలియన్‌కు వెళ్లే సమయంలోనూ వార్నర్ ముఖంలో ఏమీ చేయలేకపోయానన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది. టంగ్ వేసిన పేస్ దెబ్బకు లెగ్ వికెట్ విరిగిపోయింది. First Ashes wicket secured 🔒 Masterful from Josh Tongue ✨ #EnglandCricket | #Ashes pic.twitter.com/pS963Awgop — England Cricket (@englandcricket) June 28, 2023 కాగా, కెరీర్లో కేవలం రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న టంగ్.. ఆసీస్ ఓపెనర్లను తొలుత బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే వీరు ఔటయ్యాక క్రీజ్‌లో వచ్చిన లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ముందు టంగ్ పప్పులు ఉడకలేదు. వారు టంగ్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొన్నారు. 25 ఏళ్ల టంగ్ ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన అతను.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో విరుచుకుపడ్డాడు. Warner GONE! 🤩 S̶t̶u̶a̶r̶t̶ ̶B̶r̶o̶a̶d̶ Josh Tongue gets his man! #EnglandCricket | #Ashes pic.twitter.com/3sw6FSU2To — England Cricket (@englandcricket) June 28, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. రెండో ఆటగాడిగా!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఖ్వాజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ఖ్వాజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు అడ్డుగా నిలిచి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ మొత్తంలో 518 బంతులు ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ మొదటిరోజే 3/393 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆరోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. అనంతరం రెండో రోజు మొత్తం బ్యాటింగ్ చేసిన ఖ్వాజా 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 126 పరుగులు వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా మరో 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లడ్.. 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మళ్లీ అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు వచ్చింది. నాలుగో రోజు చివరి సెషన్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు . మ్యాచులో చివరి రోజైన ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించి మరో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా ఈ ఆసీస్ ఓపెనర్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు వీరే.. మోత్గనల్లి జైసింహ (భారత్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1960 జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1977 కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లండ్ - 1980 అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్ వెస్టిండీస్ - 1984 రవిశాస్త్రి (భారత్) వర్సెస్ ఇంగ్లాండ్ - 1984 అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్ న్యూజిలాండ్ - 1999 ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్ భారతదేశం - 2006 అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్న్యూజిలాండ్ - 2012 చెతేశ్వర్ పుజారా (భారత్) వర్సెస్ శ్రీలంక - 2017 రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 2019 క్రైగ్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 టాంగెనరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023 ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లాండ్ - 2023* చదవండి: Asia Cup 2023: అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలేదు! Only in Test Cricket 😍 An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv — Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023 -
న్యూ మిస్టర్ కూల్ అంటూ ప్రశంసల వర్షం.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్
England vs Australia, 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో శుభారంభం చేసిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్ చూడనేలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసీస్ సారథిని ‘న్యూ మిస్టర్ కూల్’గా అభివర్ణించిన వీరూ భాయ్.. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా అద్భుతం అంటూ ఆకాశానికెత్తాడు. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జూన్ 16-20 వరకు మొదటి టెస్టు జరిగింది. బజ్‌బాల్ విధానం పేరిట సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. మొదటి రోజే 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ(141)కి తోడు.. ట్రవిస్ హెడ్ అర్ధ శతకం(50)తో రాణించడంతో 386 పరుగులకు ఆలౌట్ అయి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. అద్భుతం చేసిన కమిన్స్, నాథన్ ఇదిలా ఉంటే.. ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్, వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ నాలుగేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఉస్మాన్ ఖవాజా (65) మరోసారి బ్యాట్ ఝులిపించగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లియోన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కమిన్స్ 73 బంతుల్లో 44 పరుగులతో.. నాథన్ 28 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి ఓటమి నుంచి ఆసీస్‌ను గట్టెక్కించి గెలుపుబాట పట్టించారు. దీంతో అనూహ్య రీతిలో సొంతగడ్డపై తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. వాటే టెస్ట్ మ్యాచ్! ఈ నేపథ్యంలో రెండు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0తో ముందంజ వేసిన ఆస్ట్రేలియా, జట్టును గెలిపించిన టెయిలెండర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఆసీస్‌ను కొనియాడుతూ చేసిన ట్వీట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ‘‘వాటే టెస్ట్ మ్యాచ్! ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యంత గొప్ప మ్యాచ్ ఇదే. నిజంగా టెస్ట్ క్రికెట్ బెస్ట్ క్రికెట్. మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాతావరణం అలా ఉన్న సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం అంటే మాటలు కాదు! ఏదేమైనా ఖవాజా రెండు ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఇక ప్యాట్ కమిన్స్ టెస్టు క్రికెట్లో మరో మిస్టర్ కూల్‌గా అవతరించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలో కమిన్స్, లియోన్ నమోదు చేసిన భాగస్వామ్యం సుదీర్ఘ కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది’’ అని సెహ్వాగ్ కమిన్స్‌ను ప్రశంసించాడు. కాగా సాధారణంగా టీమిండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్‌గా అభిమానులు పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. చదవండి: శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్.. What a Test Match. One of the best I have seen in recent times. Testcricket is Best Cricket. Was a gutsy decision by England to declare just before close on Day 1, especially considering the weather. But Khawaja was outstanding in both innings and @patcummins30 is the new Mr.… pic.twitter.com/9QqC2hjyzr — Virender Sehwag (@virendersehwag) June 20, 2023 A final day thriller to kick off the series 🏏 🏴 #ENGvAUS 🇦🇺 #Ashes pic.twitter.com/EuAk2CUeWC — England Cricket (@englandcricket) June 21, 2023 -
Ashes 1st Test: స్టీవ్ స్మిత్‌కు అలా.. ఉస్మాన్ ఖ్వాజాకు ఇలా..!
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా బయటపెట్డాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన స్టోక్స్.. ఫీల్డింగ్ మొహరింపు విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలుత స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్‌లు, రెండు లెగ్ స్లిప్‌లు మొహరించిన స్టోక్స్.. ఆట మూడో రోజు (ఇవాళ, జూన్ 18) ఉస్మాన్ ఖ్వాజాపై ఒత్తిడి తెచ్చేందుకు క్వార్టర్ సర్కిల్లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా వైవిధ్యభరితమైన ఫీల్డ్ సెటింగ్ ద్వారా.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా చేశాడు స్టోక్స్. SIX catchers in and the plan works 👏 Khawaja gone for 141.COME ON ENGLAND! 🏴 #EnglandCricket | #Ashes pic.twitter.com/6MLJcQxzCX— England Cricket (@englandcricket) June 18, 2023 కాగా, 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాదాపుగా చేరుకునేలా చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (34) పోరాడటంతో ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
ENG VS AUS Ashes 1st Test: బజ్‌బాల్ బెడిసికొట్టింది..!
బజ్‌బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ క్రికెట్ ఉనికిని చెరిపే ప్రయత్నం చేస్తున్న ఇంగ్లండ్ జట్టుకు తిక్క కుదిరింది. వారు నమ్ముకున్న బజ్‌బాల్ ఫార్ములా తొలిసారి బెడిసికొట్టింది. ఆసీస్ లాంటి జట్టు ప్రత్యర్ధిగా ఉన్నప్పుడు బజ్‌బాల్, గిజ్బాల్ అంటూ ఓవరాక్షన్లు చేయకూడదని ఇంగ్లండ్‌కు తెలిసొచ్చింది. యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ పరిస్థితి ప్రస్తుతం చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా మారింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తిక్క కుదిర్చాడు. అతనికి ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (38) సహకరించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఆసీస్ దాదాపుగా చేరుకున్నంత పని చేసింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటై, 7 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆదిలోనే అలెక్స్ క్యారీ వికెట్ కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత ఖ్వాజా.. కమిన్స్ సాయంతో ఆసీస్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆఖర్లో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 386 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. వార్నర్, లబుషేన్, స్మిత్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట... ఖ్వాజా ఇంగ్లీష్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఖ్వాజా విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్ క్యారీ(52) పరుగులతో ఉన్నారు. ఖ్వాజా స్పెషల్ సెల్బ్రెషన్ ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్ సెల్‌బ్రెషన్స్ జరపుకున్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్‌ను కిందకు విసిరి, ఆసీస్ డ్రస్సెంగ్ రూమ్ వైపు చూస్తూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కాగా ఖ్వాజాకు ఇంగ్లండ్ గడ్డపై ఇదే తొలి సెంచరీ. అందుకే ఖ్వాజా అంతగా ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఖ్వాజాకు 15 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఇది ఖ్వాజాకు 15వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఖ్వాజా సెల్బ్రెషన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు A magnificent 💯 from Usman Khawaja 😍 The south-paw fights against all odds to get Australia back in the game 👊#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/yaz1Y7gIt1 — Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023 -
Eng Vs Aus: పట్టుదలగా నిలబడ్డ ఖ్వాజా.. క్యారీ సైతం..! కోలుకున్న ఆస్ట్రేలియా!
England vs Australia, 1st Test- బర్మింగ్హమ్: ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (279 బంతుల్లో 126 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మొండి పట్టుదలతో ఆడటంతో... ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (393/8 డిక్లేర్డ్)కు ఆస్ట్రేలియా మరో 82 పరుగుల దూరంలో ఉంది. ఖ్వాజాతో కలిసి అలెక్స్ క్యారీ (80 బంతుల్లో 52 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 14/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 9; 2 ఫోర్లు), లబుషేన్ (0)లను బ్రాడ్ అవుట్ చేశాడు. కాసేపటికి స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16) కూడా పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలిచయా 67 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్) తో ఖ్వాజా నాలుగో వికెట్‌కు 81 పరుగులు... గ్రీన్ (68 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేసి ఆదుకున్నాడు. గ్రీన్ అవుటయ్యాక వచ్చిన క్యారీ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఖ్వాజాతో ఆరో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. చదవండి: వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు -
Ashes 1st Test: ఉస్మాన్ ఖ్వాజా శతకం.. పోరాడుతున్న ఆస్ట్రేలియా
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పోరాడుతుంది. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన ఆ జట్టును ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) సెంచరీతో ఆదుకున్నాడు. ట్రవిస్ హెడ్ (50) సాయంతో అతను ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 15వ శతకం. 2022 నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఖ్వాజా ఈ మధ్యకాలంలో ప్రపంచ క్రికెట్లో అందరు బ్యాటర్ల కంటే అధికంగా 7 శతకాలు బాదాడు. 2022 నుంచి ఖ్వాజా, జో రూట్ మాత్రమే టెస్ట్‌ల్లో 7 సెంచరీలు చేశారు. వీరి తర్వాత జానీ బెయిర్‌స్టో 6 సెంచరీలు చేశాడు. Diet Cokes all round! Well batted, @Uz_Khawaja #Ashes pic.twitter.com/UVKJATCsBz— cricket.com.au (@cricketcomau) June 17, 2023 కాగా, ఉస్మాన్ ఖ్వాజా సెంచరీతో ఆదుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ జట్టు 70 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 163 పరుగులు వెనుకపడి ఉంది. ఖ్వాజాకు జతగా అలెక్స్ క్యారీ (3) క్రీజ్‌లో ఉన్నాడు. 14/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. తొలి సెషన్లోనే వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), హెడ్ (50), గ్రీన్ (38) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీలకు తలో 2 వికెట్లు, స్టోక్స్‌కు ఓ వికెట్ (స్మిత్) దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్ ఖాతాలో వికెట్ -
మన తీరు ఇలా ఉండాలా?
