
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్( పీఎస్‌ఎల్-6)లో భాగంగా గురువారం పెషావర్ జాల్మి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను విజయం వరించింది. ఇస్లామాబాద్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీకి తోడు ఆసిఫ్ అలీ 14 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరికి తోడు కొలిన్ మున్రో 48, బ్రాండన్ కింగ్ 46 పరుగులతో రాణించడంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి ధీటుగానే బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో 6 వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 68, కమ్రాన్ అక్మల్ 53 పరుగులతో రాణించారు.
ఇక పీఎస్‌ఎల్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200కు పైగా పరుగులు నమోదవ్వడం 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 2010లో కరాచీ డాల్ఫిన్స్, లాహోర్ ఈగల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 14 పాయింట్లతో టాప్ స్థానానికి ఎగబాకగా.. పెషావర్ జాల్మి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
చదవండి: PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment