India Vs Sri Lanka: T20 Test Series Full Schedule Venues Squads Check Details - Sakshi
Sakshi News home page

Ind Vs SL T20 Schedule: ఇండియా వర్సెస్‌ శ్రీలంక.. పూర్తి షెడ్యూల్‌, జట్లు ఇతర వివరాలు!

Published Wed, Feb 23 2022 4:11 PM | Last Updated on Fri, Feb 25 2022 10:49 AM

India Vs Sri Lanka: T20 Test Series Full Schedule Venues Squads Check Details - Sakshi

India Vs Sri Lanka T20 Series: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో దారుణంగా వైఫల్యం చెందిన శ్రీలంక జట్టు ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌లను టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన రోహిత్‌ సేనతో ఢీకొట్టనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాతో లంక జట్టు తలపడనుంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ పోరు ఆరంభం కానుంది.

భారత్‌ వర్సెస్‌ శ్రీలంక- టీ20, టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌ ఇదే:
మూడు టీ20 మ్యాచ్‌లు- రాత్రి 7 గంటలకు ఆరంభం
మొదటి టీ20: ఫిబ్రవరి 24- అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియం- లక్నో
రెండో టీ20: ఫిబ్రవరి 26- హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం- ధర్మశాల
మూడో టీ20: ఫిబ్రవరి 27- హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం- ధర్మశాల

రెండు టెస్టు మ్యాచ్‌లు-
మొదటి టెస్టు: మార్చి 04- 08- పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బింద్రా స్టేడియం, మొహాలి- ఉదయం 9: 30 గంటలకు ప్రారంభం
రెండో టెస్టు(డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌): మార్చి 12- 16- చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు

శ్రీలంక టి20 జట్టు: దసున్‌ షనక (కెప్టెన్‌), నిసాంక, కుశాల్‌ మెండిస్, అసలంక, చండిమాల్, దనుష్క గుణతిలక, కమిల్‌ మిశార, జనిత్‌ లియనగె, చమిక కరుణరత్నే, చమీరా, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్‌ ఫెర్నాండో, మహీశ్‌ తీక్షణ, జెఫ్రె వండెర్సే, ప్రవీణ్‌ జయవిక్రమ, అషియాన్‌ డానియెల్‌. 

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

చదవండి: Virat Kohli-Yuvraj Singh: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కోహ్లి.. వైరల్‌ అవుతున్న భావోద్వేగ పోస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement