Glenn Phillips
-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్‌కు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ఓలీ పోప్ సహా ఫీల్డ్‌లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ 53వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టిమ్ సౌథీని బౌలింగ్‌కు దించాడు. అప్పటికే ఓలీ పోప్.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి ఓలీ పోప్ కట్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అకస్మాత్తుగా ఫ్రేమ్‌లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓలీ పోప్ ఔటైన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. బ్రూక్ 86 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ స్కోర్ 232/5గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అందకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
Ind vs NZ 2nd Test: 156 పరుగులకే టీమిండియా ఆలౌట్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. మొదట బెంగళూరు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. పుణె వేదికగా రెండో టెస్టులోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన.. గురువారం మొదలైన రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది.చెన్నై స్పిన్నర్లు దుమ్ములేపారుఅయితే, పుణెలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా స్టార్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. చెన్నైకి చెందిన ఈ ఇద్దరు రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.అశూ వికెట్ల వేట మొదలుపెడితే.. వాషీ విజయవంతంగా దానిని ముగించాడు. అశ్విన్ 3, వాషీ 7 వికెట్లు పడగొట్టి.. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. బౌలర్లుగా తమ కర్తవ్యం నెరవేర్చి ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయగలిగారు.ప్చ్.. బ్యాటర్లు మాత్రంకానీ.. బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ 30 పరుగులతో రాణించగా.. విరాట్ కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి చెత్తగా బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్(18),న సర్ఫరాజ్ ఖాన్(11) త్వరగానే అవుట్ కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 38 పరుగులతో అందరిలోకెల్లా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మిగతా వాళ్లలో అశ్విన్ 4, వాషింగ్టన్ సుందర్ 18- నాటౌట్, ఆకాశ్ దీప్ 6, జస్ప్రీత్ బుమ్రా 0 పరుగులు చేశారు. ఫలితంగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీమిండియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. రైటార్మ్ పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.103 పరుగులు వెనుకబడ్డ టీమిండియాకాగా పుణె వేదికగా రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(76), రచిన్ రవీంద్ర(65) అద్భుత అర్ధశతకాలు సాధించగా.. మిచెల్ సాంట్నర్ 33 రన్స్‌తో రాణించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే 103 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్ -
గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలం: పంత్ బౌల్డ్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. పుణె వేదికగా రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం 16-1 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన స్పిన్ మాయాజాలంతో వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు.తొలుత కోహ్లిభారత ఇన్నింగ్స్ 22వ ఓవర్ మూడో బంతికి శుబ్‌మన్ గిల్(30)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సాంట్నర్.. 24వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లి(1)ని బౌల్డ్ చేశాడు. అయితే, సాంట్నర్ వేసిన లో ఫుల్‌టాస్‌ను ఆడలేక వికెట్ పారేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు రిషభ్ పంత్ తోడయ్యాడు.పంత్- సర్ఫరాజ్ జోడీపై ఆశలువీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని అభిమానులు భావించగా.. కాసేపటికే ఆ ఆశలపై గ్లెన్ ఫిలిప్స్ నీళ్లు చల్లాడు. ఈ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ 26వ ఓవర్ నాలుగో బంతికి జైస్వాల్(30)ను నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరు కలిసి బెంగళూరు టెస్టు తరహాలో భారీ భాగస్వామ్యం(నాలుగో వికెట్‌కు 177) నెలకొల్పుతారని అభిమానులు ఆశించారు. గ్లెన్ ఫిలిప్స్ మాయాజాలంఅయితే, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి స్పిన్ మంత్రం వేసి.. రిషభ్ పంత్‌ను బౌల్డ్ చేశాడు. 31వ ఓవర్ రెండో బంతికి 18 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ నిష్క్రమించాడు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈసారి రంగంలోకి దిగిన సాంట్నర్ సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. 34వ ఓవర్ ఆరో బంతికి సాంట్నర్ బౌలింఘ్ సర్ఫరాజ్ విలియం రూర్కీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా కేవలం 95 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. లంచ్@ 107/7ఇక అశ్విన్(4) సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. 103 పరుగుల స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు- 107/7 (38). కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఓవరాల్‌గా రెండోసారి..! -
గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లో..!
హండ్రెడ్ లీగ్‌లో వెల్ష్ ఫైర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించాడు. సథరన్ బ్రేవ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఫిలిప్స్‌తో పాటు లూక్ వెల్స్ (30 బంతుల్లో 53; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (12 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు), స్టెఫెన్ ఎస్కినాజీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్), జానీ బెయిర్‌స్టో (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సథరన్ బ్రేవ్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, హండ్రెడ్ లీగ్ 2024 నుంచి వెల్ష్ ఫైర్ ఇదివరకు ఎలిమినేట్ అయ్యింది. సథరన్ బ్రేవ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సథరన్ బ్రేవ్‌తో పాటు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. వెల్ష్ ఫైర్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. -
వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరు..!
లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఓ అద్భుత విన్యాసం చేశాడు. ఈ మ్యాచ్ ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు. GLENN PHILLIPS IS NEXT LEVEL. 🤯- Probably the greatest athlete from New Zealand. 🫡 pic.twitter.com/DIheKFMVCn— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. క్రికెట్ చరిత్రలో ఇంతటి అద్భుత విన్యాసం ఎవరూ చేసి ఉండరని నెటిజన్లు జేజేలు పలుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. అద్భుతమైన క్యాచ్‌తో అబ్బురపరిచిన ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయినా ఈ మ్యాచ్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన కొలొంబో టీమ్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. ఫిలిప్స్ (52), ఏంజెలో పెరారీ (41), గుర్బాజ్ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. కుశాల్ పెరీరా (80), రీజా హెండ్రిక్స్ (54) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీకరాలకు చేరింది. -
చరిత్ర సృష్టించిన ఫిలిప్స్.. తొలి ఆటగాడిగా! 15 ఏళ్లలో
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో పార్ట్ టైమ్ బౌలర్‌గా ఎటాక్‌లోకి వచ్చిన ఫిలిప్స్ తన స్పిన్ మయాజాలంతో ఆసీస్‌ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అందులో 4 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్‌గా ఫిలిప్స్ నిలిచాడు. ఆఖరిగా 2008లో బ్లాక్ క్యాప్స్ స్పిన్నర్ జీతన్ పటేల్ 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్‌కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
మాటల్లో వర్ణించలేని క్యాచ్.. మాయ చేసిన గ్లెన్ ఫిలిప్స్
క్రికెట్ చరిత్రలో మరో అద్భుతమైన క్యాచ్ నమోదైంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్‌ను మాటల్లో వర్ణించలేని పరిస్థితి. గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ తన కుడివైపుకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. ఫిలిప్స్ ఈ క్యాచ్ పట్టాక న్యూజిలాండ్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. Glenn Phillips takes an OUTRAGEOUS catch. The flying Bird.#INDvsENG #INDvENGpic.twitter.com/NsXe122tsm — Abdullah Neaz (@Neaz__Abdullah) February 15, 2024 రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ ఈ కళ్లు చెదిరే క్యాచ్‌కు వేదికైంది. మూడో రోజు ఆటలో కీగన్ పీటర్సన్ కొట్టిన షాట్‌ను ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. కాగా, పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. స్కోర్ వివరాలు.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 242 ఆలౌట్ (డి స్వార్డ్ట్ 64, విలియమ్ రూర్కీ 4/59) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ (విలియమ్సన్ 43, డి పైడ్ట్ 5/89) సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (బెడింగ్హమ్ 110, విలియమ్ రూర్కీ 5/34) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 40/1 (టామ్ లాథమ్ 21 నాటౌట్, డి పైడ్ట్ 1/3) న్యూజిలాండ్ గెలవాలంటే 227 పరుగులు చేయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్‌కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్ కాప్స్ విజయంలో గ్లెన్ ఫిలిప్స్(40 నాటౌట్), మిచెల్ శాంట్నర్(35) కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్, శాంట్నర్ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు, షోర్ఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా గ్లెన్ ఫిలిప్స్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
BAN vs NZ: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. గ్లెన్ ఫిలిప్స్ విరోచిత పోరాటం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 88 పరుగులు చేసి జట్టును అదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ ప్రత్యర్ఢి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. తన జట్టుకు 180 పరుగులు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్‌తో పాటు జామీసన్(20), మిచెల్(18) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నయీం హసన్, షోర్ఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు సాధించాడు. ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు కేవలం 32 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యపడింది. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్(16), మోమినుల్ హక్(0) ఉన్నారు. చదవండి: LLC 2023: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు -
న్యూజిలాండ్ 4/4
చెన్నై: టాస్ గెలిచి కూడా ఫీల్డింగ్ ఎంచుకొని చేసిన తప్పుడు వ్యూహంతో పాటు ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేసిన వైఫల్యం చివరకు అఫ్గనిస్తాన్ భారీ ఓటమికి కారణంగా మారింది. తడబడుతూ ఇన్నింగ్స్ కొనసాగించి చివర్లో చెలరేగిన న్యూజిలాండ్, ఆపై బౌలింగ్‌లో సత్తా చాటగా...పేలవ బ్యాటింగ్‌లో అఫ్గన్ కుప్పకూలింది. దాంతో కివీస్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది. బుధవారం జరిగిన పోరులో కివీస్ 149 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ ఫిలిప్స్ (80 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెపె్టన్ లాథమ్ (74 బంతుల్లో 68; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్ యంగ్ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆరంభంలో 109/1తో పటిష్టంగా ఉన్న కివీస్ పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయి 110/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయినా సరే టీమ్ ఒక దశలో 44 ఓవర్లలో 210 పరుగులే చేసింది. కానీ చివరి 6 ఓవర్లలో బ్యాటర్లు చెలరేగడంతో ఏకంగా 78 పరుగులు సాధించగలిగింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా (62 బంతుల్లో 36; 1 ఫోర్) టాప్ స్కోరర్. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం రేపిన అఫ్గన్ గత వరల్డ్ కప్ రన్నరప్ ముందు అదే స్థాయి పోరాటపటిమ కనబర్చలేక చేతులెత్తేసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 20; విల్ యంగ్ (సి) ఇక్రామ్ (బి) ఒమర్జాయ్ 54; రచిన్ (బి) ఒమర్జాయ్ 32; మిచెల్ (సి) ఇబ్రహీమ్ (బి) రషీద్ 1; లాథమ్ (బి) నవీనుల్ 68; ఫిలిప్స్ (సి) రషీద్‌ఖాన్ (బి) నవీనుల్ 71; చాప్మన్ నాటౌట్ 25; సాన్‌ట్నర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–30, 2–109, 3–110, 4–110, 5–254, 6–255. బౌలింగ్: ముజీబ్ 10–0–57–1, ఫరూఖీ 7–1–39–0, నవీనుల్ 8–0–48–2, నబి 8–1–41–0, రషీద్ ఖాన్ 10–0–43–1, అజ్మతుల్లా ఒమర్జాయ్ 7–0–56–2. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) హెన్రీ 11; ఇబ్రహీమ్ (సి) సాన్‌ట్నర్ (బి) బౌల్ట్ 14, రహ్మత్ షా (సి) అండ్ (బి) రచిన్ 36; హష్మతుల్లా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 8; ఒమర్జాయ్ (సి) లాథమ్ (బి) బౌల్ట్ 27; ఇక్రామ్ నాటౌట్ 19; నబి (బి) సాన్‌ట్నర్ 7; రషీద్‌ఖాన్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 8; ముజీబ్ (సి) యంగ్ (బి) ఫెర్గూసన్ 4; నవీనుల్ (సి) చాప్మన్ (బి) సాన్‌ట్నర్ 0; ఫరూఖీ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో ఆలౌట్) 139. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–43, 4–97, 5–107, 6–125, 7–134, 8–138, 9–139, 10–139. బౌలింగ్: బౌల్ట్ 7–1–18–2, హెన్రీ 5–2–16–1, సాన్‌ట్నర్ 7.4–0–39–3, ఫెర్గూసన్ 7–1–19–3, ఫిలిప్స్ 3–0–13–0, రచిన్ రవీంద్ర 5–0–34–1. -
CWC 2023 ENG VS NZ: రూట్ కొంపముంచిన రివర్స్ స్వీప్
2023 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎదురీదుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన బట్లర్ సేన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తుంది. మధ్యలో (ఐదో వికెట్‌కు) కాసేపు (70 పరుగులు) రూట్, బట్లర్ జోడీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినప్పటికీ బట్లర్ వికెట్ పడ్డాక కథ మళ్లీ మొదటికొచ్చింది. Watch Joe Root's reverse-scoop: https://t.co/riEnCtwreZ pic.twitter.com/RCUIh8oFUl — CricTracker (@Cricketracker) October 5, 2023 బట్లర్ ఓటయ్యాక 33 పరుగులు జోడించిన అనంతరం లివింగ్‌స్టోన్ కూడా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 221 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన జో రూట్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. Wait what 🤯! Reverse scoop to Trent Boult 🤯, Joe Root🤌 📸: Disney+Hotstar pic.twitter.com/R1JRhC2BUk — CricTracker (@Cricketracker) October 5, 2023 రివర్స్ స్వీప్ జో రూట్ (77) కొంపముంచింది.. ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్ స్వీప్ షాట్లు ఆడి సక్సెస్ సాధించిన రూట్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద (41.1 ఓవర్లు) ఏడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖర్లో కుదురుకున్న ఇంగ్లండ్.. గౌరవప్రదమైన స్కోర్ ఇంగ్లండ్ టెయిలెండర్లు ఆఖర్లో తలో చేయి వేసి ఓ మోస్తరు పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేసింది. 252 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మరో 30 పరుగులు జోడించి 282 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) అజేయంగా నిలువగా.. బెయిర్‌స్టో (33), మలాన్ (14), బ్రూక్ (25), మొయిన్ అలీ (11), బట్లర్ (43), రూట్ (77), లివింగ్‌స్టోన్ (20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, సాంట్నర్, ఫిలిప్స్ తలో 2, బౌల్ట్, రవీంద్ర చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్ పట్టగా (బెయిర్‌స్టో).. రెండోది సౌథీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (మొయిన్ అలీ) అందున్నాడు. సాంట్నర్ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఫిలిప్స్ అత్యద్భుతం. Some catch 👏 Jonny Bairstow is forced to depart early...#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hrB15EWVgt — England Cricket (@englandcricket) September 10, 2023 మొయిన్ అలీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ ఈ క్యాచ్‌ను అందకున్నాడు. రిస్క్‌తో కూడుకున్న ఈ క్యాచ్‌ను పట్టుకుని ఫిలిప్స్ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ క్యాచ్‌ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. Glenn Phillips ... Flying bird ...#ENGvNZ pic.twitter.com/Y1h08pWRE8 — Manikanta Aravind (@MA_Aravind) September 10, 2023 ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్ క్యాచ్‌తో పోలిస్తే ఫిలిప్స్ క్యాచ్‌కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్‌ను ఫ్లయింగ్ బర్డ్‌తో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లివింగ్‌స్టోన్ (95 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఇంగ్లీష్ బౌలర్లు డేవిడ్ విల్లే (3/34), రీస్ టాప్లే (3/27), మొయిన్ అలీ (2/30), అట్కిన్సన్ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఫిలిఫ్స్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కివీస్
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 సిరీస్‌ను 2-2తో కివీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ మూడు, సోధి రెండు వికెట్లు సాధించారు. చాప్మాన్, ఫిలిఫ్స్ విధ్వంసం.. 176 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కేవలం 17.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెపర్ సీఫెర్ట్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ ఫిలిఫ్స్(25 బంతుల్లో 42), చాప్మాన్(25 బంతుల్లో 40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు, లూక్ వుడ్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక కార్డిఫ్ వేదికగా సెప్టెంబర్ 8న ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. చదవండి: ODI WC 2023: వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ.57లక్షలు! -
NZ Tour Of England: న్యూజిలాండ్‌ను గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్
ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్ యంగ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అదరగొడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అజేయమైన ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 32 పరుగులు బాదిన ఫిలిప్స్.. గ్లోసెస్టర్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 27) జరిగిన మ్యాచ్‌లో అజేయమైన అర్ధసెంచరీతో (37 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫిలిప్స్ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్ పర్యటనలో న్యూజిలాండ్‌కు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన న్యూజిలాండ్ టీ20, వన్డే జట్లలో సభ్యుడిగా ఉన్న ఫిలిప్స్ భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కీలకంగా మారవచ్చని కివీస్ మేనేజ్మెంట్ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే 4 టీ20లు, 4 వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ టీమ్.. తొలుత టీ20 సిరీస్ (ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ (సెప్టెంబర్ 8-15) ఆడుతుంది. తొలి టీ20 ఆగస్ట్ 30న, రెండోది సెప్టెంబర్ 1న, మూడోది సెప్టెంబర్ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 8న తొలి వన్డే, సెప్టెంబర్ 10న రెండో వన్డే, సెప్టెంబర్ 13న మూడో వన్డే, సెప్టెంబర్ 15న నాలుగో వన్డే జరుగనుంది. ఇంగ్లండ్‌తో టీ20లకు కివీస్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర సీఫెర్ట్, ఇష్ సోధి ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, విల్ యంగ్ న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్, ల్యూక్ వుడ్ న్యూజిలాండ్ సిరీస్ కోసం ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ -
SRH VS LSG: కీలక మ్యాచ్‌లో తేలిపోయిన మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్.. వరుస బంతుల్లో..!
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. ఓ దశలో మార్క్రమ్, క్లాసెన్ ధాటిగా ఆడుతుండటంతో భారీ స్కోర్ సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే వీరిద్దరు కృనాల్ పాండ్యా (13వ ఓవర్) బౌలింగ్‌లో వరస బంతుల్లో పెవిలియన్‌కు చేరి దారుణంగా నిరాశపరిచారు. మార్క్రమ్ (20 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా పరుగులు సాధించగా.. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ ఫిలిప్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. కీలక మ్యాచ్‌లో వీరిద్దరూ తేలిపోవడంతో భారీ స్కోర్‌పై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు ఢీలా పడిపోయారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. 13 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) దారుణంగా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్‌వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లక్నో కంటే సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ సేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: లక్నోతో సన్‌రైజర్స్ కీలక పోరు.. 13 కోట్ల ఆటగాడికి మరో సారి నోఛాన్స్ -
బ్రూక్ కి అంత.. ఫిలిప్స్‌కి ఇంతే ఫైనల్ 4 లో ఎస్ ఆర్ హెచ్
-
PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్
ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్‌ల్లో (6) ఇది వరుసగా రెండవది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ (8 బంతుల్లో 12), లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్ (11 బంతుల్లో 19), హర్‌ప్రీత్ బ్రార్ (9 బంతుల్లో 17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్ కర్రన్ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్ (15), వెంకటేశ్ అయ్యర్ (11) రెండంకెల స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, నాథన్ ఇల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్. ఛేదనలో కేకేఆర్ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్‌లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్స్ రసెల్, రింకూ సింగ్ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ (7 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్ఆర్హెచ్ను గేమ్‌లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సిక్సర్ బాది గెలిపించాడు. ఇంచుమించు అలాగే పంజాబ్‌తో మ్యాచ్‌లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ను గెలుపు ట్రాక్‌లో పెడితే, రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిలిప్స్ తరహాలోనే నిన్నటి మ్యాచ్‌లో రసెల్ కూడా 19వ ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫిలిప్స్.. కుల్దీప్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదితే.. నిన్నటి మ్యాచ్‌లో సామ్ కర్రన్ బౌలింగ్‌లో రసెల్ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్, రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్‌రైజర్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేవి. చదవండి: ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన -
ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్‌రేటుతో..
IPL 2023 RR Vs SRH: ఐపీఎల్-2023లో.. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాడు న్యూజిలాండ్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ గ్లెన్ ఫిలిఫ్స్. తొమ్మిది మ్యాచ్‌ల పాటు బెంచ్‌కే పరిమితమైన అతడు రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో ఎట్టకేలకు ఈ సీజన్లో ఖాతా తెరిచాడు. భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో రైజర్స్ తుది జట్టులో చోటు సంపాదించాడు. వచ్చీరాగానే.. ఇన్నాళ్లు తనను పక్కకు పెట్టి మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పు చేసిందో తన అద్భుత ఆట తీరుతో చాటిచెప్పాడు. కీలక సమయంలో తుపాన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. 7 బంతుల్లో 25 పరుగులతో చెలరేగాడు. వరుసగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫిలిప్స్ అద్భుత ఆట తీరు సృష్టించిన సునామీలో రాజస్తాన్ ప్లేయర్లు జోస్ బట్లర్ ఇన్నింగ్స్(95 పరుగులు), యజువేంద్ర చహల్(4/29) స్పెల్ కొట్టుకుపోయాయి. వీరిద్దరినీ కాదని 7 బంతుల్లో 357.14 స్ట్రేక్రేటుతో మెరిసి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫిలిప్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఈ ఇన్నింగ్స్‌తో గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ మ్యాచ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో నిలిచాడు. మొదటి స్థానంలో ఈ క్రమంలో బౌలర్ నువన్ కులశేఖర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫిలిప్స్ 7 బంతుల్లో 25 పరుగులతో టాప్‌నకు చేరుకోగా.. సీఎస్కే తరఫు పుణెతో మ్యాచ్‌లో నువన్ 2012లో 2/10 బౌలింగ్ గణాంకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీకి ఆడిన మార్క్ బౌచర్(2009లో) కేకేఆర్ మీద 13 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలిచి మూడో స్థానంలో ఉండగా.. 2021లో కీరన్ పొలార్డ్(ముంబై) పంజాబ్ కింగ్స్‌తో 7 బంతుల్లో 15 పరుగుల(నాటౌట్)తో నాలుగో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ తరఫున రెండో ఆటగాడిగా ఇదిలా ఉంటే.. ఎస్ఆర్హెచ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో టాప్-4లో ఉన్నది వీళ్లే! ►416.66 - 25*(6) - శశాంక్ సింగ్- గుజరాత్ టైటాన్స్ మీద- 2022లో- వాంఖడే స్టేడియంలో ►357.14 - 25 (7) - గ్లెన్ ఫిలిప్స్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2023లో- జైపూర్‌లో ►340.00 - 34*(10) - రషీద్ ఖాన్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2018లొ ►285.71 - 40(14) - వాషింగ్టన్ సుందర్- రాజస్తాన్ రాయల్స్ మీద- 2022లో పుణెలో. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 7⃣ balls that changed the Sunday night for us 🧡 Glenn Phillips is our 𝐑𝐢𝐬𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 and we couldn't be more happy 😍 pic.twitter.com/YrCG7gd1UC — SunRisers Hyderabad (@SunRisers) May 8, 2023 -
సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే..
IPL 2023 RR Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ట్రోఫీని అందించిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. 2016లో అనూహ్య రీతిలో రైజర్స్‌ను విజేతగా నిలిపి తొలి టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీతో అనుబంధం పెనవేసుకున్న వార్నర్ అన్న.. అనుకోని పరిస్థితుల్లో అవమానకర రీతిలో జట్టును వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌ను 6.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఢిల్లీకి ఆడుతున్న వార్నర్ భాయ్.. ఐపీఎల్-2023లో రిషబ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 24న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత ఉప్పల్‌లో అడుగుపెట్టిన వార్నర్.. కెప్టెన్‌గా విజయం అందుకున్నాడు. ప్రతీకార విజయం అతడి సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో రైజర్స్పై విజయం సాధించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 29 నాటి ఢిల్లీ మ్యాచ్‌లో గెలుపొంది క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్లో ఇలా ముఖాముఖి పోరులో ఇరు జట్లు చెరో విజయం అందుకున్నాయి. అదే విధంగా పాయింట్ల పట్టికలో తొమ్మిది, పది స్థానాల్లో దోబూచులాడుతున్నాయి. గ్లెన్ వల్లే ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్భుతం చేసిన విషయం తెలిసిందే. ఆఖరి బంతికి నో బాల్ ట్విస్ట్ చేసుకోవడంతో రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. 13.25 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు వరుస అవకాశాలు ఇచ్చిన యాజమాన్యం.. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫిలిప్స్నకు ఛాన్స్ ఇచ్చింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్ కీలక సమయంలో వరుసగా 6,6,6,4 బాది తన విలువేంటో చాటుకున్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ ఎడిషన్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఏది అవసరమో అది చేసి చూపించాడు ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ విజయాన్ని ఉద్దేశించిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఐపీఎల్‌కు ఏది అవసరమో గ్లెన్ ఫిలిన్స్ అదే చేశాడు.. టేక్ ఏ బో! సన్‌రైజర్స్ బాగా ఆడింది’’ అని వార్నర్ ప్రశంసలు కురిపించాడు. మిస్ యూ వార్నర్ దీనిపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘మిస్ యూ వార్నర్.. నువ్వు జట్టులో లేకున్నా మా గుండెల్లో మాత్రం ఉన్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఫిలిప్స్‌ను ఇన్నాళ్లు ఆడించకుండా రైజర్స్ మేనేజ్మెంట్ చేసిన తప్పిదాన్ని వార్నర్ భలేగా ఎత్తిచూపాడని పేర్కొంటున్నారు. చదవండి: జాగ్రత్త.. అతడు హీరో! సమద్‌పై ఎస్ఆర్హెచ్ ట్వీట్ వైరల్.. ఫ్యాన్స్ మాత్రం.. How goods the IPL, Glenn Phillips take a bow, Well played Sunrisers 👌👌🔥🔥 — David Warner (@davidwarner31) May 7, 2023 WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో జట్టు సమష్టిగా పోరాడింది. ఊహించనదాని కంటే ఎక్కువే స్కోరు చేస్తామని అనుకున్నాం. అదే నిజమైంది. వాస్తవానికి ముందు నుంచే మేము కాస్త దూకుడు ప్రదర్శించాల్సింది’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతోనే గెలుపు వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు. నాడు ఘోర పరాభవం ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లో ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడిన సన్‌రైజర్స్‌కు చేదు అనుభవం మిగిలిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ పదహారో ఎడిష్ను ఓటమితో ఆరంభించింది. ఈ క్రమంలో ఆదివారం (మే 7) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. మరోసారి బట్లర్ విశ్వరూరం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ (18 బంతుల్లో 35 పరుగులు) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 59 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఏకంగా 95 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 పరుగులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అభిషేక్, త్రిపాఠి కలిసి ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి రాజస్తాన్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55 పరుగులు)కు తోడైన రాహుల్ త్రిపాఠి అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అయితే, 13వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన అభిషేక్.. మరోసారి భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరడంతో రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు సాధించి 16వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. 6,6,6,4 ఆ తర్వాత కాసేపటికే త్రిపాఠి(29 బంతుల్లో 47 పరుగులు)ని చహల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులో(18వ ఓవర్ మూడో బంతి)కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తొలుత రెండు పరుగులు, ఆ తర్వాత ఒక పరుగు మాత్రమే తీశాడు. ఇంతలోనే మరో ఎండ్‌లో ఉన్న మార్కరమ్(6)ను చహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. నో బాల్ వల్ల అదృష్టం దీంతో రైజర్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,6, 4 బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి బంతికి హైడ్రామా నెలకొనగా.. సందీప్ శర్మ నోబాల్ కారణంగా రైజర్స్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిందన్న స్టేట్మెంట్ నిమిషాల్లో తారుమారైంది. ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్‌లో రైజర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ మాకు శుభారంభం అందించాడు. త్రిపాఠి అతడికి తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్స్, క్లాసీ అద్భుత పాత్ర పోషించారు. సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒత్తిడి పెరిగినపుడు సరైన టెక్నిక్‌ను ఉపయోగిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది’’ అని తమ బ్యాటర్ల ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..! సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్‌కు వదిలేసి మంచి పని చేసింది..!
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (మే 7) జరిగిన హైటెన్షన్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్ గెలవడం.. అంతా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్నాయి. ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి, గెలుపు ట్రాక్‌లో ఉంచింది మాత్రం డైనమైట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. ఈ కివీస్ బ్యాటర్.. ఎస్ఆర్హెచ్ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావాల్సిన తరుణంలో సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 25) ఆడి అసాధ్యమనుకున్న గెలుపుపై ఆశల రేకెత్తించాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచిన ఫిలిప్స్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఫిలిప్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓటమిపాలై, లీగ్ నుంచి నిష్క్రమించేది. ఫిలిప్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ ఫిలిప్స్.. సనరైజర్స్ హ్యారీ బ్రూక్‌ను వదిలించుకుని నీకు అవకాశమిచ్చి మంచి పని చేసిందంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 13.25 ఆటగాడి (బ్రూక్) కంటే అందులో పది శాతం (1.5 కోట్లు) కూడా రేటు దక్కని ఫిలిప్స్ చాలా బెటరని అంటున్నారు. కేకేఆర్‌పై బ్రూక్ చేసిన సెంచరీ కంటే రాజస్థాన్‌పై ఫిలిప్స్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమమని కొనియాడుతున్నారు. సెంచరీ మినహాయించి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విఫలమైన బ్రూక్‌ను ఇకపై పక్కకు పెట్టి ఫిలిప్స్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు మినుకమినుకుమంటున్న దశలో ఫిలిప్స్ ఎస్ఆర్హెచ్ను ఫైనల్ ఫోర్కు చేరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్ సంజు శాంసన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్‌ను గెలిపించిన గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్‌రైజర్స్ -
RR VS SRH: హైడ్రామా.. ఆఖరి బంతి నో బాల్.. ఓడి గెలిచిన సన్‌రైజర్స్
జైపూర్: లక్ష్యం 215 పరుగులు... 17 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 171 పరుగులు. గెలవాలంటే చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. అయితే 18వ ఓవర్లో కీలక బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్లను చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కానీ కుల్దీప్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచి గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్‌ను మళ్లీ రైజర్స్ చేతుల్లోకి తెచ్చాడు. ఐదో బంతికి అతను అవుట్ కాగా, ఆఖరి ఓవర్లో సమీకరణం 17 పరుగులుగా మారింది. సందీప్ శర్మ వేసిన ఈ ఓవర్లో తొలి 5 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అబ్దుల్ సమద్‌ను అవుట్ చేసి సందీప్ శర్మ సంబరాలు చేసుకున్నాడు. అయితే అది నోబాల్‌గా తేలింది. సన్‌రైజర్స్ విజయానికి ఫోర్ అవసరం కాగా, సందీప్ మళ్లీ వేసిన ఆఖరి బంతిని సమద్ సిక్సర్‌గా మలిచాడు! దాంతో సన్‌రైజర్స్ శిబిరం సంబరాల్లో మునిగిపోగా, జైపూర్ స్టేడియం మూగబోయింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెపె్టన్ సంజు సామ్సన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 81 బంతుల్లోనే 138 పరుగులు జోడించడం విశేషం. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు జట్టును గెలిపించాయి. కీలక క్యాచ్‌లు వదిలేసి, సునాయాస రనౌట్ అవకాశం చేజార్చుకొని రాజస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నటరాజన్ (బి) జాన్సెన్ 35; బట్లర్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 95; సామ్సన్ (నాటౌట్) 66; హెట్‌మైర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–54, 2–192. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–44–1, జాన్సెన్ 4–0–44–1, నటరాజన్ 4–0–36–0, మార్కండే 4–0–51–0, అభిషేక్ 2–0–15–0, వివ్రాంత్ 2–0–18–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్మోల్ప్రీత్ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 33; అభిషేక్ (సి) చహల్ (బి) ఆర్.అశ్విన్ 55; త్రిపాఠి (సి) యశస్వి (బి) చహల్ 47; క్లాసెన్ (సి) బట్లర్ (బి) చహల్ 26; మార్క్రమ్ (ఎల్బీ) (బి) చహల్ 6; ఫిలిప్స్ (సి) హెట్‌మైర్ (బి) కుల్దీప్ 25; సమద్ (నాటౌట్) 17; జాన్సెన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–51, 2–116, 3–157, 4–171, 5–174, 6–196. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–48–0, కుల్దీప్ యాదవ్ 4–0–50–1, ఆర్. అశ్విన్ 4–0–35–1, చహల్ 4–0–29–4, మురుగన్ అశ్విన్ 3–0–42–0, మెకాయ్ 1–0–13–0. -
అదృష్టం ఎస్‌ఆర్‌హెచ్‌వైపు.. కొంపముంచిన నో బాల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక అద్బుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 పరుగులతో విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌వైపు తిప్పాడు. కానీ మరుసటి బంతికే అతను ఔటవ్వడంతో మళ్లీ రాజస్తాన్ వైపు తిరిగింది. కొంపముంచిన నోబాల్.. ఇక ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో సందీప్ శర్మ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా.. రెండో బంతిని అబ్దుల్ సమద్ సిక్సర్ తరలించడంతో నాలుగు బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఇక మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి, ఐదో బంతికి సింగిల్స్ రావడంతో ఆఖరి బంతికి ఎస్ఆర్హెచ్కు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. సందీప్ ఆఖరి బంతి వేశాడు. సమద్ లాంగాఫ్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న బట్లర్ క్యాచ తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి ఎదురైంది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్. అంపైర్ నోబాల్ అని ప్రకటించాడు. దీంతో ఒత్తిడిలో పడిన సందీప్ యార్కర్ వేయగా.. అబ్దుల్ సమద్ స్ట్రెయిట్సిక్స్తో ఎస్ఆర్హెచ్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఒక రకంగా మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. అందుకే ఎస్ఆర్హెచ్ను నోబాల్ రూపంలో అదృష్టం వరించింది. This is the best league in the world and you can't change our minds 🔥 Congrats Samad, hard luck, Sandeep!#RRvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/phHD2NjyYI — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్లెన్ పిలిప్స్