![Glenn Phillips, Mitchell Santner pull off heist as New Zealand beat Bangladesh in 2nd test - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/9/newzealand1.jpg.webp?itok=CpiJ0QIt)
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్ కాప్స్ విజయంలో గ్లెన్ ఫిలిప్స్(40 నాటౌట్), మిచెల్ శాంట్నర్(35) కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్, శాంట్నర్ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు, షోర్‌ఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 144 పరుగులకే కుప్పకూలింది.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా గ్లెన్ ఫిలిప్స్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment