న్యూఢిల్లీ: పారదర్శకత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలో కొత్త చరిత్ర లిఖించనుంది. ఇకపై కోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) చేసేందుకు చర్యలు ప్రారంభించింది. కేసుల ప్రత్యక్ష ప్రసారాల కోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.
యాప్‌లో ఏమైనా మార్పులు అవసరమైతే చేసి త్వరలో అన్ని కేసుల విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో రెండేళ్ల నుంచి రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న కేసుల విచారణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తురన్నారు.
మహారాష్ట్ర శివసేన పార్టీ చీలిక కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల అమలు ఆలస్యమైంది.
ఇదీ చదవండి: ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment