ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు | Asia Cup: Parthiv Patel to join Team India as cover for Dhoni | Sakshi
Sakshi News home page

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

Published Mon, Feb 22 2016 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

ధోనీకి గాయం.. పార్థివ్కు పిలుపు

ఢాకా: ఆసియా కప్ ప్రారంభంకాక ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోనీ కండరాలు పట్టివేశాయి. దీంతో భారత క్రికెట్ బోర్డు బ్యాట్స్మన్ కమ్ కీపర్ పార్థివ్ పటేల్ను జట్టులోకి తీసుకుంది. ఢాకా వెళ్లి భారత జట్టులో చేరాల్సిందిగా కబురంపింది.

బంగ్లాదేశ్లో ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈలోగా పార్థివ్ బంగ్లాదేశ్ వెళ్లనున్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత అతనికి భారత జట్టులో చోటు దక్కింది. చివరిసారిగా నాలుగేళ్ల క్రితం శ్రీలంకతో వన్డేలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 20 టెస్టులు, 38 వన్డేలాడిన పార్థివ్ అంతర్జాతీయ టి-20లు మాత్రం రెండే ఆడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement