
Live Cricket Streaming On Amazon Prime: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్.. కొత్తగా క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్‌లోకి అడుగు పెట్టింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నూతన సంవత్సరం(2022) తొలి రోజు ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌ను లైవ్‌లో ప్రసారం చేయడం ద్వారా సరికొత్త రంగంలోకి అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట లైవ్ స్ట్రీమ్ కావడంతో క్రికెట్ అభిమానులు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా క్రికెట్‌ను వీక్షించారు.
అమెజాన్ ప్రైమ్.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పదం కుదుర్చుకుని, స్వదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇదివరకే క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
చదవండి: కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్‌దే పైచేయి
Comments
Please login to add a commentAdd a comment