భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat kohli) ఫామ్ లేమితో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన రోకో ద్వయం.. పుష్కరకాలం తర్వాత ఆడిన రంజీ ట్రోఫీలోనూ అదే తీరును కనబరిచారు. ముంబై తరపున ఆడిన 31 పరుగులు చేయగా.. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన కోహ్లి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు.
వీరిద్దరూ ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడేందుకు యూఏఈకు పయనం కానున్నారు. ఈ క్రమంలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ మద్దతుగా నిలిచాడు. ఈ సీనియర్ ద్వయం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌కి ఎంతో విలువను చేకూర్చారు. ఒక డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా భారత జట్టుకు కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ జోడీ కీలక పాత్ర పోషించనున్నారు.
వీరిద్దరే కాకుండా జట్టులోని మొత్తం ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లరుతున్నారు. దేశానికి గౌరవం తీసుకురావాలనే తపన ప్రతీ ఒక్కరిలోనూ ఉంది" అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో గంభీర్ పేర్కొన్నాడు.
అదే విధంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై కూడా గంభీర్ స్పందించాడు. "ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు మాకు ముఖ్యమే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా దుబాయ్‌లో అడుగుపెట్టనున్నాము.
పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌నే సీరియస్‌గా తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోలేము కాదా? మొత్తం అన్ని మ్యాచ్‌లను ఒకేలా చూస్తాము. వాస్తవానికి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ మేము మాత్రం కేవలం సాధారణ గేమ్‌లానే చూస్తాము" అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
చదవండి: 28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment