
సాహా స్థానంలో పార్థివ్
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో పార్థివ్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 ఏళ్ల వయసులో 2002లో తన తొలి టెస్టు ఆడిన పార్థివ్, భారత్ తరఫున ఎనిమిదేళ్ల క్రితం చివరి సారి టెస్టు ఆడాడు. మొత్తం 20 టెస్టుల్లో కలిపి అతను 683 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ ఫామ్‌లో ఉన్న కారణంగానే నమన్ ఓజా, దినేశ్ కార్తీక్‌లను వెనక్కి తోసి పార్థివ్ అవకాశం దక్కించుకున్నాడు.