
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్(India vs Pak) మధ్య బ్లాక్ బాస్టర్ మ్యాచ్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. ఆదివారం(ఫిబ్రవరి 23)న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యుకళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీపైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) సెంచరీతో మెరుస్తాడని యువీ జోస్యం చెప్పాడు.
కాగా ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్ సిరీస్‌తో తన ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ కేవలం 36 బంతుల్లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు.
"రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నా.. లేకపోయిన అది నాకు ముఖ్యం కాదు. నేను ఎప్పుడు రోహిత్ లాంటి మ్యాచ్ విన్నర్‌లకు సపోర్ట్‌గా ఉంటాను. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లితో పాటు రోహిత్ కూడా భారత్‌కు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు. రోహిత్ ఫామ్ లేమితో సతమతమవుతున్నప్పటికి.. కొన్ని కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు సాధించడం సానుకూళ అంశం.
కచ్చితంగా ప్రత్యర్ధికి రోహిత్ నుంచి ముప్పు పొంచి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌ను అందుకుంటే 60 బంతుల్లోనే సెంచరీ సాధిస్తాడు. అది అతడి నైజం. ఒక్కసారి రిథమ్‌ను అందుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు. అతడు బౌండరీలు మాత్రమే కాదు సిక్సర్లను కూడ ఈజీగా కొట్టగలడు. ప్రపంచక్రికెట్‌లో షార్ట్ బాల్స్‌ను అత్యుత్తమంగా ఆడే ఆటగాళ్లలో రోహిత్ ఒకడు.
ఏ బౌలర్ అయినా 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసినా.. ఆ షార్ట్‌బాల్‌ను సిక్సర్‌గా మలిచే సత్తా అతడికి ఉంది. అతని స్ట్రైక్ రేట్ ఎల్లప్పుడూ 120-140 మధ్య ఉంది. రోహిత్ తనదైన రోజున సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించగలడు. కాగా దుబాయ్‌లోని పరిస్థితులు పాకిస్తాన్ కలిసొచ్చే అవకాశముంది.
వారు అక్కడ చాలా క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి బాగా తెలుసు. స్లో వికెట్స్‌పై స్పిన్‌ను బాగే ఆడే ఆటగాళ్లు ఇరు జట్లలో కూడా ఉన్నారు. ఏ జట్టు అయితే అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తుందో ఆ జట్టే విజేతగా నిలుస్తుందని" జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.
తుది జట్లు(అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment