
పుపువా న్యూగినియాలో భూకంపం
సిడ్నీ: పుపువా న్యూగినియాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదు అయిందని యూఎస్ జియోలాజిస్టులు వెల్లడించారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ లేదని తెలిపారు. పుపువా న్యూగినియా, టారన్ నైరుతి ప్రాంతంలో 58 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పారు. సునామీ వచ్చే సూచనలు కూడా ఏమీ లేవన్నారు. ఈ మేరకు యూఎస్ జియోలాజిస్టులు తమ వెబ్సైట్లో వెల్లడించారు.