Lockie Ferguson
-
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. హ్యాట్రిక్ వీరుడు దూరం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఫెర్గూసన్‌కు గాయం..మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్? -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్‌గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
నిప్పులు చెరిగిన నేత్రావల్కర్, ఫెర్గూసన్
మేజర్ లీగ్ క్రికెట్లో ఇవాళ (జులై 12) సియాటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓర్కాస్‌పై వాషింగ్టన్ ఫ్రీడం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓర్కాస్.. వాషింగ్టన్ ఫ్రీడం పేసర్లు సౌరభ్ నేత్రావల్కర్ (3.4-0-18-3), లోకీ ఫెర్గూసన్ (4-0-26-4), మార్కో జన్సెన్ (4-0-28-1), ఇయాన్ హాలండ్ (4-0-34-1) ధాటికి 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ 51 (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ 24 (19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), శుభమ్ రంజనే 12 (17 బంతుల్లో) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడం.. లహీరు మిలంత (33 నాటౌట్), ఓబస్ పియెనార్ (31 నాటౌట్) రాణించడంతో 18.2 ఓవర్లలో విజయతీరాలకు (127/5) చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ డకౌట్ కాగా.. స్టీవ్ స్మిత్ 12, రచిన్ రవీంద్ర 26, ముక్తార్ అహ్మద్ 8, మ్యాక్స్‌వెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఓర్కాస్ బౌలర్లలో నండ్రే బర్గర్ 2, ఇమాద్ వసీం, కెమారాన్ గానన్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. లూకీ ఫెర్గూసన్ సరికొత్త చరిత్ర
టీ20 క్రికెట్లో న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా పాపువా న్యూగినీతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.ఈ మ్యాచ్‌లో ఫెర్గుసన్ ఎవరూ ఊహించని విధంగా తన 4 ఓవర్ల కోటాను మెయిడిన్లుగా ముగించాడు. ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా 3 వికెట్లు కూడా పడగొట్టాడు.పసికూన పాపువా న్యూగినీ బ్యాటర్లకు ఈ కివీస్పీడ్ స్టార్ చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొనేందుకు న్యూగినీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతిని అందుకున్న ఫెర్గూసన్ తొలి బంతికే వికెట్ తీసాడు. ఆ ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన లాకీ.. ఏడో ఓవర్లో మరోసారి బంతిని అందుకుని రెండోసారి మెయిడిన్ చేశాడు.మళ్లీ 12వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి వికెట్ తీసి మూడో ఓవర్‌ను మెయిడిన్ చేశాడు. 14వ ఓవర్లో రెండో బంతికి మరో వికెట్ తీసి మరోసారి మెయిడిన్ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఫెర్గూసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫెర్గూసన్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ పేరిట ఉండేది.పనామాపై సాద్ బిన్ జఫర్ 4 మెయిడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. అయితే తాజా మ్యాచ్‌లో 4 మెయిడిన్ ఓవర్లతో పాటు 3 వికెట్లు పడగొట్టిన ఫెర్గూసన్.. సాద్ బిన్ జఫర్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో 4 ఓవర్లు మెయిడిన్ వేసిన తొలి బౌలర్‌గా కూడా ఫెర్గూసన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికి సాధ్యం కాలేదు.అదేవిధంగా ఓవరాల్‌గా టీ20ల్లో 4కి 4 ఓవర్లు మెయిడిన్ వేసిన రెండో బౌలర్‌గా ఫెర్గూసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జఫర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2021లో పనమాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో సాద్ బిన్ జఫర్ 4 ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. -
ఫెర్గూసన్ అద్భుతం.. పీఎన్జీపై న్యూజిలాండ్ అద్బుత విజయం
న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ నుంచి ఇదివరకే నిష్క్రమించింది. అయితే గ్రూప్ ‘సి’లో తమ ఆఖరి పోరులో విజయంతో పాటు పేస్ బౌలర్ ఫెర్గూసన్ (4–4–0–3) పుటలకెక్కిన రికార్డు గణాంకాలతో కివీస్ శిబిరం సంతృప్తి చెందింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినీపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ అమిని (17; 2 ఫోర్లు), నొర్మాన్ వనువా (14; 1 ఫోర్, 1 సిక్స్), సెసె బవు (12; 1 ఫోర్) రెండంకెల స్కోర్లు చేశారు. పరుగివ్వకుండా అన్ని మెయిడిన్లే వేసిన ఫెర్గూసన్ 3 వికెట్లు తీశాడు. తద్వారా కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ 2021లో పనామాపై వేసిన 4–4–0–2 రికార్డు స్పెల్ తుడిచిపెట్టుకుపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ విలియమ్సన్ (18 నాటౌట్; 2 ఫోర్లు), మిచెల్ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. -
నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. అయినా చిత్తుగా ఓడిన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఫెర్గూసన్ నిప్పులు చెరిగినప్పటికీ (3.5-0-12-4) న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఫెర్గూసన్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ 17 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసి, 72 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. ఫెర్గూసన్‌తో పాటు ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) రాణించడంతో ఆస్ట్రేలియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిడ్ హెడ్ (45) కాస్త పర్వాలేదనిపించాడు. కమిన్స్ (28), మార్ష్ (26), టిమ్ డేవిడ్ (17), స్టీవ్ స్మిత్ (11), నాథన్ ఇల్లిస్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మ్యాక్స్‌వెల్ (6), ఇంగ్లిస్ (5), మాథ్యూ వేడ్ (1), జంపా (1), హాజిల్‌వుడ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. జంపా మాయాజాలం.. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆడమ్ జంపా (4-0-34-4) మాయాజాలం దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్ (2/16), హాజిల్‌వుడ్ (1/12), కమిన్స్ (1/19), మార్ష్ (1/18) కూడా రాణించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (42) చేశాడు. ఫిలిప్స్‌తో పాటు జోష్ క్లార్క్సన్ (10), బౌల్ట్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫిన్ అలెన్ (6), విల్ యంగ్ (5), సాంట్నర్ (7), చాప్మన్ (2), మిల్నే (0), ఫెర్గూసన్ (4) దారుణంగా విఫలమయ్యారు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ డెవాన్ కాన్వే బ్యాటింగ్‌కు దిగలేదు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25న ఇదే ఆక్లాండ్‌లో జరుగనుంది. -
WC 2023: ఎదురులేని న్యూజిలాండ్..బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టిన కివీస్
వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. చెలరేగిన ఫెర్గూసన్ చెన్నైలోని చెపాక్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి బంతికే కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. ఓపెనర్ లిటన్ దాస్‌ను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులకే నిష్క్రమించగా.. మెహిదీ హసన్ మిరాజ్ 30, షకీబ్ 40, ముష్ఫికర్ రహీం 66 పరుగులతో రాణించారు. ఆఖర్లో మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ 2, లాకీ ఫెర్గూసన్ 3, సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. సమిష్టిగా రాణించి ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడింది కివీస్. ఓపెనర్‌గా వచ్చిన రచిన్ రవీంద్ర 9 పరుగులకే అవుట్ కాగా.. డెవాన్ కాన్వే(45)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వచ్చీ రాగానే కేన్ మామ మళ్లీ నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 67 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అడుగుపెట్టిన కేన్ మామ.. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో 42.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసిన కివీస్ 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. లాకీ ఫెర్గూసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా స్టార్ బౌలర్
బంగ్లాదేశ్‌తో జరిగే వన్డేసిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు టామ్ లాథమ్, టిమ్ సౌథీ వంటి చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు కివీస్ సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. ఈ క్రమంలో బంగ్లాతో సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఎంపికయ్యాడు. ఫెర్గూసన్ కివీస్ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఇదే తొలి సారి. ఇక ఇదే విషయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ.. "లాకీ ఫెర్గూసన్ అంతర్జాతీయ స్ధాయిలో చాలా అనుభవం ఉంది. ఇప్పటివరకు బౌలింగ్ యూనిట్‌ను ముందుకు నడిపించిన లాకీకి.. ఓవరాల్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించింది. అతడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని నేను భావిస్తున్నా" అని పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత బంగ్లాకు.. కాగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుండడం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి ఈ పర్యటనలో భాగంగా కివీస్ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కివీస్ రెండు దఫాలుగా బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్ ఆడనుంది. సెప్టెంబర్ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్ 28 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. ఇక బంగ్లా టూర్‌కు దూరమైన డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ ,టిమ్ సౌథీ.. వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో రానున్నారు. న్యూజిలాండ్ వన్డే జట్టు: లాకీ ఫెర్గూసన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, చాడ్ బోవ్స్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైల్ జామీసన్, కోల్ మెక్కాంచీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, రాచిన్ రవీంద్ర, రచిన్ రవీంద్ర, విల్ యంగ్ Lockie Ferguson to lead New Zealand in Bangladesh this month. Several first-choice players have been rested for the series ahead of the World Cup - https://t.co/GI8HKbN36v pic.twitter.com/SBM7GdpAQz — Cricbuzz (@cricbuzz) September 2, 2023 -
GT VS KKR: ఐపీఎల్-2023లో ఫాస్టెస్ట్ డెలివరీ
ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన బంతి రికార్డైంది. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ లోకీ ఫెర్గూసన్ ఐపీఎల్-2023 ఫాస్టెస్ట్ డెలివరీ సంధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌల్ చేసిన ఫెర్గూసన్.. గిల్ ఎదుర్కొన్న రెండో బంతిని గంటకు 154.1 కిమీ బుల్లెట్ వేగంతో సంధించాడు. Lockie Ferguson bowled the fastest bowl of IPL 2023 - 154.1 kph. #KKR Blood 💜#KKRvsGT #IPL2023 pic.twitter.com/iTLju1q6Ry — SRKholic Saify 🇮🇳 (@SRKholic_Saify) April 9, 2023 ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఏ బౌలర్ ఇంత వేగవంతమైన బంతి వేయలేదు. ఈ ఓవర్లో నిప్పులు చెరిగిన ఫెర్గూసన్.. తొలి బంతిని 149 కిమీ వేగంతో, మూడో బంతిని 150.15 కిమీ వేగంతో, నాలుగో బంతిని 151.4 కిమీ వేగంతో సంధించి, పేస్‌కా సుల్తాన్ అనిపించుకున్నాడు. అయితే ఇంత చేసినా అతనికి ఒక్క వికెట్ కూడా దక్కకపోగా.. ధారాళంగా (4 ఓవర్లలో 40) పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. విజయ్ శంకర్ (24 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 3, సుయాశ్ శర్మకు ఓ వికెట్ దక్కింది. -
ఐపీఎల్ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు టూ టైమ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను సమస్య కారణంగా ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీగ్ మొత్తానికే దూరం కాగా.. తాజాగా స్టార్ బౌలర్, న్యూజిలాండ్ ఆటగాడు లోకీ ఫెర్గూసన్ గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు ఫెర్గూసన్ గాయం వార్త వెలుగు చూసింది. దీంతో అతను మార్చి 25న జరిగాల్సిన తొలి వన్డే బరి నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో కివీస్ క్రికెట్ బోర్డు ఎవరినీ ఎంపిక చేయలేదు. శ్రీలంకతో తొలి వన్డేకు మాత్రం ఫెర్గూసన్ దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే, ఫెర్గూసన్ గాయం తీవ్రతపై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కానీ కేకేఆర్ యాజమాన్యం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ ఫెర్గూసన్ గాయం బారిన పడకుండి ఉంటే, తొలి వన్డే తర్వాత ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు పయనమవ్వాల్సి ఉండింది. ఫెర్గూసన్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కేకేఆర్ యాజమాన్యం కలవర పడుతుంది. ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేవలు కోల్పోయిన ఆ జట్టు, ఫెర్గూసన్ సేవలను కూడా కోల్పోతే భారీ మూల్యం తప్పదని భావిస్తుంది. ఫెర్గూసన్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా పేస్ బౌలింగ్ భారమంతా టిమ్ సౌథీపై పడుతుంది. ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరో 8 రోజులు మాత్రమే ఉన్నా కేకేఆర్ ఇప్పటికీ తమ నూతన కెప్టెన్ పేరును (శ్రేయస్ రీప్లేస్మెంట్) ప్రకటించలేదు. కాగా, ఫెర్గూసన్ గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2023 వేలంలో కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. కేకేఆర్ ఏప్రిల్ 2న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్!
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇక తొలుత రౌండ్-1 మ్యాచ్‌లు జరగనుండగా.. ఆక్టోబర్ 23 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్-12 మొదటి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తాడో పేడో తేల్చుకోనున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు ఫెర్గూసన్ అందుబాటులో ఉండనున్నట్లు కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. కాగా స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు పొత్తికడుపు గాయం కారణంగా ఫెర్గూసన్ దూరమయ్యాడు. అతడి గాయం అంత తీవ్రమైనది కానప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆడించి రిస్క్ తీసుకోడదని న్యూజిలాండ్ జట్టు మేనేజేమెంట్ భావించింది. సిడ్నీ వేదికగా జరిగే మా తొలి మ్యాచ్‌కు ఫెర్గూసన్ మా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. అతడు తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అదే విధంగా మా ఫైనల్ ప్రాక్టీస్ సెషన్లో అతడు బౌలింగ్ కూడా చేశాడు. అతడు జట్టు మా ప్రధాన బౌలర్. ఫెర్గూసన్ తిరిగి ఫిట్నెస్ సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. చదవండి: వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ -
కివీస్‌ను వెంటాడుతోన్న గాయాలు.. మరో స్టార్ బౌలర్ కూడా!
న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఈ ట్రై సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్నాడు. కాగా అతడికి దాదాపు వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు కివీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తుండగా.. తాజాగా ఫెర్గూసన్‌కు కుడా గాయం కావడం న్యూజిలాండ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వెటరన్ పేసర్ ఆడమ్ మిల్నే కూడా తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందిస్తూ.. "ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తికడుపు గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదు. న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ టీ20 ప్రపంచకప్ సమయానికి లూకీ పూర్తి ఫిట్నెస్ను సాధిస్తాడని నేను భావిస్తున్నాను. అతడు మా జట్టులో కీలక బౌలర్. గతేడాది ప్రపంచకప్‌లో దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ సేవలు కోల్పోయాం. ఈ సారి అలా జరగదని నేను ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక ట్రై సిరీస్‌ను న్యూజిలాండ్ ఓటమితో ప్రారంభించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కివీస్ ఓటమిపాలైంది. చదవండి: Women Asia Cup 2022 INDW VS BANW: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్ -
Ire Vs NZ: పాపం ఐర్లాండ్.. టీ20 సిరీస్‌లోనూ..!
Ireland Vs New Zealand T20 Series 2022: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బెల్ఫాస్ట్ వేదికగా సోమవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌లో కివీస్ చేతిలో వైట్‌వాష్(3-0)కు గురైన ఆతిథ్య ఐర్లాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టాస్ గెలిచి.. న్యూజిలాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సాంట్నర్ బృందానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గప్టిల్ 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్ చేరాడు. ఇక క్లీవర్ సైతం 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమలో గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి 69 పరుగుఉలు చేశాడు. నీషమ్(29), బ్రాస్‌వెల్(21) అతడికి సహకారం అందించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. Mark Adair is still fighting 👊 We need 44 runs off the last four overs. SCORE: https://t.co/nImk9IyGSm#BackingGreen | #EXCHANGE22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/JZuZxaRNRV — Cricket Ireland (@cricketireland) July 18, 2022 టాప్ స్కోరర్ అతడే.. లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ వరుసగా 13,12 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక డెలనీ 5 పరుగులే చేయగా.. హిట్టర్ హ్యారీ టెక్టర్ సైతం ఐదు పరుగులకే నిష్క్రమించాడు. ఈ క్రమంలో కర్టిస్ కాంఫర్ 29 పరుగులతో రాణించి ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఎనిమిదో స్థానంలో మార్క్ అడేర్ 25 పరుగులు చేయగా.. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. దీంతో 31 పరుగుల తేడాతో బల్బిర్నీ బృందం కివీస్ చేతిలో ఓటమిపాలైంది. Our first six of the innings - just about! SCORE: https://t.co/nImk9IyGSm#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/ffwOUEKdwQ — Cricket Ireland (@cricketireland) July 18, 2022 కాగా న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్‌కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. జేమ్స్ నీషమ్ రెండు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. డఫ్పీ, ఇష్ సోధి చెరె వికెట్ తీశారు. ఇక కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గ్లెన్ ఫిలిప్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Glenn Phillips has been awarded: ➡️ Multibagger of the Match ➡️ Player of the Match#BackingGreen #IREvNZ #Exchange22 pic.twitter.com/gh4DsgvXtk — Cricket Ireland (@cricketireland) July 18, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మొదటి టీ20: ►వేదిక: సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్, బెల్ఫాస్ట్ ►టాస్: ఐర్లాండ్- బౌలింగ్ ►న్యూజిలాండ్ స్కోరు: 173/8 (20) ►ఐర్లాండ్ స్కోరు: 142 (18.2) ►విజేత: 31 పరుగుల తేడాతో పర్యాటక న్యూజిలాండ్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ ఫిలిఫ్స్(52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్) ►ఆధిక్యం: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0తో ముందంజ చదవండి: Lendl Simmons: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! -
ఉమ్రాన్ మాలిక్ రికార్డును బద్దలు కొట్టిన ఫెర్గూసన్..
ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఏకంగా గంటకు కు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్ నిలిచాడు. అంతకుముందు ఎస్ఆర్హెచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ(157 .కి.మీ వేగం) రికార్డును ఫెర్గూసన్ బద్దలు కొట్టాడు. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' -
ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్?
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆఖర్లో రషీద్ ఖాన్(11 బంతుల్లో 31*), రాహుల్ తెవాటియా(21 బంతుల్లో 40*) విధ్వంసం సృష్టించడంతో విజయం అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఓడినప్పటికి బ్యాటింగ్‌లో ఎస్ఆర్హెచ్ నుంచి మరో ఆణిముత్యం బయటపడ్డాడు. అతనే శశాంక్ సింగ్. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హాట్రిక్ సిక్సర్లు బాది అతనికి చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా 6 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సహా 25 పరుగులు సాధించాడు. ఒక రకంగా ఎస్ఆర్హెచ్ 195 పరుగుల భారీ స్కోరు చేయడంలో శశాంక్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌ల నుంచి జట్టులో ఉన్నప్పటికి శశాంక్‌కు బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాగానే తన పవరేంటో చూపించాడు. ఈ సీజన్లో ఉమ్రాన్ మాలిక్‌తో పోటీ పడుతూ అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న లోకీ ఫెర్గూసన్‌ను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా 147 కిమీ వేగంతో ఫెర్గూసన్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతిని ఫైన్‌లెగ్ దిశగా సిక్స్ కొట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. Courtesy: IPL Twitter ఎవరీ శశాంక్ సింగ్..? ముంబైకి చెందిన శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న జన్మించాడు. మంచి స్ట్రైక్ రొటేట్ చేయగల బ్యాటర్‌గా గుర్తింపు పొందిన శశాంక్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగలడు. 2015లో ముంబై తరపున డొమొస్టిక్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది టి20, లిస్ట్- ఏ క్రికెట్లో ఎంటరయ్యాడు, ఇక 2019లో చత్తీస్‌ఘర్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2017 నుంచి ఐపీఎల్లో ఉన్న శశాంక్ సింగ్ తొలుత ఢిల్లీ క్యాపిటల్స్.. 2019, 2020 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఐపీఎల్ మెగావేలంఓ ఎస్ఆర్హెచ్.. శశాంక్ సింగ్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: Umran Malik 5 Wickets: ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్ కొత్త చరిత్ర Muttiah Muralitharan Vs Marco Jansen: 'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీఎస్కేపై చెత్త రికార్డు నిలబెట్టుకున్నాడు.. ఎవరా బౌలర్!
గుజరాత్ టైటాన్స్ బౌలర్.. లోకి ఫెర్గూసన్ సీఎస్కేపై తనకున్న చెత్త రికార్డును మరోసారి నిలబెట్టుకున్నాడు. తాజాగా ఐపీఎల్ 2022లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకముందు కూడా 2020 ఐపీఎల్లో 4 ఓవర్లలో 54 పరుగులు.. 2021 ఐపీఎల్ సీజన్లోనూ 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకొని ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.తాజా మ్యాచ్‌లోనూ అదే చెత్త బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఇదే సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనూ ఫెర్గూసన్ తన కోటా ఓవర్లలో 46 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా ఇది చూసిన అభిమానులు..''ఫెర్గూసన్‌కు సీఎస్కే అంటే భయమనుకుంటా'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు IPL 2022: సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం.. హార్దిక్ పాండ్యాకు ఏమైంది? -
ఫెర్గూసన్ సూపర్ యార్కర్.. బట్లర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ లాకీ ఫెర్గూసన్ అద్భుతమైన బంతితో మెరిశాడు. అప్పటికే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న జోస్ బట్లర్‌ను ఫెర్గూసన్ స్లో యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర వేసిన ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఐదో బంతిని బారీ సిక్స్ బాదిన బట్లర్.. అఖరి బంతికికూడా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే తెలివిగా ఫెర్గూసన్ తన బౌలింగ్‌లో పేస్ తగ్గించి స్లో యార్కర్ వేశాడు. ఫెర్గూసన్ వేసిన బంతికి బట్లర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ గుజరాత్ టైటాన్స్ చేతిలో 37 పరుగులు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. చదవండి: IPL 2022 RR Vs GT: హార్ధిక్ పాండ్యాకు ఏమైంది.. ? మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! Jos Buttler X Slower ball pic.twitter.com/m0qkktCk4c — Mohammed Asif (@Klassy__KL) April 14, 2022 -
న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో మరో ఆటగాడు ఔట్
Lockie Ferguson Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై కుంగిపోయి ఉన్న ఆ జట్టుకు పుండు మీద కారం చల్లినట్లుగా గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తొలుత పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ మార్టిన్ గప్తిల్ గాయపడి భారత్‌తో కీలక మ్యాచ్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న ఫెర్గూసన్‌కు ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అని తేలడంతో వైద్యులు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ జట్టును నుంచి ఫెర్గూసన్‌ను తప్పించి, అతని స్థానంలో ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవడం చాలా ముఖ్యం. భారత్, న్యూజిలాండ్ జట్లు పాక్ చేతిలో పరాజయం పాలవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. కాగా, గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, జట్లతో పాటు బలహీనమైన అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరు జట్ల నుంచి కేవలం రెండు జట్లకు మాత్రమే సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉండడం.. పాక్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారు కావడంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్ -
ఫెర్గూసన్ చెత్త రికార్డు..
Lockie Ferguson.. సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి. ఇక్కడ విశేషమేమిటంటే.. ఫెర్గూసన్ గత సీజన్లోనూ దుబాయ్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనే ఫెర్గూసన్ 54 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
సెకెండ్ ఫేజ్‌లో తొలి మ్యాచ్.. నొప్పితో విలవిల్లాడిన స్మిత్
Steven Smith: ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పృద్వీ షా స్ధానంలో జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్ 34 బంతుల్లో 4 ఫోర్లుతో 39 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్ రెండో దశలో స్మిత్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా ఇన్నింగ్ 13 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్రయత్నించిన స్మిత్.. మిస్ కావడంతో బంతి తొడ పై భాగాన తగిలింది. దీంతో స్మిత్ కింద పడిపోయి కొద్ది సేపు నొప్పితో విలవిల్లాడు. కాగా తర్వాత బంతికే స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు pic.twitter.com/hfNsPyy4P5 — Simran (@CowCorner9) September 28, 2021 -
చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్; అద్భుత విజయం
లీడ్స్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ ఆఖరిఓవర్లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్‌షైర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్‌కు చివరిఓవర్లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఫెర్గూసన్ వేశాడు. అయితే ఫెర్గూసన్ వేసిన రెండో బంతి నోబాల్ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్ జోన్స్ ఫోర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి వెల్స్ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్ ఐదో బంతికి లూక్ వుడ్‌ను అద్బుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్ బంతిని విసిరాడు. టామ్ హార్ట్లీ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో లిత్ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్‌షైర్ బ్యాటింగ్‌లో హారీ బ్రూక్(50 బంతుల్లో 91నాటౌట్ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్ కెప్టెన్ లిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్ హ్యాట్రిక్‌తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్ జోన్స్ 64 నాటౌట్, కీటన్ జెన్నింగ్స్ 37 పరుగులతో రాణించారు. LOCKIE FERGUSON HATTRICK 🔥 Look at those scenes 😍#Blast21 pic.twitter.com/QaFAp25KAZ — Vitality Blast (@VitalityBlast) July 2, 2021 -
Ajit Agarkar: కనీసం ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి
అహ్మదాబాద్: వరుస ఓటములతో డీలా పడిన కేకేఆర్ నేడు పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కోనుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కేకేఆర్ పంజాబ్‌తో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ కేకేఆర్ ఫ్రాంచైజీకి ఒక కీలక సూచన చేశాడు. ''కేకేఆర్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా.. మ్యాచ్‌లోకి వచ్చేసరికి మాత్రం తడబాటు కొనసాగుతూనే ఉంది. లోకీ ఫెర్గూసన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌కు కేకేఆర్ ఇప్పటివరకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనుకుంటే కెప్టెన్ మోర్గాన్, నరైన్, కమిన్స్ స్థానంలో అతనిని తీసుకునే అవకాశం ఉంది. పూర్ ఫామ్‌లో ఉన్న మోర్గాన్ తనకు తాను తప్పుకొని లోకికి అవకాశం ఇవ్వాలి లేదా నరైన్ స్థానంలో ఆడించాలి. లోకీ ఫెర్గూసన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానం చేయగలడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ఫెర్గూసన్ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. కాబట్టి ఇప్పటికైనా అతనికి అవకాశం ఇస్తే మంచిది. ఇప్పటివరకు చెన్నై, ముంబై వేదికల్లో మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఇకపై అహ్మదాబాద్, ఢిల్లీ వేదికల్లో ఆడనుంది. నేడు పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇక్కడ 200 పై చిలుకు స్కోరు వస్తుందని గ్యారంటీ లేదు.. కానీ సరిగ్గా ఆడితే మాత్రం 160 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఫెర్గూసన్ గతేడాది కేకేఆర్ తరపున ఐపీఎల్లో 5 మ్యాచ్‌లాడి 43 పరుగులతో పాటు 6 వికెట్లు తీశాడు. -
సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు
దుబాయ్: సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టు సూపర్ విజయం సాధించింది. కోల్‌కత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన లాకీ ఫెర్గూసన్ సూపర్ ఓవర్లో డేవిడ్ వార్నర్ వికెట్ తీయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తొలుత 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఫెర్గూసన్ తన పదునైన బంతులతో హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 15 పరుగులే ఇచ్చాడు. అటు తర్వాత సూపర్ ఓవర్లోనూ సత్తా చాటాడు. 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మోర్గాన్ 1, దినేష్ కార్తీక్ 2 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్‌కు అద్భుతమైన గెలుపునందించిన ఫెర్గూసన్ కేకేఆర్ తరపున తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) తొలి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ సూపర్ ఓవర్ తొలి బంతికి ఫుల్ లెంగ్త్ డెలివరీతో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి రెండు పరుగులిచ్చాడు. మూడో బంతికి చక్కని యార్కర్‌తో సమద్‌ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్ ఓవర్ మొదటి బంతికి వార్నర్‌ను ఔట్ చేయడం మరచిపోలేని అనుభూతి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో ఫెర్గూసన్ చెప్పుకొచ్చాడు. అది తన ఫేవరెట్ వికెట్లలో ఒకటి అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో తన బౌలింగ్ విషయానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనకే వదిలేశాడని ఫెర్గూసన్ వెల్లడించాడు. అటు మ్యాచ్‌లోనూ, ఇటు సూపర్ ఓవర్లోనూ మెరుగ్గా రాణించి జట్టుకు విజయాన్నందించిన ఫెర్గూసన్‌పై కెప్టెన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో పోరాడి ఓడిన కేకేఆర్ తాజా మ్యాచ్‌తో పోటీలోకి వచ్చిందని అన్నాడు. (చదవండి: సూపరో... సూపరు) -
సూపరో... సూపరు
ఉత్కంఠకు రూపం ఉంటే అది కూడా ఊపిరి బిగపట్టుకుని ఆస్వాదించేది. బంతి బంతికీ తారుమారవుతున్న ఆధిపత్యాన్ని చూసి అబ్బురపడేది. ప్రతి యేటా మండే ఎండలో అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి వర్షా కాలంలో జరుగుతున్నా అభిమానులు మాత్రం చివరి బంతి వరకు తుది ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ, అనుక్షణం చోటు చేసుకుంటున్న మలుపులకు మురిసిపోతూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు జరిగినా ఏ సీజన్లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ‘సూపర్ ఓవర్’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్’ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించగా... దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత కూడా ‘సూపర్ ఓవర్’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఒక సూపర్ ఓవర్లో కాకుండా రెండు సూపర్ ఓవర్లలో తేలడం విశేషం. గతంలో సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘సూపర్ ఓవర్’ కూడా టై కావడం... ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్ ఓవర్‌ను ఆడించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధన తెచ్చింది. ఐపీఎల్లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు. అబుదాబి: బంతితో అంతా తానై ఆడించిన లాకీ ఫెర్గూసన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును గట్టెక్కించాడు. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్ ఓవర్లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలో తడబడి ఓటమివైపు నిలబడ్డాడు. ఆద్యంతం టన్నులకొద్దీ వినోదాన్ని పంచిన ఈ మ్యాచ్‌లో చివరకు గెలుపు కోల్కతావైపే నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ మోర్గాన్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్ (3/15) ఈ ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. నిదానంగా మొదలై.... దూకుడుగా ముగిసి మండే ఎండలో కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. తొలి మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. తర్వాత రాహుల్ త్రిపాఠి 6, 4... గిల్ వరుసగా మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 48 పరుగులు చేసిన కోల్‌కతా త్రిపాఠి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కోసం బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నితీశ్ రాణా (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్))తో కలిసి గిల్ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు కోల్‌కతా 77/1తో నిలిచింది. అప్పటికే కుదురుకున్న గిల్, రాణా వరుస ఓవర్లలో... ప్రియమ్ గార్గ్ అద్భుత ఫీల్డింగ్‌కు పెవిలియన్ బాట పట్టారు. కాసేపటికే రసెల్ (11 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలి గింది. ఈ దశలో మోర్గాన్, కార్తీక్ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మోర్గాన్ 4, 6 సహాయంతో 16 పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు. విలియమ్సన్ పట్టుదల... ఫీల్డింగ్‌లో గాయపడిన విలియమ్సన్ ఓపెనర్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో సింగిల్స్ కోసం ఆరాటపడకుండా బౌండరీల ద్వారా పరుగులు సాధించాడు. బెయిర్‌స్టో కూడా విలియమ్సన్కు అండగా నిలవడంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇందులో 46 (10 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు బౌండరీల ద్వారా రావడం విశేషం. పవర్‌ప్లే తర్వాతి తొలి బంతికే విలియమ్సన్‌ను అవుట్ చేసి ఫెర్గూసన్ రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ఫెర్గూసన్ వైవిధ్యం... వార్నర్ పోరాటం విలియమ్సన్ ఔటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. అద్భుత బంతితో ప్రియమ్ గార్గ్ (4)ను బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. మరుసటి ఓవర్లోనే బెయిర్‌స్టోను వరుణ్ అవుట్ చేశాడు. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న ఫెర్గూసన్ చక్కటి యార్కర్‌తో మనీశ్ పాండే (6)ను పెవిలియన్ చేర్చి రైజర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ పోరాటం ఆపలేదు. విజయ్ శంకర్ (7)తో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 109/4తో నిలిచింది. సమద్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాక ఆటలో వేగం పెరిగింది. ఉన్నంత వరకు ధాటిగా ఆడిన సమద్... కెప్టెన్‌పై భారాన్ని తగ్గించాడు. అప్పటివరకు బౌలింగ్‌తో బెంబేలెత్తించిన ఫెర్గూసన్ తెలివైన ఫీల్డింగ్‌తో సమద్‌ను అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడే మ్యాచ్ పూర్తి మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఉత్కం‘టై’... చివరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 18 పరుగులు కావాలి. బౌలర్ రసెల్ బంతి అందుకున్నాడు. అనుభవాన్నంతా రంగరించి ఆడుతున్న వార్నర్, అప్పుడే వచ్చిన రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. రసెల్ తొలి బంతిని నోబాల్ వేశాడు. ఆ తర్వాత ‘ఫ్రీ హిట్’ బంతిపై రషీద్ ఒక్క పరుగు తీసి వార్నర్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. వార్నర్ జూలు విదిల్చి వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న వార్నర్ ఆఖరి బంతికి గురి తప్పాడు. రసెల్ వేసిన బంతి వార్నర్ ప్యాడ్ లకు తగిలి ఆఫ్‌సైడ్ కు వెళ్లిపోయింది. వార్నర్, రషీద్ ఒక పరుగు మాత్ర మే పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. రెండు జట్లు సూపర్ ఓవర్‌కు సిద్ధమయ్యాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) గార్గ్ (బి) రషీద్ 36; త్రిపాఠి (బి) నటరాజన్ 23; రాణా (సి) గార్గ్ (బి) శంకర్ 29; రసెల్ (సి) శంకర్ (బి) నటరాజన్ 9; మోర్గాన్ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–48, 2–87, 3–88, 4–105, 5–163. బౌలింగ్: సందీప్‌శర్మ 4–0– 27–0, థంపి 4–0–46–1, నటరాజన్ 4–0– 40–2, విజయ్ శంకర్ 4–0–20–1, రషీద్ ఖాన్ 4–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) రసెల్ (బి) వరుణ్ 36; విలియమ్సన్ (సి) రాణా (బి) ఫెర్గూసన్ 29; గార్గ్ (బి) ఫెర్గూసన్ 4; వార్నర్ (నాటౌట్) 47; మనీశ్ పాండే (బి) ఫెర్గూసన్ 6; శంకర్ (సి) గిల్ (బి) కమిన్స్ 23; సమద్ (సి) గిల్ (బి) శివమ్ మావి 23; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–58, 2–70, 3–70, 4–82, 5–109, 6–146. బౌలింగ్: కమిన్స్ 4–0–28–1, మావి 3–0– 34–1, వరుణ్ 4–0–32–1, రసెల్ 2–0– 29–0, ఫెర్గూసన్ 4–0–15–3, కుల్దీప్ 3–0– 18–0. ► లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (186 మ్యాచ్‌ల్లో 5,759 పరుగులు), రైనా (193 మ్యాచ్‌ల్లో 5,368 పరుగులు), రోహిత్ శర్మ (197 మ్యాచ్‌ల్లో 5,158 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. గతంలో మూడుసార్లు ఆ జట్టు సూపర్ ఓవర్లో ఓడింది. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2009లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 5,037 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ► టోర్నీ చరిత్రలో ‘టై’ అయిన మ్యాచ్‌లు ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ‘టై’గా ముగియడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో ఢిల్లీ –పంజాబ్; ముంబై –బెంగళూరు; ముంబై–పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లు ‘టై’గా ముగిసి తుది ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. -
కాస్త జలుబు చేసిందంతే
ఆక్లాండ్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త జలుబు చేసినా సరే నానా హైరానా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్ పేస్ బౌలర్ లోకీ ఫెర్గూసన్‌కు కూడా ఎదురైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత అతనికి కొంత అనారోగ్యంగా కనిపించడంతో కివీస్ బోర్డు వెంటనే స్పందించింది. కరోనా వైరస్‌కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్‌లోనే ఉండాలని నిర్బంధించింది. శనివారం అతని రిపోర్ట్లు నెగెటివ్‌గా రావడంతో ఊపిరి పీల్చుకొని ఫెర్గూసన్ ఆక్లాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. కరోనా విషయంలో అతి చేసినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. ‘నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. టీమ్ వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది.’ అని ఫెర్గూసన్ అన్నాడు. మరోవైపు కరోనా కారణంగా మరో రెండు క్రికెట్ ఈవెంట్లు రద్దయ్యాయి. జింబాబ్వేలో పర్యటిస్తోన్న ఇంగ్లండ్ కౌంటీ జట్టు డెర్బీషైర్ టూర్‌ను రద్దు చేసుకొని ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ చివరి రౌండ్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి.