
ఆ నలుగురి కథ!.
కర్ఫ్యూ నీడలో అల్ల కల్లోలంగా ఉన్న సిటీలోకి నలుగురు కుర్రాళ్లు అడుగుపెడతారు.
కర్ఫ్యూ నీడలో అల్ల కల్లోలంగా ఉన్న సిటీలోకి నలుగురు కుర్రాళ్లు అడుగుపెడతారు. అప్పుడు వాళ్లు అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటారు. దాన్నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్.మహదేవ్, అంజనా మీనన్ జంటగా చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పీవీ శ్రీరాంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటికే కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘చంద్రమహేశ్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. మా నాన్నగారి అకాల మరణం కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యమైంది’’ అని మహదేవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జైపాల్ రెడ్డి.