న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ నుంచి ఇదివరకే నిష్క్రమించింది. అయితే గ్రూప్ ‘సి’లో తమ ఆఖరి పోరులో విజయంతో పాటు పేస్ బౌలర్ ఫెర్గూసన్ (4–4–0–3) పుటలకెక్కిన రికార్డు గణాంకాలతో కివీస్ శిబిరం సంతృప్తి చెందింది.
సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినీపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ అమిని (17; 2 ఫోర్లు), నొర్మాన్ వనువా (14; 1 ఫోర్, 1 సిక్స్), సెసె బవు (12; 1 ఫోర్) రెండంకెల స్కోర్లు చేశారు.
పరుగివ్వకుండా అన్ని మెయిడిన్లే వేసిన ఫెర్గూసన్ 3 వికెట్లు తీశాడు. తద్వారా కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ 2021లో పనామాపై వేసిన 4–4–0–2 రికార్డు స్పెల్ తుడిచిపెట్టుకుపోయింది.
అనంతరం సులువైన లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ విలియమ్సన్ (18 నాటౌట్; 2 ఫోర్లు), మిచెల్ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment