Wriddhiman Saha
-
28 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
భారత మాజీ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(wriddhiman saha) అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పంజాబ్ జట్టుతో శనివారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌తో సాహా ఆటకు గుడ్‌బై చెప్పాడు. "క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు అయ్యింది. 1997 నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది. దేశం, రాష్ట్రం, జిల్లా, క్లబ్‌లు, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.ఈ స్ధాయిలో నేను ఉండటానికి, నేను సాధించిన విజయాలు.. నేర్చుకున్న పాఠాలు.. ఇవన్నీ అద్భుతమైన క్రీడతోనే సాధ్యమైంది. తన క్రికెట్ ప్రయాణంలోనిరంతరం మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, బీసీసీఐ, బెంగాల్ క్రికెట్, టీసీఎ సోదరుడు, భార్య (రోమి), అన్వీ, అన్వే(పిల్లలు),అత్తమామలకు కృతజ్ఞతలు తెలపాలనకుంటున్నాను"అని సోషల్ మీడియాలో నోట్ షేర్ చేశాడు.ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులకు ఆలౌటై 152 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే తన కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో సాహా ‘డకౌట్’ కావడం గమనార్హం. 152 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 35.4 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ధోని తర్వాత..అయితే టెస్టు క్రికెట్లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. అయితే రిషభ్ పంత్ దూసుకురావడంతో 2021 నుంచి టీమిండియా తరపున ఆడేందుకు సాహాకు అవకాశాలు లభించలేదు.వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో బెంగాల్, త్రిపుర జట్లకు ప్రాతినిధ్యం వహించి 142 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 116 లిస్ట్–ఎ మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్‌తో జాగ్రత్త! -
‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అని ద్రవిడ్ డైరెక్ట్‌గానే చెప్పేశాడు!
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.ధోని నీడలో..నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది. ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలుస్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు. పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది. ఐపీఎల్లో అదే హైలైట్2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.అతడిని తన వారసుడిగా తీర్చిదిద్దిబెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్లో మళ్లీ తిరిగొచ్చాడు.అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్లోనూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సాహా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత తను క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు సాహా సోషల్ మీడియాలో వెల్లడించాడు.క్రికెట్లో నా సుదీర్ఘ ప్రయాణానికి విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్లో ఈ రంజీ సీజనే నా చివరిది. ఆఖరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో సాహా రాసుకొచ్చాడు. కాగా 40 ఏళ్ల సాహా వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ బెంగాల్ స్టార్ ప్లేయర్ గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి..ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం భాగమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్లో గత కొన్నేళ్లగా గుజరాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును కూడా సాహా నమోదు చేసుకోపోయినట్లు తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.ధోని తర్వాత..అయితే టెస్టు క్రికెట్లో భారత్ చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో సహా ఒకడని చెప్పుకోవచ్చు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా భారత టెస్టు జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా కొనసాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1353 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్లో మూడు సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ -
అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా
ఐపీఎల్ 16వ సీజన్లో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. కాగా గుజరాత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పియూష్ చావ్లాను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. వేసింది వైడ్ బాల్ అయినప్పటికి సాహా ప్రంట్ఫుట్ వచ్చేలా ఊరించే బంతి వేయడం ఫలితాన్ని ఇచ్చింది. సాహా మిస్ చేయడంతో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేయగా సాహా స్టంప్ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అనుభవం ముందు సాహా బ్యాటింగ్ పనికిరానట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mumbai was desperate for a wicket, and Piyush Chawla delivered in his very first over. What an underrated performer for Mumbai this season. Just incredible. #GTvsMI #IPL2023 pic.twitter.com/3ldhhAlZyz — Ridhima Pathak (@PathakRidhima) May 26, 2023 చదవండి: 'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్! -
అతడు రీ ఎంట్రీ ఇస్తే సంతోషిస్తా! టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ: దాదా
WTC Final 2021-23- Ganguly Prediction: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా పునరాగమనం చేస్తే బాగుంటుందని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సేవలు ఉపయోగించుకోవాలని పరోక్షంగా సూచించాడు. ఆ దిశగా టీమిండియా సెలక్టర్లు యోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్- 2021-23 జరుగనున్న విషయం తెలిసిందే. జూన్ 7న మ్యాచ్ మొదలుకానున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇక స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. పంత్, రాహుల్ దూరం ఈ క్రమంలో.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్.. రిషభ్ పంత్ స్థానంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే, మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో.. ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఇషాన్ కిషన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. తద్వారా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా టెస్టుల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ ఇషాన్‌ను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. వృద్ధిమాన్ సాహా అతడు వస్తే సంతోషిస్తా ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సాహాకు అవకాశమిస్తే మాత్రం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. టీమిండియా స్వదేశంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలిచినపుడు కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అంతకంటే ముందు వృద్ధిమాన్ టెస్టుల్లో ఆడాడు. అంతకు మునుపు రిషభ్ పంత్ ఉండేవాడు. అందుకే అప్పుడు సాహా అవకాశాలు కోల్పోయాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో సాహాకు పిలుపు వస్తే బాగుంటుంది. అతడు పునరాగమనం చేస్తే నేను సంతోషిస్తాను. సెలక్టర్లు ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని దాదా సూచించాడు. టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా.. కానీ ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నానన్న గంగూలీ.. ఆసీస్‌తో పోటీ అంటే కాస్త కష్టమేనన్నాడు. ‘‘మ్యాచ్ అద్భుతంగా సాగుతుందని అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో తెలియదు. నేనైతే భారత్ గెలవాలని కోరుకుంటున్నా. కానీ అవకాశాలు మాత్రం 50-50గా ఉన్నాయి’’ అని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా తొట్టతొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా ఉన్న సాహా.. 15 ఇన్నింగ్స్‌లలో కలిపి 299 పరుగులు చేశాడు. ఇక 38 ఏళ్ల సాహా ఆఖరి సారిగా న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున 2021లో టెస్టు ఆడాడు. మొత్తంగా 40 టెస్టులాడి 1353 పరుగులు సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: గంభీర్ ఓ లెజెండ్.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇక మైదానంలో.. IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్ నెగ్గే విషయంలో కాదు..! -
హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
-
సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..!
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. గుజరాత్ అభిమానులు ఈ వెటరన్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలో భారత ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టులో చోటు కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐసీసీ ట్రోఫీ (డబ్ల్యూటీసీ) సాధించాలంటే టీమిండియాకు సాహా సేవలు చాలా అవసరమని అంటున్నారు. వయసు (38) సాకుగా చూపి సాహాను విస్మరించొద్దని అంటున్నారు. ఎలాగూ కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి, అతని స్థానంలో సాహాను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన రెగ్యులర్ వికెట్‌కీపర్ కేఎస్ భరత్‌తో పోలిస్తే సాహా చాలా బెటరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాహా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిస్తే టీమిండియాకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ఫార్మాట్‌కు తగ్గట్లుగా సాహా తన ఆటతీరును మార్చుకుంటాడని, అతనిలో టాలెంట్‌ను భారత సెలెక్టర్లు ఇకనైనా గుర్తించాలని అంటున్నారు. ఐపీఎల్లో అతను చేసిన సెంచరీని, దేశవాలీ క్రికెట్లో చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని (20 బంతుల్లో 4 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 102) గుర్తించుకోవాలని కోరుతున్నారు. రహానే లాగే సాహా ఇన్నింగ్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సాహాతో పాటు శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు. అయితే 9వ ఓవర్లో మేయర్స్ ఔట్ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. డికాక్ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. చదవండి: IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం -
IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్: ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ జోరు కొనసాగిస్తోంది. అద్భుత బ్యాటింగ్‌తో భారీ విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ దశకు చేరువైంది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 142 పరుగులు జోడించడం విశేషం. అనంతరం కృనాల్ పాండ్యా సారథ్యంలోని లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. సాహా, గిల్ చెలరేగడంతో గుజరాత్ వేగంగా దూసుకుపోయింది. మొహసిన్ ఓవర్లో సాహా 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో స్కోరు 78 పరుగులకు చేరింది. సాహా 20 బంతుల్లో, గిల్ 29 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. లక్నో ఎట్టకేలకు 12వ ఓవర్లో తొలి వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయగలిగినా... గిల్‌తో పాటు కెపె్టన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిల్లర్ (12 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరు కొనసాగించి స్కోరును 200 దాటించారు. ఛేదనలో మేయర్స్, ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన డికాక్ కూడా ప్రత్యర్థి తరహాలోనే పోటీ పడి పరుగులు సాధిస్తూ ఘనమైన ఆరంభాన్నందించారు. వీరిద్దరి జోరు చూస్తే హోరాహోరీ పోరు తప్పదనిపించింది. అయితే 9వ ఓవర్లో తొలి వికెట్‌గా మేయర్స్ వెనుదిరగ్గా...ఆ తర్వాత లక్నో పరిస్థితి అంతా ఒక్కసారిగా తలకిందులైంది. మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ తర్వాత ఒక టి20 మ్యాచ్‌లో కెపె్టన్ హోదాలో అన్నదమ్ములు (కృనాల్, హార్దిక్ పాండ్యా) ప్రత్యర్థులుగా తలపడటం ఇది రెండోసారి మాత్రమే. స్కోరు వివరాలు .. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి) (సబ్) ప్రేరక్ మన్కడ్ (బి) అవేశ్ ఖాన్ 81; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 94; హార్దిక్ పాండ్యా (సి) కృనాల్ పాండ్యా (బి) మొహసిన్ 25; మిల్లర్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–142, 2–184. బౌలింగ్: మొహసిన్ 3–0–42–1, అవేశ్ ఖాన్ 4–0–34–1, కృనాల్ పాండ్యా 4–0–38–0, యష్ ఠాకూర్ 4–0–48–0, రవి బిష్ణోయ్ 2–0–21–0, మేయర్స్ 1–0–16–0, స్వప్నిల్ 1–0–7–0, స్టొయినిస్ 1–0–20–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) రషీద్ ఖాన్ (బి) మోహిత్ శర్మ 48; డికాక్ (బి) రషీద్ 70; దీపక్ హుడా (సి) రాహుల్ తెవాటియా (బి) షమీ 11; స్టొయినిస్ (సి) షమీ (బి) మోహిత్ శర్మ 4; నికోలస్ పూరన్ (సి) షమీ (బి) నూర్ అహ్మద్ 3; ఆయుశ్ బదోని (సి) నూర్ (బి) మోహిత్ శర్మ 21; స్వప్నిల్ (నాటౌట్) 2; కృనాల్ పాండ్యా (సి) మిల్లర్ (బి) మోహిత్ శర్మ 0; బిష్ణోయ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–88, 2–114, 3–130, 4–140, 5–153, 6–166, 7–166. బౌలింగ్: షమీ 4–0–37–1, హార్దిక్ పాండ్యా 3–0–37–0, రషీద్ ఖాన్ 4–0–34–1, నూర్ అహ్మద్ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–29–4, జోసెఫ్ 1–0–5–0. -
20 బంతుల్లో హాఫ్ సెంచరీ! డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఛాన్స్ ఇవ్వండి..
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్, భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న సాహా.. 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 81 పరుగులు చేశాడు. సాహా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 20 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా బట్లర్, దుబే, శార్ధూల్ ఠాకూర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ ముగ్గురు కూడా 20 బంతుల్లో అర్ధశతకం సాధించారు. సాహాకు ఛాన్స్ ప్లీజ్ ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఇంకా అతడి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గిల్ స్థానంలో సాహాను భర్తీ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టెస్టులు ఆడిన అనుభవం ఉన్న సాహాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి! అయినా కష్టమే -
Ind Vs Ban: పంత్.. సెంచరీ మిస్! ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు
Bangladesh vs India, 2nd Test- Rishabh Pant: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ శ్రేయస్ అయ్యర్(87)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. 93 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో) సాధించాడు. అయితే, 67.5వ ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చిన పంత్ సెంచరీ మిస్ అయ్యాడు. ధోని రికార్డు బద్దలు కాగా పంత్ ఇలా తొంభై పరుగుల పైచిలుకు స్కోరు చేసి అవుట్ కావడం ఇది ఆరోసారి. ఇదిలా ఉంటే.. శతకం చేజార్చుకున్నప్పటికీ పంత్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. సాహా తర్వాత మిర్పూర్ టెస్టులో రెండో రోజు ఆటలో భాగంగా ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి అర్ధ శతకం సాధించాడు పంత్. తద్వారా టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై ధోని తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. కాగా 2007లొ ఇదే వేదికపై ధోని 50 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. అదే విధంగా ధోని, వృద్ధిమాన్ సాహా తర్వాత బంగ్లాపై యాభై పైచిలుకు పరుగులు చేసిన మూడో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి ఆట తీరుతో మరోసారి తనకు టెస్టుల్లో తిరుగులేదని నిరూపించుకున్నాడంటూ పంత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే.. Harry Brook: బ్రూక్ పంట పండింది.. ఎస్ఆర్హెచ్ తలరాత మారేనా! -
ఐపీఎల్లో రాణించినా పట్టించుకోలేదు.. ఇక నేను టీమిండియాకు ఆడటం కష్టమే..!
Wriddhiman Saha: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తాను టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమని రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సభ్యుడొకరు ఇదివరకే తనతో స్పష్టం చేశారని, నేనే ఆటపై మమకారం చంపుకోలేక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తనను ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూశానని వైరాగ్యంతో చెప్పుకొచ్చాడు. గడిచిన ఐపీఎల్ సీజన్లో తన పర్ఫామెన్స్‌ను కొలమానంగా తీసుకుని ఉంటే ఈ పాటికి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండాల్సి ఉండిందని బాధను వెల్లగక్కాడు. యువకులతో పోటీపడి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా అవకాశం రాలేదంటే ఇక తాను టీమిండియాకు ఆటడం కష్టమేనని వాపోయాడు. కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన సాహా, గతేడాది ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. నాటి ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి టెస్టుల్లో టీమిండియా ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు. తదనంతరం సాహా, టీమిండియాకు సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా మారిపోయాడు. పంత్ గాయం కారణంగా లేక విశ్రాంతి తీసుకున్న మ్యాచుల్లోనే సాహాకు అవకాశం దొరికేది. ఇలాంటి పరస్థితుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్‌లో భాగమైన సాహా తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని 11 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీల సాయంతో 31.70 సగటున 317 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శన ఆధారంగా తనను టీమిండియాకు ఎంపిక చేస్తారని సాహా ఆతృతగా ఎదురుచూశాడు. అయితే సెలెక్టర్లు మాత్రం అతనికి మరోసారి మొండి చేయి చూపించారు. చదవండి: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. త్రిపుర జట్టుకు ప్లేయర్ కమ్ మెంటార్‌గా సేవలు అందించాడనికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్‌ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు. తాజాగా ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు కూడా సాహాను ఎంపిక చేయలేదు. కాగా జట్టు నుంచి ఉద్వాసన తర్వాత ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారిస్తాని గతంలో సాహా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన షా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 317 పరుగులు చేశాడు. ఇక త్రిపుర తరపున షా ఆడాలనుకుంటే 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' నుంచి ఖఛ్చితంగా నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.ఘీపై ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐ చర్చిస్తుంది. "వృద్ధిమాన్ సాహా త్రిపురకు ప్లేయర్-కమ్-మెంటర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. అతడు త్రిపుర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖరారు కాలేదు" అని ఎన్డీటీవీతో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
IPL 2022: అమ్మో.. క్రీజులో అతడు ఉన్నాడంటే అంతే! ఆహా ఏమి షాట్లు!
IPL 2022 Gujarat Titans: శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ అతడేనని గుజరాత్ టైటాన్స్ యువ బౌలర్ యశ్ దయాల్ అన్నాడు. గిల్ క్లాసికల్ బ్యాటర్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా, ఆర్సీబీ ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ.. అతడి కోసం ఏకంగా 3.20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన యశ్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో ఫైనల్లోనూ ఒక వికెట్ తీశాడు. రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపి గుజరాత్‌కు శుభారంభం అందించాడు. తద్వారా అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన గుజరాత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్-2022 అనుభవాల గురించి ఇండియా న్యూస్‌తో పంచుకున్న యశ్ దయాల్.. తనను ఇబ్బంది పెట్టిన బ్యాటర్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘‘నెట్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టం. ఏ షాట్ అయినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాదడమే తనకు అలవాటు. అద్భుతమైన షాట్లు ఆడతాడు. క్లాసికల్ బ్యాటర్’’ అంటూ ఈ లెఫ్టార్మ్ పేసర్ సహచర ఆటగాడిని కొనియాడాడు. అదే విధంగా.. వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉంటే కష్టమేనని, పవర్‌ప్లేలో అతడిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బౌలర్ ఆచితూచి ఆడాల్సిందేనని యశ్ దయాల్ చెప్పుకొచ్చాడు. డేవిడ్ మిల్లర్ కూడా ప్రమాదకరమైన బ్యాటర్ అని పేర్కొన్నాడు. ఇక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లలో జోస్ బట్లర్, రుతురాజ్ గైక్వాడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా అనిపించిందని తన అనుభవాన్ని పంచుకున్నాడు. చదవండి👉🏾 IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది' చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! .@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍 The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f — IndianPremierLeague (@IPL) May 29, 2022 -
బెంగాల్ జట్టుకు ఆడనున్న వృద్ధిమాన్ సాహా,మహమ్మద్ షమీ..!
రంజీ ట్రోఫీ 2021-2022లో భాగంగా జార్ఖండ్‌తో జరగనున్న క్వార్టర్ ఫైనల్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ తమ జట్టును ప్రకటించింది. లీగ్ దశ నుంచి వైదొలిగిన వృద్ధిమాన్ సాహా తిరిగి మళ్లీ బెంగాల్ జట్టు తరపున ఆడనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ పేసర్ మహమ్మద్ షమీని కూడా ఎంపిక చేసింది. అయితే రానున్న రోజుల్లో బీజీ షెడ్యూల్ ఉన్నందున మహమ్మద్ షమీ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో సాహా.. రంజీ ట్రోఫీ లీగ్ దశ నుంచి తప్పుకున్నాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీజన్లో సాహా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మ్యాచ్‌లు ఆడిన సాహా 281 పరుగులు సాధించాడు. క్వార్టర్ ఫైనల్ జూన్ 6న బెంగళూరు వేదికగా జరగనుంది. బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), మనోజ్ తివారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, అభిషేక్ రామన్, రిటిక్ ఛటర్జీ, సయన్ శేఖర్ మొండల్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, ఇషాన్ గ్హో, ఆర్. రాయ్ చౌదరి, ప్రదీప్త ప్రమాణిక్, కరణ్ లాల్, నీలకంఠ దాస్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్, మహమ్మద్ కైఫ్, అంకిత్ మిశ్రా చదవండి: IPL 2022: 'మ్యాచ్ గెలవడం కంటే నీ ఈగో ముఖ్యమా' -
'రస్సెల్, ధోనిలా భారీ షాట్లు ఆడలేను.. కానీ పవర్‌ప్లేలో మాత్రం..'
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా నిలకడగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియన్ బ్యాటర్ మాథ్యూ వేడ్ స్థానంలో సాహా గుజరాత్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య చేధనలో సాహా అద్భుతమైన అర్ధసెంచరీ సాధించాడు. ఇక 2008 మొదటి సీజన్ నుంచి సహా ఐపీఎల్లో ఆడుతున్నాడు. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సహా పలు విషయాలు పంచుకున్నాడు. "చిన్నప్పటి నుంచి నేను పొట్టి ఫార్మాట్లో ఆడేందుకు ఇష్టపడతాను. క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, ధోని భాయ్లా భారీ షాట్లు ఆడలేను. కానీ పవర్‌ప్లేలో జట్టు కోసం త్వరగా పరుగులు సాధించగల సత్తా నాకు ఉంది. వ్యక్తిగత రికార్డుల గురించి నేను ఆలోచించను. ఇప్పటి వరకు జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాను. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అత్యత్తుమంగా ఆడటానికి ప్రయత్నిస్తాను" అని సాహా పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సాహా 154 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: 'నేను యార్కర్లు వేయలేకపోతున్నాను.. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సాహాను బెదిరించిన జర్నలిస్టుకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఇకపై..
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్టు బోరియా మజుందార్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ షాకిచ్చింది. రెండేళ్లపాటు ఆయనపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్ పేరిట బీసీసీఐ లేఖను పంపింది. కాగా.. ‘‘భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత.. సోకాల్డ్ ఓ జర్నలిస్టు నా పట్ల ప్రదర్శించిన ‘గౌరవం’ఇది! జర్నలిజం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ జర్నలిస్టు బోరియా మజుందార్ తనకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లు సాహా షేర్ చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపిన ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో సాహా ఆరోపణలకై దర్యాప్తునకై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. సాహా, మజుందార్‌ల వాదన విన్న అనంతరం... ‘‘మిస్టర్ మజుందార్ బెదరింపు ధోరణిని అవలంబించారు’’ అని పేర్కొంటూ ఆయనపై రెండేళ్ల నిషేధం విధించాల్సిందిగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు సిఫారసు చేసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అపెక్స్ కౌన్సిల్ బోరియా మజుందార్‌ను రెండేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ►భారత్‌లో నిర్వహించే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రెస్ మెంబర్‌గా ఆయనకు అవకాశం ఉండదు. ►భారత్‌లో రిజిస్టర్ అయిన ఆటగాళ్లను ఆయన ఇంటర్వ్యూ చేయకూడదు. ►బీసీసీఐ, సభ్యులతో ఆయనను సంప్రదింపులు చేయరాదు. ఈ నిబంధనలు పాటించాల్సిందిగా అన్ని రాష్ట్రాల యూనిట్లకు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. చదవండి👉🏾Sri Lanka Tour of Bangladesh: బంగ్లాదేశ్‌తో శ్రీలంక టెస్టు సిరీస్.. జట్టు ప్రకటన -
సాహా ఆరోపణలపై కమిటీ నివేదిక..
Wriddhiman Saha Allegations- న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంటర్వ్యూ విషయమై బెదిరింపులకు పాల్పడిన ఉదంతంపై విచారించిన కమిటీ తమ నివేదికను బీసీసీఐకి అందజేసింది. బోర్డు ఉన్నతస్థాయి అధికారుల బృందం ఈ నెల 23న నివేదికను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ ... సాహాను ఇంటర్వ్యూ అడిగాడు. క్రికెటర్ స్పందించకపోవడంతో బెదిరించినట్లుగా వాట్సాప్‌లో సాహాకు ఎస్సెమ్మెస్ పంపడం వివాదాస్పదమైంది. ఓ సీనియర్ క్రికెటర్, బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ను ఓ సాధారణ జర్నలిస్టు శాసించడంపై బోర్డు విచారణ చేపట్టింది. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, సభ్యుడు ప్రభ్‌తేజ్ భాటియాలతో కూడిన త్రిసభ్య కమిటీ సాహా ఆరోపణలపై విచారించింది. చదవండి: IPL 2022: టైటాన్స్ జోరుకు రైజర్స్ బ్రేక్ -
జర్నలిస్ట్‌పై ఆరోపణలు.. సాహాకు దిమ్మతిరిగిపోయే కౌంటర్
ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ తనను బెదిరించాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జర్నలిస్ట్ సాహాపై పరువు నష్టం దావా వేశాడు. ఇంటర్వ్యూ కోసం సాహాతో చాట్ చేసింది వాస్తవమేనని, కానీ తన మెసేజ్‌లను సాహా టాంపర్ చేశాడని జర్నలిస్ట్ బోరియా మజుందార్ ప్రత్యారోపణలు చేశాడు. There are always two sides to a story. @Wriddhipops has doctored, tampered screenshots of my WhatsApp chats which have damaged my reputation and credibility. I have requested the @BCCI for a fair hearing. My lawyers are serving @Wriddhipops a defamation notice. Let truth prevail. pic.twitter.com/XBsiFVpskl — Boria Majumdar (@BoriaMajumdar) March 5, 2022 భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసిన సాహా అభిమానుల సానుభూతి కోసమే తనపై ఆరోపణలు చేశాడని మజుందార్ పేర్కొన్నాడు. సాహా సోషల్ మీడియాలో షేర్ చేసిన చాట్స్ నకిలీవని, ఒరిజినల్ మెసేజ్‌లను కోర్టులో సమర్పిస్తానని తెలిపాడు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు మజుందార్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. కాగా, సాహా జర్నలిస్ట్‌పై చేసిన ఆరోపణలను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా చేపట్టింది. తొలుత జర్నలిస్ట్ పేరును వెల్లడించని సాహా విచారణలో భాగంగా సదరు జర్నలిస్ట్ పేరును కమిటీ ముందు వెల్లడించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో సాహా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ గంగూలీ తనకు భరోసా కల్పించినా, ద్రవిడ్ తనను రిటైర్మెంట్ గురించి ఆలోచించమన్నాడంటూ సాహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ -
Wriddhiman Saha: మౌనం వీడిన సాహా.. నాకు నా తల్లిదండ్రులు అలాంటివి నేర్పించలేదు
Wriddhiman Saha Comments: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై వ్యాఖ్యలు, జర్నలిస్టు బెదిరింపులు అంటూ ట్వీట్‌తో వార్తల్లోకెక్కిన భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఎట్టకేలకు మౌనం వీడాడు. సదరు జర్నలిస్టు పేరు బయటపెట్టకపోవడం వెనుక కారణాన్ని వెల్లడించాడు. ఈ మేరకు సాహా సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంతవరకు బీసీసీఐ నుంచి నాతో ఎవరూ కమ్యూనికేట్ చేయలేదు. ఒకవేళ వాళ్లు అడిగితే తప్పకుండా ఆ జర్నలిస్టు పేరు బయటపెడతా. నిజానికి ఓ వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడం, అభాసుపాలు చేయడం.. కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇతరకులకు హాని చేయాలన్న ఆలోచన ఉండదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఇదే. అందుకే నా ట్వీట్లో ఆ వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. అయితే, మీడియాలో కొంతం మంది వ్యక్తులు ఆటగాళ్లను ఎలా అగౌరవపరుస్తారో బయట ప్రపంచానికి తెలియాలన్న తలంపుతోనే ఆ ట్వీట్ చేశాను’’ అని అన్నాడు. అదే విధంగా... ‘‘ఈ పని ఎవరు చేశారో వాళ్లకు బాగా తెలుసు. నాలాగా ఇతర ఆటగాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఆ ట్వీట్లు చేశాను. ఇలా చేయడం వల్ల ఇంకోసారి సదరు వ్యక్తి ఇలాంటి తప్పులు చేయకూడదనేదే నా ఉద్దేశం’’ అని సాహా చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని సాహా.. కోచ్ ద్రవిడ్ తనకు రిటైర్మెంట్ సలహా ఇచ్చాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఓ జర్నలిస్టు తనను బెదిరించాడంటూ అతడి నుంచి తనకు వచ్చిన మెసేజ్ స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన బీసీసీఐ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాహాను వివరణ కోరనున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ పీటీఐతో పేర్కొన్నారు. చదవండి: Saha-Journalist Row: బీసీసీఐ సంచలన నిర్ణయం..! Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త.. -
Wriddhiman Saha: సాహా ఫైర్.. అసలేమైంది
-
Wriddhiman Saha: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ!
Wriddhiman Saha: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని నేపథ్యంలో.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై సాహా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను రిటైర్ అవ్వాలంటూ ద్రవిడ్ సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనకు జట్టులో చోటు ఉంటుందని హామీ ఇచ్చాడనడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నారని అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాహా వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. అసలు భారత క్రికెట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... రాహుల్ ద్రవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం సహా... ఓ జర్నలిస్టు తనను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పంపాడంటూ సాహా ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన తర్వాత.. సోకాల్డ్ ఓ జర్నలిస్టు నా పట్ల ప్రదర్శించిన ‘గౌరవం’ఇది! జర్నలిజం ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ’ అంటూ సదరు వ్యక్తి తనకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లు సాహా షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సహా... వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తదితరులు అతడికి అండగా నిలిచాడు. ఒక క్రికెటర్ పట్ల సదరు జర్నలిస్టు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని, అతడి పేరు బయటపెట్టాల్సిందిగా వృద్ధికి సూచించారు. ఇక ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి జోక్యం చేసుకోవాలని రవిశాస్త్రి విజ్ఞప్తి చేశాడు. ఈ పరిణామాల క్రమంలో సాహా వివాదంపై దృష్టి సారించిన బీసీసీఐ... ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సాహాకు మెసేజ్‌లు చేసిన వ్యక్తి ఎవరు? ఇంటర్వ్యూలో అతడు ఏం మాట్లాడాడు? తదితర విషయాల గురించి లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘‘బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్ సాహా. అతడి పట్ల ఎవరైనా అవమానకరంగా వ్యవహరిస్తే బోర్డు చూస్తూ ఊరుకోదు. బెదిరింపులకు పాల్పడితే అస్సలు సహించదు. కచ్చితంగా విచారణ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రీడా విశ్లేషకులు..... ‘‘గంగూలీకి సాహాతో మాట్లాడి హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సాహా కూడా ఇలా మాట్లాడం సరికాదు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదు’’ అని అంటున్నారు. ఆ స్క్రీన్‌షాట్‌లో ఏముందంటే! ‘‘నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. బాగుంటుంది. మీరు సరిగా స్పందించకపోతే.. నేను కూడా మిమ్మల్ని ప్రోత్సహించను. ఎవరు అత్యుత్తమ వికెట్ కీపరో... వాళ్లు అతడినే ఎంపిక చేస్తారు కదా. నువ్వు నాకు కాల్ చేయలేదు. నిన్నెపుడూ ఇక ఇంటర్వ్యూ చేయను. ఈ అవమానాన్ని నేను అంత తేలికగా మర్చిపోను. కచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. నువ్విలా చేయకుండా ఉండాల్సింది’’అంటూ సదరు జర్నలిస్టు తనకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడంటూ సాహా స్క్రీన్షాట్లు షేర్ చేశాడు. చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త.. After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 -
Rahul Dravid: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్..!
Rahul Dravid- Wriddhiman Saha: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అతడి మాటలు తననేమీ బాధించలేదని, ఇప్పటికీ సాహా పట్ల తన మనసులో గౌరవం అలాగే ఉందన్నాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, ఆటగాడిగా అందుకున్న విజయాలే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో సాహాకు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అతడు.. ద్రవిడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని ఆయన సలహా ఇచ్చాడని ఆరోపించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి తనకు హామీ ఉన్నప్పటికీ జట్టులో స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... ‘‘భారత క్రికెట్ విజయాల్లో తను భాగం అయ్యాడు. తన పట్ల నాకు గౌరవం ఉంది. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాను. అయితే, అతడికి ఈ విషయంలో క్లారిటీ అవసరం. నిజానికి అందరు ఆటగాళ్లతో ఎప్పుడూ మాట్లాడినట్లుగానే మాట్లాడాను. కాస్త నిజాయితీగా వ్యవహరించాల్సింది. మీడియా ద్వారా ఈ మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా ప్రతిసారి మనం ఇచ్చిన సలహాలు, సందేశాలు ప్రతి ఆటగాడికి నచ్చాలని లేదు కదా! అందుకే తన మాటలకు ఎక్కువగా బాధపడలేదు. మన అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా వాళ్లను తప్పుపట్టాల్సింది కూడా ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించే తీరు గురించి చెబుతూ... ‘‘జట్టు ఎంపిక విషయంలో నేను లేదంటే... రోహిత్... ఆటగాళ్లతో కచ్చితంగా మాట్లాడతాం. వాళ్లు ఎందుకు తుది జట్టులో లేరో.. అందుకు గల కారణాలు వివరిస్తాం. సెలక్ట్ అవ్వని వాళ్లు బాధకు లోనుకావడం సహజమే. అయినా, వాళ్ల పట్ల నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, క్లారిటీ కలిగి ఉండాలని నేను కోరుకుంటాను’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే! -
కోచ్‌పై సాహా సంచలన వ్యాఖ్యలు.. ద్రవిడ్ రిటైర్మెంట్ సలహా ఇచ్చాడని ఆవేదన
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై వృద్ధిమాన్ సాహా సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను ఇకపై ఎంపిక కోసం పరిగణించనందున "రిటైర్మెంట్" గురించి ఆలోచించమని సలహా ఇచ్చినట్టు సాహా తెలిపాడు. కాగా శ్రీలంకతో టెస్టులకు జట్టు ఎంపికలో సాహాను పరిగణినలోకి తీసుకోవడం లేదని ముందే అతడికి టీమ్ మేనేజ్మెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అతడు రంజీ ట్రోఫీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. "ఇక నుంచి జట్టు ఎంపికలో నన్ను పరిగణించబోమని టీమ్ మేనేజ్మెంట్ నాకు చెప్పింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించాడు. గత నవంబర్‌లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో నేను పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుని అజేయంగా 61 పరుగులు చేసినపుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నన్ను అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడుగా తను ఉన్నంత కాలం జట్టులో నా స్ధానం గురించి ఆందోళన చెందవద్దని గంగూలీ నాకు హామీ ఇచ్చారు. బోర్డు అధ్యక్షుడి నుంచి అటువంటి భరోసా రావడంతో నేను చాలా సంతోష పడ్డాను. అయితే ఇంతలోనే జట్టులో స్ధానాన్ని ఎలా కోల్పోయానో నాకు అర్ధం కావడం లేదు" అని సాహా పేర్కొన్నాడు. చదవండి: "త్వరలోనే భారత జట్టులోకి వస్తా.. నా విజయంలో అతడిదే కీలక పాత్ర" -
Ind Vs NZ 1st Test: ఏం ఆడుతున్నావయ్యా.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా?
Twitter reacts after Wriddhiman Saha was dismissed against New Zealand: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు ఆటలో భాగంగా 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా నిష్క్రమించగా 88వ ఓవర్లో సాహా క్రీజులోకి వచ్చాడు. కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ.. అతడు 93వ ఓవర్లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక పరుగు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? ఇప్పటికైనా అతడిని కాదని రిషభ్ పంత్‌ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్‌లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకోండి!’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో... తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అరంగేట్ర మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. Throw out that Saha from team and play with KS Bharat . — Sowmya (@SowmyaVirat18) November 26, 2021 Why is W saha still in the team ? #indvs — Name cannot be blank (@infinity9191) November 26, 2021 #saha pic.twitter.com/p9EEwBGAjX — Cricket 🏏 memes 😁 (@Lakshay48215862) November 26, 2021 Time for India to move away from Saha even as a backup keeper, he is the best "Wicket-keeper" but time to give that backup option to KS Bharat or someone to groom from the Sri Lanka Test series. — Johns. (@CricCrazyJohns) November 26, 2021 -
Ind Vs Nz 1st Test: అర్థసెంచరీలతో రాణించిన కివీస్ ఓపెనర్లు.. రెండోరోజు ముగిసిన ఆట
India Vs Nz 1st Test Day 2 2021 Highlights: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(75*), టామ్ లాథమ్(50*) అర్థసెంచరీలు సాధించారు. కాగా న్యూజిలాండ్ ఇంకా 215 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ అద్భుతంగా ఆడుతున్నారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో 57 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 129 పరుగులు చేసింది. Updates: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 111.1 ఓవర్ల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 258/4 స్కోరుతో రెండో రోజు ఆటను మొదలెట్టిన రహానే సేనను కివీస్ బౌలర్ టిమ్ సౌథీ దెబ్బతీశాడు. అర్ధ సెంచరీ సాధించిన జడేజా.. ఆ తర్వాత సాహా, సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో బౌలర్ అజాజ్ పటేల్ అశ్విన్, ఇషాంత్ శర్మలను పెవిలియన్‌కు పంపి లాంఛనం పూర్తి చేశాడు. ఇక కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్లు జట్టుకు శుభారంభం అందించారు. యంగ్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. లాథమ్ కూడా హాఫ్ సెంచరీ దిశ(40)గా పయనిస్తున్నాడు. 46 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 116/0. 3: 40 PM: న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బౌండరీలు బాదుతూ కివీస్ స్కోరును పెంచుతున్నాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతున్నాడు. ఇద్దరూ నిలకడగా ఆడుతుండటంతో 44 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 110 పరుగులు చేసింది. 2:55 PM: న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ నిలకడగా ఆడుతున్నారు. 28వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన విల్ యంగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 33 ఓవర్లు ముగిసే సరికి లాథమ్ 28, యంగ్ 58 పరుగులతో ఉన్నారు. స్కోరు: 89-0 1:38 PM: ►15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 35-0. 12:35 PM: ►ఇషాంత్ శర్మ టీమిండియా బౌలింగ్ అటాక్‌ను ఆరంభించాడు. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్(0), విల్ యంగ్(2) క్రీజులో ఉన్నారు. ►మొదటి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో అశ్విన్ బౌల్డ్ అయ్యాడు. 109 ఓవర్లలో స్కోరు ఎంతంటే ►కివీస్ బౌలర్ టిమ్ సౌథీ వరుస వికెట్లు పడగొడుతున్నాడు. తొలుత జడేజా.. ఆ తర్వాత సాహా, శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్‌కు పంపిన సౌథీ... అక్షర్ పటేల్‌ను కూడా అవుట్ చేశాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం అశ్విన్, ఉమేశ్ యాదవ్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 339/8 (109) 12:05 PM: లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 339 పరుగులు చేసింది. అశ్విన్ 38 పరుగులు, ఉమేశ్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ►స్కోరు: 339/8 (109) 11:29 AM: 108 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 333-8 11:11 AM: 104 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. 11:00 AM: 100 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 314-8. 10: 57 AM: 99వ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్(3) అవుట్. అయ్యర్ సైతం టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా... టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 171 బంతుల్లో 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ప్రస్తుతం అశ్విన్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 10: 38 AM: అయ్యర్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు సాహాను అవుట్ చేసిన కివీస్ బౌలర్ టిమ్ సౌథీ.. నిలకడగా ఆడుతున్న అయ్యర్‌ను సైతం పెవిలియన్‌కు పంపి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వికెట్ డౌన్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(104), అశ్విన్(13) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రవీంద్ర జడేజా( 50 పరుగులు) పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ అతడిని అవుట్ చేశాడు. 10: 30 AM: 95 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 301-6. అయ్యర్ అద్భుతం న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా రెండో రోజు ఆట మొదలెట్టింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. 92వ ఓవర్లో జెమీషన్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి.. టెస్టుల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇక జడేజా టిమ్ సౌథీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్ రెండో రోజు తొలి వికెట్ కోల్పోయింది. కాగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక్కడ చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. -
వృద్ధిమాన్ సాహా ఓపెనర్‌గా పనికిరాడు: దక్షిణాఫ్రికా కోచ్
Mark Butcher Comments On Wriddhiman Saha: ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది. దీంతో ఫ్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసాయి. అయితే ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి వృద్ధిమాన్ సాహా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంపై దక్షిణాఆఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన సాహా వరుసగా 7,1,18, పరుగుల మాత్రమే సాధించాడు. "వృద్ధిమాన్ సాహా వాస్తవానికి మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్సమన్. అయితే సాహా ఓపెనింగ్‌లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటింగ్ ఆర్ఢర్లో మార్పు చేస్తే అతడు అధ్బుతంగా ఆడగలడు" అని ఓ క్రికెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి! -
Wriddhiman Saha: ధోని రిటైర్ అయిన తర్వాతే నాకు ఛాన్స్!
న్యూఢిల్లీ: అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టి దాదాపు 11 ఏళ్లు పూర్తయ్యాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయం ప్రకారం ఉత్తమ వికెట్ కీపర్లలో తనూ ఒకడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ అయితే, అతడి స్మార్ట్‌నెస్ ఫిదా అయ్యాడు. ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు అయినా, తన ఆటలో మెరుపు మాత్రం తగ్గలేదని అభిమానులు అంటారు. తన పని తాను సక్రమంగా నెరవేర్చుకుపోయేతత్వం.. లెజెండరీ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ కెప్టెన్ జట్టులో ఉన్నంతకాలం అతడికి అవకాశాలు సన్నగిల్లడంతో అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో జట్టులో చోటు దక్కించుకునేందుకు నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. అయితే, టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా పంతే ఉండాలంటూ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించడం కూడా తనకే చెల్లింది. ఇప్పటికే క్రికెట్ ప్రేమికులకు అర్థమై పోయి ఉంటుంది.. అవును.. వృద్ధిమాన్ సాహా గురించే ఇదంతా. వ్యక్తిగతంగా తాను అనుకున్న శిఖరాలకు చేరుకోలేకపోయినా, మేటి క్రికెటర్‌గా వార్తల్లో నిలవకపోయినా... జట్టు గెలిస్తే చాలు అనే మనస్తత్వం కలిగిన సాహా ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడిన సాహా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోని వంటి లెజెండ్‌తో పోటీపడాల్సిన పరిస్థితి కదా. సాహా దురదృష్టవంతుడా? అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు. మన ప్రదర్శనను బట్టే.. మేనేజ్మెంట్ జట్టులోకి ఎంపిక చేయాలా వద్దా అన్న విషయం గురించి నిర్ణయం తీసుకుంటుంది. బాగా ఆడిన వాళ్ల స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు. జట్టు ప్రయోజనాల కోసమే ఆలోచించాలి. అంతేగానీ, మనం ఆడామా లేదా అన్నది ముఖ్యం కాదు. నిజం చెప్పాలంటే.. ధోని భాయ్ జట్టులో ఉంటే.. కచ్చితంగా ఆయనే కీపింగ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఎప్పుడో ఒక్కసారి వచ్చిన అవకాశాన్నైనా వదులుకునేందుకు నేను సిద్ధంగా ఉండేవాడిని కాను. నా అరంగేట్రమే చిత్రంగా జరిగింది. 2010 దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన మ్యాచ్. నిజానికి ముందు నేను తుదిజట్టులో లేనని చెప్పారు. కానీ ఆ తర్వాత పిలుపు వచ్చింది. అప్పటి నుంచి కాల్ వచ్చినా రాకున్నా ప్రాక్టీసు చేస్తూ సన్నద్ధంగా ఉండేవాడిని. 2014 తర్వాత.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాతే... నాకు రెగ్యులర్‌గా ఆడే అవకాశం వచ్చింది. అంతకుముందు ఎవరైనా గాయపడినా, లేదంటే ఇతరత్రా కారణాల దృష్ట్యా అందుబాటులో లేకపోయితే.. అప్పుడు మాత్రమే నాకు చాన్స్ ఉండేది. ఇక గాయాల గురించి ప్రస్తావించగా.. ‘‘2018లో నా భుజానికి గాయమైంది. సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడే ఇంగ్లండ్ సిరీస్ కూడా ఉంది. ఆ సమయంలో దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్ దూసుకువచ్చారు. ముఖ్యంగా పంత్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మీద బాగా ఆడతాడు. తన రాకతో.. జట్టులో స్థానం కోసం నేను ఎంతోకాలం వేచిచూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పునరాగమనం కోసం కఠిన సమయాల్లో ఓపికగా ఉండాలి’’ అని సాహా పేర్కొన్నాడు. అదే విధంగా ఎల్లప్పుడూ రెండో చాయిస్ వికెట్ కీపర్‌గానే పరిగణింపబడటంపై స్పందిస్తూ.. ‘‘ధోని భయ్యా ఉన్నపుడు.. అంటే కెరీర్ ఆరంభంలోనూ.. ఇక గాయాల కారణంగా స్థానం కోల్పోయి పంత్ వచ్చినపుడు నేనేమీ అనుకోలేదు. ఆటలో ఇవన్నీ సహజం. అయితే, 2014 నుంచి 2018 వరకు నేను ఫస్ట్ చాయిస్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంటుంది. మేనేజ్మెంట్ నిర్ణయం మీదనే అన్నీ ఆధారపడి ఉంటాయి. టీ20లు, వన్డేలు ఆడాలని నాకూ ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్ణయాల ప్రకారమే నడుచుకోవాలి కదా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 38 టెస్టులాడిన ఈ బెంగాలీ క్రికెటర్ 1251 పరుగులు చేశాడు. 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: Ind Vs Sl: గంగూలీ, ద్రవిడ్.. వీరోచిత ఇన్నింగ్స్ గుర్తుందా! -
గాయాల వల్లే వెనుకబడ్డాను
కోల్‌కతా: తరచూ గాయాల వల్లే కెరీర్ సాఫీగా సాగడం లేదని టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. 2010లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాహా ఇన్నేళ్లయినా తన ముద్ర వేయలేకపోయాడు. అయితే వైఫల్యాలకంటే కంటే తనని గాయాలే ఇబ్బంది పెట్టాయన్నాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమైన సాహా ముంబైలో జట్టుకు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో సోమవారం చేరతాడు. ‘సరిగ్గా ఆడకపోతే విమర్శలు తప్పవు. నాకూ తప్పలేదు. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నాను. ఇన్నేళ్లయినా నా బ్యాటింగ్ ఏమాత్రం మెరుగవలేదని చాలామంది విమర్శిస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు కానీ... నా బ్యాటింగ్ శైలిని, టెక్నిక్‌ను మార్చుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే అందులో ఏ లోపం లేదనే నేను అనుకుంటున్నాను. నేనిపుడు పూర్తిగా ఆటమీదే దృష్టిపెట్టాను. మరింతగా శ్రమించాలనే పట్టుదలతో ఉన్నాను’ అని ఈ బెంగాలీ వికెట్ కీపర్ తెలిపాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత ప్రధాన కీపర్‌గా ఎదగాల్సిన తనను గాయాలు పక్కనబెట్టాయని, 2018 సీజన్ అంతా ఇలాగే ముగిసిపోయిందన్నాడు. అయితే డాషింగ్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందివచ్చిన అవకాశాల్ని బాగా సద్వినియోగం చేసుకోగలిగాడని సాహా కితాబిచ్చాడు. ‘నేను గాయాల బారిన పడిన ప్రతీసారి పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్, పంత్ ఇలా ఎవరో ఒకరు జట్టులోకి వచ్చారు. వీరిలో రిషభ్ మాత్రం సత్తా చాటుకున్నాడు. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడి పదిలంగా పాతుకుపోయాడు’ అని సాహా వివరించాడు. భారత జట్టుకు ఆడటమే ఓ వరమని, ఆ ప్రేరణే తనని ఆశావహంగా నడిపిస్తోందని చెప్పాడు. గాయాలు, వైఫల్యాలనేవి ప్రతి ఒక్కరి కెరీర్లో ఉంటాయని, అలాగే తనకూ అలాంటి సవాళ్లు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ‘నేను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచించాను. నేను ఆడినా, ఆడకపోయినా టీమ్ గెలవడమే ముఖ్యమ ని భావించా. జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనే అంశాల కారణంగా సహచరులతో నా సంబంధాలు ఎప్పుడూ చెడిపోలేదు’ అని సాహా స్పష్టం చేశాడు. సాహా 11 ఏళ్ల కెరీర్ ఇప్పటికీ గాయాలతో పడుతూ లేస్తూ సాగుతోంది. 38 టెస్టులాడిన ఈ బెంగాలీ క్రికెటర్ 1251 పరుగులు చేశాడు. 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడంలో భాగమయ్యాడు. కివీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పయనమవుతోంది. కరోనా, సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో పంత్, సాహాలతో పాటు బ్యాకప్ కీపర్‌గా కేఎస్ భరత్‌కు కూడా చోటు దక్కింది. -
Team India England Tour: బ్యాకప్ కీపర్‌గా భరత్
న్యూఢిల్లీ: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు వెంబడి అదనపు వికెట్ కీపర్‌గా ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ వెళ్లనున్నాడు. బెంగాల్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నా... అతను పర్యటన మధ్యలో గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ ఒకరు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ శ్రీకర్ భరత్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ టోర్నీలో ఆడే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో కోల్‌కతాలోని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెడతాడు. చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ -
Covid-19: కోలుకున్న క్రికెటర్.. ఇంగ్లండ్ టూర్‌కు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నీలో కరోనా వైరస్ బారిన పడ్డ భారత జట్టు వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు సాహాకు మార్గం సుగమం అయ్యింది. ఢిల్లీలో క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకున్న సాహాకు నెగెటివ్ రావడంతో అతను కోల్‌కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక అక్కడ కొన్ని రోజు లు గడిపిన తర్వాత ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టు కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో అడుగు పెట్టనున్నాడు. అయితే ఇంగ్లండ్‌కు వెళ్లేలోపు సాహా తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. జూన్ 2న భారత్ అక్కడికి బయలుదేరనుంది. మరోవైపు.. ఐపీఎల్-2021 సీజన్ ఆడే క్రమంలో కోవిడ్ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా కోలుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన అతడు.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: WTC Final: అందుకే వాషింగ్టన్‌తో కలిసి ఉండటం లేదు! The real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do. We are deeply grateful to you for all the sacrifices that you and your family are making. .#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42j — Amit Mishra (@MishiAmit) May 18, 2021 -
అలా అయితే.. ఇప్పట్లో IPL పూర్తి చేయడం కష్టమే!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా గతేడాది ప్రత్యక్షంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూసే అవకాశం లేకపోయినా టీవీలోనైనా వీక్షించి ఆనందించారు క్రికెట్ ప్రేమికులు. భారత్‌లో పరిస్థితుల దృష్ట్యా వేదికను యూఈఏకి మార్చిన బీసీసీఐ.. ఐపీఎల్-2020ను విజయవంతంగా పూర్తి చేసి వారికి వినోదాన్ని అందించింది. అయితే, 14వ సీజన్‌కు వచ్చే సరికి సీన్ మారింది. ఈసారి స్వదేశంలోనే క్యాష్ రిచ్‌లీగ్ నిర్వహించారు. కానీ, బయో బబుల్‌లో ఉన్నా ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021కు మధ్యలోనే బ్రేక్ పడింది. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, విదేశాల్లో మిగతా షెడ్యూల్ పూర్తి చేద్దామనుకున్నప్పటికీ పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం, కేకేఆర్ క్రికెటర్ ప్రసిద్ కృష్ణ ఇంకా హోంక్వారంటైన్లోనే ఉండాల్సి రావడం సహా విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే స్వస్థలాలకు తరలివెళ్లడం వంటి అంశాలు అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మరోసారి అందరినీ ఒకేచోటకు చేర్చడం, బయె బబుల్ నిబంధనలు పక్కాగా అమలు అయ్యేలా చూడటం అంత తేలికేం కాదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టోర్నీ ప్రారంభానికి ముందే ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయిద్దామని ఫ్రాంఛైజీలు భావించినా, పలువురు క్రికెటర్లు ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుండేదేమో! ‘‘చాలా మంది ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్టపడలేదు. నిజానికి అది వారి తప్పు కాదు. టీకాపై అవగాహన లేకపోడం మాత్రమే. ఇంకొంత మంది మాత్రం.. బయో బబుల్‌లో సురక్షితంగా ఉన్నాం కదా. వ్యాక్సిన్‌తో పనేంటి అనుకున్నారు. దీంతో, ఫ్రాంఛైజీలు కూడా వారిని మరీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఫలితంగా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చార్టర్ ఫ్లైట్లలో ప్రయాణాలు చేసినప్పటికీ ఇతర సిబ్బంది కూడా మాతోనే ఉంటారు కదా. వారి కోవిడ్ స్టేటస్ ఏంటో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు ఎవరికి ఎప్పుడు వైరస్ సోకిందో చెప్పడం కష్టం’’ అని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే, విదేశీ క్రికెటర్లు, సిబ్బంది టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపినా, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వారికి వ్యాక్సినేషన్ చేయలేకపోయామని తెలిపినట్లు వెల్లడించింది. కాగా సాహా, ప్రసిద్ కృష్ణ మే 25న ముంబైలో నిర్వహించే మూడు కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగటివ్ వస్తే మాత్రమే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు వారికి చాన్స్ ఉంటుంది. లేదంటే మేజర్ టోర్నీపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇక ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత పలువురు టీమిండియా ఆటగాళ్లు టీకా వేయించుకుంటున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, పుజారా, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ తదితరులు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. చదవండి: Hanuma Vihari: విహారి వలంటీర్స్... -
ఆ క్షణంలో చాలా భయపడిపోయా: సాహా
ముంబై: కరోనా పాజిటివ్ అని తెలియగానే తాను చాలా భయపడిపోయానని ఎస్ఆర్హెచ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. ఈ సీజన్లో ఆరంభంలో సాహాని ప్రయోగాత్మక ఓపెనర్‌గా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించింది. అయితే ఆడిన రెండు మ్యాచ్‌లు కలిపి 8 పరుగులు మాత్రమే చేయడంతో తర్వాత రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలోనే సాహా కరోనా వైరస్ బారినపడ్డాడు. అప్పటికే కేకేఆర్ ఆటగాళ్లు కరోనా బారీన పడడం.. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐ సీజన్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న సాహా తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘కరోనా పాజిటివ్‌గా తేలగానే చాలా భయపడిపోయా. నేనే కాదు.. నా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకి గురయ్యారు. అది తెలిసి నేనే నా ఫ్యామిలీకి వీడియో కాల్ చేసి వారికి నా ఆరోగ్యం బాగానే ఉందని.. మీరు ఆందోళన చెందొద్దని చెప్పాను. కాగా ఐపీఎల్ సందర్భంగా ప్రాక్టీస్ ముగించుకుని హోటల్‌కి వచ్చిన తర్వాత జలుబు, దగ్గు రావడంతో టీమ్ డాక్టర్‌కి సమాచారం అందించాను. ఆరోజే క్వారంటైన్లో ఉంచి.. నాకు కరోనా పరీక్ష చేశారు. వెంటనే నన్ను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ టోర్నీ రద్దు అయ్యే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిశాయి. మరో 31 మ్యాచ్‌లు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేసి సెప్టెంబరు- అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. అయితే ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశాలు లేవని ఆయా బోర్డులు స్పష్టం చేశాయి. చదవండి: కరోనాతో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత -
IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ
-
IPL 2021 నిరవధిక వాయిదా: బీసీసీఐ
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్కే రెండో స్థానంలో ఉంది. వాయిదా వేస్తాం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021)కు కరోనా సెగ తగిలింది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్ బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి. కాగా ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బాంబే హైకోర్టులో పిటిషన్ కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేయాలని పిటిషన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్‌కు కేటాయించిన వనరులను కోవిడ్ రోగులకు ఉపయోగించవచ్చని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. రద్దు చేస్తేనే మంచిది.. భారత్‌లో రోజూవారీ కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వహణ రద్దు అంశంపై sakshi.com నిర్వహించిన పోల్‌లోనూ ఈ విషయం నిరూపితమైంది. ఐపీఎల్‌ను ఆపేస్తేనే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. చదవండి: వైరల్: డ్రింక్స్ మోసుకెళ్లినా.. వి లవ్ యూ వార్నర్ అన్నా! IPL suspended for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI#COVID19 pic.twitter.com/K6VBK0W0WA — ANI (@ANI) May 4, 2021 -
వారితో కలిసి ఆడడమే గొప్ప విషయం: సాహా
ముంబై: టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ 2021 సీజన్లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జట్టుతో పాటు ప్రాక్టీస్ ఆరంభించిన సాహా.. సచిన్,గంగూలీ, ధోని, కోహ్లి లాంటి దిగ్గజ క్రికెటర్ల నుంచి తాను పొందిన సలహాలను మీడియాతో పంచుకున్నాడు. సచిన్ టెండూల్కర్: సచిన్ విషయానికి వస్తే.. నా డెబ్యూ క్యాప్‌ను అతని నుంచి అందుకోవడం గొప్పగా భావిస్తున్నా. ఇది నిజంగా మరిచిపోలేని రోజు. సచిన్‌తో కలిసి ఆ టెస్టు మ్యాచ్ ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. సౌరవ్ గంగూలీ: దాదా(సౌరవ్ గంగూలీ)తో కలిసి నేను అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా.. బెంగాల్ జట్టు తరపున మాత్రం ఆడాను. దేశవాలీ మ్యాచ్ సందర్భంగా అతను ఇచ్చిన సలహాలు ఇప్పటికి గుర్తున్నాయి. ఎంఎస్ ధోని: ధోని బాయ్ నన్ను ఎంతో ప్రోత్సహించేవాడు. అతను టెస్టు కీపర్‌గా ఉన్న కాలంలోనే నేను జట్టులోకి వచ్చాను. అవకాశాలు ఎక్కువగా రాకపోయినా.. ధోని బాయ్ ఇచ్చిన సలహాలు ఎన్నటికి మరువలేనివి. అంతేకాదు ఐపీఎల్లో సీఎస్కే తరపున ధోని నాయకత్వంలో ఆడడం గొప్ప విషయం. విరాట్ కోహ్లి: ప్రస్తుత తరంలో గొప్ప కెప్టెన్లలో కోహ్లి ఒకడు. అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోయే గొప్ప వ్యక్తిత్వం కోహ్లి దగ్గర ఉంది. కాగా వృద్ధిమాన్ సాహా టీమిండియా జట్టులోకి లేటు వయసులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2010లో దక్షిణాఫ్రికా పర్యటనకు రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఎంపికైన సాహా.. వివిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మలు గాయపడడంతో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు ఆడిన సాహాకు 2017లో ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 233 బంతుల్లో 117 పరుగులు చేసిన సాహా పుజారాతో కలిసి ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. సాహా కెరీర్లో ఈ ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2020లో ఆసీస్ పర్యటన సందర్భంగా మొదటి టెస్టు మ్యాచ్‌లో సాహా ఘోరంగా విఫలం కావడంతో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ పర్యటనలో పంత్ విశేషంగా రాణించడం.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పంత్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించడంతో సాహా క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మొత్తంగా ఇప్పటివరకు సాహా టీమిండియా తరపున 38 టెస్టుల్లో 1251 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు సాధించాడు. చదవండి: సన్‌రైజర్స్ కెప్టెన్ గుడ్‌న్యూస్ ఈ క్యాచ్ చూశాక మాట్లాడండి బాస్! -
ఈ క్యాచ్ చూశాక మాట్లాడండి బాస్!
బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకున్నా రిషభ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. కనీసం కీపర్‌గా కూడా అతను ప్రతిభ చూపడం లేదు. పంత్‌ను కొనసాగించడం అవసరమా? మెరుగ్గా కీపింగ్ చేసే వృద్ధిమాన్ సాహాను ఎందుకు దూరం పెడుతున్నారు? ఇవి సగటు భారత క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన సందేహాలు, ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు. అయితే, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పంత్ ఫామ్‌లోకొచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో (97), బ్రిస్బేన్ టెస్టులో (89 నాటౌట్) పరుగులు చేసి అందరి నోళ్లు మూయించాడు. ఈ క్రమంలోనే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. పంత్‌ను ఇక కీపర్‌గా కాకుండా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా పరిగణించాలనేది మేటర్. ఎందుకంటే బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ కీపింగ్ విషయంలో అతను కొన్ని పొరపాట్లు చేయడమే దీనికి కారణం. #INDvsENG #indiavsEngland #pant Wow what stunning catch by rishabh pant 🤩😱🤗 pic.twitter.com/PtfAMXQrf9 — Reva (@revanth675) February 14, 2021 తాజాగా కీపింగ్ విమర్శలకూ పంత్ సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి కీపింగ్‌లోనూ సత్తా చాటుతానని నిరూపించాడు. దాంతోపాటు సొంతగడ్డపై తొలి టెస్టు ఆడుతున్న సిరాజ్‌కు.. తొలి బంతికే వికెట్ దక్కేలా చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్ 39 ఓవర్లో ఈ విశేషం చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన బంతిని ఓలీ పోప్ (57 బంతుల్లో 22; 1 ఫోర్) బౌండరీ తరలిద్దామనుకున్నాడు. ఓలీ గౌవ్స్ను తాకి వికెట్ల వెనకాల నుంచి పరుగులు పెడుతోంది. మెరుపువేగంతో అద్భుతంగా డైవ్ చేసిన పంత్ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను ఓపెనర్ రోహిత్ (161) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడు రహానే (67), పంత్ (58 నాటౌట్) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగలిగింది. ఇక రెండో రోజు ఆటలో భారత బౌలర్లు ఆధిపత్యం కనబర్చడంతో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. పంత్ పట్టిన మరో క్యాచ్ One more super duper catch from #RishabhPant 🔥😍❤️#ENGvIND #INDvENG pic.twitter.com/6Mb5b9xPvO — 🇮🇳 S U N N Y - V I R A T 🇮🇳 (@sunny_hrudhay) February 14, 2021 చదవండి: ఆ అవార్డు రిషభ్ పంత్‌దే.. పంత్,ఇంగ్లండ్ కీపర్ గొడవ.. మధ్యలో స్టోక్స్ -
'పంత్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు'
ముంబై: టీమిండియా వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తన సహచర ఆటగాడు రిషబ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ పర్యటనలో రిషబ్ గొప్ప ప్రదర్శన చేసినప్పటికి తన కెరీర్‌కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్నాడు. 'పంత్‌కు,నాకు మధ్య మంచి అనుబంధం ఉంది.. కావాలంటే అ విషయంపై మీరు అతన్ని అడగొచ్చు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. ఎవరు బాధపడం.. పైగా ఒకరినొకరు సాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగానూ నాకు పంత్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరిలో నెంబర్ 1,2 అంటూ ఎవరు లేరు. బ్యాటింగ్‌లో ఎవరిశైలి వారికి ఉంటుంది. మ్యాచ్‌లో ఉత్తమంగా రాణించినవారికి జట్టు అవకాశాలిస్తుంది. నా పని నేను చేసుకుంటూ వెళుతా.. అంతేగాని జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో ఉండదు. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పంత్ కీపింగ్‌లోనూ క్రమంగా మెరుగవుతున్నాడు. మొదటి తరగతిలోనే అన్ని నేర్చుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది.. పంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏదో ఒకరోజు ఉన్నతస్థాయికి ఎదుగుతాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తోనే రిషబ్ పంత్‌ను టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరి వ్యక్తిగత గుర్తింపు వారికి ఉంటుంది. ఇక రహానే కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సిరీస్‌లో మేం సాధించిన విజయం ప్రపంచకప్ గెలిచినంత సమానం. రహానే కెప్టెన్సీ చాలా కూల్‌గా ఉంటుంది. కోహ్లి లాగే అతను ఆటగాళ్లను బాగా నమ్ముతాడు.. భావోద్వేగాలను బయటపెట్టడానికి మాత్రం ఇష్టపడడు. సహచరుల్లో స్పూర్తి ఎలా నింపాలో రహానేకు బాగా తెలుసు.. అతని విజయరహస్యం కూడా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: థ్యాంక్యూ యువీ భయ్యా.. ఇదంతా నీ వల్లే ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విఫలం తర్వాత మిగతా మూడు టెస్టులకు అవకాశం రాకపోవడంపై సాహా స్పందించాడు. ఎవరి కెరీర్‌లోనైనా ఫెయిల్యూర్ అనే దశ కచ్చితంగా ఉంటుంది. కెరీర్లో ముందుకు సాగాలంటే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొవడం తప్పనిసరి.. నేను గాయపడడంతోనే కదా.. రిషబ్ పంత్ ప్రతిభ ఎంత అనేది భయపడింది. అంతమాత్రానా నా కెరీర్ ముగిసిపోతుందని నేను అనుకోనని తెలిపాడు. చదవండి: ఐపీఎల్: రిటైన్ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం -
ఇటు ఇషాంత్... అటు సాహా!
బెంగళూరు/సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి నెల రోజుల ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. జట్టులోని ఇద్దరు కీలక సభ్యులు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాల నుంచి కోలుకుంటున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న ఇషాంత్ శర్మ బుధవారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధన చేయగా... సిడ్నీలో సాహా తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఇషాంత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉంటే అతను వెంటనే ఆస్ట్రేలియా బయల్దేరతాడు. ద్రవిడ్, సునీల్ జోషి సమక్షంలో... ఐపీఎల్లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అనంతరం ఇషాంత్ పొత్తికడుపు కండరాల గాయంతో తప్పుకున్నాడు. ఆ తర్వాతి నుంచి అతను ఎన్సీఏలోనే ఉంటూ గాయానికి చికిత్స పొందుతున్నాడు. ఫిట్‌గా మారితే నవంబర్ 18 నుంచి ఇషాంత్ బౌలింగ్ చేయవచ్చని ఎన్సీఏ గతంలోనే బీసీసీఐకి సమాచారం అందించింది. బోర్డు వైద్యులు, ట్రయినర్ పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం బుధవారం అతను మైదానంలోకి దిగాడు. రెండు వేర్వేరు స్పెల్‌లలో కలిపి సుమారు రెండు గంటల పాటు ఇషాంత్ బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ సునీల్ జోషి అక్కడే ఉన్నారు. ఇషాంత్ బౌలింగ్‌ను భారత అండర్–19 జట్టు కోచ్, మాజీ పేసర్ పారస్ మాంబ్రే పర్యవేక్షించాడు. పూర్తి రనప్, వేగంతో ఇషాంత్ బౌలింగ్ చేశాడని, ఎక్కడా కొంచెం కూడా అతను ఇబ్బంది పడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. బ్యాటింగ్ ప్రాక్టీస్... ఐపీఎల్లో కండరాల గాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సాహా... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే జట్టుతో పాటు అతనూ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బుధవారం సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు నువాన్ సెనెవిరత్నే, దయానంద గరాని నెట్స్‌లో విసిరిన బంతులను సాహా ఎదుర్కొన్నాడు. రెండు టి20లకు బుమ్రా, షమీ దూరం! ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత ప్రధాన పేసర్లు షమీ, బుమ్రాలకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. డిసెంబర్ 11 నుంచి గులాబీ బంతితో జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రధాన జట్టు మొత్తం బరిలోకి దిగే అవకాశం ఉండగా... అంతకుముందు డిసెంబర్ 6 నుంచి జరిగే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా షమీ, బుమ్రా ఆడాలని జట్టు కోరుకుంటోంది. అయితే 6, 8 తేదీల్లో ఆసీస్‌తో భారత్ రెండు టి20లు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టి20లనుంచి తప్పించైనా సరే... ప్రాక్టీస్ మ్యాచ్ ఆడించడంపైనే జట్టు ఎక్కువ దృష్టి పెట్టింది. మూడు వన్డేలు, తొలి టి20 తర్వాత ఈ ఇద్దరు పేసర్లు టెస్టు సిరీస్ కోసమే సిద్ధం కావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే జరిగితే చివరి రెండు టి20ల్లో చహర్, నటరాజన్, సైనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. -
'అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్సపై భారీ విజయం సాధించింది. 88 పరుగుల భారీ విజయంతో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వృద్దిమాన్ సాహా 87 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్ వార్నర్ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీకి వరుసగా ఇది హ్యాట్రిక్ ఓటమి. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ప్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ సాహా ప్రదర్శనపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అయిన వృద్దిమాన్ సాహా నాకౌట్ ఇన్నింగ్స్‌తో విజయానికి దూరం కావాల్సి వచ్చిందంటూ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 'ఈరోజు సాహా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిని ముందే తెలుసు.. కానీ ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం నుంచి జట్టుతో ఉంటున్న తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి తుఫాను ఇన్నింగ్స్ ఆడేశాడు. అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్‌స్టో రానున్న మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రావడం కష్టమే.. ఒకవేళ ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో. ఎస్ఆర్హెచ్ విధించిన 220 పరుగులు చేధించడం కొంచెం కష్టమే. శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు ఓపెనర్లుగా వచ్చినా.. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ సున్నాకే వెనుదిరగడం.. మిగతావారు పూర్తిగా విఫలం కావడం.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. అయినా సాహా, వార్నర్ దాటికి పవర్‌ప్లేలో ఆ జట్టు ఈ లీగ్‌లోనే అత్యధికంగా 77 పరుగులు చేయడంతో విజయానికి అక్కడే దూరమయ్యామని అనిపించాం. ఆరంభం నుంచి ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సులువుగా ప్లేఆఫ్ చేరొచ్చనే విషయంపై స్పష్టంగానే ఉన్నాం. ఒక దశలో ఏడు విజయాలు సాధించిన తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడంతో టాప్ ప్లేస్ కోసం మళ్లీ పోటీ ఏర్పడింది. ఇప్పుడు దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది. మాకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో కఠినమైన ముంబై, ఆర్సీబీని ఎదుర్కోనున్నాం. రెండు మ్యాచ్‌లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.. రెండు గెలిస్తే టాప్ ప్లేస్ మా సొంతం అవుతుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే.. రన్‌రేట్ కీలకమవుతుంది.. అందుకే రానున్న మ్యాచ్‌ల్లో రన్‌రేట్‌ను కూడా మరింత మెరుగుపరుచుకుంటాం.' అని పాంటింగ్ తెలిపాడు. -
నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా
కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లో తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు. -
‘పంత్‌ను డిసైడ్ చేస్తే అతనే ఆడతాడు’
రాజ్‌కోట్: మరొకసారి రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్ జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ముగిసిన తుది పోరులో సౌరాష్ట్ర విజయం సాధించింది. ఫలితంగా రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. డ్రాగా ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధారంగా సౌరాష్ట్ర విజేతగా అవతరించింది. అయితే బెంగాల్ జట్టు సభ్యుడైన వృద్ధిమాన్ సాహా మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. రంజీ ట్రోఫీని బెంగాల్ ఎందుకు సాధించలేకపోయిందో వివరించాడు. ప్రధానంగా టాస్ ఓడిపోవడమే తాము టైటిల్‌ను కోల్పోవడానికి కారణమన్నాడు. ఆ పిచ్ చాలా పేలవంగా ఉందని, దాంతో బ్యాటింగ్ చేయడం కష్టతరమైందన్నాడు. (రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు) ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎందుకు ఆడలేదు అనే దానిపై సాహా స్పందించాడు. ‘ ప్రతీ ఆటగాడికి తుది జట్టులో ఉన్నామా.. లేదా అనే విషయం మ్యాచ్‌కు ముందే తెలుస్తుంది. అది అప్పటి పరిస్థితిని బట్టి, బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేస్తారు. నేను జట్టులో ఉన్నా చోటు దక్కలేదు. అదేమీ నన్ను బాధించలేదు. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం మేరకు రిషభ్ పంత్‌కు అవకాశం దక్కింది. జట్టు పంత్ ఆడాలనే డిసైడ్ చేస్తే అతనే ఆడతాడు కదా.. అది నా చేతుల్లో ఉండదు. పంత్‌ను ఆడించాలనుకుంటే అతన్నే ఆడిస్తారు. ఇందులో విషయం ఏమీ లేదు. అది మేనేజ్మెంట నిర్ణయం. దాన్ని గౌరవించాలి. జట్టు కూర్పు అనేది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. మాలో ఎవరు ఆడిన మా లక్ష్యం మాత్రం జట్టు గెలుపులో భాగం కావడమే’ అని సాహా తెలిపాడు. -
పెద్దగా సమయం అవసరం లేదు: సాహా
కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో గాయపడిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నాడు. తన కుడి చేతి వేలికి గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న సాహా.. తాను రికవరీ కావడానికి పెద్దగా సమయం అవసరం లేదన్నాడు. కనీసం ఐదు వారాల్లో గాయం నుంచి కోలుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని క్రికెటర్ల పునరావాస శిబిరంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇప్పుడు తాను అదే పనిలో ఉన్నానని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో పింక్ బాల్ టెస్టులో సాహా గాయపడ్డాడు. గత నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పాల్గొన్న సాహా.. మళ్లీ గాయం బారిన పడ్డాడు. అయితే ఇది అంత ఇబ్బందికరమైన గాయం కాదని సాహా పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ ఆడే నాటికి తాను తిరిగి గాడిలో పడతానన్నాడు. వచ్చే నెలలో విండీస్‌తో భారత్‌కు ద్వైపాక్షిక సిరీస్ ఉన్నప్పటికీ అందులో టెస్టు సిరీస్ లేదు. అందులో కేవలం టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ మాత్రమే ఉంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే వరకూ భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు. -
సాహా చేతివేలికి సర్జరీ
కోల్‌కతా: భారత టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన డేనైట్ టెస్టు మ్యాచ్‌లో అతని చేతి వేలికి గాయమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం అతని గాయంపై మణికట్టు వైద్య నిపుణుడిని సంప్రదించింది. ఆయన సర్జరీకి సూచించడంతో ముంబైలోని హాస్పిటల్లో శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాహా మాట్లాడుతూ ‘ఇది మామూలు గాయమే. కాస్త ఫ్రాక్చర్ అయింది. కోలుకునేందుకు పెద్దగా సమయం పట్టదు. ఐదు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొని ఫిట్నెస్ సంతరించుకుంటాను’ అని అన్నాడు. న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సిరీస్‌కల్లా అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. -
ఆ టేస్ట్ షమీకి లేదు: సాహా
న్యూఢిల్లీ : భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టెస్టు ఫార్మాట్లో బెస్ట్ వికెట్‌కీపర్‌గా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల వెనుక వేగంగా కదులుతూ బంతి కోసం అతను చేసే విన్యాసాలు అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా పలుమార్లు డైవ్ చేస్తూ క్యాచ్‌లు అందుకున్న సంగతి ఎవరు మరిచిపోలేరు. అయితే సాహా ఆటలో ఎంత చురుకుదనం ప్రదర్శిస్తాడో మైదానం బయట అంతే చలాకీగా ఉంటాడు. తాజాగా ఈఎస్పీఎన్ నిర్వహించిన ఇంటర్యూలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో సంగీతం మీద అవగాహన లేకుండా ఎవరైనా ఉన్నారా అని సాహాను అడగగా.. అతను తడుముకోకుండా మహ్మద్ షమీ పేరు వెల్లడించాడు. ప్రస్తుత టీమిండియా జట్టులో అందరికి సంగీతం మీద అంతో ఇంతో ఇష్టం ఉంది. కానీ షమీకి మాత్రం సంగీతం మీద ఏ మాత్రం అవగాహన లేదన్నాడు. అయితే మైదానంలో మాత్రం షమీ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెడుతూ వికెట్లను కొల్లగొడుతాడని తెలిపాడు. ఈ సందర్భంగా రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తాను, పుజారా కలిసి ఆస్ట్రేలియన్స్పై స్లెడ్జింగ్‌కు దిగామని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్నే తాము కాపీ కొట్టామని సాహా పేర్కొన్నాడు. కోల్‌కతాలో బంగ్లాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఉమేశ్ యాదవ్ వేసిన ఓవర్లో ఓపెనర్ షాదమన్ ఇస్లామ్ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా సాహా టెస్టుల్లో భారత్ తరపున 100 డిస్మిల్స్ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా ప్రదర్శనకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లి 'ప్రస్తుత ఉపఖండపు పరిస్థితుల్లో సాహా ఒక ఉత్తమ వికెట్ కీపర్' అంటూ అప్పట్లో ప్రశంసలతో ముంచెత్తాడు. -
బంగ్లాతో టెస్టు: వృద్ధిమాన్ సాహా ‘సెంచరీ’
కోల్‌కతా: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అరుదైన క్లబ్లో చేరిపోయాడు. తన టెస్టు కెరీర్లో 100 ఔట్లలో భాగస్వామ్యమై ఆ ఫీట్ సాధించిన ఐదో భారత వికెట్ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆ జట్టు ఓపెనర్ షాదమన్ ఇస్లామ్(29) ఇచ్చిన క్యాచ్‌ను పట్టడం ద్వారా సెంచరీ డిస్మిల్స్ మార్కును చేరాడు. ఇందులో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్ రెండో బంతిని షాద్మన్ ఆడబోగా అది ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనక్కు వెళ్లింది. అది ఫస్ట్ స్లిప్‌కు వెళుతుండగా సాహా అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకుని మరోసారి కీపర్ విలువను చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 99 డిస్మిల్స్ తో ఉన్న సాహా.. షాద్మన్ క్యాచ్‌ను అందుకోవడం సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత ఇషాంత్ వేసిన 20 ఓవర్ నాల్గో బంతికి మహ్మదుల్లా క్యాచ్‌ను కూడా సాహానే అందుకున్నాడు.(ఇక్కడ చదవండి:కోహ్లినే బిత్తర పోయేలా..) భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన జాబితాలో ఎంఎస్ ధోని(294) అగ్రస్థానంలో ఉండగా, కిర్మాణీ(198) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కిరణ్ మోరే(130) ఉండగా, నాల్గో స్థానంలో నయాన్ మోంగియా(107) ఉన్నాడు. ఆ తర్వాత స్థానాన్ని సాహా ఆక్రమించాడు. -
మనోడికి ఏ బంతైనా ఒక్కటే: సాహా
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు తొలిసారి పింక్ బాల్ టెస్టుకు సిద్ధమైంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్లో ఆరంభం కానున్న డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా తలపడనుంది. అయితే పింక్ బాల్‌తో డే అండ్ నైట్ టెస్టుల అనుభవం లేని భారత జట్టు ఎంతవరకూ ఆకట్టుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంంగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్ 130 తేడాతో గెలిచిన టీమిండియా.. పింక్ బాల్ టెస్టు ఎంత వరకూ రాణిస్తుందో అనే దానిపై ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్ర బాల్‌తో మెరిసిన భారత బౌలర్లు.. పింక్ బాల్‌పై పట్టు ఎంతవరకూ సాధిస్తారో అనేది చూడాలి.(ఇక్కడ చదవండి: రెడ్–పింక్ క్రికెట్ బాల్స్ మధ్య తేడా ఏమిటి!?) అయితే తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేసి భారత జట్టులో కీలక పేస్ బౌలర్‌గా మారిపోయిన మహ్మద్ షమీకి ఏ బంతైనా ఒక్కటే అంటున్నాడు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. ‘ షమీకి అది రెడ్ బంతా.. పింక్ బంతా అనేది ముఖ్యం కాదు. ఏ బంతితోనైనా చెలరేగిపోతాడు. మనోడికి పింక్ బాల్ అనేది సమస్య కాదు. ఎక్స్ట్రా రివర్స్ స్వింగ్‌తో ఫలితాన్ని రాబట్టడంలో షమీ దిట్ట. ఏ బంతితోనైనా షమీ దడపుట్టిస్తాడు. అలానే ఇషాంత్, ఉమేశ్‌లు కూడా పింక్ బంతితో రాణించడం ఖాయం. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా పేసర్లకు బంతి కలర్ అనేది ప్రాబ్లమే కాదు. ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే భారత పేసర్లను నిలువరించడం బంగ్లాదేశ్‌కు కష్టం’ అని సాహా పేర్కొన్నాడు. -
‘వీలైతే ధోని రికార్డు.. లేకుంటే కార్తీక్ సరసన’
ఇండోర్: టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని రికార్డుపై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో సాహాను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక ఔట్లు చేసిన కీపర్‌గా ధోనీ(15) రికార్డు సాధించాడు. అందులో 12 క్యాచ్‌లు, మూడు స్టంపౌట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 12 ఔట్లతో దినేశ్ కార్తీక్ నిలిచాడు. ఇందులో 11 క్యాచ్‌లు 1 స్టంపౌట్ ఉన్నాయి. సాహా ఇప్పటివరకూ బంగ్లాతో ఆడిన రెండు టెస్టుల్లో ఏడు ఔట్లు చేశాడు. అయితే ఈ రెండు టెస్ట్‌లలో అతను మరో ఎనిమిది ఔట్లను తన ఖాతాలో వేసుకుంటే ధోనీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. లేకుంటే కనీసం ఐదు వికెట్లను సాధించిన కార్తీక్ సరసన నిలుస్తాడు. కాగా, గురువారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాను రఫ్పాడించిన టీమిండియా.. అదేపనిలో బంగ్లాదేశ్ పని పట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసి చాంపియన్ షిప్లో ఎవరికీ అందని ఎత్తులో నిల్చోవాలని కోహ్లి సేన భావిస్తోంది. కాగా, 2000లో టెస్టు హోదా పొంది భారత్‌తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడిన బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్‌పై మాత్రం గెలవలేకపోయింది. గత 19 ఏళ్లలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్ నెగ్గగా... రెండు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. నిషేధం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్... వ్యక్తిగత కారణాలతో తమీమ్... గాయం కారణంగా మష్రఫె ముర్తజాలాంటి మేటి ఆటగాళ్ల సేవలు బంగ్లాదేశ్ కోల్పోయిన నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. -
రిషభ్ మా భవిష్యత్తు...మరి సాహా!
న్యూఢిల్లీ: భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుత కెరీర్ డైలమాలో పడింది. ఇటీవల కాలంలో పంత్ నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్ కావడం టీమిండియా మేనేజ్మెంట్కు విసుగు తెప్పించడంతో పంత్‌ను పక్కన పెట్టేశారు. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్ పంత్ అని భావించినా అందుకు ఇప్పట్లో సమాధానం దొరికేలా కనబడటం లేదు. సఫారీలతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పంత్‌ను ఆడించి చూద్దామని సెలక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లి, రవిశాస్త్రిలు వద్దని చెప్పటం ఒకటైతే, ఇక్కడ మరొక వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వైపు మొగ్గుచూపారు. ఆ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆడిన సాహా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ పంత్‌కు అండగా నిలిచిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలు సైతం అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంత్ కెరీర్ ఏమిటనేది అతని అభిమానులకు మింగుడు పడటం లేదు. కాకపోతే రిషభ్ పంత్ తన భవిష్యత్తు అంటున్నాడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. ఇక్కడ అతనితో ఎవరికీ పోలిక తేలేమని సృష్టం చేశాడు. ప్రధానంగా సాహా-పంత్‌లను పోల్చవద్దని పేర్కొన్నాడు. ఈ ఇదరికీ పోలిక తేవడం ఎంతమాత్రం సరైనది కాదని అన్నాడు. ‘ రిషభ్ మా భవిష్యత్తు క్రికెటర్. మరి సాహా మా ప్రస్తుత క్రికెటర్. ఇద్దరూ అసాధారణ వికెట్ కీపర్లే. వారి వారి నైపుణ్యంతో జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. అటువంటప్పుడు ఇద్దరికీ పోలిక తేవడం మంచిది కాదు. విదేశీ పిచ్‌ల స్వభావాన్ని పంత్ తొందరగా అర్ధం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనే ఇందుకు ఉదాహరణ. భారత్-ఏ తరఫున విదేశీ పిచ్‌ల్లో ఆడిన అనుభవం పంత్‌కు ఉండటంతో అది అతనికి కలిసొచ్చింది. ఇక మేము భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు సాహా వైపు చూస్తున్నాం. అతను మా అత్యుత్తమ వికెట్ కీపర్. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతని ప్రతిభ అంతా చూశాం. కాకపోతే వయసు రీత్యా పంత్ మా జట్టు భవిష్య ఆశా కిరణం అనుకుంటున్నాం’ అని శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. -
వికెట్ల వెనుక మా సూపర్‌మ్యాన్ నువ్వే..!
న్యూఢిల్లీ: తన 35వ పుట్టినరోజుని జరుపుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసిన సాహా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రధానంగా వికెట్ల వెనుక తనదైన ముద్రను కనబరిచి శభాష్ అనిపించాడు. ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లతో తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న సాహా.. ఈరోజు(అక్టోబర్ 24)తో 35 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాడు. దీనిలో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)..సాహాకు విషెష్ తెలియజేసింది. ‘ వృద్ధిపాప్స్.. కీప్ స్టెచింగ్.. కీప్ క్యాచింగ్’ అంటూ అభినందనలు తెలిపింది. ఇక బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారీ ప్రత్యేక అభినందలు తెలిపాడు. ‘ సాహాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వికెట్ల వెనుక మా సూపర్‌మ్యాన్ నువ్వు. నీ పనిని సమర్ధవంతంగా ఇలానే నిర్వర్తించు. రాబోవు సంవత్సరం మరింత ఆనందమయం కావాలి.. అదే సమయంలో సక్సెస్‌తో హ్యాపీగా ఉండాలి’ అని తివారీ ట్వీట్ చేశాడు. ‘ హ్యాపీ బర్త్‌డే సాహా. చాలా వికెట్లను క్యాచ్‌ల రూపంలో అందుకుంటున్న నీకు మరింత సంతోషం, అదృష్టం కలిసి రావాలి. హేవ్ ఏ గ్రేట్ డే’ అని మయాంక్ అగర్వాల్ తన ట్వీట్లో విషెష్ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా సాహా పునరాగమం చేసిన సంగతి తెలిసిందే. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ నిరాశ పరుస్తూ ఉండటంతో సాహాను జట్టులోకి తీసుకున్నారు. తనపై కెప్టెన్ విరాట్ కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మరొకసారి అత్యుత్తమ వికెట్ కీపర్‌గా నిరూపించుకున్నాడు. వికెట్ల వెనుక ఎంతో చురుకుదనంతో కదులుతూ అసాధారణ క్యాచ్‌లతో అలరించాడు. దక్షిణాఫ్రికాను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంలో కీపర్‌గా సాహా ప్రత్యేక ముద్ర కనబరిచాడు. -
సాహా ఔట్.. రిషభ్ ఇన్
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా వేలికి గాయమైంది. దాంతో బాధపడ్డ సాహాకు ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆ బంతి సాహా వేలి పైభాగాన తగలడంతో నొప్పి ఎక్కువైంది. దాంతో ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే స్టాండ్ బై కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్‌ను రమ్మంటూ కోహ్లి పిలిచాడు. ఉన్నపళంగా పంత్ గ్లౌవ్స్ ధరించి ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న కీపర్‌కు సమస్య తలెత్తితే స్టాండ్ బైగా ఉన్న కీపర్ కీపింగ్ చేయవచ్చు. దాంతో సాహా స్థానంలో పంత్ కీపర్‌గా వచ్చాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ జట్టులో సాహాతోపాటు పంత్ కూడా ప్రాబబుల్స్‌లో ఉన్నాడు. కాకపోతే ఇటీవల రిషభ్ పంత్ పేలవమైన ఆట కారణంగా సాహాను తొలి టెస్టు నుంచి కొనసాగిస్తూ వచ్చారు. తనకు వచ్చిన అవకాశాన్ని సాహా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో గాయపడటం ఆందోళన కల్గించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సాహా మైదానాన్ని వీడటం.. పంత్ రావడం జరిగాయి. ఈ మ్యాచ్‌తో సిరీస్ ముగుస్తున్న తరుణంలో పంత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఒకవేళ భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడి అప్పుడు కూడా సాహా రాకపోతే ఆ స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా పంత్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిస్థితిని చూస్తుంటే మరోసారి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అలా జరిగితే పంత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ఆడుతూ 67 పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ ఆరు వికెట్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఇంకా దక్షిణాఫ్రికా 270 పరుగుల వెనుబడి ఉంది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ముందు ఈ పరుగులు సాధించాలి. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉండటంతో టీమిండియా భారీ విజయం ఖాయంగా కనబడుతోంది. -
సాహా మళ్లీ మెరిపించాడు..
-
సాహా మళ్లీ మెరిపించాడు..
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో తన మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా తన వికెట్ కీపింగ్‌తో మెరిపించాడు. భారత్ తన ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్డ్ చేసిన తర్వాత ఇన్నింగ్స్‌కు దిగిన సఫారీలకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్, డీకాక్‌లు విఫలమయ్యారు. తొలి వికెట్‌గా ఎల్గర్ డకౌట్‌గా నిష్క్రమించితే, రెండో వికెట్‌గా డీకాక్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భాగంగా మహ్మద్ షమీ వేసిన రెండో బంతి బౌన్స్ అవుతూ ఎల్గర్పైకి దూసుకొచ్చింది. దాన్ని ఆడటానికి తడబడంతో అది కాస్త ఎల్గర్ గ్లౌవ్‌ను ముద్దాడుతూ సాహా చేతుల్లోకి వెళ్లింది. ఎత్తులో వచ్చిన బంతిని సాహా అద్భుతమైన రీతిలో అందుకోవడంతో ఎల్గర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై డీకాక్‌ను ఉమేశ్ దాదాపు అదే బంతితో పెవిలియన్‌కు పంపించాడు. రెండో ఓవర్ చివరి బంతిని ఉమేశ్ లెగ్‌స్టంప్‌పై బౌన్స్ చేయగా డీకాక్ ఇబ్బంది పడ్డాడు. అది కూడా గ్లౌవ్‌ను తాకుతూ వెళుతున్న క్రమంలో అమాంతం ఎగిరిన సాహా దాన్ని క్యాచ్‌గా పట్టుకున్నాడు. దాంతో సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. అయితే సఫారీలు మరో పరుగు జోడించిన తర్వాత వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం సఫారీలు 488 పరుగులు వెనుకబడ్డారు. -
సాహాకు తిరుగులేదు.. పంత్‌కు చోటులేదు!
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టులో పునరాగమనం చేసిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని సాహా.. కీపర్‌గా మాత్రం అదుర్స్ అనిపించాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా కదులుతూ అద్భుతమైన క్యాచ్‌లతో అలరించాడు. ప్రధానంగా రెండో టెస్టులో డిబ్రుయిన్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇచ్చిన క్యాచ్‌లను కళ్లు చెదిరే రీతిలో అందుకున్న సాహా.. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను అత్యంత సమన్వయంతో పట్టుకున్నాడు. బంతి రెండుసార్లు చేతుల్లోంచి జారిపోయినా నియంత్రణ కోల్పోకుండా బంతిని వేటాడి మరీ డుప్లెసిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీనిపై డుప్లెసిస్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం మినహా చేసేదేమీ లేకపోయింది. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం టెస్టు క్రికెట్లో సాహానే బెస్ట్ వికెట్ కీపర్ అని గణాంకాలు చెప్తున్నాయి. 2017 నుంచి ఈరోజు వరకూ పేస్ బౌలింగ్‌లో సాహా వికెట్ల వెనుక గోడలా ఉన్నాడని తాజా గణాంకాలే చెబుతున్నాయి. బంతుల్ని కచ్చితమైన దృష్టితో ఆపడమే కాకుండా క్యాచ్‌లను అందుకోవడంలో కూడా సాహా టాప్‌లో నిలిచాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్సైట్ ఇచ్చిన నివేదిక ప్రకారం సాహానే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ రెండేళ్లలో కనీసం 10 క్యాచ్‌లు పట్టిన కీపర్ల జాబితాని పరిశీలిస్తే.. సాహా 96.9 శాతం క్యాచ్‌ల్ని అందుకుని అగ్రస్థానంలో నిలవగా.. శ్రీలంక కీపర్ డిక్వెల్లా 95.5 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మాత్రం టాప్-5లో చోటు దక్కలేదు. పంత్ 91.6 శాతంతో 9వ స్థానానికి పరిమితమయ్యాడు. గత ఏడాది జనవరిలో గాయం కారణంగా భారత్ జట్టుకి సాహా దూరమవగా అతని స్థానంలో పంత్ అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీలతో అదరగొట్టాడు. అటు తర్వాత పంత్ వెనుకబడ్డాడు. అటు బ్యాటింగ్‌లోనూ కీపింగ్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించకపోగా పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో సఫారీలతో సిరీస్‌కు పంత్‌ను తప్పించి సాహాకు అవకాశం కల్పించారు. తనకు వచ్చిన అవకాశాన్ని సాహా తన సమర్థతతో వినియోగించుకోవడంతో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. -
సాహా ‘కసి’ తీరా..!
సాహాలో కసి కనిపిస్తుంది. ఆట ద్వారా తనను తాను నిరూపించుకోవాలనే కసి కనిపిస్తుంది. తనను చాలాకాలం పక్కన పెట్టిన కసి కనిపిస్తుంది. తానొక అత్యుత్తమ వికెట్ కీపర్ అని మరోసారి చాటుకోవాలని కసి కనిపిస్తుంది. జట్టుకు కీపింగ్ అనేది ఎంత కీలకమో తెలియజేయాలనే కసి కనిపిస్తోంది. తనను మళ్లీ తీసేస్తే టీమిండియా ఆలోచించాలనే కసి కనిపిస్తోంది. అందుకే సాహా చెలరేగిపోతున్నాడు. ప్రధానంగా తన కీపింగ్‌పై అపారనమ్మకమున్న సాహా తనకు వచ్చిన అవకాశాల్ని ఏమాత్రం వదులుకోవడం లేదు. పుణే: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లను వృద్ధిమాన్ సాహా పట్టగా, అందులో డిబ్రుయిన్ క్యాచ్ అద్భుతమైనది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతిని సాహా డైవ్ కొట్టి అందుకున్నాడు. అదే సీన్‌ను మళ్లీ రిపీట్ చేశాడు సాహా. అదే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో డిబ్రుయిన్ లెగ్‌సైడ్‌కు ఆడిన బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోగా అమాంతం గాల్లోకి ఎగిరి మరీ పట్టేసుకున్నాడు. దాంతో సఫారీలు 21 పరుగుల వద్దే రెండో వికెట్ కోల్పోయారు. కష్ట సాధ్యమైన క్యాచ్‌ను తనకే సాధ్యమైనట్లు సాహా అందుకోవడం ఈ రోజు ఆటలో ఒక హైలైట్. అయితే ఇది జరిగిన కాసేపట్లోనే సాహా మరో అద్భుతం చేశాడు. డుప్లెసిస్‌ను వదల్లేదు.. ఫాలోఆన్ ఆడుతున్న సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా అశ్విన్ వేసిన 24 ఓవర్ మూడో బంతి డుప్లెసిస్ బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయినంత పని అయ్యింది. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా వదల్లేదు. తనను బ్యాలెన్స్ చేసుకుంటూనే బంతిని గాల్లో ఉండగానే పట్టేసుకున్నాడు. సాహా ఇలా క్యాచ్ పట్టాడో లేదో.. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ సాహా అత్యుత్తమ వికెట్ కీపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక తనను తప్పించాలంటే ఆలోచించాలనే సంకేతాలు పంపాడు. ‘ వచ్చే నెలకు 35వ ఒడిలో అడుగుపెట్టనున్న సాహా.. తన సామర్థ్యం ఏమిటో జట్టు మేనేజ్మెంట్కు తెలిసేలా చేశాడు’ అంటూ కొనియాడుతున్నారు. నాల్గో రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఈ నాలుగు వికెట్లలో అశ్విన్ రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు. ఫాలోఆన్ ఆడుతున్న దక్షిణాఫ్రికా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను అందుకోవాలంటే ఇంకా 252 పరుగుల వెనుకబడి ఉంది. దాంతో భారత్‌కు ఇన్నింగ్స్ విజయం ఖాయంగా కనబడుతోంది. -
రెండో టెస్టు: సాహో సాహా!
పుణే: దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో చాలాకాలం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండో టెస్టుఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ఆడుతున్న క్రమంలో సాహా మరో అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన డిబుయ్రిన్ ఓ బంతిని లెగ్‌సైడ్‌కు ఆడబోగా అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వెళుతున్న క్యాచ్‌ను సాహా అద్భుతమైన డైవ్ కొట్టి మరీ పట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆరో ఓవర్ నాల్గో బంతిని డిబ్రుయిన్(8) ఆడబోగా అది కాస్తా బ్యాట్ అంచుకు తగిలి వికెట్ల వెనుక నుంచి దూరంగా వెళుతుండగా సాహా తనదైన మార్కుతో అందుకున్నాడు. డైవ్‌లు కొట్టి క్యాచ్‌లు అందుకోవడంలో సాహాకు తిరుగులేదు. గతంలో కూడా చాలా సందర్బాల్లో సాహా అసాధారణ క్యాచ్‌లతో మైమరిపించాడు కూడా. ఈ టెస్టు సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటలో కూడా డిబ్రుయిన్ క్యాచ్‌ను సాహానే అందుకున్నాడు. అది కూడా డైవ్ కొట్టి పట్టుకున్నాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో డిబ్రుయిన్ మళ్లీ సాహా వలలో చిక్కాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డిబ్రుయిన్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సాహా అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతోనే వెనుదిరిగాడు. దాంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు ఓపెనర్ మార్కరమ్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ నుంచి తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన మార్కరమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్‌కు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. ఈరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సఫారీల చేత ఫాలోఆన్ ఆడించడానికి మొగ్గుచూపాడు. -
పంత్‌ను పక్కన పెట్టేశారు..
న్యూఢిల్లీ: అనుకున్నదే అయ్యింది. గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఉద్వాసన పలికారు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న తొలి టెస్టుకు పంత్‌ను తప్పిస్తారని గత వారామే సూచన ప్రాయంగా తెలిసినప్పటికీ ఇప్పుడ అధికారంగా అతన్ని పక్కన పెట్టేశారు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టుకు పంత్‌ను తప్పించిన విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేసినట్లు ఐసీసీ ఒక ట్వీట్ ద్వారా పేర్కొంది. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసినట్లు తెలిపింది. బుధవారం విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్ పంత్ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో సంజూ శాంసన్ నుంచి పోటీ ఉండగా, టెస్టు ఫార్మాట్లో సాహా నుంచి పంత్‌కు సవాల్ ఎదురవుతోంది. పంత్ ఒక వరల్డ్‌క్లాస్ ఆటగాడని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ అతని ఆటపై ఎక్కడో కాస్త అనుమానం ఉండటంతో రిస్క్ చేయదల్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందుకు కోహ్లి నుంచి రవిశాస్త్రి మద్దతు ఉండటంతో పంత్‌ను తప్పించారు. బ్యాటింగ్, కీపింగ్‌ల్లో పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఒకటైతే, కీపర్ స్థానంలో ఉన్న ఆటగాడు డీఆర్ఎస్ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్ విఫలమవుతూ వస్తున్నాడు. ప్రత్యేకంగా భారత్ వంటి బంతి టర్న్ అయ్యే పిచ్‌ల్లో డీఆర్ఎస్ను నిర్దారించడంలో పంత్ ఇబ్బంది పడుతున్నాడు. మరొకవైపు వికెట్ల వెనుక పంత్ కంటే సాహానే అత్యుత్తమం అని కోహ్లి, శాస్త్రిలు భావిస్తున్నారు. దాంతో పంత్ స్థానంలో సాహాను సఫారీలతో తొలి టెస్టు ఆడించడానికి రంగం సిద్ధం చేశారు. టెస్టు జట్టులో పంత్ ఉన్నప్పటికీ అతని స్థానంలో సాహా పేరును ఖారరు చేశారు. దాంతో సాహా తుది జట్టులో ఆడటం ఖాయం. మరి తొలి టెస్టులో సాహా రాణిస్తే పంత్ అవసరం ఈ సిరీస్‌లో ఉండకపోవచ్చు. Virat Kohli confirms that Rishabh Pant has been left out of India's first Test against South Africa. Wriddhiman Saha will keep wickets instead. India fans, what do you make of the selection?#INDvSA pic.twitter.com/LnNIOIpmuL — ICC (@ICC) October 1, 2019 -
రిషభ్ పంత్‌కు ఉద్వాసన?
న్యూఢిల్లీ: భారత క్రికెట్లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ భవితవ్యం డైలమాలో పడినట్లే కనబడుతోంది. ఇటీవల కాలంలో పంత్ నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్ కావడం టీమిండియా మేనేజ్మెంట్కు సవాల్‌గా మారింది. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్ పంత్ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. మళ్లీ దేశవాళీ టోర్నీలో పంత్ తానేంటో నిరూపించుకునే వరకూ అతనికి అవకాశాలు ఇవ్వకూడదనే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకూ చూస్తే పంత్ ఆడిన ఏ ఒక్క ఇన్నింగ్స్ కూడా భారత్ మేనేజ్మెంట్కు సంతృప్తి నివ్వలేదు. అయినా పంత్‌లో సత్తాను దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో అవకాశం కల్పించారు. అక్కడ కూడా పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు మళ్లీ నిర్లక్ష్యమే కనిపించింది. ప్రత్యర్థి బౌలర్లు ఊరిస్తూ వేస్తున్న బంతులకు పంత్ భారీ షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకుంటున్నాడు.దాంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు పంత్‌ను పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటివరకూ పంత్‌కు అండగా నిలిచిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలు సైతం అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సఫారీలతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పంత్‌ను ఆడించి చూద్దామని సెలక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లి, రవిశాస్త్రిలు వద్దనే చెప్పారట. పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పంత్ స్థానాన్ని సాహాతో భర్తీ చేయడానికి ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. పంత్ ఒక వరల్డ్‌క్లాస్ ఆటగాడని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ అతని ఆటపై ఎక్కడో కాస్త అనుమానం ఉండటంతో రిస్క్ చేయదల్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందుకు కోహ్లి నుంచి రవిశాస్త్రి మద్దతు ఉండటంతో పంత్‌కు ఉద్వాసన చెప్పినట్లేనని కథనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్, కీపింగ్‌ల్లో పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఒకటైతే, వికెట్ల వెనుక కీపర్ స్థానంలో డీఆర్ఎస్ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్ విఫలమవుతూ వస్తున్నాడు. ప్రత్యేకంగా భారత్ వంటి బంతి టర్న్ అయ్యే పిచ్‌ల్లో డీఆర్ఎస్ను నిర్దారించడంలో పంత్ ఇబ్బంది పడుతున్నాడు. మరొకవైపు వికెట్ల వెనుక పంత్ కంటే సాహానే అత్యుత్తమం అని కోహ్లి, శాస్త్రిలు భావిస్తున్నారు. దాంతో పంత్ స్థానంలో సాహాను సఫారీలతో తొలి టెస్టు నుంచే ఆడించాలని చూస్తున్నారు. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సాహాను ఆడించి అక్కడ మరోసారి తనను తాను నిరూపించుకుంటే మాత్రం పంత్ కెరీర్ సందిగ్థంలో పడటం ఖాయం. -
‘పంత్ ఎట్టిపరిస్థితుల్లోనూ బెస్ట్ చాయిస్ కాదు’
కోల్‌కతా: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఇచ్చిన అవకాశాలు చాలు అనేది ఒకవైపు విమర్శ అయితే, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనేది మరొకవైపు వాదన. పంత్‌ను పక్కన పెట్టమంటూ కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సూచించగా, అతనిలో టాలెంట్ ఉంది.. కాస్త ఓపిక పట్టండి అని మరో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారు సరే కానీ టెస్టుల్లో కూడా అతను ఎందుకంటూ బెంగాల్ మాజీ కెప్టెన్ దీప్‌దాస్ గుప్తా ప్రశ్నించాడు. ‘ఇప్పటివరకూ పంత్ ఆటను పరిశీలిస్తే టెస్టుల్లో అతను ఎంతమాత్రం బెస్ట్ చాయిస్ కాదు. టెస్టు క్రికెట్ అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. తన గత చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో పంత్ అయోమయానికి గురైనట్లే కనబడింది. పంత్ టెస్టు ఆటగాడు కాదు. వృద్ధిమాన్ సాహాను టెస్టులకు ఎంపిక చేయాల్సింది. టెస్టుల్లో రిషభ్ కంటే సాహానే అత్యుత్తమం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత వరల్డ్‌లో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. కాకపోతే అతను మంచి బ్యాట్స్‌మన్ కాదా.. అనేది ఇంకా టీమిండియా మేనేజ్మెంట్ సందేహం. ప్రధానంగా భారత జట్టు ఐదుగురి బౌలర్లతో మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో సాహా బ్యాటింగ్ సందేహాలు ఏర్పడుతున్నాయి. అతను ప్రతీసారి పరుగులు చేస్తూనే ఉన్నాడు. భారత్-ఏ తరఫున నిలకడగా పరుగులు చేసి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు’ అని దీప్‌దాప్ గుప్తా పేర్కొన్నాడు.గత నెల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి టెస్టు ఆడిన పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్‌లో తడబాటుకు గురైన పంత్ బౌల్డ్‌గా నిష్క్రమించాడు. -
‘గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ కీపర్ కాలేరు’
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో వరుసగా విఫలమవుతున్న భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఒకే తరహా షాట్లు ఆడి వికెట్‌ను సమర్పించుకుంటున్న పంత్‌ను ఇప్పటికే పలువురు విమర్శించగా, తాజాగా భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా పంత్‌ను సుతిమెత్తగా మందలించాడు. గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్ కీపర్ కాలేరంటూ పరోక్షంగా చమత్కరించాడు. అదే సమయంలో వృద్ధిమాన్ సాహాను వెనుకేసుకొచ్చాడు కిర్మాణీ. ఇటీవల కాలంలో పంత్‌కు పదే పదే అవకాశాలిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్.. సాహాను అస్సలు పట్టించుకోకపోవడం నిరాశ కల్గిస్తుందన్నాడు. ఒకవైపు పంత్‌ను పరీక్షిస్తూనే మరొకవైపు సాహాకు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. పంత్‌తో సమానమైన అవకాశాలను సాహాకు కూడా ఇవ్వాలన్నాడు. ‘ పంత్ టాలెంట్ ఉన్న క్రికెటరే. కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. అతనికి నేర్చుకుంటూ ఎదగడానికి సమయం చాలా ఉంది. అటువంటి సందర్భంలో సాహాను నిర్లక్ష్యం చేయడం తగదు. విండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో సాహాకు అవకాశం ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసింది. సాహా మంచి వికెట్ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి. ఒక జత కీపింగ్ గ్లోవ్స్ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్ కీపర్ కాలేరు కదా’ అంటూ కిర్మాణీ చురకలంటించాడు. కనీసం రెండో టెస్టులోనైనా సాహాకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా.. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి టెస్టులోనే సాహాకు అవకాశం దక్కుతుందని ఆశించారు. కాకపోతే విండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో విఫలమైన పంత్‌నే తొలి టెస్టులో ఆడించడం విమర్శలకు దారి తీసింది. ఇక్కడ కూడా పంత్ నిరాశ పరచడం విమర్శకుల నోటికి మరింత పని చెప్పింది. -
పంత్ ఒడిసిపట్టుకున్నాడు: సాహా
న్యూఢిల్లీ: మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన సాహా, తనకు రిషభ్ పంత్‌తో ఎటువంటి పోటీ లేదని అంటున్నాడు. ‘గాయం తర్వాత ఆటగాళ్లతో కలవడం గొప్పగా అనిపిస్తోంది. ఒక ఆటగాడిగా తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం కన్నా ఆనందం ఏముంటుంది. చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్నట్టు నేను భావించలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌కు సాయం చేయడంపైనే దృష్టి పెడుతున్నా. నేను జట్టుకు దూరమైనప్పుడు రిషబ్ పంత్ అవకాశం అందుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని ఎవరైనా అందిపుచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు. రిషబ్ పంత్ కూడా అలాగే చేశాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అతడిని నాకు పోటీదారుగా భావించను. నిజానికి పంత్ ఎన్సీఏకు వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి చాలా సమయం గడిపాం’ అని సాహా తెలిపాడు. గతేడాది ఐపీఎల్లో గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్ సాహా .. ఇంగ్లండ్‌లో మోచేతికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టు తరుపున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. -
‘గత 10 ఏళ్లలో సాహానే బెస్ట్ కీపర్’
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా టీమిండియాలో ప్రస్తుతం చోటు దక్కని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా భారత అత్యుత్తమ వికెట్ కీపర్ అని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గత 10 ఏళ్లలో భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ల పరంగా చూస్తే సాహానే బెస్ట్ అంటూ గంగూలీ కితాబిచ్చాడు. ఎంఎస్ ధోని టెస్టులకు గుడ్ బై చెప్పిన తర్వాత సాహా టెస్టు ఫార్మాట్లో రెగ్యులర్ కీపర్‌గా మారిపోయాడు. ధోని స్థాయిలో కీపింగ్ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం భుజం నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న సాహా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ‘దాదాపు ఏడాదిగా సాహా జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ గత పదేళ్లలో భారత జట్టులో ఆడిన వికెట్ కీపర్ల పరంగా చూస్తే అతనే అత్యుత్తమం. గాయాలనేవి ఆటగాడి చేతిలో ఉండవు. వికెట్ కీపర్ అన్నాక దూకాల్సిందే. అలా దూకేటపుడే సాహా గాయపడ్డాడు. కోలుకోవడానికి సమయం పడుతుంది. అతను త్వరగా మామూలు స్థితికి చేరుకుని పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నా' అని గంగూలీ అన్నాడు. -
అందుకు ఎన్సీఏనే కారణం: యువీ
న్యూఢిల్లీ: టీమిండియా రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చే నెల్లో లండన్‌కు వెళ్లి తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొనున్నాడు. దీనిలో భాగంగా జాతీయ క్రికెట్ అకాడమీలోని ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గాయాలు పాలైన క్రికెటర్లు తిరిగి పునరాగమనం చేయడానికి బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘గాయాలు బారిన పడిన టీమిండియా క్రికెటర్లు కోలుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదం చేస్తాయి. నేను క్యాన్సర్ మహమ్మారి నుంచి తొందరగా కోలుకోవడానికి సదరు అకాడమీలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సదుపాయాలే ముఖ్య కారణం. క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత ఎన్సీఏ పునరావాస కార్యక్రమంలో పాల్గొనడం నాకు లాభించింది. అక్కడ చాలా గొప్ప సదుపాయాల్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దేశంలోనే అత్యంత అనుభవమన్న ఫిజియోలు, ట్రైనర్స్ మన జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నారు’ అని యువీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. -
దినేశ్ కార్తీక్‌కు చాన్స్?
న్యూఢిల్లీ: వచ్చే నెల్లో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐపీఎల్లో గాయపడ్డ సాహా ఇంకా కోలుకోపోవడంతో అతను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. సాహా గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు, ఐదు వారాలు సమయం సరిపోతుందని తొలుత భావించినా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దాంతో సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడేంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్న కార్తీక్‌ను టెస్టు సిరీస్‌కు సైతం ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారంతో వన్డే సిరీస్ ముగియనున్న నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో సాహా స్థానంలో దినేశ్ కార్తీక్ ఆడిన సంగతి తెలిసిందే. దాంతో దినేశ్ కార్తీక్‌ను టీమిండియా టెస్టు జట్టులో యథావిధిగా కొనసాగించాలనేది సెలక్టర్ల యోచన. -
అఫ్గాన్ టెస్ట్‌కు ఇషాంత్ డౌటే.!
హైదరాబాద్ : అఫ్గానిస్తాన్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు టీమిండియాను గాయల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా బొటన వేలి గాయంతో దూరం కాగా అతని స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు. తాజాగా పేసర్ ఇషాంత్ శర్మ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇషాంత్ ఇంగ్లండ్‌లో సస్సెక్స్ జట్టు తరుపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇషాంత్ గాయపడ్డాడని వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతోంది. ఆ ట్వీట్లో ఇషాంత్ గాయపడ్డాడని, అతని స్థానంలో వేరే ఆటగాడిని తీసుకున్నట్లు ఆ జట్టు పేర్కొంది. అయితే అది చిన్న గాయమా, పెద్దదా అని తెలియాల్సి ఉంది. దీంతో అఫ్గాన్‌తో బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే మ్యాచ్‌కు ఇషాంత్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది జరిగితే భారత్‌కు కష్టాలు తప్పవు. మరోవైపు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ఫామ్ భారత్‌ను కలవరపెడుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లతో చెలరేగిన రషీద్ తమ జట్టుకు విజయాన్నందించాడు. ఇషాంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా 6 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో సైతం 8 వికెట్లు పడగొట్టాడు. 🦈 One change for us today here at The Saffrons. @ollierobinson25 returns, replacing the injured @ImIshant. Your Sussex Sharks XI: Wells, Wright, Finch, Brown*+, Evans, Burgess, Wiese, Archer, Jordan, Robinson, Briggs 🎥 A word from the skipper... #gosbts #SharkAttack pic.twitter.com/H56vhlsw8x — Sussex Cricket (@SussexCCC) June 3, 2018 -
సాహా స్థానంలో దినేశ్ కార్తీక్
ముంబై: గాయం కారణంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దూరం కావడంతో... ఈ నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగే చారిత్రాత్మక టెస్టులో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. సాహా స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది. -
సాహా ఔట్.. దినేశ్ ఇన్
ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా స్థానంలో మరో కీపర్ దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది. దీంతో అఫ్గాన్‌తో జరిగే టెస్టుకు తాను సిద్దంగా లేనట్లు సాహా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ట్వీట్ చేసింది. ‘ అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు వృద్దిమాన్ సాహా దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు’ అని ట్వీట్లో పేర్కొంది. UPDATE: Wriddhiman Saha ruled out of the @paytm Afghanistan Test. The All-India Senior Selection Committee has named @DineshKarthik as the replacement. #INDvAFG #TeamIndia Details - https://t.co/drNqHvsFu0 pic.twitter.com/hqquMTpqDP — BCCI (@BCCI) 2 June 2018 బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కోహ్లి గైర్హాజరితో భారత జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు. చదవండి : ఏకైక టెస్టుకు భారత జట్టు ప్రకటన -
‘అతనికి కీపింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా’
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌కు కీపింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు సహచర ఆటగాడు వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించిన తర్వాత మాట్లాడిన సాహా.. ప్రత్యేకంగా రషీద్ ఖాన్ వైవిధ్యమైన బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రషీద్ ఖాన్ వైవిధ్యమైన బౌలర్. అతనికి కీపింగ్ చేయడం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. రషీద్ తరహా బౌలర్‌కు కీపింగ్ చేయడం ఒక మంచి అనుభవం. అతని బౌలింగ్‌లో విపరీతమైన టర్న్‌తో పాటు పేస్ కూడా ఉంటుంది. అటువంటి బౌలర్‌కు కీపింగ్ చేయడం చాలా కష్టం. దాంతో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అత్యంత నమ్మకంతో కీపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో అశ్విన్, జడేజా, మిశ్రా, కుల్దీప్ వంటి స్టార్ స్పిన్నర్లకు కీపింగ్ చేశా. వారి తర్వాత రషీద్‌కు కీపింగ్ చేస్తున్నా.డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్లలో రషీద్ ఒకడు’ అని సాహా పేర్కొన్నాడు.ప్రస్తుతం అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్లో రషీద్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు ఇటీవల వన్డేల్లో వేగవంతంగా వంద వికెట్లను సాధించిన బౌలర్‌గా రషీద్ గుర్తింపు సాధించాడు. -
‘వార్నర్ లేకున్నా ఆ సత్తా ఉంది’
కోల్‌కతా : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైనా తమ జట్టు రాణించగలదని సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. ఇక గత రెండు సీజన్ల నుంచి డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ టైటీల్ను సైతం నెగ్గింది. అయితే తాజా ట్యాంపరింగ్ వివాదంతో ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చర్యల తీసుకున్న తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాహా మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌ను దృష్టిలో పెట్టుకునే జట్టు సన్నాహకాలు ప్రారంభిస్తోంది. కానీ అతనిక్కడ లేడు. ఈ ప్రభావం మాజట్టుపై కొంత ఉంటుంది. అతని స్థానం భర్తీ చేయగల ఆటగాళ్లు కూడా మా జట్టులో ఉన్నారు. ఒక వేళ వార్నర్ ఉంటే అది మాకు అదనపు బలం. అతనో అద్భుత ఆటగాడు. గత సీజన్లలో హైదరాబాద్ సారథిగా మంచి ప్రదర్శన కనబర్చాడు. అయినప్పటికీ అతని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లున్నారు. మా జట్టు రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉంది. ’ అని సాహా తెలిపాడు. ఇక ట్యాంపరింగ్‌పై స్పందిస్తూ.. దేశం తరుఫున, ప్రతి ఒక్క ఆటగాడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏ ఆటలోనైనా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు. అది క్రీడాస్పూర్తికే విరుద్ధం. ఇది అందరి ఆటగాళ్లు వర్తిస్తుంది. వారు క్రీడాస్పూర్తిని మరచి బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించారు. ఇది ముమ్మాటికి తప్పే. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయంలో అందరిని ఒకలే చూడాలి తప్ప ఒక్కో కేసును ఒకలా చూడవద్దు. ’అని సాహా అభిప్రాయపడ్డారు. -
సాహా...వహ్వా!
కోల్‌కతా: భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా స్థానిక లీగ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు జేసీ ముఖర్జీ ట్రోఫీలో భాగంగా టి20 ఇంటర్ క్లబ్ మ్యాచ్‌లో సాహా 20 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మోహన్ బగాన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సాహా... బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ (బీఎన్ఆర్) జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతని 20 బంతుల ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 4 ఫోర్లు, 2 సింగిల్స్ ఉన్నాయి. తాను ఆడిన చివరి ఓవర్లో 6 బంతుల్లో సాహా ఆరు సిక్సర్లు బాదడం విశేషం. ఈ మ్యాచ్‌కు అధికారికంగా గుర్తింపు లేకపోయినా... బెంగాల్ క్రికెట్లో బీఎన్ఆర్ పటిష్టమైన జట్టు కావడం, వేదికైన కాళీఘాట్ మైదానం కూడా పెద్దది కావడాన్ని బట్టి చూస్తే సాహా ఇన్నింగ్స్‌ను ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసిన బీఎన్ఆర్ 151 పరుగులు చేయగా మోహన్ బగాన్ 7 ఓవర్లలోనే 152 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శుభోమయ్ దాస్ 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో 10 వికెట్లతో విజయం సాధించింది. టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న సాహాకు 2014 ఐపీఎల్ ఫైనల్లో మెరుపు సెంచరీ సాధించిన రికార్డు ఉంది. ఈసారి అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. -
సాహా విధ్వంసం.. 20 బంతుల్లో శతకం!
కోల్‌కతా : టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా రెచ్చిపోయాడు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఎమో కానీ మైదానంలో చెలరేగాడు. ఏకంగా 14 సిక్సులు, నాలుగు ఫోర్లతో కేవలం 20 బంతుల్లో శతకం బాదాడు. శనివారం కోల్‌కతాలో జరిగిన జేసీ ముఖర్జీ లోకల్ టీ20 టోర్నీలో సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న 20 బంతుల్లో 18 బంతులను బౌండరీ లైన్ దాటించడం విశేషం. వీటితోనే సాహా 100 పరుగులను పూర్తి చేశాడు. మరో రెండు బంతుల్లో రెండు సింగిల్స్ సాధించాడు. ఈ విజృంభణతో సాహా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ బగాన్ జట్టు బీఎన్ఆర్ రీక్రియేషన్ క్లబ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీఎన్ఆర్ 152 లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన మోహన్ బగాన్ సాహా, కెప్టెన్ సుబ్హోమయ్(43 22 బంతుల్లో)లు దాటిగా ఆడటంతో వికెట్ నష్ట పోకుండా కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం సాహా మాట్లాడుతూ.. ‘ఇది రికార్డో కాదో కూడా నాకు తెలియదు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేకమైన్ షాట్స్ ఆడటానికి ప్రయత్నించా. ప్రతి బంతి నా బ్యాట్ మధ్యలో తగిలిందని భావించి హిట్టింగ్ చేశానని’ తెలిపాడు. ఇక వన్డే, టీ20ల్లో అవకాశంపై స్పందిస్తూ.. అది సెలక్టర్ల నిర్ణయమని, అవకాశం వచ్చేలా ఆడటమే నా బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సాహా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతానన్నా సాహా సన్‌రైజర్స్‌లో ధావన్, వార్నర్‌లు ఉండటంతో ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనన్నాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన రికార్డు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. పుణె వారియర్స్‌పై 30 బంతుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. -
ఎక్కడైనా ఓకే: సాహా
కోల్‌కతా:రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్న వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా తన బ్యాటింగ్ స్థానంపై స్పందించాడు. తన కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కోరితే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ సేవలు అందించేందుకు సిద్దం ఉన్నట్లు తెలిపాడు. కేవలం టాపార్డర్‌లోనే కాకుండా, లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేస్తానని ఈ సందర్భంగా సాహా స్పష్టం చేశాడు. 'నేను ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. జట్టు మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నా. పొట్టి ఫార్మాట్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంటుంది. అందుచేత ఫలానా స్థానంలో బ్యాటింగ్ చేస్తాననడం సరైంది కాదు. నాకు అప్పజెప్పే బాధ్యతల్ని నిర్వర్తించడానికి రెడీగా ఉన్నా. ఆ క్రమంలో ఎక్కడ బ్యాటింగ్ చేయాల్సిన వచ్చినా అది సమస్యగా భావించను' అని సాహా తెలిపాడు. మరొకవైపు ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌పై కూడా సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో కఠినమైన సవాల్ ఉంటుందని పేర్కొన్న సాహా.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఆడితే అది కచ్చితంగా మన జట్టుకు లాభిస్తుందన్నాడు. కాగా, ఇంగ్లండ్‌లో వికెట్ల వెనుక కీపింగ్ చేయడం అంత ఈజీ కాదని సాహా పేర్కొన్నాడు. -
టీమిండియాలో ఛేంజ్.. దినేశ్ కార్తీక్‌కు పిలుపు!
జోహాన్నెస్‌బర్గ్: వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు పిలుపు అందింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వృద్ధిమాన్ సాహా ట్రైనింగ్ సెషన్లో గాయపడటంతో అతని స్థానంలో కార్తీక్‌ను పంపాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో దినేశ్ కార్తీక్ ఫ్లయిట్ ఎక్కి.. మూడో టెస్టులోపు జట్టులో చేరబోతున్నాడు. తొలి టెస్ట్ తర్వాత ప్రాక్టీస్ చేస్తుండగా సాహా మోకాలికి గాయమైంది. దీంతో అతన్ని రెండో టెస్ట్‌కు పక్కనపెట్టి పార్థివ్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడో టెస్ట్‌కు కూడా సాహా దూరం కానున్నాడు. ఈలోగా బీసీసీఐ మెడికల్ టీమ్ సాహా పరిస్థితిని సమీక్షించి.. అతన్ని దక్షిణాఫ్రికా టూర్లో కొనసాగించాలా? వద్ద అన్నది నిర్ణయం తీసుకోనుంది. తొలి టెస్ట్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వికెట్ కీపర్‌గా సాహా రాణించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండోటెస్టు రసకందాయంలో పడింది. సఫారీలు మొదటి ఇన్నింగ్స్‌లో 335పరుగులు చేయగా, భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు రెండు వికెట్లకు 90పరుగులు చేసి.. పట్టుబిగించే దిశగాసాగుతున్నారు. -
ధోని రికార్డును బ్రేక్ చేశాడు..!
కేప్‌టౌన్:భారత క్రికెట్లో ఎంఎస్ ధోని నమోదు చేసిన రికార్డులు ఎన్నో. అయితే గతంలో ధోని సాధించిన ఒక రికార్డును భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తాజాగా బద్ధలు కొట్టాడు. 2014లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ధోని అత్యధికంగా తొమ్మిది క్యాచ్‌లు పట్టి భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే ఆ రికార్డును సాహా తాజాగా బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్‌లో సాహా 10 క్యాచ్‌లతో ధోని రికార్డును సవరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన సాహా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఐదు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లు అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా సాహా రికార్డు సాధించాడు. మరొకవైపు ఓవరాల్‌గా చూస్తే ఒక టెస్టులో 10 క్యాచ్‌లు పట్టిన జాబితాలో సాహా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన బాబ్ టేలర్(1980లో భారత్‌పై), ఆసీస్‌కు చెందిన గిల్‌క్రిస్ట్(2000లో న్యూజిలాండ్)పై 10 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లు. ఇప్పుడు వీరి సరసన సాహా నిలిచాడు. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ 11 క్యాచ్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో జోహెనెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఏబీ ఈ ఘనత సాధించాడు. -
వారిద్దరూ కాదు.. అశ్వినే: సాహా
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో ఉన్న స్పిన్నర్ల విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో కీపింగ్ చేయడం చాలా కష్టమని అంటున్నాడు రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా. అశ్విన్ సంధించే బంతుల్లో చాలా ఎక్కువ వైవిధ్యం ఉన్న కారణంగానే కీపింగ్ చేయడం కష్టతరంగా ఉంటుందన్నాడు. ఇక్కడ మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ల కంటే అశ్విన్ బౌలింగ్ లో కీపింగ్ చేయడం అంత సులువు కాదన్నాడు. 'ప్రస్తుత భారత జట్టు స్సిన్నర్లలో అశ్వినే ముందు వరుసలో ఉన్నాడు. అశ్విన్ బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. అతను అనేక కోణాల్లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. బౌలింగ్ లెంగ్త్ లో ఒక ప్రత్యేకత ఉంది. అదే అశ్విన్ ను ఉన్నతస్థాయిలో నిలిపింది. ఇక్కడ కుల్దీప్, జడేజాల కంటే అశ్విన్ బౌలింగ్ లోనే వైవిధ్యం ఎక్కువని చెప్పాలి. దాంతో అశ్విన్ బౌలింగ్ కు కీపింగ్ చేయడం సవాల్ గా ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల యాక్షన్ ఫోజు అతి పెద్ద ఛాలెంజ్ గా సాహా అభివర్ణించాడు. ఇక్కడ ఆ ఇద్దరి స్వింగ్ బౌలింగ్ కంటే వారి యాక్షనే సవాల్ గా ఉంటుంది'అని సాహా తెలిపాడు. ఒక కీపర్ గా వికెట్ల వెనుక కీపింగ్ చేసేటప్పుడు ఎవరు బౌలింగ్ కఠినంగా అనిపిస్తుంది అనే దానిపై సాహా పైవిధంగా స్పందించాడు. గురువారం నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో వికెట్ కీపర్ గా తన అభిప్రాయాలను సాహా పంచుకున్నాడు. -
ధోని తప్పుకోవాలా?
న్యూఢిల్లీ: ఏ క్రికెటరైనా జాతీయ జట్టులో ఆడాలనుకోవడం సహజం. అందులోనూ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఆడే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. జాతీయ జట్టులో స్థానం ఆశించే క్రమంలో పోటీ ఎక్కువగా ఉంటే టాలెంట్ ఉన్నా కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. భారత క్రికెట్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి పోటీగా వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్టుల నుంచి ధోని తప్పుకున్న క్రమంలో ఆ ఫార్మాట్ లో బాధ్యతల్ని సాహాకు అప్పజెప్పారు. టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ బాధ్యతల్లో సాహా సక్సెస్ అయ్యాడు కూడా. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో సాహాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకు కారణం మహేంద్ర సింగ్ ధోని ఉండటం. 2019 వరల్డ్ కప్ వరకూ ధోని జట్టులో ఉండాటనే సంకేతాల్ని చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే ఇచ్చేశాడు. ఈ తరుణంలో సాహా చేసిన వ్యాఖ్యలు ధోని అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేశాయి. అందుకు కారణం వచ్చే వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకోవడం కోసం తీవ్రంగా యత్నిస్తున్నట్లు సాహా పేర్కొనడమే. ఇది తన భార్య బలంగా కోరుకుంటున్న కోరికగా ఓ కార్యక్రమానికి హాజరైన సాహా తెలిపారు. దీనిపై ధోని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ లో నీవు ఆడతానని చెప్పడం దేనికి సంకేతం. నీ మనసులో ఉన్న ఆంతర్యం ఏమిటి?అని ధోని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 'సాహా.. నీ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టాం. నువ్వు ఆడతానంటే.. ధోని జట్టు నుంచి వెళ్లిపోవాలా? అంటూ ఒకరు నిలదీశారు. ఎంఎస్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా నీకుందా? అని మరొక అభిమాని ప్రశ్నించారు. ఇప్పటివరకూ 9 వన్డేలు ఆడిన నీ సగటు 13.66 మాత్రమే. అత్యుత్తమ స్కోరు 16 పరుగులు. మరి అటువంటప్పుడు మ్యాచ్ ఫినిషర్ అయిన ధోని జట్టు నుంచి వైదొలగాలా?అని మరొక అభిమాని విమర్శించాడు. -
నాకైతే కుంబ్లేతో నో ప్రోబ్లం..!
న్యూఢిల్లీ:గత కొన్ని రోజుల క్రితం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జట్టులోని ఆటగాళ్లతో అంతగా సఖ్యత లేకపోవడంతోనే కుంబ్లే అర్థాంతరంగా తన పదవిని వదలుకున్నాడు. ఇందుకు కారణం తమతో కుంబ్లే అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాడని అత్యధిక శాతం మంది తేల్చిచెప్పడమే. మరి తనకు కుంబ్లేతో ఎటువంటి ప్రోబ్లం లేదని అంటున్నాడు వికెట్ కీపర్ వృద్ధిమాన్. ' కుంబ్లే వ్యవహారంలో సహచరులు గురించి నాకు తెలీదు. నావరకూ అయితే కుంబ్లే ఓకే. నేను ఎప్పుడూ కుంబ్లే కఠినంగా వ్యవహరించిన క్షణాల్ని చూడలేదు. కుంబ్లే కఠినంగా ఉంటున్నాడని కొంతమంది అనుకుని ఉండొచ్చు.. మరికొంతమందికి కుంబ్లేతో ఇబ్బంది ఉండకపోవచ్చు. నేనైతే కుంబ్లే కఠినంగా ఉండటాన్ని చూడలేదు. ఒక కోచ్ గా చేసేటప్పుడు కొన్ని సందర్బాల్లో కఠినంగా ఉండాలి. నేను అనిల్ భాయ్ శిక్షణలో ఇబ్బందిగా ఫీల్ కాలేదు'అని సాహా పేర్కొన్నాడు. కుంబ్లే ఎప్పుడూ 400 నుంచి 500 వరకూ పరుగులు చేయమనేవాడని, అదే సమయంలో అవతలి జట్టును 150 లోపు ఆలౌట్ చేయాలనే వాడని సాహా తెలిపాడు. అయితే అలా చేయడం అన్నిసార్లు సాధ్యం కాదని ఒప్పుకున్న సాహా.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మాత్రం అవతలి జట్టుపై విరుచుకుపడమని మాత్రమే చెబుతాడన్నాడు. ఇదే వారిద్దరిలో ఉన్న వ్యత్యాసమన్నాడు. -
రవిశాస్త్రి సానుకూల స్వభావి..
కొలంబో: భారత్ నూతన కోచ్ రవిశాస్త్రి సానుకూల ధృక్పథం కలిగిన వ్యక్తి అని టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మన బలమే మనకు రక్షా అని ఎల్లప్పుడు చెప్పేవాడని సాహా గుర్తు చేసుకున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా జట్టుతో చేరిన సాహా కోచ్ మార్పుపై మాట్లాడుతూ.. కుంబ్లే, శాస్త్రీ ఇద్దరు జట్టుకు సేవలందించిన వారని తెలిపాడు. రవిశాస్త్రి డైరెక్టర్‌గా భారత్ 2015 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరిందని, శ్రీలంక టెస్టు సిరీస్ గెలిచామని సాహా గుర్తు చేశాడు. కుంబ్లే సారథ్యంలో నమోదు చేసిన విజయాలు తెలిసిందేనని పేర్కొన్నాడు. సూచనలు ఇవ్వడంలో కోచ్‌గా ఎవరి ప్రత్యేకత వారిదేనన్న సాహా.. మైదానంలో రాణించడం ప్లేయర్‌గా మా బాధ్యత అని చెప్పుకొచ్చాడు. కోచ్‌లు మారినంత మాత్రానా ఆటలో పెద్ద తేడా ఏమి ఉండదని సాహా అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్ అనంతరం చాల రోజుల తర్వతా శ్రీలంక టూర్‌కు ఎంపికైన సాహా.. లోకల్ లీగ్‌లు ఆడానని, అవి నాకు చాల ఉపయోగపడ్డాయని తెలిపాడు. శ్రీలంకలో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ విజయాలనే పునరావృతం చేస్తామని సాహా ధీమా వ్యక్తం చేశాడు. ఈ లాంగ్ గ్యాప్ మాపై ప్రభావం చూపదని పేర్కొన్నాడు. తొలిటెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ కీలకమని సాహా పేర్కొన్నాడు. భారత్ శ్రీలంకతో 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. తొలి టెస్టు జులై 26 నుంచి మొదలుకానుంది. -
'కుంబ్లే కోచింగ్ బాగుండేది'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసి, ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లే పర్యవేక్షణకు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మద్దతుగా నిలిచాడు. అత్యధిక మంది భారత క్రికెట్ సభ్యులకు కుంబ్లే కోచింగ్ నచ్చలేదనే వార్తల నేపథ్యంలో సాహా స్పందించాడు. అసలు కుంబ్లే కోచింగ్ తో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. భారత క్రికెటర్ల పట్ల కుంబ్లే 'హెడ్ మాస్టర్' లా ఉంటూ కఠినంగా ప్రవర్తించేవాడనే వార్తలను సాహా ఖండించాడు. 'కుంబ్లే పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన వాతావారణం ఉండేది. నేను చూసినంత వరకూ మేమంతా జోక్‌లు వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. నాతో పాటు ప్రతీ ఒక్కరితోనూ కుంబ్లే సరదాగా ఉండేవాడు. ముఖ్యంగా కుంబ్లే కోచ్ అయిన తరువాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాం. అక్కడ నాకు అతని అనుభవం బాగా ఉపయోగపడింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడమని కుంబ్లే చెప్పేవాడు. దాంతో పాటు చక్కటి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఇది నేను టెస్టులు ఆడేటప్పుడు నాకు తెలిసిన అనిల్ గురించి చెబుతున్న విషయాలు. మరి వన్డేల్లో కుంబ్లే ఎలా ఉండేవాడో నాకైతే తెలియదు. కుంబ్లే పర్యవేక్షణలో ఉన్న సరదా సరదా వాతావరణం కొత్త కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో కూడా ఉంటుందని అనుకుంటున్నా'అని సాహా పేర్కొన్నాడు. -
జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్ క్యాచ్
ఇండోర్: టీమిండియా కీపర్‌గా వృద్ధిమాన్ సాహా అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసి పట్టుకున్నాడు. సాహా గాల్లోకి డైవ్ చేసి అసాధారణ రీతిలో క్యాచ్‌లు పట్టుకుని తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న సందర్భాలున్నాయి. తాజాగా ఐపీఎల్-2017 సీజన్లో సాహా ఇలాంటి అరుదైన ఫీట్‌ను రిపీట్ చేసి దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్‌ను తలపించాడు. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన గతి తెలిసిందే. సాహా కింగ్స్ లెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ వరుణ్ అరోన్ వేసిన షార్ట్ డెలివరీని బెంగళూరు ఆటగాడు మణ్‌దీప్ సింగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన సాహా పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేసి సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ స్టన్ అయ్యారు. సాహా ఫీల్డింగ్‌ను ప్రశంసించారు. మణ్‌దీప్ క్యాచవుట్గా పెవిలియన్ చేరాడు. -
87 కొట్టు... ట్రోఫీ పట్టు...