
సెల్హాట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్‌పై ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. అయితే ఈ చారిత్రత్మక విజయం సాధించింనందుకు బంగ్లా జట్టు ఆటగాళ్లకు ఆ దేశక్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది.
ఈ గెలుపులో భాగమైన ఆటగాళ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. "ఆటగాళ్లకు బంగ్లా క్రికెట్ బోర్డు నుంచి ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఉంటుంది. సొంత గడ్డపై కివీస్‌పై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది.
మా బాయ్స్‌కు బోనస్ ఇవ్వాలని నేను బీసీబీ అధ్యక్షుడితో మాట్లాడాను. అది కచ్చితంగా జరుగుతోంది. మా జట్టు ఢాకాకు చేరుకున్న తర్వాత వారితో కలిసి బీసీబీ అధ్యక్షుడు డిన్నర్ చేస్తారు. అనంతరం బోనస్‌కు సంబంధించిన ప్రకటన చేయవచ్చు" అని విలేకురల సమావేశంలో జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 26 నుంచి ఢాకా వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment