బెంగళూరు: అస్నా తుపాను విస్తరిస్తున్న క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) గుజరాత్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది అస్నా తుపాన్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఏర్పడటం సాధారణం కాదని తెలిపింది. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
1976 అరేబియా సముద్రంలో మొదటిసారి విస్తరించిన ఈ తుపాన్‌కు పాకిస్తాన్.. అస్నా తుపానుగా పేరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందినిస సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే నిన్న శుక్రవారం వర్షం కొంత తెరిపి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment