Papua New Guinea
-
ఫెర్గూసన్ అద్భుతం.. పీఎన్జీపై న్యూజిలాండ్ అద్బుత విజయం
న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ నుంచి ఇదివరకే నిష్క్రమించింది. అయితే గ్రూప్ ‘సి’లో తమ ఆఖరి పోరులో విజయంతో పాటు పేస్ బౌలర్ ఫెర్గూసన్ (4–4–0–3) పుటలకెక్కిన రికార్డు గణాంకాలతో కివీస్ శిబిరం సంతృప్తి చెందింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినీపై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ జట్టు 19.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ అమిని (17; 2 ఫోర్లు), నొర్మాన్ వనువా (14; 1 ఫోర్, 1 సిక్స్), సెసె బవు (12; 1 ఫోర్) రెండంకెల స్కోర్లు చేశారు. పరుగివ్వకుండా అన్ని మెయిడిన్లే వేసిన ఫెర్గూసన్ 3 వికెట్లు తీశాడు. తద్వారా కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ 2021లో పనామాపై వేసిన 4–4–0–2 రికార్డు స్పెల్ తుడిచిపెట్టుకుపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ విలియమ్సన్ (18 నాటౌట్; 2 ఫోర్లు), మిచెల్ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. -
NZ Vs PNG: న్యూజిలాండ్, పీఎన్జీ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-సిలో భాగంగా ఇవాళ (జూన్ 17) న్యూజిలాండ్, పపువా న్యూ గినియా జట్లు తలపడనున్నాయి. ట్రినిడాడ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ అనంతరం మరోసారి వర్షం మొదలుకావడంతో మ్యాచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కు ఇది టీ20 వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్.తుది జట్లు..న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్పపువా న్యూ గినియా: టోనీ ఉరా, అసద్ వలా(కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బావు, హిరి హిరి, చాడ్ సోపర్, కిప్లిన్ డోరిగా(వికెట్‌కీపర్), నార్మన్ వనువా, అలీ నావో, కబువా మోరియా, సెమో కమియా -
టీ20 వరల్డ్‌కప్‌లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
పొట్టి ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 17) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 బెర్త్‌లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.గ్రూప్-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగా సాగనుంది.కాగా, ఇవాల్టి మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)గ్రూప్-1, గ్రూప్-2ల్లో అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. -
T20 WC: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్
వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పపువా న్యుగినియాతో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌లో అఫ్గన్ జట్టు వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్-సిలో ఉంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన రషీద్ ఖాన్ బృందం.. గ్రూప్ దశలో మూడింట మూడు మ్యాచ్‌లు గెలిచింది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడో గెలుపు నమోదు చేసి ఆరు పాయింట్ల(నెట్ రన్‌రేటు +4.230)తో గ్రూప్-సి టాపర్‌గా నిలిచింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫజల్హక్ ఫరూకీ(3/16), నవీన్ ఉల్ హక్(2/4), నూర్ అహ్మద్(1/14) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసి సత్తా చాటారు. తేలికగా తలవంచని ప్రత్యర్థిఈ క్రమంలో 19.5 ఓవర్లలో 95 పరుగులు చేసిన పీఎన్జీ జట్టు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ ముందు అంత తేలికగా తలవంచలేదు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గులాబిదిన్ నయీబ్(36 బంతుల్లో 49 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిగతా వాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, మహ్మద్ నబీ(23 బంతుల్లో 16 నాటౌట్) ఆచితూచి ఆడారు. View this post on Instagram A post shared by ICC (@icc)ఫలితంగా 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసిన అఫ్గన్ జయభేరి మోగించింది. తద్వారా సూపర్-8 దశకు అర్హత కూడా సాధించింది. ఇక ఇప్పటికే వెస్టిండీస్ గ్రూప్-సి నుంచి సూపర్-8లో అడుగుపెట్టగా.. న్యూజిలాండ్ ఎలిమినేట్ అయింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్
43 ఏళ్ల ఉగాండ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో (1.00) పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఫ్రాంక్.. 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో ఏకంగా 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం.టీ20 వరల్డ్‌కప్ టోర్నీల చరిత్రలో అతి తక్కువ ఎకానమీతో 4 ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన బౌలర్ల వివరాలు..ఫ్రాంక్ న్సుబుగా (ఉగాండ)- 1.00అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 1.75అజంత మెండిస్ (శ్రీలంక)- 2.00మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2.00హసరంగ (శ్రీలంక)- 2.00కాగా, గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్‌ను మడత పెట్టారు.ఫ్రాంక్ న్సుబుగా (4-2-4-2), అల్పేశ్ రాంజానీ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. -
T20 World Cup 2024: చిరస్మరణీయం.. తొలి విజయం సాధించిన పసికూన
క్రికెట్ పసికూన, ఆఫ్రికా దేశం ఉగాండ ప్రపంచకప్ టోర్నీల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉగాండ ఆటగాళ్లు, అభిమానులు తమ తొలి విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల కేరింతలు, డ్యాన్స్‌లతో గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్ అనంతరం ఉగాండ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్ని అంటాయి.Uganda players & fans are dancing & celebrating the victory in Guyana. ❤️- This is the victory of T20I World Cup. pic.twitter.com/vH8uzs4cyf— Johns. (@CricCrazyJohns) June 6, 2024వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్‌ను మడత పెట్టారు. THE VICTORY DANCE BY UGANDA. 🇺🇬- Video of the day! (ICC). pic.twitter.com/l9fiVPN79J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 202443 ఏళ్ల స్పిన్నర్ ఫ్రాంక్ న్సుబుగా పీఎన్జీ పాలిట సింహ స్వప్నమయ్యాడు. ఫ్రాంక్ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంక్ స్పెల్‌లో 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ఫ్రాంక్‌తో పాటు అల్పేశ్ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రియాజత్, మియాగి మినహా ఉగాండ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఉగాండను ఇబ్బంది పెట్టారు. -
వెస్టిండీస్‌ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు
గయానా: టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్ విండీస్ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు టోని వుర (2), అసద్ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్ అమిని (12)తో ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్‌గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విండీస్‌ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్, పూరన్ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కింగ్ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్ రొవ్మన్ పావెల్ (15), రూథర్‌ఫోర్డ్ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్ (9 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) వచ్చాక చేజ్ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: పపువా న్యూగినియాలో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 2000 మంది దాకా శిథిలాల కింద కూరుకుపోయారు. ఇంకొన్నివేల మంది నిరాశ్రయులయ్యారు.తాజా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘న్యూగినియాలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నా. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గినియా దేశానికి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నా’అని ప్రధాని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
ప్రకృతి విలయతాండవం.. 2,000 మంది మృతి
పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ పేర్కొంది. ఈ మేరకు ఐరాస ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది. More than 2,000 people were buried alive in a massive landslide in Papua New Guinea . pic.twitter.com/avgy49mEPg— Baba Banaras™ (@RealBababanaras) May 27, 2024 ఇక, ఈ ప్రమాద ఘటన కారణంగా 2000 మంది మరణించారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్ నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. తమ దేశానికి తగు సాయం అందించాలని కోరింది. అలాగే, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. Drone video reveals extent of the damage caused by a landslide in Papua New Guinea, which killed more than 670 people according to the UN.Rescue workers are trying to retrieve bodies from under the mud. pic.twitter.com/SPvUjdeaQF— Al Jazeera English (@AJEnglish) May 26, 2024అయితే, ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రావిన్స్‌లో భారీ నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపు నేలమట్టమయ్యాయి. కొండచరియల కారణంగా ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది. గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ కోసం మరో జట్టును ప్రకటించారు. రెండో సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా ఇవాళ (మే 8) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల ఈ జట్టుకు అస్సద్ వలా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సీజే అమీనీ అస్సద్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపికయ్యాడు. తూర్పు ఆసియా పసిఫిక్ రీజియనల్ పోటీల ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన పపువా న్యూ గినియా 2021లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యింది. ఆ ఎడిషన్‌లో ఈ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో 10 మంది 2021 ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్నారు. 