
సాక్షి, ఢిల్లీ: ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఈడీ అధికారులు.. అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. తప్పుడు కేసులు పెడుతోందని ఘాటుగా స్పందించింది.
దేశంలో ఈడీ కేసుల్లో అరెస్టులపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధర్మాసనం స్పందిస్తూ..‘ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులు చేస్తోంది. ఈడీకి ఇదొక అలవాటుగా మారింది. ఇలా అనేక కేసులు మేము చూస్తున్నాం. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాంలో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ఆధారాలు చూపలేదు. గతంలోనూ అనేక కేసుల్లో ఆధారాలు చూపించలేదు. తప్పులు కేసులు పెడుతుంది. ప్రతీ స్కాంలో ఈడీ తీరు ఇలాగే ఉంది. అరెస్టులు చేయడం అలవాటుగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ED making allegations without evidence: Supreme Court observes #SupremeCourt while hearing a bail application in an ED arrest:
Justice Abhay S Oka: this is what we’re seeing in umpteen number of cases filed by the ED. This is the pattern, you just make allegations without any… pic.twitter.com/THRaLZg9R5— Bar and Bench (@barandbench) May 5, 2025