Dasun Shanaka
-
3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్న శ్రీలంక బౌలర్
అబుదాబీ టీ10 లీగ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షనక.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేసిన షనక తొలి నాలుగు బంతులకు బౌండరీలు సమర్పించుకున్నాడు. ఇందులో రెండో నో బాల్స్ ఉన్నాయి. అనంతరం ఐదో బంతి సిక్సర్ కాగా.. ఆరో బంతి నో బాల్ అయ్యింది. తిరిగి ఏడో బంతి కూడా నో బాల్ కాగా.. ఈ బంతి బౌండరీకి తరలివెళ్లింది.మొత్తంగా షనక ఓవర్ తొలి మూడు బంతుల్లో 4 నో బాల్స్ వేశాడు. దీంతో మూడు బంతులు ఏడు బంతులయ్యాయి. ఏడు బంతుల్లో బ్యాటర్ నిఖిల్ చౌదరీ ఐదు బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఓ బాల్ డాట్ బాల్‌గా మారింది. ఓవర్ చివరి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్లో మొత్తంగా 33 పరుగులు వచ్చాయి.ఢిల్లీ బుల్స్, బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బుల్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిథ్ 1, టామ్ బాంటన్ 8, జేమ్స్ విన్స్ 27, రోవ్‌మన్ పావెల్ 17, టిమ్ డేవిడ్ 1, షాదాబ్ ఖాన్ 10 (నాటౌట్), ఫేబియన్ అలెన్ 6 పరుగులు చేశారు. ఆఖర్లో నిఖిల్ చౌదరీ మెరుపు వేగంతో 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. లియామ్ లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించడంతో 9.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
LPL 2024: ఫాల్కన్స్‌ను గెలిపించిన షకన, మెండిస్.. కొలొంబో ఔట్
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి కొలొంబో స్ట్రయికర్స్ నిష్క్రమించింది. నిన్న (జులై 18) క్యాండీ ఫాల్కన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన కొలొంబో.. స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. కమిందు మెండిస్ (54), దుసన్ షనక (39) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఫాల్కన్స్‌ను గెలిపించారు.రాణించిన సమరవిక్రమసమరవిక్రమ (62) అర్ద సెంచరీతో రాణించడంతో కొలొంబో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ (30), వెల్లలగే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. ఫాల్కన్స్ బౌలర్లలో హస్నైన్ 3, హసరంగ 2, ఏంజెలో మాథ్యూస్, షనక తలో వికెట్ పడగొట్టారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. కమిందు మెండిస్, షనక సత్తా చాటడంతో 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కొలొంబో బౌలర్లలో బినర ఫెర్నాండో, మతీష పతిరణ తలో 3, ఇషిత విజేసుందర, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో గెలుపొందిన ఫాల్కన్స్.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2లో జాఫ్నా కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జులై 21న జరిగే ఫైనల్లో గాలే మార్వెల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
షనక ఊచకోత.. చాప్మన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాండీ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్ హ్రిదోయ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. దినేశ్ చండీమల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), షనక (15 బంతుల్లో 46 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ముస్తాఫిజుర్ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్ బౌలర్లలో నువాన్ తుషార, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్ పడగొట్టారు.లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, గాలే మార్వెల్స్.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్, క్యాండీ ఫాల్కన్స్ పోటీపడనున్నాయి. -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్‌గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్‌కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
శ్రీలంకకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కెప్టెన్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది. అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు యువ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా ఈ టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో లంక బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్ -
వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు బిగ్ షాక్.. కెప్టెన్‌కు గాయం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనకతో పాటు యువ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యారు. నెట్‌ప్రాక్టీస్‌లో షనక మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు పూర్తిగా ప్రాక్టీస్ సెషన్స్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు పతిరానా భుజం గాయంతో బాధపడుతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా పతిరానాకు భుజానికి గాయమైంది. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌కు షనక దూరం కావడంతో కుశాల్ మెండిస్ లంక సారధిగా వ్యవహరించనున్నాడు. షనక స్ధానంలో దుషాన్ హేమంత, పతిరానా స్ధానంలో లహురు కుమార తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 16న లక్నో వేదికగా ఆసీస్‌తో శ్రీలంక తలపడనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. చదవండి: Ind Vs Pak: పాక్ బ్యాటర్లకు చుక్కలు.. వారెవ్వా.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే పాపం.. -
CWC 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇర్లు జట్లు చెరో మార్పు చేశాయి. కసున్ రజిత స్థానంలో తీక్షణ లంక జట్టులోకి రాగా.. ఫకర్ జమాన్ స్థానంలో షఫీక్ పాక్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ -
CWC 2023: శ్రీలంకతో మ్యాచ్.. పాకిస్తాన్ చరిత్ర పునరావృతం చేసేనా..?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్ టోర్నీలో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. పాక్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక.. పాక్‌పై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు. మెగా టోర్నీలో ఇరు జట్లు 7 సందర్భాల్లో ఎదురెదురుపడగా అన్ని సార్లు పాకిస్తాన్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాక్‌కు ఓటమి రుచి చూపించాలని శ్రీలంక జట్టు కసిగా ఉంది. మరోవైపు పాక్ ప్రపంచకప్‌లో శ్రీలంకపై తమ జైత్రయాత్రను కొనసాగించేందుకు ప్రణాళికలతో సిద్దంగా ఉంది. ఓవరాల్‌గా కూడా పాక్‌దే పైచేయి.. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై పాకిస్తాన్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 156 వన్డేల్లో తలపడగా.. పాక్ 92, శ్రీలంక 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈసారి లంకతో అంత ఈజీ కాదు.. ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై స్పష్టమైన ఆథిక్యం కలిగిన పాక్‌కు లంకేయులతో ఈసారి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన చాలా రెట్లు మెరుగుపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతి భారీ లక్ష్యన్ని (429) ఛేదిస్తూ కూడా శ్రీలంక అంత ఈజీగా చేతులెత్తేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంపాలైనప్పటికీ, బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్‌కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్‌గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్‌వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్‌గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఆసియాకప్-2023 ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి. కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు శ్రీలంక జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. కెప్టెన్‌గా అతడి విజయం శాతం 60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్‌ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది. చదవండి: IND vs AUS: అశ్విన్.. ఆసీస్‌తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్ పఠాన్ -
అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్
ఆసియాకప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. లీగ్,సూపర్-4 దశలో అదరగొట్టిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించంగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన ఫలితంగా ప్రత్యర్థి లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ వన్డేల్లో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. లంక బ్యాటర్లలో 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఈ దారుణ ఓటమి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గాయాలు కూడా శ్రీలంక క్రికెట్‌ను వెంటాడుతున్నాయి. హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో, థీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటారన్నది అనుమానమే. ఇక భారత చేతిలో ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తమ ఓటమిని శాసించాడని షనక తెలిపాడు. అతడే మా కొంపముంచాడు.. మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని నేను భావించాను. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ నిర్ణయం మిస్‌ఫైర్ అయింది. వాతవారణ పరిస్ధితులు కూడా కీలక పాత్ర పోషించాయి. మేము ఇది మర్చిపోలేని రోజు. మేము మా బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని క్రీజులో నిలదొక్కుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అది మేము చేయలేకపోయాం. ఫైనల్లో మేము ఓడిపోయినప్పటికీ మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సదీర, కుసల్ మెండీస్ స్పిన్నర్లను ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా ఆసలంక కూడా తన మార్క్‌ను చూపించాడు. ఈ ముగ్గురూ భారత పిచ్‌లపై కూడా అద్భుతంగా ఆడగలరు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఓడించి ఫైనల్‌కు వచ్చాం. మా బాయ్స్ గత కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అయితే మా ఆటతీరుతో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. అదే విధంగా విజేత భారత్‌కు నా అభినందనలు అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షనక చెప్పుకొచ్చాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ -
అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది. నమ్మలేకపోయాను నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఎల్లప్పుడూ స్వింగ్ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్‌లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్ ఫుల్‌గా స్వింగ్ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను. అవుట్ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 సిరాజ్ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(2) సహా కుశాల్ మెండిస్(17), సమరవిక్రమ(0), చరిత్ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేయగా.. హార్దిక్ పాండ్యా దునిత్ వెల్లలగే(8), ప్రమోద్ మదుషాన్(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 23, శుబ్‌మన్ గిల్ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ ఇక విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే -
సిరాజ్ సంచలనం.. తమ వరల్డ్ రికార్డును తామే బ్రేక్ చేసిన శ్రీలంక! చెత్తగా..
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ హైదరాబాదీ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంకతో మొదలుపెట్టిన సిరాజ్ వరుసగా వన్‌డౌన్ బ్యాటర్ సదీర సమరవిక్రమ, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వ, కెప్టెన్ దసున్ షనకలను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ విశ్వరూపం.. బెంబేలెత్తిన లంక బ్యాటర్లు 12వ ఓవర్ ముగిసే సరికి ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి లంకను దెబ్బకొట్టగా.. సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో సింహళీయుల జట్టు వన్డే చరిత్రలో తన పేరిట ఉన్న చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది. 2012లో పర్ల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 13 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. తాజాగా టీమిండియాతో ఆసియా కప్ ఫైనల్లో 12 పరుగుల వద్దే ఆరో వికెట్ పారేసుకుంది. అసోసియేట్ దేశాలు మినహా టెస్టు ఆడే జట్లలో శ్రీలంక రెండుసార్లు ఈ మేరకు ఘోర పరాభవం మూటగట్టుకోవడం గమనార్హం. కెనడా లంక చేతిలో.. లంక ఇలా కాగా 2003లో శ్రీలంకతో పర్ల్‌లో 12 పరుగులకు.. అదే విధంగా 2013లో నెట్ కింగ్ సిటీతో మ్యాచ్‌లో 10 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సహా ప్రత్యర్థి చేతిలో ఇలా భంగపడటం రెండూ శ్రీలంక జట్టుకే చెల్లిందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
#lndVsSL: టాస్ గెలిచిన శ్రీలంక.. అక్షర్ అవుట్.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్ ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. తీక్షణ స్థానంలో అతడే మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు. కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం. తుదిజట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా. చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్ The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥 Who'll come out on top - #India or #SriLanka? Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup, 2023- India vs Sri Lanka, Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియాను హెచ్చరించాడు. శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న దసున్ షనక బృందాన్ని ఓడించడం అంత తేలికేమీ కాదని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఊహించారా? కొలంబో వేదికగా ఆదివారం టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని ఊహించామా? కానీ అదే జరిగింది. అలాగే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి కంటే పాక్ నిష్క్రమణ మరీ ఘోరం. ఏదేమైనా.. ఇప్పటికీ భారత జట్టుకు అవకాశం ఉంది. వాళ్లు ఫైనల్ ఆడబోతున్నారు. టీమిండియా సత్తాకు పరీక్ష కానీ అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పరాజయం వారికి కనువిప్పు కలిగించిందనే అనుకుంటున్నా. కఠినంగా శ్రమించి.. వ్యూహాలు పక్కాగా అమలు చేస్తేనే ఫైనల్లో అనుకున్న ఫలితం రాబట్టగలరు. శ్రీలంకను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. టీమిండియా సత్తాకు పరీక్ష ఇది. శ్రీలంకను తక్కువ అంచనా వేయకండి రోహిత్ సేనను ఎలాగైనా ఓడించి ట్రోఫీ గెలవాలని శ్రీలంక కాచుకుని కూర్చుంది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఏ జట్టుకైనా ఇలాంటి విజయాలు అవసరం. ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు. సమిష్టిగా రాణిస్తూ విజయపరంపర కాగా స్టార్లు ప్లేయర్లు లేకుండా.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఒక్కో అవరోధం దాటుకుంటూ ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా దసున్ షనక జట్టు నిలిచిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించడం శ్రీలంకకు బలం. ఈ నేపథ్యంలోనే రోహిత్ సేనను ఉద్దేశించి అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన WC 2023: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక.. -
Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక!
Asia Cup, 2023- India vs Sri Lanka, Final Predicted Playing XI: గతేడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో సూపర్-4 దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వన్డే ఫార్మాట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2023 ఆరంభానికి ముందే అంతర్జాతీయ టైటిల్ గెలిచి అభిమానులను ఖుషీ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంకతో ఆసియా కప్-2023 ఫైనల్‌కు అన్ని రకాలుగా సిద్ధమైంది. సూపర్-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చేదు అనుభవం విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణను ఆడించారు. అయితే, వెస్టిండీస్‌తో టీ20లలో అదరగొట్టినప్పటికీ.. వన్డే అరంగేట్రంలో తడబడ్డాడు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ. సూర్య కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక బుమ్రా ఉన్నాడు కాబట్టి తుదిజట్టు నుంచి మరోసారి షమీకి ఉద్వాసన తప్పదు. వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్! సిరాజ్ రాకతో ప్రసిద్ తప్పుకోవాల్సిందే. కానీ బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరం కావడంతో ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ శ్రీలంకకు చేరుకున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్‌ను తప్పించి ఈ చెన్నై కుర్రాడిని ఆడించవచ్చు. లంక స్పిన్నర్ దూరం.. తక్కువ అంచనా వేస్తే అంతే ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే.. కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ దూరం కావడం శ్రీలంక అవకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అయితే, యువ స్పిన్ సంచలనం దునిత్ వెల్లలగే సూపర్‌ఫామ్‌లో ఉండటం.. అతడికి తోడుగా ఆల్‌రౌండర్లు అసలంక, ధనంజయ డి సిల్వా రాణించడం దసున్ షనక బృందానికి సానుకూలాంశాలు. కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ బ్యాట్ ఝలిపిస్తే తిరుగే ఉండదు. ఇక స్టార్లు లేకపోయిన్పటికీ ఫైనల్ దాకా చేరుకున్న.. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను టీమిండియా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. సూపర్-4 మ్యాచ్‌లోనే రోహిత్ సేనకు ఈ విషయం బాగా అర్థమైంది. టాస్ గెలిచిన జట్టు తొలుత.. ఇక కొలంబో వాతావరణం మరోసారి టీమిండియా- శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆసియా కప్‌లో కొలంబో వేదికగా జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది. 13 సార్లు వన్డే ఫార్మాట్లో, రెండుసార్లు టి20 ఫార్మాట్లో నిర్వహించారు. భారత్, శ్రీలంక జట్లు ఆసియా కప్ ఫైనల్స్‌లో ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్, మూడుసార్లు శ్రీలంక గెలుపొందాయి. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. ఆరుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది శ్రీలంక. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో! పిచ్, వాతావరణం గత తొమ్మిది రోజుల్లో ప్రేమదాస స్టేడియంలో ఆరు మ్యాచ్‌లు జరిగాయి. దాంతో పిచ్ మందకొడిగా మారింది. స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో ఒకట్రెండుసార్లు ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. ఒకవేళ వర్షంవల్ల ఆట సాధ్యపడకపోతే రిజర్వ్ డే సోమవారం ఫైనల్‌ను కొనసాగిస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్. శ్రీలంక: షనక (కెప్టెన్), కుశాల్ పెరీరా, నిసాంక, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే, దుషాన్ హేమంత, పతిరణ, కసున్ రజిత. చదవండి: న్యూజిలాండ్‌పై గెలుపు.. ఇంగ్లండ్‌దే సిరీస్ The big day has arrived! #India locks horns with #SriLanka in the #AsiaCup2023 final. Get ready for a cricketing spectacle! 🇮🇳🆚🇱🇰 Tune-in to #INDvSL in #AsiaCupOnStar Tomorrow | 2 PM | Star Sports Network#Cricket pic.twitter.com/R4PfMv29XR — Star Sports (@StarSportsIndia) September 16, 2023 -
Asia Cup: నిరీక్షణ ముగించాలని టీమిండియా! సమష్టిగా రాణిస్తూ శ్రీలంక
Asia Cup 2023 Final Ind VS SL: ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా మూడు అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు విజేతగా నిలిచి ఐదేళ్లయింది. 2018లో ఆసియా కప్ టైటిల్ సాధించాక భారత జట్టు మరో టోర్నీలో చాంపియన్‌గా నిలువలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో, 2022 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో ఓడిన టీమిండియా... 2019, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నిరీక్షణ ముగించేందుకు భారత జట్టుకు ఆసియా కప్ రూపంలో మరో అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్లో టీమిండియా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో గెలిచి భారత జట్టు టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందా లేదా మరికొన్ని నెలలు పొడిగిస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కొలంబో: వర్షంతో దోబూచులాడిన ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. వచ్చే నెలలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భారత్, శ్రీలంక జట్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్–4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. వాళ్లంతా వచ్చేస్తున్నారు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా ఫైనల్లో బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ చేతి వేళ్లకు గాయం కావడంతో అతను ఫైనల్‌కు దూరమయ్యాడు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా టీమ్ మేనేజ్మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను శనివారం కొలంబోకు రప్పించింది. బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఈ టోర్నీలో గిల్, కోహ్లి, రాహుల్ ఒక్కో సెంచరీ కూడా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్ సమతూకంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్‌తో ఆకట్టుకుంటే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. సమష్టిగా రాణిస్తూ... ఆసియా కప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ఏడో టైటిల్‌పై గురి పెట్టింది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. పలువురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఈ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాసున్ షనక నాయకత్వంలో తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో కుశాల్ మెండిస్, నిసాంక, అసలంక, సమర విక్రమపై లంక ఆశలు పెట్టుకుంది. షనక, ధనంజయ డిసిల్వా, వెలలాగె ఆల్‌రౌండ్ పాత్రలను పోషిస్తారు. గాయం కారణంగా స్పిన్నర్ తీక్షణ ఫైనల్‌కు దూరమయ్యాడు. పతిరణ, కసున్ రజిత తమ పేస్‌తో భారత బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి. -
3 సింగిల్ డిజిట్ స్కోర్లు! అయినా నన్ను నమ్మిన సెలక్టర్లకు థాంక్స్: కెప్టెన్
Asia Cup 2023- India Vs Sri Lanka In Final: ‘‘నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే సమయంలో నా బ్యాటింగ్‌తో కెప్టెన్సీని పోల్చుకోను. మిడిలార్డర్లో బ్యాటర్‌గా ఎలా ఆడాలన్న విషయం కంటే.. సారథిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం మీదే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. బ్యాటింగ్ ముఖ్యం కాదని నేను చెప్పను గానీ.. ఫామ్ గురించి మర్చిపోయి కెప్టెన్‌గా ముందుకు సాగిపోతాను. ఎందుకంటే.. డెసిషన్ మేకింగ్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు థాంక్స్ నిజానికి ఫామ్‌లేమితో సతమతమవుతున్నా.. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు. అదే విధంగా నాలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఎప్పుటికప్పుడు సహాయసహకారాలు అందిస్తు కోచింగ్ సిబ్బందికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆటగాడిగా విఫలమవుతున్నా.. నాయకుడిగా రాణించడానికి వీరే కారణం. అందుకే వాళ్లందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అన్నాడు. బ్యాటర్‌గా విఫలమవుతున్నా.. తనపై విశ్వాసం ఉంచి, అండగా నిలుస్తున్న సెలక్టర్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు కాగా ఆసియా కప్-2023లో అసాధారణ పోరాటంతో ఫైనల్‌కు చేరింది శ్రీలంక. సమిష్టిగా రాణిస్తూ.. సెప్టెంబరు 17న టీమిండియాతో కొలంబో వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు కెప్టెన్ దసున్ షనక బ్యాట్ ఝులిపించకపోవడం కాస్త జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఈ ఆల్‌రౌండర్ ఆరు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 54. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లే ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 14 నాటౌట్, అఫ్గనిస్తాన్‌పై 5, బంగ్లాదేశ్ మీద 24, టీమిండియాపై 9, పాకిస్తాన్‌పై 2 పరుగులు మాత్రమే సాధించాడు. నాయకుడిగా సూపర్ హిట్ అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడంలో మాత్రం సఫలమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడి అండర్‌డాగ్స్‌గా ఆసియా కప్ బరిలోకి దిగిన లంకను ఫైనల్‌కు తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో తుదిపోరుకు ముందు మీడియాతో మాట్లాడిన దసున్ షనక.. తన బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆటగాడిగా కంటే నాయకుడిగా రాణించడం మీదే ఎక్కువగా దృష్టి సారించానని పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ WATCH: Dasun Shanaka previews Asia Cup 2023 Finals against Indiahttps://t.co/vdpKwgkdrm #AsiaCup2023 #SLvIND — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2023 -
మేము పాకిస్తాన్‌కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
Asia Cup: మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు లంక! పాక్ సంగతి అంతే ఇక..
కొలంబో: ఆసియా కప్‌లో ‘సెమీఫైనల్’లాంటి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్–4 దశలో భాగంగా నేడు జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్తాన్ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించగా... భారత్‌తో తుది పోరులో తలపడే ప్రత్యర్థిని ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. నాలుగో జట్టయిన బంగ్లాదేశ్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. భారత్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు రన్‌రేట్‌లో పాక్ భారీగా వెనుకబడగా... టీమిండియా చేతిలో ఓడినా చివరి వరకు పోరాడిన లంక మెరుగైన స్థితిలో ఉంది. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే లంక లాభపడుతుంది. మెరుగైన రన్‌రేట్‌తో ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే పాకిస్తాన్, శ్రీలంక సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే సొంతగడ్డపై లంకకు అదనపు ప్రయోజనం ఉంది. భారత్‌తో పోరులో పాక్ పేలవ బ్యాటింగ్ బయటపడింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్ అంతంత మాత్రమే ఆడుతుండగా, వరల్డ్ నంబర్‌వన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ దానికి తగినట్లుగా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. మిడిలార్డర్లో రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్ కూడా జట్టు ఆశించిన రీతిలో స్కోర్లు చేయలేకపోతున్నారు. అయితే అన్నింటికంటే మించి ప్రధాన బౌలర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా ఈ మ్యాచ్‌కు దూరం కావడం పాక్‌కు పెద్ద దెబ్బ. నసీమ్ అధికారికంగా తప్పుకోగా అతని స్థానంలో జమాన్‌ను ఎంపిక చేశారు. రవూఫ్ కూడా ఆడే తక్కువగా ఉండటంతో దమాని బరిలోకి దిగవచ్చు. పాక్ స్పిన్ కూడా బలహీనంగా ఉంది. మరోవైపు లంక స్పిన్ బలమేంటో గత మ్యాచ్‌లో కనిపించింది. ఇదే జోరు కొనసాగిస్తే పాక్‌ను ఆ జట్టు సునాయాసంగా అడ్డుకోగలదు. వెలలాగె, అసలంక, తీక్షణలను పాక్ ఎలా ఆడుతున్నది చూడాలి. ప్రధానంగా కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ, ధనంజయలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్‌గా కెపె్టన్ షనక కీలక ప్రదర్శన చేయాల్సి ఉంది. 155 ఇప్పటి వరకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 155 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 92 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, 58 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. -
Ind vs SL: అస్సలు ఊహించలేదు.. కోహ్లి వికెట్ తీశాడు.. కానీ!
Asia Cup 2023- India vs Sri Lanka: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. కొలంబో వికెట్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావించామని.. కానీ అనూహ్యరీతిలో బంతి టర్న్ అయిందని పేర్కొన్నాడు. ఇక దునిత్ వెల్లలగే అద్భుతం చేయగలడని తాను ముందే ఊహించానన్న షనక.. అందుకు తగ్గట్లే అతడి ఆట తీరు కొనసాగిందని హర్షంవ వ్యక్తం చేశాడు. అదే విధంగా చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. టాపార్డర్‌ను కుదేలు చేసిన వెల్లలగే కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. లంకను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. వెల్లలగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(53)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. 49.1 ఓవర్లలో టీమిండియా 213 పరుగులు చేయగలిగింది. అసలంక, ధనంజయ పోరాడినా లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను స్పిన్ ఆల్‌రౌండర్లు చరిత్ అసలంక(22), ధనంజయ డి సిల్వ(41) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల ధాటికి లంక జట్టు 172 పరుగులకే చాపచుట్టేయగా.. 41 పరుగులతో గెలిచి రోహిత్ సేన ఫైనల్‌కు చేరింది. కాగా ఈ ఓటమితో వరుసగా 13 వన్డే విజయాలు సాధించిన షనక బృందం జోరుకు బ్రేక్ పడింది. బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ నేపథ్యంలో దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘వికెట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్ పిచ్ అనుకున్నాం.. కానీ అలా జరుగలేదు. వెల్లలగే అద్భుతంగా రాణించాడు. ధనంజయ, అసలంక కూడా గొప్పగా బౌలింగ్ చేశారు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకే టీమిండియాతో మ్యాచ్లోనాకు వారిద్దరి రూపంలో రెండు మంచి స్పిన్ ఆప్షన్లు కనిపించాయి’’ అని పేర్కొన్నాడు. ఇక వెల్లలగే అద్భుతంగా ఆడగలడని అంచనా వేశానన్న షనక.. అతడు విరాట్ కోహ్లి వికెట్ తీయడం ప్రత్యేకమని హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు వెల్లలగేదే అంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో వెల్లలగే శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(3), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లు తీశాడు.ఘ తదుపరి పాకిస్తాన్‌తో చావోరేవో ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో చావోరేవో తేల్చుకోనుంది. గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లంక ఫైనల్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023 -
Ind vs SL: శ్రీలంక పై భారత్ విజయం
Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4 Updates: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టార్గెట్ 214 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 172 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీతో (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్కోర్లు: భారత్ 213(49.1), శ్రీలంక 172 (41.3) ASIA CUP 2023. India Won by 41 Run(s) https://t.co/P0ylBAiETu #INDvSL — BCCI (@BCCI) September 12, 2023 తొమ్మిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక 172 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదవ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రజిత ఔటయ్యాడు. ఎనిమిదవ వికెట్ కోల్పోయిన శ్రీలంక 171 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదవ వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి మహేష్ తీక్షణ (2) ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 162 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ధనుంజయ్ డిసింగ్వా (41) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక 99 పరుగుల వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి షనక (9) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 73 పరుగులకే శ్రీలంక సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో అసలంక (22) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్ స్టంపింగ్ చేయడంతో సమరవిక్రమ (17) ఔటయ్యాడు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 73/4. అసలంక (22), ధనంజయ డిసిల్వ (5) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన శ్రీలంక స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడుతుంది. కేవలం 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి కుశాల్ మెండిస్ (15) ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నే (2) పెవిలియన్ బాటపట్టాడు. 7.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 25/3. బుమ్రా 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. టార్గెట్ 214.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 214 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (6) ఔటయ్యాడు. తిప్పేసిన లంక స్పిన్నర్లు.. 213 పరుగులకే ఆలౌటైన భారత్ లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) ధాటికి భారత్ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది. వరణుడి ఆటంకం సమయం సాయంత్రం 06:23 నిమిషాలు: టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌కు వరణుడి ఆటంకం. వర్షం కారణంగా ఆట నిలిపి వేసే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 197 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 15, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 42.2: వరుసగా రెండో వికెట్ తీసిన అసలంక. కుల్దీప్ యాదవ్ డకౌట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 42.1: అసలంక బౌలింగ్‌లో బుమ్రా(5) బౌల్డ్ 40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 180-7 అక్షర్, బుమ్రా క్రీజులో ఉన్నారు. ఏడో వికెట్ డౌన్ 38.5:అసలంక బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన జడేజా(4) 35.6:వెల్లలగేబౌలింగ్లో పాండ్యా(5) అవుట్ ఐదో వికెట్ కోల్పోయిన భారత్ 34.2: అసలంక బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(33) అవుట్. పాండ్యా, జడేజా క్రీజులో ఉన్నారు. స్కోరు: 172/5 (35.5) FIFTY UP! 👏🏻😍 Back to back half centuries for #TeaIndia skipper, @ImRo45! Will he notch up his 31st 💯 today? 👀 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/N9eImshbuf — Star Sports (@StarSportsIndia) September 12, 2023 29.6: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రాహుల్‌ను వెల్లలగే బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు. ఇషాన్ కిషన్(24), హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. స్కోరు: 154-4(30) 25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 128-3 కేఎల్ రాహుల్18, ఇషాన్ కిషన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 109-3 రోహిత్ శర్మ అవుట్ 15.1: లంక స్పిన్నర్ వెల్లలగే ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కోహ్లి వికెట్ తీసిన తన మరుసటి ఓవర్లోనే రోహిత్(53)ను బౌల్డ్ చేశాడు. స్కోరు: 91/3. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13.5: లంక యువ స్పిన్నర్ వెల్లలగే మరోసారి మెరిశాడు. తొలుత గిల్ వికెట్ తీసిన అతడు.. ఈసారి ఏకంగా కింగ్ కోహ్లిని అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి షనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ హాఫ్ సెంచరీ 12.2: బౌండరీతో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న రోహిత్ శర్మ. 44 బంతుల్లో 51 పరుగులు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 11.1: శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వెల్లలగే బౌలింగ్‌లో గిల్(19) బౌల్డ్ అయ్యాడు. కోహ్లి, రోహిత్ క్రీజులో ఉన్నారు. ►10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 65/0 వారెవ్వా హిట్‌మ్యాన్ 6.5: కసున్ రజిత బౌలింగ్‌లో సిక్స్ బాది రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ►6 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 31/0 రోహిత్ 17, గిల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►2 ఓవర్లలో టీమిండియా స్కోరు: 10-0. రోహిత్ శర్మ 7, గిల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అక్షర్‌కు పిలుపు.. అతడు అవుట్ ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ స్థానంలో అక్షర్‌కు చోటిచ్చినట్లు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: పాథుమ్ నిస్సాంకా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లగే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ 15 గంటలలోపే మళ్లీ పాకిస్తాన్‌తో రిజర్వ్ డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తిరిగి 15 గంటలలోపై మళ్లీ మ్యాచ్‌కు సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన శ్రీలంకతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా విశ్రాంతినిచ్చే అవకాశం ఉందా? భారత తుది జట్టులో ఎవరెవరుంటారు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా భారత్- లంక మ్యాచ్ కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్న విషయం తెలిసిందే. -
శ్రీలంక లయన్స్ వర్సెస్ బంగ్లా టైగర్స్.. గెలుపెవరిది?
ఆసియాకప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా క్యాండీ వేదికగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక బ్లాస్టర్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం శ్రీలంక.. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది. లహురు కుమారా,థీక్షణ మినహా పెద్దగా అనుభవం ఉన్న బౌలర్లు లేరు. యువ సంచలనంచ,పేసర్ మతీషా పతిరానా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా స్వదేశంలో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఆడిన 5 వన్డేల్లోనూ లంక విజయం సాధించింది. సొంత గడ్డపై ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న లంక.. వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్లోనూ దుమ్మురేపింది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంకనే సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్ హక్కు అవకాశం ఇచ్చారు. లిట్టన్ దాస్ దూరమైనప్పటికీ అఫీఫ్ హొస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తోవిద్ హృదయ్ రూపంలో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా టాస్కిన్ అహ్మద్, ముస్తిఫిజర్ రెహ్మన్, షకీబ్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. వీరి చెలరేగితే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు. తుది జట్లు(అంచనా) బంగ్లాదేశ్ అఫీఫ్ హొస్సేన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తోవిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్ శ్రీలంక పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, మతీశ పతిరణ చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! -
LPL 2023: చెలరేగిన కుశాల్ పెరీరా.. ఫైనల్లో డంబుల్లా
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు. -
వరుసగా రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన హసరంగ.. బ్యాట్‌తో విధ్వంసం, బంతితో మ్యాజిక్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆగస్ట్ 5న జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-9-3, 22 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టిన హసరంగ.. ఇవాళ (ఆగస్ట్ 8) గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు. Into the halfway mark with the Titans on 58 for 6!#LPL2023 #LiveTheAction pic.twitter.com/I3WiwI0oiP — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 తొలుత బ్యాట్‌తో విధ్వంసం (27 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సృష్టించిన హసరంగ.. ఆతర్వాత బంతితో (3.4-0-17-4) తనదైన స్టయిల్లో మ్యాజిక్ చేశాడు. హసరంగ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీయడంతో గాలేపై క్యాండీ 89 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. World-class Wanindu welcomes 200 T20 wickets!#LPL2023 #LiveTheAction pic.twitter.com/E920VBNQa8 — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. హసరంగ, ఫకర్ జమాన్ (35 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చండీమల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మహ్మద్ హరీస్ (14 బంతుల్లో 17; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. గాలే బౌలర్లలో లహిరు సమరకూన్ 2 వికెట్లు పడగొట్టగా.. కసున్ రజిత, నగరవ, షంషి తలో వికెట్ దక్కించుకున్నారు. B-Love Kandy treats their home crowd to the season’s first 200 total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8uc4aEQuws — LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023 అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే.. హసరంగ, నువాన్ ప్రదీప్ (3-0-21-3), ముజీబ్ (4-0-26-2), దుష్మంత చమీర (3-0-17-1) ధాటికి 16.4 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. గాలే ఇన్నింగ్స్‌లో లహిరు సమరకూన్ (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లసిత్ క్రూస్పుల్లే (27), అషాన్ ప్రియజన్ (25), షకీబ్ అల్ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్‌జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం
SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు. ఐపీఎల్-2023లో సీఎస్కే తరఫున ఇరగదీసిన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్ దుషన్ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి. చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..! -
అతడిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు: సెహ్వాగ్
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ స్థానంలో షనక ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమమ్యాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన షనక కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కేతో జరిగిన క్వాలిఫియర్-1లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే క్వాలిఫియర్-2లో దసన్కు చోటు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం షనక ప్రదర్శన పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. "అహ్మదాబాద్‌లో గుజరాత్‌ను ఓడించడం అంత సులభం కాదు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో గుజరాత్ ఓడిపోయింది. కాబట్టి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి హార్దిక్ అండ్ కో భావిస్తుంది. ముంబై బాగా కష్టపడాలి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ముంబై తమ జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయను తీసుకురావచ్చు. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. వారు బౌలింగ్ పరంగా పటిష్టంగానే ఉన్నారు. కానీ బ్యాటింగ్‌లో కాస్త నిలకడ లోపించింది. ముఖ్యంగా దాసున్ షనక తీవ్ర నిరాశపరిచాడు. అతడి స్థానంలో ఓడియన్ స్మిత్ లేదా అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంటే బాగుంటుంది. లేదా మనోహర్‌కు అవకాశం ఇచ్చిన పర్వాలేదు. అతడు కూడా భారీ సిక్స్‌లు కొట్టగలడు. షనకపై చాలా ఆశలు పెట్టుకున్నాను. అతడు నా అంచనాలకు కనీసం ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టులో కోహ్లి ఉండాలా వద్దా? గవాస్కర్ సమాధానమిదే -
అన్నదమ్ముల సవాల్.. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ! అతడు కూడా..
ఐపీఎల్-2023లో అన్నదమ్ముల మధ్య సవాల్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించనుండగా.. లక్నోకు హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా సారధ్యం వహించనున్నాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో కృనాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక రాజస్తాన్‌పై అద్భుతవిజయం సాధించిన గుజరాత్.. అదే జోరును లక్నోపై కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ పేసర్, ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జాషువా లిటల్ దూరమయ్యాడు. తన జాతీయ జట్టు విధులు నిర్విర్తించేందుకు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ తలపడనుంది. మే 9 నుంచి మే 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. అనంతరం లిటిల్ మళ్లీ గుజరాత్ జట్టుతో కలవనున్నాడు. శ్రీలంక కెప్టెన్ ఐపీఎల్ ఎంట్రీ ఇక లిటిల్ స్థానంలో శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ దసన్ షనకను తీసుకోవాలని గుజరాత్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న షనక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా అభినవ్ మనోహర్ స్ధానంలో సాయిసుదర్శన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మైర్స్ ఔట్.. డికాక్ ఇన్ మరోవైపు లక్నో కూడా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఓపెనర్ కైల్ మైర్స్ స్ధానంలో ప్రోటీస్ స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మైర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో డికాక్ చోటు దక్కలేదు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మైర్స్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మైర్స్‌ను పక్కన పెట్టి డికాక్‌ను తీసుకురావాలని లక్నో మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తుది జట్లు(అంచనా) గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, సాయిసుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, దసన్ షనక గుజరాత్ టైటాన్స్ సబ్‌స్ట్యూట్స్: శుభమాన్ గిల్, మనోహర్,శ్రీకర్ భరత్, శివమ్ మావి, సాయి కిషోర్ లక్నో సూపర్ జెయింట్స్ డికాక్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతం, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్ చదవండి: IPL 2023: అందుకే అలా చేశా.. అతడు మా జట్టుకు దొరికిన నిజమైన ఆస్తి! అద్భుతాలు సృష్టిస్తాడు -
మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..
New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది. దంచికొట్టిన మెండిస్ క్వీన్స్టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెలరేగిన సీఫర్ట్ కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ కూడా కివీస్‌దే 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది. Rachin getting the job done for New Zealand 🇳🇿 Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N — Spark Sport (@sparknzsport) April 8, 2023 Jimmy Neesham EPIC CATCH 🤩 Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt — Spark Sport (@sparknzsport) April 8, 2023 -
NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే
డునెడిన్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఏప్రిల్ 5) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 142 to win in Dunedin! 🎯 Adam Milne (5-26) leading an all-round performance in the field. Follow the chase LIVE in NZ on @sparknzsport 📺 or Rova 📻 LIVE scoring https://t.co/wA3XiQ80si #NZvSL #CricketNation pic.twitter.com/S5Fv3eFdhd — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 నిప్పులు చెరిగిన ఆడమ్ మిల్నే.. రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. మిల్నేతో పాటు బెన్ లిస్టర్ (4-0-26-2), షిప్లే (1/25), రచిన్ రవీంద్ర (1/24), జిమ్మీ నీషమ్ (1/20) తలో చేయి వేయడంతో శ్రీలంక మరో ఓవర్ మిగిలుండగానే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (10), కుశాల్ పెరీరా (35), ధనంజయ డిసిల్వ (37), అసలంక (24) మత్రమే రెండంకెల స్కోర్ సాధించగలిగారు. 50 up for Tim Seifert. His sixth in international T20 cricket 🏏 Follow play LIVE in NZ on @sparknzsport 📺 or with Rova 📻 LIVE scoring https://t.co/2BMmCgLarp #NZvSL #CricketNation pic.twitter.com/u149v2xJW7 — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. సీఫర్ట్‌కు జతగా చాడ్ బోవ్స్ (15 బంతుల్లో 31; 7 ఫోర్లు), టామ్ లాథమ్ (30 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్) కూడా రాణించడంతో కివీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 32 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. చాడ్ బోవ్స్ వికెట్ కసున్ రజితకు దక్కింది. -
గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్. గాయంతో టోర్నీకి దూరమైన కేన్ విలియమ్సన్ స్థానంలో లంక కెప్టెన్ దాసున్ షనకను ఎంపిక చేసింది. ఈ మేరకు గుజరాత్ టైటాన్స్ షనక ఎంపికను ఖరారు చేసింది. సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ తీసుకునే క్రమంలో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని కుడి కాలు బెణికినట్లు తెలిసింది. ప్రస్తుతం చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లిపోయిన విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడని గుజరాత్ పేర్కొంది. తాజాగా కేన్ మామ స్థానంలో షనకను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్నట్లు తేలింది. ఇక లంక కెప్టెన్‌గా షనక తన జోరు కనబరుస్తున్నాడు. ఇటీవలే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 124 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లోనూ 121 పరుగులతో లంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా షనకకు ఇదే తొలి ఐపీఎల్ కావడం విశేషం. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన షనక రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల నైపుణ్యం అతని సొంతం. కాగా షనక సారధ్యంలోనే లంక జట్టు 2022లో ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. దసున్ షనకతో కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేస్తారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో యూజర్లను ఆకట్టుకుంటోంది. చదవండి: నక్క తోక తొక్కిన వార్నర్.. రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్ Jason Roy 👉 KKR Dasuna Shanaka 👉 GT#IPL2023 #KKR #GT pic.twitter.com/btHydFHxh0 — SED KKR FAN (@KirketXpertt) April 4, 2023 -
WC 2023: 44 ఏళ్ల తర్వాత.. తొలిసారి! లంకకు ఏంటీ దుస్థితి? కివీస్ వల్లే..
Sri Lanka Failed To Qualify ICC ODI WC 2023 Directly: 1996 వరల్డ్‌కప్ ఛాంపియన్స్.. 2007, 2011 ప్రపంచకప్ రన్నరప్.. ఇవీ వన్డే క్రికెట్లో శ్రీలంక సాధించిన అద్బుతాలు. అయితే ఇదంతా గతం. కట్‌చేస్తే .. 2023 వన్డే వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించని జట్టుగా లంక అప్రతిష్టను మూటగట్టుకుంది. అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, చమిందా వాస్ సహా ఎందరో హేమాహేమీలను అందించిన శ్రీలంక క్రికెట్ ఇప్పుడు కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవ్వడం అందరిని విస్మయపరిచింది. 44 ఏళ్ల తర్వాత లంక మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టడం కోసం క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుస ఓటములు లంక అవకాశాలను దెబ్బకొట్టాయి. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడలా.. ఇప్పుడిలా అడ్డుకున్న కివీస్ ఇందులో భాగంగా రెండు టెస్టుల్లో పోరాడి ఓడిన లంక జట్టు.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఫలితం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లతో ఓటమి పాలైన కరుణ రత్నె బృందం.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లిన కివీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో నేరుగా అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసింది. తొలి వన్డేలో 198 పరుగులతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. షనక బృందం అవుట్ కాగా రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వన్డే సిరీస్ కోల్పోయిన దసున్ షనక బృందం ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశం కూడా చేజార్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేలో జూన్‌లో జరుగనున్న ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. కాగా కివీస్‌తో మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కు సౌతాఫ్రికా నుంచి ప్రమాదం పొంచి ఉంది. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో సత్తా చాటితే ప్రొటిస్ విండీస్‌ను వెనక్కినెట్టి రేసులో మరో ముందడుగు వేస్తుంది. కాగా భారత్ వేదికగా అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: IPL 2023 Captains Salaries: సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! వీరి గురించి తెలుసా? పాపం అతడొక్కడే! -
IPL 2023: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో..
Dasun Shanaka- Gautam Gambhir: ‘‘నా దగ్గర తనను కొనుగోలు చేసేంత డబ్బు లేదు. తన బ్యాటింగ్ అద్భుతం. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటే అతడు.. ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో! నా అభిప్రాయం ప్రకారం ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర అతడిని కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదు’’.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. టీమిండియాతో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆసియా టీ20 కప్ టీ20 టోర్నీలో లంకను విజేతగా నిలిపిన అతడు.. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో సిరీస్‌లోనూ అదరగొట్టాడు. అదరగొట్టాడు తొలి టీ20 లో 27 బంతుల్లో 45, రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేగాక.. మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్‌ను అవుట్ చేసి రెండో టీ20లో జట్టుకు విజయం అందించాడు. ఇక మూడో మ్యాచ్‌లో 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఏదైమైనా సిరీస్ ఓడినప్పటికీ ఆటగాడిగా మాత్రం షనక సఫలమయ్యాడని చెప్పొచ్చు. అయినా పాపం! ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణిస్తున్న షనక.. ఐపీఎల్-2023 మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్‌లో అతడి ప్రదర్శన సందర్భంగా గంభీర్ ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు. నేనేం బాధపడటం లేదు ఈ వ్యాఖ్యలపై దసున్ షనక తాజాగా స్పందించాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇండియా పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అందుకే నేను అక్కడ ఆడటాన్ని ఆస్వాదిస్తా. నాలోని దూకుడైనా ఆటగాడు బయటకు వస్తాడు.. నాదైన శైలిని అక్కడ ప్రదర్శించగలను. అయితే, ఐపీఎల్ వేలంలో నన్ను ఎవరూ కొననంత మాత్రాన నేనేమీ బాధపడను. భవిష్యత్తులో నాకోసం భారత్‌లో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నా. అప్పుడు కచ్చితంగా ఐపీఎల్లో ఆడతాను’’ అని షనక తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా షనక ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్20లో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన క్యాపిటల్స్ జట్టు ముంబై ఎమిరేట్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: IND Vs AUS: ఈజీ క్యాచ్ ఇచ్చిన రాహుల్.. కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్ Ravindra jadeja: రోహిత్, జడేజా చెప్పే చేశారు! అదేదో అంపైర్ ముందు చేయొచ్చు కదా! క్లీన్చిట్ ఇచ్చాక.. -
లంకతో మూడో వన్డే.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్‌లోనైనా ఫలితం చివరి మ్యాచ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో మాత్రం రెండో మ్యాచ్‌కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్ గెలుచుకోగా, చివరి పోరుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మరో విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, టి20ల తరహాలో కనీసం ఒక విజయంతోనైనా ముగించి పరువు నిలబెట్టుకోవాలని లంక కోరుకుంటోంది. మార్పు ఉంటుందా... ‘అవసరమైతే తర్వాతి మ్యాచ్‌లో మార్పులు చేస్తాం’... రెండో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సిరీస్ ఇప్పటికే చేతికందడంతో స్వల్ప మార్పులతో రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించాలనేది ఆలోచన. గత రెండు మ్యాచ్‌లలోనూ అవకాశం దక్కకుండా అర్షదీప్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ బెంచీపై వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. ముగ్గురికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఉమ్రాన్, రాహుల్, అక్షర్‌లను పక్కన పెట్టవచ్చు. మరోవైపు భుజం నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన చహల్ పూర్తిగా కోలుకున్నాడు. అతడిని ఆడిస్తారా లేక రెండో వన్డే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. ఇతరత్రా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లంతా ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ప్రధాన బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీరంతా తమ స్థాయికి తగినట్లు ఆడితే నిలువరించడం లంకకు చాలా కష్టమవుతుంది. నిసాంక పునరాగమనం... గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ను కాస్త ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను హోరాహోరీగా మార్చగలిగినా... శ్రీలంక అసలు సమస్య బ్యాటింగ్‌లోనే ఉంది. ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు ప్రదర్శన ఇవ్వకపోవడంతో పేలవ స్కోరుకే పరిమితమైన జట్టు ఏమీ చేయలేకపోయింది. అందరికంటే సీనియర్ కుశాల్ మెండిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు చేయాల్సి ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన నిసాంక తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అతని స్థానంలో ఆడిన నువనిదు ఫెర్నాండో అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించడంతో పక్కన పెట్టలేని పరిస్థితి. దాంతో అసలంకను తప్పించవచ్చు. బౌలింగ్‌లో అంతంత మాత్రంగానే ఉన్న లంక భారత బ్యాటింగ్‌ను ఎంత వరకు నిలువరించగలదో చూడాలి. -
Ind Vs SL: చెలరేగిన భారత బౌలర్లు.. లంక బ్యాటర్లు విలవిల! స్కోరు?
India vs Sri Lanka, 2nd ODI: శ్రీలంకతో రెండో వన్డేలో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. దీంతో కోల్‌కతాలో పర్యాటక లంక 215 పరుగులకే ఆలౌట్ అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మహ్మద్ షమీ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. ఆరో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు. దీంతో 29 పరుగుల వద్ద ఓపెనర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంకను అరంగేట్ర బ్యాటర్ నువానీడు ఫెర్నాండో ఆదుకున్నాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు. పాపం నువానీడు! 17వ ఓవర్ చివరి బంతికి మెండిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా 102 పరుగుల వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్.. ధనంజయ డిసిల్వను బౌల్డ్ చేయగా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నువానీడు అక్షర్ బౌలింగ్‌లో అసలంక తప్పిదం కారణంగా రనౌట్ కావడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఇక తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్ దసున్ షనక కుల్దీప్ బౌలింగ్(22.5)లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అసలంకను సైతం కుల్దీపే పెవిలియన్‌కు పంపాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో హసరంగ ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కరుణరత్నెను ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేశాడు. అదరగొట్టేశారు ఆఖర్లో దునిత్ వెల్లలగె(32) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడిని అవుట్ చేసిన సిరాజ్.. లాహిర్ కుమారను కూడా పెవిలియన్‌కు పంపడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిర్ణీత 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్‌కు ఒకటి, పేసర్లు సిరాజ్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం.. క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ -
IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్ పడతారా?
కోల్‌కతా: ఈ ఏడాది ప్రపంచకప్ సన్నాహాన్ని ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఇదే ఊపులో సిరీస్‌ను కోల్‌కతాలోనే ముగించాలనే పట్టుదలతో ఉంది. శ్రీలంకతో నేడు జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితి లంకది. టి20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ద్వారా పుంజుకున్నట్లే... ఈ పోరులోనూ గెలవాలని ఆశిస్తుంది. ఈడెన్ పిచ్‌పై ఐదేళ్ల క్రితం (2017) ఆసీస్‌తో వన్డే ఆడిన భారత్ గెలిచింది. లంకతో మాత్రం ఈ వేదికపై 2014లో ఆడగా.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ (264) చేశాడు. గువహటి వన్డేలోనూ ధాటిగా ఆడిన భారత కెప్టెన్ తన జోరు కొనసాగిస్తే మాత్రం సింహాళ జట్టుకు కాళరాత్రే! పైగా గిల్, కోహ్లిలతో టాపార్డర్ సూపర్ ఫామ్‌లో ఉండటం, మళ్లీ పేస్ దళం చెలరేగడం భారత బలాన్ని అమాంతం పెంచుతోంది. కోల్‌కతాలో స్పిన్నర్లకు అవకాశం ఉండటంతో చహల్, అక్షర్ కూడా ప్రభావం చూపుతారు. సర్వశక్తులు ఒడ్డాల్సిందే! ఇప్పుడున్న భారత్ ఫామ్‌ను చూస్తే దుర్భేధ్యంగా ఉంది. ఇలాంటి జట్టును ఎదుర్కోవాలన్నా... ఓడించాలన్నా శ్రీలంక సర్వశక్తులు ఒడ్డాల్సిందే. సమష్టి బాధ్యత కనబరిస్తేనే పటిష్టమైన టీమిండియాను ఢీకొంటుంది. లేదంటే గత మ్యాచ్ ఫలితమే పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. టాపార్డర్‌లో నిసాంక మాత్రమే నిలకడగా ఆడుతున్నాడు. షనక కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణిస్తున్నాడు. వీరితో పాటు ఫెర్నాండో, కుశాల్ మెండిస్‌లు కూడా రాణిస్తేనే భారీస్కోరు చేయగలుగుతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఇప్పటి వరకు 21 వన్డేలు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఈ వేదికపై శ్రీలంకతో ఐదు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్ రద్దయింది. పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లతో పాటు బౌలర్లకూ అవకాశమిస్తుంది. అయితే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపుతుంది. వాన ముప్పు లేదు. -
Ind Vs SL: అందుకే ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాం: రోహిత్ శర్మ
India vs Sri Lanka, 1st ODI- Rohit Sharma: శ్రీలంకపై భారీ గెలుపుతో వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. గువహటి వేదికగా తొలి వన్డేలో రోహిత్ సేన పర్యాటక లంకపై 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 83, మరో ఓపెనర్ 70 పరుగులతో చెలరేగగా.. విరాట్ కోహ్లి సెంచరీ(113)తో మెరవడం హైలైట్‌గా నిలిచాయి. సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఇదిలా ఉంటే.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకను గెలిపించేందుకు ఆ జట్టు సారథి దసున్ షనక శాయశక్తులా ప్రయత్నించాడు. భారత గడ్డపై తొలి సెంచరీ(108 .. నాటౌట్) సాధించి సత్తా చాటాడు. అయితే, లంక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన భారత పేసర్ మహ్మద్ షమీ... సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఉన్న షనక (98 వద్ద) రనౌట్(మన్కడింగ్) చేశాడు. నిజానికి ఇది అవుటే! కానీ కెప్టెన్ రోహిత్... షమీ దగ్గరకొచ్చి వారించాడు. అందుకే వెనక్కి తీసుకున్నాం వెంటనే షమీ అంపైర్‌తో అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో షనక ఐదో బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘షమీ రనౌట్ చేశాడని నాకు తెలియదు. షనక 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో తను ఎందుకు అప్పీలు చేశాడో తెలియదు. ఏదేమైనా.. షనక అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తనను మరీ ఇలా అవుట్ చేయాలనుకోవడం భావ్యం కాదు కూడా! మేము అలా అనుకోలేదు! హ్యాట్సాఫ్ షనక. తను నిజంగా అత్యద్భుతంగా ఆడాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తన విషయంలో వెనక్కి తగ్గినా పర్లేదనుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా షనక విషయంలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన హిట్‌మ్యాన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడిని కొనియాడుతూ.. ‘‘లవ్ యూ భాయ్’’ అని పోస్టులు పెడుతున్నారు. ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి వన్డే స్కోర్లు: ఇండియా- 373/7 (50) శ్రీలంక- 306/8 (50) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి చదవండి: WTC: భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్ Captain @ImRo45 explains why he withdrew the run-out appeal at non striker’s end involving Dasun Shanaka.#INDvSL @mastercardindia pic.twitter.com/ALMUUhYPE1 — BCCI (@BCCI) January 10, 2023 -
దసున్ షనక సెంచరీ వృధా.. శ్రీలంకపై భారత్ ఘన విజయం
గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 67పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగల్గింది. లంక కెప్టెన్ దసున్ షనక(108) ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. లంక బ్యాటర్లలో షనకతో పాటు ఓపెనర్ నిస్సాంక 72 పరుగులతో అకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, షమీ,హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరగనుంది. చదవండి: IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్ -
Ind Vs SL: తొలి వన్డే.. టాస్ గెలిచిన లంక! అర్ష్‌దీప్, కుల్దీప్‌నకు నో ఛాన్స్
India vs Sri Lanka, 1st ODI: టీమిండియాతో తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచింది. లంక కెప్టెన్ దసున్ షనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా అసోంలోని గువహటిలో గల బర్సపర వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌తో వన్డే సిరీస్ ఆరంభం కానుంది. కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై గతంలో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా గెలుపొందింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడే నిమిత్తం శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్‌లో లంకను 2-1తో ఓడించింది. ఇక వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ వన్డే సిరీస్‌లోనూ ఫేవరెట్‌గా ఉండగా.. లంక జట్టులో అందరు ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. ఇషాన్ అవుట్! అర్ష్‌దీప్, కుల్దీప్ బెంచ్ మీదే.. ఊహించినట్లుగానే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అదే విధంగా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. పేస్ విభాగంలో షమీ, సిరాజ్, ఉమ్రాన్‌కు ఛాన్స్ రాగా.. అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. స్పిన్నర్లలో కుల్దీప్‌నకు మొండిచేయి ఎదురైంది. సీనియర్ యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్ తొలి వన్డే ఆడనున్నారు. ఇదిలా ఉంటే.. లంక తరఫున దిల్షాన్ మధుషంక వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక. చదవండి: Rohit Sharma: ఎందుకు ఏడుస్తున్నావు? నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయి! వీడియో వైరల్ -
Ind Vs SL: ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే! సూర్య, ఉమ్రాన్ అవుట్!
India vs Sri Lanka, 1st ODI: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. టీ20 సిరీస్‌లో శ్రీలంకను ఓడించిన భారత జట్టు ప్రస్తుతం వన్డేలకు సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువహటి వేదికగా దసున్ షనక బృందంతో రోహిత్ సేన మంగళవారం తొలి వన్డే ఆడనుంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో మరింత బలంగా కనిపిస్తోంది. సిరీస్ గెలుపే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతుండగా.. లంక సైతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా వన్డే సిరీస్‌కు టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రాకతో.. టీ20లలో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. మరో యువ ఓపెనర్, వన్డేల్లో సత్తా చాటుతున్న శుబ్‌మన్ గిల్, రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తుదిజట్టులో ఆడే అవకాశం దక్కకకపోవచ్చు. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న కేఎల్ రాహుల్‌కు తోడు శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఉన్న నేపథ్యంలో సూర్య వేచ్చి చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. బౌలింగ్ విభాగంలో సీనియర్లు షమీ, సిరాజ్ రాకతో ఉమ్రాన్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అర్ష్‌దీప్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తోడు స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్, వాతావరణం బర్సపర స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ గ్రౌండ్లో 2018లో ఒకే ఒక వన్డే జరిగింది. విండీస్ 322 పరుగులు చేసినా, భారత్ 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్, పాతుమ్ నిసాంక, అవిష్క, ధనంజయ, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, కుమార. చదవండి: రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే! సూర్యను ఆకాశానికెత్తిన దిగ్గజం -
Ind Vs SL: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! ఒక్కడి దగ్గరా..
IPL 2023 Mini Auction- India vs Sri Lanka: శ్రీలంక కెప్టెన్ దసున్ షనక పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. వాంఖడేలో జరిగిన తొలి టీ20లో 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇక రెండో టీ20లో 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు. అంతేకాదు.. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను దెబ్బకొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో 31 బంతుల్లో 65 పరుగులతో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేలా కనిపించిన అక్షర్ పటేల్‌ను షనక పెవిలియన్‌కు పంపాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో తానే రంగంలోకి దిగి బంతిని అందుకున్నాడు. చివరి ఓవర్ మూడో బంతికి అక్షర్‌ను.. ఆఖరి బంతికి శివం మావిని అవుట్ చేశాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా మరోసారి తన విలువేంటో నిరూపించుకున్నాడు దసున్ షనక. కాగా టీమిండియా- శ్రీలంక టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. మొత్తంగా రెండు టీ20ల్లో 101 పరుగులు(స్ట్రైక్‌రేటు 206.12) చేసిన 31 ఏళ్ల దసున్ షనక.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కరి దగ్గరా డబ్బుండేది కాదు! బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చర్చ సందర్భంగా దసున్ షనకపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నా దగ్గరైతే తనను కొనగలిగేంత డబ్బు లేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా? ఒక్కసారి ఊహించుకోండి.. తను ఎంతటి భారీ ధరకు అమ్ముడుపోయేవాడో! నాకు తెలిసి ఏ ఒక్క ఫ్రాంఛైజీ దగ్గర షనకను కొనుగోలు చేసేంత డబ్బు ఉండేది కాదనుకుంటున్నా’’ అని గౌతీ.. లంక సారథిని కొనియాడాడు. కాగా గత కొంతకాలంగా టీ20లలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న దసున్ షనక రూ. 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2023 మినీ వేలంలోకి వచ్చాడు. నిరాశే మిగిలింది! అయితే, ఆశ్చర్యకరంగా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి పట్ల ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. కాగా డిసెంబరు 23న జరిగిన వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 17.5 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే.. Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే..
రాజ్‌కోట్: టి20 సిరీస్‌లో ఆఖరి పోరుకు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. ఇరు జట్ల లక్ష్యం ఒక్కటే... సిరీస్ వశం చేసుకోవడం. దీంతో నిర్ణాయక పోరు మరింత ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్ ఫలితం, ప్రదర్శన చూస్తే ఆతిథ్య జట్టు కంటే శ్రీలంక జట్టే మేటిగా ఉంది. టీమిండియా గతి తప్పిన బౌలింగ్, టాపార్డర్ వైఫల్యం ఏమాత్రం కొనసాగినా మ్యాచే కాదు... సిరీస్‌నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా భారత శిబిరంపైనే ఉంది. పొట్టి సిరీస్ గెలుచుకోవాలంటే గట్టి పోరాటం చేయాల్సిందే! ఓపెనర్లు మెరిపించాలి గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ నిరాశపరిచారు. వీరిద్దరు శుభారంభం ఇవ్వలేకపోయారు. తొలి మ్యాచ్‌లో కిషన్ రాణించినా పెద్దగా మెరిపించలేకపోయాడు. కీలకమైన ఆఖరి పోరులో ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే అది ఇన్నింగ్స్‌పై కచి్చతంగా ప్రభావం చూపిస్తుంది. సూర్యకుమార్ ఫామ్‌లో ఉన్నాడు. అతనిపై జట్టు మేనేజ్మెంట్కు ఏ బెంగా లేదు. అక్షర్ పటేల్ రూపంలో అదనపు బ్యాటింగ్ బలం కనిపిస్తున్నప్పటికీ రెగ్యులర్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా బ్యాట్లకు పనిచెబితేనే లంక బౌలింగ్‌పై పట్టు సాధించవచ్చు. అప్పుడే పోరాడే స్కోరైనా... ఛేదించే లక్ష్యమైనా సాకారమవుతుంది. బెంగంతా బౌలింగ్‌పైనే... ఈ సిరీస్‌లో భారత బౌలింగ్ తీసికట్టుగానే ఉంది. ప్రధాన బౌలర్లే ఓవర్‌కు పది పైచిలుకు పరుగులు ఇవ్వడం జట్టును ఆందోళన పరుస్తోంది. అర్‡్షదీప్ గత మ్యాచ్ ‘నోబాల్స్’ను మరిచి లయ అందుకోవాల్సి ఉంది. ఉమ్రాన్ మలిక్ నిప్పులు చెరుగుతున్నప్పటికీ వైవిధ్యం కొరవడటంతో ధారాళంగా పరుగులు సమరి్పంచుకుంటున్నాడు. చహల్ మ్యాజిక్ కరువైంది. మొత్తంగా నిలకడలేని బౌలింగ్ జట్టుకు ప్రతికూలంగా పరిణమించింది. నిర్ణాయక పోరులో సమష్టి బాధ్యత కనబరిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదంటే కష్టాలు తప్పవు. ఆత్మవిశ్వాసంతో లంక సేన గత మ్యాచ్ ఫలితమే కాదు... ఆటతీరు కూడా శ్రీలంక జట్టులో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. బ్యాటింగ్‌లో మెరుపులు, ఆరంభంలో వికెట్లు షనక సేనను పైచేయిగా నిలబెట్టింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్ మెండిస్‌లతో పాటు అసలంక, షనక ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కసున్ రజిత, మదుషంక, షనక సమష్టిగా భారత బ్యాటర్స్‌ను వణికించారు. సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లోనూ తమ జోరు కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌కు స్వర్గధామమైన రాజ్‌కోట్ పిచ్‌పై మరోసారి తమ బ్యాటింగ్ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. -
IND vs SL: రెండో టీ20.. ఉత్కంఠపోరులో శ్రీలంక విజయం (ఫొటోలు)
-
భారత్ చెత్త బౌలింగ్.. చితక్కొట్టిన శ్రీలంక బ్యాటర్లు!
పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ దసన్ శనక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. అతడితో పాటు ఓపెనర్ కుశాల్ మెండిస్ (52), అసలంక(37) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. భారత చెత్త బౌలింగ్.. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మినహా మిగితందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఏకంగా 7 నోబాల్స్ వేశారు. అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఐదు నో బాల్స్ వేయడం గమానార్హం. రెండు ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ 37 పరుగులు, ఉమ్రాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 48 పరుగులు, శివమ్ మావి తన నాలుగు ఓవర్ల కోటాలో 53 పరుగులు ఇచ్చారు. చదవండి: IND vs SL: ఏంటి అర్ష్‌దీప్ బౌలింగ్ మర్చిపోయావా? ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ -
IND Vs SL: ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం (ఫొటోలు)
-
ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం
శ్రీలంకతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై విజయానికి రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. లంకకు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు. పాండ్యా నమ్మకాన్ని వమ్ము చేయని అక్షర్ పటేల్ 20 ఓవర్లో 13 పరుగులకు గాను 11 పరుగులే ఇచ్చాడు. దీనికి తోడు చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో దాసున్ షనక 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుషాల్ మెండిస్ 28, చమిక కరుణరత్నే 23 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శివమ్ మావి 4 వికెట్లు తీయగా..ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరొక రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో దీపక్ హుడా(41 నాటౌట్),అక్షర్ పటేల్(31 నాటౌట్) టీమిండియా ఇన్నింగ్‌సను నిలబెట్టారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో హసరంగా, దనుంజయ డిసిల్వా, దిల్షాన్ మధుషనక, కరుణరత్నే, తీక్షణలు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జనవరి 5(గురువారం) పుణే వేదికగా జరగనుంది. -
Ind Vs SL: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు!
India vs Sri Lanka, 1st T20I- Hardik Pandya: ‘‘మేము గతం గురించి ఆలోచించడం లేదు. అయితే, ఒక్కటి మాత్రం నిజం. వాళ్లు ఇండియాలో ఉన్నారన్న భావన కలిగేలా చేస్తాం. కావాల్సినంత మజా అందిస్తాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ మంగళవారం నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన పాండ్యా ప్రత్యర్థి జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో శ్రీలంక చేతిలో ఓటమి గురించి ఆలోచించడం లేదన్న హార్దిక్ పాండ్యా.. ‘‘వాళ్లు (శ్రీలంక) మేటి అంతర్జాతీయ జట్టు ఇండియాతో.. అది కూడా ఇండియాలో ఆడుతున్నారన్న భావన కచ్చితంగా కలిగిస్తాం. మా కుర్రాళ్ల తరఫున నేను మీకు మాట ఇస్తున్నా. మేము వాళ్లను స్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మా బాడీ లాంగ్వేజ్ చాలు వాళ్లను భయపెట్టడానికి మా బాడీ లాంగ్వేజ్ చాలు. మీరు మంచి గేమ్ చూడబోతున్నారని మాట ఇస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో లంక చేతిలో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో పాండ్యా.. ఆసియా చాంపియన్ దసున్ షనక బృందాన్ని ఢీకొట్టనున్నాడు. చదవండి: BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా -
Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! ఇషాన్, రుతు.. ఇంకా అర్ష్..
India vs Sri Lanka, 1st T20I- ముంబై: ఈ కొత్త సంవత్సరం భారత యువ క్రికెటర్లకు లక్కీ చాన్స్ ఇస్తోంది. స్టార్లు లేని టీమిండియాలో ఓ పూర్తి స్థాయి సిరీస్ ఆడేందుకు చక్కని అవకాశం కల్పించింది. ముఖ్యంగా టాపార్డర్‌లో సత్తా చాటుకునేందుకు కుర్రాళ్లకు ఇంతకు మించిన సదవకాశం ఉండదేమో! భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మూడు టి20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ మంగళవారం వాంఖడేలో జరుగుతుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో నూతన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇన్నాళ్లు అడపాదడపా ఓపెనింగ్‌లో అవకాశాలు పొందిన ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో సత్తా చాటుకోవాలి. ముఖ్యంగా పవర్‌ప్లేలో తమ బ్యాటింగ్ పవర్ చూపించాల్సిందే! ‘సూర్య’ ప్రతాపం కొనసాగేనా గతేడాది ఆసాంతం సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. ఒక్క ఏడాదిలోనే ఐసీసీ టి20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్ర స్థానానికి ఎగబాకాడు. ముఖ్యంగా ప్రతీ సిరీస్‌లోనూ తన మార్కు ఆటతీరుతో రాణించాడు. భారత 360 డిగ్రీ బ్యాటర్‌గా రూపాంతరం చెందాడు. ప్రత్యర్థి పేస్ బౌలర్ల పాలిట సూర్య ప్రతాపం ఎంత చెప్పకున్నా తక్కువే. ఇదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో సూర్య ఉన్నాడు. రోహిత్, కోహ్లి, రాహుల్ లేని టాప్ ఆర్డర్‌కు సూర్యకుమారే ఇప్పుడు పెద్ద దిక్కు. పెరిగిన బాధ్యతలతో జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వుంటుంది. పగ్గాలు అప్పగించిన ప్రతీసారీ నిరూపించుకున్న హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ మెరుపులు కూడా తోడయితే లంకేయులకు కష్టాలు తప్పవు. మిడిలార్డర్లో దీపక్ హుడా, సంజూ శాంసన్‌లే కూడా బ్యాటింగ్‌లో బాధ్యతను పంచుకుంటే తక్కువ దూరంలో బౌండరీ ఉన్న వాంఖెడేలో భారీ స్కోర్లు ఏమంత కష్టం కానేకాదు. అర్ష్‌దీప్‌పై భారం ప్రస్తుత భారత జట్టులో అనుభవజ్ఞులైన పేసర్లు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే జట్టులో ఇప్పుడున్న ఏకైక సీనియర్ బౌలర్ చహల్ ఒక్కడే! అతను స్పిన్‌తో కట్టడి చేయగలడు. అయితే సీమ్ బౌలింగ్‌ను నడిపించేది మాత్రం అర్ష్‌దీప్ సింగే. గడచిన ఐదారు నెలల్లో అర్ష్‌దీప్ తన పేస్ వాడి ఏంటో చూపెట్టాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అతని ప్రతిభను గుర్తించి పదేపదే అవకాశాలిస్తోంది. స్పీడ్‌తో ఉమ్రాన్ మాలిక్, పేస్ వైవిధ్యంతో హర్షల్ పటేల్, స్పిన్‌తో వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఏ మేరకు కళ్లెం వేయగలరో చూడాలి. ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! శ్రీలంక మిగతా ఫార్మాట్లలో ఎలా వున్నప్పటికీ పొట్టి ఫార్మాట్లో గట్టి ప్రత్యర్థే! ఆసియా కప్ టి20 చాంపియన్ శ్రీలంక జట్టులో మెరుపులు మెరిపించే బ్యాటర్స్‌కు కొదవే లేదు. కెప్టెన్ షనక, నిసాంక, కుశాల్ మెండిస్, భానుక రాజపక్స, సమరవిక్రమ అందరు మంచి ఫామ్‌లో ఉన్నారు. పైగా అనుభవజ్ఞులు లేని భారత బౌలింగ్‌పై వీళ్లు విరుచుకుపడితే భారీ స్కోర్లకు కొరత ఉండదు. బౌలింగ్ విషయానికి వస్తే హసరంగ స్పిన్ మ్యాజిక్‌తో పాటు తీక్షణ, మదుశంక, లహిరు కుమారల రూపంలో శ్రీలంక బౌలింగ్ మెరుగ్గానే ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, సూర్యకుమార్, సామ్సన్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చహల్, హర్షల్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్ మెండిస్, ధనంజయ, అసలంక, చమిక కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, లహిరు కుమార. పిచ్–వాతావరణం వాంఖెడే పిచ్ ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్లో మెరుపులకు చక్కని అవకాశం కల్పిస్తుంది. దీంతో భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం వల్ల టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు. చదవండి: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవాకు ఒకేసారి రెండు క్యాన్సర్లు Pele: చివరి చూపు కోసం... A new year 🗓️ A new start 👍🏻 A new Vice-captain - @surya_14kumar - for the Sri Lanka T20I series 😎#TeamIndia had their first practice session here at Wankhede Stadium ahead of the T20I series opener in Mumbai 🏟️#INDvSL | @mastercardindia pic.twitter.com/qqUifdoDsp — BCCI (@BCCI) January 2, 2023 -
Ind Vs SL: ఇండియా వర్సెస్ శ్రీలంక.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు
Sri Lanka Tour of India 2023: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో టీమిండియా కొత్త సంవత్సరం ఆరంభించనుంది. మంగళవారం (జనవరి 3) లంకతో టీ20 మ్యాచ్‌తో 2023 ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌లలో భాగంగా మొత్తంగా మూడు టీ20, మూడు వన్డేల్లో స్వదేశంలో తలపడనుంది. ఈ నేపథ్యంలో పూర్తి షెడ్యూల్, ఇరు జట్ల వివరాలు, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం.. తదితర అంశాలు గమనిద్దాం. ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్ 2023 మూడు టీ20లు ►మొదటి టీ20: జనవరి 3, మంగళవారం- వాంఖడే స్టేడియం, ముంబై ►రెండో టీ20: జనవరి 5, గురువారం- మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె ►మూడో టీ20: జనవరి 7, శనివారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్ ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటలకు ప్రారంభం ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ 2023 మూడు వన్డేలు ►తొలి వన్డే: జనవరి 10, మంగళవారం- బర్సాపర క్రికెట్ స్టేడియం, గువాహటి ►రెండో వన్డే: జనవరి 12, గురువారం- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ►మూడో వన్డే: జనవరి 15, ఆదివారం- గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే? ►ఇండియా వర్సెస్ శ్రీలంక 2023 సిరీస్‌ల మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం ►స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు తదితర చానెళ్లలో వీక్షించవచ్చు. ►డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్షప్రసారం. టీమిండియా టి20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్, మావి, ముకేశ్ కుమార్. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్ సింగ్ శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్ కెప్టెన్), ఆషేన్ బండార, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే). చదవండి: BBL: సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా? BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? -
Ind Vs SL: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన
India vs Sri Lanka 2023 T20 And ODI Series- కొలంబో: భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లలో పాల్గొనే శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కలిపి 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు షనక సారథ్యం వహిస్తాడు. కాగా వచ్చే నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. టీమిండియాతో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక బోర్డు సైతం టీమిండియాను ఢీకొట్టే తమ జట్టు వివరాలు బుధవారం వెల్లడించింది. రెండు సిరీస్‌లకు దసున్ షనక కెప్టెన్ కాగా.. వన్డేలకు కుశాల్ మెండిస్, టీ20లకు వనిందు హసరంగ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక టీమిండియా- శ్రీలంక మధ్య 3, 5, 7 తేదీల్లో టీ20, 10, 12, 15 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్‌తో సిరీస్- శ్రీలంక జట్టు వివరాలు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్ కెప్టెన్), ఆషేన్ బండార, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే) ►టి20లకు మాత్రమే: భానుక రాజపక్స, తుషార. ►వన్డేలకు మాత్రమే: వండెర్సే, నువానిడు ఫెర్నాండో. చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. ఇద్దరు ఏపీ అమ్మాయిలకు చోటు! Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్ వెళ్లి ఆడుకో! ఇక్కడుంటే.. -
SL Vs ENG: ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం.. సెమీస్‌కు
ICC Mens T20 World Cup 2022- England vs Sri Lanka Updates: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ 47 పరుగులతో రాణించగా.. బెన్ స్టోక్స్ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో బట్లర్ బృందం టీ20 ప్రపంచకప్-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు: టాస్: శ్రీలంక శ్రీలంక: 141/8 (20) ఇంగ్లండ్: 144/6 (19.4) మొయిన్ అలీ ఔట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ధనంజయ బౌలింగ్‌లో షనకకు క్యాచ్ ఇచ్చి మొయిన్ అలీ (1) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 113. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 14వ ఓవర్ తొలి బంతికి కుమార బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి లివింగ్‌స్టోన్ (4) ఔటయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రూక్ అవుట్ డిసిల్వ బౌలింగ్‌లో బ్రూక్(4) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టోక్స్, లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 93/3 (11.1) రెండో వికెట్ డౌన్ అర్ధ శతకానికి చేరువగా ఉన్న హేల్స్(47)ను హసరంగ బౌల్డ్ చేశాడు. పదో ఓవర్ తొలి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు: 82/2 (9.1). బ్రూక్, స్టోక్స్ క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఓపెనర్ హసరంగ బౌలింగ్‌లో కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరెంతంటే! స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. లంక బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వీలు చిక్కినప్పుడల్లా బంతికి బౌండరీకి తరలిస్తూ పరుగులు పిండుకుంటున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 70/0 (6). బట్లర్ 25, అలెక్స్ హేల్స్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెమీస్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగంది ఇంగ్లండ్. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్ పాతుమ్ నిసాంక 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో చివరి ఓవర్లోనే లంక రాజపక్స, హసరంగ, కరుణరత్నె వికెట్లు కోల్పోయింది. రాజపక్స అవుట్ రాజపక్స(22) రూపంలో ఆరో వికెట్ కోల్పోయింది. హసరంగ, కరుణరత్నె క్రీజులో ఉన్నారు. నిరాశ పరిచిన కెప్టెన్ లంక కెప్టెన్ దసున్ షనక మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో లంక ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 128/5 (18). హసరంగ, రాజపక్స క్రీజులో ఉన్నారు. నిసాంక ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేసిన రషీద్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో నిసాంక(67) అవుటయ్యాడు. దీంతో లంక నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు- 118/4 (15.3). రాజపక్స, దసున్ షనక క్రీజులో ఉన్నారు. అర్ధ శతకంతో జోరు మీదున్న నిసాంక 14 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 104/3. భనుక రాజపక్స 7, పాతుమ్ నిసాంక 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన లంక స్టోక్స్ బౌలింగ్‌లో మలన్‌కు క్యాచ్ ఇచ్చిన అసలంక(8) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో స్కోరు: 80-2 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) రెండో వికెట్ కోల్పోయిన లంక డిసిల్వ(9) రూపంలో లంక రెండో వికెట్ కోల్పోయింది. అసలంక క్రీజులోకి వచ్చాడు. దంచి కొడుతున్న నిసాంక 8 ఓవర్లలో లంక స్కోరు: 71-1. నిసాంక 42, డిసిల్వ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి లంక స్కోరు: 54/1 (6) తొలి వికెట్ కోల్పోయిన లంక లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(18).. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 39-1. పాతుమ్ నిసాంక 19, ధనుంజ డి సిల్వా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చావో రేవో టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 గ్రూప్-1లో శ్రీలంకతో మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావో రేవోలా తయారైంది. లంకపై గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఆస్ట్రేలియా సెమీస్‌కు.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్లనుంది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో కచ్చితంగా ఇంగ్లండ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. వర్షం అంతరాయం వల్ల ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్.. నాలుగు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో ఉంది. అయితే నెట్ రన్‌రేట్ ప్లస్‌లో ఉండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశం. లంకపై సాధారణ విజయం నమోదు చేసినా ఇంగ్లీష్ జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. అంతిమంగా ఇంగ్లండ్‌కు కావాల్సింది విజయం. ఇంగ్లండ్: జోస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత ఇక ఇంగ్లండ్ జట్టులో హిట్టర్లకు కొదువ లేదు. బ్యాటింగ్‌లో తొలి స్థానం నుంచి 10వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు జట్టులో ఉన్నారు. బట్లర్, స్టోక్స్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్‌లతో టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తుండగా.. మిడిలార్డర్లో లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీలు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్, సామ్ కరన్‌లు తమ పేస్ పదును చూపిస్తుండగా.. ఆదిల్ రషీద్ స్పిన్‌తో అదరగొడుతున్నాడు. అటు శ్రీలంక మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్‌ను తమతో పాటు ఇంటికి తీసుకుపోవాలని భావిస్తుంది. అయితే లంక జట్టు ప్రస్తుతం అనుకున్న రీతిలో ఆడడం లేదు. ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా దెబ్బతీశాయి. విజయంతో టోర్నీని ముగించాలని లంక ఆశిస్తుంది. ► ఇరుజట్ల రికార్డులు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 13 సార్లు తలపడగా ఇంగ్లండ్ 9సార్లు.. శ్రీలంక నాలుగుసార్లు నెగ్గాయి. -
లంకకు ఏమైంది.. ఎందుకిలా?
టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక పోరాటం సూపర్-12లోనే ముగిసేలా కనిపిస్తోంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 102 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం లంక కొంప ముంచింది. 168 పరుగుల టార్గెట్ అంత కష్టం కాకపోయినా.. కాస్త కష్టపడితే చేధించే అవకాశం ఉంటుంది. కానీ లంక బ్యాటర్లలో అది ఏ కోశానా కనపడలేదు. లంక టాపార్డర్ అయితే మరీ దారుణం. ఏదో వచ్చామా.. ఆడామా వెళ్లామా అన్నట్లుగా నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకున్నారు. మధ్యలో బానుక రాజపక్స 34, కెప్టెన్ దాసున్ షనక 35 పరుగులతో లంక ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరు ఒకేసారి ఔటవ్వడం లంకను దెబ్బ తీసింది. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం మళ్లీ మొదలు. చివరకు 102 పరుగుల వద్ద ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసి దారుణ రన్‌రేట్‌తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. విచిత్రమేంటంటే.. ఆఫ్గన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు రద్దు కాగా.. ఒకటి ఓడిపోయింది. అయినా కూడా వారి రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ఐదో స్థానంలో ఉంది. దాదాపు నెలరోజుల కిందట ఆసియా కప్ 2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఈ విజయాన్ని లంకతో పాటు క్రికెట్‌ను అభిమానించే దేశాలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎందుకంటే అంతకముందు లంక ఎన్నడు చూడని ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోయింది. ఆసియా కప్ టైటిల్ గెలవడం లంకకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. లంక ప్రజలకు ఇది కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు ఈ విజయం ఊరటనిచ్చింది. అయితే గతేడాది ప్రదర్శన కారణంగా ఈసారి టి20 ప్రపంచకప్‌కు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. అయితే క్వాలిఫయింగ్ పోరులో తొలి మ్యాచ్‌లోనే లంకకు నమీబియా గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ ఓటమిని మరిపిస్తూ వరుసగా విజయాలు నమోదు చేసిన లంక గ్రూఫ్ టాపర్‌గా సూపర్-12లో అడుగుపెట్టింది. దీంతో ఈసారి ప్రపంచకప్‌లో శ్రీలంక అండర్డాగ్స్ అని.. కచ్చితంగా టైటిల్ కొడుతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అండర్డాగ్స్ కాస్త తేలిపోయారు. కనీసం సెమీఫైనల్‌కు వెళ్లినా బాగుండు అనుకున్నవాళ్లకి ఆ అవకాశం లేకుండా పోయింది. మరి లంక దారుణ ప్రదర్శన వెనుక కారణాలు ఏమున్నాయని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా లంకను గాయాలు దెబ్బతీశాయి. టి20 ప్రపంచకప్ ఆరంభంలోనే దనుష్క గుణతిలక లాంటి స్టార్ ప్లేయర్ దూరమవడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత దుష్మంత చమీరా, దిల్షాన్ మధుషనకలు కూడా గాయాలతో దూరమయ్యారు. తాజాగా కివీస్‌తో మ్యాచ్‌కు ముందు జట్టు స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో కూడా తొడ కండరాల గాయంతో తప్పుకోవడం లంకను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. రెండు ఓటములు నమోదు చేసిన లంక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. గ్రూఫ్-1లో ఉన్న అన్ని జట్లకు వర్షం అడ్డంకిగా నిలిచింది.. ఒక్క శ్రీలంకకు తప్ప. లంక తాను ఆడిన మూడు మ్యాచ్‌లు పూర్తిగానే జరిగాయి. ఈ అవకాశాన్ని లంక సరిగా వినియోగించుకోలేక చేతులెత్తేసింది. చదవండి: సెంచరీతో పాటు సిక్సర్ల రికార్డు.. అరుదైన క్రికెటర్‌గా ఘనత కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కుశాల్ మెండిస్ మెరుపులు.. ఐర్లాండ్‌పై లంక ఘన విజయం
సూపర్-12లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది.129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 15 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు నాటౌట్ చెలరేగగా.. ధనుంజయ డిసిల్వా 31, చరిత్ అసలంక 31 పరుగులు నాటౌట్ రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డిలానీ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్ తీశారు. 10 ఓవర్లలో లంక స్కోరు 75/1 ►10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 38, చరిత్ అసలంక 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 31 పరుగులు చేసిన డిసిల్వా డిలానే బౌలింగ్‌లో టక్కర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంక విజయానికి 60 బంతుల్లో 54 పరుగులు కావాలి. ధాటిగా ఆడుతున్న లంక.. విజయం దిశగా ►129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు జట్టు ఓపెనర్లు కుషాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వాలు శుభారంభం అందించారు. 8 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కుషాల్ 31, డిసిల్వాల 31 పరుగులతో అజేయంగా ఆడుతున్నారు. శ్రీలంక టార్గెట్ 129 ►సూపర్-12లో భాగంగా ఐర్లాండ్ జట్టు లంక ముందు 129 పరుగుల లక్ష్యాeన్ని నిర్దేశించింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్ తీశారు. 10 ఓవర్లలో ఐర్లాండ్ 60/4 ►10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. డాక్రెల్ 0, టెక్టర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రెండు పరుగులు చేసిన కాంఫెర్ కరుణరత్నే బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(35) రూపంలో ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్.. ►ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(35) రూపంలో ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్టిర్లింగ్ రాజపక్సకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఐర్లాండ్ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. 4 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 24/1 ► శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 13, లోర్కాన్ టక్కర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన ఆండ్రూ బాల్బర్నీ లాహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ► టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఇవాళ గ్రూఫ్-1లో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. క్వాలిఫయింగ్ పోరులో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో టాపర్‌గా నిలిచి ఏ1గా అడుగుపెట్టిన శ్రీలంక అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని సాధించింది. ఇరుజట్లు టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు తలపడగా(2009, 2021).. రెండుమార్లు విజయం లంకనే వరించింది. ఇక లంక తాను చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో ఏడు విజయాలు నమోదు చేయడం విశేషం. శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, అషెన్ బండార, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్ -
SL Vs NED: ఈ గ్రూపులో మేమే నంబర్ 1గా ఉంటామని తెలుసు.. కానీ..
ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs Netherlands, 9th Match, Group A: టీ20 ప్రపంచకప్-2021లో ఆకట్టుకోలేకపోయిన శ్రీలంక ఈసారి పసికూనలతో క్వాలిఫైయర్స్ ఆడింది. ఇందులో భాగంగా.. ఆసియా కప్-2022 విజేతగా నిలిచి అదే జోష్‌లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అడుగుపెట్టిన లంకకు ఆరంభ మ్యాచ్‌లోనే నమీబియా షాకిచ్చింది. దీంతో సూపర్-12కు అర్హత సాధించాలంటే గ్రూప్-ఏలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో యూఏఈని ఓడించింది. ఓపెనర్ పాతుమ్ నిసాంక 74 పరుగులతో చెలరేగగా.. బౌలర్లు విశ్వరూపం చూపించడంతో 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నెట్ రన్‌రేటును మెరుగుపరచుకుంది. గట్టి పోటీ ఎదురైంది! అదే జోరులో గురువారం(అక్టోబరు 20) నెదర్లాండ్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో బరిలోకి దిగిన శ్రీలంకకు.. ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓపెనర్ కుశాల్ మెండిస్(79) రాణించడంతో 162 పరుగుల స్కోరు చేయగలిగిన లంక.. వనిందు హసరంగ 3 వికెట్లతో చెలరేగడంతో ఆఖరికి 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మేము నంబర్ 1.. తద్వారా గ్రూప్-ఏ నుంచి సూపర్-12కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రూపులో మేము నంబర్ 1గా ఉంటామని తెలుసు. కానీ ఆరంభ మ్యాచ్‌లోనే మాకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, మా ఆటగాళ్ల ప్రదర్శన బాగానే ఉంది. ముఖ్యంగా బౌలింగ్ గ్రూపు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రోజు వికెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొదటి 10 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ప్రణాళికను అమలు చేయగలిగాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2022: క్వాలిఫైయర్స్ గ్రూప్-ఏ: శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ రౌండ్‌రాబిన్ పద్ధతిలో నిర్వహణ చదవండి: T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! ఆసియా కప్ నిర్వహణపై పాక్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన కేంద్ర క్రీడల మంత్రి View this post on Instagram A post shared by ICC (@icc) -
73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Sri Lanka vs United Arab Emirates, 6th Match, Group A: శ్రీలంక వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో శ్రీలంక విజయ భేరి మోగించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 17.1 ఓవర్లలోనే కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో చమీరా, హాసరంగా చెరో మూడు వికెట్లతో యూఏఈను దెబ్బ తీయగా.. తీక్షణ రెండు, షనక, మధుషాన్ తలా వికెట్ సాధించారు. ఇక యూఏఈ బ్యాటర్లలో ఆఫ్జల్ ఖాన్(19) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. 36 పరుగులకే 6 వికెట్లు.. ఓటమి దిశగా యూఏఈ 36 పరుగులకే యూఏఈ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9 పరుగులు చేసిన ఆరవింద్.. హాసరంగా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. యూఏఈ విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి. నాలుగో వికెట్ కోల్పోయిన యూఏఈ 21 పరుగుల వద్ద యూఏఈ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూరి.. మధుషాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక పేసర్ చమీరా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన వసీం.. చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. యూఏఈతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుశాల్ మెండిస్(18), ధనుజంయ డి సిల్వా(33) తప్ప మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. మరో వికెట్ కోల్పోయిన లంక లంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దసున్ షనక బృందం.. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్ నష్టపోయింది. 16వ ఓవర్లో అఫ్ఝల్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి హసరంగ.. బాసిల్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 121-6. చమిక కరుణరత్నె, పాథుమ్ నిసాంక క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు యూఏఈ బౌలర్ మెయప్పన్ శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ నాలుగో బంతికి రాజపక్సను పెవిలియన్‌కు పంపిన అతడు.. ఆ మరుసటి రెండు బంతుల్లో అసలంక, దసున్ షనకలను బౌల్డ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మెయప్పన్ హ్యాట్రిక్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 117-5 14 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరెంతంటే యూఏఈ జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 114/2 రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. పాథుమ్ నిసాంక, భనుక రాజపక్స క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 12వ ఓవర్ మొదటి బంతికే శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. అఫ్జల్ ఖాన్ బౌలింగ్‌లో ధనుంజయ (33పరుగులు) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 84/1 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(38), ధనుంజయ డి సిల్వా(27) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 42 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లక్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 57/1 2 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 19/0 2 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(13), నిస్సాంక(5) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో యూఏఈ, శ్రీలంక జట్లు చావోరేవో తేల్చుకోవడానికి శ్రీలంక సిద్దమయ్యాయి. గీలాంగ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు శ్రీలంక ఆటగాడు గుణతిలక గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో అసలంక తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందాయి. ఈ క్రమంలో సూపర్-12 అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ యూఏఈ: చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, కాషిఫ్ దౌద్, వృత్త్యా అరవింద్(వికెట్ కీపర్), ఆర్యన్ లక్రా, బాసిల్ హమీద్, చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! -
శ్రీలంకకు బిగ్ షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2022 రౌండ్-1లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు నమీబియా గట్టి షాకిచ్చింది. గీలాంగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ శనక(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక 88 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 75 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రాజపాక్స్.. బెర్నార్డ్ స్కోల్ట్జ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 72/4 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో భానుక రాజపాక్స(19), శనక(22) పరుగులతో ఉన్నారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన శ్రీలంక శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బెన్ షికోంగో వేసిన నాలుగో ఓవర్లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. 4 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 22/3 తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. డేవిడ్ వైస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. రాణించిన నమీబియా బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్‌లో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్ సాధించారు. 15 ఓవర్లకు నమీబియా స్కోర్: 95/6 15 ఓవర్లు ముగిసే సరికి నమీబియా 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. క్రీజులో జాన్ ఫ్రైలింక్(14), జేజే స్మిత్(1) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు నమీబియా స్కోర్: 59/3 10 ఓవర్లు ముగిసే సరికి నమీబియా మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో గెర్హార్డ్ ఎరాస్మస్(11),స్టీఫన్ బార్డ్(15) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన నమీబియా 16 పరుగుల వద్ద నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దివాన్ లా కాక్.. ప్రమోద్ మధుషాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు నమీబియా స్కోర్: 24/2 తొలి వికెట్ కోల్పోయిన నమీబియా 3 పరుగుల వద్ద నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన మైఖేల్ వాన్ లింగేన్.. చమీరా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2022కు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ రౌండ్-1(గ్రూప్-ఎ)లో భాగంగా తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమిబీయా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మధుషాన్, మహేశ్ తీక్షణ నమీబియా: స్టీఫన్ బార్డ్, డేవిడ్ వైస్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జేజే స్మిట్, జాన్ ఫ్రైలింక్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), దివాన్ లా కాక్, మైఖేల్ వాన్ లింగేన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో -
SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పరాభవం.. అఫ్గనిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. కానీ ఆ తర్వాత శ్రీలంక జట్టు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. బంగ్లాదేశ్‌పై తొలి గెలుపు నమోదు చేసిన దసున్ షనక బృందం విజయాల బాట పట్టి టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచింది. సూపర్-4లో వరుసగా అఫ్గనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్లను ఓడించి ఫైనల్ చేరి.. తుదిపోరులో మరోసారి పాక్‌ను మట్టికరిపించి ఆసియా కప్ 15వ ఎడిషన్ విజేతగా అవతరించింది. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షోభం దృష్ట్యా.. సొంత ప్రేక్షకుల కేరింతల నడుమ అందుకోవాల్సిన ట్రోఫీని దుబాయ్ గడ్డపై ముద్దాడింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమ దేశ ప్రజలకు.. ఈ మెగా టోర్నీలో విజయంతో ఉపశమనం కలిగించి.. వాళ్ల ముఖాలు విజయదరహాసంతో వెలిగిపోయేలా చేసింది యువ ఆటగాళ్లతో కూడిన లంక జట్టు. అసాధారణ.. అద్వితీయ గెలుపు కోటి రూపాయలకు పైగా ప్రైజ్‌మనీ సాధించి దేశానికి శుభవార్త అందించింది. క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన ఈ గెలుపు నిజంగా అసాధారణమైనది. వారు పంచిన ఆనంతం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ మీద టాస్ గెలిస్తేనే విజయం అన్న అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ జయకేతనం ఎగురవేసి.. గెలుపులోని అసలైన మజాను రుచిచూసింది. మాకు సీఎస్కే ఆదర్శం! ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ మ్యాచ్‌లో.. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 2021 చెన్నై ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసి.. గెలిచింది. మేము మ్యాచ్ ఆడుతున్నపుడు నా మదిలో ఇదే విషయం మెదిలింది. మా జట్టులోని యువ ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నారు. ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వనిందు నిజంగా తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రభావం చూపాడు. చమిక, ధనుంజయ డి సిల్వా కూడా బాగా బ్యాటింగ్ చేశారు. చివరి బాల్‌ను సిక్స్‌గా మలచడం మాకు టర్నింగ్ పాయింట్. 160 పరుగుల స్కోరు అనేది ఛేదించదగ్గ లక్ష్యంగానే కనిపిస్తుంది. అయితే, 170 మార్కు మానసికంగా ప్రత్యర్థిపై కాస్త ఒత్తిడి పెట్టేందుకు ఉపకరిస్తుంది. ఇక మధుషంక గురించి చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌గా తనకు నేను ఎంత వరకు అండగా ఉండాలో అంత వరకు మద్దతుగా నిలిచాను’’ అని షనక చెప్పుకొచ్చాడు. కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్-2021 రెండో దశ మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు చెన్నై.. ఇప్పుడు శ్రీలంక ఈ క్రమంలో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లలో దాదాపు అన్నింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే, ఫైనల్లో ధోని సేన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. 27 పరుగుల తేడాతో మోర్గాన్ బృందాన్ని మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై అదే తరహాలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. పాక్‌ను 23 పరుగులతో ఓడించి ఆసియా కప్-2022 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ.. -
ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!
ఆసియాకప్-2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఛాంపియన్‌గా శ్రీలంక అవతరిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(55) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీయగా.. హాసరంగా మూడు, కరుణరత్నే రెండు వికెట్లు సాధించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడితో పాటు వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. తొలి బంతికే పది పరుగులు పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ వేసిన శ్రీలంక పేసర్ మధు శంక మొదటి బంతికే ఏకంగా 10 పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే నోబాల్‌గా మధుశంక వేశాడు. అనంతరం పాక్ బ్యాటర్లకు ఫ్రీహిట్ లభించింది. అయితే వరుసగా నాలుగు బంతులను కూడా వైడ్‌గానే అతడు వేశాడు. అందులో ఓ బంతి వైడ్‌తో పాటు బౌండరీకి కూడా వెళ్లింది. దీంతో తొలి ఐదు బంతులు లెక్కలోకి రాకుండానే ఎక్స్‌ట్రాస్ రూపంలో పాకిస్తాన్‌కు 9 పరుగులు వచ్చాయి. ఎట్టకేలకు ఆరో బంతిని మధుశంక సరిగ్గా వేశాడు. ఈ ఫ్రీహిట్ బంతికి సింగిల్ మాత్రమే పాక్బ్యాటర్ రిజ్వాన్ సాధించాడు. దీంతో తొలి బంతి పడేటప్పటికి పాక్ ఖాతాలో 10 పరుగులు వచ్చి చేరాయి. మధుశంక బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 0 ball 9 Runs 😂 It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr — Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
ఎన్నాకెన్నాళ్లకు.. ఆసియా కప్‌తో లంకలో పండుగ (ఫొటోలు)
-
పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫైనల్ బరిలో శ్రీలంక, పాకిస్తాన్.. ఆసియా కప్ కొట్టేదెవరు?
ఆసియా కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఆసియా కప్‌లో చాలా మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో టాస్ మరోసారి కీలకం కానుంది. ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను ఓడించిన లంక మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఆడనుంది. ఆసియా కప్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే! మరోవైపు పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బ్యాటింగ్‌లో మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవరూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. అయితే పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉండడం సానుకూలాంశం. శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ -
ఫైనల్‌కు ముందు శ్రీలంకతో పాక్ పోరు.. స్టార్ బౌలర్‌కు విశ్రాంతి!
ఆసియాకప్-2022 సూపర్-4 అఖరి మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్ రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. శ్రీలంక జట్టులోకి ధనంజయ డి సిల్వా, ప్రమోద్ మదుషన్ ఎంట్రీ ఇవ్వగా.. పాక్ జట్టులోకి హాసన్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వచ్చారు. కాగా ఈ మ్యాచ్‌కు పాక్ స్టార్ ఆటగాళ్లు నసీం షా, షాదాబ్ ఖాన్‌కు విశ్రాంతి ఇచ్చారు. తుది జట్లు: పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్ శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక చదవండి: Asia cup 2022 Afg vs Ind: 'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసమే' -
లంక ఘన విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్
లంక ఘన విజయం.. ఆసియాకప్ నుంచి టీమిండియా ఔట్ ఆసియాకప్ నుంచి టీమిండియా నిష్ర్కమించింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. లంక ఇన్నింగ్స్‌లో పాతుమ్ నిసాంక 52, కుషాల్ మెండిస్ 57 పరుగులు చేయగా.. చివర్లో దాసున్ షనక 33, బానుక రాజపక్స 25 పరుగులు నాటౌట్‌గా నిలిచి లంకకు విజయమందించారు. టీమిండియా బౌలర్లలో చహల్ 3, అశ్విన్ ఒక వికెట్ తీశారు. చహల్ మ్యాజిక్.. నాలుగో వికెట్ కోల్పోయిన లంక ► 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. చహల్ తెలివైన బంతితో కుషాల్ మెండిస్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. రాజపక్స 7, షనక 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. చహల్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ ► టీమిండియాతో మ్యాచ్‌లో శ్రీలంక వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మొదట 52 పరుగులు చేసిన నిసాంక సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత చరిత్ అసలంక డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 46 పరుగులతో ఆడుతున్నాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక.. 8 ఓవర్లలో 74/0 ►174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ధాటిగా ఆడుతువంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. పాతుమ్ నిసాంక 39, కుషాల్ మెండిస్ 35 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 174.. 4 ఓవర్లలో లంక స్కోరెంతంటే? ►174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. పాతుమ్ నిసాంక 23, కుషాల్ మెండిస్ 4 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 173/8.. శ్రీలంక టార్గెట్ 174 ►ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్, కోహ్లిలు తొందరగా పెవిలియన్ చేరినప్పటికి.. రోహిత్, సూర్యకుమార్‌లు టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించారు. మూడో వికెట్‌కు ఇద్దరి మధ్య 96 పరుగులు భాగస్వామ్యం నమోదైంది. అయితే రోహిత్, సూర్యకుమార్‌లు ఔటైన తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీనిక తోడూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 200 పరుగుల స్కోరు దాటుతుందనుకుంటే 173 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషనక 3, దాసున్ షనక, చమిక కరుణరత్నే చెరో రెండు వికెట్లు, మహిష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రిషబ్ పంత్(17) ఔట్ ►శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా రిషబ్ పంత్(17) మధుషనక బౌలింగ్‌లో నిసాంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు దీపక్ హుడా(3 పరుగులు).. దిల్షాన్ మధుషనక బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ(72) ఔట్ శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడిన రోహిత్ శర్మ(72) కరుణరత్నే బౌలింగ్‌లో నిసాంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 109/2 ► శ్రీలంకతో టీ20లో టీమిండియా దూకుడుగానే ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేరికి.. ► పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 91 పరుగులు సాధించింది. హాఫ్ సెంచరీ చేసిన రోహిత్‌శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే.. ►ఆసియా కప్‌లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగులు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ► టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు సాధించారు. 9 ఓవర్లకు టీమిండియా 65/2 ► తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 65 పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోయింది. రోహిత్ శర్మ(41), సూర్యకుమార్(15) పరుగులతో క్రీజులో ఉన్నారు. 7 ఓవర్లు ముగిసేరికి.. ► ఏడు ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 54 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే? ► 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ► శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి.. దిల్షాన్ మధుషనక బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్(6) ఔట్ ► శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు మాత్రమే చేసి మహీష్ తీక్షణ బౌలింగ్లోఘెల్బగా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక ► ఆసియాకప్‌లో భాగంలో సూపర్-4లో మంగళవారం టీమిండియా, శ్రీలంకల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఫైనల్ బరిలో నిలవాలంటే టీమిండియా లంకపై తప్పనిసరిగా గెలవాల్సిందే. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఏంచుకుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక టీమిండియా బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బౌలింగ్ పెద్ద సమస్యగా మారిపోయింది. గత మ్యాచ్‌లో భువనేశ్వర్ కూడా ధారళంగా పరుగులు ఇవ్వడంతో బౌలింగ్ కూర్పులో ఒక స్పష్టత లేకుండా పోయింది. అలాగే పంత్, కార్తిక్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది కూడా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక అఫ్గానిస్తాన్‌పై విజయంతో శ్రీలంక ఫుల్ జోష్‌లో ఉంది. మరి టీమిండియాతో మ్యాచ్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని లంక ఉవ్విళ్లూరుతుంది. -
IND VS SL: లంకతో అంత ఈజీ కాదు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
ఆసియా కప్ 2022 సూపర్-4 దశ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 6) భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ స్టేజీలో శ్రీలంక ఇప్పటికే ఓ విజయం (ఆఫ్ఘనిస్తాన్పై) సాధించి మెరుగైన రన్‌రేట్‌తో (0.589) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా.. పాక్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (-0.126) నిలిచింది. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు, పసికూనే కదా అని శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకేయులు భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించి మాంచి జోష్ మీద ఉన్నారు. శ్రీలంక అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కంటిన్యూ చేస్తే.. టీమిండియా ఇంటి బాట పట్టక తప్పదు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ సైతం ఆసియా కప్‌లో శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంకకు భారత్‌తో సమానమైన విన్నింగ్ రికార్డు ఉంది. ఆసియా కప్ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 10, శ్రీలంక 10 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20ల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో టీమిండియా లంకేయులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 17, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇరు జట్ల మధ్య తాజాగా జరిగిన 5 టీ20లను పరిశీలిస్తే.. చివరి 3 మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించినప్పటికీ.. వారి సొంతగడ్డపై జరిగిన 2 టీ20ల్లో లంకేయులే జయకేతనం ఎగురవేశారు. ఓవరాల్‌గా చూస్తే.. లంక జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ, వారిదైన రోజున వారిని ఆపడం మాత్రం చాలా కష్టం. బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కనబడే శ్రీలంక.. బ్యాటింగ్‌లో మాత్రం తగినంత డెప్త్ కలిగి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ మరోసారి కీ రోల్ ప్లే చేయనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దసున్ షనక (కెప్టెన్), భానుక రాజపక్సే, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక చదవండి: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
శ్రీలంకతో కీలక పోరుకు భారత్ 'సై'.. అశ్విన్‌కు చాన్స్ ఉందా?
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ జోరు చూస్తే పాకిస్తాన్‌పై మళ్లీ గెలవడం ఖాయమనిపించింది. అయితే ఆదివారం పాక్ చేతిలో ఎదురైన పరాజయం ‘సూపర్–4’ దశను ఆసక్తికరంగా మార్చింది. ఫైనల్ చేరాలంటే మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాపై ఒత్తి డి పెంచింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. అనుభవం, రికార్డులపరంగా ప్రత్యర్థిపై అన్ని రకాలుగా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... గత రెండు మ్యాచ్‌లలో లంక అనూహ్య విజయాలు చూస్తే అంత సులువు కాదని అనిపిస్తోంది. అశ్విన్‌కు చాన్స్ ఉందా! టి20 ప్రపంచకప్‌కు ఈ వారంలోనే భారత జట్టును ప్రకటించనున్నారు. ఇలాంటి స్థితిలో ఆసియా కప్‌లో సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇస్తూ అన్ని రకాల ప్రత్యామ్నాయాలను భారత్ పరీక్షిస్తోంది. అయితే పాకిస్తాన్ చేతిలో ఓడటంతో మరోసారి తుది జట్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ గత మ్యాచ్‌లో శుభారంభం అందించడం సానుకూలాంశం. టోర్నీలో రెండో అర్ధ సెంచరీతో కోహ్లి ఫామ్‌లోకి రాగా, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా మరోసారి చెలరేగాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ రెండు విభాగాల్లోనూ నిరాశపర్చాడు. కీపర్ రిçషభ్ పంత్, దినేశ్ కార్తీక్ మధ్య టీమ్ మేనేజ్మెంట్ ఇంకా తేల్చుకోలేకపోతోంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఇద్దరూ ఆడగా, గత పోరులో కార్తీక్ స్థానంలో బ్యాటర్‌గా దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. హుడాకు మరో అవకాశం ఇస్తారా లేక కార్తీక్‌ను మళ్లీ ఆడిస్తారా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్లాంటివాళ్లు లేకపోవడంతో బౌలింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. ఎంతో నమ్ముకున్న భువనేశ్వర్ పాక్‌తో మ్యాచ్‌లో 19వ ఓవర్లో భారీగా పరుగులు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు దానిని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. స్పిన్ విభాగంలో ఒక మార్పు జరగవచ్చు. ఆశించిన స్థాయిలో చహల్ రాణించడం లేదు కాబట్టి సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్‌కు ఒక అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడని ఖాయంగా చెప్పవచ్చు. స్టార్లు లేకపోయినా లీగ్ దశలో అఫ్గానిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఓడగానే శ్రీలంక జట్టును అంతా తేలిగ్గా చూశారు. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు చూపిన పోరాటపటిమ, యువ ఆటగాళ్ల పట్టుదల అభినందనీయం. ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమికి చేరువై గెలుపునకు ఎలాంటి అవకాశం లేని స్థితి నుంచి లంక మ్యాచ్‌లు గెలవగలిగింది. ముందుగా బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపిన ఆ జట్టు ‘సూపర్–4’లో గెలుపుతో అఫ్గానిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు షనక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స కీలక సమయాల్లో రాణించి జట్టు విజయానికి కారణం కాగా, చివర్లో చమిక కరుణరత్నే కూడా బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. బౌలింగ్ లో గుర్తింపు ఉన్న పేసర్లు ఎవరూ లేకపోవడం లంక జట్టు బలహీనత. అయితే ఐపీఎల్లో ఆడిన స్పిన్నర్లు మహీశ్ తీక్షణ, హసరంగ భారత్‌పై ప్రభావం చూపగలరు. -
Asia Cup 2022: లంక చేతిలో మా ఓటమికి ప్రధాన కారణం అదే: బంగ్లా కెప్టెన్
Asia Cup 2022 SL Vs Ban- Bangladesh Knocked Out Of Tourney: ఆసియా కప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసింది. దుబాయ్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బృందం ఓటమి పాలైంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మెగా ఈవెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్‌తో పాటు లంక సూపర్-4కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఓటమిపై స్పందించాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక ఈవెంట్లో పరాజయంతో ఇంటిబాట పట్టినందుకు చింతిస్తున్నామంటూ అభిమానులను క్షమాపణ కోరాడు. అదరగొట్టిన కుశాల్, దసున్ గురువారం(సెప్టెంబరు 1) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆఫిఫ్ హొసేన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుత ఆరంభం అందించాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 60 పరుగులు చేశాడు. అయితే, మిడిలార్డర్ విఫలం కావడంతో లంక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ దసున్ షనక 33 బంతుల్లో 45 పరుగులు చేసి లంక శిబిరంలో ఉత్సాహం నింపాడు. కొంప ముంచిన ఇబాదత్! కానీ.. ఆ తర్వాత వనిందు హసరంగ 2 పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో గెలుపు కోసం చివరి 2 ఓవర్లలో లంకకు 25 పరుగులు అవసరమయ్యాయి. దీంతో బంగ్లా విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసిన బంగ్లా బౌలర్ ఇబాదత్ 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్లో లంక గెలుపు సమీకరణం 8 పరుగులకు చేరగా.. అసిత ఫెర్నాండో లాంఛనం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 వైడ్లు, 4 నోబాల్‌లు వేసిన బంగ్లాకు చేదు అనుభవం తప్పలేదు. మా ఓటమికి కారణం అదే! ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. ‘‘చెత్త బౌలింగ్ కారణంగా ముఖ్యంగా డెత్ ఓవర్లలో విఫలమైనందున భారీ మూల్యం చెల్లించాం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి చేతిలో నాలుగు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మా బౌలింగ్ అధ్వాన్నంగా సాగింది. నిజానికి, శ్రీలంక బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా దసున్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మేము వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలని అనుకున్నాం. కానీ.. మా బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. గత ఆర్నెళ్లుగా మా జట్టు ప్రదర్శన అస్సలు బాగుండటం లేదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఏదేమైనా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పకతప్పదు. ఎక్కడివెళ్లినా మా మీద మీ ప్రేమ తగ్గడం లేదు. అయితే, మేము మిమ్మల్ని నిరాశ పరుస్తున్నాం. సారీ’’ అని పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
అఫ్గనిస్తాన్ వర్సెస్ శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..?
ఆసియా కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా శనివారం (ఆగస్టు 27) శ్రీలంక- అఫ్గనిస్తాన్ వర్సెస్ శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..? జట్లు తలపడనున్నాయి. స్థానిక టీ20 టోర్నీలో పాల్గోని మంచి ఊపు మీద ఉన్న శ్రీలంక.. టైటిలే లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్ కోల్పోయిన అఫ్గనిస్తాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. హాట్ ఫేవరేట్‌గా శ్రీలంక దాసున్ షనక సారథ్యంలో శ్రీలంక జట్టు హాట్ ఫేవరేట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆ జట్టు యువ ఆటగాళ్లు పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ షనక కూడా తనదైన రోజున బ్యాట్ ఝుళిపించే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్టార్ పేసర్ దుషాంతా చమీరా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ అనే చేప్పుకోవాలి. పేస్ బౌలింగ్ విభాగంలలో చమిక కరుణరత్నే తప్ప చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ కనిపించడం లేదు. ఇక స్పిన్ బౌలింగ్‌లో వానిందు హసరంగా వంటి స్టార్ స్పిన్నర్ ఉన్నాడు. అతడితో పాటు మహేశ్ తీక్షణ వంటి యువ స్పిన్నర్ రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. కాగా ఈ మెగా ఈవెంట్‌కు ముందు స్థానిక టీ20 టోర్నీలో లంక ఆటగాళ్లు పాల్గోనడం ఆ జట్టుకు సానుకూలాంశం బౌలింగ్‌లో తడబడుతున్న అఫ్గనిస్తాన్! ఆఫ్ఘనిస్థాన్ విషయానికి వస్తే.. అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటకీ.. బౌలింగ్‌లో మాత్రం తడబడుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే పునరావృతమైంది. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండగా.. మిడిలార్డర్లో గని, నజీబుల్లా జద్రాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్ మినహా బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. ఇక ఆఫ్గాన్ కెప్టెన్ నబీ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. నబీ ఐర్లాండ్ సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. పిచ్ రిపోర్ట్: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలో కొత్త బంతితో బౌలర్లు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. హెడ్ టూ హెడ్ రికార్డులు అంతర్జాతీయ టీ20ల్లో ఇరు జట్లు ముఖాముఖి ఒకే సారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. చదవండి: Asia Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్ సీనియర్ పేసర్ రీ ఎంట్రీ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక
ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. 20 మందితో కూడిన జట్టుకు దాసున్ షనక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దనుంజయ డిసిల్వా, వనిందు హసరంగా, దుష్మంత చమీరా, చమిక కరుణరత్నే , పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్, బానుక రాజపక్సలు పేరున్న ఆటగాళ్లు కాగా.. ఐపీఎల్ ద్వారా 'బేబీ మలింగ'గా పిలవబడిన మతీషా పార్థీరానా కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. వాస్తవానికి ఆసియా కప్ మొదట శ్రీలంక వేదికగా జరగాల్సింది. కానీ దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో తలెత్తడంతో వేదికను లంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొనునుండగా.. ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లు ఖరారు కాగా.. మిగతా రెండు స్థానాలు కోసం హాంకాంగ్, కవైట్, సింగపూర్, యూఏఈలు పోటీ పడుతున్నాయి. ఆసియాకప్‌కు శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), ధనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), భానుక రాజపక్స (వికెట్ కీపర్), అషెన్ బండార, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫరీ వాండర్సే, ప్రవీణ్ ద్వండర్సే చమీర, బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, దినేష్ చందిమల్ (వికెట్ కీపర్), నువానిందు ఫెర్నాండో, కాసున్ రజిత -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేళ.. 'ఆ నవ్వు చూసి చాలా కాలమైంది'
శ్రీలంకలో ఎప్పుడో ఆగిపోయిన నవ్వులు శనివారం మళ్లీ పూశాయి. లంకలో ఆ నవ్వులు ఎందుకు ఆగిపోయాయో అందరికి తెలిసిందే. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి.. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం వరుసగా లంకను చుట్టుముట్టాయి. పర్యాటకానికి కేంద్రంగా ఉండే లంకలో ముఖ్యంగా కరోనా తర్వాత తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి లేక విలవిల్లాడారు. ప్రభుత్వాన్ని గద్దె దిగాలంటూ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో లంకలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఏడాదిగా ప్రభుత్వం చర్యలతో విసిగిపోయిన ప్రజలకు మానసిక సంతోషం చాలా అవసరం అనిపించింది. ఆ సంతోషాన్ని అక్కడి ప్రజలు క్రికెట్ ద్వారా కోరుకున్నారని నిన్నటి మ్యాచ్‌తో తెలిసింది.. కాదు తెలిసేలా చేశాడు లంక కెప్టెన్ దాసున్ షనక.. లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదట ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు వస్తుందా అన్న అనుమానం వచ్చింది. కానీ ఆసీస్ క్రికెట్ బోర్డు ఇవేమి పట్టించుకోలేదు. ఆపదలో ఉన్న లంక బోర్డును ఆదుకునేందుకు ఆసీస్ జట్టు మూడు టి20, ఐదు వన్డేలు, రెండు టెస్టుల ఆడేందుకు ఆ గడ్డపై అడుగుపెట్టింది. తొలి రెండు టి20లను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికి శనివారం జరిగిన మూడో టి20లో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. లంక కెప్టెన్ దాసున్ షనక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఆఖరి మూడు ఓవర్లలో 59 పరుగులు అవసరమైన దశలో షనక 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో సంతోషం కట్టలు తెచ్చుకుంది. ఏదో సాధించామన్న ఫీలింగ్ అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరిలో కనిపించింది. లంక అభిమానుల మొహాల్లో చాలా కాలం తర్వాత నవ్వు మళ్లీ విరిసింది. ఆ నవ్వుకు కారణమయ్యాడు దాసున్ షనక. ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన చిన్నపిల్లలు సైతం మ్యాచ్ గెలిచామంటూ ఉద్వేగంతో వారిచ్చిన హావభావాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు తినడానికి తిండి లేక అల్లల్లాడిపోయిన అక్కడి పిల్లల్లో ఈ ఆనందం చూసి మనకు కడుపు నిండినట్లయింది. క్రీడలు.. బాధలో ఉన్న వ్యక్తులకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు సంతోషాన్ని పంచుతాయని లంక, ఆసీస్ మ్యాచ్ ద్వారా మరోసారి తెలియవచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనూ లంక కెప్టెన్ షనక స్వయంగా ట్విటర్లో షేర్ చేశాడు. ''మా ప్రజల్లో నవ్వు మళ్లీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వార్నర్ 39, స్టోయినిస్ 38, స్టీవ్ స్మిత్ 37 నాటౌట్, ఫించ్ 29 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక్.. షనక ఇన్నింగ్స్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక మూడు టి20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకున్న లంక.. విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని వన్డేలకు సిద్ధమవుతుంది. I’m very happy to see these smiling faces of my people 😇🇱🇰 pic.twitter.com/H4yQDmLpjj — Dasun Shanaka (@dasunshanaka1) June 11, 2022 చదవండి: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం.. థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత తన్నుకున్న భారత్, అఫ్గానిస్తాన్ ప్లేయర్స్ -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!
పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చదవండి: IND vs SA: 'అతడొక యంగ్ కెప్టెన్.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు' Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE — Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022 -
3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!
పల్లెకెలె: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.5 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IND vs SA T20 Series: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Hero of the match! 💪 What a knock by Dasun Shanaka 💥#SLvAUS #CheerForLions pic.twitter.com/n8ug04rQvh — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 11, 2022 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది. శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్ చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సిరీస్ ఆస్ట్రేలియాదే!
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! -
SL Vs Aus: ఆసీస్‌తో టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే!
Sri Lanka Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు సిద్ధమైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో మంగళవారం నాటి(జూన్ 7) మ్యాచ్‌కు శ్రీలంక తమ తుది జట్టును ప్రకటించింది. కాగా 3 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కోసం కంగారూ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడగా ఆతిథ్య ఆసీస్ జట్టు చేతిలో ఘోర పరాభవం చవిచూసింది. ఆఖరి మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది ఐదింట నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఫించ్ బృందానికి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పరాభవానికి బదులు తీర్చుకోవాలని లంక జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-2022లో మా ఆటగాళ్లు భాగస్వామ్యం కావడంతో కావాల్సినంత ప్రాక్టీసు దొరికింది. ఐపీఎల్ అనుభవం మా జట్టుకు ఉపకరిస్తుంది. బలమైన ఆసీస్ జట్టును ఢీకొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్‌కు శ్రీలంక తుది జట్టు: పాథుమ్ నిసాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, నువాన్ తుషార. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: MS Dhoni: 'ధోని కెప్టెన్సీలో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా' -
మార్ష్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్-2022 సీజన్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటిల్స్ 6.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఐపీఎల్‌కు మార్ష్ దూరమైతే ఢిల్లీకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మార్ష్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లను ఓ సారి పరిశీలిద్దాం. బెన్ మెక్‌డెర్మోట్ ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మోట్ అద్భుతమైన టీ20 ఆటగాడు. గత రెండు బిగ్‌బాష్ సీజన్‌ల్లో మెక్‌డెర్మోట్ అద్భుతంగా రాణించాడు. 2020 సీజన్లో 402 పరుగులు, 2021 సీజన్లో 577 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోను మెక్‌డెర్మోట్ రాణించాడు. 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 93 పరుగులు సాధించాడు. కాగా రూ.50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2022 వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. కాగా టీ20ల్లో అతడికి ఉన్న రికార్డుల దృష్ట్యా ఢిల్లీ మెక్డెర్మోట్ని భర్తీ చేసే అవకాశం ఉంది. దాసున్ షనక శ్రీలంక పరిమిత ఓవర్ల కెప్టెన్ దసున్ షనక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మార్ష్ స్థానంలో సరైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో షనక అద్భుతంగా రాణించాడు. 3 మ్యాచ్‌ల్లో 124 పరుగులు సాధించాడు. మోయిసెస్ హెన్రిక్స్ ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బిగ్ బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. గత ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన హెన్రిక్స్ 440 పరుగులు సాధించాడు. హెన్రిక్స్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా రాణించగలడు. ఐపీఎల్లో హెన్రిక్స్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 277 పరుగులు సాధించాడు. మార్ష్‌కు ప్రత్యమ్నాయంగా హెన్రిక్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు -
Ind Vs Sl 2nd T20: 16 మ్యాచ్‌లు ఆడితే.. పాపం 12 మ్యాచ్‌లలో ఓటమే!
India Vs Sri Lanka T20 Series: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో గెలుపుపై కన్నేసింది. శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక వరుస విజయాల ప్రపంచ రికార్డును నెలకొల్పాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. మొదటి మ్యాచ్‌లో ఓటమితో డీలా పడిన శ్రీలంక ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప గెలిచే సూచనలు కనిపించడం లేదు. వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, కుశాల్ మెండిస్ వంటి ఆటగాళ్లు దూరం కావడంతో ఆతిథ్య జట్టుతో పోలిస్తే మరింత బలహీనంగా అనిపిస్తోంది. శనివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ నేపథ్యంలో.. ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, ముఖాముఖి రికార్డు తదితర వివరాలు.. ఎక్కడ, ఎప్పుడు? భారత్ వర్సెస్ శ్రీలంక- రెండో టీ20 హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల ఫిబ్రవరి 26(శనివారం)- రాత్రి ఏడు గంటలకు ఆరంభం తుదిజట్ల అంచనా: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేశ్అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. శ్రీలంక: నిరోషన్ డిక్వెలా(వికెట్ కీపర్), పాథుమ్ నిసంక, చరిత్ అసలంక, జనిత్ లియానగే, ధనుంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, జెఫ్రే వాండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లాహిరు కుమార. పిచ్ వాతావరణం ధర్మశాల మైదానంలో చివరి టీ20 మ్యాచ్‌ల 2016లో జరిగింది. కాబట్ ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమే. ఇంకా వర్ష సూచన కూడా ఉంది. ముఖాముఖి పోరులో రికార్డులు ఇప్పటి వరకు టీమిండియా- శ్రీలంక మధ్య 23 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 15, లంక ఏడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక సొంతగడ్డపై శ్రీలంకపై 9-2 తేడాతో భారత జట్టు విజయాల పరంగా అద్బుత రికార్డు కలిగి ఉంది. మొత్తంగా భారత్‌లో 16 టి20లు ఆడిన శ్రీలంక 12 మ్యాచ్‌లలో ఓడింది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే.. -
‘11’వ విజయం వేటలో టీమిండియా.. లంకకు ఆపే దమ్ముందా
India Vs Sri Lanka 2nd T20I Match: గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో రెండు కీలక మ్యాచ్‌లలో పరాజయాల తర్వాత ఒక్కసారిగా కోలుకున్న భారత జట్టు వరుసగా 11వ విజయపై గురి పెట్టింది. మెగా టోర్నీలో 3 విజయాలు, ఆపై వరుసగా న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై రెండు సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు శ్రీలంకను కూడా గత మ్యాచ్‌లో చిత్తు చేసి వరుసగా 10 విజయాలు నమోదు చేసింది. ఇదే జోరులో మిగిలిన రెండు మ్యాచ్‌లూ గెలిస్తే అత్యధిక వరుస విజయాల ప్రపంచ రికార్డు సమమవుతుంది. ఈ నేపథ్యంలో లంకతో రెండో టి20 మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఈ మైదానంలో 2016లో చివరిసారి టి20 మ్యాచ్ జరిగింది కాబట్టి పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పలేం. మ్యాచ్ రోజు వర్ష సూచన కూడా ఉంది. మార్పుల్లేకుండా... తొలి మ్యాచ్‌లో భారీ గెలుపుతో పాటు రుతురాజ్ ఇంకా కోలుకోకపోవడంతో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్ కిషన్ చెలరేగితే మూడో స్థానంలో శ్రేయస్ తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నాడు. నాలుగో స్థానంలో ఈ సారైనా సంజు సామ్సన్ను ఆడిస్తారా లేక జడేజాకే అవకాశం ఇస్తారా చూడాలి. వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేస్తుండగా, గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేకపోయిన దీపక్ హుడాకు మరో అవకాశం ఖాయం. బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, హర్షల్ పటేల్‌లు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. చహల్‌కు తోడుగా జడేజా కూడా ఉండటంతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇలాంటి జట్టును నిలువరించడం లంకకు అంత సులువు కాదు. రెండు మార్పులతో... భారత గడ్డపై 16 టి20లు ఆడిన శ్రీలంక 12 మ్యాచ్‌లలో ఓడిందంటే ఆ జట్టు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కండరాల గాయంతో మహీశ్ తీక్షణ, కుశాల్ మెండిస్ అనూహ్యంగా సిరీస్‌కు దూరం కావడంతో లంక వద్ద తగిన ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయింది. ఆతిథ్య జట్టుతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న లంక ఏదైనా సంచలనం జరగకపోతుందా అన్నట్లుగానే ఎదురు చూస్తోంది. బ్యాటింగ్‌కు కాస్త పటిష్టపర్చేందుకు లంక జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. కమిల్, చండిమాల్ స్థానాల్లో గుణతిలక, డిక్వెలా తుది జట్టులోకి రానున్నారు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన అసలంక, కెప్టెన్ షనకలపై ఆ జట్టు అమితంగా ఆధార పడుతోంది. స్పిన్నర్లు వాండర్సే, జయవిక్రమ ఏమాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి. -
Ind Vs Sl 1st T20: అప్పుడు భారత్ భారీ స్కోరు.. రోహిత్ సెంచరీ.. మరి ఈసారి!
India Vs Sri Lanka T20 Series- 1st T20: స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. పర్యాటక జట్లను 3-0 వైట్‌వాష్ చేసి జోరు మీదున్న రోహిత్ సేన.. శ్రీలంకతో జరుగనున్న సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పర్యటనలో 1-4 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయిన లంక.. బలమైన భారత జట్టుపై గెలిచి తామేంటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో లక్నో వేదికగా జరిగే మొదటి టీ20 మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తుది జట్ల అంచనా, ముఖాముఖి రికార్డులు, పిచ్ వాతావరణం తదితర అంశాలు.. ఇండియా వర్సెస్ శ్రీలంక మొదటి టీ20- ఎప్పుడు, ఎక్కడ? ►ఫిబ్రవరి 24 ►లక్నో- వాజ్‌పేయి స్టేడియం ►రాత్రి 7 గంటలకు ఆరంభం ►స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్/భువనేశ్వర్ కుమార్. శ్రీలంక: పథుమ్ నిసాంక, ధనుష్క గుణతిలక, కమిల్ మిషారా(వికెట్ కీపర్, దినేశ్ చండిమాల్, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్నే వాండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లాహిరు కుమార. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూల పిచ్. ఇక్కడ 2018లో ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేయగా, రోహిత్ సెంచరీ సాధించాడు. అయితే ఉత్తరాదిన ఇంకా మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ముఖాముఖి రికార్డులు: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 22 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 14 మ్యాచ్‌ల్లో, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చదవండి: Sanju Samson: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ 💬 💬 "I'm excited to be back and raring to go." Say Hello to all-rounder @imjadeja and vice-captain @Jaspritbumrah93 as they join #TeamIndia for the Sri Lanka series. 👋 👋@Paytm | #INDvSL pic.twitter.com/gpWG3UESjv — BCCI (@BCCI) February 23, 2022