2024 ప్రపంచకప్‌లో గినియా జర్నీ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో గినియా.. పటిష్టమైన వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. ప్రపంచకప్ గ్రూప్-సిలో ఉన్న గినియా.. గ్రూప్ దశలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఉగాండ జట్లతో పోటీపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం పపువా న్యూ గినియా జట్టు: అస్సద్ వలా (కెప్టెన్), సీజే అమీనీ (వైస్ కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరాపొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటిదాకా 15 జట్లను ప్రకటించారు. మరో జట్లను ప్రకటించాల్సి ఉంది. జట్ల వివరాలను వెల్లడించిన దేశాలు..భారత్ఇంగ్లండ్ఆస్ట్రేలియాఒమన్సౌతాఫ్రికాన్యూజిలాండ్ఆఫ్ఘనిస్తాన్నేపాల్కెనడావెస్టిండీస్యూఎస్ఏఉగాండస్కాట్లాండ్ఐర్లాండ్పపువా న్యూ గినియాజట్లను ప్రకటించాల్సిన దేశాలు..పాకిస్తాన్నమీబియానెదర్లాండ్స్శ్రీలంకబంగ్లాదేశ్ -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్‌రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్‌తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్‌రౌండర్‌గా పేరుంది. -
పపువా న్యూగినియాలో భూకంపం.. 6.9 తీవ్రత నమోదు!
పపువా న్యూ గినియాలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం చోటుచేసుకుందని, కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది. ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్జీఎస్ హెచ్చరించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతున ఉంది. దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65 కిలోమీటర్ల లోతున ఉంది. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈ విపత్తులో ఎంత ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇదే ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. అప్పుడు ఏడుగురు మృతి చెందారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
టీ20 వరల్డ్‌కప్ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!
వచ్చే ఏడాది వెస్టిండీస్, యూఎస్ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఈస్ట్ ఏసియా పసిఫిక్ రీజియన్స్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ జట్లు తాజాగా ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి. టీ20 వరల్డ్‌కప్ 2024 నిబంధనల ప్రకారం.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్‌లాండ్, భూటాన్, చైనా, మయన్మార్ వరుస స్థానాల్లో ఉన్నాయి. -
T20 WC: టి20 ప్రపంచకప్-2024కు అర్హత సాధించిన పసికూన
వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా అర్హత సాధించింది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి పపువా న్యూ గినియా జట్టు టి20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టుగా నిలిచింది. శుక్రవారం ఎమిని పార్క్ వేదికగా పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గినియా వంద పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టోనీ యురా 61, ఆసద్ వాలా 59, చార్ల్స్ అమిని 53 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పిలిప్పీన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేనియల్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అర్ష్‌దీప్ శర్మ 22 పరుగులు చేశాడు. పపువా న్యూ గినియా బౌలర్లలో కబువా మోరియా రెండు వికెట్లు తీయగా.. జాన్ కరికో, హిరిహిరి ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఐర్లాండ్ అర్హత సాధించగా.. తాజాగా పపువా న్యూ గినియా కూడా అర్హత సాధించడంతో టి20 వరల్డ్‌కప్ అర్హతకు సంబంధించి మరో ఐదు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా క్వాలిఫయర్ నుంచి.. మిగతా నాలుగు బెర్తుల్లో రెండు ఆసియా నుంచి.. మరో రెండు ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆 Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq — ICC (@ICC) July 28, 2023 చదవండి: Ashes 2023: పాంటింగ్‌పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను' -
ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే..
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడయ్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్జీ సింగ్, టోక్ పిసిన్ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్ సిటీలో రెండు, ఐస్‌ల్యాండ్‌లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్ భాషను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్ భాష వాడుకలో ఉంది. ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్..! -
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్‌ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్‌కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని..