ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఖ్వాజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ఖ్వాజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు అడ్డుగా నిలిచి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ మొత్తంలో 518 బంతులు ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ మొదటిరోజే 3/393 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆరోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు.
అనంతరం రెండో రోజు మొత్తం బ్యాటింగ్ చేసిన ఖ్వాజా 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 126 పరుగులు వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా మరో 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లడ్.. 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మళ్లీ అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు వచ్చింది. నాలుగో రోజు చివరి సెషన్‌లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు . మ్యాచులో చివరి రోజైన ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించి మరో 31 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా టెస్టు మ్యాచ్‌లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా ఈ ఆసీస్ ఓపెనర్ నిలిచాడు.
ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు వీరే..
మోత్గనల్లి జైసింహ (భారత్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1960
జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 1977
కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లండ్ - 1980
అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్ వెస్టిండీస్ - 1984
రవిశాస్త్రి (భారత్) వర్సెస్ ఇంగ్లాండ్ - 1984
అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్ న్యూజిలాండ్ - 1999
ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్ భారతదేశం - 2006
అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌న్యూజిలాండ్ - 2012
చెతేశ్వర్ పుజారా (భారత్) వర్సెస్ శ్రీలంక - 2017
రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్ ఆస్ట్రేలియా - 2019
క్రైగ్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023
టాంగెనరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్) వర్సెస్ జింబాబ్వే - 2023
ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్ ఇంగ్లాండ్ - 2023*
చదవండి: Asia Cup 2023: అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ స్ట్రాంగ్ కౌంటర్.. తగ్గేదేలేదు!
Only in Test Cricket 😍
— Sony Sports Network (@SonySportsNetwk) June 18, 2023
An unconventional field setup from 🏴 forced Usman Khawaja to come down the track and ended up getting bowled 😲👏#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/jb0XKnBJCv
Comments
Please login to add a commentAdd a comment