
పుణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్ తన టీ20 కెరీర్‌లో 12 నోబాల్స్ వేశాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో ఏకంగా ఐదు నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ హసన్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇక ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దషన్ శనక ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 56 పరుగులతో పాటు అదరగొట్టిన షనక.. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా శనివారం(జనవరి7) జరగనుంది.
చదవండి: Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్!