సిరాజ్‌ సంచలనం.. తమ వరల్డ్‌ రికార్డును తామే బ్రేక్‌ చేసిన శ్రీలంక! చెత్తగా.. | Asia Cup Final Ind Vs SL: Siraj Shines Sri Lanka Break Their Worst World Record In All ODIs | Sakshi
Sakshi News home page

#Mohammed Siraj: సిరాజ్‌ సంచలనం.. తమ వరల్డ్‌ రికార్డును తామే బ్రేక్‌ చేసిన శ్రీలంక! చెత్తగా..

Published Sun, Sep 17 2023 5:18 PM | Last Updated on Sun, Sep 17 2023 5:54 PM

Asia Cup Final Ind Vs SL: Siraj Shines Sri Lanka Break Their Worst World Record In All ODIs - Sakshi

Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ఆసియా కప్‌-2023 ఫైనల్లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ధాటికి శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ హైదరాబాదీ ఒ‍కే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంకతో మొదలుపెట్టిన సిరాజ్‌ వరుసగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ సదీర సమరవిక్రమ, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన చరిత్‌ అసలంక, ధనుంజయ డి సిల్వ, కెప్టెన్‌ దసున్‌ షనకలను పెవిలియన్‌కు పంపాడు.

సిరాజ్‌ విశ్వరూపం.. బెంబేలెత్తిన లంక బ్యాటర్లు
12వ ఓవర్‌ ముగిసే సరికి ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి వికెట్‌ తీసి లంకను దెబ్బకొట్టగా.. సిరాజ్‌ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో సింహళీయుల జట్టు వన్డే చరిత్రలో తన పేరిట ఉన్న చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది. 2012లో పర్ల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 13 పరుగులకు ఆరో వికెట్‌ కోల్పోయింది. 

తాజాగా టీమిండియాతో ఆసియా కప్‌ ఫైనల్లో 12 పరుగుల వద్దే ఆరో వికెట్‌ పారేసుకుంది. అసోసియేట్‌ దేశాలు మినహా టెస్టు ఆడే జట్లలో శ్రీలంక రెండుసార్లు ఈ మేరకు ఘోర పరాభవం మూటగట్టుకోవడం గమనార్హం.

కెనడా లంక చేతిలో.. లంక ఇలా
కాగా 2003లో శ్రీలంకతో పర్ల్‌లో 12 పరుగులకు.. అదే విధంగా 2013లో నెట్‌ కింగ్‌ సిటీతో మ్యాచ్‌లో 10 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సహా ప్రత్యర్థి చేతిలో ఇలా భంగపడటం రెండూ శ్రీలంక జట్టుకే చెల్లిందని క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్‌ ఆరు, హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు.

చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్‌ భావోద్వేగం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement