
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఇక తొలిరోజు ఆటలో హైలైట్ అయింది మాత్రం నిస్సందేహంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.
సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి ఈసారి తన ఆటతో ఎవరైనా భయపెడతారంటే ముందు వినిపించిన పేరు ఖవాజాదే. తాజాగా నాలుగో టెస్టులో ఖవాజా అద్భుత సెంచరీతో మెరిశాడు. 251 బంతుల్లో 104 పరుగులతో ఆడుతున్న ఖవాజా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతను ఆడిన ఒక్క షాట్‌లో కూడా చిన్న పొరపాటు లేదంటేనే ఎంత గొప్ప బ్యాటింగ్ కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు.
ఖవాజా టెస్టు కెరీర్‌లో ఇది 14వ సెంచరీ కావొచ్చు.. కానీ టీమిండియాపై, భారత గడ్డపై ఇదే మొదటి శతకం కావడం విశేషం. అందునా భారత్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఎమెషన్‌తో కూడుకున్నది. అందుకే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఖవాజా మాట్లాడుతూ కాస్త ఎమెషన్ అయ్యాడు. ''గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. ఈసారి సెంచరీతో మెరిశాను.. అందుకే ఇది ఎంతో విలువైనది'' అని చెప్పుకొచ్చాడు.
"ఈ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు.
ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104 పరుగులు, గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది.
First 💯 for Usman Khawaja against India and what a time to get it 🙌#INDvAUS #BGT2023 #UsmanKhawaja #SteveSmith #ViratKohli #Cricket pic.twitter.com/Xv4QAtP46z
— Abdullah Liaquat (@im_abdullah115) March 9, 2023