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు సంకుచితంగా ఉంది. అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటున్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అతడిని అనుమానితుడిని చేసింది. అందుకే ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, వెంటనే అనుమతి దక్కలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ హక్కుల సూత్రబద్ధ సమర్థకురాలిగా ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. మనం ఈ స్వీయ–ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన పట్ల పాకిస్తాన్ ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. మన సొంత ప్రమాణాలను నిర్దేశించుకోవడానికి మన పొరుగు వాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? పాకిస్తాన్ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిణించుకుంటున్న దేశం, ఐరాసలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? మన దేశాన్ని సందర్శించాలని కోరుకునే పాకిస్తానీయుల పట్ల మనం ఎందుకు చీకాకుగా వ్యవ హరిస్తాం? అయితే మన పట్ల వాళ్ల ప్రవర్తన కూడా అలాగే ఉందనే వాదన ఒకటుంది. కానీ నా అనుభవం అలా లేదని నేను చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా ఇలాంటి వాదన సముచితమైనది కాదు. అది మనకు విలువనివ్వదు కూడా! మొదటి విషయం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగానూ, మానవ హక్కుల విషయంలో సూత్రబద్ధ సమర్థకురాలిగానూ ఉంటున్నందుకు భారత్ గర్వపడుతుంది. కానీ మనం దీన్ని గురించి చెప్పినట్లయితే పాకిస్తాన్ అసలు నమ్మదు. అయితే మనం కూడా మన స్వీయ– ప్రతిష్ఠను నిలుపుకొనేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సొంత ప్రమాణాలను నిర్దేశించు కోవడానికి మన పొరుగువాడి ప్రవర్తన ప్రమాణం అవుతుందా? అలా కాదంటే– ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా కాకుండా, దానికి భిన్నంగా వ్యవహ రించడం ద్వారా మనం మరింత మెరుగైనవాళ్లమని దృఢ నిరూపణ చేయాల్సి ఉంటుంది. అనుమానపు చూపు అద్భుతమైన ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా పట్ల మనం వ్యవహరించిన తీరు నేను వర్ణించిన రోత ప్రవర్తనకు ప్రతిరూపమే. నిజానికి ఇది అంతకుమించిన ఘోరమైన విషయం. సంకు చితంగా, ద్వేషపూరితంగా, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఇలాంటి వైఖరి భార త్ను పేలవంగా చూపిస్తుంది. దీంట్లోని అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే, ఇదంతా మనకు మనం కలిగించుకున్న నష్టమే. పాకిస్తాన్లో పుట్టిన ఖ్వాజా నాలుగేళ్ల వయసులో ఉండగా కుటుంబంతోపాటు ఆస్ట్రేలి యాకు వలస వెళ్లాడు. ఈరోజు అతడికి ద్వంద్వ జాతీయత ఉంది. అతడు అటు పాకిస్తానీయుడి గానూ, ఇటు ఆస్ట్రేలియన్ పౌరుడిగానూ ఉంటు న్నాడు. అది మన ప్రభుత్వ కళ్లలో అనుమానితుడిని చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుతో కలిసి భారత్ పర్యటనకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, అతడికి వెంటనే అనుమతి దక్కలేదు. అది ఎంత ఆలస్యమైందంటే, ఫిబ్రవరి 1న ఖ్వాజా లేకుండానే ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు వచ్చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ పాలనా యంత్రాంగం నిరసన తెలిపిన తర్వాతే ఖ్వాజా వీసాను పొంద గలిగాడు. ప్రభుత్వాల ప్రామాణిక ధోరణి భారతదేశంలో మనలో ఏ కొద్దిమందికో ఈ విషయం గురించి తెలుసు. అందులో బహుశా చాలా కొద్దిమంది దీని గురించి కలవరపడుతుండవచ్చు. కానీ ఆస్ట్రేలియాలో ఇలా ఉండదు. బీజేపీ ఖ్వాజాను ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిలా కాకుండా పాకిస్తాన్లో పుట్టిన ముస్లింలా చూస్తోందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో రాసే దేశ అత్యుత్తమ క్రికెట్ వ్యాఖ్యాతల్లో ఒకరైన మాల్కమ్ కోన్ రాశారు. వాస్తవం ఇంతకంటే దారుణంగా ఉంది. భారతీయ వీసాను పొందడంలో సమస్యలు ఎదుర్కోవడం ఖ్వాజాకు ఇదే తొలిసారి కాదు. ‘ది గార్డియన్’ పత్రిక ప్రకారం– మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2011 లోనే ఈ అనుభవం అతడికి ఎదురైంది. పాకిస్తానీ యుల పట్ల ద్వేషపూరిత వైఖరిని ప్రదర్శించడం భారత ప్రభుత్వాలకు ఒక ప్రామాణికమైన ఆచర ణగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. ద్వంద్వ పౌరసత్వం ఉన్న పాకిస్తానీయుడు, భారతీయ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను వివరించనివ్వండి. ఆ వ్యక్తి లండన్, న్యూయార్క్ లేదా దుబాయ్ నివాసి అయినప్పటికీ, వారి పాకిస్తానీ పాస్‌పోర్ట్‌పైనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది తప్ప మరొక పాస్‌పోర్ట్ మీద కాదు. దరఖాస్తు సమర్పించగానే భారతీయ రాయబార కార్యా లయం దాన్ని ఢిల్లీకి పంపిస్తుంది. అక్కడ విదేశీ వ్యవహారాల శాఖ కాకుండా, హోమ్ మంత్రిత్వ శాఖ దాన్ని నిర్ణయిస్తుంది. దానికి కొన్ని నెలలు పడుతుంది. మూడు నెలల్లోగా నిర్ణయం వస్తుందని ఆశించవద్దని దరఖాస్తుదారులకు ఆటోమేటిక్‌గా చెబుతారు. అఖండ భారత్ ఇలాగా? తరచుగా నేను మెజారిటీ కేసులను తడిమి చూశాను. ఎక్కడా స్పందన లేదు. అలాంటి సందర్భాల్లో ఏ వార్తా రాకపోవడం మంచి వార్త కాదు. ఒకవేళ వచ్చిదంటే, ఎవరో మీ కోసం తీగ లాగగలగాలి. అదీ మీరు అదృష్టవంతులైతే! కానీ ఎంతమంది పాకిస్తానీయులకు అలాంటివి చేసి పెట్టేవారు దొరుకుతారు? తుది ఫలితం ఏమిటంటే – భారత్ సందర్శించడానికి చాలా తక్కువ మంది మాత్రమే అనుమతి పొందుతారు. ఒకప్పుడు –అంటే చాలా కాలం క్రితం కాదు– మన తోటి దేశవాసులుగా ఉండిన వారితో మనం నిజంగా వ్యవహరించవలసిన తీరు ఇదేనా? మరీ ముఖ్యంగా, అఖండ భారత్‌పై మన ప్రకటనలకు (సమర్థన అటుండనీ) మద్దతు గెల్చుకోవడానికి మనం వెళుతున్న మార్గం ఇదేనా? దక్షిణాసియా ప్రాంతంలో కీలక శక్తిగా తనను తాను పరిగణించుకుంటున్న దేశం, ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత సీటును కోరుకుంటున్న దేశం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా ‘అవును’ అనేది సమాధానం అయితే అది నేను నమ్మలేని విషయం అవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వంతో మనకు దశాబ్దాలుగా సమస్యలు ఉన్నాయనడంలో సందేహమే లేదు. కానీ నిజం ఏమిటంటే పాకిస్తాన్ ప్రజల విషయంలో కూడా ఇది నిజమేనా? ఈ సందర్భంలో దేశ పౌరులనూ, వారి భయంకరులైన పాలకులనూ మనం వేరు చేసి చూడకూడదా? లేదా మనం అలాంటి సులభమైన సూక్ష్మ విషయాన్ని కూడా గ్రహించలేనంత అసమర్థులమా? ఈ విషయంలో నిజం ఏదంటే, మనం వీసాలను నిరాకరించడం ద్వారా పాకిస్తానీయులు ఇబ్బందిపడి ఉండవచ్చు లేదా పడకపోయి ఉండ వచ్చు. కానీ ఒక దేశంగా మనం (భారత ప్రభుత్వాలు మాత్రమే కాదు, భారత ప్రజలం కూడా) వికారంగా కనిపించడం లేదా? కాబట్టే మన కోసమైనా మనం ఇలాంటి ధోరణిని తప్పక ఆపివేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కేరీకి గిఫ్ట్ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్ పరంగా ఆల్ ది బెస్ట్ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ కాగా.. ఉస్మాన్ ఖవాజా 180, గ్రీన్ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి 186, శుబ్‌మన్ గిల్ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ట్రెవిస్ హెడ్ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్ లబుషేన్ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. సిరీస్‌లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది. Virat Kohli presents his match jersey to Usman Khawaja and Alex Carey. Class bloke! pic.twitter.com/tr3ciu1az7 — Vignesh Bharadwaj (@VBharadwaj31) March 13, 2023 -
IND VS AUS 4th Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపలేదని ఆసీస్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్‌కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్‌పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. 186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 మ్యాచ్‌ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. -
చరిత్ర సృష్టించిన ఖవాజా.. 43 ఏళ్ల రికార్డు బద్దలు! ఏకైక ఆటగాడిగా..
అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరగుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా (180; 422 బంతుల్లో 21x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా మరో బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (114; 170 బంతుల్లో 18x4) విరోచిత శతకం సాధించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా తమ తొలి ఇన్నింగ్‌లో 480 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బ్యాటింగ్) శుభ్‌మన్ గిల్ (18 బ్యాటింగ్) అజేయంగా ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఖవాజా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాటర్‌గా ఖవాజా రికార్డులకెక్కాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 422 బంతులు ఆడిన ఉస్మాన్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజ బ్యాటర్ గ్రాహం యాలోప్ పేరిట ఉండేది. 1979లో ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో యాలోప్ 392 బంతులు ఆడాడు. ఇక తాజా మ్యాచ్‌లో 422 బంతులు ఆడిన ఉస్మాన్.. 43 ఏళ్ల యాలోప్ రికార్డు బ్రేక్ చేశాడు. కాగా యాలోప్ తర్వాతి స్థానంలో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(361) బంతులతో ఉన్నాడు. చదవండి: IND vs AUS: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్, జడ్డూ! వీడియో వైరల్ -
Ind Vs Aus: స్మిత్ రికార్డు బద్దలు కొట్టిన ఖవాజా.. అరుదైన ఘనత
India vs Australia, 4th Test- Usman Khawaja: ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఈసారి భారత పర్యటన అతడి కెరీర్లోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. గతంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం డ్రింక్స్ అందించేందుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆరంభానికి ముందే తుదిజట్టులో చోటు ఖాయం కాబట్టి.. తనదైన మార్కు చూపించాలని ఆరాటపడ్డాడు. అయితే, మొదటి టెస్టులో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఢిల్లీ టెస్టుతో పుంజుకున్న అతడు.. మొత్తంగా 87 పరుగులు సాధించాడు. ఇక ఇండోర్ టెస్టులో 60 పరుగులతో సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అయితే, ఈసారి ఏకంగా సెంచరీ బాది జట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. పట్టుదలగా నిలబడి 422 బంతులు ఎదుర్కొని 180 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఖవాజా అరుదైన ఘనత సాధించాడు. స్మిత్ రికార్డు బద్దలు అహ్మదాబాద్ టెస్టులో 180 పరుగులు సాధించిన ఖవాజా భారత గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో స్మిత్‌ను వెనక్కినెట్టాడు. భారత్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ బ్యాటర్లు 1. డీన్ జోన్స్- 1986- చెన్నైలో- 210 2. మాథ్యూ హెడెన్-2001- చెన్నైలో- 203 3. ఉస్మాన్ ఖవాజా- 2023- అహ్మదాబాద్-180 4. స్టీవ్ స్మిత్- 2017- రాంచిలో- 178 నాటౌట్. చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా? 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..