'నాకు పార్థీవ్తో పోటీ లేదు' | No competition with Parthiv Patel, says Wriddhiman Saha | Sakshi
Sakshi News home page

'నాకు పార్థీవ్తో పోటీ లేదు'

Published Fri, Dec 30 2016 3:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

'నాకు పార్థీవ్తో పోటీ లేదు'

'నాకు పార్థీవ్తో పోటీ లేదు'

కోల్కతా:ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భాగంగా మొహాలి టెస్టు ద్వారా తిరిగి జాతీయ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసి ఆకట్టుకున్న భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్తో  తనకు ఎటువంటి పోటీ లేదని మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు. తాను ఏ ఒక్క ఆటగాడికి పోటీనే కాదని పేర్కొన్న వృద్ధిమాన్.. తన అవకాశాలపై కూడా ఎటువంటి ఆందోళన లేదన్నాడు.

బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లీగ్  మ్యాచ్లో భాగంగా మోహన్ బగాన్ తరుపున ఆడటానికి ఇక్కడకు విచ్చేసిన  సాహా.. అసలు పార్థీవ్తో తనకు పోటీ ఉందని భావించడం లేదన్నాడు. 'పార్థీవ్తో పోటీ ఉందని అనుకోవడం లేదు. జాతీయ జట్టుకు తిరిగి  ఆడాలనే క్రమంలో పార్థీవ్ విపరీతంగా శ్రమించాడు. టెస్టు సిరీస్లో పార్థీవ్ మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు.  మా ఎంపికపై సెలక్టర్లకు ఏదైతే సరైనది అనిపిస్తోంది అదే చేస్తారు.

అదంతా ఓపెన్ గానే ఉంటుంది. దీని గురించి పెద్దగా పట్టించుకోను. అలా అని మరొక ఆటగాడి ప్రదర్శనపై కూడా ఎటువంటి ఆందోళన లేదు' అని సాహా పేర్కొన్నాడు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్లో 65.00 సగటుతో పార్థీవ్ 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలను పార్థీవ్ నమోదు చేశాడు. అదే సిరీస్ లో సాహా రెండు మ్యాచ్ లు ఆడి 12.25 సగటుతో 49 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement