Amazon Prime Video To Stream Live Cricket From 1 January 2022 - Sakshi
Sakshi News home page

Amazon Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు న్యూఇయర్‌ బంపర్‌ గిఫ్ట్‌..!

Published Mon, Dec 20 2021 4:57 PM | Last Updated on Mon, Dec 20 2021 5:48 PM

Amazon Prime Video To Stream Live Cricket From 1 January 2022 - Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు అమెజాన్‌ గుడ్‌న్యూస్‌ను అందించింది. వచ్చే ఏడాది నుంచి క్రికెట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో పొందవచ్చునని అమెజాన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.     

మొదటి మ్యాచ్‌ వారిదే..!
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌ను జనవరి 1, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్‌ స్ట్రీమ్‌ కానుంది. నవంబర్ 2020లో,  అమెజాన్‌ ప్రైమ్ వీడియో న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా...న్యూజిలాండ్‌ ఆడే అంతర్జాతీయ పురుషుల, మహిళల క్రికెట్ మ్యాచ్‌లను ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉండనున్నాయి. 


 

ఇండియా మ్యాచ్‌లు కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే...!
స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ భారత క్రికెట్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ విభాగంలోకి అమెజాన్‌ కూడా రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగే సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. భారత మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లతో పాటుగా నవంబర్‌ 2022లో భారత, న్యూజిలాండ్‌ పురుషుల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా స్ట్రీమ్‌ అవ్వనున్నాయి. వీటితో పాటుగా న్యూజిలాండ్‌ మెన్స్‌ జట్టు 2022 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా పర్యటన, మార్చి 2022లో ఆస్ట్రేలియా పర్యటన, మార్చి/ఏప్రిల్ 2022లో నెదర్లాండ్ పర్యటనలను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లైవ్‌ స్ట్రీమ్‌ కానుంది. 

లైవ్‌తో పాటుగా..!
అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు మ్యాచ్‌ల రన్-అప్‌లో భాగంగా అనేక క్రికెట్ ప్రోగ్రామింగ్, ఇతర హైలైట్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

చదవండి: బెస్ట్‌ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌.. వరెస్ట్‌గా మోస్ట్‌ పాపులర్‌ యూజింగ్‌ సైట్‌/యాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement