యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్లు ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలుత ఉస్మాన్ ఖ్వాజాను (17) అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో బోల్తా కొట్టించిన టంగ్.. ఆతర్వాత ఇటీవలికాలంలో చూడని అత్యద్భుమైన బంతితో వార్నర్ (66) ఖేల్ ఖతం చేశాడు. టంగ్ సంధించిన బంతిని ఎలా ఆడాలో తెలీని వార్నర్ నిశ్రేష్ఠుడిగా చూస్తూ ఉండిపోయాడు. పెవిలియన్‌కు వెళ్లే సమయంలోనూ వార్నర్ ముఖంలో ఏమీ చేయలేకపోయానన్న ఎక్స్‌ప్రెషన్ కనిపించింది. టంగ్ వేసిన పేస్ దెబ్బకు లెగ్ వికెట్ విరిగిపోయింది.
First Ashes wicket secured 🔒
— England Cricket (@englandcricket) June 28, 2023
Masterful from Josh Tongue ✨ #EnglandCricket | #Ashes pic.twitter.com/pS963Awgop
కాగా, కెరీర్‌లో కేవలం రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న టంగ్.. ఆసీస్ ఓపెనర్లను తొలుత బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే వీరు ఔటయ్యాక క్రీజ్‌లో వచ్చిన లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ముందు టంగ్ పప్పులు ఉడకలేదు. వారు టంగ్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదుర్కొన్నారు. 25 ఏళ్ల టంగ్ ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన అతను.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Warner GONE! 🤩
— England Cricket (@englandcricket) June 28, 2023
S̶t̶u̶a̶r̶t̶ ̶B̶r̶o̶a̶d̶ Josh Tongue gets his man! #EnglandCricket | #Ashes pic.twitter.com/3sw6FSU2To
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment