భారత్‌ చెత్త బౌలింగ్‌.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు! | IND vs SL: Shanaka slams fifty as Sri Lanka end at 206/6 | Sakshi
Sakshi News home page

IND vs SL: భారత్‌ చెత్త బౌలింగ్‌.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు!

Published Thu, Jan 5 2023 8:55 PM | Last Updated on Thu, Jan 5 2023 10:02 PM

IND vs SL: Shanaka slams fifty as Sri Lanka end at 206/6 - Sakshi

పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్‌ దసన్‌ శనక సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 22 బంతుల్లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (52), అసలంక(37) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు, అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించారు. 
భారత చెత్త బౌలింగ్‌..
భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ మినహా మిగితందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఏకంగా 7 నోబాల్స్‌ వేశారు. అర్ష్‌దీప్‌ సింగ్ ఒక్కడే ఐదు నో బాల్స్‌ వేయడం గమానార్హం. రెండు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్‌ 37 పరుగులు,  ఉమ్రాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులు, శివమ్‌ మావి తన  నాలుగు ఓవర్ల కోటాలో 53 పరుగులు ఇచ్చారు.
చదవండిIND vs SL: ఏంటి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ మర్చిపోయావా? ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement