Parthiv Patel
-
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్ నూతన అసిస్టెంట్ మరియు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని టైటాన్స్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. భారత్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌గా పార్థివ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం తమ జట్టుకు మేలు చేస్తుందని జీటీ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు. వీరందరితో కలిసి పార్థివ్ పని చేస్తాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. -
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్
ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో గుజరాత్‌కే ప్రాతినిథ్యం వహించిన పార్థివ్ తన సొంత జట్టుతో మరోసారి జత కట్టనున్నాడని సమాచారం. పార్థివ్.. గ్యారీ కిర్‌స్టన్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు.కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్ -
హార్దిక్ రీ ఎంట్రీ చాలా కష్టం.. ఒకవేళ అదే జరగాలంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు హార్దిక్ ఫిట్‌గా లేడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బహుశ వైట్ బాల్ అందుబాటులో లేపోవడంతో అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించదు.ఒకవేళ హార్దిక్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలంటే అంతకంటేముందు కనీసం ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో పార్ధివ్ పేర్కొన్నాడు.హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్ -
బాబర్ ఆజం ఒక సెల్ఫిష్.. వారు టీ20లకు అస్సలు సరిపోరు: పార్ధివ్
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాక్ జట్టుపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుబెట్టారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ సైతం బాబర్ టార్గెట్ చేశాడు. ఆజం ఒక స్వార్ధపరుడు అంటూ పార్ధివ్ మండిపడ్డాడు."బాబర్ ఆజం ఒక సెల్ఫిష్ ప్లేయర్. జట్టు ప్రయోజనాలు కంటే తన స్వలాభమే ఎక్కువగా చూసుకుంటాడు. ఫఖార్ జమాన్‌ను కాదని తనే ఓపెనర్‌గా రావాలని బాబర్ నిర్ణయించుకున్నాడు. ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు. బాబర్ ఓపెనర్‌గా వచ్చినప్పుడు జమాన్‌ను కనీసం ఫస్ట్ డౌన్లోనైనా బ్యాటింగ్‌కు పంపాల్సింది. కానీ అది కూడా చేయలేదు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ఆ దేశ దిగ్గజాలు కూడా ఇదే చెబుతున్నారు. ప్రస్తుతం పాక్ జట్టులో టీ20లకు సెట్ అయ్యే ఆటగాళ్లు లేరు. టీ20ల్లో వారి స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా బాగోలేదు. పాక్ ఇతర అంతర్జాతీయ జట్ల కంటే చాలా వెనుకబడి ఉన్నారని" ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ధివ్ పటేల్ పేర్కొన్నాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు పాకిస్తాన్ కెప్టెన్సీ పగ్గాలు తిరిగి చేపట్టిన బాబర్.. తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. -
MI: బుమ్రా, హార్దిక్‌ను వదిలేద్దామంటే.. రోహిత్ శర్మనే అడ్డుకున్నాడు!
‘‘రోహిత్ శర్మ తన జట్టులోని ఆటగాళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అందుకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా సరైన ఉదాహరణలు. 2014లో బుమ్రా తొలిసారి ముంబై ఇండియన్స్‌తో చేరాడు. అయితే, 2015లో అతడికి ఆడే అవకాశం వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా అతడిని సీజన్ మధ్యలోనే రిలీజ్ చేస్తారనే చర్చ నడిచింది. అప్పుడు రోహిత్ శర్మ కలుగుజేసుకుని.. బుమ్రా జట్టుతో ఉండేలా యాజమాన్యాన్ని ఒప్పించాడు. రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ 2016లో బుమ్రా తన ప్రదర్శనను తారస్థాయికి తీసుకువెళ్లడం తెలిసిందే. హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇలాగే జరిగింది. 2015లో అతడు జట్టుతో చేరినపుడు పర్లేదనిపించాడు. కానీ 2016లో అతడి కెరీర్ చెత్తగా సాగింది. అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రదర్శన ఇలా ఉన్నపుడు ఫ్రాంఛైజీ కచ్చితంగా అతడిని వదిలించుకోవాలని భావించడం సహజం. తర్వాత దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన ఆధారంగా మళ్లీ తిరిగి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటుంది. అయితే, పాండ్యా విషయంలో రోహిత్ శర్మ ఇలా జరుగనివ్వలేదు. ఇప్పుడు వాళ్లిద్దరు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ సారథిగా ఉన్న రోహిత్ శర్మ వారికి అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ముంబై ఫ్రాంఛైజీ ఈ ఇద్దరినీ వదిలివేయాలని భావించినపుడు రోహిత్ అడ్డుచెప్పాడని తెలిపాడు. అతడు జోక్యం చేసుకోవడం వల్లే బుమ్రా, పాండ్యా ముంబైతో కొనసాగారని పేర్కొన్నాడు. జియో సినిమా షోలో భాగంగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్.. మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా.. 2015- 17 వరకు పార్థివ్ పటేల్ కూడా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. కాగా ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీ అందించిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభం కానుండగా.. 24న ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా పోటీ పడనుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
Ind vs Eng: ‘సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో..’
India vs England, 2nd Test - Visakhapatnam: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశాఖపట్నం మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ ముగ్గురూ రాణించారు ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆకట్టుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ నైపుణ్యాలతో సత్తా చాటాడు. వీరితో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం రాణించాడు. మొత్తంగా అశూ ఆరు వికెట్లు తీయగా.. జడేజా 89 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ 61 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లోకల్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు మొదటి టెస్టులో కేవలం పదకొండు ఓవర్లు బౌల్ చేసిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. రెండో టెస్టులో సిరాజ్ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు.. ‘‘జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే సరిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండో టెస్టుకు టీమిండియా సన్నద్ధం కావడంలో నేను మరో కోణంలో ఆలోచిస్తున్నా. జట్టులో అవసరమా? టెస్టు మొత్తంలో సిరాజ్‌ను కేవలం ఏడెనిమిది ఓవర్ల పాటే బౌలింగ్ చేయించాలనుకుంటే జట్టులో ఉంచడం ఎందుకు? తుదిజట్టులో కుల్దీప్ యాదవ్ కంటే అక్షర్ పటేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం అతడి బ్యాటింగ్ స్కిల్స్ అని రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడు. మరి సిరాజ్ సేవలను ఉపయోగించుకోనపుడు అతడి స్థానంలో ప్యూర్ బ్యాటర్‌ను తీసుకోవాలి. అదనపు బ్యాటర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అనవసరంగా ఎవరూ జట్టులో ఉన్నారన్న భావన కలగదు’’ అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం. నిజానికి వాళ్లు(బుమ్రా, సిరాజ్) మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువస్తారని భావించాం’’ అంటూ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే! తాడోపేడో తేల్చుకో.. -
రాహుల్‌కు కఠిన సవాలు.. ఏం చేస్తాడో చూడాలి! మరి భరత్?
Ind vs SA 2023 Test Series: కేఎల్ రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గా పాతుకుపోయిన ఈ కర్ణాటక ఆటగాడు గత కొన్నేళ్లుగా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీ శుబ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో.. అవసరాన్ని బట్టి నాలుగు లేదంటే ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు. అంతేకాదు.. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యంగా మారాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాటింగ్‌తో పాటు, అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంత్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే, టెస్టుల్లో మాత్రం వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు మెరుగైన రికార్డు లేదు. ముఖ్యంగా రిషభ్ పంత్ జట్టులో ఉంటే అతడికి జట్టులో అసలు స్థానమే కరువయ్యే పరిస్థితి. కానీ.. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్‌గా కాకపోయినా.. స్పెషలిస్టు బ్యాటర్‌గానైనా రాహుల్ జట్టులో చోటు సంపాదిస్తున్నాడు. ఆసీస్‌తో సిరీస్ నుంచి భరత్ వికెట్ కీపర్ పంత్ గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(ఆసీస్ వర్సెస్ ఇండియా) నుంచి ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భరత్‌ను కాదని కేఎల్ రాహుల్‌కే కీపర్‌గా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. ఇషాన్ ఇంకా నిరూపించుకోనే లేదు ఇషాన్ కిషన్ జట్టుతో లేడు కాబట్టి వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ మాత్రమే తమకు మిగిలి ఉన్న ఆప్షన్ అని పేర్కొన్నాడు. గత ఐదారు నెలలుగా రాహుల్ కీపింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకున్నాడన్న ద్రవిడ్.. సౌతాఫ్రికాలో అతడికి గట్టి సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు. రాహుల్ వైపే మొగ్గు చూపిన ద్రవిడ్ అయితే, ఇక్కడ పెద్దగా స్పిన్ బౌలింగ్‌కు ఆస్కారం లేదు కాబట్టి.. కేఎల్ రాహుల్ మెరుగ్గానే కీపింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. రాహుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. తప్పుబట్టిన మాజీ వికెట్ కీపర్ ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేఎల్ రాహుల్‌ను టెస్టుల్లో కీపర్‌గా ఆడించడం సరికాదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. india’s test match wicketkeeper should be someone who is keeping regularly in ranji trophy or first class cricket….#imho #INDvSA #IndianCricket — parthiv patel (@parthiv9) December 24, 2023 భరత్‌కు పరోక్ష మద్దతు ‘‘రంజీ ట్రోఫీ లేదంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తరచుగా కీపింగ్ చేసే ఆటగాడినే టీమిండియా టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్‌గా తీసుకోవాలి’’ అని పార్థివ్ పటేల్ పరోక్షంగా కేఎస్ భరత్‌కు మద్దతునిచ్చాడు. అయితే, కేఎల్ రాహుల్ అభిమానులకు మాత్రం పార్థివ్ ఆలోచన నచ్చడం లేదు. రాహుల్- భరత్ బ్యాటింగ్ గణాంకాలు పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ ఏం చేస్తాడో? పేసర్ల బౌలింగ్‌లో అద్భుతంగా కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. రవీంద్ర జడేజా లేదంటే రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ విషయంలో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్, బౌన్సీ పిచ్‌లు ఉన్న సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి! ఇషాన్ స్థానంలో భరత్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్‌తో భర్తీ చేశారు టీమిండియా సెలక్టర్లు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భరత్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
'కొంచెం హుందాగా ప్రవర్తించండి'.. సెహ్వాగ్, పార్థివ్‌లకు చురకలు
టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. అందులో ఒకటి అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు కావడం సగటు అభిమానికి బాధ కలిగించింది. అఫ్గానిస్తాన్ ఈసారి నేరుగా టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. ఐర్లాండ్ మాత్రం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడింది. క్వాలిఫయింగ్‌లో స్కాట్లాండ్ను ఓడించిన ఐర్లాండ్.. రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌కు గట్టిషాక్ ఇచ్చింది. గ్రూఫ్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్-12లో ఇంగ్లండ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో ఓడించిన ఐర్లాండ్.. లంక చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక అఫ్గానిస్తాన్ పరిస్థితి దారుణం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు రద్దు కాగా.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ రెండు జట్లు సెమీస్ చేరడం కష్టమే. అయితే ఐర్లాండ్‌కు కాస్త అవకాశం ఉంది. ఈ సంగతి పక్కనపెడితే టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్‌లకు ఒక క్రికెట్ అభిమాని చురకలంటించాడు. అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను సభ్య దేశాలుగా పేర్కొనడంతోనే ఈ తంటంతా వచ్చి పడింది. విషయంలోకి వెళితే.. శుక్రవారం అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ ప్రీ మ్యాచ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్, పార్ధివ్ పటేల్‌లు పాల్గొన్నారు. మాటల్లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను వీరిద్దరు సభ్య దేశాలుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇరుజట్లు ఐసీసీలో శాశ్వత జట్లుగా ఎప్పుడో గుర్తింపు పొందాయి. అటు ఆఫ్గన్.. ఇటు ఐర్లాండ్‌కు టెస్టు సభ్యత్వం కూడా ఉంది. ఈ విషయం మరిచిపోయి వాటిని సభ్య దేశాలు అనడం ఒక అభిమానికి చిరాకు తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్, పార్థివ్ పటేల్‌కు చురకలంటించాడు. ''కొంచెం హుందాగా ప్రవరిస్తే మంచిది..'' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో సగం మ్యాచ్‌లు వర్షార్పణం అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తారంటూ ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. అదేంటో గానీ ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కూడా ఒక టీమ్‌లా తయారైంది. ఈసారి గట్టిగా కురుస్తూ మ్యాచ్‌లను రద్దు చేసే పనిలో పడింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో పాయింట్ల పట్టికలో వరుణుడు టాప్‌లో ఉన్నట్లు అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Some professionalism please... pic.twitter.com/whYV7UPuA5 — Karthik Raj (@kartcric) October 27, 2022 చదవండి: ‘భారత్‌పై గెలిస్తే నవ్వుకుంటారుగా.. అంత ఏడుపు ఎందుకులే..’ -
రోహిత్ తర్వాత నాలుగేళ్లకు ద్రవిడ్ అరంగేట్రం! ఇప్పుడు అతడు కెప్టెన్.. ఇతడేమో!
Rohit Sharma 15 Years Of T20 Journey: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్. ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3620 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు. 28 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ మేటి! ఇక టీ20 ఫార్మాట్లో రోహిత్ అత్యధిక స్కోరు 118. ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్ సొంతం. క్యాష్ రిచ్ లీగ్‌లో 227 మ్యాచ్‌లలో భాగమైన రోహిత్ 5879 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో అతడి అత్యధిక స్కోరు 109. ఇలా పదిహేనేళ్ల క్రితం ఐసీసీ మెగా ఈవెంట్‌తో తన టీ20 ప్రయాణం మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. రోహిత్ తర్వాత అరంగేట్రం.. కానీ! ఇప్పటికే టీమిండియా సారథిగా పలు టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డులు నెలక్పొలిన ఈ హిట్‌మ్యాన్.. ప్రపంచకప్-2022లో తొలిసారిగా టీమిండియా టీ20 కెప్టెన్ హోదాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ తర్వాత టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన 10 మంది భారత ఆటగాళ్లు.. రోహిత్ కంటే ముందే రిటైర్ కావడం విశేషం. వారెవరో తెలుసుకుందాం! యూసఫ్ పఠాన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్.. రోహిత్ శర్మ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజులకే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007 ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్.. ఫిబ్రవరి 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ కార్తిక్ మురళీ కార్తిక్ 2007లో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. ఇక ఐపీఎల్-2014లో భాగంగా తన చివరి టీ20 ఆడిన మురళీ కార్తిక్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా 2008లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు ప్రవీణ్ కుమార్. భారత్ తరఫున మొత్తం 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తరచూ గాయాల బారిన పడిన కారణంగా 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు ప్రవీణ్ కుమార్. ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 2009 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. 2010లో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన ఓజా.. 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అతడు మొత్తం ఆరు టీ20లు ఆడాడు. ఆశిష్ నెహ్రా భారత మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా శ్రీలంకతో మ్యాచ్ ద్వారా 2009లో తన అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆరంభించాడు. మొత్తంగా టీమిండియా తరఫున 27 టీ20 మ్యాచ్‌లు ఆడిన నెహ్రా.. 2017లో తన చివరి టీ20 ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. తొలి సీజన్లోనే క్యాష్ రిచ్లో గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపి.. ఈ ఘనత అందుకున్న తొలి భారత హెడ్‌కోచ్‌గా నిలిచాడు నెహ్రా. సుదీప్ త్యాగి 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సుదీప్ త్యాగి.. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా అదే ఏడాది అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ అదే అతడికి చివరి టీ20 అయింది. 2020లో అతడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. వినయ్ కుమార్ టీ20 వరల్డ్‌కప్-2010 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు వినయ్ కుమార్. భారత్ తరఫున 2010- 12 మధ్యకాలంలో తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. రాహుల్ శర్మ టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ 2012లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆటకు వీడ్కోలు పలికాడు. రాహుల్ ద్రవిడ్ టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం రోహిత్ శర్మ తర్వాత.. నాలుగేళ్లకు అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టడం విశేషం. 2011లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో ద్రవిడ్ తన తొలి టీ20 ఆడాడు. అదే ద్రవిడ్‌కు ఆఖరిది కూడా! ఇక 2012లో అతడు రిటైర్ అయిన విషయం తెలిసిందే. పార్థివ్ పటేల్ పార్థివ్ పటేల్ 2011 వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్లో రెండే రెండు టీ20లు ఆడాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక పార్థివ్ పటేల్ యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా ఇటీవలే ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. -
పార్థివ్ పటేల్‌కు లక్కీ ఛాన్స్.. ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా..
International League T20- MI Emirates Coaching Staff: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నేపథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమించింది. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీతో ప్రయాణం ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ఈ ఫ్రాంఛైజీతో అతడి ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాలుగు సార్లు(2013 మినహా) టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోచ్‌లకు స్వాగతం! ఎంఐ ఎమిరేట్స్ కోచ్‌ల నియామకం నేపథ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్‌లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు దక్కిన గౌరవం! ఇక తన నియామకంపై షేన్ బాండ్ స్పందిస్తూ.. ఎంఐ ఎమిరేట్స్ హెడ్‌కోచ్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ఎంఐ ఎమిరేట్స్ స్థాయిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. కాగా యూఏఈ లీగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ లీగ్ ద్వారా పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ కోచ్‌లుగా ఎంఐ ఎమిరేట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్ అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? 𝘿𝙖𝙫𝙖𝙣𝙜𝙚𝙧𝙚 Express is here 🔥 We are excited to announce that @Vinay_Kumar_R has joined MI Emirates as the bowling coach! 🤩#OneFamily #MIemirates @ILT20Official pic.twitter.com/z5spZNsi4j — MI Emirates (@MIEmirates) September 17, 2022 -
కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వికెట్ కీపర్ హెల్మెట్ ఇండియా మహారాజాస్ కొంపముంచింది. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అశోక్ దిండా వేశాడు. ఓవర్ మూడో బంతిని ఫుల్‌లెంగ్త్‌తో వేశాడు. క్రీజులో ఉన్న పెరీరా టచ్ చేయాలని చూశాడు. కానీ బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్ పార్థివ్ పటేల్ వైపు వెళ్లింది. అయితే పార్థివ్ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో బౌండరీ వెళుతుందని మనం అనుకునేలోపే కీపర్ హెల్మెట్‌కు తాకిని బంతి అక్కడే ఆగిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్ బైస్ రూపంలో ఇండియా మహారాజాస్‌కు ఐదు పరుగుల ఫెనాల్టీ విధించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మహారాజాస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 5 Runs when ball Hits Keeper Helmet ⛑️😂😂 Dinda Parthiv Bhajji all Smiles 😊@llct20 #LLC pic.twitter.com/fON67VE3hm — Kagiso Rabada (@cricketer_jii) September 16, 2022 -
'అతడికి రోహిత్ సపోర్ట్‌గా నిలిచాడు.. మ్యాచ్‌లో అదరగొట్టాడు'
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ అవేష్ ఖాన్అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అవేష్ ఖాన్‌ను భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభినందిచాడు. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవేష్ ఖాన్ దారుణంగా విఫలమైనప్పటికీ.. అతడికి మళ్లీ ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశసంల వర్షం కురిపించాడు. అవేష్ ఖాన్‌కు రోహిత్ శర్మ మద్దతుగా నిలవడంతోనే అతడు అద్భుతంగా రాణించడాని పటేల్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. " ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంటాడు. అతడు తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేస్తాడని నేను ముందే ఉహించాను. ఈ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వాలి. ఎందుకంటే అతడు వరుసగా విఫలమవుతున్నా, మళ్లీ అవకాశం ఇచ్చి అవేష్లో ఆత్మవిశ్వాన్ని పెంచాడు. రోహిత్ ఇచ్చిన భరోసాతో అవేష్ అద్భుతంగా రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసే తన సత్తాను అవేష్ ఖాను మరో సారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు చాలా సపోర్టుగా ఉంటున్నారు. భారత జట్టులోకి వచ్చే ప్రతీ ఆటగాడు ఇటువంటి వాతావరణాన్నే కోరుకుంటారు" అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగులూండగానే 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో పంత్(440, రోహిత్ శర్మ(33), సంజు సామ్సన్(30) పరుగులతో రాణించారు. అనంతరం 192 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్(24), పావెల్(24) పరుగులతో టాప స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు , అవేష్ ఖాన్, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి టీ20 ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! -
‘ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లికే ఛాన్స్!’
టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ సమస్యను ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్ జోడిగా పంత్ జత కట్టగా.. ప్రస్తుతం జరుగతోన్న విండీస్ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌గా ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన సుర్య.. మూడో టీ20లో 76 పరుగులతో దుమ్ము రేపాడు. రాహుల్ లేకుంటే! ఇక ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌కు కూడా కేఎల్ రాహుల్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ రాహుల్ అసియా కప్‌కు దూరమైతే సూర్యకుమార్ యాదవ్‌నే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కీలక వాఖ్యలు చేశాడు. రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించనందున ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. కోహ్లికి ఛాన్స్! ఎందుకంటే.. ఇటీవలి కాలంలో భారత ఇప్పటికే అనేక ఓపెనింగ్ కాంబినేషన్లను పరీక్షించిందని, ఆసియా కప్‌లో కోహ్లికి కూడా ఛాన్స్ ఇవ్వవచ్చు అని పటేల్ తెలిపాడు. ఇక ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోహ్లి ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతడు ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు. అతడు అసియా కప్‌తో తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని ఆశిస్తున్నాను. కోహ్లికి ఆసియా కప్ చాలా కీలకం. అదే విధంగా అతడు ఫామ్‌లోకి రావడం భారత్‌కు కూడా చాలా ముఖ్యం. ఇక ఈ మెగా టోర్నీకు కేఎల్ రాహుల్ దూరమైతే.. విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ జట్టుకైనా ఓపెనింగ్ కాంబినేషన్ కీలకం. గత కొన్ని సిరీస్‌ల నుంచి రాహుల్ అందుబాటు లేకపోవడంతో ఓపెనింగ్ జోడీలో భారత్ ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, పంత్, సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లుగా జట్టు మెనేజేమెంట్ అవకాశం ఇచ్చింది. ఈ ప్రయోగాల్లో భాగంగా కోహ్లిని కూడా ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న తలపడనుంది. చదవండి: IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా! -
T20 WC: అతడు మరీ అంత బ్యాడ్ ఛాయిస్ కాదు! ప్రపంచకప్ జట్టులో ఉంటే..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో భారత జట్టులో మహ్మద్ షమీకి స్థానం కల్పిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌తో పాటు షమీ కూడా జట్టులో ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో అనుభవజ్ఞులైన ఈ పేస్ త్రయంతో బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రయోగాలు చేస్తున్న టీమిండియా! ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగుతామన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లను మెగా ఈవెంట్‌కు సన్నద్ధం చేసే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షమీకి అవకాశం ఇవ్వాలంటూ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. మహ్మద్ షమీ(PC: BCCI) ఐపీఎల్లో అదరగొట్టిన షమీ! అయినా.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో షమీ.. ఆరు వికెట్లు(ఎకానమీ 9.57) పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ ఫార్మాట్ షమీకి సూట్ కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మరింత మెరుగయ్యాడు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ టీమిండియా తరఫున పునరాగమనం చేశాడు. నిజానికి మహ్మద్ షమీ కూడా ఐపీఎల్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించాడు. గత ప్రపంచకప్ మ్యాచ్ కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాడు. కాబట్టి అతడు ఈసారి మరీ అంత బ్యాడ్ ఛాయిస్ ఏమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, భువీ, అర్ష్‌దీప్‌తో పాటు 31 ఏళ్ల షమీని మేనేజ్మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్-2022లో అదరగొట్టిన 37 ఏళ్ల దినేశ్ కార్తిక్ భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చి.. ఫినిషర్‌గా స్థానం సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. చదవండి: Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్! -
'అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవచ్చు'
వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో అశ్విన్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక అశ్విన్ దాదాపు 8 నెలల తర్వాత తిరిగి భారత టీ20 జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. అతడు చివరగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కాగా విండీస్‌తో తొలి టీ20లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా అశ్విన్‌కు జట్టులో చోటు దక్కిది. ఇక మిగితా ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే సోమవారం జరగనున్న రెండో టీ20లో కూడా ముగ్గురు స్పిన్నర్లకు భారత్ అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఈ క్రమంలో భారత్ మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20లో భారత ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే అశ్విన్ తన స్థానం కోల్పోతాడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా అశ్విన్‌కు చోటు దక్కే అవకాశం లేదని పార్థివ్ తెలిపాడు. "భారత తమ తదుపరి మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కదు. అతడు టీమిండియా టీ20 ప్రపచంకప్ ప్రణాళికలలో లేనట్లు కన్పిస్తోంది. ప్రపంచకప్ భారత జట్టులో కుల్దీప్ యాదవ్, బిష్ణోయ్,యుజ్వేంద్ర చాహల్ వంటి స్పిన్నర్లు ఉండాలని నేను భావిస్తున్నాను. ఈ మణికట్టు స్పిన్నర్లుకు మ్యాచ్ మధ్యలో వికెట్లు పడగొట్టి మలుపు తిప్పగలిగే సత్తా ఉంది. అశ్విన్ మాత్రం టీ20ల్లో అంతగా రాణించలేడు" అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. ఇక తొలి టీ20లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మను పార్థివ్ పటేల్ ప్రశంసించాడు. "స్వదేశంలో కూడా భారత్ టీ20ల్లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం నేను ఇప్పటివరకు చూడలేదు. విండీస్ పర్యటనలో భారత్ అద్భుతంగా ఆడుతోంది. ప్రతీ మ్యాచ్‌లోను భారత్ తమ వ్యూహాలను రచిస్తోంది. తొలి టీ20లో స్పిన్నర్లను రోహిత్ సరైన సమయాల్లో ఊపయగించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రవి బిష్ణోయ్‌తో నాలుగు ఓవర్లు వేయించడం సాహసోపేత నిర్ణయం" అని పార్థివ్ తెలిపాడు. చదవండి: ZIM vs IND: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..? -
Ind Vs WI: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు!
India VS West Indies T20 Series: ఇటీవలి కాలంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో చోటు చేసుకుంటున్న మార్పులపై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి తుది జట్టులోకి స్థానం కల్పించే క్రమంలోనే వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నారన్నాడు. వివిధ సిరీస్‌లలో వేర్వేరు ఆటగాళ్లతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నాడు. కాగా ‘రన్‌మెషీన్’ కోహ్లి గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ఐపీఎల్ అనుభవంతో టీ20 ఫార్మాట్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొన్న పంత్.. ఇప్పుడు సూర్య! ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ జట్టులో కోహ్లి స్థానం ఏమిటన్న దానిపై క్రీడా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో బీసీసీఐ సైతం పలు ప్రయోగాలు చేస్తోంది. మెగా ఈవెంట్‌కు పంపాల్సిన జట్టు గురించి కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు క్రికెట్ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఇంగ్లండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఓపెనర్(ఆఖరి రెండు మ్యాచ్‌లు)గా రాగా.. విండీస్‌తో తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. శ్రేయస్ అయ్యర్ మూడు, పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. విరాట్ కోహ్లి(PC: Virat Kohli Twitter) అందుకే ఇలా చేస్తున్నారు! ఈ నేపథ్యంలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘తుది జట్టులో విరాట్ కోహ్లికి స్థానం కల్పించేందుకే బ్యాటింగ్ ఆర్డర్లో ఇన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిజానికి వెస్టిండీస్‌తో కోహ్లి వన్డే సిరీస్ ఆడాల్సింది. ఎందుకంటే ఆ ఫార్మాట్లో కోహ్లి మెరుగ్గా రాణించగలడు. సులువుగా మునుపటి ఫామ్ అందుకునే అవకాశం ఉండేది. 50 ఓవర్ల ఆట కాబట్టి చాలా సమయం ఉంటుంది. ఒక్కసారి నిలదొక్కుకుంటే.. శిఖర్ ధావన్ లేదంటే శుబ్‌మన్ గిల్లాగా 70- 80 పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక విండీస్‌తో టీ20 సిరీస్ మొత్తం సూర్య.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. కాగా తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 24 పరుగులు చేయగా.. పంత్ 12 బంతుల్లో 14 పరుగులు సాధించాడు. ఇక మొదటి మ్యాచ్‌లో రోహిత్ సేన 68 పరుగులతో విజయం సాధించింది. చదవండి: Dinesh Karthik: ఇలాంటి షాట్లు డీకేకు మాత్రమే సొంతం.. Rohit Sharma: అద్భుతంగా ముగించాం..! మేము చాలా హర్ట్ అయ్యాం! అయినా ఇది ఆరంభమే! -
'ఇంగ్లండ్‌తో రెండో టీ20.. దీపక్ హుడా స్థానంలో కోహ్లి రానున్నాడు'
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం జరగనున్న రెండో టీ20లో ఇంగ్లండ్‌తో భారత తలపడనుంది. అయితే తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న భారత సీనియర్ ఆటగాళ్లు రెండో టీ20కు అందు బాటులోకి రానున్నారు. దీంతో భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టుపై టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. "అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకు రావాలి. అదే విధంగా అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా రానున్నాడు. ఇక విరాట్ కోహ్లి.. దీపక్ హుడా స్థానంలో జట్టులోకి వస్తాడని నేను భావిస్తున్నాను. మరో వైపు శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. దినేష్ కార్తీక్ స్ధానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది" అని పార్థివ్ పటేల్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి' -
IPL 2022: పాపం పొలార్డ్.. కృనాల్ ఓవరాక్షన్ భరించలేకున్నాం!
IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్ పటేల్ క్రిజ్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’’ అని కృనాల్ తీరును తప్పుబట్టాడు. ఇక మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది? తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్’’ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్ ఎడిషన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది. చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్ ఇదేమైనా టెస్టు మ్యాచ్ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi — IndianPremierLeague (@IPL) April 24, 2022 -
తీవ్ర విషాదంలో పార్థివ్ పటేల్.. భావోద్వేగ పోస్టుతో..
Parthiv Patel Father Passed Away: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని పార్థివ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారని తెలియజేసేందుకు చింతిస్తున్నాం. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’’ అని అతడు ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. కాగా కొంతకాలం క్రితం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పార్థివ్ తండ్రిని.. స్వస్థలం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కాగా సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ పటేల్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ మొత్తంలో అత్యంత చిన్న వయస్సులోనే వికెట్ కీపర్‌గా ఎదిగిన ఆటగాళ్లలో అతడిది తొలి స్థానం. ఇక టీమిండియా తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt — parthiv patel (@parthiv9) September 26, 2021 -
'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు'
ముంబై: ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ను దక్కించుకునే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి నాయకత్వంలోని జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందని.. కివీస్ కంటే బలంగా కనిపిస్తుందని చెప్పాడు. స్టార్‌స్పోర్ట్ష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. '' రాబోయే ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియానే బలంగా కనిపిస్తుంది. కివీస్‌తో పోల్చుకొని చూస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బీసీసీఐ 20 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించినప్పుడే విజయం మనదే అని తెలిసింది. వీరికి తోడు నలుగురు స్టాండ్ బై ప్లేయర్లను కూడా ఎంపికచేశారు. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీలతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ త్రయం 11 మ్యాచ్‌లు కలిపి 149 వికెట్లు తీశారు. ఇక పేస్ విభాగానికి అండగా సిరాజ్, ఉమేశ్ రూపంలో బెంచ్ బలం కూడా పటిష్టంగా కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్, గిల్, కోహ్లి, రహానే, పుజారా, పంత్‌తో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తుండగా.. కేఎల్ రాహుల్ కూడా వారికి జత కలిస్తే ఇక బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఆల్‌రౌండర్ కోటాలో చూసుకుంటే అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు ఉన్నారు. వీరికి తోడూ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జడేజా దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ వచ్చీ రావడంతోనే 23 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడు జడేజా తుది జట్టులోకి వచ్చాడు.. అక్షర్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే.. అయినా మంచి జట్టుతో మ్యాచ్‌ను గెలవడం అవసరం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా కివీస్, భారత్‌ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: ఇండియా గురించే ఆలోచిస్తున్నా ‘ధోని కోసం పంత్‌తో కలిసి ప్లాన్ చేశా’ -
‘కోహ్లిని పక్కకు పెట్టి ఒత్తిడి తగ్గించండి’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన పార్థివ్ పటేల్..టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌ను మార్చాలని సూచించాడు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను చేయాలని పేర్కొన్నాడు. టీ20 క్రికెట్లో రోహిత్ ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అనే విషయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటే మంచిదన్నాడు. ఆటగాళ్లను ఎలా ముందుకు నడిపించాలనే విషయం రోహిత్‌కు బాగా తెలుసన్నాడు. స్పోర్ట్ తక్‌తో మాట్లాడిన పార్థివ్.. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ను సారథిగా చేయాలన్నాడు. ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌ను మార్చినంత మాత్రాన నష్టం ఏమీ ఉండదన్నాడు. (అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్) ఇలా చేస్తే కోహ్లిపై కూడా ఒత్తిడి తగ్గించివారు అవుతారన్నాడు. ‘ రోహిత్ చాలా టోర్నమెంట్లు గెలిచాడు. ఒత్తిడిలో ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో చూశాం. ముంబై ఇండియన్స్‌కు ఎన్నో ట్రోఫీలను తీసుకొచ్చాడు రోహిత్. ప్రతీ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఒక సెటిల్డ్ టీమ్ కాదనే విషయం కూడా గుర్తించాలి. జట్టు బరిలోకి దిగిన తర్వాత ఆటగాళ్లను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపిస్తాడు రోహిత్. టీ20లకు కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేయండి’ అని పార్థివ్ కోరాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలను అందించాడు రోహిత్. అదే ఆర్సీబీకి కోహ్లి ఇప్పటివరకూ ఒక ట్రోఫీ కూడా సాధించలేకపోయాడు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు ముందు రోహిత్-కోహ్లి కెప్టెన్సీపై పెద్ద చర్చే నడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించిన పార్థివ్.. టీ20 వరల్డ్‌కప్ నాటికి కెప్టెన్‌ను మార్చాలన్నాడు. ప్రత్యేకంగా పొట్టి ఫార్మాట్లో కెప్టెన్‌గా రోహిత్ సరైనవాడనే విషయాన్ని బీసీసీఐ తెలుసుకోవాలని పరోక్షంగా సూచించాడు. -
‘పాలబుగ్గల’ పార్థివ్ రిటైర్
న్యూఢిల్లీ: సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ పిచ్‌పై ఒక 17 ఏళ్ల కుర్రాడితో వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించినప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు నిలబడి మ్యాచ్‌ను ‘డ్రా’వైపు మళ్లించిన అతని పట్టుదలను చూసి ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. తర్వాతి రోజుల్లో భారత క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే పార్థివ్ పటేల్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ బుధవారం ప్రకటించాడు. తన కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ సంఘానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన పార్థివ్... ఈ ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు. కీపర్‌గా ప్రతిభ, చక్కటి బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నా... ధోని హవా కారణంగా ఎక్కువ కాలం జాతీయ జట్టుకు పార్థివ్ దూరం కావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ధోని తప్పుకోవడం వల్లో, సాహా గాయాల వల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. టీనేజర్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను 35 ఏళ్ల వయసులో ఆట ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో: పార్థివ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి భారత్ ఆడిన 20 టెస్టుల్లో 19 మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కింది. అయితే కీలక సమయాల్లో కీపర్‌గా చేసిన తప్పిదాలతో జట్టులో స్థానం కోల్పో యాడు. 2002లో హెడింగ్లీ, 2003– 04లో అడిలైడ్‌లో భారత్ సాధిం చిన విజయాల్లో భాగంగా ఉన్న పార్థివ్... 2004లో రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 69 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2012 తర్వాత పార్థివ్ వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చలేదు. అతను 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఐపీఎల్/దేశవాళీ క్రికెట్లో: ఐపీఎల్లో పార్థివ్ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన 2017 ఫైనల్లో చివరి బంతికి సుందర్‌ను రనౌట్ చేసిన దృశ్యం అభిమానులు మరచిపోలేనిది. 2020లో బెంగళూరు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ తరఫున అతను చిరస్మరణీయ ప్రదర్శన కనబర్చాడు. పార్థివ్ సారథ్యంలోనే గుజరాత్ మూడు ఫార్మాట్లలో (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం. ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్... తొమ్మిది వేళ్లతోనే వికెట్ కీపర్‌గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్ చావ్లా, శివరామకృష్ణన్ తర్వాత పార్థివ్ది నాలుగో స్థానం. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం ప్రపంచ క్రికెట్ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతను 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్‌లు చేశాడు. -
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్
ముంబై : టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బుధవారం తెలిపాడు. 35 ఏళ్ల పార్థివ్ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు కలిపి 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపింగ్స్ చేశాడు.ఇక దేశవాలి క్రికెట్లో గుజరాత్ తరపున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు. అదే సమయంలో దినేష్ కార్తిక్, ఎంఎస్ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడంతో పార్థివ్ కెరీర్ డౌన్‌ఫాల్ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పార్థివ్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్లో పార్థివ్ పటేల్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. Parthiv Patel announces his retirement from all cricket. 👕 25 Tests, 38 ODIs, two T20Is 🏏 1706 runs 🧤 93 catches, 19 stumpings He remains the youngest wicket-keeper to play Test cricket, having made his debut at 17 years and 152 days ⭐ pic.twitter.com/O5i8FeRUiW — ICC (@ICC) December 9, 2020 -
నన్ను మీ నాన్న అన్న మాటలే.. నీకు ఇచ్చేశా!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌గా పార్థివ్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదనే చెప్పాలి. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనలో టాలెంట్ ఉన్నా అడపా దడపా అవకాశాలు రావడం ఒకటైతే, ధోని పుట్టిన శకంలోనే పార్థీవ్ కూడా ఉండటం శాపంగా మారింది. ఇది విషయాన్ని పార్థివ్ పటేల్ గతంలోనే చెప్పాడు కూడా. తాను ధోని పుట్టిన శకంలో పుట్టిన కారణంగా భారత జట్టులో సాధ్యమైనన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయానని పార్ధివ్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది తన దురదృష్టంగా పార్ధివ్ అభివర్ణించుకున్నాడు. అయితే మాటకు మాటకు పంచ్‌కు పంచ్ ఇవ్వడంలో పార్ధివ్ ఎక్కడా తగ్గడు. అయితే తాను ఆసీస్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యలకు గతేడాది కౌంటర్ ఇచ్చినట్లు పార్ధివ్ తెలిపాడు. 2019లో సిడ్నీలో జరిగిన టెస్టు ద్వారా స్టీవ్ మాటల్ని అతనికే అప్పచెప్పినట్లు పార్థివ్ పేర్కొన్నాడు. అదేంటి స్టీవ్ వా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించగా, మరి పార్థివ్ స్లెడ్జ్ చేయడం ఏమిటా అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. 2003-04 సీజన్లో సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ స్టీవ్ వాకు చివరిది. ఆ మ్యాచ్‌లో టీమిండియా కీపర్‌గా ఉన్న పార్థివ్ పటేల్.. స్టీవ్ వా స్లెడ్జ్ చేయబోయాడు. ('ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు') దాంతో స్టీవ్ వా కాస్త కూల్‌గానే పార్ధివ్‌కు చురకలంటించాడు. ‘‘నేను క్రికెట్ బ్యాట్ పట్టేటప్పటికి నువ్వు నేపీస్ వేసుకుంటున్నట్లు ఉన్నావ్.. సీనియర్ అనే గౌరవాన్ని ఇచ్చి స్లెడ్జ్ చేస్తే బాగుంటుంది’’ అని పార్థివ్‌కు స్టీవ్ వా హితబోధ చేశాడు. అయితే ఆ మాటల్ని మరిచిపోలేని పార్ధివ్.. గత సంవత్సరం అదే సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తిరిగి ఇచ్చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా కుమారుడు ఆస్టిన్ వా సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఉన్నాడు. అలా ఆస్టిన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన క్రమంలో అతని దగ్గరకె వెళ్లి.. ‘‘ నేను టెస్టుల్లో అరంగేట్రం చేసేటప్పటికి నువ్వు నేపీస్లో ఉండి ఉంటావ్. ఇది మీ నాన్న స్టీవ్ వా నన్ను అన్నమాటలు.. మీ నాన్నకు చెప్పు. ఆ మాటల్ని తిరిగి ఇచ్చేశానని చెప్పు’అని ఆస్టిన్ను ఆట పట్టించిన విషయాన్ని పార్థివ్ తాజాగా షేర్ చేసుకున్నాడు. కౌ కార్నర్ క్రోనికల్స్ యూ ట్యూబ్ న్యూ సిరీస్‌లో భాగంగా చంద్రకాంత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పార్థివ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. -
'ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు'
ముంబై : 2008 ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అప్పటి జట్టులో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం తాను పోటీలోనే ఉన్నానని తెలిపాడు. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తనను జట్టులోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్‌తో మంగళవారం ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పార్థివ్ మాట్లాడాడు. ('అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని') 'సరైన సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా ముఖ్యం. 2008 ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేసే సమయంలో మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో నేను రెండో వికెట్ కీపర్ స్థానానికి పోటీలో నిలిచా. అయితే ఆ సమయంలో ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యా. అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. నాకు కాల్ చేసి.. నువ్వు మంచి ప్రదర్శన చేస్తున్నావు.. ఇలాగే కొనసాగించు అన్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కోసం నిన్ను ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారని ' పార్థివ్ తెలిపాడు. 2008లో ఆసీస్ పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. అయితే ఈ సిరీస్ మొత్తం వివాదాల నడుమే కొనసాగింది. సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో హర్బజన్ సింగ్, ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య చోటుచేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ ప్రేమికులెవరు అంత తొందరగా మరిచిపోలేరు. 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన పార్థివ్ పటేల్ తన కెరీర్లో 25 టెస్టులు, 38 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన పిన్నవయస్కుడిగా (17ఏండ్ల 153రోజులు) వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు పాకిస్తాన్ వికెట్ కీపర్ హనీఫ్ మహ్మద్(17 ఏళ్ల 300 రోజులు) పేరిట ఉండేది. ('నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు') -
డీన్ జోన్స్‌కు పార్థీవ్ అదిరిపోయే పంచ్
బెంగళూరు: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పార్థీవ్ పటేల్‌ను జట్టుతో పాటే ఉంచుకుంది. గత సీజన్లో పార్థీవ్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయడంతో పార్థీవ్నే అట్టిపెట్టుకుంది. 2019 సీజన్లో పార్థీవ్ పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి 373 పరుగులు చేశాడు. దాంతో పార్థీవ్‌పై మరొకసారి నమ్మకం ఉంచింది ఆర్సీబీ యాజమాన్యం. కాగా, పార్థీవ్ను తిరిగి జట్టులో కొనసాగించడంపై ఆసీస్ మాజీ క్రికెటర్, క్రికెట్ విశ్లేషకుడు డీన్ జోన్స్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ పార్థీవ్ను అట్టిపెట్టుకున్నారా. అసలు ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్ ఎవరు? అని ట్వీట్ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పార్థీవ్ పటేల్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘ మీరు ప్రశాంతంగా ఉంటే మంచిది. వచ్చే ఐపీఎల్లో మీ సెలక్ట్ డగౌట్లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తే బాగుంటుంది’ అని పేర్కొన్నాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. 2018లో తిరిగి ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పట్నుంచీ పార్ధీవ్ తుది జట్టులో చోటుకు ఎటువంటి ఢోకా ఉండటం లేదు. వికెట్ కీపరే కాకుండా ఓపెనర్ కూడా కావడంతో పార్థీవ్ ఆర్సీబీ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటూ వస్తున్నాడు. 2014లో ఆర్సీబీ తరఫున పార్థీవ్ ఆడాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కూడా పార్థీవ్ ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లో 139 మ్యాచ్‌లు ఆడిన పార్థీవ్ 22.60 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 13 హాఫ్ సెంచరీలు చేయగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 81. -
ఆర్సీబీతో మ్యాచ్: సీఎస్కే లక్ష్యం 162
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్బీబీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సారథి విరాట్ కోహ్లి(9)ని దీపక్ చహర్ ఔట్ చేశాడు. చహర్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ ఆరంభం నుంచి దాటిగా ఆడాడు. అదే జోరులో జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డివిలియర్స్(25) వెనుదిరిగాడు. దీంతో 58 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పార్థీవ్ పటేల్, అక్ష్దీప్ నాథ్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ముఖ్యంగా యువ ఆటగాడు అక్ష్దీప్ సిక్స్‌లు కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో వైపు పార్థీవ్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడుతూనే అర్దసెంచరీ పూర్తి చేశాడు. అయితే స్కోర్ పెంచే యత్నంలో భారీ షాట్లకు యత్నించి అక్ష్దీప్(24) అవుటయ్యాడు. అనంతరం వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుందునుకున్నారు. అయితే చివర్లో మొయిన్ అలీ(26) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో చహర్, జడేజా, బ్రేవో తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తాహీర్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. -
రహానే, విజయ్ విఫలం
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావిస్తున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటగా... మరో ఇద్దరు విఫలమయ్యారు. తొలి రోజు భారత్ నాలుగు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. న్యూజిలాండ్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 340 పరుగులు చేసింది. హనుమ విహారి (150 బంతుల్లో 86; 8 ఫోర్లు), వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (111 బంతుల్లో 79 బ్యాటింగ్; 10 ఫోర్లు), ఓపెనర్ పృథ్వీ షా (88 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు టెస్టు జట్టులో స్థానం లేని మయాంక్ అగర్వాల్ (108 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (12), ఓపెనర్ మురళీ విజయ్ (64 బంతుల్లో 28; 4 ఫోర్లు) మాత్రం ఈ అవకాశాన్ని సమర్థంగా వాడుకోలేకపోయారు. తొలి వికెట్‌కు విజయ్‌తో 61 పరుగులు జోడించిన షా, రెండో వికెట్‌కు మయాంక్‌తో 50 పరుగులు జత చేశాడు. అనంతరం ఆంధ్ర ఆటగాడు విహారి చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. విహారి, మయాంక్ మధ్య మూడో వికెట్‌కు 73 పరుగులు జతకూడాయి. మయాంక్, రహానే 18 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. టెస్టు జట్టులో పునరాగమనాన్ని ఆశిస్తున్న న్యూజిలాండ్ పేసర్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రహానే బౌల్డయ్యాడు. అయితే ఆ తర్వాత విహారి, పార్థివ్ మధ్య మరో భారీ భాగస్వామ్యం నెలకొంది. ధాటిగా ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. అయితే సెంచరీ దిశగా దూసుకుపోతున్న విహారి చివరి ఓవర్ నాలుగో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసింది. -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనాద్కట్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
‘ధోని శకంలో పుట్టడమే నా పొరపాటు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిన కారణంగా అప్పట్లో తన స్థానాన్ని ఎంఎస్ ధోనికి కోల్పోయినట్లు పార్థీవ్ పటేల్ వెల్లడించాడు. ధోని కంటే ముందే భారత జట్టు తరఫున వికెట్ కీపర్లుగా ఆడిన పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్ ఆ తర్వాత దాదాపు దశాబ్దకాలం మళ్లీ జట్టు దరిదాపుల్లోకి రాలేకపోయారు. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ తన మార్క్ కీపింగ్, బ్యాటింగ్‌తో ధోని ప్రత్యేకతను చాటుకోవడంతో భారత సెలక్టర్లు మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించే అవసరమే లేకపోయింది. కానీ.. 2014లో టెస్టులకి ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ తర్వాత టీమిండియాలోకి వృద్ధిమాన్ సాహా, పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్‌ల పునరాగమనానికి మార్గం సుగుమమైంది. తాము మెరుగ్గా ఆడలేకపోవడంతోనే ధోని వైపు సెలక్టర్లు మొగ్గు చూపారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్థీవ్ పటేల్ వెల్లడించాడు. 'నాతో చాలా మంది చెప్తుంటారు.. ధోని పుట్టిన తరంలో పుట్టడం నా దురదృష్టమని. కానీ.. ధోని కంటే ముందే నేను భారత జట్టులో ఆడాను. అక్కడ నేను బాగా ఆడింటే.. ధోనిని జట్టులోకి తీసుకొచ్చేవారు కాదు కదా.? కాబట్టి నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు. జట్టులో చోటు కోల్పోవడానికి కారణంగా అత్యుత్తమంగా ఆడలేకపోవడమే. నా ఈ స్థితికి ఒకరిని విమర్శించడం కంటే ధోనీ తరంలో పుట్టడం నా పొరపాటు అని సర్దిచెప్పుకోవడం బాగుంటుంది. ధోని ఓ లెజెండ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని పార్థీవ్ పటేల్ పేర్కొన్నాడు. -
స్మిత్, వార్నర్ లేకున్నా నష్టం లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం దురదృష్టకరమని భారత క్రికెటర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లపై వేటు అనేది టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లున్నాయరని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ అనేది బిగ్ బ్రాండ్ అని అందులో కేవలం ఇద్దరు క్రికెటర్లు ఆడకపోతే వచ్చే నష్టమేం లేదన్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ పార్థీవ్ పటేల్‌ను రూ.1.7 కోట్లకు తీసుకున్న విషయం తెలిసిందే. 'ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగినా ఐపీఎల్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ మెగా టోర్నీపై ప్రభావం చూపించదు. ఐపీఎల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సాధ్యమైనంత వరకు జట్టు ప్రయోజనాల కోసం శాయశక్తులా కృషి చేస్తాను. అంతకంటే ముఖ్యంగా భారత జట్టులో వికెట్ కీపర్లకు చాలా పోటీ ఉంది. ఓ వైపు దినేశ్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడితే మరోవైపు దేశవాలీలో వృద్ధిమాన్ సాహా రాణిస్తున్నాడు. జట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఇతర దేశాల జట్లతో పోల్చితే భారత జట్టులో కీపర్‌గా స్థానం దక్కించుకోవడం చాలా కష్టమని' పార్థీవ్ వివరించాడు. కాగా, బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాదిపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సీఏ నిర్ణయం అనంతరం ఐపీఎల్‌లోనూ ఈ సీజన్ నుంచి స్మిత్, వార్నర్‌లను నిషేధిస్తున్నామని, వేరే క్రికెటర్లను తీసుకోవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు స్మిత్, వార్నర్ స్థానాలను మరో ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాయి. -
భారత్ వికెట్లు టప..టపా
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది. పుజారా(50), పార్దీవ్‌పటేల్(2), హార్దిక్ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. తొలుత కెప్టెన్ కోహ్లి తరహాలోనే టీమిండియా నయావాల్ చతేశ్వర పుజారా హాఫ్ సెంచరీ అనంతరం ఆండిల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్(2) సైతం మోర్కెల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఆవెంటనే క్రీజులో వచ్చిన ఆల్‌రౌండర్ పాండ్యా ఆండిల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డికాక్ చిక్కాడు. 144 పరుగుల వద్దే భారత్ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో భారత్ 144 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో భువనేశ్వర్(4), మహ్మద్ షమీ(0) ఉన్నారు. అంతకు ముందు పుజారా 178 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక కెప్టెన్ కోహ్లి(54) వికెట్ అనంతరం భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడల్లా కుప్ప కూలింది. -
అంకిత్ బావ్నే భారీ సెంచరీ
విజయవాడ: న్యూజిలాండ్ 'ఎ' తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత 'ఎ' ఆటగాడు అంకిత్ బావ్నే(162;245 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. అతనికి జతగా పార్థివ్ పటేల్ (65;101 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. ఫలితంగా భారత్ 'ఎ' తన తొలి ఇన్నింగ్స్ లో 447 పరుగులు చేసింది. 360/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత 'ఎ' ఆదిలోనే పార్దీవ్ ను ఐదో వికెట్ గా కోల్పోయింది. పార్దీవ్ అవుటైన కాసేపటికి శార్దూల్ ఠాకూర్ (5) అవుటయ్యాడు. ఆపై 116 పరుగుల ఓవర్ నైట్ స్కోరు బ్యాటింగ్ కొనసాగించిన అంకిత్ బావ్నే నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కాగా, మరో ఎండ్ నుంచి అతనికి సహకారం కరువైంది. వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో అంకిత్ బ్యాట్ ఝుళిపించాడు. ఆ క్రమంలోనే భారత్ 'ఎ' నాలుగొందల పరుగుల మార్కును చేరింది. అంకిత్ బావ్నే చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 'ఎ' 236 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 447 ఆలౌట్ -
అంకిత్ బావ్నే సెంచరీ
సాక్షి, విజయవాడ: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంకిత్ బావ్నే (166 బంతుల్లో 116 బ్యాటింగ్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీ, పార్థివ్ పటేల్ (78 బంతుల్లో 56 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 154 పరుగులు జోడించడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 33/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో నాలుగు వికెట్లకు 360 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత్ ‘ఎ’ 149 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడాడు. ప్రియాంక్ పాంచల్ (46; 7 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ (79 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 133 పరుగులు జత చేశాక అవుటయ్యాడు. అయ్యార్ అవుటయ్యాక స్కోరు బోర్డుకు మరో తొమ్మిది పరుగులు కలిశాక ప్రియాంక్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కరుణ్ నాయర్ (43; 7 ఫోర్లు), అంకిత్ బావ్నే నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించి భారత్ ‘ఎ’ స్కోరును 200 పరుగులు దాటించారు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న నాయర్‌ను స్పిన్నర్ సోధి అవుట్ చేయడంతో భారత్ ‘ఎ’ నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం అంకిత్ బావ్నే, పార్థివ్ పటేల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. -
సెలెక్టర్ల కోసం క్రికెట్ ఆడను: పార్థివ్
ముంబై: భారత జట్టులో చోటు కోసం సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు తాను క్రికెట్ ఆడటంలేదని వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. ఆదివారం ముగిసిన ఐపీఎల్–10లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన పార్థివ్, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన భారత తుది జట్టులో చోటు దక్కనందుకు బాధేం లేదని చెప్పాడు. ‘నిజం చెప్పాలంటే సెలక్షన్స్ గురించి ఆలోచించను. అది నా పని కాదు. సెలెక్టర్ల దృష్టిలో పడేందుకే క్రికెట్ ఆడను. చాలా ఏళ్లుగా ఈ ఆటలో ఉన్నా. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా. ఈ ఏడాది నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో పునరాగమనం, టైటిల్ విజేత ముంబై ఇండియన్స్‌లో భాగమవడం చాలా ఆనందాన్నిచ్చింది. నా ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తా జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి’ అని పార్థివ్ పేర్కొన్నాడు. -
కెప్టన్లుగా రోహిత్ ,పార్థివ్
►ఇండియా ‘బ్లూ’ కెప్టెన్‌గా రోహిత్ ►‘రెడ్’ జట్టు సారథిగా పార్థివ్.. ►దేవ్‌ధర్ ట్రోఫీ కోసం జట్ల ప్రకటన ముంబై: ఈనెల 25 నుంచి జరిగే దేవ్‌ధర్ ట్రోఫీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా ‘రెడ్’ జట్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ‘బ్లూ’కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ‘రెడ్’ జట్టుకు పార్థివ్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ విజేత హోదాలో తమిళనాడు మూడో జట్టుగా బరిలోకి దిగనుంది. ‘బ్లూ’ జట్టులో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అంబటి రాయుడు, శార్దుల్ ఠాకూర్ చోటు దక్కించుకోగా.. ‘రెడ్’ జట్టులో శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి స్థానం పొందారు. ఇండియా బ్లూ జట్టు: రోహిత్ (కెప్టెన్), హర్భజన్, మన్దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, రాయుడు, మనోజ్ తివారీ, రిషబ్ పంత్, దీపక్ హూడా, క్రునాల్ పాండ్య, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, శార్దుల్, ప్రసిధ్ కృష్ణ, పంకజ్ రావు. ఇండియా రెడ్ జట్టు: పార్థివ్ (కెప్టెన్), ధావన్, మనీశ్, మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, ఇషాంక్ జగ్గీ, గుర్కీరత్ మాన్, అక్షర్, అక్షయ్ కర్నేవార్, అశోక్ దిండా, కుల్వంత్ ఖెజ్రోలియా, ధావల్, గోవిందా పొద్దార్. -
ఇండియా ‘బ్లూ’కు రోహిత్..‘రెడ్’కు పార్థివ్
దేవదార్ ట్రోఫీ లో భారత బ్యాట్‌మెన్స్‌లు రోహిత్ శర్మ ఇండియా ‘బ్లూ’ టీంకు, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇండియా రెడ్ టీంకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ఇండియా బ్లూలో, శిఖర్ ధావన్‌కు ఇండియా రెడ్‌లో చోటు దక్కింది. ఈ రెండు జట్లతో పాటు విజయ్‌హజారే ట్రోఫీ విజేత తమిళనాడు కూడా ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి 29 వరకు విశాఖపట్నంలో డీబీ దేవదార్ ట్రోఫీ జరుగనుంది. ఇండియా బ్లూ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), మన్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మనోజ్ తివారీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, హర్భజన్ సింగ్, క్రునాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్, సిద్ధార్త్ కౌల్, శార్థూల్ ఠాకూర్, కృష్ణ, పంకజ్ రావ్. ఇండియా రెడ్ జట్టు: పార్థివ్ పటేల్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), శిఖర్ ధావన్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, ఇషాంక్ జగ్గీ, గుర్కీరత్ మన్; అక్సర్ పటేల్, అక్షయ్ కామేశ్వర్, అశోక్ దిండా, కుల్వంత్ ఖేజ్రోలియా, ధావల్ కులకర్ణి, గోవింద పొద్దర్ -
పార్థీవ్ అవుట్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. మంగళవారం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత టెస్టు జట్టులో పార్థీవ్ పటేల్ కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో పార్థీవ్ రాణించినప్పటికీ అతని తాజా ఎంపికపై సెలక్టర్లు మొగ్గు చూపలేదు. కాగా, తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకుంద్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. 2011 జూలై నెలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ముకుంద్ చివరిసారి ఆడాడు. ఇదిలా ఉండగా భారత జట్టులో మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహాలు తిరిగి చోటు దక్కించుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావడంతో వారికి స్థానం కల్పించారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన ఇరు జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత ఎంపిక చేసిన జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా -
పార్థీవ్ పటేల్‌కు కోపం వచ్చింది!
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టులో రెగ్యులర్ కీపర్ గా తమ తొలి ప్రాధాన్యత వృద్ధిమాన్ సాహాకే అని ఇటీవల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పార్థివ్ వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగైనా, సాహానే మా అత్యుత్తమ వికెట్ కీపర్’ అని ఎంఎస్కే స్పష్టం చేశాడు. ఇదే నిర్ణయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దాదాపు సమర్ధించాడు. తమ రెండో కీపర్ పార్ధీవ్ అంటూ విరాట్ తెలిపాడు. అయితే ఇదే విషయంపై పార్ధీవ్ పటేల్ పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ ఎవర్నీ విమర్శించకుండానే తన మనసులోని మాటను పార్థీవ్ బహిర్గతం చేశాడు. 'నేను భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదు. ఆ సమయంలో సంతోషంగా జట్టు నుంచి తప్పుకున్నా. నేను విపరీతంగా శ్రమించే తిరిగి చాలా ఏళ్ల తరువాత జట్టులో స్థానం దక్కించుకున్నా. కేవలం భారత జాతీయ జట్టులో స్థానం కోసమే నేను క్రికెట్ ఆడటం లేదు. వికెట్ కీపర్‌గా నాకు కొన్ని పరిమితులున్నాయి.. అదే క్రమంలో లక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని సాధించడం కోసం నేను ఎప్పుడూ యత్నిస్తూ ఉంటా. దీనిలో భాగంగానే నా మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటా. నేను భారత జట్టులోకి తిరిగి ఎలా వచ్చానో నాకు తెలుసు. నేను సత్తా చాటాను కాబట్టే జట్టులో స్థానం దక్కింది. నాకు గేమ్ అంటే ఇష్టం. ఆ క్రమంలోనే ఇప్పటికీ ఆడుతున్నా. కేవల భారత జట్టులో స్థానం కోసమైతే కాదు' అని పార్థీవ్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల పార్థీవ్ పటేల్ ఎనిమిదేళ్ల తరువాత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే సాహా తిరిగి కోలుకోవడంతో పార్థీవ్ ను రెండో కీపర్‌గా పరిమితం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మన చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే చేసిన వ్యాఖ్యలు పార్థీవ్కు కోపాన్ని తెప్పించినట్లు కనబడుతోంది. -
గుజరాత్ గుబాళింపు
తొలిసారి రంజీ ట్రోఫీ సొంతం ఫైనల్లో ముంబైపై విజయం ఇండోర్: కెప్టెన్ పార్థివ్ పటేల్ (143; 24 ఫోర్లు) వీరోచిత సెంచరీ సాధించి గుజరాత్ క్రికెట్ జట్టు కల నెరవేర్చాడు. ముంబై జట్టుతో జరిగిన ఫైనల్లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది. ముంబై నిర్దేశించిన 312 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ 89.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. 89 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను పార్థివ్ పటేల్, మన్‌ప్రీత్ జునేజా (54; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. జునేజా అవుటయ్యాక రుజుల్ భట్ (27 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి పార్థివ్ ఐదో వికెట్‌కు 94 పరుగులు జతచేశాడు. విజయానికి 13 పరుగుల దూరంలో ఉన్నపుడు పార్థివ్ అవుటైనా రుజుల్, చిరాగ్ గాంధీ (11 నాటౌట్) మరో వికెట్ పడకుండా గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు భారత దేశవాళీలో జరిగే మూడు ఫార్మాట్ల టోర్నీలు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే, సయ్యద్ ముస్తాక్ అలీ టి20) నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలిసారి రంజీ ట్రోఫీ నెగ్గిన తమ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం రూ. 3 కోట్లు నజరానాగా ప్రకటించింది. -
చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్
ఏడు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తమ రాష్ట్ర జట్టు చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని అందించాడు. అవును.. పాలబుగ్గల పసివాడిగా టీమిండియాలోకి ప్రవేశించిన పార్థివ్ పటేల్ జాతీయ జట్టుకు దూరమైనా, దేశవాళీ మ్యాచ్‌లలో మాత్రం ఇరగదీస్తున్నాడు. రంజీట్రోఫీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గుజరాత్ జట్టుకు అందని పండుగానే మిగిలిపోయిన విజయాన్ని అందించిపెట్టాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 143 పరుగులు చేసి ఒక రకంగా ఒంటిచేత్తో ట్రోఫీని ఇచ్చాడు. దాంతోపాటు 42వ సారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించాలనుకున్న ముంబై ఆశల మీద నీళ్లు చల్లాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై జట్టు మీద 5 వికెట్ల తేడాతో గుజరాత్ నెగ్గి రంజీట్రోఫీని కైవసం చేసుకుంది. విజయానికి 312 పరుగులు కావల్సిన దశలో వికెట్ నష్టపోకుండా 47 పరుగుల స్కోరుతో ఆట ప్రారంభించిన గుజరాత్ జట్టులో అప్పటికి ప్రియాంక్ పాంచాల్ 34 పరుగులతోను, సమిత్ గోహిల్ 5 పరుగులతోను క్రీజ్‌లో ఉన్నారు. అయితే గోహిల్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ నాయర్ ఔట్ చేయడంతో ఇక కష్టమనుకున్నారు. కానీ అప్పుడు మన్‌ప్రీత్ జునేజాకు జోడీగా కెప్టెన్ పార్థివ్ పటేల్ బరిలోకి దిగాడు. వీళ్లిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు మ్యాచ్‌నే గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన పార్థివ్‌కు జునేజా మంచి అండగా నిలిచాడు. వీరి భాగస్వామ్యాన్ని అఖిల్ హెర్వాద్కర్ విడగొట్టాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జునేజా ఔటయ్యాడు. అయితే, సులభమైన క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు వదిలేయడంతో గుజరాత్ పని కొంతవరకు సులువైందని చెప్పుకోవచ్చు. చివర్లో వచ్చిన చిరాగ్ గాంధీ కూడా తనవంతు సాయం చేయడంతో గుజరాత్ రంజీట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. నిజానికి రంజీట్రోఫీ కోసం ఏడు దశాబ్దాల నుంచి గుజరాత్ ఎదురుచూస్తోంది. అసలు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు ఆ తర్వాత కనీసం రన్నరప్‌గా కూడా నిలవలేదు. 65 ఏళ్ల తర్వాత రాకరాక వచ్చిన అవకాశాన్ని పార్థివ్ బృందం సరిగ్గా ఉపయోగించుకుంది. రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టును మట్టికరిపించింది. గత తొమ్మిది సార్లుగా గెలుస్తూ వచ్చిన ఆ జట్టును బోల్తా కొట్టించింది. స్కోర్లు: ముంబై 228, 411, గుజరాత్ 328, 313/5 -
చెలరేగిన పార్థివ్.. చరిత్ర సృష్టించిన గుజరాత్
-
ఎవరు గెలిచినా చరిత్రే
42వ టైటిల్‌పై ముంబై దృష్టి తొలిసారి నెగ్గేందుకు గుజరాత్ ఆరాటం నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్ ఇండోర్: ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడు దశాబ్దాల ఎదురుచూపుల అనంతరం గుజరాత్ జట్టుకు అపూర్వ అవకాశం దక్కింది. తమ రంజీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటిదాకా ఆ జట్టు చాంపియన్‌గా నిలి చింది లేదు. అయితే ఈసారి మాత్రం విజేతగా నిలిచే అవకాశం వారి ముంగిట నిలి చింది. నేటి (మంగళవారం) నుంచి రంజీ రారాజు ముంబై జట్టుతో జరిగే తుది సమరంలో పార్థివ్ పటేల్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. అప్పుడెప్పుడో 1950–51లో ఈ జట్టు రంజీ ఫైనల్‌కు చేరినా తమ కలను నెరవేర్చుకోలేకపోయింది. అప్పటి నుంచి కనీసం రన్నరప్‌గా నిలిచే అవకాశం కూడా దక్కలేదు. 65 ఏళ్ల అనంతరం ఈసారి తమ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక మరోవైపు రంజీ టైటిల్‌ను మంచినీళ్ల ప్రాయంలా తమ ఖాతాలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. 45 సార్లు ఈ జట్టు రంజీ ఫైనల్లోకి రాగా... ఏకంగా 41 సార్లు విజేతగా నిలిచిందంటే వీరి హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా 1990–91 సీజన్ ఫైనల్లో హరియాణా చేతిలో ముంబై ఓడిపోయింది. అప్పటి నుంచి తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరగా ప్రతిసారీ ముంబైనే విజేతగా నిలిచింది. బుమ్రా దూరం: బరిలోకి దిగకముందే గుజరాత్ జట్టు తమ కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కోల్పోవాల్సి వచ్చింది. ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం అతను జాతీయ జట్టులో చేరనున్నాడు. అయితే జార్ఖండ్‌తో జరిగిన సెమీస్‌లో ఆర్పీ సింగ్ తన కెరీర్లోనే అద్భుత గణాంకాలు (6/29) నమోదు చేసి ఫుల్ జోష్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చేదే. రుష్ కలారియా, మెహుల్ పటేల్ కూడా బౌలింగ్ బాధ్యతను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్‌లో ప్రియాంక్ పాంచల్ ఇప్పటికే సీజన్లో అత్యధిక పరుగులు (1,270) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరో ఓపెనర్ సమిత్ గోహెల్ (889 పరుగులు) కూడా మంచి ఫామ్‌లో ఉండడంతో జట్టుకు శుభారంభం అందనుంది. జునేజా, పార్థివ్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. సమష్టి బలంతో బరిలోకి: సీజన్ ఆద్యంతం ఆటగాళ్లు గాయాల బారిన పడినా ముంబై జట్టు తమ రిజర్వ్ బెంచ్ సత్తా ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించింది. సెమీఫైనల్‌కు ముందు జట్టులో చేరిన టీనేజి సంచలనం పృథ్వీ షా తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి జట్టు విజయానికి కారకుడయ్యాడు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కెప్టెన్ ఆదిత్య తారే, సిద్దేష్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ విజయ్ గోహిల్ ఇప్పటికే 27 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేసర్లు శార్దుల్ ఠాకూర్, బల్విందర్ సంధూ కీలకం కానున్నారు. ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–4లో ప్రత్యక్ష ప్రసారం -
'నాకు పార్థీవ్‌తో పోటీ లేదు'
కోల్‌కతా:ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో భాగంగా మొహాలి టెస్టు ద్వారా తిరిగి జాతీయ క్రికెట్ జట్టులోకి పునరాగమనం చేసి ఆకట్టుకున్న భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌తో తనకు ఎటువంటి పోటీ లేదని మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పష్టం చేశాడు. తాను ఏ ఒక్క ఆటగాడికి పోటీనే కాదని పేర్కొన్న వృద్ధిమాన్.. తన అవకాశాలపై కూడా ఎటువంటి ఆందోళన లేదన్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా మోహన్ బగాన్ తరుపున ఆడటానికి ఇక్కడకు విచ్చేసిన సాహా.. అసలు పార్థీవ్‌తో తనకు పోటీ ఉందని భావించడం లేదన్నాడు. 'పార్థీవ్‌తో పోటీ ఉందని అనుకోవడం లేదు. జాతీయ జట్టుకు తిరిగి ఆడాలనే క్రమంలో పార్థీవ్ విపరీతంగా శ్రమించాడు. టెస్టు సిరీస్‌లో పార్థీవ్ మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. మా ఎంపికపై సెలక్టర్లకు ఏదైతే సరైనది అనిపిస్తోంది అదే చేస్తారు. అదంతా ఓపెన్ గానే ఉంటుంది. దీని గురించి పెద్దగా పట్టించుకోను. అలా అని మరొక ఆటగాడి ప్రదర్శనపై కూడా ఎటువంటి ఆందోళన లేదు' అని సాహా పేర్కొన్నాడు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌లో 65.00 సగటుతో పార్థీవ్ 195 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలను పార్థీవ్ నమోదు చేశాడు. అదే సిరీస్ లో సాహా రెండు మ్యాచ్ లు ఆడి 12.25 సగటుతో 49 పరుగులు మాత్రమే చేశాడు. -
ఓపెనర్లు ఇరగదీశారు..
-
ఓపెనర్లు ఇరగదీశారు..
చెన్నై:ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్‌లు ఇరగదీశారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలుత కేఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికీ పార్థీవ్ 81 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే టీమిండియా ఓపెనర్లు సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 31 ఇన్నింగ్స్ ల తరువాత ఇదే తొలిసారి. 2015 జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని చివరిసారి సాధించింది. అప్పట్నుంచి ఈ ఇన్నింగ్స్ ముందు వరకూ చూస్తే టీమిండియా ఓపెనింగ్ యావరేజ్ 24.72గా ఉంది. ఇదిలా ఉంచితే 2011 నుంచి చూస్తే టీమిండియా ఓపెనర్లు 50 కు పైగా వ్యక్తిగత స్కోరు సాధించడం ఇది నాల్గోసారి మాత్రమే. 60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును కదిలిస్తోంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు పార్థీవ్, రాహుల్‌లు సమయోచితంగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, పార్థీవ్ పటేల్(71) భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. దాంతో ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. -
అంతా బాగుంది...
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన కోచ్ అనిల్ కుంబ్లేకు ఆనందాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా బౌలర్లు రాణిస్తున్న తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి ఫీల్డింగ్ ఏర్పాట్లతో బౌలింగ్ ప్రణాళికలకు కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగో టెస్టు ప్రారంభానికి రెండు రోజుల ముందు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని మ్యాచ్‌లలో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అది ఇన్నింగ్సలో ఐదు వికెట్లు తీయడం కావచ్చు లేదా అసలైన సమయంలో తీసిన ఒకే ఒక వికెట్ కావచ్చు. మూడు వేర్వేరు పిచ్‌లపై కూడా ఫలితం సాధించగలిగాం. దాని ప్రకారమే లెంగ్తను సరిదిద్దుకొని బౌలింగ్ చేయగలిగాం. కోహ్లి ఫీల్డింగ్ ఆలోచనలు, బౌలర్లు శ్రమకు తగిన గుర్తింపును తెచ్చేలా చేశాయి’ అని కుంబ్లే అన్నారు. సాధారణంగా ఆటగాళ్ల మధ్య పోలికలను తాను ఇష్టపడనని... షమీ, ఉమేశ్ ఇద్దరూ చాలా బాగా ఆడుతున్నారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఆట ముగిసే సమయంలో చివరి స్పెల్‌లో కూడా వారిద్దరు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి వికెట్లు తీయగలిగారు. ముఖ్యంగా 18 నెలల విరామం తర్వాత క్రికెట్లోకి వచ్చిన షమీ ఆడుతున్న తీరు స్ఫూర్తిదాయకం’ అని కుంబ్లే అన్నారు. మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు కూడా అర్ధ సెంచరీ సాధించడం అద్భుతమన్న దిగ్గజ స్పిన్నర్, ఈ ఇన్నింగ్స జడేజాలో ఆత్మవిశ్వాసం పెంచిందన్నారు. విజయ్ చెలరేగుతాడు... ఓపెనర్ మురళీ విజయ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడనే విమర్శను కుంబ్లే కొట్టిపారేశారు. ‘గత రెండేళ్లుగా మా జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ విజయ్. రాజ్‌కోట్‌లో అతను సెంచరీ కూడా చేశాడు. సిరీస్‌లో ఒకే తరహాలో అవుటైనా, షార్ట్ పిచ్ బంతి అతని బలహీనత కాదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్, త్వరలోనే మరో భారీ ఇన్నింగ్స ఆడతాడు’ అని కోచ్ సమర్థించారు. మరోవైపు పదే పదే ఓపెనర్లు మారుతున్నా, భారత్ బాగా ఆడుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటలో గాయాలు సహజమని, కోలుకున్న లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఆడిన రోజులతో పోలిస్తే, తర్వాతి కాలంలో ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు శ్రద్ధ పెరిగిందని, ఇప్పుడు భారత జట్టు అత్యంత ఫిట్‌గా కనిపిస్తోందని కుంబ్లే అన్నారు. మరోవైపు డీఆర్ఎస్ వినియోగంపై తమ ఆటగాళ్లంతా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్థివ్ పటేల్ కొనసాగింపు... వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా మూడో టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ పటేల్‌కు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులోనూ అతను ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. సాహా కోలుకున్నా... ముందు జాగ్రత్తగా అతనికి మరింత విశ్రాంతి కల్పించినట్లు బోర్డు చెప్పింది. మొహాలీ టెస్టులో పార్థివ్ రెండు ఇన్నింగ్సలలో 42, 67 నాటౌట్ పరుగులు చేశాడు. ‘ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు ఆడినా పార్థివ్ ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదు. కీపర్‌గా, అప్పటికప్పుడు ఓపెనర్‌గా కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చాడు. కష్టానికి ఎప్పటికై నా గుర్తింపు లభిస్తుందని అతని పునరాగమనం చూపించింది. తన 16 ఏళ్ల వయసులోనే అతను ఒకసారి జట్టును ఓటమినుంచి రక్షించాడు. గడ్డం గీసుకుంటే ఇప్పటికీ అతను 16 ఏళ్లవాడిలాగానే కనిపిస్తాడు’ అని పార్థివ్ గురించి కుంబ్లే వ్యాఖ్యానించారు. -
పార్థీవ్కు లైన్ క్లియర్
ముంబై: మరో రెండు రోజుల్లో నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో ఆరంభం కానున్న నాల్గో టెస్టులో భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఆడేందుకు లైన్ క్లియరైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ను నాల్గో టెస్టులో ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించారు. మొహాలీలో మూడో టెస్టుకు ముందు సాహా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో అనూహ్యంగా పార్థీవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత జట్టులో పునరాగమనం చేసిన పార్థీవ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నాల్గో టెస్టులో ఆడనున్నాడు. అతను గాయం నుంచి తిరిగి కోలుకోవడంతో జట్టులో ఎంపికయ్యాడు. నాల్గో టెస్టులో మురళీ విజయ్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఆ క్రమంలోనే పార్థీవ్ టాపార్డర్‌లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. మరొకవైపు పేసర్ ఇషాంత్ శర్మను జట్టు స్వ్కాడ్ నుంచి విడుదల చేశారు.డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. వారణాసికి చెందిన ప్రతీమా సింగ్‌తో ఇషాంత్ శర్మ పెళ్లి జరుగనుంది. ఆ నేపథ్యంలో ఇషాంత్ కు విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. -
పార్థీవ్ అతుక్కుపోయాడా?
ముంబై:భారత క్రికెట్ జట్టు..ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రత్యర్థి జట్లకు కఠినమైన సవాల్ విసురుతున్న జట్టు. ప్రత్యేకంగా టెస్టుల్లో భారత్ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు అనేక అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుని టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, ఓవరాల్‌గా భారత క్రికెట్ జట్టులో తీవ్రమైన పోటీ నెలకొంది. అటు వన్డేల్లో కానీ ఇటు టెస్టుల్లో కానీ యువ క్రికెటర్లు తమను నిరూపించుకుంటూ భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లగా స్థిరపడే యోచనలో ఉన్నారు. గతంలో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు మనీష్ పాండే, అజింక్యా రహానే విషయంలో ఇదే పోటీని చూశాం. వన్డేల్లో ఏడోస్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల అన్వేషణలో వీరి మధ్య పోటీ సాగింది. ఆ తరువాత భారత జట్టులో చాలా మంది ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దగ్గర్నుంచీ కేదర్ జాదవ్, జయంత్ యాదవ్‌లు ఇప్పటికే తమను నిరూపించుకున్నా ఇంకా వారి రెగ్యులర్ స్థానంపై భరోసా అయితే లేదు. దానికి కారణం భారత జట్టులో తీవ్రమైన పోటీనే. ఇదే సమయంలో ఎనిమిదేళ్ల తరువాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తన స్థానంపై ఆశలు పెట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొహాలిలో జరిగిన మూడో టెస్టులో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పార్థీవ్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన పార్థీవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు. తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయిందనుకున్న తరుణంలో పార్థీవ్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఇలా భారత జట్టులో సుదీర్ఘ కాలం తరువాత పునరాగమనం చేయడం రికార్డే అయినా, అందుకు కారణం మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలే. ఈ విషయాన్ని పార్థీవ్ స్వయంగా చెప్పాడు కూడా. ఒకవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో విశేషంగా రాణిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సైతం పక్కకు పెట్టి, పార్థీవ్ కు అవకాశం కల్పించారు. దేశవాళీ టోర్నీల్లో పార్థీవ్ కూడా మెరుగ్గా రాణించడంతోనే అతని ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ తరుణంలో సెలక్టర్లకు పార్థీవ్ నుంచి ఊహించని సవాలే ఎదురవుతుందనే చెప్పాలి. ఎటువంటి తడబాటు లేకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంతో పార్థీవ్ను ఉన్నపళంగా తప్పించే కారణాలు కనబడుటం లేదు. మరొవైపు ఇంగ్లండ్ తో ముంబైలో జరిగే నాల్గో టెస్టులో పార్థీవ్ ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా వృద్దిమాన్ సాహా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో పార్థీవ్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. ఒకవేళ ఆ టెస్టులో కూడా పార్థీవ్ మరోసారి రాణిస్తే మాత్రం సెలక్టర్లకు తలనొప్పి తప్పకపోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని టెస్టులకు వీడ్కోలు చెప్పిన తరువాత సాహానే భారత జట్టుకు రెగ్యులర్ కీపర్‌గా మారిపోయాడు. ఈ సమయంలో పార్థీవ్ నుంచి పోటీ ఏర్పడటంతో సాహా కూడా మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిఉంది. ఇటీవల కాలంలో భారత వెటరన్ క్రికెటర్లకు అవకాశాలు కల్పించడంలో కోహ్లి, కుంబ్లే వెనుకడుగు వేయడం లేదు. ఇదే తరహాలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్టులో గంభీర్ అవకాశం ఇచ్చారు. ఆ విషయాన్నిపక్కకు పెడితే ప్రస్తుతం అటు బ్యాటింగ్ లోనూ ఇటు కీపింగ్‌లోనూ తనదైన మార్కుతో సత్తా చాటుకున్న పార్థీవ్.. భారత జట్టులో జెండా పాతినట్లే కనబడుతోంది. మరోసారి పార్థీవ్ చెలరేగితే మాత్రం అతను జట్టులో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. -
'ఇదొక అద్భుతమైన క్షణం'
మొహాలీ:దాదాపు ఎనిమిదేళ్ల తరువాత భారత క్రికెట్ జట్టు జెర్సీ ధరించడంపై వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే తాను జట్టులోకి తిరిగి వస్తున్నప్పుడు జట్టు సభ్యుల నుంచి లభించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నాడు. ప్రత్యేకంగా తన పునరాగమనంలో కెప్టెన్ విరాట్ కోహ్లి పాత్ర వెలకట్టలేనిదని పార్థీవ్ కొనియాడాడు. 'ఇంత సుదీర్ఘ కాలం తరువాత తిరిగి భారత క్రికెట్ జట్టులోకి వస్తానని ఏనాడు అనుకోలేదు. ఇది నిజంగానే అద్భుతమైన క్షణం. డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులతో కలిసి అనుభవాల్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ జట్టుకు ఆడటం ఒక అరుదైన గౌరవం. గతంలో నేను చాలా టెస్టు మ్యాచ్‌లు ఆడినా, విన్నింగ్స్ రన్స్ ను ఎప్పుడూ చేయలేదు. ఇంగ్లండ్ తో మూడో టెస్టులో మ్యాచ్‌ను నా చేతుల్తోనే ఫినిష్ చేసినందుకు ఒకింత గర్వంగా ఉంది. అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లి.. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశాడు' అని పార్థీవ్ పేర్కొన్నాడు. చాలా కాలం నుంచి దేశవాళీ మ్యాచ్‌ల్లో బాగా ఆడుతున్నాననే విషయం తనకు తెలుసని పార్థీవ్ అన్నాడు. ఇదే జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి కారణమైందన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఫామ్‌నే అంతర్జాతీయ మ్యాచ్‌లో కూడా కొనసాగించినట్లు పార్థీవ్ తెలిపాడు. మూడో టెస్టుకు ముందు కీపర్ వృద్థిమాన్ సాహా గాయపడటంతో అనూహ్యంగా పార్థీవ్ చోటు దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అటు కీపింగ్ లో రాణించడంతో పాటు, ఇటు బ్యాటింగ్ లో కూడా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
సహచరుల ప్రోత్సాహం వల్లే...
పార్థీవ్ పటేల్ న్యూఢిల్లీ: సహచరులు ప్రోత్సహించడం వల్లే పునరాగమనంలో రాణించగలిగానని పార్థీవ్ పటేల్ అన్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్సల్లోనూ రాణించిన సంగతి తెలిసిందే. ‘కెప్టెన్ కోహ్లి సహా మిగతా ఆటగాళ్లు నన్ను పునరాగమనం చేసిన ఆటగాడిగా చూడలేదు. ఇదే నేను నూతనోత్సాహంతో ఆడేందుకు దోహదపడింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న ఈ వాతావరణమే ఒత్తిడి లేకుండా రాణించేందుకు ఉపయోగపడింది’ అని ఈ గుజరాత్ వికెట్ కీపర్ అన్నాడు. దేశానికి ఆడటమే గొప్ప గౌరవమని చెప్పిన పార్థీవ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి జట్టులోకి రావడమనేది కష్టమైన పని అని అన్నాడు. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణించడం కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యేందుకు దోహదపడిందని పార్థీవ్ చెప్పాడు. తొలి ఇన్నింగ్సలో 42 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్సలో అజేయంగా 67 పరుగులు చేశాడు. -
మూడో టెస్టులో భారత్ ఘనవిజయం
-
అలవోకగా ముగించారు
మూడో టెస్టులో భారత్ ఘనవిజయం 8 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు సిరీస్‌లో 2-0తో ఆధిక్యం డిసెంబర్ 8 నుంచి నాలుగో టెస్టు గెలవడం కాస్త ఆలస్యం అరుుందేమో గానీ... గెలుపు మాత్రం అనాయాసంగానే వచ్చింది. ఊహించినదానికి భిన్నంగా నాలుగో రోజు ఆట చివరి సెషన్ వరకు వెళ్లినా, భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ముందుగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ పని పట్టిన కోహ్లి సేన, ఆ తర్వాత చిన్నపాటి లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది. ఆల్‌రౌండర్ నైపుణ్యం భారత్‌కు విజయాన్ని అందించగా, బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. మూడో రోజే కీలక వికెట్లు కోల్పోయి వెనుకబడిపోయిన కుక్ బృందం... భారత్‌ను రెండోసారి బ్యాటింగ్‌కు దించడం మినహా ఎలాంటి ప్రతిఘటన, సంచలనం లేకుండానే తలవంచింది. గాయంతో బాధపడుతూనే హమీద్ చేసిన పోరాటం ఆ జట్టు కనీస పోటీ ఇచ్చేందుకు సరిపోకపోగా... జడేజా, షమీ బౌలింగ్‌తోపాటు పార్థివ్ పటేల్ మెరుపులతో మొహాలీలో మన జట్టు భాంగ్రా నృత్యం చేసింది. మొహాలీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు మూడో టెస్టులో అలవోక విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 78/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (179 బంతుల్లో 78; 6 ఫోర్లు), హసీబ్ హమీద్ (156 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, జయంత్, షమీ, జడేజా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 103 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.2 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (54 బంతుల్లో 67 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు రవీంద్ర జడేజాకు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టులో సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక జట్టు సిరీస్ చేజార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదు. కొంత విరామం తర్వాత నాలుగో టెస్టు డిసెంబర్ 8 నుంచి ముంబైలో జరుగుతుంది. సెషన్-1: రూట్ అర్ధ సెంచరీ నాలుగో రోజు జడేజా తాను వేసిన తొలి ఓవర్లోనే నైట్ వాచ్‌మన్ బ్యాటీ (0)ని అవుట్ చేసి ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే బట్లర్ (18) కూడా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడబోరుున బట్లర్, జయంత్ వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. చేతిగాయంతో ఓపెనింగ్ చేయలేకపోయిన హసీబ్ హమీద్ ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చాడు. మరోవైపు జడేజా బౌలింగ్‌లో ఫోర్‌తో 147 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. 6 పరుగుల వద్ద హమీద్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను పార్థివ్ వదిలేయగా... రూట్, హమీద్ కలిసి కొద్దిసేపు ఇంగ్లండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించిన తర్వాత జడేజా ఈ జోడీని విడదీశాడు. స్లిప్‌లో ఒంటిచేత్తో రహానే అద్భుత క్యాచ్ పట్టడంతో రూట్ వెనుదిరిగాడు. ఓవర్లు: 32, పరుగులు: 78, వికెట్లు: 3 సెషన్-2: హమీద్ పోరాటం లంచ్ తర్వాత హమీద్, క్రిస్ వోక్స్ (47 బంతుల్లో 30; 3 ఫోర్లు) కలిసి మరి కొంత సేపు పోరాడారు. వోక్స్ కొన్ని చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించగా... హమీద్ దుర్బేధ్యమైన డిఫెన్‌సతో భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా నిలబడ్డాడు. ఈ స్థితిలో 82 ఓవర్ల తర్వాత కోహ్లి కొత్త బంతి తీసుకోవడంతో మ్యాచ్‌పై మన పట్టు బిగిసింది. షమీ కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే ఫలితం సాధించాడు. మొదటి బంతినే అతను బౌన్సర్ వేయగా వోక్స్ హుక్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో బంతి అతని హెల్మెట్‌కు తగిలి దాని స్టెమ్గార్డ్ పడిపోరుుంది. ఆందోళనతో కోహ్లి బ్యాట్స్‌మన్ వద్దకు వెళ్లి చూశాడు. కొంత చికిత్స తర్వాత వోక్స్ మళ్లీ బ్యాట్ పట్టాడు. అరుుతే తగ్గని షమీ తర్వాతి బంతినే మళ్లీ బౌన్సర్‌గా విసిరాడు. ఇది వోక్స్ బ్యాట్ హ్యాండిల్‌కు తగిలి గాల్లోకి లేవగా పార్థివ్ క్యాచ్ అందుకోవడంతో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే మరో బౌన్సర్‌తో రషీద్ (0)ను కూడా షమీ పెవిలియన్ పంపించాడు. అరుుతే ఆ తర్వాత హమీద్ వేగంగా పరుగులు చేశాడు. అశ్విన్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అశ్విన్ మరుసటి ఓవర్లో మరో సిక్స్‌తో 147 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు రెండో పరుగు తీసే ప్రయత్నంలో అండర్సన్ (5) రనౌట్ కావడంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే విజయ్ (0) వికెట్ కోల్పోరుుంది. మరోవైపు వోక్స్, అండర్సన్ వేసిన వరుస ఓవర్లలో పార్థివ్ రెండేసి బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ఓవర్లు: 20.2, పరుగులు: 80, వికెట్లు: 3 (ఇంగ్లండ్) ఓవర్లు: 6, పరుగులు: 33, వికెట్లు: 1 (భారత్) సెషన్-3: పార్థివ్ దూకుడు విరామం తర్వాత కూడా పార్థివ్ జోరు కొనసాగింది. రషీద్ వేసిన ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. పార్థివ్, పుజారా (25) కలిసి రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అరుుతే విజయానికి మరో 15 పరుగుల దూరంలో రషీద్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోరుు పుజారా వెనుదిరి గాడు. అరుుతే కోహ్లి (6 నాటౌట్) తో కలిసి పార్థివ్ మ్యాచ్ ముగిం చాడు. బ్యాటీ వేసిన బంతిని కవర్స్‌లో పార్థివ్ ఫోర్ కొట్టడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఓవర్లు: 14.2, పరుగులు: 71, వికెట్లు: 1 ► 6 మొహాలీ మ్యాచ్‌తో భారత జట్టు వరుసగా 16 టెస్టుల్లో పరాజయం లేకుండా కొనసాగుతోంది. గతంలో 1985-87 మధ్య ఇండియా వరుసగా 17 టెస్టులు ఓడలేదు. ► 12 కెప్టెన్‌గా వ్యవహరించిన 20 టెస్టుల్లో కోహ్లికి ఇది 12వ విజయం. గతంలో ధోనికి కూడా తన తొలి 20 టెస్టుల్లో సరిగ్గా ఇలాగే 12 విజయాలు, 2 పరాజయాలు, 6 డ్రాలు ఉన్నాయి. -
పార్థీవ్ పటేల్ మరో ఘనత
మొహాలి:ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు ద్వారా ఎనిమిదేళ్ల తరువాత తిరిగి టెస్టు జట్టులో పునరాగమనం చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్... తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత తరపున టెస్టుల్లో 50మందిని పెవిలియన్ కు పంపిన భారత కీపర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. అంతకుముందు ఏడుగురు భారత కీపర్ల మాత్రమే టెస్టుల్లో 50 మందిని అవుట్ చేసిన క్లబ్లో చేరగా, ఆ ఘనత సాధించిన ఎనిమిదో కీపర్‌గా పార్థీవ్ నిలిచాడు. తన కెరీర్లో 21 టెస్టు మ్యాచ్ ఆడుతున్న పార్థీవ్.. అలెస్టర్ కుక్ క్యాచ్ పట్టి 50 అవుట్ల క్లబ్లో చేరాడు. ఆ తరువాత కాసేపటికి బెన్ స్టోక్స్ ను స్టంప్ చేశాడు. దాంతో దినేష్ కార్తీక్ 50 అవుట్ల మార్కును పార్థీవ్ అధిగమించాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు పార్థీవ్ ఖాతాలో 41 క్యాచ్‌లు, 8 స్టంపింగ్స్ ఉన్నాయి. ఎనిమిదేళ్ల తరువాత ఒక భారత ఆటగాడు టెస్టుల్లో పునరాగమనం చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కు ముందు 2008లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పార్థీవ్ చివరిసారి ఆడాడు. భారత తరపున టెస్టుల్లో ఇంత సుదీర్ఘ కాలం తరువాత మరోసారి జట్టులో స్థానం సంపాదిండం ఇదే మొదటిసారి. అంతకుముందు భారత నుంచి ఆరు సంవత్సరాల తరువాత పునరాగమనం ఆటగాళ్లలో మొహిందర్ అమర్ నాథ్, విజయ్ మెహ్రాలు మాత్రమే ఉన్నారు. -
సాహా స్థానంలో పార్థివ్
భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో పార్థివ్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. 17 ఏళ్ల వయసులో 2002లో తన తొలి టెస్టు ఆడిన పార్థివ్, భారత్ తరఫున ఎనిమిదేళ్ల క్రితం చివరి సారి టెస్టు ఆడాడు. మొత్తం 20 టెస్టుల్లో కలిపి అతను 683 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ ఫామ్‌లో ఉన్న కారణంగానే నమన్ ఓజా, దినేశ్ కార్తీక్‌లను వెనక్కి తోసి పార్థివ్ అవకాశం దక్కించుకున్నాడు. -
ఊహించని ఛాన్స్.. నిరీక్షణకు బ్రేక్!
మొహాలి: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర పడింది. ఊహించని విధంగా అవకాశం తలుపు తట్టింది. వృద్ధిమాన్ సాహా గాయపడడంతో టీమిండియా టెస్టు టీమ్ లో పార్థివ్ పటేల్ కు ఛాన్స్ దక్కింది. ఎనిమిదేళ్ల తర్వాత అతడు టెస్టుల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. పార్థివ్ చివరిసారిగా 2008 ఆగస్టులో శ్రీలంకతో కొలంబొలో జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా తరపున ఆడాడు. 31 ఏళ్ల పార్థివ్ ఇప్పటివరకు 20 టెస్టులు ఆడి 29.69 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 ఏళ్ల వయసులో 2002లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించిన పార్థివ్ నిలదొక్కుకోలేకపోయాడు. అంచనాలకు తగినట్టు రాణించలేక స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. అతడి కంటే ఆలస్యంగా టీమిండియాలో స్థానం దక్కించుకున్న ఎంఎస్ ధోని జట్టులో పాతుకుపోవడంతో పార్థివ్ కు అవకాశం లేకుండా పోయింది. ధోని జట్టుకు దూరమైనప్పుడు మాత్రమే అతడికి సెలెక్టర్ల నుంచి పిలుపువచ్చేంది. ఆరేళ్ల కాలంలో పటేల్ కేవలం 20 టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2014లో టెస్టుల నుంచి ధోని రిటైరయ్యాక యువ ఆటగాళ్లకు అవకాశం దక్కడంతో పార్థివ్ దేశవాళి మ్యాచ్ లకే పరిమితమయ్యాడు. రంజీ మ్యాచుల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం వల్లే అతడికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్ తో జరిగే మూడో టెస్టులో పార్థివ్ రాణించినా అతడి అంతర్జాతీయ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని విశ్లేషకుల అంచనా. -
ధోనికి బ్యాకప్‌గా పార్థీవ్ పటేల్
భారత కెప్టెన్ ధోని వెన్నునొప్పితో బాధపడుతున్నందున... పార్థీవ్ పటేల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా బంగ్లాదేశ్ పంపుతున్నారు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా ధోని అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ముందు జాగ్రత్తగా పార్థీవ్ను ఆసియాకప్ జట్టులోకి బ్యాకప్‌గా తీసుకున్నారు. అయితే ధోనికి తీవ్ర గాయమేమీ లేదని, అతను తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని జట్టు వర్గాలు తెలిపాయి. -
ధోనీకి గాయం.. పార్థివ్‌కు పిలుపు
ఢాకా: ఆసియా కప్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోనీ కండరాలు పట్టివేశాయి. దీంతో భారత క్రికెట్ బోర్డు బ్యాట్స్‌మన్ కమ్ కీపర్ పార్థివ్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంది. ఢాకా వెళ్లి భారత జట్టులో చేరాల్సిందిగా కబురంపింది. బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈలోగా పార్థివ్ బంగ్లాదేశ్ వెళ్లనున్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత అతనికి భారత జట్టులో చోటు దక్కింది. చివరిసారిగా నాలుగేళ్ల క్రితం శ్రీలంకతో వన్డేలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 20 టెస్టులు, 38 వన్డేలాడిన పార్థివ్ అంతర్జాతీయ టి-20లు మాత్రం రెండే ఆడాడు. -
గుజరాత్ గెలిచిందోచ్...
తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ సొంతం * ఫైనల్లో ఢిల్లీపై 139 పరుగులతో ఘనవిజయం * కెప్టెన్ పార్థివ్ పటేల్ సెంచరీ * చెలరేగిన ఆర్పీ సింగ్, బుమ్రా బెంగళూరు: సమష్టిగా రాణిస్తే... ప్రత్యర్థి జట్టులో మేటి ఆటగాళ్లు ఉన్నా విజయం సాధించొచ్చని గుజరాత్ జట్టు నిరూపించింది. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి కైవసం చేసుకుంది. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు సోమవారం జరిగిన ఫైనల్లో 139 పరుగుల ఆధిక్యంతో ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించింది. గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, ఉన్ముక్త్ చంద్, ఇషాంత్ శర్మలాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఢిల్లీ జట్టుకు నిరాశ తప్పలేదు. 2010-11 సీజన్లో గుజరాత్ రన్నరప్‌గా నిలిచినా... ఈసారి మాత్రం విజేతగా నిలిచి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (119 బంతుల్లో 105; 10 ఫోర్లు) సెంచరీ సాధించగా... రుజుల్ భట్ (74 బంతుల్లో 60; 4 ఫోర్లు, ఒక సిక్స్), చిరాగ్ గాంధీ (39 బంతుల్లో 44; 4 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ జట్టులో నవ్‌దీప్ సైని, సుభోద్ భాటి, పవన్ నేగి రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 32.3 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు మాజీ సభ్యుడు రుద్రప్రతాప్ (ఆర్పీ) సింగ్ (4/42), జస్ప్రీత్ బుమ్రా (5/28) తమ పేస్ బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. శిఖర్ ధావన్ (5), గౌతమ్ గంభీర్ (9) విఫలమవ్వగా... ఉన్ముక్త్ చంద్ (33; 6 ఫోర్లు), పవన్ నేగి (57; 9 ఫోర్లు, ఒక సిక్స్) కాస్త పోరాటిపటిమ కనబరిచినా ఫలితం లేకపోయింది. -
అదరగొట్టిన పార్థీవ్ పటేల్
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీతో జరుగుతున్నతుదిపోరులో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ, పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో గుజరాత్ తడబడినట్లు కనిపించింది. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కాగా, చివర్లో కలారియా(21) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 273 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఢిల్లీ బౌలర్లలో సైనీ, నేగీ, భాటిలకు తలో రెండు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, రానా, మనన్ శర్మలకు ఒక్కో వికెట్ లభించింది. -
ఓటు వేసిన పుజారా, పార్థివ్
రాజ్‌కోట్: భారత యువ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇందుకోసం ఐపీఎల్-7లో భాగంగా ఏప్రిల్ 28న బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన వెంటనే పంజాబ్ ఫ్రాంచైజీ నుంచి అనుమతి తీసుకొని స్వస్థలమైన రాజ్‌కోట్‌కు వచ్చాడు. ఎన్నికల కమిషన్ తరపున రాజ్‌కోట్ జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పుజారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఐపీఎల్ నుంచి రావడం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు పార్థివ్ పటేల్ కూడా అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.