అదరగొట్టిన పార్థీవ్ పటేల్ | gujarat captain Parthiv Patel gets century in vijay hazare final against delhi | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన పార్థీవ్ పటేల్

Published Mon, Dec 28 2015 6:14 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

అదరగొట్టిన పార్థీవ్ పటేల్

అదరగొట్టిన పార్థీవ్ పటేల్

బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీతో జరుగుతున్నతుదిపోరులో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది.  దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్  ఆదిలోనే  ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 

 

ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ,  పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో గుజరాత్ తడబడినట్లు కనిపించింది.

 

ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కాగా, చివర్లో కలారియా(21) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 273 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఢిల్లీ బౌలర్లలో సైనీ, నేగీ, భాటిలకు తలో రెండు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, రానా, మనన్ శర్మలకు ఒక్కో వికెట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement