భారత మాజీ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(wriddhiman saha) అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ జట్టుతో శనివారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌తో సాహా ఆటకు గుడ్‌బై చెప్పాడు. "క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు అయ్యింది. 1997 నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది. దేశం, రాష్ట్రం, జిల్లా, క్లబ్‌లు, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
ఈ స్ధాయిలో నేను ఉండటానికి, నేను సాధించిన విజయాలు.. నేర్చుకున్న పాఠాలు.. ఇవన్నీ అద్భుతమైన క్రీడతోనే సాధ్యమైంది. తన క్రికెట్ ప్రయాణంలోనిరంతరం మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్, టీసీఎ సోదరుడు, భార్య (రోమి), అన్వీ, అన్వే(పిల్లలు),అత్తమామలకు కృతజ్ఞతలు తెలపాలనకుంటున్నాను"అని సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులకు ఆలౌటై 152 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే తన కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో సాహా ‘డకౌట్’ కావడం గమనార్హం. 152 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 35.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
ధోని తర్వాత..
అయితే టెస్టు క్రికెట్‌లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. అయితే రిషభ్ పంత్ దూసుకురావడంతో 2021 నుంచి టీమిండియా తరపున ఆడేందుకు సాహాకు అవకాశాలు లభించలేదు.
వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్‌లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్, త్రిపుర జట్లకు ప్రాతినిధ్యం వహించి 142 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 116 లిస్ట్–ఎ మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్‌తో జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment