శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (PC: SLC)
Asia Cup 2023- India Vs Sri Lanka In Final: ‘‘నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే సమయంలో నా బ్యాటింగ్‌తో కెప్టెన్సీని పోల్చుకోను. మిడిలార్డర్‌లో బ్యాటర్‌గా ఎలా ఆడాలన్న విషయం కంటే.. సారథిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం మీదే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది.
బ్యాటింగ్ ముఖ్యం కాదని నేను చెప్పను గానీ.. ఫామ్ గురించి మర్చిపోయి కెప్టెన్‌గా ముందుకు సాగిపోతాను. ఎందుకంటే.. డెసిషన్ మేకింగ్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు థాంక్స్
నిజానికి ఫామ్‌లేమితో సతమతమవుతున్నా.. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు. అదే విధంగా నాలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఎప్పుటికప్పుడు సహాయసహకారాలు అందిస్తు కోచింగ్ సిబ్బందికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి.
ఆటగాడిగా విఫలమవుతున్నా.. నాయకుడిగా రాణించడానికి వీరే కారణం. అందుకే వాళ్లందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అన్నాడు. బ్యాటర్‌గా విఫలమవుతున్నా.. తనపై విశ్వాసం ఉంచి, అండగా నిలుస్తున్న సెలక్టర్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు
కాగా ఆసియా కప్-2023లో అసాధారణ పోరాటంతో ఫైనల్‌కు చేరింది శ్రీలంక. సమిష్టిగా రాణిస్తూ.. సెప్టెంబరు 17న టీమిండియాతో కొలంబో వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు కెప్టెన్ దసున్ షనక బ్యాట్ ఝులిపించకపోవడం కాస్త జట్టును కలవరపెడుతోంది.
ఇప్పటి వరకు ఈ ఆల్‌రౌండర్ ఆరు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 54. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లే ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 14 నాటౌట్, అఫ్గనిస్తాన్‌పై 5, బంగ్లాదేశ్ మీద 24, టీమిండియాపై 9, పాకిస్తాన్‌పై 2 పరుగులు మాత్రమే సాధించాడు.
నాయకుడిగా సూపర్ హిట్
అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడంలో మాత్రం సఫలమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ఆడి అండర్‌డాగ్స్‌గా ఆసియా కప్ బరిలోకి దిగిన లంకను ఫైనల్‌కు తీసుకువచ్చాడు.
ఈ నేపథ్యంలో టీమిండియాతో తుదిపోరుకు ముందు మీడియాతో మాట్లాడిన దసున్ షనక.. తన బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆటగాడిగా కంటే నాయకుడిగా రాణించడం మీదే ఎక్కువగా దృష్టి సారించానని పేర్కొన్నాడు.
చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
WATCH: Dasun Shanaka previews Asia Cup 2023 Finals against Indiahttps://t.co/vdpKwgkdrm #AsiaCup2023 #SLvIND
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2023
Comments
Please login to add a commentAdd a comment