ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.
బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R
— sudhakar (@naidusudhakar) September 25, 2024
The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w
— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024
Heavy rainfall in mumbai
It looks like Tsunami🥺
ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024
ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
#WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z
— ANI (@ANI) September 26, 2024
#WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7
— ANI (@ANI) September 25, 2024
#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO
— ANI (@ANI) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment