మహారాష్ట్రను భారీ వర్షాలు బెంబేలెతిస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు, పుణె, థానె, కొల్హాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణె వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. పుణె పింప్రి-చించ్‌వాడ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్‌లోకి వరద నీరు చేసింది. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధుల్లో వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.
This city needs prayers today 🙏#MumbaiRains pic.twitter.com/1XRK582CRr
— Nikita Dutta (@nikifyinglife) July 25, 2024
> ముంబై, థానే వంటి పొరుగు ప్రాంతాలు కూడా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్నాయి. అంధేరి, సియోన్, చెంబూర్, కుర్లా, థానేలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబయిలోని అంధేరి సబ్‌వే వరద నీరు కారణంగా మూతపడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో విహార్ సరస్సు, మోదక్ సాగర్ సరస్సు నేడు తెల్లవారుజామున పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రదిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) మూడు బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంది.కుండపోత వర్షాలతోనీటి మట్టం పెగిఠా నదిపై ఉన్న బాబా భిడే వంతెన నీటిలో మునిగిపోయింది. అదే విధంగా ఖడక్వాస్లా డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ముఠా నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్లాపూర్‌లో పంచగంగ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయం చేస్తోంది.
🌧️ 𝗣𝘂𝗻𝗲 𝗪𝗲𝗮𝘁𝗵𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🌧️
•Schools, private offices, tourist places shut down, 4 dead in rain-related incidents.
•It's been raining continuously in pune for the last 12 hours.🌧️⛈️
#PuneRains #MumbaiRains pic.twitter.com/Iw3ZPWFZHd— RAJA👑 (@SWAPNIL_2211) July 25, 2024
ముంబైలో కూడా పరిస్థితి భయంకరంగా మారింది. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది జూలైలో రెండవ అత్యంత ఎక్కవగా రికార్డైంది. శుక్రవారం ఉదయం వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది.
భారీ వర్షాల మధ్య ముంబైకి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని, కొన్నింటిని దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు తెలియజేసింది.
This is how #MumbaiRains look from a flight! 😻 https://t.co/QrPE5X9lGO pic.twitter.com/FvnIGjjTC0
— WabiSabi (@Geeky_Foodie) July 20, 2024
రాష్ట్రంలో పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమీక్ష చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని చెప్పారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment