దినేశ్‌ కార్తీక్‌కు చాన్స్‌? | Injured Wriddhiman Saha in Doubt for England Tests, Dinesh Karthik Likely Replacement | Sakshi
Sakshi News home page

దినేశ్‌ కార్తీక్‌కు చాన్స్‌?

Published Mon, Jul 16 2018 11:55 AM | Last Updated on Mon, Jul 16 2018 2:41 PM

Injured Wriddhiman Saha in Doubt for England Tests, Dinesh Karthik Likely Replacement - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెల్లో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్‌ టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐపీఎల్‌లో గాయపడ్డ సాహా ఇంకా కోలుకోపోవడంతో అతను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. సాహా గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు, ఐదు వారాలు సమయం సరిపోతుందని తొలుత భావించినా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

దాంతో సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడేంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్న కార్తీక్‌ను టెస్టు సిరీస్‌కు సైతం ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మంగళవారంతో వన్డే సిరీస్‌ ముగియనున్న నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే దినేశ్‌ కార్తీక్‌ పేరు ప‍్రధానంగా వినిపిస్తోంది.

ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ ఆడిన సంగతి తెలిసిందే. దాంతో దినేశ్‌ కార్తీక్‌ను టీమిండియా టెస్టు జట్టులో యథావిధిగా కొనసాగించాలనేది సెలక్టర్ల యోచన​.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement