ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, పార్థీవ్ పటేల్లు ఇరగదీశారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలుత కేఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఆ తరువాత కొద్ది సేపటికీ పార్థీవ్ 81 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే టీమిండియా ఓపెనర్లు సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 31 ఇన్నింగ్స్ ల తరువాత ఇదే తొలిసారి. 2015 జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనింగ్ జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని చివరిసారి సాధించింది.
Published Sun, Dec 18 2016 12:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
Advertisement