పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్‌లో రిలాక్స్ మోడ్‌లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్‌లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్‌లా మారిపోయింది.
తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్‌లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది.
అయితే మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు.
Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y
— PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023
Jalebia zyada bik gai inki shayad
— Noor ul Ain (@thenoorulain13) March 16, 2023
Comments
Please login to add a commentAdd a comment