Ire Vs NZ 1st T20: New Zealand Won By 31 Runs Lead Check Details Inside - Sakshi
Sakshi News home page

Ire Vs NZ 1st T20: ఐర్లాండ్‌పై కివీస్‌ ఘన విజయం.. పాపం ఆతిథ్య జట్టు!

Published Tue, Jul 19 2022 10:28 AM | Last Updated on Tue, Jul 19 2022 11:06 AM

Ire Vs NZ 1st T20: New Zealand Won By 31 Runs Lead In 3 Match Series - Sakshi

మొదటి టీ20లో ఐర్లాండ్‌ పరాజయం

Ireland Vs New Zealand T20 Series 2022: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. బెల్‌ఫాస్ట్‌ వేదికగా సోమవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌లో కివీస్‌ చేతిలో వైట్‌వాష్‌(3-0)కు గురైన ఆతిథ్య ఐర్లాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

టాస్‌ గెలిచి..
న్యూజిలాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సాంట్నర్‌ బృందానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ గప్టిల్‌ 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్‌ చేరాడు.

ఇక క్లీవర్‌ సైతం 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమలో గ్లెన్‌ ఫిలిప్స్‌ నిలకడగా ఆడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి 69 పరుగుఉలు చేశాడు. నీషమ్‌(29), బ్రాస్‌వెల్‌(21) అతడికి సహకారం అందించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్‌ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

టాప్‌ స్కోరర్‌ అతడే..
లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌, కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ వరుసగా 13,12 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక డెలనీ 5 పరుగులే చేయగా.. హిట్టర్‌ హ్యారీ టెక్టర్‌ సైతం ఐదు పరుగులకే నిష్క్రమించాడు.

ఈ క్రమంలో కర్టిస్‌ కాంఫర్‌ 29 పరుగులతో రాణించి ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఎనిమిదో స్థానంలో మార్క్‌ అడేర్‌ 25 పరుగులు చేయగా.. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 31 పరుగుల తేడాతో బల్బిర్నీ బృందం కివీస్‌ చేతిలో ఓటమిపాలైంది. 

కాగా న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. జేమ్స్‌ నీషమ్‌ రెండు, కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. డఫ్పీ, ఇష్‌ సోధి చెరె వికెట్‌ తీశారు. ఇక కివీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఐర్లాండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మొదటి టీ20:
►వేదిక: సివిల్‌ సర్వీస్‌ క్రికెట్‌ క్లబ్‌, బెల్‌ఫాస్ట్‌
►టాస్‌: ఐర్లాండ్‌- బౌలింగ్‌
►న్యూజిలాండ్‌ స్కోరు: 173/8 (20)
►ఐర్లాండ్‌ స్కోరు: 142 (18.2)
►విజేత: 31 పరుగుల తేడాతో పర్యాటక న్యూజిలాండ్‌ గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: గ్లెన్ ఫిలిఫ్స్‌(52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌)
►ఆధిక్యం: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 1-0తో ముందంజ

చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్‌ ఓపెనర్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement