Live streaming
-
ఇకపై సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం
-
సుప్రీంకోర్టులో అన్ని విచారణలు త్వరలో లైవ్
న్యూఢిల్లీ: పారదర్శకత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలో కొత్త చరిత్ర లిఖించనుంది. ఇకపై కోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) చేసేందుకు చర్యలు ప్రారంభించింది. కేసుల ప్రత్యక్ష ప్రసారాల కోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. యాప్‌లో ఏమైనా మార్పులు అవసరమైతే చేసి త్వరలో అన్ని కేసుల విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో రెండేళ్ల నుంచి రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న కేసుల విచారణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తురన్నారు.మహారాష్ట్ర శివసేన పార్టీ చీలిక కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల అమలు ఆలస్యమైంది.ఇదీ చదవండి: ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట -
Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్
ఇటీవల ప్రధాని మోదీ దేశంలో టాప్ ఫాలోయింగ్ ఉన్న ఏడుగురు గేమర్స్‌ను కలిశారు. వారిలో ఒక్కతే అమ్మాయి పాయల్ ధారే. గేమ్స్‌ను ఆడుతూ తన వ్యాఖ్యానం వినిపిస్తూ ‘లైవ్ స్ట్రీమింగ్’ ద్వారా 35 లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకున్న పాయల్ పురుషుల ఆధిపత్య రంగమైన గేమింగ్‌లో తనదైన స్థానం పొందారు. పాయల్ పరిచయం. వీడియో గేమ్స్ అనగానే మూడు విధాలైన భాగస్వాములు ప్రస్తావనకు వస్తారు. 1. గేమ్స్ ఆడేవాళ్లు 2. చలామణిలో ఉన్న గేమ్స్‌ను ఆడుతూ తమ వ్యాఖ్యానం వినిపిస్తూ (లైవ్ స్ట్రీమింగ్) వీడియోలు చేసేవారు, 3. గేమ్స్ తయారు చేసేవారు. మన దేశంలో 2014 తర్వాత సెల్ఫోన్ల అందుబాటు పెరిగాక గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే వారితోపాటు గేమ్స్ చుట్టూ షోస్ చేసేవారి (గేమర్స్) పలుకుబడి కూడా పెరిగింది. వీరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారారు. ఇక ఒరిజినల్‌గా మన దేశంలో గేమ్స్ తయారు చేసేవారు పై రెండు వర్గాలతో పోల్చితే తక్కువ. ఇటీవల ప్రధాని మోడి గేమ్స్ ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిన 7 మంది గేమర్స్‌ను న్యూఢిల్లీలో కలిసి వారితో మాటామంతి జరిపారు. తీర్థ్ మిత్ర, అనిమేష్ అగర్వాల్, అన్షు బిస్త్, నమన్ మాధుర్, మిథిలేష్, గణేష్ గంగాధర్ అనే యువ గేమర్‌లతోపాటు వీరితో పాల్గొన్న ఒకే ఒక మహిళా గేమర్ పాయల్ ధారే. 15000 మంది గేమర్స్ మన దేశంలో 15 వేల మంది గేమర్స్ ఉన్నారు. అంటే వీడియో గేమ్స్‌ను ఆడుతూ వాటిని వివరిస్తూ వాటిపై వ్యాఖ్యానం చేస్తూ ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాపులర్ అయిన వారు. ఇలాంటి వారిలో అత్యంత ఆదరణ పొందిన వారికి లక్షల మంది ఫాలోయెర్స్ ఉంటారు. ఇదంతా గేమింగ్ కమ్యూనిటీ. గేమ్స్ చుట్టూ వీడియోలు చేసేందుకే మన దేశంలో దాదాపు 1500 స్టుడియో లు కూడా ఉన్నాయి. గేమ్స్‌ను స్వయంగా తయారు చేసే సాంకేతిక నైపుణ్యం లేని వారు కూడా ఉన్న గేమ్స్ ద్వారా పాపులర్ అవుతున్నారు. పాయల్ ధారే కూడా అలా పేరు పొందింది. సంవత్సరానికి 5 కోట్లు 23 ఏళ్ల పాయల్ ధారేకు ‘పాయల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ ఉంది. ఈ చానల్లో ఆమె వీడియో గేమ్స్ ఆడుతూ తన సరదా వ్యాఖ్యానంతో వీడియోలు చేసి పెడుతుంటుంది. మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న గేమ్స్‌ను పరిచయం చేయడం లేదా ఆడటం వల్ల, సరదా వ్యాఖ్యానం చేయడం వల్ల గేమ్స్ అంటే ఇష్టం ఉన్న యువత అంతా ఈమె వీడియోలు ఫాలో అవుతుంటారు. దానివల్ల ఆమెకు సంవత్సరానికి రూ. 5 కోట్ల ఆదాయం అందుతోందని ఒక అంచనా. ఆశ్చర్యం ఏమంటే ఇంటర్ చదివే వరకూ కూడా పాయల్‌కు సెల్‌ఫోన్ లేదు. గేమ్స్ తెలియదు. పల్లెటూరి అమ్మాయి పాయల్ ధారేది మధ్యప్రదేశ్‌లోని చింద్వారా అనే చిన్న పల్లె. ఫోన్ కూడా చూడని ఆ అమ్మాయి 2021లో లాక్డౌన్ సమయంలో గేమ్స్ గురించి తెలుసుకుంది. ఆ సంవత్సరమే తన వీడియోలు రిలీజ్ చేయసాగింది. 2023 నాటికి అంటే కేవలం రెండేళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ పొందింది. ‘మా అమ్మ నేను గేమింగ్‌లోకి వెళతానంటే భయపడింది. మా నాన్న ప్రోత్సహించారు. వీడియో గేమింగ్‌లో ఆడపిల్లలకు అంత సులువుగా ప్రవేశం లభించదు’ అంటుంది పాయల్. ఇప్పుడు తనను చూసి కనీసం 200 మంది అమ్మాయిలు గేమింగ్‌లోకి వచ్చారని తెలిపింది. మంచి మార్గం కోసం ‘గేమ్స్‌ను తప్పించలేము. యువతకు మంచి లక్ష్యాలను ఏర్పరడానికి వీటిని మీరు ఉపయోగిస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి’ అని ప్రధాని గేమర్స్‌ను కోరారు. ‘మన పంచతంత్రం వంటి కథలను గేమ్స్‌కు వాడండి. పర్యావరణ సమస్యలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలతో గేమ్స్ తయారు చేస్తే ఇండియన్ సంస్కృతి ఉన్న గేమ్స్ తయారు చేస్తే ఆటకు ఆట, బోధనకు బోధన సమకూరుతాయి’ అని ప్రధాని అన్నారు. చదువుకు తగిన సమయం ఇస్తూ, ఒకవేళ ఏదైనా ఉపాధి ఉంటే ఆ ఉపాధి, ఉద్యోగాల్లో ఉంటూ జీవనానికి తగు గ్యారంటీ ఉన్నప్పుడు గేమింగ్‌లోకి వచ్చి ఆ రంగంలో నిలదొక్కుకోవాలని గేమర్స్‌కు సూచించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికా లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అకాడమీ అవార్డ్స్ వేడుకలను హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాల్గవ సారి హోస్ట్ చేయనున్నారు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఈవెంట్‌ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలతో వీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది అవార్డులకు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి పోటీ పడుతున్నాయి. ఇండియా నుంచి పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్: ఆగిపోయిన 24x7 లైవ్.. దానికోసమేనా?
బిగ్‌బాస్ పని అయిపోయింది.. ఈ షో క్రేజ్ తగ్గిపోయింది.. దీన్నెవరు చూస్తారు? పరమ సోది.. ఇలా ఈ రియాలిటీ షో గురించి నానామాటలన్నారు. కారణం.. రానురానూ షోలో పస తగ్గింది. లీకులు ఎక్కువైపోయాయి. ఫేవరిజం పెరిగింది. కంటెస్టెంట్ల ఎంపిక, ఎలిమినేషన్పైనా తీవ్ర వ్యతిరేకత.. వెరసి.. బిగ్‌బాస్‌కు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీంతో ఎలాగైనా బిగ్‌బాస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు మేకర్స్. 19 మందితో బిగ్‌బాస్ 7 అందులో భాగంగానే సీజన్ 7ను ఉల్టాపల్టా పేరిట వినూత్నంగా మొదలుపెట్టారు. సెప్టెంబర్ 3న కేవలం 14 మంది మాత్రమే హౌస్‌లో అడుగుపెట్టారు. షో మొదలైన నెలరోజుల తర్వాత మరో ఐదుగురు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ సీజన్లో 19 మంది పాల్గొనగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఓటీటీల పుణ్యమా అని గంట ఎపిసోడ్ మాత్రమే కాకుండా 24 గంటల లైవ్ స్ట్రీమ్ కూడా హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం లైవ్ ఆపేసేవారు. మిడ్‌వీక్ ఎలిమినేషన్.. హింటివ్వని నాగ్ మరో మూడు రోజుల్లో షోకి ఎండ్‌కార్డ్ పడనున్న తరుణంలో సడన్‌గా లైవ్ ఆపేశారు. గత సీజన్లో మిడ్‌వీక్ ఎలిమినేషన్‌కు ముందు కూడా ఇలాగే లైవ్ ఆపేశారు. కానీ అప్పటికి ఫైనలిస్టులను ఇంకా ప్రకటించలేదు. పైగా మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ జనాలను ముందే హెచ్చరించాడు. అన్నట్లుగానే శ్రీసత్యను వారం మధ్యలో ఎలిమినేట్ చేసి ఆ తర్వాత మిగిలిన ఐదుగురిని ఫైనలిస్టులుగా ప్రకటించారు. కానీ ఈసారి నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊసే ఎత్తలేదు. పైగా ఫైనలిస్టులను సైతం ప్రకటించేశాడు. సడన్‌గా ఆగిపోయిన లైవ్ కానీ సడన్‌గా లైవ్ ఆపేశారు. దీంతో అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా? లేదా? అని జనాలు అయోమయానికి లోనవుతున్నారు. అయితే సోషల్ మీడియా బజ్ చూస్తుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈసారి కప్పు కోసం టాప్ 6 గట్టిగానే కొట్టుకున్నారు. ఇప్పటిదాకా కంటెస్టెంట్లు శాయశక్తులా పోరాడగా ఇప్పుడు వారి అభిమానులు తమ ఫేవరెట్స్‌ను గెలిపించుకునేందుకు ఓట్లు గుద్దుతున్నారు. టైటిల్ రేసులో ప్రశాంత్, అమర్ ముందు వరుసలో ఉన్నారు. వీరి మధ్యే అసలైన పోటీ నడుస్తోంది. రేపటితో ఓటింగ్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. మరి ఆలస్యం చేయకుండా మీ అభిమాన కంటెస్టెంట్‌కు ఓటేసుకోండి. -
Aadudam Andhra: క్రీడాకారుల కోసం రూ.41.43 కోట్ల విలువైన 5 లక్షల స్పోర్ట్స్ కిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల సందడి నెలకొంది. క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌తో పాటు క్రీడా పరికరాల పంపిణీ ఊపందుకుంది. సుమారు 50 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ అతిపెద్ద మెగా టోర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన దాదాపు 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లకు తరలించింది. డిసెంబర్ తొలివారం నాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కిట్లను అందించేలా ప్రత్యేక దృష్టి సారించింది. వీటితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విజేతలకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో టీషర్టు, టోపీని ఇవ్వనున్నారు. కిట్ల నాణ్యత పక్కాగా పరిశీలన.. ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి మూడు వాలీబాల్లు, నెట్, మూడు బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్స్, మూడు బేసిక్ క్రికెట్ కిట్లు, రెండు టెన్నీకాయిట్ రింగ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక నియోజకవర్గ పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు యాంక్లెట్స్, నీక్యాప్స్ అందిస్తోంది. మండల స్థాయిలో ఆరు వాలీబాల్లు, రెండు ప్రొఫెషనల్ క్రికెట్ కిట్లను సమకూరుస్తోంది. వీటితో పాటు 6 వేల ట్రోఫీలు, 84 వేల పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనుంది. క్రీడా పరికరాల తయారీలో మంచి పేరున్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించి స్పోర్ట్స్ కిట్లను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన అధికారులు, కోచ్‌లు స్వయంగా స్పోర్ట్స్ కిట్ల తయారీ పరిశ్రమలకు వెళ్లి వాటి నాణ్యతను పరిశీలించారు. ఆయా సంస్థలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సరఫరా చేసిన పరికరాలను ప్రత్యేక కమిటీ ద్వారా మరోసారి పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. వెలుగులోకి ప్రతిభావంతులు ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ప్రతి క్రీడాకారుడు పోటీల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వమే సమకూరుస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థలకు చేరిన కిట్లను మరోసారి పరిశీలించి క్షేత్రస్థాయికి వేగంగా పంపించేలా ఆదేశించాం. ఈ మెగా టోర్నీని ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ . ప్రత్యక్ష ప్రసారానికి సన్నాహాలు ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే మ్యాచ్‌ల వివరాలు, స్కోర్‌ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనుంది. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 10 మంది చొప్పున వలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. నియోజకవర్గస్థాయి పోటీలను యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. -
IND VS AUS: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త
భారత క్రికెట్ అభిమానులకు రిలయెన్స్ వారి జియో సినిమా శుభవార్త చెప్పింది. ఈ నెల 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్‌లను ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ సిరీస్ కోసం జియో సినిమా ప్రత్యేక కామెంటేటర్స్ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇందులో సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్ శ్రీకాంత్, శరణ్‌దీప్ సింగ్ తదితర మాజీ భారత క్రికెటర్లు ఉన్నారు. సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో, రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్‌లో, మూడో వన్డేలో రాజ్‌కోట్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ ముగియగానే భారత్‌లోనే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. కాగా, రిలయెన్స్ అనుబంధ సంస్థ అయిన వయాకామ్18 బీసీసీఐ మీడియా హక్కులను 5963 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే నుంచే బీసీసీఐతో వయాకామ్ ప్రయాణం మొదలుకానుంది. వాయకామ్ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ ప్రసార హక్కులను కూడా సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుండగా.. ఇవే మ్యాచ్‌లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఇదివరకే ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను (ఐపీఎల్ డిజిటల్ రైట్స్) కూడా దక్కించుకుంది. -
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్‌తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్‌తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్‌ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. జియో సినిమాలో ఫ్రీగా భారత్-విండీస్ సిరీస్
క్రికెట్ ప్రేమికులకు జియో సినిమా (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్) శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2023 సీజన్ తరహాలోనే త్వరలో ప్రారంభంకానున్న భారత్-వెస్టిండీస్ సిరీస్‌ను జియో సినిమాలో ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. జులై 12-ఆగస్ట్ 13 వరకు జరిగే ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అధినేత ఆకాశ్ అంబానీ వెల్లడించారు. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ షాక్, మెటా మరో సంచలన నిర్ణయం!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే యాప్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్లడించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజర్లు కొత్త పోస్టులను క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను షట్‌డౌన్ చేయనున్న మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్ట్‌లు, ప్రాజెక్ట్‌లను నిలిపివేసింది. ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టవిటీ డివిజన్‌ను షట్‌డౌన్ చేయనుంది. డెన్మార్క్‌లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని ఆపేసింది. 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు అక్టోబర్ నెలలో ప్రకటించింది. ఆగష్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయలనుకున్నట్టు మెటా తెలిపింది. -
మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్..
ముంబై: మహారాష్ట్ర ముంబై నగర వీధుల్లో దక్షిణ కొరియాకు చెందిన యూట్యూబర్‌ను వేధించాడు ఓ ఆకతాయి. ఆమె లైవ్ వీడియో చేస్తున్న సమయంలో వచ్చి ఇబ్బందిపెట్టాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బలవంతంగా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ యువకుడి చేష్టలకు ఆ యూట్యూబర్ భయాందోళన చెందింది. వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయినా ఇద్దరు యువకులు బైక్‌పై ఆమె వెనకాలే వెళ్లి మరోసారి వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆదిత్య అనే ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దక్షిణ కొరియా యూట్యూబర్‌ను వేధించిన ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దని పేర్కొన్నాడు. 1000 మంది ముందు ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. ముంబై పోలీసులను ట్వీట్లో ట్యాగ్ చేశాడు. @MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last night while she was live streaming in front of a 1000+ people. This is disgusting and some action needs to be taken against them. This cannot go unpunished. pic.twitter.com/WuUEzfxTju — Aditya (@Beaver_R6) November 30, 2022 ముంబై పోలీసులు దీనిపై స్పందించారు. యూట్యూబర్ తన వివరాలు చెబితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. అనంతరం కొన్ని గంటలకే వీడియోలోని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వేరే దేశం నుంచి వచ్చిన మహిళను వేధించిన యువకునిపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మన అతిథులతో ఇలాగేనా ప్రవర్తించేది? అని కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి ఆకతాయిలను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: గుజరాత్ తొలి విడత పోలింగ్.. ఓటేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా -
ఒక్కరోజు ముందుగానే.. సీజేఐ వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నే తృత్వంలోని ప్రధాన ధర్మాసనం జరిపే చివరి సారి విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జస్టిస్ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవుదినం. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం సోమవారం జరిపే లాంఛన విచారణను తమ వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. రిటైరయ్యే సీజేఐ చివరి విచారణను తన వారసునితో కలిసి చేపట్టడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఆగస్టు 26న సీజేఐగా రిటైరైన జస్టిస్ ఎన్.వి.రమణ చివరి రోజు చేపట్టిన విచారణను తొలిసారిగా కోర్టు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇదీ చదవండి: హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు! -
స్పెషల్ రికార్డు సృష్టించనున్న టీ20 ప్రపంచకప్-2022
ICC T20 World CUP 2022 creates very SPECIAL RECORD: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 ప్రారంభం కాకముందే ఓ స్పెషల్ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్.. ఏకంగా 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటి వరకు ఈ క్రికెట్ ఈవెంట్ కూడా ఇన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. ఇదే తొలి సారి కావడం విశేషం. అదే విధంగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 10,000 గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని ఛానెల్‌లు ఇవ్వనున్నాయి. మరోవైపు ప్రపంచకప్ మ్యాచ్ జరిగే అన్ని స్టేడియాల్లో ఐసీసీ దాదాపు 35కు పైగా కెమరాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా మ్యాచ్ హైలెట్స్‌ను T20worldcup.com, టీ20 వరల్డ్ కప్ యాప్‌లో గానీ వీక్షించవచ్చు. భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ప్రాంతీయ బాషల్లో కూడా ప్రసారం చేయనుంది. ఇక ఆక్టోబర్ 16న గీలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమిబీయా మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్-2022కు తెరలేవనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా -
ప్రత్యక్ష ప్రసారం ప్రజాస్వామ్యానికి బలం
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమూల మార్పు జరిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలూ లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. న్యాయ ప్రక్రియలోని పారదర్శకత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అయితే ముఖ్యమైన విచారణలను లైవ్ టెలికాస్ట్‌కి అనుమతిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 27నే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకమైన కేసుల విచారణను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని తీసుకున్న నిర్ణయానికి అదే నాంది అయింది. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టుల్లో జరిగే విచారణలను ప్రజాప్రయోజనం రీత్యా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. వారు సూచించినట్లుగానే ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని బలోపేతం చేయడంలో న్యాయపరమైన కృషికి జీవం పోస్తాయి. ఆనాడు వారు ప్రదర్శించిన ఆ దార్శనికతకు తదనంతర ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, యుయు లలిత్‌ల పూర్తి మద్దతు లభించింది. నాలుగేళ్ల అనంతరం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సెప్టెంబర్ 20న ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్పర్సన్, ప్రత్యక్ష ప్రసారాలు మొదలెట్టడానికి వెనుక చోదక శక్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్, ఆ రోజు తన కోర్టులో విచా రణను మొదలు పెడుతూ ‘మేం ఇప్పుడు వర్చువల్’ అని ప్రకటిం చారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత సర్వోన్నత న్యాయస్థానం మనసా వాచా ఒక గొప్ప పనికి పూనుకుంది. ‘ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పనిని మనం చేయలేకపోతే మనం ఏదీ సాధిం చలేం. తక్కిన ప్రపంచం ముందుకెళుతుంటే న్యాయం మాత్రం యథా తథంగా స్తంభించిపోయి ఉంటుంది. ఇది ప్రపంచానికీ, న్యాయానికీ కూడా మంచిది కాదు’ అని దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధ బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ చెప్పిన గొప్పమాటలను భారత సుప్రీంకోర్టు స్ఫూర్తిగా తీసుకుని ఆచరణను ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించడం ద్వారా... కీలక మలుపు తిప్పగలిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు గత, ప్రస్తుత చీఫ్ జస్టిస్లను, సుప్రీంకోర్టు జడ్జీలను అభినందించాల్సి ఉంటుంది. దానికి వారు అర్హులు కూడా అని చెప్పాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన, ప్రభావ శీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కింది కారణా లను మనం చూపించవచ్చు. ఒకటి: దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలు లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. అలాగే న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. ప్రజలకు అందుతున్న న్యాయ ప్రక్రియలోని పారదర్శకత, సౌలభ్యత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను పౌరులకు అందు బాటులోకి తేవడం అనేది సమాచారాన్ని ఎల్లెడలా నింపుకున్న పౌరు లను అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైన దశగా చెప్పాలి. రెండు: ఈ నిర్ణయం చట్టపాలన ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తుంది. దరిద్ర నారాయణుల, చారిత్రకంగా వెనుక బడిపోయిన, సాధికారతకు దూరమైపోయిన వర్గాల హక్కులను న్యాయవ్యవస్థ గట్టిగా పరిరక్షిస్తుందని ప్రజలు విశ్వసించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. సత్యాన్ని శక్తిమంతంగా మాట్లాడడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. దీని ప్రత్యక్ష ప్రభావం వెంటనే బయటపడక పోవచ్చు కానీ చట్టబద్ధపాలనను గౌరవించే సంస్కృతిని నిర్మించే శక్తి ఈ నిర్ణయానికి ఉందని చెప్పితీరాలి. మూడు: న్యాయ నిర్ణయ విధానంలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలను సాధారణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం అరుదుగానే జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అనేవి న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ మాత్రమే వదిలివేయాల్సిన ముఖ్యమైన విషయాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు కోర్టు విచారణలను ప్రత్యక్షంగా చూడడం వల్ల లక్షలాది సామాన్య భారతీయులు తాము శిక్షణ పొందిన న్యాయ వాదులు కాకున్నప్పటికీ, న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలలోని నేపథ్యాన్నీ, సందర్భాన్నీ అర్థం చేసుకోవడమే కాదు... న్యాయనిర్ణయ క్రమంలో తటస్థించే... పోటీ పడే విలువలు, ఘర్షించే హక్కులను కూడా వారు ప్రశంసించగలుగుతారు. కోర్టు విచారణల ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ద్వారా సుప్రీంకోర్టు బలీయమైన విశ్వాసాన్ని పాదుకొల్పింది. నాలుగు: ఈ నిర్ణయం న్యాయవాద వృత్తి నాణ్యతను, ప్రమా ణాలను పెంచగలుగుతుంది. లాయర్లు కోర్టుముందు కనిపించడానికి చక్కగా సిద్ధమవుతారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేయ కూడదనే వివేచనతో ఉంటారు. ఇప్పుడు తమ వాదనలను ప్రజలు నేరుగా చూడటం పట్ల లాయర్లలో సానుకూల వైఖరి పెరుగుతుంది. న్యాయాన్ని అందించే యంత్రాంగాలను న్యాయవాదులు గతంలో కంటే మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. యువ న్యాయవాదుల సన్నద్ధత, మేధో కుశలత కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి వారి న్యాయవాద వృత్తికి అది ఉన్నత స్థాయిని కట్టబెడుతుంది. భారతదేశంలో న్యాయవాద విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని న్యాయవాద కళాశాలల్లో నాణ్యమైన బోధనను, పరిశోధనను పెంచడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. న్యాయవాద వృత్తిలోని వ్యాజ్యాలకు సంబంధించిన అంశంలో ప్రవేశించడానికి చాలామంది న్యాయవాద పట్టభద్రులు ఆసక్తి చూపని ధోరణి చాలా సంవత్స రాలుగా కలవరపెడుతోంది. కార్పొరేట్ లావాదేవీల ప్రపంచానికి వ్యతిరేకంగా... కఠిన షరతులు, ఉదాసీనత కారణంగా మన యువ న్యాయవాదులు లావాదేవీల బార్లో చేరడానికి సంసిద్ధత తెలుపడం లేదు. లాయర్ల వాస్తవ వాదనలను తిలకించడం, న్యాయమూర్తులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వంటి విచారణలను తిలకించడం వల్ల, సాపేక్షంగా నిర్లక్ష్యానికి గురైన ఈ క్షేత్రంలోకి న్యాయవాద విద్యార్థులు వచ్చేలా ప్రభావితం చేయవచ్చు. జ్యుడీషి యరీ, న్యాయవాద వృత్తి పనితీరుకు సంబంధించిన నూతన స్కాలర్ షిప్, పరిశోధనా రంగాలపై పనిచేసేలా లా ఫ్యాకల్టీ సభ్యులు, న్యాయ పరిశోధకులు ప్రేరణ పొందవచ్చు. టెక్నాలజీ అనేది సంఘీభావాన్ని బలోపేతం చేసి, దూరానికి సంబంధించిన అవరోధాలను అధిగమించడంలో గొప్ప ఉపకరణంగా ఉంటుంది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఆశిద్దాము. పైగా చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల వద్దకు, వారి రోజువారీ చర్చల వరకు తీసుకెళ్లడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. అమెరికా సుప్రీంకోర్టు విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అలివర్ వెండెల్ హోమ్స్ గతంలో ఒక అద్భుత వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచంలో అతిగొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడ నిలిచామన్నది కాదు; మనం ఏ దిశగా వెళుతున్నామన్నదే ప్రధానమైనది.’ మనం నిజంగానే సరైన దిశలో పయనిస్తున్నామని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు. సి. రాజ్ కుమార్ వ్యాసకర్త వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. విచారణలు ఇలా చూడండి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని మూడు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారా విచారణలు ప్రసారం చేయనున్నట్లు సీజేఐ యూయూ లలిత్ తెలిపారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. తర్వాత మిగతా అన్నింటిని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్ స్ట్రీమింగ్కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. కాగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ 27సుప్రీంకోర్టు కేసుల వాదనలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. చివరికి సెప్టెంబర్ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ యూయూ లలిత్ ఈనెల 20న నిర్ణయించారు. మొదటి స్ట్రీమింగ్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైందిద. మరో విచారణలో మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే Vs ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విబేధాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. చదవండి: జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు -
Asia Cup 2022: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్! ఫ్రీగా చూడాలనుకుంటున్నారా?
Asia Cup 2022 Broadcast: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం(ఆగష్టు 28) రాత్రి ఏడున్నర గంటలకు దాయాదుల పోరు ఆరంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీరాభిమానులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2022 టోర్నీ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. మొబైల్లో వీక్షించేందుకు వీలుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. అయితే, ఈ రెండు మాధ్యమాల్లో మ్యాచ్‌లు చూడాలంటే తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రికెట్ వీరాభిమానులైతే కచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారనుకోండి! అయితే, మెగా టోర్నీ మ్యాచ్‌లను టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటున్న దేశీవాసులకు మాత్రం ఓ గుడ్‌న్యూస్! అదేమిటంటే.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ ఆధ్వర్యంలోని డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీడిష్లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. కాగా దూరదర్శన్‌లో ఆసియా కప్ ప్రసారాలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఫ్రీగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం.. భలే బాగుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇక అత్యధిక ఆసియా కప్ టైటిళ్లు గెలిచిన, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ ఎలా పుట్టిందో తెలుసా?.. ఆసక్తికర విషయాలు It’s momentous. It’s legendary. It’s epic.💥 #AsiaCup2022 #INDvPAK pic.twitter.com/cpHI0G4qm0 — Doordarshan Sports (@ddsportschannel) August 24, 2022 -
లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి!
బీజింగ్: ఆన్లైన్ పోర్టలోలో ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న మాజీ భార్యను హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేశారు. చైనాలో ఈ ఘటన జరిగింది. సిచువాన్ ప్రావిన్స్‌లో నివసించే టాంగ్ లూ తన భార్య లామూను వేధించేవాడు. దీంతో 2020లో విడాకులు తీసుకుంది. మళ్లీ పెళ్లాడాలని వేధించాడు. 2020 సెప్టెంబర్‌లో ఆమె ఇంటికొచ్చాడు. అప్పటికే ఆమె టిక్‌టాక్ లాంటి ఆన్లైన్ పోర్టల్ డౌయిన్‌లో లైవ్ కార్యక్రమాలు చూస్తోంది. తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించి, ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పటించాడు. తీవ్రంగా గాయపడిన లామూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని వారాల తర్వాత మరణించింది. ఈ సంఘటన చైనాలో తీవ్ర సంచలనం సృష్టించింది. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం 2021 అక్టోబర్‌లో అతడికి మరణ శిక్ష విధించింది. ఇటీవలే అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. ఇదీ చదవండి: మృత్యువులోనూ వీడని స్నేహం -
ప్రత్యక్ష ప్రసారాలకు సీజే ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసార నిబంధనలకు ప్రధాన న్యాయమూర్తి ఆమో దం తెలిపారు. ఈ నిబంధనలను, కోర్టు కార్య కలాపాల రికార్డింగ్‌ను అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. 2022, మే 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రత్యక్ష ప్రసారాల నిబంధన లను రూపొందించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ అడ్వొకేట్ శ్రీలేఖ పూజారి గత సంవత్సరం అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వా లని హైకోర్టు పాలన విభాగాన్ని సుప్రీంకోర్టు ఈ ఫిబ్రవరిలో ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. ముఖ్యమైన కేసుల ప్రత్యక్ష ప్రసారాలకు 2018లో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా చాలా హైకోర్టుల్లో అమలుకావడం లేదు. గుజరాత్ హైకోర్టు తొలిసారి లైవ్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, పట్నా హైకోర్టుల్లో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారమవుతోంది. వీటిని యూట్యూబ్‌లోనూ అప్లోడ్ చేస్తున్నారు. -
ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం.. స్టార్ స్పోర్ట్స్ లింకును దొంగిలించి..!
Tamil Nadu Man Arrested For Streaming IPL Matches In Own App: సొంత యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని వ్యక్తులు తమ లింకును దొంగిలించి ఓ యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన స్టార్ స్పోర్ట్స్ టీవీ ప్రతినిధి కదరామ్ తుప్పా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ యాప్‌ను తమిళనాడులోని శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం తమిళనాడు వెళ్లిన పోలీసులు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్ కోయిల్ వీధిలో ఉంటున్న రామమూర్తి (29) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ టీవీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఛానల్ బీసీసీఐతో 16,347 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. అయితే కొందరు ఫ్రాడ్లు అక్రమంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ లీగల్‌గా ఒప్పందం చేసుకున్న సంస్థలకు నష్టం చేకూరుస్తున్నారు. టీవీల్లో ఐపీఎల్ వ్యుయర్షిప్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటమే ఇందుకు నిదర్శనం. చదవండి: IPL 2022: సీఎస్కేకు మరో భారీ షాక్.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్ -
ఆగిపోయిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ లైవ్ స్ట్రీమింగ్, అసలేమైందంటే..
Bigg Boss Non-Stop Live Issue: బిగ్‌బాస్ రియాలిటీ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. తెలుగులో ఇప్పటికే 5సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్ అయిపోయింది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో ప్రేక్షకులకు 24 గంటల ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఈ సరికొత్త బిగ్‌బాస్ ఇటీవల ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మొదలై దాదాపు వారం రోజులు గడిచింది. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ అప్పుడే హౌజ్‌లో గొడవలు, టీంలు, నామినేషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫుల్ ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నిన్న ఆటంకం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ తరచూ ఆగిపోతోంది. అయితే దీనిపై తరచూ సబ్స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే అందరినీ నిరాశపరుస్తూ నిన్న అర్ధరాత్రి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. ఒక్కసారిగా షో ఆగిపోవడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. షో ఎందుకు ఆగిపోయిందో హాట్ స్టార్ వెల్లడించలేదు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది. చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు -
క్రికెట్ అభిమానులకు అమెజాన్ ప్రైమ్ శుభవార్త..
Live Cricket Streaming On Amazon Prime: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్.. కొత్తగా క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్‌లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నూతన సంవత్సరం(2022) తొలి రోజు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌ను లైవ్‌లో ప్రసారం చేయడం ద్వారా సరికొత్త రంగంలోకి అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట లైవ్ స్ట్రీమ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా క్రికెట్‌ను వీక్షించారు. అమెజాన్ ప్రైమ్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పదం కుదుర్చుకుని, స్వదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇదివరకే క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్‌దే పైచేయి -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు న్యూఇయర్ బంపర్ గిఫ్ట్..!
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అమెజాన్ గుడ్‌న్యూస్‌ను అందించింది. వచ్చే ఏడాది నుంచి క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ సేవలను అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొందవచ్చునని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొదటి మ్యాచ్ వారిదే..! న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ను జనవరి 1, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమ్ కానుంది. నవంబర్ 2020లో, అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి లైవ్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా...న్యూజిలాండ్ ఆడే అంతర్జాతీయ పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌లను ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనున్నాయి. ఇండియా మ్యాచ్‌లు కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే...! స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్ భారత క్రికెట్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ విభాగంలోకి అమెజాన్ కూడా రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగే సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. భారత మహిళల క్రికెట్ మ్యాచ్‌లతో పాటుగా నవంబర్ 2022లో భారత, న్యూజిలాండ్ పురుషుల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా స్ట్రీమ్ అవ్వనున్నాయి. వీటితో పాటుగా న్యూజిలాండ్ మెన్స్ జట్టు 2022 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా పర్యటన, మార్చి 2022లో ఆస్ట్రేలియా పర్యటన, మార్చి/ఏప్రిల్ 2022లో నెదర్లాండ్ పర్యటనలను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లైవ్ స్ట్రీమ్ కానుంది. లైవ్‌తో పాటుగా..! అమెజాన్ ప్రైమ్ యూజర్లు మ్యాచ్‌ల రన్-అప్‌లో భాగంగా అనేక క్రికెట్ ప్రోగ్రామింగ్, ఇతర హైలైట్లను కూడా యాక్సెస్ చేయవచ్చు. చదవండి: బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్.. వరెస్ట్‌గా మోస్ట్ పాపులర్ యూజింగ్ సైట్/యాప్ -
సిటీలో క్రికెట్ జోష్.. మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో..
సాక్షి, హైదరాబాద్: సిటీలో క్రికెట్ జోష్ పెరిగింది. ఎక్కడ చూసినా టీ20 ఫీవర్ కన్పిస్తోంది. సుదీర్ఘకాలం తరువాత ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నగర క్రికెట్ అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారీ స్క్రీన్స్‌పై... అభిమానులు ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ను చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వీరిని ఆకర్షించడానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈసారి అత్యధిక సంఖ్యలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మల్లీప్లెక్స్ థియేటర్స్‌లోనూ క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారీ తెరలపై ప్రదర్శించడానికి కొందరు యజమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండాపూర్, కోకాపేట్లాంటి ప్రాంతాల్లోని కొన్ని లగ్జరీ విల్లాల్లో కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో మ్యాచ్‌ను తిలకించడానికి ఏర్పాట్లు చేశారు. జోరుగా బెట్టింగ్... ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ కేంద్రంగా జరుగుతున్న ఈ బెట్టింగ్ రాకెట్లో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావటంతో రూ.1,000 బెట్టింగ్‌పై రూ.20, 30 వేలకు పైగానే పందెం సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 94906 17444 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటి -
సాంకేతికత రెండంచుల కత్తిలాంటిది!
న్యూఢిల్లీ: కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ (ప్రత్యక్ష ప్రసారం) ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థలో అనవసరపు గోప్యత తొలగిపోతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అయితే లైవ్‌స్ట్రీమ్ అనేది కొన్ని సందర్భాల్లో రెండంచులున్న కత్తిలాగా మారుతుందని, అలాంటప్పుడు న్యాయమూర్తులు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తులు పాపులర్ ఒపీనియన్ (జనాకర్షక అభిప్రాయాలు)కు లొంగకూడదన్నారు. గుజరాత్ హైకోర్టులో ఆన్లైన్ లైవ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఆరంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయన్న విషయం తెలుసుకునే హక్కుందని, ప్రజలకు సంపూర్ణ సమాచారం అందితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానంలో జాగరూకత అవసరమని, లైవ్‌స్ట్రీమింగ్‌తో జడ్జిలపై రకరకాల ఒత్తిడులు పడతాయని, దీంతో తీరైన న్యాయాన్ని అందించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఒక్కోమారు ప్రజలు మెచ్చిన అభిప్రాయం న్యాయానికి వ్యతిరేకంగా ఉండొచ్చని, అయినా రాజ్యాంగానికి లోబడి న్యాయాన్నే అనుసరించాలని ఉద్భోదించారు. ప్రైవసీ సమస్యను గుర్తించాలి లైవ్‌స్ట్రీమింగ్‌తో క్లయింట్ల ప్రైవసీకి సంబంధించి ఇబ్బందులు ఎదురుకావచ్చని, అలాగే కీలక సాక్షులు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడం ఆందోళనకరమైన అంశమని జస్టిస్ రమణ గుర్తు చేశారు. వీరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్ష ప్రసార నిబంధనలు రూపొందించుకోవాలన్నారు. న్యాయవాదులు సైతం జాగ్రత్తగా వ్యవహరించాలని, పబ్లిసిటీ కోసం పాకులాడకూడదని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో కొన్నిచోట్ల లైవ్‌స్ట్రీమింగ్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తామని చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా కొన్ని విషయాల గురించి ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉందని, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పనితీరుపై సరైన అవగాహన లేదని చెప్పారు. జనాల్లో న్యాయవ్యవస్థ గోప్యత, గూఢతపై నెలకొన్న సంశయాలను తీర్చే సమయం ఆసన్నమైందని, లైవ్‌స్ట్రీమింగ్ ఇందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. కోర్టుల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ చేస్తున్న కృషిని సీజేఐ కొనియాడారు. కేసుల భారం.. పనితీరుకు సూచిక కాదు సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ న్యాయస్థానాలలో ‘పెండెన్సీ’4.5 కోట్ల కేసులకు చేరుకుందని తరచుగా కోట్ చేసే గణాంకం.. ఇది కేసుల భారాన్ని ఎదుర్కోవడంలో భారత న్యాయవ్యవస్థ యొక్క అసమర్థతగా చిత్రించినట్టుగా ఉంటుందని, దీనిని ‘అతిగా అంచనా వేయడం’గా, ‘అనాలోచిత విశ్లేషణ‘గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. పెండెన్సీ కేసుల భారం పనితీరు కొలిచేందుకు ఉపయోగపడే సూచిక కాదని ఆయన పేర్కొన్నారు. అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో వేసే ‘విలాసవంతమైన వ్యాజ్యాలు’న్యాయ విచారణ జాప్యానికి దోహదపడే కారకాల్లో ఒకటన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతం సహా వివిధ కారణాల వల్ల ఏ సమాజంలోనూ విభేదాలు తప్పవని, వీటి పరిష్కారానికి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. మధ్యవర్తిత్వం వివాద పరిష్కారానికి చాలా ముందస్తుగా ఉపయోగించిన సాధనమని చెప్పారు. మధ్యవర్తిత్వం భారతీయ నైతికతలో లోతుగా ఇమిడి ఉందని, దేశంలో బ్రిటిష్ విచారణ వ్యవస్థకు ముందు ఇది ప్రబలంగా ఉందని, వివాద పరిష్కార పద్ధతిగా వివిధ రకాల మధ్యవర్తిత్వాలను ఉపయోగించేవారని చెప్పారు. ఇండియా–సింగపూర్ మధ్యవర్తిత్వ సదస్సులో ప్రధాన వక్తగా ఉపన్యాసం ఇచ్చారు. అనేక ఆసియా దేశాలు సహకార, స్నేహపూర్వక పరిష్కారం అందించడంలో సుదీర్ఘమైన, గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయని జస్టిస్ రమణ అన్నారు. ‘గొప్ప భారతీయ ఇతిహాసమైన మహాభారతం.. వాస్తవానికి సంఘర్షణ పరిష్కార సాధనంగా మధ్యవర్తిత్వం కోసం ప్రారంభ ప్రయత్నానికి ఒక ఉదాహరణను అందిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పాండవులు, కౌరవుల మధ్య వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు. మధ్యవర్తిత్వ వైఫల్యం ఘోరమైన పరిణామాలకు దారితీసింది..’అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ కూడా ఈ కార్యక్రమంలో తన ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. -
లైవ్‌లో బూతులు.. భార్యతో సహా పబ్జీ మదన్ అరెస్ట్
సాక్షి, చెన్నై: యూ ట్యూబ్ చానల్ గేమ్స్ పేరిట పబ్జీ మదన్ సాగించిన వ్యవహారం గురించి తెలిసిందే. నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు.. మహిళల పట్ల ఆసభ్య పదజాలంతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మదన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడిని చెన్నై పోలీసులు శుక్రవారం ధర్మపురిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛానల్‌కు అడ్మిన్‌గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కృతికను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వీరి చానల్‌కు 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని, వారిలో మైనర్లే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక మదన్ చానల్ వేదికగా గేమ్స్ ఆడిన వారిలో సంపన్నుల పిల్లలే ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్.. మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్ అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్ గురించి వీడియోలు చేశాడు. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. భారత్‌లో బ్యాన్ చేసిన పబ్జీ గేమ్ ఆడుతూ ఇటీవల బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో ఛానల్‌ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో చెన్నై వాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మదన్ కోర్టును ఆశ్రయించాడు. జడ్జి దండపాణి మాట్లాడుతూ.. చానల్ వేదికగా మదన్ మహిళలను అసభ్యపద జాలంలో దూషించిన ఆడియోను విన్న తర్వాత బెయిల్ కోసం వాదించండి అంటూ మదన్ న్యాయవాదికి హితవు పలికారు. మదన్ వాయిస్ రికార్డులు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు షాక్‌కు గురయ్యింది. జూన్ 17న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. మదన్ వద్ద మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: లైవ్‌లో మదనుడి బూతులు, రాసలీలల స్క్రీన్ షాట్స్ -
న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలపై సూచనలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్లపై సుప్రీంకోర్టు ఈ–కమిటీ నమూనా నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాను పబ్లిక్ డొమైన్ ఉంచి దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని భాగస్వాములను కోరింది. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను, సంబంధిత పక్షాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా... ఈ సదుపాయాన్ని తెస్తున్నారు. నమూనా నిబంధనలను బాంబే, ఢిల్లీ, మద్రాస్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో కూడిన కమిటీ రూపొందించింది. ‘‘నమూనా నిబంధనల ముసాయిదా తయారీకి ఉపకమిటీ విస్తృతమైన చర్చలు చేసింది. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో 2018లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలు పరిగణనలోకి తీసుకుంది. న్యాయవాదులు, సాక్షుల గోప్యత, ఇతరత్రా గోప్యతలకు సంబంధించిన అంశాలు, కొన్ని సందర్భాల్లో కేసు సున్నితత్వం కారణంగా ప్రజా ప్రయోజనాన్ని కాపాడడంతోపాటు విచారణపై కేంద్ర, రాష్ట్ర చట్టాల నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. నమూనా నిబంధనల ముసాయిదా ఈ–కమిటీ వెబ్సైట్లో లభ్యమవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఈ–కమిటీ ఛైర్ పర్సన్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. సలహాలు, సూచనలు ఇవ్వాలని లేఖ రాశారు. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమన్యాయం హక్కులో భాగంగా ఈ ప్రత్యక్షప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయని లేఖలో నొక్కి చెప్పారు. నమూనా నిబందనలపై సూచనలు సలహాలు ఈ నెల 30 లోగా ecommissione ree@aij.gov.inకు పంపాలని సూచించింది. ముసాయిదాలో ముఖ్యాంశాలు ►కోర్టు హాలులో ఐదు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒకటి నేరుగా ధర్మాసనం వైపునకు ఉంటుంది. రెండు కెమెరాలు న్యాయవాదుల వైపు ఉంటాయి. నాలుగో కెమెరా అవసరమైన సమయంలో నిందితుడి కోసం వినియోగిస్తారు. ఐదో కెమెరా సాక్షలు వైపు ఉంటుంది. ►ఏ క్షణంలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయడానికి ధర్మాసనంలోని న్యాయమూర్తి వద్ద రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ధర్మాసనం అనుమతించిన తర్వాత న్యాయవాదులు, సాక్షులు, నిందితులు లేదా ఇతరత్రా వ్యక్తులు కోర్టులో సంభాషించడానికి మైక్రోఫోన్లు అందిస్తారు. ►ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్ నిమిత్తం ప్రతి కోర్టు కాంప్లెక్స్‌లోనూ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ (డీసీఆర్) ఏర్పాటు చేస్తారు. ►రిజిస్ట్రార్ (ఐటీ) పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష ప్రసారాలను సమన్వయం చేస్తారు. ►వివాహ సంబంధ అంశాలు, బదిలీ పిటిషన్లు, లైంగిక వేధింపుల కేసులు, ఐపీసీ సెక్షన్ 376 ప్రొసిడీంగ్స్, మహిళలపై లింగ వివక్ష దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రత్యక్షప్రసారాలు ఉండవు. ప్రధాన న్యాయమూర్తి లేదా ధర్మాసనంలోని న్యాయమూర్తి సూచనల మేరకు ఇతర అంశాల్లోనూ ప్రత్యక్షప్రసారాలను అనుమతించరు. శాంతి భద్రతల ఉల్లంఘనలకు దారితీసే వర్గాల మధ్య విభేదాల కేసులు కూడా ధర్మాసనం అనుమతి ఉంటేనే ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ►విచారణకు ముందే ప్రత్యక్ష ప్రసారంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలకు కోర్టు మాస్టర్/రీడర్ తెలియజేస్తారు. ఆయా అభ్యంతరాలు సంబంధిత ధర్మాసనానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది. ►ప్రత్యక్ష ప్రసారం చేయని కేసుల రికార్డింగులు కోర్టు నిర్వహణలో భాగంగా భద్రపరుస్తారు. ►విచారణలకు హాజరయ్యే విజిటర్లు, మీడియా వ్యక్తులు ఆడియో, వీడియో రికార్డు చేయడానికి అనుమతి ఉండదు. ►విచారణ సమయంలో అందరూ న్యాయమూర్తి సూచనలు తప్పకుండా పాటించాలి. ►నిబంధనలు ఉల్లంఘించి వారికి చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్‌తోపాటు కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేస్తుంది. ►ట్రాన్స్‌స్రిప్ట్‌లను ఆంగ్లంతోపాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. -
లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్
వాషింగ్టన్: న్యూస్ రిపోర్టర్‌గా లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత ఈజీ కాదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయాలి. ఒక్కోసారి అనుకోని పరిణామాలు జరిగి రిపోర్టర్స్ తమ ఏకాగ్రతను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలదన్నట్లు సీరియస్ అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ఇంట్లోని పెంపుడు జంతువులో లేక ఇతర జంతువులేవైనా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపిస్తే రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలైనా.. దానిని చూసే వారికి మాత్రం నవ్వు తెప్పించడం ఖాయం. తాజాగా సీఎన్ఎన్ రిపోర్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనూ రాజు అనే వ్యక్తి సీఎన్ఎన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజు వాషింగ్టన్ డీసీలో తన లైవ్ బైట్‌కు సిద్ధమయ్యాడు. దర్జాగా సూట్ వేసుకొని వార్తలు చదివేయడానికి ప్రిపేర్ అయ్యాడు. కెమెరాను చూస్తూ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సూట్‌పై ఒక పరుగు పాకుతుండడం కెమెరాకు చిక్కింది. రాజు దానిని గ్రహించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఆ పురుగు అతని మెడ వద్దకు రావడంతో లైవ్‌లో ఉన్నానన్న విషయం మరిచిన రాజు పురుగును అవతలికి విసిరేశాడు. ఆ తర్వాత పక్కనున్న వారిని '' అలాంటి పురుగులు నా జట్టులో ఉన్నాయా '' అంటూ అడిగాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉండడంతో అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. ఈ వీడియోను స్వయంగా రాజు తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ Had an unwelcome visitor try to crawl into my live shot earlier. pic.twitter.com/Pu68z0cWSN — Manu Raju (@mkraju) May 27, 2021 -
1.5 లీటర్ల వోడ్కా ఛాలెంజ్.. చివరికి
మాస్కో : వోడ్కా ఛాలెంజ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు. అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు. దీంతో ఈ సరదా ఛాలెంజ్ విషాదంగా ముగిసింది. వివరాల ప్రకారం.. లైవ్‌లో హాట్ సాస్ లేదా, వోడ్కాను తాగాల్సిందిగా ఓ యూట్యూబర్ సవాల్ విసిరాడు. ఈ ఛాలెంజ్ పూర్తిచేసిన వారికి రివార్డ్‌గా పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయని ప్రకటించాడు. దీంతో ఈ పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ప్రత్యేకంగా ఏజ్ లిమిట్ ఏదీ విధించకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ పోటీలో పాల్గొన్నాడు. (వైరల్: గుడిసెకు కాళ్లు వచ్చాయా?) లైవ్ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. రష్యన్ సెనేటర్ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కొత్తగా ఎన్నోరకాల ఛాలెంజ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెస్తున్నాయి. దీంతో ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. (53 ఏళ్లకు దొరికిన పర్స్, ఏదీ మిస్ అవ్వలేదు!) -
కొడుకు పెళ్లి.. ఫోన్లో తల్లిదండ్రుల దీవెనలు
సాక్షి, బెంగళూరు: లాక్డౌన్ కారణంగా కుమారుడి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు సాంకేతికత సహాయంతో ఫోన్లోనే కళ్యాణాన్ని వీక్షించారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఎవరూ ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు. ఈ సమయంతో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా కొడూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ జాయిస్, జయలక్ష్మీ దంపతుల కుమారుడు శివచంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన కావ్యశ్రీతో మే13న పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఘనంగా పెళ్లి జరిపించేందుకు ఫంక్షన్ హాల్ కూడా బుక్‌చేశారు. లాక్డౌన్ కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో ముందుగా అనుకున్న ముహూర్తానికే వధువు ఇంటి వద్ద నిరాడంబరంగా పెళ్లి జరిపించారు. శివమొగ్గ జిల్లాలో ఉన్న శివచంద్ర తల్లిదండ్రులు పెళ్లికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. తాళి కట్టిన సమయంలో ఫోన్ స్క్రీన్ మీద అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి వెళ్లలేని బంధువుల కోసం లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారని లక్ష్మీనారాయణ తెలిపారు. (టిక్‌టాక్.. ఎంత పని చేసింది?) -
దెయ్యాలను నిజంగా చూడాలనుకుంటున్నారా?
దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఇది ఇప్పట్లో ఒడవని ముచ్చట. కానీ దెయ్యాల మీద వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను భయపెట్టించి మరీ కాసులు కురిపించాయి. ముఖ్యంగా హాలీవుడ్లో దెయ్యాల సినిమాలు అనగానే గుర్తుకువచ్చేవి ది ఎగ్జారిస్ట్, ది కంజ్యూరింగ్, అనబెల్లె. వీటికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే "ది కంజ్యూరింగ్" సినిమా పుట్టుకకు కారణం.. పైన కనిపిస్తున్న భవనమే. ఇప్పుడీ భవనం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, మనమూ హారర్ సినిమాలో ఓ భాగమైనట్లు అనుభూతి చెందేందుకు ఓ కొత్త కార్యక్రమం రాబోతోంది. కొంతమంది ఈ ఇంట్లోకి వెళ్లి వారి ప్రతీ కదలికలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దాన్ని మనం ఇంట్లో నుంచే వీక్షించవచ్చు. చుక్కలు చూపించిన దయ్యాలు ఎన్నో యేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో తరతరాలుగా నివసిస్తున్న ఓ కుటుంబం ఆ ఇంట్లో నుంచి నిష్క్రమిద్దాం అనుకునే లోపే వారు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టినవారికి వింత అనుభవాలు ఎదురయ్యేవి. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దెయ్యాల పరిశోధకులు లోరెన్, ఎడ్ వారెన్ ఆ భవనంలోకి అడుగుపెట్టి సునితంగా అధ్యయనం చేశారు. అనంతరం అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో వారి కుమార్తె ఆండ్రియా ఈ ఇంటి గురించి "హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ లైట్: ద ట్రూ స్టోరీ" అనే పుస్తకం రాసింది. లైట్లు వెలుగుతూ.. ఆరిపోతూ.. ఆ తర్వాత 1970లో ఓ కుటుంబం ఆ ఇంట్లోకి దిగింది. అయితే నెమ్మదిగా అక్కడ ఉన్న దెయ్యాలు చుక్కలు చూపించడం మొదలు పెట్టాయి. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వాళ్లు ఏడాదికే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అది ఎన్నో హారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. హీన్జెన్ అనే వ్యక్తి గతేడాది ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు అతీత శక్తుల కదలిక ఉన్నట్లుగా గుర్తించాడు. ఆ మేరకు గదుల్లో అడుగుజాడలతోపాటు, తలుపు కొట్టుకుంటున్న శబ్ధాలు, లైట్లు వాటంతటవే వెలుగుతూ, ఆగిపోవడం కనిపించిందన్నారు. దీంతో కొంతమంది దెయ్యాల పరిశోధకులను ఇంట్లోకి పంపించి, వారి అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మే 9 నుంచి ఇంట్లోనే ఉంటూ వారం రోజులపాటు లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే మే 8న ద హౌస్ లైవ్ కార్యక్రమానికి సంబంధించి చిన్న ప్రివ్యూ కూడా వదలనున్నారు. దీన్ని డార్క్ జోన్ వెబ్సైట్ ఏర్పాటు చేస్తోంది. (ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు) నిజమైన దెయ్యాలను చూడవచ్చు ఇక ప్రేక్షకులు కంజ్యూరింగ్ హౌస్‌లో ఉన్నట్లుగా అనుభూతి చెందేదుకు ఆ ఇంట్లో పలు కెమెరాలను అమర్చనున్నారు. తద్వారా అతీత శక్తుల అలజడిని ప్రతి ఒక్కరూ స్వయంగా చూడగలరని డార్క్ జోన్ వెబ్సైట్ పేర్కొంటోంది. ఇంకేముందీ మీరూ సినిమా చూసేస్తామని రెడీ అయిపోకండి. ఎందుకంటే ఇది ఉచితమేమీ కాదు చిన్నపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి నాలుగున్నర డాలర్లు, వారమంతా చూడటానికి పంతొమ్మిదిన్నర డాలర్లు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అలా వచ్చిన డబ్బునంతా కోవిడ్-19 వ్యతిరేకంగా పనిచేసే చారిటీలకు ఇవ్వనున్నారు. టికెట్లు కొనుగోలు మే1 నుంచే ప్రారంభమైంది. ఇంకెందుకాలస్యం.. మరిన్ని వివరాలకు Darkzone వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేయండి, టికెట్లు బుక్ చేసుకుని దెయ్యాలను కనులారా వీక్షించండి. -
లైవ్ స్ట్రీమింగ్‌లో పోప్ ఈస్టర్ సందేశం
వాటికన్ సిటీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు. -
ఐఐటీ, జేఈఈ, నీట్కి ప్రిపేరవుతున్నారా?
హైదరాబాద్ : ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మీ ఇంట్లోనే ఉండి అనుభవఙ్ఞులైన అధ్యాపకులచే లైవ్ క్లాసెస్ వినే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడానికి వచ్చేసింది యుప్ మాస్టర్ యాప్. దీంట్లో 10-25 సంవత్సరాల అనుభవం ఉన్న లెక్చరర్స్ పాఠాలు బోధిస్తారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్‌ను దేశంలోని మెట్రో సిటీ నుంచి మారుమూల ప్రాంతాల వరకు అందరికీ చేరువ చేసేందుకు సిద్ధమైంది ఈ యాప్ అది కూడా చాలా తక్కువ ధరకే ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసులు మీ ఇంట్లోనే కూర్చొని వినొచ్చు. పాఠాలు బోధించడమే కాదు, లైవ్ చాటింగ్ ఫీచర్ ద్వారా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. వందల కొద్దీ వీడియోలు, మాక్ టెస్టులతో మిమ్మల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తాం అంటున్నారు యాప్ నిర్వాహకులు. “యుప్ మాస్టర్‌ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. పట్టణంలోనే ప్రతీ పల్లెలోనూ డోర్ డెలివరీలాగా క్లాసెస్‌ను విస్తరిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మంచి విద్యను పొందలేని విద్యార్థులకు ఈ యాప్ ద్వారా నాణ్యమైన బోధనను అందిస్తాం అని చెప్పటానికి గర్వంగా ఉంది. ప్రస్తుతానికి మా ఫోకస్ ఐఐటీ, జేఈఈ, నీట్ పైనే. కొన్ని రోజుల తర్వాత ప్రతీ విద్యార్థికి క్లాసెస్‌ను విస్తరిస్తాం” అని యాప్ సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫ్యాకల్టీ ద్వారా 45 రోజులపాటు ప్రతీరోజు నాలుగున్నర నుంచి ఆరు గంటలపాటు ఐఐటీ, జేఈఈ, నీట్ తరగతులను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థులకు అందిస్తారు. లైవ్ క్లాసెస్ యాక్సెస్ కూడా యుప్ మాస్టర్ యాప్ నిర్వాహకులే కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్‌లో మీరూ మెంబర్ అయిపోండి. క్వాలిటీ క్లాసెస్‌ను వినండి. -
ఆ హోటల్ రూమ్‌లో లైవ్ స్ట్రీమింగ్...
టోక్యో: జపాన్‌లోని ఓ హోటల్ వినూత్న ఆలోచన చేసింది. ఆ ఆలోచన కాస్తా వర్కవుట్ అవడంతో హోటల్‌కు జనాలు క్యూ కడుతున్నారు. వివరాలు.. జపాన్‌లోని అసాహి ర్యోకాన్ హోటల్లోని గదిలో ఒక రాత్రి బస చేయాలంటే 100 యెన్లు చెల్లిస్తే చాలు. దేశీయ కరెన్సీలో చెప్పాలంటే రూ.66 చెల్లిస్తే సరిపోతుంది. అయితే అది ఆ హోటల్లో ఉన్న మిగతా రూములకు వర్తించదు. కేవలం 8వ నెంబర్ గదికి మాత్రమే ఈ సదుపాయం ఉంది. అంతేకాదు.. అందులో బస చేయాలంటే హోటల్ యాజమాన్యం చెప్పే షరతులకు అంగీకరించాలి. ఇక ఒక్క డాలర్ అద్దెగదిలో అన్నిరకాల వసతులు ఉంటాయి. కానీ అదనంగా ఆ గదిలో ఓ కెమెరా కూడా ఉంటుంది. దీనిద్వారా రాత్రి గదిలో అద్దెకు దిగిన వారు చేసేదంతా యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తారు. అసలు ఈ ఆలోచన వీళ్లకొచ్చింది కాదు. ఓ బ్రిటీష్ ట్రావెలర్ ఈ హోటల్లో బస చేసిన రాత్రి లైవ్‌స్ట్రీమింగ్ చేశాడు. ఇది నచ్చిన సదరు యాజమాన్యం అదే ఆలోచనను అమల్లో పెట్టింది. వెంటనే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ.66కే అద్దె.. కానీ గదిలో బస చేసే రాత్రి మొత్తం అక్కడ ఏం జరుగుతుందో యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఫోన్ కాల్స్, ఇతరత్రా వ్యక్తిగత విషయాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ ఆలోచన చెప్పగానే హోటల్ చానల్‌కు 3వేల మందికి పైగా సబ్‌స్ర్కైబ్ అయ్యారు. ఎన్నో యాడ్లు వచ్చిపడుతున్నాయి. ఆలోచన వర్కవుట్ అవడంతో హోటల్ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
ఫేస్బుక్ లైవ్‌పై ఆంక్షలు
పారిస్: తమ లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. తీవ్రవాదం, విద్వేషాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. ‘క్రైస్ట్‌చర్చ్’మసీదు కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాదం పెచ్చుమీరకుండా ఉండేందుకు ఆ సంస్థలపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు ప్రపంచవ్యాప్తంగా ‘క్రైస్ట్‌చర్చ్’పిలుపునివ్వాలని సిద్ధమవుతున్నారు. మార్చిలో శ్వేత జాతీయుడు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 51 మంది చనిపోయారు. కాల్పులు జరుపుతూ దుండగుడు ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా జుకర్ బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఫేస్బుక్ వినియోగదారులు తీవ్రవాద సంబంద వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ‘న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమం తర్వాత తీవ్రవాదం వ్యాప్తిచేసేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపాం’అని ఫేస్బుక్ తెలిపింది. -
వినోదంలో యాప్‌లే ‘టాప్’
న్యూఢిల్లీ: బ్యాండ్‌విడ్త్ కోసం బెగ్గింగ్ చేసే రోజులు పోయాయిప్పుడు. ఒక వీడియోను డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఖర్చయిపోతుందేమోననే భయాలు కూడా లేవిప్పుడు. అందుకే... పెన్‌డ్రైవ్‌లోకి డౌన్లోడ్ చేసుకుని దాన్నే అలా చేతులు మార్చుకునే రోజులిప్పుడు లేవు. డౌన్లోడ్ చేసుకుంటే స్పేస్ వృథా అవుతుందన్న కారణంతో అంతా తమ సొంత టీవీల్లోనో, మొబైల్లోనో వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇదిగో... ఈ ధోరణి ఎంటర్టైన్మెంట్ రంగ రూపురేఖల్ని మార్చేస్తోంది. డిజిటల్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల టీవీ చానళ్లకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలు అమల్లోకి వచ్చాక ఓటీటీ వేగం మరింత పెరిగింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ– ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సర్వే ప్రకారం మీడియా– వినోద రంగానికి సంబంధించి 2019లో తొలిసారిగా సినిమాను డిజిటల్ విభాగం అధిగమించనుంది. 2021 నాటికి ప్రింట్‌ను కూడా దాటేసి రూ.35,400 కోట్ల స్థాయికి చేరనుంది. ఈ విభాగంలో ఇంత భారీ స్థాయిలో అవకాశాలుండటంతో ఓటీటీ సంస్థలు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 30 పైచిలుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి సినిమాలు, చానల్స్ ప్రసారంతో పాటు సొంతంగా సీరియళ్లు, సినిమాల్లాంటి కంటెంట్‌ను కూడా రూపొందిస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 1,200 గంటల నిడివి ఉండే తాజా కంటెంట్‌ను ఓటీటీ సంస్థలు నిర్మించాయి. హాట్‌స్టార్, ఈరోస్ నౌ, సోనీ లైవ్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హంగామా, వూట్, ఆల్ట్‌బాలాజీ, జీ5, సన్‌నెక్ట్స్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశీ సంస్థలు అంతర్జాతీయంగానూ విస్తరిస్తున్నాయి. ఈరోస్ డిజిటల్ తాజాగా చైనా సంస్థతో జట్టు కట్టి భారత్, చైనాలో ఒక ప్రోగ్రామ్‌ను చిత్రీకరిస్తోంది. బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా కో–మార్కెటింగ్ డీల్స్ కుదుర్చుకుంది. చౌకగా చార్జీలు.. ఓటీటీ సంస్థలు వీలైనంత చౌకగా కంటెంట్‌ను ఆఫర్ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు హాట్‌స్టార్ అన్ని స్పోర్ట్స్, అమెరికన్ షోస్, సినిమాలకు వార్షికంగా రూ.999 చార్జీలు వసూలు చేస్తోంది. రూ.299కి నెలవారీ ప్యాకేజీ కూడా అందిస్తోంది. టీవీల్లో ప్రసారం కాకముందే స్పెషల్స్, సీరియల్స్ మొదలైనవి చూడాలనుకునేవారి కోసం హాట్‌స్టార్ వీఐపీ పేరుతో వార్షికంగా రూ.365 చార్జీలకు అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ చార్జీలు నెలకు రూ.500–800 స్థాయిలో ఉంటున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో చార్జీలు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 స్థాయిలో ఉన్నాయి. నెలవారీగానే కాక వారం వ్యవధికి పనిచేసే చిన్న ప్యాక్లనూ ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. సోనీలైవ్ 7 రోజులకు రూ.29 ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో హాట్‌స్టార్ కూడా కేవలం రూ.25 నెలవారీ చార్జీలతో స్పోర్ట్స్ ప్యాకేజీని అందిస్తోంది. జీ5 సైతం ఇదే కోవలో చౌక ప్యాకేజీలను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. సాధారణంగా బడ్జెట్ ప్యాక్‌లకు వ్యతిరేకంగా ఉండే నెట్‌ఫ్లిక్స్ కూడా భారత యూజర్లకు చౌక ప్యాక్‌లపై దృష్టి పెడుతోంది. వారానికి రూ.65కే సర్వీసులు అందించే ప్యాక్‌ను పరిశీలిస్తోంది. భారీ పెట్టుబడులు.. ఓటీటీ సంస్థలు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈరోస్ నౌ సంస్థ దగ్గర ఇప్పటికే 12,000 పైచిలుకు సినిమాలున్నాయి. కొత్తగా మరింత కంటెంట్ కొనుగోలు, నిర్మాణం కోసం వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో 50–70 మిలియన్ డాలర్లు వెచ్చించబోతోంది. స్టార్ యూఎస్ హోల్డింగ్స్‌తో కలిసి స్టార్ ఇండియా తమ ఓటీటీ విభాగం హాట్‌స్టార్‌లో దాదాపు రూ.1,066 కోట్ల (153 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. గతేడాది పెట్టిన రూ.516 కోట్ల పెట్టుబడులకు ఇది అదనం. ఇతర సంస్థలూ ఇదే స్థాయిలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది కొత్త సినిమాలు, 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. సేక్రెడ్ గేమ్స్ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్ తరహాలోనే ఇవి కూడా హిట్ అవుతాయని ఆశిస్తోంది. దేశీ సంస్థ ఆల్ట్‌బాలాజీ కూడా 2019లో 30–40 షోలు నిర్మిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రాంతీయ’ కంటెంట్‌పై దృష్టి.. సాధారణంగా యువ జనాభాలో ఎక్కువ శాతం వీక్షకులు బస్సులు, రైళ్లు, ట్యాక్సీల్లో ప్రయాణించేటప్పుడో లేదా లంచ్ బ్రేక్‌లోనూ చూసేందుకు అనువైన 10–15 నిమిషాల తక్కువ నిడివి ఉండే కంటెంట్‌ను ఇష్టపడుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోస్ నౌ లాంటి సంస్థలు ఇలాంటి కంటెంట్‌పై దృష్టిపెడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచీ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఓటీటీ సంస్థలు గుర్తించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వీక్షకులకు మరింత చేరువయ్యే మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ను అందిస్తున్నాయి. వయాకామ్18కి చెందిన వూట్ సంస్థ తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ తదితర భాషల్లో కంటెంట్ రూపొందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ కూడా తెలుగు సహా తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి భాషల్లో ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఓటీటీ జోరు ఇదీ...! ► 2018లో 32.5 కోట్ల మంది ఆన్లైన్ వీడియోలు వీక్షించారు. ఇది అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అధికం. ► వచ్చే మూడేళ్లలో డిజిటల్ వీడియో వినియోగదారుల సంఖ్య 50–60 కోట్లకు చేరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017లో 70 లక్షలుగా ఉన్న సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018 నాటికి 1.2–1.5 కోట్లకు పెరిగారు. ► దేశీయంగా 34 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉండగా, డేటా వినియోగం గతేడాది రెట్టింపయ్యింది. -
ఫేస్బుక్ లైవ్‌లపై ఇక ఆంక్షలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్ నరమేధం సంఘటన తరువాత పలు సంస్కరణలకు పూనుకుంటోంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది. ఇక పై ఫేస్బుక్ లైవ్‌లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది. అంటే ఇకపై ఫేస్బుక్ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. క్రైస్ట్‌చర్చ్ ఊచకోత సంఘటన లైవ్ స్ట్రీమింగ్పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌పాంపై ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది. ఈ మేరకు ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు. ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపై ఆధారఫడి ఫేస్బుక్లో ఎవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు. చదవండి : న్యూజిలాండ్ సంచలన నిర్ణయం మృతుల్లో ఐదుగురు భారతీయులు -
అతడి ఆత్మహత్యను లైవ్‌లో చూశారు
గురుగ్రామ్ : మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయనేది ఇటీవలి కాలంలో వినిపిస్తున్న మాట. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన సంఘటన గురించి చదివితే ఆ మాట నిజమనిపించక మానదు. ఓ వ్యక్తి ఆత్మహ్యత చేసుకుంటన్నది ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తే.. 2వేల మంది దానిని సినిమాలా చూశారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్ చౌహన్‌కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంటూ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు. కాగా అమిత్ మానసికంగా కుంగిపోయాడని.. ఆరు నెలల నుంచి చికిత్స పొందుతున్నాడని అతని బంధువులు పోలీసులకు తెలిపారు. దీనిపై అమిత్ తండ్రి ఆశోక్ చౌహన్ మాట్లాడుతూ.. తనకు సోమవారం రాత్రి 9 గంటలకు ఈ విషయం తెలిసిందన్నారు. భార్యతో, ఇరుగుపొరుగు వాళ్లతో అమిత్ తరచు గొడవ పడుతుండేవాడని తెలిపారు. -
ప్రత్యక్ష ప్రసారంలో ఇబ్బందేమిటో..?
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసా రం ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బం దులు ఏమిటో అని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకుగాను నిర్ణయం తీసుకునే విషుంగా మరిం త సమయాన్ని న్యాయమూర్తులు కే టాయించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను టీవీల ద్వారా ప్రత్యక్ష ప్ర సారం చేయాలన్న డిమాండ్ ఎప్ప టి నుంచో వస్తున్న విషయం తెలిసిందే. అయితే, పాలకుల్లో స్పందన మాత్రం లేదు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ ప్రజా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. ఇప్పటికే ఈ విషయంగా నిర్ణయాలు తీసుకునేందుకుగాను ప్రభుత్వానికి పలుసార్లు సమయాన్ని కోర్టు కేటాయించిందని చెప్పవచ్చు. తాజా విచారణ సమయంలో ప్రభుత్వాన్ని బెంచ్ ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యల్ని సంధించిందని చెప్పవచ్చు. పార్లమెంట్, రాజ్య సభల్లోని వ్యవహారాల్నే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నప్పుడు, ఇక్కడి అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేయడంలో ఇబ్బందులు ఏమిటో అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇంతలో అడ్వకేట్ జనరల్ సోమయాజులు జోక్యంచేసుకుని సమయం కేటాయించాలని విన్నవించారు. అదే సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది శేషాద్రి అందుకుని కేరళ తరహాలో ఇక్కడ ప్రసారాలు చేయవచ్చుగా అని సూచించారు. ఈ ప్రసారాలకు నిధులు ఖర్చు అవుతాయన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని, కేరళలో అనుసరిస్తున్న విధానం అనుసరిస్తూ నిధులతో పనిలేదని వివరించారు. దీంతో తదుపరి విచారణ అక్టోబర్‌కు వాయిదా పడింది. నష్టపరిహారం కోసం: ఎన్నికల వాయిదా పడడంతో తమకు ఏర్పడ్డ న ష్టాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇప్పించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మే 16న రాష్ట్రంలోని 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నగదు బట్వాడా ఆరోపణలతో తంజావూరు, అరవకురిచ్చిల్లో ఎన్నికలు ఆ గాయి. ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడో అన్నది తేలాల్సి ఉంది. కాగా, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు నగదు బట్వాడా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈ దృష్ట్యా తమకు నష్టం ఏర్పడి ఉన్నదంటూ బీజేపీ, పీఎంకే తదితర అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ఎన్నికల నిమిత్తం తాము నియమ నిబంధనలకు లోబడి ఖర్చులు పె ట్టి ఉన్నామని, ఆ ఖర్చులను తమకు ఎవరు ఇస్తారని పిటిషన్ ద్వారా ఎన్నికల యంత్రాంగాన్ని ప్రశ్నించారు. తమకు నష్ట పరిహారం అం దించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఎన్నికల యంత్రాంగం తరఫున న్యాయవాది నిరంజన్ హాజరై, నష్ట పరిహారం చెల్లించేందుకు తగ్గ ఆస్కారాలు లేవు అని బెంచ్ దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణ సెప్టెంబరు 20కు వాయిదా పడింది. -
తుపాకితో కాలుస్తూ.. ఫేస్బుక్లో లైవ్!
ఫేస్బుక్లో 'లైవ్ వీడియో' అనే ఫీచర్ మామూలువాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతోందో గానీ, దుర్వినియోగం చేసుకునేవాళ్లకు మాత్రం అది చక్కగా ఉంది. గన్ కల్చర్ వెర్రితలలు వేస్తున్న అమెరికాలో ఓ వ్యక్తి తుపాకితో వేరేవాళ్లను కాలుస్తూ ఆ దృశ్యాలను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో షికాగో పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నీలిరంగు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి ముందుగా షికాగోలోని వెస్ట్ ఈగిల్వుడ్ ప్రాంతంలో గల ఓ స్టోర్స్ బయట కెమెరా ఎదుట మాట్లాడుతూ కనిపించాడు. కొంతసేపటి తర్వాత, తుపాకి కాల్పుల మోత వినిపించి, కెమెరా వీధివైపు తిరిగింది. నిందితుడు కూడా ఫ్రేమ్‌లోకి వచ్చి కాల్పులు కొనసాగిస్తాడు. కాసేపటికి ఓ మహిళ అరుపులు వినిపించాయి. వీడియో నిజమైనదేనని షికాగో పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియో గురించి తమకు తెలుసని, నిందితుడి గురించి కూడా విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నాడు. -
నేటితో రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలకు తెర!
- సోమవారం సాయంత్రం నుంచి అమలు - అన్ని టీవీ చానళ్లకూ నోటీసులు - వీడియో కాన్ఫరెన్స్‌లో భన్వర్‌లాల్ ఆదేశం - ఆచరణ సాధ్యం కాదంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్:ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సోమవారం సాయంత్రంతో తెలంగాణలో ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలో జరిగే రాజకీయ నాయకుల ప్రచారాన్ని వార్తా చానళ్లు(టీవీలు) ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ ఆదివారం ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన విసృ్తతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు, రెవెన్యూ అధికారులకు భన్వర్‌లాల్ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రచార ఘట్టానికి తెరపడుతుంది. దీన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌ను నియంత్రించడానికి పోలీసు, రెవెన్యూ విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ మేరకు ఆయా సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్ష ప్రసారాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భన్వర్‌లాల్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగుస్తున్నప్పటికీ.. సీమాంధ్రలో మే 4వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువుంది. మరోపక్క తెలంగాణలో ఎన్నికలు జరిగే 30వ తేదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల కీలక నేతలు సైతం అదేరోజు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయా నేతలు గుప్పించే హామీలు, లేవనెత్తే అంశాలు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని సీఈఓ అభిప్రాయపడ్డారు. దీనిని కట్టడి చేయడం కోసం ఎన్నికల కోడ్‌తో పాటు సంబంధిత చట్టాల్లోని అంశాలను ప్రస్తావిస్తూ వార్తా చానళ్ల యాజమాన్యాలకు సోమవారం నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.ప్రాంతీయ చానళ్ల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున నగర పోలీసులకు ఈ బాధ్యతలను అప్పగించారు. అయితే, ఈ విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ రకంగా నోటీసులు ఇచ్చినా ఫలితం ఉండదని వారు అంటున్నారు. దీన్ని అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరిగిన ప్రతిసారీ జాతీయ చానళ్ల ప్రసారాలను ఆపాల్సి ఉంటుందని, మరోపక్క ఇంత తక్కువ సమయంలో కేవలం పోలీసు విభాగం నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఆపడమనేది ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అయితే, అమలు సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి.. సీఈఓ ఇచ్చిన ఆదేశాలను అన్ని వార్తా చానళ్ల యాజమాన్యాలకు తప్పనిసరిగా తెలియజేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నుంచి మరోసారి స్పష్టత తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలపై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను సంబంధిత సెక్షన్ల సహితంగా చానళ్ల దృష్టికి తీసుకెళ్లి, లిఖిత పూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలింగ్ ఏర్పాట్లపై నగర కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.