red alert
-
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
వీడియో: జడివాన ఎఫెక్ట్.. ముంబై అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024 -
తీరం దాటిన వాయుగుండం..
-
అస్నా తుపాను.. కర్ణాటకకు రెడ్ అలెర్ట్
బెంగళూరు: అస్నా తుపాను విస్తరిస్తున్న క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది అస్నా తుపాన్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఏర్పడటం సాధారణం కాదని తెలిపింది. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 అరేబియా సముద్రంలో మొదటిసారి విస్తరించిన ఈ తుపాన్‌కు పాకిస్తాన్.. అస్నా తుపానుగా పేరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందినిస సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే నిన్న శుక్రవారం వర్షం కొంత తెరిపి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు. -
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. 29 మరణాలు..
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు 29 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే..సుమారు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సుమారు 300 మందిని వరదల నుంచి కాపాడాయి.गुजरात में बाढ़ से पीड़ित परिवारों को सुनिए - दो दिन से बारिश हो रही है। हम बाहर नहीं जा पा रहे हैं। ठीक से खाना भी नहीं खाया है। कोई भी हमें राहत सामग्री देने नहीं आया है।हम सो भी नहीं पा रहे हैं।पूरी रात यहीं बैठकर काट रहे है#GujaratFlood #GujaratRain #Jamnagar #GujaratRains pic.twitter.com/iTJWjPxT1n— Gaurav Singh (@Gaurav2372000) August 28, 2024మరోవైపు.. ఇవాళ( గురువారం) రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో.. కచ్ఛ్, ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, సురేంద్రనగర్, జునాగఢ్, రాజ్‌కోట్, బొటాడ్, గిర్సోమ్నాథ్, అమ్రేలి, భావ్‌నగర్‌లతో కూడిన కచ్ , సౌరాష్ట్ర ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.गुजरात के उपर बहोत ही बडा डीप डिप्रेशन बना हुआ है जिसका अंदाजा आप नीचे दी गई इमेज से लगा सकते है।नदिया उफान पर है कई हाइवे पानी की वजह से बंद करने पडे है।अगर जरुरी ना हो तो कृपया घर से बाहर ना निकले#HeavyRain #GujaratRains #Gujarat #Ahmedabad #Vadodara #Kutch #RainAlert pic.twitter.com/oNyRyt9r03— Rakesh Chauhan✨💫🇮🇳(मोदी का परीवार) (@hindu_balak07) August 28, 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు పెరిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.బుధవారం సుమారు 6వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలు తరలించినట్లు అధికారులు తెలిపారు.गुजरात: लगातार भारी बारिश के बाद जामनगर शहर में जगह-जगह भीषण जलभराव हो गया है। बहुत जगह बाढ़ भी आई है। #GujaratFlood #GujaratRain #Jamnagar #GujaratRains pic.twitter.com/l8m15pN71I— Gaurav Singh (@Gaurav2372000) August 28, 2024 గుజరాత్లో ఇప్పటివరకు కురిసిన వర్షం.. సగటు వార్షిక వర్షపాతంలో 105 శాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షంతో అజ్వా, ప్రతాపురా రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. నది తీర ప్రాంతాలైన వడోదర, ఇతర నగరాల్లోకి గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల్లో నీరు నిలిచింది.భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసిన పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న గుజరాత్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ పలు అంచనాలను వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 24) ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గోవా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వాతావరణశాఖ అందించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 269.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం. ఆగస్టు 23 వరకు, ఢిల్లీలో 274 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు 2014 లో నమోదైన గరిష్ట వర్షపాతం కంటే అత్యధికం.ఆగస్టు 25న గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. -
పుణె నగరానికి వరద ముప్పు.. ‘ఐఎండీ’ హెచ్చరిక
ముంబయి: మహారాష్ట్రలోని పుణె నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రెండు టీమ్‌ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పుణె, చించ్వాడ్,బలివాడిలో సిద్ధంగా ఉంచారు.పుణె, పింప్రి చించ్వాడ్ నగరాల్లోని పౌరులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. రెండు నగరాల్లోని డ్యాముల నుంచి నీటిని కిందకు వదులుతుండటంతో వరదలు పోటెత్తే అవకాశముంది.డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ముంబైలో దట్టమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకాధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.#WATCH | Delhi: Waterlogging witnessed in several parts of the national capital after heavy rainfall; visuals from outside Civic Center near Ramlila Maidan. pic.twitter.com/19UhRO02ag— ANI (@ANI) July 31, 2024ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక, వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలకు సూచించారు. కాగా, ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ విధించింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: Traffic flow impacted near ITO as a result of heavy rains and waterlogging pic.twitter.com/clEyUfWurL— ANI (@ANI) July 31, 2024 Current Situation at Old Rajendra Nagar after Rains 🚨Years of Negligence and Corruption have Resulted into this. MCD and Delhi Govt should Wake Up to Such Conditions. Together, they have turned it into a Death Trap. pic.twitter.com/CeJosR4PTJ— Deepanshu Singh (@deepanshuS27) July 31, 2024 Delhi Minister & AAP leader Atishi tweets, "In light of very heavy rainfall today evening and forecast of heavy rainfall tomorrow, all schools - government and private - will remain closed tomorrow." pic.twitter.com/grisV4oFgT— ANI (@ANI) July 31, 2024 -
జలదిగ్బంధంలో ముంబై, పూణే.. స్కూల్స్ బంద్
ముంబై: మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇక, పూణే, థానే, పాల్ఘర్ నగరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, ముంబై, పూణే, సహ పింప్రి, చించ్విడ్ నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దు అయినట్టు తెలుస్తోంది. Railway tracks on Vikhroli station. Travel only if there's an emergency. #MumbaiRains#MumbaiRains pic.twitter.com/9ZlnrC3QRW— Shakib (@MohdShakib98513) July 25, 2024 మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. This is the Indrayani river overflowing at Alandi today.Crazy, scary videos being shared from all across Pune by people!Hope the rains mellow down soon. pic.twitter.com/ixv3UYv1WD— Urrmi (@Urrmi_) July 25, 2024 జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలో శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. This is how it looks like in our locality.. #PuneRains #Pune pic.twitter.com/wEpiRj8a1t— 🎼🎵🌝 𝒟𝒾𝓋𝓎𝒶 𝒮 🇮🇳 🌝🎵🎼 (@_MyInspirationz) July 25, 2024 -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
Heavy Rains: ‘రెడ్ అలెర్ట్’లో ముంబై.. కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
మహారాష్ట్రను భారీ వర్షాలు బెంబేలెతిస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు, పుణె, థానె, కొల్హాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణె వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. పుణె పింప్రి-చించ్వాడ ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లోకి వరద నీరు చేసింది. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధుల్లో వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.This city needs prayers today 🙏#MumbaiRains pic.twitter.com/1XRK582CRr— Nikita Dutta (@nikifyinglife) July 25, 2024> ముంబై, థానే వంటి పొరుగు ప్రాంతాలు కూడా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్నాయి. అంధేరి, సియోన్, చెంబూర్, కుర్లా, థానేలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబయిలోని అంధేరి సబ్వే వరద నీరు కారణంగా మూతపడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో విహార్ సరస్సు, మోదక్ సాగర్ సరస్సు నేడు తెల్లవారుజామున పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రదిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) మూడు బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంది.కుండపోత వర్షాలతోనీటి మట్టం పెగిఠా నదిపై ఉన్న బాబా భిడే వంతెన నీటిలో మునిగిపోయింది. అదే విధంగా ఖడక్వాస్లా డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ముఠా నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్లాపూర్‌లో పంచగంగ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయం చేస్తోంది.🌧️ 𝗣𝘂𝗻𝗲 𝗪𝗲𝗮𝘁𝗵𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🌧️ •Schools, private offices, tourist places shut down, 4 dead in rain-related incidents.•It's been raining continuously in pune for the last 12 hours.🌧️⛈️#PuneRains #MumbaiRains pic.twitter.com/Iw3ZPWFZHd— RAJA👑 (@SWAPNIL_2211) July 25, 2024 ముంబైలో కూడా పరిస్థితి భయంకరంగా మారింది. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది జూలైలో రెండవ అత్యంత ఎక్కవగా రికార్డైంది. శుక్రవారం ఉదయం వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల మధ్య ముంబైకి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని, కొన్నింటిని దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు తెలియజేసింది. This is how #MumbaiRains look from a flight! 😻 https://t.co/QrPE5X9lGO pic.twitter.com/FvnIGjjTC0— WabiSabi (@Geeky_Foodie) July 20, 2024రాష్ట్రంలో పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమీక్ష చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని చెప్పారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
TG: పలు జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో.. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. -
AP: భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది.రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
Heavy Rains: రెడ్ అలర్ట్ జారీ.. విద్యాసంస్థలకు సెలవులు
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.ఉత్తర మలప్పురం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.కొట్టాయం జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు కూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఉత్తర కోజికోడ్‌లోని ఓంచియం, కొత్తూర్, పయ్యోలి తదితర గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.మూజియార్ డ్యామ్ షట్టర్లు పెంచినందున దాని పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పాతనంతిట్ట జిల్లా అధికారులు కోరారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం, వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. -
కుమ్మేస్తున్న వర్షాలు.. మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. -
Mumbai Rains: ముంబైను వీడని వర్షాలు.. రెడ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైను వర్ష భయం వీడటం లేదు. రెండు రోజుల నుంచి నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఆర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసన వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువులను తలపించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.కాగా ముంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ముంబైకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది.ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు . అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇదిలా ఉండగా సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ రైలు సేవలు, బస్సు సర్వీసులు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు సైతం విడిచింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముగిసిన ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
దేశ రాజధాని ఢిల్లీలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికిముందు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత మరింత పెరిగిన నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు మరో రెండు రోజుల వరకు ఢిల్లీలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 5.7 డిగ్రీలు ఎక్కువ. నగరంలో వరుసగా ఎనిమిదో రోజు వడగాడ్పులు వీచాయి. వరుసగా 35వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటూ నీరు తాగుతూ ఉండాలని సూచించింది.జూన్ 11 నుంచి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా, దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో వేడివాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 27-30 మధ్య ఢిల్లీకి చేరుకుంటాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదే సమయానికి ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. -
తమిళనాడుకు రెడ్ అలర్ట్..
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ తమిళనాడులో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి పర్వత శ్రేణుల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఊటీలోనూ కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. Meenakshi Amman temple is located in #Madurai, Tamil Nadu.The temple has a fully functional ancient rainwater harvesting system installed when it was built in the year 1190 CE.View of Meenakshi Amman temple during rains. Perfect water management.… pic.twitter.com/RI3mOcexJN— SK Chakraborty (@sanjoychakra) May 17, 2024 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. ఊటీలో కుండపోత కారణంగా పర్యాటకలు గదులకే పరిమితమయ్యారు. మరోవైపు.. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో, అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Today to Tomorrow: Ghats zone, West, south and central #Tamilnadu, #Kerala, south #Karnataka (image 1) will see heavy to very heavy rains /Thunderstorms.Southern TN,#kumari #Nellai ghats of kerala and TN has high chance for very heavy rains.#Nilgiris #Covai #Tiruppur… pic.twitter.com/s3Xak6qoQY— Rainstorm - வானிலை பதிவுகள் (@RainStorm_TN) May 22, 2024 -
నిప్పుల కొలిమి!
పదేళ్లలో ఇవే అత్యధికంగత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.11 జిల్లాలకు రెడ్ అలర్ట్..ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది.