Hasan Ali
-
భారత్ రాకపోయినా నష్టం లేదు.. ఆ టోర్నీ మాత్రం పాక్‌లోనే: హసన్ అలీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. అయితే ఈ మెగా టోర్నీలో భారత జట్టు పాల్గోనడంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. పాకిస్తాన్‌కు భారత జట్టును పంపిచేందుకు బీసీసీఐ విముఖత చూపుతోంది. భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్ధ వేదికలపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సైతం తెలియజేసింది.ప్రస్తుతం ఈ విషయాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. అయితే పీసీబీ మాత్రం మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హసన్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలిగినా పాకిస్తాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహిస్తుందని అలీ థీమా వ్యక్తం చేశాడు."మేము గతేడాది వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్‌కు వెళ్లాము. అటువంటిప్పుడు వారు కూడా పాకిస్తాన్‌కు రావాలి కాదా. క్రీడలను రాజకీయాలకు దూరం పెట్టాలని ఇప్పటికే చాలా మంది లెక్కలేనన్ని సార్లు చెప్పారు. మరోవైపు చాలా మంది భారత ఆటగాళ్లు సైతం పాకిస్తాన్లో ఆడేందుకు సముఖత చూపిస్తున్నారు.ఈ విషయాన్ని భారత క్రికెటర్లే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అంటే భారత జట్టు సైతం పాక్‌కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే కదా. కానీ వారి దేశ విధి విధానాలకు కట్టుబడి ఉన్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని పీసీబీ చైర్మెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్లు ఈ మెగా ఈవెంట్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది.భారత్ రాకపోయినా ఈ టోర్నీ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ దాటి వెళ్లదు. కచ్చింగా పాక్‌లో ఆడాల్సిందే. భారత్ ఆడకపోతే ఓవరాల్‌గా క్రికెట్ ముగిసినట్లు కాదు కాదా. భారత్ ఒక్కటే కాదు మిగితా టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఉన్నాయి" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు. -
నిప్పులు చెరిగిన హసన్ అలీ.. టిమ్ సీఫర్ట్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో ఇవాళ (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. హసన్ అలీ (4-0-15-4), బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-27-2), జహీద్ మెహమూద్ (4-0-25-2), మీర్ హమ్జా (3.1-0-25-1) ధాటికి 19.1 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. .@RealHa55an is a vibe 😄pic.twitter.com/oq7KK1mc5M — CricTracker (@Cricketracker) March 6, 2024 గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (15), ఖ్వాజా నఫే (17), రిలీ రొస్సో (10), అకీల్ హొసేన్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. బిగ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (9), సర్ఫరాజ్ ఖాన్ (7), ఆమిర్ (2), హస్నైన్ (5), ఉస్మాన్ తారిక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ సీఫర్ట్ (31 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. షోయబ్ మాలిక్ (27 నాటౌట్) కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జేమ్స్ విన్స్ (27) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ షాన్ మసూద్ (7) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. -
ఐపీఎల్‌పై మనసు పారేసుకున్న పాకిస్తాన్ స్టార్ బౌలర్
ఐపీఎల్ 2024 సీజన్ వేలానికి ముందు పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి క్రికెటర్ కోరుకునే విధంగానే తనకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉందని అన్నాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్‌లలో ఒకటని.. ఇలాంటి లీగ్‌లో ఆడాలని ప్రతి ఆటగాడు కలలు కంటాడని తెలిపాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే తాను తప్పక క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఓ లోకల్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ హసన్ అలీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు కేవలం ఒకే ఒక్క ఎడిషన్‌లో ఆడిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభమైన తొలి ఏడాది (2008) మాత్రమే పాక్ క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొన్నారు. అనంతరం భారత్-పాక్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో దాయాది దేశ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కలేదు. 2008 ఎడిషన్‌లో షాహిద్ అఫ్రిది (డెక్కన్ ఛార్జర్స్), షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్), కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్), మిస్బా ఉల్ హాక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), షోయబ్ అక్తర్, సల్మాన్ బట్, ఉమర్ గుల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), అజహార్ మెహమూద్ (పంజాబ్ కింగ్స్) ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు. -
పాక్‌కు పరీక్ష! నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. అలీ స్థానంలో అతడే!
ICC ODI WC 2023- Pak Vs SA: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సౌతాఫ్రికాను తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యమైనదే. ప్రతీ విభాగంలోనూ మేము మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు సరిచేసుకోవాలి. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా ఈ విషయాలన్నిటి గురించి అంతా కూర్చుని చర్చించుకున్నాం. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మ్యాచ్‌కు హసన్ అలీ అనారోగ్యం కారణంగా దూరం కాగా.. వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చినట్లు బాబర్ తెలిపాడు. మూడు మార్పులతో సౌతాఫ్రికా ఇక ఇప్పటి వరకు నెదర్లాండ్స్ చేతిలో తప్ప ఓటమన్నది ఎరుగని సౌతాఫ్రికా.. మరో భారీ విజయంపై కన్నేయగా.. హ్యాట్రిక్ ఓటములకు చెక పెట్టాలని పాక్ భావిస్తోంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి ప్రొటిస్ జట్టుపై తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పాక్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా.. తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి కూడా టీమ్‌తో చేరారు. రీజా హెండ్రిక్స్, కగిసో రబడ, లిజాద్ విలియమ్స్ దూరం కావడంతో ఈ ముగ్గురు రీఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లు పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్. సౌతాఫ్రికా క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి . చదవండి: WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్ శర్మ -
WC 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్!
వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ స్టార్ పేసర్ హసన్ అలీ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న కారణంగా సౌతాఫ్రికాతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ‘‘ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి సౌతాఫ్రికాతో పాకిస్తాన్ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు’’ అని ప్రకటన విడుదల చేసింది. కాగా యువ పేసర్ నసీం షా గాయం కారణంగా వరల్డ్‌కప్-2023 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో అనూహ్యంగా హసన్ అలీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 29 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ తాజా ప్రపంచకప్ ఈవెంట్లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి 5.82 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్) వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్.. సౌతాఫ్రికాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ప్రొటిస్ జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. వరుస ఓటములతో డీలా పడ్డ పాక్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి! ఇక ఈ మ్యాచ్‌లో హసన్ అలీ స్థానంలో మహ్మద్ వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: WC 2023: కోహ్లిలా ఉండాలన్నందుకు.. నాపై ద్రోహి అనే ముద్ర వేశారు! కానీ.. -
WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
‘‘జట్టును ప్రకటించినప్పుడే నాకంతా అర్థమైపోయింది. స్నేహాలు, వ్యక్తిగత బాంధవ్యాల ఆధారంగానే ఈ సెలక్షన్ జరిగింది. జట్టు సమతూకంగా లేదు. ఇండియాలో వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు ఈ తిప్పలు తప్పవని నేను ముందే ఊహించాను. వాళ్లు(మేనేజ్మెంట్) అన్నీ మాట్లాడతారు గానీ సరైన వ్యూహాలు రచించలేకపోతున్నారు. ఇండియాలో పిచ్ పరిస్థితులు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్న విషయం వాళ్లు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. సెలక్షన్ మొత్తం తప్పుల తడక ఈ టీమ్ సెలక్షన్ మొత్తం తప్పులతడకగా ఉంది. నసీం షా అందుబాటులో లేడని హసన్ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు. హసన్ అలీ కేవలం మేనేజ్మెంట్లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగానే జట్టులోకి వచ్చాడు. ఇక ఉసామా మిర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆడతాడు. ముస్తాక్ అహ్మద్‌కు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టు గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటపుడు ఇలాంటే ఫలితాలే వస్తాయి. అప్పుడు నన్నైతే పక్కనపెట్టారు అయినా.. పాకిస్తాన్ గతంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిందే లేదు. షాహిద్ ఆఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగినపుడు షాదాబ్ ఖాన్‌ను తప్పించి ఉసామా మిర్‌ను రప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇమాద్ వసీం(లెఫ్టార్మ్ స్పిన్నర్)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సెలక్షన్ తీరుపై మండిపడ్డాడు. ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కోక తప్పదంటూ ఘాటు విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇప్పటికే పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుందన్న కనేరియా.. ఇకముందు కూడా కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా మెగా ఐసీసీ టోర్నీలో ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మూడు పరాజయాలు చవిచూసింది. బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు కనీవిని ఎరుగని రీతిలో వన్డే ఫార్మాట్లో అదీ మేజర్ ఈవెంట్లో అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటములపై స్పందించిన డానిష్ కనేరియా ఈ మేరకు ఆజ్ తక్‌తో మాట్లాడుతూ పాక్ బోర్డు, సెలక్టర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కాగా పాక్ వరుస ఓటములు నేపథ్యంలో కెప్టెన్‌గా బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక.. -
WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్
ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్.. స్పిన్ దళంలో ఒకడిగా తప్పక టీమ్‌లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఇమాద్ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం ‘‘చాలా రోజులుగా ఇమాద్ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో తమను తాము నిరూపించుకోవాల్సిందే. అందుకే అతడికి చోటు లేదు డొమెస్టిక్ క్రికెట్లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్ క్రైటీరియా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్ వసీం జూనియర్ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు. అనూహ్య రీతిలో ఉస్మా మీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడుతున్న ఇమాద్ వసీం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు. చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే? 🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56 — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023 -
వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. ఎవరూ ఊహించని ఆటగాళ్లు ఎంట్రీ
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లహోర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ టోర్నీలో పాల్గోనే సభ్యుల వివరాలను వెల్లడించాడు. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా వన్డేప్రపంచకప్‌కు ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఆసియాకప్ మధ్యలో వైదొలిగిన స్టార్ పేసర్ హ్యారీస్ రవూఫ్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. మరోవైపు ఆసియాకప్‌లో శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ కూడా తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎవరూ ఊహించిన విధంగా స్పిన్నర్ ఉస్మా మీర్, ఫాస్ట్‌బౌలర్ హసన్ అలీను పాక్ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయపడిన నసీం షా స్ధానంలో హసన్ అలీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇక రిజర్వ్ జాబితాలో మహ్మద్ హ్యారిస్, జమాన్ ఖాన్, అర్బర్ అహ్మద్‌లకు చోటు దక్కింది. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మ వసీం జూనియర్, సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్. రిజర్వ్: మహ్మద్ హరీస్, జమాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? 🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56 — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023 -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్‌లో రిలాక్స్ మోడ్‌లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్‌లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్‌లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్ పడింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్ యునైటెడ్-పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ 3, షాదాబ్ ఖాన్ 2, ఫజల్ హక్ ఫారూఖీ, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్ (1.4-0-13-3), సూఫియాన్ (3/37), అమెర్ జమాల్ (2/28), జేమ్స్ నీషమ్ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ (38), రహ్మానుల్లా గుర్భాజ్ (33), షాదాబ్ ఖాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. పీఎస్ఎల్-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు.. ముల్తాన్ సుల్తాన్స్: 262/3 (ఉస్మాన్ ఖాన్ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120) క్వెట్టా గ్లాడియేటర్స్: 253/8 పెషావర్ జల్మీ 242/6 ముల్తాన్ సుల్తాన్స్ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121) లాహోర్ ఖలందర్స్ 226/5 (ఫకర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115) ఇస్తామాబాద్ యునైటెడ్ 107 పెషావర్ జల్మీ 240/2 (బాబర్ ఆజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115) క్వెట్టా గ్లాడియేటర్స్ 243/2 (జేసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్) -
PSL: హృదయాలు కొల్లగొట్టింది.. సూపర్.. స్టన్నింగ్! ఇంక ఆపుతావా?
PSL 2023- Simon Doull: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ‘నీకిది అవసరమా’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘పర్లేదు.. అతడు అన్నదాంట్లో తప్పేముంది’ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో నేపథ్యంలో సైమన్ డౌల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్- ముల్తాన్ సుల్తాన్స్ తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ కింగ్స్‌ను 205 పరుగులకు అవుట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో అద్భుత విజయం అందుకుంది. దీంతో ఇస్లామబాద్ యునైటెడ్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో డగౌట్లో ఉన్న హసన్ అలీ భార్య సమియా అర్జూ సైతం ఆనందంతో గెంతులేసింది. నమ్మశక్యంరాని రీతిలో భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు గెలుపొందడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కెమెరాలు సమియా సెలబ్రేషన్స్ మీద దృష్టిసారించాయి. హృదయాలు కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్ సమియా రూపానికి ఫిదా అయిన సైమన్ డౌల్.. ‘‘ఆమె గెలిచింది. నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది హృదయాలు ఆమె కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో నెటిజన్లు 53 ఏళ్ల డౌల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ‘‘ఇంక ఆపెయ్! ఆట గురించి మాట్లాడమంటే.. నువ్వు చేసే పని ఇదా! జట్టును గెలిపించడానికి కృషి చేసిన ఆ ఆటగాళ్ల గురించి వర్ణించేందుకు నీ భాషాప్రావీణ్యాన్ని ఉపయోగించు.. బాగుంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. అందాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? అంటూ సైమన్ డౌల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హసన్ అలీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి 51 పరుగులతో రాణించిన ఫహీం అష్రఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల పాక్ కెప్టెన్, పెషావర్ జల్మీ సారథి బాబర్ ఆజం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక హసన్ అలీ భార్య సమియా భారత్‌కు చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అన్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Simon Doull is all of Us right now 😂😂😂 even he is baffled by the beauty of Pakistan 😅😅🔥🔥❤️❤️ #simondoull #tiktokdown #PSL8 pic.twitter.com/08VK1KizuQ — Adil Ali Shah (@AdilAliShah13) March 9, 2023 -
బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవి చూసింది. గురువారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం అద్భుతంగా రాణించాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్.. కేవలం 14.5 ఓవర్లలోనే చేధించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో గుర్బాజ్(62) అర్ధశతకంతో చెలరేగగా.. వాన్ డెర్ డస్సెన్(42) పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ పేసర్ హసన్ అలీని బాబర్ తన బ్యాట్‌తో కొట్టేందుకు సరదగా ప్రయత్నించాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన హసన్ అలీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి బాబర్ సింగిల్ తీశాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న బాబర్‌ను చూసి.. హసన్ అలీ నవ్వుతో ఏదో అన్నాడు. అందుకు బదులుగా బాబార్ తన బ్యాట్‌తో కొడతూ అన్నట్లగా సైగలు చేశాడు. బాబర్ అలా చేసిన వెంటనే అలీ నవ్వుతో కొంచెం ముందుకు పరిగెత్తాడు. వీరిద్దరి చర్యను చూసిన సహాచర ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన హసన్ అలీ మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్! కెప్టెన్‌గా స్మిత్ HASAN and babar😭😭😭 pic.twitter.com/hzve62ME4o — a. (@yoonosenadaa) February 23, 2023 Some banter between Babar Azam and Hassan Ali#PZvsIUpic.twitter.com/tDsxIhcrCl — Cricket Pakistan (@cricketpakcompk) February 23, 2023 -
అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్లోనే తొలి బౌలర్‌గా
పుణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్ తన టీ20 కెరీర్లో 12 నోబాల్స్ వేశాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో ఏకంగా ఐదు నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ హసన్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దషన్ శనక ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 56 పరుగులతో పాటు అదరగొట్టిన షనక.. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా శనివారం(జనవరి7) జరగనుంది. చదవండి: Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
హద్దు మీరితే ఇలాగే ఉంటుంది.. సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సహనం కోల్పోయాడు. తనను హేళన చేసిన కొంతమంది అభిమానులతో బహిరంగ గొడవకు దిగాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఫామ్ కోల్పోయిన జట్టుకు దూరమైన హసన్ అలీ ఒక లోకల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్ జిల్లాలో ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో హసన్ అలీ బౌండరీ లైన్ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్ అలీని టీచ్ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్ ఆడడానికి సిగ్గులేదా.. అంటూ ఆటపట్టించారు. చాలాసేపు ఓపికతో భరించిన హసన్ అలీపై కొంతమంది గడ్డి, పేపర్లను విసిరారు. దీంతో సహనం కోల్పోయిన హసన్ అలీ తనను టీచ్ చేసిన వారితో గొడవకు దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించగా మిగతావారు హసన్ అలీని అడ్డుకున్నారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు వచ్చి హసన్ అలీని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఒక లోకల్ మ్యాచ్‌లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్‌ను ఇలానే అవమానిస్తారా అంటూ మ్యాచ్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్ అలీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్ అలీని ట్రోల్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు. దీంతో అభిమానుల ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచిగా ఉన్నంతవరకు ఏం కాదు కానీ ఆటగాళ్లు రివర్స్ అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని హసన్ అలీ ఉదంతం హెచ్చరిస్తుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఒకప్పుడు హసన్ అలీ పాక్ తరపున నెంబర్‌వన్ బౌలర్‌గా రాణించాడు. ఆ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా కొంతకాలం కొనసాగాడు. ఇక పాకిస్తాన్ తరపున హసన్ అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 21 టెస్టుల్లో 77 వికెట్లు, 50 టి20ల్లో 60 వికెట్లు తీశాడు. You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd — zayn (@ZaynMahmood5) December 4, 2022 Hassan Ali's fight with the crowd😱#HassanAli #PakvEng #Cricket pic.twitter.com/G4mji06uwa — Muhammad Noman (@nomanedits) December 3, 2022 చదవండి: FIFA WC: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! ENG Vs PAK: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా -
అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా!
Shadab Khan: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఆ జట్టు పేసర్ హసన్ అలీ మధ్య జరిగిన సరదా సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అలీ కామెంట్‌కు షాదాబ్ బదులిచ్చిన తీరుపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు అతడి ఫాలోవర్లు. ఇంతకీ విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో.. హసన్ అలీ ఏదో సీరియస్‌గా చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. అతడి పెళ్లి గురించే! ఈ ట్వీట్లో హసన్ అలీని ట్యాగ్ చేశాడు. ఇందుకు స్పందించిన అలీ.. ‘‘మేము షాదాబ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం’’ అంటూ ఇందులోకి షాదాబ్ ఖాన్‌ను లాగాడు. ఈ ట్వీట్‌కు బదులుగా షాదాబ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ‘‘అసలు మీ ఇద్దరికీ ఏం అనిపిస్తోంది? నేను మరీ అంత పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నారా? నేను చిన్న పిల్లాడిని ప్రతి ఒక్కరు నా పెళ్లి గురించే అడుగుతున్నారు. నేనింకా చిన్న పిల్లాడినే’’ అని ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్ సరదాగా బదులిచ్చాడు. కాగా నిలకడలేమి ఆట తీరు వల్ల 28 ఏళ్ల హసన్ అలీకి ఇటీవల జట్టులో అవకాశాలు కరువయ్యాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ జట్టుకు అతడు ఎంపికకాలేదు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సైతం సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. షాదాబ్ ఖాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా.. టీ20 ఫార్మాట్లో ఈ ఆల్‌రౌండర్ అదరగొడుతున్నాడు. ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల్లో అద్భుతంగా రాణించాడు. ఐసీసీ టోర్నీలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదితో కలిసి పాక్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే 28 ఏళ్ల హసన్ అలీ.. భారత్‌కు చెందిన సామియా ఆర్జూను పెళ్లాడిన విషయం తెలిసిందే. చదవండి: Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! Basically we talking about Shadab’s wedding babar saying vo ni honi 😆 @76Shadabkhan https://t.co/LLejsLkBFq — Hassan Ali 🇵🇰 (@RealHa55an) November 22, 2022 Aap logo ko be Lagta ha ka main boht bara ho gaya houn. Sab mere say shadi ka puchte hain. Abhi mai bacha hun. https://t.co/UktMfUZOcA — Shadab Khan (@76Shadabkhan) November 22, 2022 -
Ind Vs Pak: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. విరాట్.. నేను: పంత్
T20 World Cup 2022- India Vs Pakistan- Rishabh Pant: దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎల్లప్పుడూ తనకు ప్రత్యేకమేనని టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అన్నాడు. భారత్- పాక్ మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమాహారమని.. ఆటగాళ్లతో పాటు అభిమానులందరూ ఎమోషనల్‌గా ఉంటారని పేర్కొన్నాడు. ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత చుట్టూ ఉద్వేగపూరిత వాతావరణం ఉంటుందని.. ఫ్యాన్స్ కేరింతలు, కోలాహలం.. అదో గొప్ప ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. జాతీయ గీతం పాడుతుంటే తన రోమాలు నిక్కబొడుచుకుంటాయని.. ఆ భావనను మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పరాభవానికి బదులు తీర్చుకునేందుకు టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న టీమిండియా తలపడనుంది. గతేడాది యూఏఈలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దాయాదితో పోరు నేపథ్యంలో ఇప్పటికే తుది జట్టును ఎంపిక చేసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఒంటి చేత్తో రెండు సిక్స్‌లు ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న రిషభ్ పంత్.. ప్రపంచకప్-2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్ తాలుకు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఐసీసీతో అతడు మాట్లాడుతూ.. ‘‘నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో హసన్ అలీ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో నేను వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాను. ఆదిలోనే మేము వికెట్లు కోల్పోయిన కారణంగా రన్‌రేటుపై దృష్టి సారించాం. నేను, విరాట్ కలిసి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలో నేను ఒంటిచేత్తో రెండు సిక్స్‌లు కొట్టాను. నా స్పెషల్ షాట్‌ను ఎగ్జిక్యూట్ చేశాను’’ అని పేర్కొన్నాడు. ఇక రన్‌మెషీన్ విరాట్ కోహ్లితో కలిసి ఆడటం గురించి చెబుతూ.. కఠిన పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో కోహ్లిని చూసి నేర్చుకోవాలని.. తనతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుందని పంత్ అన్నాడు. కాగా ప్రపంచకప్-2021లో పాక్‌తో మ్యాచ్‌లో పంత్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులు సాధించాడు. కోహ్లి 57 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పంత్ ఆర్ డీకే?! ఫినిషర్‌గా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత రిషభ్ పంత్‌కు అతడి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2022లో పాక్‌తో ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరిలో తుదిజట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. చదవండి: Rohit Sharma: 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది' Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!
ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ కోసం 1020 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అదే విధంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కింగ్ కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం రన్మిషన్ను ప్రశంసలలో ముంచెత్తారు. ట్విటర్ వేదికగా హాసన్ అలీ, మహ్మద్ అమీర్, కమ్రాన్ ఆక్మల్ వంటి పాక్ ఆటగాళ్లు కోహ్లిని అభినందిచారు. "ఫామ్ తాత్కాలికమైనది.. క్లాస్ అనేది ఎప్పటికీ పోదు. కోహ్లి ఆటను ఎల్లప్పుడూ చూడడానికి ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కోహ్లి నిజమైన కింగ్" అంటూ ట్విటర్ వేదికగా ఆక్మల్ పేర్కొన్నాడు. మరో వైపు హాసన్ అలీ "ది గ్రేట్ కోహ్లి ఈజ్ బ్యాక్" అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మెగా ఈవెంట్ గ్రూపు దశలో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. సూపర్-4లో మాత్రం దాయాది జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక సూపర్-4 దశలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన భారత్ ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
మహిళా అభిమానికి ఫిదా.. 'ఐ లవ్ ఇండియా' అన్న పాక్ క్రికెటర్
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ భారతీయ మహిళా అభిమానికి ఫిదా అయ్యాడు. తనపై ఆమె చూపించిన అభిమానానికి ముగ్దుడైన హసన్ అలీ.. 'ఐ లవ్ ఇండియా' అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత్‌కు చెందిన ఒక మహిళ అభిమాని అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా పాక్ క్రికెటర్లంతా ప్రాక్టీస్ ముగించుకొని డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాలతో ఫోటోలు క్లిక్‌మనిపించారు. ఈ సమయంలో అక్కడినుంచి వెళుతున్న హసన్ అలీని ఆపి.. ''మీకు భారత్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.'' అని మహిళ పక్కన ఉన్న వ్యక్తి పేర్కొంటూ సెల్ఫీ కావాలని అడిగాడు. ''అవును మాకు ఇండియాలో కూడా అభిమానులు ఉంటారు.. ఐ లవ్ ఇండియా..'' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత సదరు మహిళతో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. ఇక హసన్ అలీ భార్య సమియా ఆర్జూ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఇక మొదట హసన్ అలీ ఆసియాకప్‌కు పీసీబీ ప్రకటించిన జట్టులో లేడు. మహ్మద్ వసీమ్ గాయపడడంతో అతని స్థానంలో హసన్ అలీని ఎంపిక చేశారు. ఇక చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లో హసన్ అలీకి అవకాశం రాలేదు. హసన్ అలీ కంటే హారిస్ రౌఫ్, షాహనవాజ్ దహాని, నసీమ్ షాల త్రయంవైపే కెప్టెన్ బాబర్ ఆజం మొగ్గు చూపాడు. అయితే టీమిండియాతో మ్యాచ్‌లో యంగ్ బౌలర్ నసీమ్ గాయపడడంతో హాంకాంగ్‌తో మ్యాచ్‌కు హసన్ అలీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా టీమిండియా బుధవారం హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూఫ్-ఏ నుంచి సూపర్-4కు టీమిండియా అర్హత సాధించనుంది. మరోవైపు టీమిండియాతో చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. హాంకాంగ్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి రెండో జట్టుగా పాక్ సూపర్-4లో అడుగుపెట్టాలని ఆశపడుతుంది. చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ ఆసియా కప్‌లోనే మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా..! -
భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్ సీనియర్ పేసర్ రీ ఎంట్రీ!
ఆసియాకప్-2022కు పాకిస్తాన్ యువ పేసర్ మహ్మద్ వసీమ్ వెన్ను నోప్పితో దూరమైన సంగతి తెలిసిందే. అయతే తాజాగా వసీం స్థానంలో ఆ జట్టు సీనియర్ పేసర్ హసన్ అలీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రాక్టీస్ సెషన్లో భాగంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. అతడిని వెంటనే ఐసీసీ అకాడమీ తరలించి ఎంఆర్ఐ స్కాన్ చేయించగా.. గాయం తీవ్రమైనదిగానే తేలింది. ఈ క్రమంలో వసీం టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.అంతకుమందు పాక్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది మెకాలి గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే అతడి స్థానాన్ని యువ పేసర్ మొహమ్మద్ హస్నైన్‌తో పాక్ భర్తీ చేసింది. ఇక ఎక్స్‌ప్రెస్ పేసర్ హసన్ అలీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పీసీబీ జట్టు నుంచి హసన్ ఊద్వసన పలికింది. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడిని పీసీబీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక ఆనూహ్యంగా జట్టులోకి వచ్చిన హసన్ ఏ మేరకు చూడాలి మరి. ఇప్పటి వరకు 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అలీ 60 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఆగస్టు 28న ఆడనుంది. చదవండి: Ind Vs Pak: రోహిత్ ‘హగ్’తో ఆనందంలో మునిగిపోయిన పాక్ ఫ్యాన్! నువ్వు గ్రేట్ భయ్యా! -
'కోహ్లి, హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పాక్ పేసర్ హసన్ అలీ ఒకేలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి గత కొన్నాళ్లుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవతున్నాడని హఫీజ్ తెలిపాడు. కోహ్లి కొద్ది రోజులు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నట్టే అలీ కూడా విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని హఫీజ్ అన్నాడు. 'గత 10 ఏళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. కోహ్లి ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. విండీస్ పర్యటనకు కోహ్లికి విశ్రాంతి ఇచ్చి బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆటగాడికి రెస్టు అవసరం. ఈ విరామం కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడానికి సహాయపడుతుంది. విరాట్ కోహ్లి భారత జట్టులో కీలక ఆటగాడు. కానీ గత మూడేళ్ల నుంచి అతడు అంతగా రాణించలేకపోతున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి అర్దసెంచరీ సాధించినప్పటికీ.. అది అతడు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ కాదు" అని హఫీజ్ పేర్కొన్నాడు. హాసన్ అలీ గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి లాంటి సమస్యనే హాసన్ అలీ కూడా ఎదుర్కొంటున్నాడు. అతడు కూడా చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాడు. హాసన్ అలీ సుదీర్ఘ విరామం తీసుకోని తిరిగి మళ్లీ క్రికెట్లో అడుగు పెట్టాలని హఫీజ్ తెలిపాడు. చదవండి: CWG 2022 Ind W Vs Eng W: క్రికెట్లో పతకం ఖాయం చేసిన టీమిండియా -
ఎంత పని చేశావ్.. లంక జట్టులో మరో 'హసన్ అలీ'
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (408 బంతుల్లో 160 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. షఫీక్‌కు తోడూ బాబర్ ఆజం అర్థ సెంచరీతో రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అబ్దుల్లా షఫీక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లంక ఆటగాడు కాసున్ రజిత జారవిడవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసిల్వా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి బ్యాట్ ఎడ్జ్ తాకడంతో గాల్లోకి లేచింది. బౌండరీలైన వద్ద ఉన్న కాసున్ రజిత అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ పట్టడం వల్ల కూడా లంకకు పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఎందుకుంటే అప్పటికి పాక్ విజయానికి 19 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కానీ కాసున్ రజితను మాత్రం అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. అతన్ని పాక్ క్రికెటర్ హసన్ అలీతో పోల్చారు. కీలక సమయంలో క్యాచ్‌లను జారవిడుస్తాడన్న అపవాదును హసన్ అలీ ఇంతకముందు చాలాసార్లు మూటగట్టుకున్నాడు. టి20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్ వద్ద ఉన్న హసన్ అలీ చేతిలోకి వచ్చినప్పటికి అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే ఆ తర్వాత మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఆసీస్‌ను ఫైనల్ చేర్చాడు. అలా ఆరంభం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్తాన్.. హసన్ అలీ వదిలేసిన ఒక్క క్యాచ్ వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో హసన్ అలీ క్యాచ్‌లు జారవిడిచాడు. తాజాగా లంకతో తొలి టెస్టులోనూ హసన్ అలీ ఇదే సీన్‌ను రిపీట్ చేశాడు. రెండు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు సింపుల్ రనౌట్ చేసే చాన్స్‌ను కూడా మిస్ చేశాడు. తాజాగా కాసున్ రజితను కూడా హసన్ అలీతో పోలుస్తూ అభిమానులు కామెంట్స్ చేశారు. ''హసన్ అలీ నుంచి స్పూర్తి పొందినట్లున్నాడు.. వెల్కమ్ టూ హసన్ అలీ అకాడమీ.. లంక జట్టులో హసన్ అలీని చూశాం.. క్యాచ్ పట్టినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదులే..'' అంటూ రజితను ఒక ఆట ఆడుకున్నారు. Welcome to 'Hassan Ali' academy#PAKvSL pic.twitter.com/7rsznXDpOI — Juniii... @searchingsukoon (@searchingsukoon) July 20, 2022 We found hassan ali in Srilankan team.inspired by Real Hassan Ali😜#PAKvSL #SLvPAK#PAKvsSL #SLvsPAK pic.twitter.com/5a5i3sbxNr — ḶQ 💚 🇵🇰 | 🏏 l❤️ (@Saddique_rao) July 20, 2022 #WTC23 Inspired by Hassan Ali😜#PAKvSL pic.twitter.com/QqA4KSfWOZ — Mohammad Asad (@MohammadAsad77) July 20, 2022 చదవండి: షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం -
అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ అంతుపట్టని డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హసన్ అలీ.. మ్యాచ్‌కు దూరంగా ఉన్న హారిస్ రౌఫ్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. అయితే హసన్ అలీ చేసిన డ్యాన్స్ కాస్త విచిత్రమైన మూమెంట్స్లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ ఈ అంతుపట్టని డ్యాన్స్ ఏంటా అని షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం వీరోచిత సెంచరీ పాక్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు. Hassan Ali's back!!!! pic.twitter.com/WoQjdftQmQ — Ramiya 2.0 (@yehtuhogaaa) July 16, 2022 చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్ చేయాలి' -
పాక్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించిన పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్
Liam Livingstone Lauds Hasan Ali: ఇంగ్లండ్ కౌంటీల్లో చెలరేగిపోతున్న పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీపై పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో లివింగ్‌స్టోన్ పాక్ పేసర్‌ని కొనియాడాడు. లివింగ్‌స్టోన్‌కు లాంకాషైర్ హోం టీమ్ కావడంతో హసన్ అలీ ప్రదర్శనను ఆకాశానికెత్తుతూ, తన జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాట్ ఎ సైనింగ్.. వాట్ ఎ విన్ అంటూ రెడ్ రోసెస్తో హసన్ అలీకి, లాంకాషైర్ జట్టుకు విషెస్ తెలిపాడు. What a signing… what a win 🌹🌹🌹 https://t.co/bqei0nZohb — Liam Livingstone (@liaml4893) April 24, 2022 కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్‌లో భాగంగా గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన హసన్.. లాంకాషైర్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గ్లోస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ కాగా.. లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంకాషైర్ జట్టులో జోష్ బొహానన్ (231) డబుల్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ డేన్ విలాస్ (109) సెంచరీతో సత్తా చాటాడు. చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు -
150 కిమీ వేగంతో యార్కర్.. స్టంప్ రెండు ముక్కలు
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ బౌలింగ్ వేగానికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెలితే.. హసన్ అలీ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. మూడోరోజు ఆటలో భాగంగా గ్లూస్టర్షైర్ బ్యాటర్ జేమ్స్ బ్రేసీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాదాపు 150 కిమీ వేగంతో విసిరిన పదునైన యార్కర్ బ్యాట్స్‌మన్ కాళ్ల సందుల నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. అయితే బంతి సూపర్ ఫాస్ట్‌గా రావడంతో స్టంప్ రెండు ముక్కలయింది. ఈ వీడియోనూ లంకాషైర్ ట్విటర్లో షేర్ చేస్తూ.. కొత్త స్టంప్ ప్లీజ్.. చెప్పడానికి ఏం లేదు.. ఓ మై వర్డ్.. మేము ఇంకో స్టంప్ తెప్పించాల్సిందే అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లూస్టర్షైర్తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో మెరిశాడు. అతని ధాటికి గూస్టర్షైర్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకాషైర్‌కు 304 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకముందు లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌ను 556 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జోష్ బొహానన్ డబుల్ సెంచరీతో(231 పరుగులు) మెరవగా, కెప్టెన్ డేన్ విలాస్ 109 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. చదవండి: Wriddiman Saha Case: సాహా వ్యవహారం.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం! County Championship: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ NEW STUMPS, PLEASE! 👀@RealHa55an 😲 🌹 #RedRoseTogether pic.twitter.com/KhjUz3TG6q — Lancashire Cricket (@lancscricket) April 23, 2022 “Oh my word!” 😳 We’ll have to get another one of those, @RealHa55an! 🤣 🌹 #RedRoseTogether pic.twitter.com/XQO4reizR1 — Lancashire Cricket (@lancscricket) April 23, 2022 -
రెండుసార్లు బచాయించినా గెలిపించలేకపోయారు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022) చివరి అంకానికి చేరుకుంది. లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఎలిమినేటర్ 2లో భాగంగా శుక్రవారం లాహెర్ ఖలందర్స్ ఇస్లామాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిన్ అఫ్రిది తన చివరి ఓవర్ వేశాడు. ఇస్లామాబాద్ గెలవాలంటే 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. క్రీజులో హిట్టర్ అసిఫ్ అలీతో పాటు హసన్ అలీ ఉన్నారు. ఓవర్ తొలి బంతిని అసిఫ్ బౌండరీ పంపించాడు. రెండో బంతిని సింగిల్ తీయడంతో హసన్ అలీ స్ట్రైక్‌కు వచ్చాడు. మూడో బంతిని హసన్ భారీ షాట్ ఆడినప్పటికి బంతి వెళ్లి డేవిడ్ వీస్ చేతిలో పడింది. కానీ రిప్లేలో నోబాల్ అని తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తైంది. ఆ తర్వాత ఫ్రీ హిట్‌లోనూ అసిఫ్ అలీ కూడా అదే తరహాలో భారీ షాట్ ఆడాడు. లాంగాన్ దిశలో ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నప్పటికి కౌంట్ కిందకు రాదు. అలా రెండుసార్లు ఔట్ నుంచి బచాయించినప్పటికి ఇద్దరు అలీలు మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలందర్స్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. షఫీక్ 52 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కమ్రాన్ గులామ్ 30, డేవిడ్ వీస్ 28 నాటౌట్, మహ్మద్ హఫీజ్ 28 పరుగులు చేశారు. అనంతరం ఇస్లామాబాద్ యునైటెడ్స్ 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అజమ్ ఖాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు pic.twitter.com/49893BOcmh — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 pic.twitter.com/PDjZQt2Xlk — Sports Hustle (@SportsHustle3) February 25, 2022 -
క్యాచ్ డ్రాప్ చేశా.. ఏడ్చాను.. రెండ్రోజులు నిద్రపోలేదు.. నా భార్య కంగారుపడింది..
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో సూపర్ 12 దశలో అద్భుత విజయాలు సాధించిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన బాబర్ ఆజమ్ బృందం... రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు. ఇక షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను... హసన్ అలీ మిస్ చేయగా.. దొరికిన లైఫ్‌ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే కంగారూలను గెలిపించాడు. దీంతో హసన్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. అతడి భార్యను ఉద్దేశించి కూడా కొంతమంది నీచపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హసన్ అలీ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడిన అతడు... ‘‘నా కెరీర్లో అది అత్యంత కఠిన సమయం. ఆ మ్యాచ్ ఫలితాన్ని అస్సలు మర్చిపోలేకపోయాను. ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఆ రోజు మ్యాచ్ తర్వాత రెండు రోజుల పాటు నేను నిద్రపోలేదు. ఏడ్చాను. నా భార్య చాలా కంగారుపడింది. టెన్షన్‌కు గురైంది. నేను ఏమైపోతానో అని భయపడింది. నేను మాత్రం డ్రాప్ చేసిన ఆ క్యాచ్ గురించే తీవ్రంగా ఆలోచించేవాడిని. ప్రతిసారి ఆ విషయమే గుర్తుకు వచ్చేది. అయితే, బంగ్లాదేశ్ పర్యటనకు పయనమైన తర్వాత నాలో కాస్త మార్పు వచ్చింది. చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నాకు నేనే నచ్చజెప్పుకొన్నాను’’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో సహచర ఆటగాళ్లు ముఖ్యంగా షోయబ్ భాయ్ తనకు అండగా నిలిచాడన్న హసన్ అలీ... నువ్వు టైగర్ అంటూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని గుర్తు చేసుకున్నాడు. తాను ఏడుస్తుంటే షాహిన్ కూడా ఏడ్చాడని అంతా కలిసి తమను ఓదార్చారని పేర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు సైతం తనకు మద్దతుగా నిలబడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పాకిస్తాన్‌పై విజయంతో ఫైనల్లో ప్రవేశించిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీద గెలుపొంది తొలిసారి టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: Sourav Ganguly: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ.. సిగ్గుపడండి.. ఎందుకిలా? పాపం కెప్టెన్, కోచ్! -
Hasan Ali: సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్.. ఇంత దురుసుతనం పనికిరాదు!
Hasan Ali Argument With Journalist Goes Viral: పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్నలిస్టుతో వాదనకు దిగి దురుసుగా ప్రవర్తించాడన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే... పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా హసన్ అలీ ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా సీజన్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ లిస్టు ప్రకటన సందర్భంగా... ఓ జర్నలిస్టు పదే పదే హసన్ అలీని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడిని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్న హసన్ అలీ... తర్వాతి ప్రశ్న అంటూ సమాధానం దాటవేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన సదరు జర్నలిస్టు.. ‘‘ఇది అస్సలు మంచి పద్ధతి కాదు’’ అని విసుక్కున్నాడు. హసన్ అలీ సైతం ఇందుకు ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘ముందు ట్విటర్లో మంచి రాతలు రాయడం నేర్చుకోండి. ఆ తర్వాతే నేను సమాధానాలు ఇస్తాను. సరేనా? వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రశ్నలు అడగకుండా మిమ్మల్ని ఆపలేదేమో కానీ.. కనీసం మాకైనా ఆ హక్కు ఉంది కదా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హసన్ అలీని ఇస్లామాబాద్ యునైటెడ్ అధికారులు సముదాయించారు. అప్పటి వివాదం.. అనాస్ సయీద్ అనే జర్నలిస్టు గతంలో హసన్ అలీని ట్విటర్ వేదికగా విమర్శించాడు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించాలంటూ హితవు పలికాడు. సహచర ఆటగాళ్లతో హసన్ అలీ ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి... ‘‘ప్రొటోకాల్ ప్రకారం.. ప్రయాణాల్లో తప్పక మాస్కు ధరించాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తారు’’ అంటూ సెటైర్లు వేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘పాత వీడియోలతో డ్రామాలు చేయవద్దు. వాస్తవాలేమిటో తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. ఫేక్ మసాలాలు వద్దు. మీ నుంచి సత్ప్రవర్తన ఆశిస్తున్నా’’ అని హసన్ అలీ బదులిచ్చాడు. తాజా ప్రెస్ మీట్లో భాగంగా మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ఇంత దురుసు ప్రవర్తన పనికిరాదు’’ అంటూ హసన్ అలీని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. ఇక ప్లాటినమ్ కేటగిరీలో ఇస్లామాబాద్ యునైటెడ్ హసన్ అలీని రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మథ్యూవేడ్ క్యాచ్ జారవిడిచినందుకు హసన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Virat Kohli: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్ ప్రశంసల జల్లు BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్ What happened to Hassan Ali?! What did @anussaeed1 say to him on Twitter? pic.twitter.com/C6vCFGINv0 — Ghumman (@emclub77) December 12, 2021 Don’t create drama please with old videos. Check your facts first. No need to give fake masala, expect better from u.🙏🏼 https://t.co/Grw11Zz11P — Hassan Ali 🇵🇰 (@RealHa55an) May 31, 2021 -
అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్
Umpire Warns Hasan Ali Use Saliva To Shine Ball.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. కరోనా దృష్యా ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్లు బంతి పదును కోసం సలైవాను రుద్దడం నిషేధం. మార్చి 2020లో ఐసీసీ తీసుకొచ్చిన ఈ నిబంధనను బౌలర్లు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అయితే హసన్ అలీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిబంధనను అతిక్రమించి బంతి పదును కోసం సలైవా రుద్ది కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి: Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ ఇది చూసిన ఫీల్డ్ అంపైర్.. హసన్ అలీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇలా చేయడం మంచిది కాదని.. ఇంకోసారి రిపీట్ కావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వెర్నన్ ఫిలాండర్ కూడా హసన్ అలీతో మాట్లాడడం వైరల్‌గా మారింది. కోచ్ చెబితేనే ఇలా చేశాడా.. లేక ఉద్దేశపూర్వకంగానే హసన్ అలీ బంతికి సలైవా రుద్దాడా అనేది తెలియదు. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ బంతి పదును కోసం సలైవాను రెండుసార్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాగా హసన్ అలీ ఇప్పటికే రెండుసార్లు బంతికి సలైవా రుద్దాడు. ఇంకోసారి అదే తప్పు చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్ స్పిన్నర్ చెత్త రికార్డు.. 21 ఏళ్ల తర్వాత ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ ఓపెనర్ హబీద్ అలీ (133 పరుగులు) సెంచరీతో మెరవగా.. షఫీఖ్ 52 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 7 వికెట్లతో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులుకు ఆలౌటైంది. -
Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ
Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెనర్లు అబిద్ అలీ (93 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (52 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మరో 185 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 253/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్... మరో 77 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ముష్ఫికర్ (91; 11 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. హసన్ అలీ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా! .@AbidAli_Real and @imabd28 in conversation following their unbroken 145-run opening stand.#BANvPAK #HarHaalMainCricket pic.twitter.com/VtgcaQcso4 — Pakistan Cricket (@TheRealPCB) November 27, 2021 -
Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి..
Ban Vs Pak: Pakistan fielder engage in synchronized fielding during first Test Against Bangladesh: ఛాటోగ్రామ్ వేదికగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 95 ఓవర్ వేసిన హసన్ అలీ బౌలింగ్‌లో మెహదీ హసన్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే ఫీల్డర్లు ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్ బంతిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకేసారి పరిగెత్తడంతో పాటు యాదృచ్చికంగా ఒకేసారి డైవ్ కూడా చేశారు. చివరకు బంతిని దొరకబుచ్చుకున్నారు. దీంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్ ఆఫ్రిది, ఆస్రఫ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. మిడిలార్డర్ మిడిలార్డర్ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం 206 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (114),ముష్ఫికర్(91), మెహది హసన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IND Vs NZ: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. Synchronised fielding. LIVE COMMS: 👉https://t.co/KryaHg4P9S👈#BANvsPAK|#PAKvsBAN pic.twitter.com/RrJwXHCsXj — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 27, 2021 -
హసన్ అలీ కవ్వింపు చర్యలు.. బంగ్లాకు షాకిచ్చిన ఐసీసీ
Hasan Ali Reprimanded For Breaching ICC Code Of Conduct.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని ఐసీసీ మందలించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కవ్వింపు చర్యలకు గాను హసన్ అలీని హెచ్చరించింది. విషయంలోకి వెళితే.. బంగ్లా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హసన్ అలీ.. బంగ్లా బ్యాటర్ నురుల్ హసన్‌ను క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న నురుల్ హసన్‌ను టార్గెట్ చేస్తూ హసన్ అలీ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయంపై సీరియస్ అయిన ఐసీసీ.. ఆర్టికల్ 2.5 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవల్ 1 నిబంధన ఉల్లఘించిన హసన్ అలీని హెచ్చరికతో సరిపెట్టింది. దీంతోపాటు హసన్ అలీకి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో బంగ్లాకు షాక్ తగిలింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ జట్టు మొత్తం సహా సపోర్ట్ స్టాఫ్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది -
ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది
Pakistan Beat Bangladesh By 4 Wickets 1st T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. అయితే ఒక దశలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఫఖర్ జమాన్(34), కుష్దిల్ షా(34) మంచి ఇన్నింగ్స్ ఆడడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. కాగా స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో మరోసారి ఉత్కంఠ పెరిగింది. చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని అయితే షాదాబ్ ఖాన్(21 నాటౌట్), మహ్మద్ నవాజ్(18 నాటౌట్)లు బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ హసన్ అలీ దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అసిఫ్ హొస్సేన్(36), మెహదీ హసన్(30 నాటౌట్), నురుల్ హసన్(28) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 3, మహ్మద్ వసీమ్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా -
హసన్ అలీని తప్పుబడుతున్నారు.. మరి అఫ్రిది చేసిందేంటి
Virender Sehwag Slams Pakistan Fans Criticize Hasan Ali.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్‌లో హసన్ అలీ హీరో నుంచి జీరో అయ్యాడు. మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన హసన్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లతో వేడ్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు తిప్పేశాడు. అలా జట్టు ఓటమికి హసన్ అలీనే కారణమంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి తోడూ మ్యాచ్ అనంతరం బాబర్ అజమ్ మాట్లాడుతూ.. '' హసన్ అలీ క్యాచ్ జారవిడవడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్'' అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో హసన్ అలీ పాకిస్తాన్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆసక్తి కలిగించింది. దీంతో హసన్ అలీకి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్దతు పెరుగుతూ వస్తుంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ ఓటమికి హసన్ అలీని తప్పుబట్టడంపై ఫేస్బుక్ వేదికగా స్పందించాడు. చదవండి: T20 World Cup 2021: మొన్న షమీ, కోహ్లి.. ఇప్పుడు హసన్ అలీ ''ఒక జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోతే విమర్శలు రావడం సహజం. కానీ ఒక్క వ్యక్తినే తప్పుబడుతూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి చెందడం వెనుక హసన్ అలీ ఒక్కడే కారణం కాదు. అతను మాథ్యూ వేడ్ క్యాచ్‌ను డ్రాప్ చేసి ఉండొచ్చు.. మరి షాహిన్ అఫ్రిదిని తప్పుబట్టరా.. అతను పొదుపుగా బౌలింగ్ చేసి సిక్సర్లు ఇవ్వకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇక్కడ పాక్ అభిమానులు ఒకే కోణంలో ఆలోచిస్తూ అసలు విషయాన్ని వదిలేసి హసన్ అలీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొన్న న్యూజిలాండ్‌కు డారిల్ మిచెల్ ఎలాగో.. నిన్న మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ అలాగే కనిపించాడు. అతను జట్టును ఎలా ఫైనల్ చేర్చాడో.. వేడ్ కూడా అలానే చేర్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: T20 World Cup 2021: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు -
T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు
Hasan Ali Trolled For Dropping Matthew Wade Catch: టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, అజేయ జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్‌కు నవంబర్ 10న ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో శృంగ భంగమైంది. పాక్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కూడా ఆఖరి వరకు పాక్‌కు తిరుగులేదనిపించినా.. హసన్ అలీ చేసిన ఒకే ఒక్క పొరపాటు పాక్ కొంపముంచింది. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్.. మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. #Pakistan lost due to bad efforts by #HasanAli(@RealHa55an) on the field. He not only led #BabarAzam down but whole of Pakistan. it smells #fixing because he married an #Indian Samiya Arzoo.#T20WorldCup #PAKVSAUS #shaheenafridi #ImranKhan pic.twitter.com/4aszB900ZR — Rizwan Ahmad (@Rizwan_2Ahmad) November 12, 2021 ఈ నేపథ్యంలో హసన్ అలీ.. గతంలో(పాక్ చేతిలో భారత్ ఓడిన సందర్భంగా) టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమీ, విరాట్ కోహ్లిల మాదరే దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ మరింత శృతి మించిపోయింది. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు.. భారతీయురాలైన హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. Well done RAW Agent Samiya Arzoo👏👏 #HasanAli pic.twitter.com/d6fDAMrUo7 — AgentVinod (@AgentVinod03) November 11, 2021 మరోవైపు, హసన్ ఆలీ కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని స్వయానా పాక్ కెప్టెనే అభిప్రాయపడడంతో జట్టు సభ్యులెవరూ అతనికి మద్దతుగా నిలిచే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, హసన్ అలీపై జరుగుతున్న ఈ ఆన్లైన్ దాడిని భారత నెటిజన్లు మాత్రం ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా, భారత్‌కు చెందిన సమీయా అర్జోని హసన్ అలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమీయా అర్జోతో పాటు సెమీస్‌లో ఒక్క పరుగుకే ఔటైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను సైతం పాక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. Pakistani fans waiting for Hassan Ali back home #PAKvAUS pic.twitter.com/NgcavqXcVq — Farzan Tufail 🇵🇸 (@Farzantufail786) November 11, 2021 చదవండి: ఆసీస్‌తో కీలకపోరుకు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఫైనల్లో ఇక కష్టమే -
వారెవ్వా హసన్ అలీ.. అయ్యో విలియమ్సన్
Hasan Ali Strikes With Stunning Throw.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ స్టన్నింగ్ త్రోతో మెరిశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను తన బౌలింగ్‌లోనే అద్భుత రనౌట్‌తో పెవిలియన్ చేర్చాడు. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ను హసన్ అలీ వేశాడు. ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ ఢిపెన్స్ ఆడాడు. అయితే విలియమ్సన్ రిస్క్ అని తెలిసినప్పటికి సింగిల్‌కు ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కాన్వే వెనక్కి వెళ్లిపోవడంతో విలియమ్సన్ మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే హసన్ అలీ వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆ ఫలితాన్ని రిపీట్ చేస్తాం.. పాక్ పేసర్ వార్నింగ్
IND VS PAK T20 World Cup 2021.. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు మజానే. అందునా ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాదే ఆధిపత్యం. అయితే 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాకు తొలిసారి పాక్ చేతిలో పరాభవం ఎదురైంది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా యూఏఈ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను(అక్టోబర్ 24న) ఎదుర్కోనుంది. మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా పాక్‌పై విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఉవ్విళ్లూరుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి మ్యాచ్‌లో విజయం మాదేనని.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను పునరావృతం చేయనున్నామని ధీమా వ్యక్తం చేశాడు. ''2017లో భారత్‌ని ఓడించి మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి, భారత్‌తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా, మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఫఖర్ జమన్(114 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ విషయానికి వస్తే.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమన్ సెంచరీతో(114 పరుగులు) మెరవగా.. మరో ఓపెనర్ అజహర్ అలీ 59 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ హఫీజ్ 57 పరుగులతో రాణించాడు. అనంతరం 339 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పాక్ బౌలర్ల దాటికి 158 పరుగులకే కుప్పకూలి 180 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76 పరుగులు, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా(76 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 -
పాకిస్తాన్‌పై ఘన విజయం.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
లండన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో లూయిస్ గ్రెగరీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో (47 బంతుల్లో 40; 4 ఫోర్లు)... బౌలింగ్ (3/44)లో ఆకట్టుకున్నాడు. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ 52 పరుగులతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. కాగా తొలుత ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాల్ట్ (60; 10 ఫోర్లు), జేమ్స్ విన్స్ (56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. హసన్ అలీ 5 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 41 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు
దుబాయ్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు వరుసగా రెండో నెల కూడా భారత క్రికెటర్లు నామినేట్ కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్, మార్చిలో భువనేశ్వర్ కుమార్, ఏప్రిల్ నెలకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నారు. కాగా, మే నెలకు గాను నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్లో హసన్ అలీ(పాకిస్థాన్), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)లు నామినేట్ కాగా, మహిళల క్రికెట్లో క్యాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. The ICC Men's Player of the Month nominees for May are in 👀 Hasan Ali 🇵🇰 14 Test wickets at 8.92 Praveen Jayawickrama 🇱🇰 11 Test wickets at 16.18 Mushfiqur Rahim 🇧🇩 237 ODI runs at 79.00 Vote now 🗳️ https://t.co/PPTfbb1PT5#ICCPOTM pic.twitter.com/C9IFIyI35A — ICC (@ICC) June 8, 2021 మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో పాక్ యువబౌలర్హసన్అలీ 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టి ఈ నెల ఐసీసీ అవార్డుల రేసులో ముందుండగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్ప్రవీణ్ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి, హసన్‌అలీకి గట్టి పోటీగా నిలిచాడు. మరోవైపు బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు చేసి, తాను కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఉన్నానని సవాల్ విసురుతున్నాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్ గెలిచింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్ అయ్యాక 20 రోజులు రిలాక్స్ -
కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య..
ఇస్లామాబాద్: టీమిండియా డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో అతనికి దాయాది దేశమైన పాక్‌లోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాక్ యువతి రిజ్లా రెహాన్ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది పాక్ అమ్మాయిలు.. బహిరంగంగా కోహ్లీకి లవ్ ప్రపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్లకార్డ్‌ని ప్రదర్శించింది. తాజాగా కోహ్లీ అభిమానుల జాబితాలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య షామియా ఆర్జూ కూడా చేరింది. ఇటీవల, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన షామియా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించంది. ‘‘నీ ఫేవరెట్ బౌలర్ కచ్చితంగా హసన్ అలీనే అయ్యుంటాడు. మరి నీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎవరు.. ?’’ అని ఆ నెటిజన్ ప్రశ్నించడంతో.. ఆమె టక్కున విరాట్ కోహ్లీ పేరు చెప్పింది. ఇదిలా ఉంటే, షామియా స్వస్థలం భారత్‌లోని హర్యానా రాష్ట్రం. వాళ్ల ఫ్యామిలీ ప్రస్తుతం ఢిల్లీలో సెటిలైంది. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న షామియాని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ మూడేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాడు. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పట్లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్ వేరు -
ఐసీసీ ర్యాంకింగ్స్: అశ్విన్ ఒక్కడే.. పాక్ బౌలర్ల కెరీర్ బెస్ట్
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్లు సత్తా చాటారు. హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నుమాన్ అలీలు ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్ బెస్ట్‌ను అందుకున్నారు. హసన్ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలవగా.. షాహిన్ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో.. నుమాన్ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో ఈ త్రయం ముఖ్యపాత్ర పోషించింది. అందునా ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఐదు వికెట్లు తీయడం విశేషం. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హసన్ అలీ(5-27) ఐదు వికెట్లతో మెరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది(5-52), నుమాన్ అలీ(5- 86)తో మెరిశారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. ఇక టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్‌టెన్‌లో నిలిచాడు. అశ్విన్ (850 పాయింట్లతో) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. బుమ్రా 11వ స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో కమిన్స్(908 పాయింట్లు), నీల్ వాగ్నర్( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు. చదవండి: 'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు' 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' Pakistan players make significant gains after the successful #ZIMvPAK Test series 📈 More on the latest @MRFWorldwide ICC Test Player Rankings 👇 — ICC (@ICC) May 12, 2021 How impressed are you with Hasan Ali? 🤩 pic.twitter.com/BSvaGjlzTf — ICC (@ICC) May 11, 2021 -
ZIM Vs PAK: అబిద్ అలీ ‘డబుల్’.. పాక్‌దే టెస్టు సిరీస్
హరారే: జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 220/9తో ఆట కొనసాగించిన జింబాబ్వే ఐదు ఓవర్లు ఆడి తమ చివరి వికెట్‌కు కోల్పోయింది. ల్యూక్ జాంగ్వే (37)ను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది (5/52) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా, హసన్ అలీ (5/86) కూడా పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. కాగా మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్, జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను 2-1, టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. చదవండి: మా జట్టే అన్ని ఫార్మాట్లలో నెం.1: అబ్దుల్ రజాక్ -
'ఈ అవార్డు నా చిట్టితల్లికి అంకితం'
హరారే: పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం జింబాబే దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న పాక్ రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. జింబాబ్వేతో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన హసన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఓవరాల్‌గా 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం పాక్ క్రికెటర్ హసన్ అలీకి 2019లో వివాహమైంది. 'గత ఏప్రిల్ నెలలో హసన్ అలీకి కూతురు పుట్టింది. కూతురు రాక అతని అదృష్టం కలిసొచ్చిందంటూ' ఒక జర్నలిస్ట్ ట్విటర్లో కామెంట్ చేశాడు. దీనిపై హసన్ అలీ రీట్వీట్ చేశాడు. '' నా కూతురు పుట్టినప్పటి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. నా కూతురే దేవుడి రూపంలో నా వెంట ఉంటూ నాకు ఆశీర్వాదం అందించింది. అందుకే ఈరోజు మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అందుకే నాకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది అవార్డును నా చిట్టితల్లికి అంకితమిస్తున్నా. నా కూతురును చాలా మిస్సవుతున్నా.. కానీ బందుత్వం కంటే దేశానికి ఆడాలనేది నా మొదటి ప్రాధాన్యత.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హసన్ అలీ పాక్ తరపున 12 టెస్టుల్లో 52, 54 వన్డేల్లో 83, 36 టీ20ల్లో 48 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ బ్యాటింగ్‌లో పవాద్ ఆలమ్ 140 పరుగులతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌట్ అయి ఇన్నింగ్స్ 116 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా రెండో టెస్టు మే 7 నుంచి 11 వరకు జరగనుంది. చదవండి: మరణించిన క్రికెటర్‌కు ‘హ్యాపీ బర్త్‌డే‘ చెప్పిన బోర్డు! -
ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్ అలీ, పాక్ ఘనవిజయం
హరారే: మీడియం పేస్ బౌలర్ హసన్ అలీ (5/36) హడలెత్తించడంతో... జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 116 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 374/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 133 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (140; 20 ఫోర్లు) తన ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో 32 పరుగులు జోడించి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. హసన్ అలీ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి ఫవాద్ ఆలమ్ ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో తరిసాయ్ మసకందా (43; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు, నౌమాన్ అలీ రెండు వికెట్లు తీశారు. హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. రెండో టెస్టు ఈనెల 7 నుంచి హరారేలోనే జరుగుతుంది. చదవండి: T20 World Cup: వేదిక మారినా హక్కులు మావే! -
దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన పాక్ జట్టు
రావల్పిండి: తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన పేసర్ హసన్ అలీ (5/60) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్ 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్ 95 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాపై గెలుపొంది సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సఫారీలపై పాక్ చివరగా 2003లో సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో దక్కించుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యఛేదనలో సోమవారం దక్షిణాఫ్రికా అనూహ్యంగా తడబడింది. ఓవర్‌నైట్ స్కోరు 127/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 274 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మార్క్రమ్ (108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా... తెంబా బవుమా (61; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టును 241/3తో పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ దశలో పేసర్లు హసన్ అలీ, షహీన్ అఫ్రిది (4/51) విజృంభించడంతో దక్షిణాఫ్రికా మరో 33 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 10 వికెట్లు దక్కించుకున్న హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రిజ్వాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. -
పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే
కరాచీ: టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్‌లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో వన్డే తరహా ఇన్నింగ్స్‌లను చూడడం అరుదు.. అలాంటిది పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్‌తో అదుర్స్ అనిపించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ బ్యాట్స్‌మన్ అంత ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో చివరి వికెట్ పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ట్రోపిని ఇరుజట్లు పంచుకున్నాయి. అయితే ఇదంతా పాక్ దేశవాళి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చోటుచేసుకుంది.(చదవండి : బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?) క్వాయిడ్-ఎ-అజామ్ టోర్నీలో భాగంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, సెంట్రల్ పంజాబ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా సెంట్రల్ పంజాబ్ ముందు 355 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి సెంట్రల్ జట్టు 202 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హసన్ అలీ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. టీ20 తరహాలో 61 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా అలీ మాత్రం సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని విధ్వంసం ధాటికి కొండంత లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. సెంట్రల్ పంజాబ్ 319 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయినా.. జట్టు చివరి బ్యాట్స్‌మన్ వకాస్ మసూద్ సహకారంతో అలీ తన బ్యాటింగ్ కొనసాగిస్తూ.. 355 పరుగుల దాకా తీసుకొచ్చి స్కోరును సమం చేశాడు. ఇంకా ఒక్క పరుగు చేస్తే సెంట్రల్ పంజాబ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఉండేది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకుంది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) ఇన్నింగ్స్ 118వ ఓవర్‌ను సాజిద్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులను సమర్థంగా ఎదుర్కొన్న వకాస్ మసూద్‌ను సాజిద్ తన మూడో బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సెంట్రల్ పంజాబ్ 355 పరుగుల వద్ద చివరి వికెట్ కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో సెంచరీ చేసి కూడా జట్టును గెలిపించలేకపోయాననే భావనతో హసన్ అలీ నిరాశగా మైదానంలో కూలబడ్డాడు. కేవలం ఒక్క పరుగు చేసుంటే సెంట్రల్ పంజాబ్ విజయం దక్కడంతో పాటు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన అలీ మ్యాచ్ ఆఫ్ ది స్టార్‌గా నిలిచేవాడు.కాగా ఈ వీడియోనూ ఐసీసీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.'అలీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.. పాపం తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో.. ఏ గ్రేట్ షో బై హసన్ అలీ ' అంటూ కామెంట్లు పెడుతూ అలీని పొగడ్తలలో ముంచెత్తారు. 🇵🇰 INCREDIBLE SCENES 🤯 Central Punjab captain Hasan Ali smoked 106* from 61 on the last day of the Quaid-e-Azam Trophy final 🔥 With scores level, Khyber Pakhtunkhwa's Sajid Khan snared the final wicket to leave the match tied and the trophy shared! 🏆pic.twitter.com/x1GSZIa4ks — ICC (@ICC) January 5, 2021 -
సిగ్గుందా: పాక్ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్!
పాకిస్తాన్ క్రికెటర్, హరియాణా అల్లుడు హసన్ అలీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఆటను వదిలావు సరే.. మరి మోడలింగ్ ఎందుకు చేస్తున్నావు. కాస్తైనా సిగ్గుండాలి నీకు... ఇప్పుడు గాయం అడ్డురావడం లేదా. నిన్ను అసలు మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోకూడదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాక్ జట్టులో స్థానం కోల్పోయిన హసన్.. ర్యాంప్ వాక్ చేయడమే వారి ఆగ్రహానికి కారణం. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాక్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబరు 11) నుంచి రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. కాగా హసన్ అలీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టెస్టు మ్యాచ్ కోసం జరిగిన సెలక్షన్స్‌లో పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న కారణంగా అలీని పక్కన పెట్టారు. అదే విధంగా ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు సైతం అలీ అందుబాటులో లేడు. అయితే ప్రస్తుతం ఓ కార్యక్రమం సందర్భంగా హసన్ అలీ ర్యాంప్ వాక్ చేస్తూ.. ఉత్సాహంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో.. ‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే ర్యాంప్ వాక్ చేస్తూ బాగానే ఉన్నావే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ పాకిస్తాన్ తరఫున 53 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడాడు. ఆగస్టులో భారత్‌కు చెందిన యువతిని అతడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. Fractured ribs and out of cricket, but Hassan Ali's fit for some modelling pic.twitter.com/qTx0BXyed2 — Saj Sadiq (@Saj_PakPassion) December 8, 2019 -
‘మేము భార్యాభర్తలమా ఏంటి?’
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, పేస్ బౌలర్ హసన్ అలీలు మంచి స్నేహితులు. షాదాబ్ ఆరంగేట్రం చేసినప్పటి నుంచి హసన్‌తో కలిసి ప్రతీ సిరీస్ ఆడాడు. అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో హసన్-షాదాబ్‌లు పాల్గొనడంతో వీర్దిదరి మధ్య మంచి సన్నిహితం ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌కు వెన్నునొప్పి కారణంగా హసన్ అలీ దూరమయ్యాడు. దీంతో తొలిసారి హసన్ లేకుండా షాదాబ్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఇదే విషయాన్ని ఓ మీడియా సమావేశంలో ‘హసన్ అలీ లేకుండా తొలిసారి ఆడుతున్నారు.. ఎలా ఫీలవుతున్నారు?’అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి షాదాబ్ ఇచ్చిన సమాధానంతో అక్కడ ఉన్నవారంతా తెగ నవ్వడం మొదలుపెట్టారు. ఇంతకీ షాదాబ్ ఏమన్నాడంటే.. ‘హసన్, నేను భార్యభర్తలం అనుకుంటున్నారే ఏంటి? మీరు అడిగిన విధానం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తోంది(దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా నవ్వుకున్నారు)’అంటూ షాదాబ్ సరదాగా పేర్కొన్నాడు. అనంతరం ‘హసన్, నేను మంచి స్నేహితులం. చాలా రోజులుగా ప్రతీ సిరీస్‌లో పాల్గొంటున్నాం. ఈ సిరీస్‌లో నేను మాత్రమే కాకుండా జట్టు సభ్యులందరూ హసన్ అలీని మిస్సవుతున్నారు. సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తాడు’అంటూ షాదాబ్ హసన్‌ను ప్రశంసించాడు. ఇక షాదాబ్ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు షాదాబ్ టైమింగ్‌ను మెచ్చుకుంటూ కొనియాడుతున్నారు. -
శ్రీలంకతో సిరీస్: కొత్త పెళ్లికొడుకు దూరం
కరాచీ: స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చీఫ్ సెలక్టర్, హెడ్ కోచ్ మిస్బావుల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం సుదీర్ఘ మంతనాలు జరిపిన అనంతరం జట్టులో పలు మార్పులు చేసింది. పాక్ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని కొత్త పెళ్లికొడుకు, హరియాణా అల్లుడు హసన్ అలీని జట్టులోకి తీసుకోలేదు. హరియాణా యువతితో హసన్ అలీ వివాహం గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఇక హసన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదని, అందుకే అతడికి విశ్రాంతినిచ్చామని మిస్బావుల్ తెలిపాడు. అంతేకాకుండా సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్‌ను పక్కకు పెట్టారు. పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న మహ్మద్ అమిర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ‘క్రికెట్లో గెలవడానికి సులువైన జట్లు, బలహీన ప్రత్యర్థులు ఉండరు. అనుభవం లేని ఆటగాళ్లు వచ్చినా.. సీనియర్ క్రికెటర్లు వచ్చినా మేము బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. (భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాక్ పర్యటనకు ఆసక్తి చూపకపోవడంతో.. జూనియర్ ఆటగ్లాను పంపించాలనే ఆలోచనలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఉంది. ఈ నేపథ్యంలో మిస్బావుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.) ఐదుగురు కొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదు. అన్ని విభాగాల్లో పాక్ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం’అంటూ మిస్బావుల్ పేర్కొన్నాడు. పాక్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), బాబర్ అజమ్(వైస్ కెప్టెన్), అబిద్ అలీ, ఆసిఫ్ ఆలీ, పఖర్ జామన్, హారీస్ సోహైల్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమాముల్ హక్, అమిర్, మహమ్మద్ హస్నైన్, నవాజ్, రియాజ్, షాదాబా ఖాన్, ఉస్మాన్ షిన్వారీ, వాహబ్ రియాజ్. -
హర్యానా యువతితో పాక్ క్రికెటర్ నిఖా
మరికొద్ది గంటల్లో మరో పాకిస్తానీ క్రికెటర్ భారత యువతిని పెళ్లాడనున్నాడు. పాకిస్తాన్ యువ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ హర్యానాకు చెందిన షమియా అర్జూతో మంగళవారం నిఖా చేసుకోనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో వీరి వివాహం చాలా సింపుల్‌గా, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని హసన్ అలీ సన్నిహితుడు పేర్కొన్నాడు. ఇక హసన్ అలీ సోమవారం తన అత్యంత సన్నిహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘బ్యాచిలర్‌గా చివరి రాత్రి’అంటూ ట్వీట్ చేశాడు. హసన్ ట్వీట్‌పై సానియా మీర్జా స్పందించారు. ‘హసన్‌కు అభినందనలు, మీరిద్దరూ జీవితాంతం ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కలిసినప్పుడు మంచి ట్రీట్ ఇవ్వాలి’అంటూ సానియా శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత యువతను పెళ్లాడుతున్న నాలుగో పాక్ క్రికెటర్‌గా హసన్ నిలువనున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్, షోయాబ్ మాలిక్‌లు కూడా భారత యువతులనే పెళ్లాడిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా హసన్ అలీ, షమియా అర్జూలు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చోసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో ఈ వార్తలను హసన్ ఖండించాడు. అనంతరం తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, కానీ వివాహానికి సమయం పడుతుందని తెలిపిన విషయం తెలిసిందే. దుబాయ్‌లోనే వీరి ప్రేమ చిగురించిందని, కామన్ ఫ్రెండ్ ద్వారా షమియాతో పరిచయం ఏర్పడిందని హసన్ పేర్కొన్నాడు. ఎరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన షమియా.. ప్రస్తుతం ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తోంది. -
నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్ క్రికెటర్
కరాచీ : పాకిస్తాన్ పేస్ బౌలర్ హసన్ అలీ భారత్‌కు చెందిన షమీయా అర్జూను వివాహమాడుతున్నాడు. వచ్చే నెల 20వ తేదీన దుబాయ్‌లోని హోటల్‌ను ఈ నిఖా తంతు జరుగనుంది. అయితే తమ పెళ్లికి రావాలంటూ భారత క్రికెటర్లను హసన్ అలీ ఆహ్వానించనున్నాడు. ఈ విషయాన్ని హసల్ అలీ తాజాగా స్పష్టం చేశాడు.‘ భారత క్రికెట్ జట్టును, ఆటగాళ్లను నా పెళ్లికి ఆహ్వానిస్తా. మేమంతా క్రికెటర్లమే. మా మధ్య పోరు ఫీల్డ్‌లోనే కానీ బయట కాదు. నా పెళ్లికి భారత క్రికెటర్లు వస్తే చాలా సంతోషిస్తా’ అని హసన్ అలీ పేర్కొన్నాడు. షమీయా అర్జూతో తన వివాహాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాంతో తాను అధికార ప్రకటన చేయాలని నిర్ణయించుకుని పెళ్లికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే బహిరంగ ప్రకటన చేశానని హసన్ అలీ చెప్పుకొచ్చాడు. హరియాణా రాష్ట్రానికి చెందిన షమీయా భారత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్‌గా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పరిణయం దాకా వచ్చింది. -
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్
కరాచీ : మరో పాకిస్తాన్ క్రికెటర్ భారత్‌కు అల్లుడవుతున్నాడు. పేస్ బౌలర్ హసన్ అలీ హరియాణాకు చెందిన షమీమా అర్జూను వివాహమాడనున్నాడు. వచ్చేనెల 20న దుబాయ్‌లోని హోటల్లో ఈ నిఖా తంతు జరుగుతుందని క్రికెటర్ సన్నిహితులు వెల్లడించారు. హరియాణా అమ్మాయి అయిన షమీమా దుబాయ్‌లో స్థిరపడింది. భారత్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లింది. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్‌గా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పరిణయం దాకా వచ్చింది. పెళ్లి సంగతి నిజమే కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదని హసన్ అలీ చెప్పాడు. మరోవైపు పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో వేడుక జరుగనుందని సన్నిహితులు పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత యువతిని పెళ్లి చేసుకుంటున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ. ఇదివరకు జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్, షోయబ్ మాలిక్‌లు భారత వధువుల్ని వివాహమాడారు. షోయబ్ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడగా వీరికి ఓ కొడుకు (ఇహాన్ మీర్జా మాలిక్) పుట్టాడు. -
ట్వీట్‌ను డిలీట్ చేసిన పాక్ క్రికెటర్!
మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో భాగంగా గత ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్ ఘోర పరాజయం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మాద్. ఫిట్నెస్, మ్యాచ్ మధ్యలో ఆవలించడం, అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా పాక్ బౌలర్ హసన్ అలీ తాను చేసిన ట్వీట్ దుమారం రేపడంతో అతను వార్తల్లో నిలిచాడు. పాకిస్తాన్-ఇండియా మ్యాచ్ తర్వాత ఆజ్‌తక్ ఛానెల్ విలేకరి ముమ్తాజ్ ఖాన్ ‘అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన టీమిండియాకు కంగ్రాట్స్, వరల్డ్‌కప్ గెలవాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్ చేశారు. ‘మీ ఆకాంక్ష నెరవేరుతోంది, కంగ్రాట్స్’ అంటూ హసన్ అలీ ఆమెకు రిప్లై ఇచ్చాడు. అయితే అభిమానుల నుంచి విమర్శలు వెలువెత్తిన కారణంగా వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఇక హసన్ అలీపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగాడు. ‘హసన్ అలీ వాఘా బోర్డర్ వెళ్లి తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ అదే ఉత్సాహాన్ని వరల్డ్‌కప్‌లో ఎందుకు ప్రదర్శించట్లేదు?’ అని ప్రశ్నించాడు. ఇదిలా ఉంచితే, భారత్‌తో మ్యాచ్‌లో హసన్ అలీ కేవలం వికెట్ మాత్రమే తీసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్ మొత్తానికి అదే చెత్త ప్రదర్శనగా నమోదైంది. -
కోహ్లి లేని భారత్‌కు కష్టమే: పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్: ఆసియాకప్‌లో పాల్గొనే భారత జట్టులో విరాట్ కోహ్ల లేకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ తెలిపాడు. ఏ బౌలరైనా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలని ఆరాటపడటం సహజమని, తాను కూడా కోహ్లి వికెట్ తీసి తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి వికెట్ తీస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ ఎంతో సంతోషపడేవారని వివరించాడు. 2017 చాంపియన్‌ట్రోఫి ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో అమిర్ బౌలింగ్‌లో కోహ్లి త్వరగానే ఔట్ కావడంతో అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదన్నాడు. త్వరలోనే కోహ్లికి తన బౌలింగ్ సెగ చూపించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని అలీ తెలిపాడు. మా టార్గెట్ టీమిండియానే కాదు.. ఆసియా కప్‌లో తమ టార్గెట్ ఒక్క టీమిండియానే కాదని టోర్నీ గెలవడమే పాక్ లక్ష్యమని అలీ పేర్కొన్నాడు. కోహ్లి లేకపోవడం తమకు సానుకూలమైన అంశమని అభిప్రాయపడ్డాడు. కోహ్లి లేని భారత్‌కు ఆసియా కప్‌లో కష్టమేనని.. తమ చేతిలో ఓటమి తప్పదని అలీ పేర్కొన్నాడు. చాంపియన్‌ట్రోఫి ఓడిపోయిన అనంతరం తలపడే మ్యాచ్ కాబట్టి టీమిండియాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని పాక్ బౌలర్ స్పష్టంచేశాడు. యూఏఈలోని వాతావరణం, మైదానాలు తమ దేశాన్ని తలపిస్తాయని.. చాలా సిరీస్‌లు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి టోర్నీ ఫేవరేట్ తమ జట్టేనని హసన్ అలీ తెలిపాడు. ఈ నెల 15న యూఏఈ వేదికగా ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. 19న పాకిస్తాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. -
వికెట్ తీసిన ఆనందంలో గంతేస్తే..
హరారే: వికెట్ తీయగానే బౌలర్లు ఎగిరిగంతేస్తారు. ఇక్కడ ఒక్కో బౌలర్ ఒక్కో సిగ్నేచర్ స్టెప్‌తో అలరిస్తారు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ముఖ్యంగా విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వికెట్ తీయగానే అతడు వేసే స్టెప్పులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఇలా వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమంలో బౌలర్ గాయపడటం అనేది చాలా అరుదు. అయితే పాక్ బౌలర్ హసన్ అలీ వికెట్ తీసిన ఆనందంలో గాయపడ్డాడు. హసన్ అలీ వికెట్ తీయగానే తనదైన రీతిలో సిగ్నేచర్ స్టైల్ (బాంబ్ ఎక్స్ప్లోజన్)తో పాక్ అభిమానులను అలరిస్తుంటాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో హసన్ అలీ ఆతిథ్య బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయగానే తనదైన రీతిలో సంబరాలు ప్రారంభించాడు. తన స్టైల్లో ఆనందం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెడ కండరాలు పట్టేశాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లు పాక్ బౌలర్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడితే.. మరికొందరు జాలి పడుతున్నారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) అలీ గాయం అంత తీవ్రతరమైనది కాదని పేర్కొంది. -
వికెట్ తీసి సంబరాలు చేసుకునే క్రమం
-
‘బీటింగ్ రిట్రీట్’లో పాక్ క్రికెటర్ అతి
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య అట్టారి–వాఘా సరిహద్దులో నిర్వహించే జెండా అవనత కార్యక్రమం ‘బీటింగ్ రిట్రీట్’ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. శనివారం బీటింగ్ రిట్రీట్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి పాక్ రేంజర్లు కవాతు చేస్తున్న చోటుకు దూసుకొచ్చిన అలీ.. భారత అభిమానుల వైపు తిరిగి తొడలు చరుస్తూ, రెండు చేతులు గాల్లోకి లేపి వికెట్లు తీసినట్లు సంబరాలు చేసుకున్నాడు. అనంతరం మరో వ్యక్తి అతడిని వెనక్కు తీసుకెళ్లాడు. దీంతో ఈ ఘటనపై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై బీఎస్ఎఫ్ ఐజీ(పంజాబ్ ఫ్రాంటియర్) ముకుల్ గోయల్ మాట్లాడుతూ..‘ అలీ చర్య బీటింగ్ రిట్రీట్కున్న గౌరవాన్ని దెబ్బతీసింది. ఇరుదేశాల పౌరులు గ్యాలరీలో కూర్చొని ఎలాంటి సంజ్ఞలనైనా చేయొచ్చు. కానీ కవాతు మధ్యలోకి ఇలా రావడానికి వీల్లేదు. ఈ ఘటనపై పాకిస్తాన్ రేంజర్లకు మా నిరసన తెలియజేస్తాం’ అని వెల్లడించారు. అలీ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్వీటర్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
పాక్ యువ క్రికెటర్‌పై భారత సైన్యం ఆగ్రహం
-
పాక్ క్రికెటర్ చేష్టలు.. భగ్గుమన్న భారత సైన్యం
సాక్షి, న్యూఢిల్లీ : పాక్ యువ క్రికెటర్ హసన్ అలీపై భారత సైన్యం ఆగ్రహంతో ఊగిపోతోంది. అట్టరీ-వాఘా సరిహద్దులో భారత్-పాక్ దళాల బీటింగ్ రిట్రీట్ సమయంలో హసన్ చేసిన నిర్వాకమే ఇందుకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం భారత్ తరపున బీఎస్ఎఫ్.. పాక్ తరపున రేంజర్లు రెచ్చగొట్టే సంజ్ఞలతో అక్కడ హాజరయ్యే ఇరు దేశాల ప్రజలను అలరిస్తుంటారు. ఆనవాయితీగా జరిగే ఈ ప్రదర్శన మధ్యలో ఎవరూ రావటానికి వీల్లేదు. కానీ, పాక్ క్రికెటర్ హసన్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. గ్యాలరీ నుంచి లేచి వచ్చి పరుగు పరుగున మధ్యలో నిల్చుని వికెట్లు తీసే సమయంలో చేసే తన మార్క్ సంజ్ఞను ప్రదర్శించాడు. అయితే ఈ క్రమంలో అతను బీఎస్ఎఫ్ దళాలు, భారతీయుల ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ రెచ్చగొట్టే చేష్టలు చేశాడు. ఈ చర్యలపై భారత సైన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘ఇలాంటి చర్యలను మేం ఉపేక్షించబోం. పెరేడ్ తర్వాత ఎవరూ ఇలాంటి చేష్టలు చేసినా మేం పట్టించుకునేవాళ్లం కాదు. కానీ, మధ్యలో వచ్చి ఇలా రెచ్చిపోవటం ముమ్మాటికీ ఖండించదగ్గ అంశమే. ఈ మేరకు హసన్‌తో క్షమాపణలు చెప్పించాలని.. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని పాక్ సైన్యానికి లేఖ రాశాం’ అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అఫ్రిది.. నువ్వు ఎక్కడ పుట్టావ్? అయితే పాక్ సైన్యం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా నోరు మెదపలేదు. మరోపక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం తమ ఆటగాళ్లు వాఘాను సందర్శించిన ఫోటోలను ట్వీటర్లో పోస్టు చేయగా.. డాన్ పత్రిక హసన్ చేసిన పనిని కొనియాడుతూ ఓ కథనం ప్రచురించింది. బీటింగ్ రిట్రీట్ గురించి... ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది. -
ఇంగ్లండ్ కు పాక్ బౌలర్ల షాక్..
► 211 పరుగులకు ఆలౌట్ కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో పాక్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాక్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. టోర్నిలో ఆడిన అన్ని మ్యాచులు గెలిచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్‌కు పాక్ బౌలర్లు షాక్ ఇచ్చారు. హసన్ అలీ 3/35, రుమాన్ రయీస్ 2/44, జునైద్ ఖాన్ 2/42 ల దాటికి ఇంగ్లండ్ 211 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్ ఆడుతున్నపాక్ బౌలర్ రుమాన్ రయూస్ ఓపెనర్ హెల్స్(13)ను అవుట్ చేసి దెబ్బకొట్టాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బెయిర్ స్టో(43), జోరూట్ (46), బెన్ స్టోక్స్(34), మోర్గాన్(33)లు పొరాడినా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోక పోవడం, భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్ పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్నిఉంచింది. -
పాకిస్తాన్‌దే టి20 సిరీస్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను పాకిస్తాన్ జట్టు కైవసం చేసుకుంది. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో పాక్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3–1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఓపెనర్ చాడ్విక్ వాల్టన్ (31 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రాత్‌వైట్ (24 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. షెహజాద్ (45 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవా ర్డు దక్కగా... షాదాబ్ ‘ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. -
అదరగొట్టిన అలీ.. పాక్ ఘన విజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టి20ల సిరీస్ ను 3-1తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో విండీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్ దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వాల్టన్(40), బ్రాత్ వైట్(37), శామ్యూల్స్(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రెండు మేడిన్ ఓవర్లు వేశాడు. షదబ్ ఖాన్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 125 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 127 పరుగులు సాధించింది. అహ్మద్ షెహజాద్(53), కమ్రాన్ అక్మల్(20), బాబర్ ఆజామ్(38) రాణించారు. హసన్ అలీకి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. షదబ్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్నాడు. -
దొంగబాబా అరెస్టు
ఎమ్మిగనూరు(కర్నూలు): పూజల పేరుతో ప్రజల్ని మోసగిస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న హసన్ అలీ అలియాస్ తాజుద్దీన్ క్షుద్ర పూజలతో స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్టు చేసి విచారణ చేశారు. దీంతో అతడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం దొంగ బాబా పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నాడు. పులివెందులలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
'బిగ్‌బాస్ ఎవరో బయటపెట్టండి'
హైదరాబాద్ : విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తెప్పించే ఉద్దేశంతో కేంద్రం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడాన్ని ఏపీ అసెంబ్లీ అభినందించింది. నల్లధనం తీర్మానంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తెప్పించేందుకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న కృషి హర్షనీయమన్నారు. నల్లధనంపై తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా నల్లధనంపై సభలో వాగ్వాదం జరిగింది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. స్టాక్ మార్కెట్ బ్రోకర్ హసన్ అలీ పేర్కొన్న బిగ్‌బాస్ ఎవరో వెల్లడించాలని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2004కు ముందు ఇద్దరు సీఎంలు ఎన్నికల కోసం డబ్బులు తెప్పించుకున్నారంటూ హసన్ అలీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన... ఆ వివరాలను కూడా సిట్‌కు అందిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ఆ నియోజకవర్గాల ప్రజలను అడగాలని జగన్ అన్నారు. ఐఎంజీ కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నారు అవినీతిపై పోరాటమంటూ పదే పదే మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... ఐఎంజీ కేసులో ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఐఎంజీ కేసులో చంద్రబాబు స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకోగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై చాలా కేసులు ఉన్నాయన్నారు. బాబు జమానా అవినీతి ఖజానాపై స్పందించండి అవినీతిపై సిట్ ఏర్పాటును అభినందిస్తూ ఏపీ శాసనసభలో చేసిన తీర్మానంపై చర్చలో భాగంగా సభానాయకుడు చంద్రబాబు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేసిన ఆరోపణలపై విపక్షనేత వైఎస్ జగన్ దీటుగా స్పందించారు. బాబు పాలనపై సీపీఐ వేసిన 'బాబు జమానా అవినీతి ఖజానా' విషయాలను కూడా చంద్రబాబు పేర్కొని ఉంటే ఇంకా బాగుండేదని చురకలంటించారు. వారు ఏం చేశారన్నది వారి మనస్సాక్షికి తెలుసు అని జగన్ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలను లాక్కోవడమే పని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడమే పక్కకు పెట్టి ఇతర పార్టీల నేతలను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని టీడీపీపై వైఎస్ జగన్ మో హన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి లాక్కుంటూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ, ఎమ్మెల్సీలను సైతం ప్రలోభపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏడుగురు కౌన్సిల్ సభ్యులను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్షమనేది లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ దాడుల్లో 17మంది చనిపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఎన్నికల్లో ఓట్లు వేయనివారిపై దాడులకు దిగటమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. రైతుల తోటలు ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ దాడుల్లో తమ పార్టీకి చెందిన 17మంది చనిపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 110మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. తప్పులు జరిగినప్పుడు చర్యలు తీసుకునే నాయకత్వం కావాలని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కనీసం ఖండించడం కూడా చేయలేదని మండిపడ్డారు. కాగా సభలో లేనటువంటి సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని వైఎస్ జగన్ అన్నారు. వారిపై అభాండాలు వేయటం సరికాదని జగన్ అన్నారు. ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు కుట్రలు, కుతంత్రాలు మాని రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై దృష్టి పెట్టాలని వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే వారికి ఓటేసిన ప్రజలే ప్రతిపక్షంగా మారతారని హెచ్చరించారు. తాము కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేదా అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనిపై గుండెలపై చెయ్యేసుకొని చెప్పండంటూ సవాల్ విసిరారు. Follow @sakshinews -
నల్లధనంపై నేడే ‘సిట్’ భేటీ
న్యూఢిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సిట్ అధినేత, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో సిట్ వైస్ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్తోపాటు 11 ఉన్నత విభాగాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. నల్లధనంపై ప్రభుత్వ విధానం, ఇప్పటివ రకు జరిగిన దర్యాప్తుల్లో వెలుగుచూసిన అంశాలు, బ్లాక్‌మనీకి సంబంధించి వివిధ విభాగాల వద్ద ఉన్న సమాచారంపై ఇందులో చర్చించనున్నారు. తమ దర్యాప్తుల్లో వెల్లడైన సమగ్ర సమాచారంతో ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆయా విభాగ ఉన్నతాధికారులను కోరారు. హసన్ అలీ ఉదంతంతోపాటు నల్లధనానికి సంబంధించిన ఇతర కేసులూ భేటీలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే విచారణ మొదలైన, పెండింగ్‌లో ఉన్న, మొదలు కావాల్సిన, లేదా పూర్తయిన అన్ని కేసులపైనా సిట్‌కు న్యాయ పరిధి ఉంటుందని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం తెలిపింది. తన పనితీరు, కేసుల పురోగతిపై సిట్ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికలు సమర్పించనుంది. సిట్ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో రెవెన్యూ విభాగం కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) డెరైక్టర్, సీబీఐ డెరైక్టర్, సీబీడీటీ చైర్మన్, జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెరైక్టర్, ‘రా’ కార్యదర్శి, ఆర్థికశాఖ (విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన) సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొనున్నారు. -
హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి
నల్లధనంపై విచారణ బాబుతోనే ప్రారంభించాలి ఎన్డీఏ సర్కారుకు వైఎస్సార్ సీపీ డిమాండ్ హైదరాబాద్:రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశాలకు తరలించానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ గతంలో సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంపై ఎన్డ్ఏ ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం సరిహద్దులు దాటి వెళ్లిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం పట్ల తమ పార్టీ హర్షం వ్యక్తంచేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. 1995 - 2005 మధ్య కాలంలో ఓ మాజీ ముఖ్యమంత్రికి చెందిన నల్ల డబ్బును తాను విదేశాలకు చేరవేశానని హసన్ అలీ సీబీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయని.. ఆ మాజీ ముఖ్యమంత్రి జీవించే ఉన్నారని కూడా అతడు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు. హసన్అలీ సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఇచ్చినట్టు చెపుతున్న ఈ వాంగ్మూలం మీద ఎన్డీఏ ప్రభుత్వం తొలి విచారణ చేపట్టాలన్నారు. హసన్ అలీ చెప్పిన దానిని బట్టి.. సదరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని తెలిసిపోతోందని, అందువల్ల విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ వెల్లడవుతాయని పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామి కనుక బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపకుండా ఉపేక్షిస్తుందా? హసన్ అలీ చెప్పిన విషయాలను మరుగు పరుస్తోందా? అనే అంశాలను బట్టి వారి నిష్పాక్షికత బయటపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం తన నిష్పాక్షికతను రుజువు చేసుకోవడానికి చంద్రబాబుపై విచారణ జరిపించి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. రూ. 12 వేల కోట్లు ఎలా వచ్చాయి? ఇప్పుడు మహానాడులో నీతి సూత్రాలు వల్లిస్తున్న చంద్రబాబు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున రూ. 3,000 కోట్లు, లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు అంతకు మూడు రెట్లు- అంటే రూ. 9000 కోట్లు ఖర్చు చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇన్ని నిధులు బాబుకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన కొడుక్కి నేర్పిన సంస్కారం ఇదేనా! టీడీపీ అట్టహాసంగా జరుపుకుంటున్న మహానాడులో మరణించిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మృతి చెందిన వ్యక్తిని తూలనాడరాదన్న కనీస విచక్షణ కూడా కోల్పోయి మాట్లాడారని ఆమె విమర్శించారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విదేశీ చదువు కోసం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలను ముంచి ఉండొచ్చు కానీ వైఎస్ ఏనాడూ అలా ఆలోచించలేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్ తన కుమారుడు జగన్ ఏ విధంగా అయితే ఎంబీఏ చదువుకున్నారో అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని అందరికీ ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారని ఆమె గుర్తుచేశారు. జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబు గారూ.. అనే సంబోధించారని, సంస్కారం తప్పి మాట్లాడలేదని, అది వైఎస్ తన కుమారుడికి నేర్పిన సభ్యత సంస్కారాలని ఆమె చెప్పారు. అదే మహానాడులో లోకేష్ వైఎస్, జగన్ గురించి మాట్లాడిన తీరు చూస్తే అది ఏ తరహా సభ్యతో, ఏం సంస్కారమో.. ఇదేనా చంద్రబాబు తన కుమారునికి నేర్పింది అని ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.